‘కొత్త కత్తి కొనుక్కొచ్చి నన్ను చంపేయండి’.. డబ్బు ఇవ్వాలని అడిగిన బాధితులతో మొన్నటికిమొన్న ఫిష్ నిర్వాహకుడు పలికిన ‘చిలకపలుకులు’ ఇవీ.. ‘వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది. కొద్ది సమయంలోనే మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తా’ తక్కు వ ధరకే సిమెంట్ అంటూ మోసగించిన జాదు ‘విజ్ఞప్తి’ ఇదీ. ఇలా అన్నాడో లేదో.. అలా పారిపోయేందుకు యత్నించాడు ఆ జిత్తులమారి! ఒకటీ రెండు కాదు.. ఏకంగా రూ. 4 కోట్లు వసూలు చేసిన వ్యాపారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు బాధితులు. కరీంనగర్‌లో మోసాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎన్నిమోసాలు వెలుగుచూసినా జనం జాగ్రత్తపడడం లేదు.
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్: తక్కువ ధరకే సిమెంట్ ఇప్పిస్తానని కోట్లకుకోట్లు వసూలు చేసిన జాదుగాడు.. ఉడాయించేందుకు య త్నించగా బాధితులు చాకచక్యంగా పట్టుకున్న వైనమిదీ.. బాధితుల కథనం ప్రకారం.. నగరంలోని పాతబజారుకు చెందిన బాదాం కృష్ణమూర్తి ప్రముఖ సిమెం ట్ వ్యాపారి. సూర్య ట్రేడర్స్ పేరుతో శాస్త్రీనగర్, గంజ్ లో రెండు సిమెంట్‌దుకాణాలను 15 ఏళ్లుగా నిర్వహిస్తున్నాడు. తనకున్న పరిచయాలను కృష్ణమూర్తి స్వార్థానికి వినియోగించాలనుకున్నాడు.
‘10 నెలల క్రితం నుంచి సిమెంట్ ధరలు బాగా పెరగుతున్నాయి. మీకు తక్కువ ధరకు సిమెంట్ ఇస్తా’అని పలువురిని నమ్మించాడు. భవనాలు నిర్మాణంలో ఉన్న పలువురు 500 నుంచి 3500 బస్తాల సిమెంట్ కోసం లక్షలాది రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. ఇలా సుమారు 150 మంది నుంచి రూ. 4 కోట్ల వరకూ వసూలు చేశాడు. బాగా ఒత్తిడి చేసిన వారికి తప్ప ఎవరికీ సిమెంట్ బస్తాలు ఇవ్వలేదు. ఈ 3 నెలల్లోనే సుమారు రూ. కోటిన్నర వసూలు చేశాడని, 1080 బస్తాలకు అడ్వాన్స్ ఇచ్చిన సాయినగర్‌కు చెందిన కె.శ్రీధర్ అనే బాధితుడు తెలిపాడు.
పక్కా ప్లాన్.. కానీ బెడిసికొట్టింది..
మూడు నెలలుగా కృష్ణమూర్తి తప్పించుకు తిరుగుతున్నాడు. దుకాణాలు సరిగా తెరవడం లేదు. తన అస్తు లు అమ్మడం ప్రారంభించాడు. అనుమానం వచ్చిన బాధితులు ఆయనపై ఒత్తిడి పెంచారు.
‘నాకు నష్టం వచ్చింది. అందరి డబ్బులు కొద్ది రోజుల్లో ఇచ్చేస్తా’అని నమ్మించాడు. కానీ పారిపోయేందుక పక్కా ప్లాన్ వేశాడు. ముందస్తుగా విలువైన సామగ్రిని మరో చోటుకు తరలించాడని తెలిసింది. వారం రోజులుగా ఇతని సెల్‌ఫోన్ నంబర్ పనిచేయడం లేదు. దీంతో కృష్ణమూర్తి కదలికలపై బాధితులు నిఘా పెట్టారు. మంగళవారం మధ్యాహ్నం పాత బజారులోని ఇంటికి రహస్యంగా వచ్చిన కృష్ణమూర్తిని అక్కడే పట్టుకున్నారు. మిగతా బాధితులకు సమాచారం చేరవేయగా అంతా వచ్చారు. బాధితులు వందల సంఖ్యలో ఉండడంతో అక్కడి వారు ఆశ్చర్యపోయారు. తమ డబ్బు ఇప్పించాలని వారు రోదిస్తూ వేడుకున్నారు.
రంగంలోకి మధ్యవర్తులు...
స్పందించని పోలీసులు
పరిస్థితి చేయిదాటకుండా కొందరు మధ్యవర్తులు కృష్ణమూర్తికి మద్దతుగా రంగంలోకి దిగి బేరమాడుతున్నట్లు సమాచారం. ఎంతో కొంత ముట్టజెప్పి చేతులు దులుపుకునేందుకు వీరు యత్నిస్తన్నట్లు తెలిసింది. బాధితులు సుమారు రెండు గంటలు ఆందోళన చేశారు. ఈ మేరకు సమాచారం అందినా పోలీసులు స్పందించకపోవడం గమనార్హం. తుదకు బాధితులే 100కు సమాచారం ఇచ్చారు.
సిమెంట్ వ్యాపారి ఆటకట్టు
Published Wed, Aug 14 2013 4:43 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM
Advertisement
Advertisement