ముంబై: ఫ్రెంచ్ సిమెంట్ దిగ్గజం వికా గ్రూపు భారత మార్కెట్లో వికా బ్రాండ్‌ను విడుదల చేసింది. దేశీయంగా తయారీ సామర్థ్య విస్తరణపై ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.300 కోట్లు వెచ్చించినట్టు వికా ఇండియా సీఈవో అనూప్ కుమార్ సక్సేనా ముంబైలో మీడియాకు తెలిపారు.
‘‘భారత్‌లో భారీ విస్తరణ ప్రణాళికలతో ఉన్నాం. 2021 నాటికి 1,700 కోట్లను ఇన్వెస్ట్ చేయడం ద్వారా మా సిమెంట్ తయారీ సామర్థ్యం 13 మిలియన్ టన్నులకు విస్తరించనున్నాం. ఇప్పటికే ఈఏడాది రూ.300 కోట్లను ఖర్చు చేశాం. ముంబైలోని కలంబోలి వద్ద 1.2 మిలియన్ టన్నుల బల్క్ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు, తర్వాత కల్‌బుర్గి సిమెంట్ ప్లాంట్‌ను 2.75 మిలియన్ టన్నులకు విస్తరణ, ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో 1.7 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నాం. కడప జిల్లాలో రెండంచెల ఇంటెగ్రేటెడ్ సిమెంట్ ప్లాంట్ కూడా ఉంది. భారత్‌లో మా మొత్తం సామర్థ్యం 7.75 మిలియన్ టన్నులు’’ అని సక్సేనా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment