redhanded
-
Viral Video: కూతురి గదిలోకి దూరిన బాయ్‌ఫ్రెండ్.. ఏం చేశారంటే?
Viral Video: బాయ్‌ఫ్రెండ్‌ను ఇంటికి పిలిచి ఎంజాయ్ చేస్తుండగా తన తల్లిదండ్రులు ఒక్కసారిగా రావడంతో బిత్తరపోయిన ఓ యువతి ప్రియుడిని బాల్కనీ నుండి పారిపొమ్మని సలహా ఇచ్చింది. దాంతో గాల్లో తాడు పట్టుకుని వేలాడుతూ కిందకు దిగుతున్న ఆ ప్రియుడిని పట్టుకుని ఆమె తల్లి చీపురు తిరగేసి చితక్కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతొంది. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ హల్చల్ చేస్తోంది. దొంగచాటుగా తన గర్ల్‌ఫ్రెండ్ గదిలోకి దూరిన ఓ యువకుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు తన గర్ల్‌ఫ్రెండ్ మాత్రం తనని కాపాడేందుకు ప్రయత్నించి అతడి బట్టలను బాల్కనీ నుండి కిందకు విసిరేసింది. ఎలాగోలా తాడుని పట్టుకుని కిందకు జారుతున్న అతడిని కింది అంతస్తులో గర్ల్‌ఫ్రెండ్ తల్లి ఒక చీపురు పట్టుకుని చితక్కొట్టేసింది. ఈ వీడియోకు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అప్లోడ్ చేసిన గంటల్లోనే మిలియన్ల వీక్షణలు వచ్చాయి. వీడియో చూస్తే ఎవ్వరికైనా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. పాపం ప్రియుడు ఏ మాత్రం పట్టు తప్పినా అతడు కింద పడే లోపే ప్రాణాలు గాల్లోకి పోవడం ఖాయం. Every pleasure in life has a price pic.twitter.com/rtHwfFNjtr — Enezator (@Enezator) August 10, 2023 ఇది కూడా చదవండి: రష్యాలో భారీ పేలుడు.. 12 మంది మృతి -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తొగుట ఎమ్మార్వో కృష్ణమోహన్
-
వైరల్ వీడియో: మరో యువతితో కాపురం.. భర్తను చితక్కొట్టిన మొదటి భార్య
సూర్యాపేట జిల్లా : ఇద్దరు పిల్లలు, భార్యను వదిలేసి మరో యవతితో కాపురం పెట్టాడో భర్త. కుటుంబాన్ని వదిలేసి రహస్యంగా ప్రియురాలితో ఉంటున్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది మొదటి భార్య ప్రియాంక. సూర్యాపేటలో ఈ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న భానుప్రకాశ్ భార్య పిల్లలను వదిలేసి మరో యువతితో కాపురం వేరుగా ఉంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య ప్రియాంక.. తన కుటుంబ సభ్యులతో కలిసి భర్త, అతని ప్రయురాలిని చితకొట్టింది. తన వివాదం కోర్టులో నడుస్తుండగా.. రహస్యంగా వివాహం చేసుకొని కాపురం పెట్టాడని మొదటిభార్య ఆరోపించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువురిని స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. -
మరో యువతితో కాపురం పెట్టిన భర్తను చితకొట్టిన మొదటి భార్య
-
భార్యాభర్తలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
సాక్షి, మధురానగర్ (విజయవాడ సెంట్రల్) : ఇంటిపక్కవార్ని మచ్చిక చేసుకుని ఇంట్లోని బంగారు వస్తువులు కాజేసిన భార్యాభర్తలను సోమవారం అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎం. పవన్‌కుమార్, రేవతి భార్యాభర్తలు. రేవతి తమ ఇంటి సమీపంలోని జీ. రవికుమార్ భార్యను మచ్చిక చేసుకుని విలువైన వస్తువులు, బంగారు నగలు, ఇంటి తాళాలు ఎక్కడ పెడుతున్నారో గమనిస్తూ ఉంది. సమయం కుదిరినప్పుడు ఒక్కొక్కటిగా తస్కరించింది. ఈనెల 5వ తేదీన ఇంట్లోని వస్తువులు మాయం అవ్వటం గమనించిన జీ రవికుమార్ దంపతులు అజిత్‌సింగ్‌నగర్ సీఐ ఎస్‌వీవీఎల్ నారాయణను కలిసి ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన నాను తాడు, చెవి దిద్దులు, రింగులు తదితర వస్తువుల విలువ సుమారు రూ.1.08 లక్షలు ఉంటుందని నిర్ణయించారు. విచారణ ప్రారంభించిన ఎస్ఐ సౌజన్య .. రవికుమార్ దంపతులను కలిసి ఎవరిమీదైనా అనుమానం ఉందా, ఇంటికి ఎవరెవరు వస్తుంటారు.. తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో రేవతి దంపతులపై అనుమానం వచ్చింది. వారిపై నిఘా పెట్టగా సోమవారం రేవతి తన భర్తతో బంగారు నగలను తాకట్టు పెట్టేందుకు వెళ్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిరువురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. తక్కువ సమయంలోనే దొంగలను పట్టుకున్నందుకు సీఐ లక్ష్మీనారాయణ పోలీసులను అభినందించారు. -
పేరు మార్చడానికి పది వేలు
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని టి.నరసాపురం మండలం బండివారిగూడెం గ్రామంలో ప్రవల్లిక అనే మహిళ వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నారు. స్థానికులైన కూరం పోతురాజు అల్లుడు శ్రీనివాస్ పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు మార్పుకు ఆమె వద్దకు వెళ్లాడు. పేరు మార్చడానికి వీఆర్వో ససేమిరా కాదన్నారు. మరలా వెళ్లి ఆమెను కలవగా పది వేలు డిమాండ్ చేయటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో శ్రీనివాస్ ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ పక్కా పథకం ప్రకారం సోమవారం ప్రవల్లికను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మరింత సమాచారం రాబట్టడం కోసం ఏసీబీ అధికారులు టి.నరసాపురం తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు -
నవ్విపోదురుగాక!
‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు..’ అన్న చందంగా తయారైంది జిల్లా విద్యాశాఖ పరిస్థితి. అందుకే ఎవరేమనుకున్నా ఫర్వాలేదన్నట్టుగా వ్యవహరించింది. పాఠశాలలో తప్పతాగి.. పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఉపాధ్యాయులను పట్టుమని పాతిక రోజులు గడవకముందే.. తిరిగి విధుల్లోకి తీసుకుంది. విద్యాశాఖ అధికారి కె.లింగయ్య శనివారం వారికి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడంతో ఉపాధ్యాయ లోకం నివ్వెరపోయింది. సాక్షి, కరీంనగర్ : ఆగస్టు 11.. జిల్లా కేంద్రంలోని ముకరంపుర ధన్గర్‌వాడీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎని మిది మంది పాఠశాలలోనే తప్పతాగారు. పాఠశాలను పానశాలగా మార్చి పోలీ సులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. విద్యాశాఖపై ఒత్తిడి రావడంతో చేసేదిలేక వారిని సస్పెండ్ చేసింది. తీరా 25 రోజులు కూడా గడవకముందే.. వారిని యథాస్థానంలో నియమిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి లింగయ్య రీ పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేశారు. గురుపూజోత్సవం వరకు వేచి ఉండి.. మరుసటి రోజే ఆర్డర్లు ఇచ్చిన డీఈవో నిర్ణయం తో ఉపాధ్యాయ లోకమంతా నివ్వెరపోయింది. గురుపూజోత్సవానికి ముందే ఆర్డర్లు ఇస్తే వేడుకల్లో ఉపాధ్యాయులు నిలదీస్తారనే ఉద్దేశంతోనే ఈ కొద్దిరోజులు కూడా ఆపేశారని, లేకుంటే వారికి ఎప్పుడో ఆర్డర్లు వచ్చేవి కావచ్చని అనుమానిస్తున్నారు. కనీసం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లకుండా వారికి ఎలా పోస్టింగ్ ఇస్తారని సొంత శాఖలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మద్యం తాగు తూ పట్టుబడిన ఉపాధ్యాయుల వివరాలను విద్యాశాఖ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వారికి పోస్టింగ్ ఇచ్చే నిర్ణయం తీసుకుంటే బాగుండని అదే శాఖ లో పని చేస్తున్న ఓ అధికారి అభిప్రాయపడ్డారు. ఆ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టకపోవడం.. శాఖాపరమైన చర్యలు తీసుకోకుండా అనతికాలంలోనే మళ్లీ పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీఏ నిబంధనల ప్రకారం.. పాఠశాలల్లో తప్పుడు పనులు చేసిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తే పూర్థిస్థాయిలో విచారణ జరపాలి. ఇందుకు ఆర్నెల్ల సమయం తీసుకోవాలి. ఆలోపు విచారణ జరిపి ఎప్పుడైనా పోస్టింగ్ ఇవ్వవచ్చు. కానీ.. తప్పు చేసి సస్పెండ్‌కు గురైన ఎంతోమందికి నెల, రెండు నెలల్లోపే రీ పోస్టింగ్ ఆర్డర్లు అందుతున్నాయి. గత నెల సస్పెండ్ అయిన ఎనిమిది మందికి ఇంత తొందరగా పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాల్సిన అంత అవసరం ఇప్పుడు ఏం వచ్చింది..? ప్రజాప్రతినిధుల ఒత్తిడితోనే ఈ నిర్ణయం తీసుకున్నారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖతోపాటు వృత్తి పరువు, ప్రతిష్టకు మచ్చ తెచ్చిన సదరు ఉపాధ్యాయులకు, డీఈవోకు ఉన్న సాన్నిహిత్యమూ దీనికి కారణమని, అందుకే నెల గడవక ముందే వారికి రీ పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారనే చర్చ జోరుగా సాగుతోంది. విద్యాశాఖ తీసుకుంటు న్న ఇలాంటి నిర్ణయాలు పాఠశాలల్లో గుట్టుచప్పుడు కాకుండా తప్పుడు పనులు చేస్తున్న.. చే సే ఆలోచన ఉన్న ఉపాధ్యాయులను మరింత ప్రోత్సహిస్తున్నట్టు ఉన్నాయి. దారి తప్పిన గురువులపై కఠినంగా వ్యవహరించి.. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకుండా అడ్డుకోవాలని ఉపాధ్యాయ సంఘ నేతలు, తల్లిదండ్రులు కోరుతున్నారు. సస్పెండ్ అయిన ఉపాధ్యాయులకు రీపోస్టింగ్ ఇవ్వడంపై డీఈవోను కె.లింగయ్యను వివరణ కోరగా.. సీసీఏ నిబంధనల మేరకే వారికి పోస్టింగ్ ఇచ్చామని, సస్పెండ్ చేసిన తర్వాత ఆర్నెల్లలోపు ఎప్పుడైనా పోస్టింగ్ ఇచ్చే అధికారం తనకుంద ని, పేర్కొన్నారు. విధుల్లో చేరిన తర్వాత వారిపై శాఖపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
సిమెంట్ వ్యాపారి ఆటకట్టు
‘కొత్త కత్తి కొనుక్కొచ్చి నన్ను చంపేయండి’.. డబ్బు ఇవ్వాలని అడిగిన బాధితులతో మొన్నటికిమొన్న ఫిష్ నిర్వాహకుడు పలికిన ‘చిలకపలుకులు’ ఇవీ.. ‘వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది. కొద్ది సమయంలోనే మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తా’ తక్కు వ ధరకే సిమెంట్ అంటూ మోసగించిన జాదు ‘విజ్ఞప్తి’ ఇదీ. ఇలా అన్నాడో లేదో.. అలా పారిపోయేందుకు యత్నించాడు ఆ జిత్తులమారి! ఒకటీ రెండు కాదు.. ఏకంగా రూ. 4 కోట్లు వసూలు చేసిన వ్యాపారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు బాధితులు. కరీంనగర్లో మోసాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎన్నిమోసాలు వెలుగుచూసినా జనం జాగ్రత్తపడడం లేదు. కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్: తక్కువ ధరకే సిమెంట్ ఇప్పిస్తానని కోట్లకుకోట్లు వసూలు చేసిన జాదుగాడు.. ఉడాయించేందుకు య త్నించగా బాధితులు చాకచక్యంగా పట్టుకున్న వైనమిదీ.. బాధితుల కథనం ప్రకారం.. నగరంలోని పాతబజారుకు చెందిన బాదాం కృష్ణమూర్తి ప్రముఖ సిమెం ట్ వ్యాపారి. సూర్య ట్రేడర్స్ పేరుతో శాస్త్రీనగర్, గంజ్ లో రెండు సిమెంట్దుకాణాలను 15 ఏళ్లుగా నిర్వహిస్తున్నాడు. తనకున్న పరిచయాలను కృష్ణమూర్తి స్వార్థానికి వినియోగించాలనుకున్నాడు. ‘10 నెలల క్రితం నుంచి సిమెంట్ ధరలు బాగా పెరగుతున్నాయి. మీకు తక్కువ ధరకు సిమెంట్ ఇస్తా’అని పలువురిని నమ్మించాడు. భవనాలు నిర్మాణంలో ఉన్న పలువురు 500 నుంచి 3500 బస్తాల సిమెంట్ కోసం లక్షలాది రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. ఇలా సుమారు 150 మంది నుంచి రూ. 4 కోట్ల వరకూ వసూలు చేశాడు. బాగా ఒత్తిడి చేసిన వారికి తప్ప ఎవరికీ సిమెంట్ బస్తాలు ఇవ్వలేదు. ఈ 3 నెలల్లోనే సుమారు రూ. కోటిన్నర వసూలు చేశాడని, 1080 బస్తాలకు అడ్వాన్స్ ఇచ్చిన సాయినగర్‌కు చెందిన కె.శ్రీధర్ అనే బాధితుడు తెలిపాడు. పక్కా ప్లాన్.. కానీ బెడిసికొట్టింది.. మూడు నెలలుగా కృష్ణమూర్తి తప్పించుకు తిరుగుతున్నాడు. దుకాణాలు సరిగా తెరవడం లేదు. తన అస్తు లు అమ్మడం ప్రారంభించాడు. అనుమానం వచ్చిన బాధితులు ఆయనపై ఒత్తిడి పెంచారు. ‘నాకు నష్టం వచ్చింది. అందరి డబ్బులు కొద్ది రోజుల్లో ఇచ్చేస్తా’అని నమ్మించాడు. కానీ పారిపోయేందుక పక్కా ప్లాన్ వేశాడు. ముందస్తుగా విలువైన సామగ్రిని మరో చోటుకు తరలించాడని తెలిసింది. వారం రోజులుగా ఇతని సెల్‌ఫోన్ నంబర్ పనిచేయడం లేదు. దీంతో కృష్ణమూర్తి కదలికలపై బాధితులు నిఘా పెట్టారు. మంగళవారం మధ్యాహ్నం పాత బజారులోని ఇంటికి రహస్యంగా వచ్చిన కృష్ణమూర్తిని అక్కడే పట్టుకున్నారు. మిగతా బాధితులకు సమాచారం చేరవేయగా అంతా వచ్చారు. బాధితులు వందల సంఖ్యలో ఉండడంతో అక్కడి వారు ఆశ్చర్యపోయారు. తమ డబ్బు ఇప్పించాలని వారు రోదిస్తూ వేడుకున్నారు. రంగంలోకి మధ్యవర్తులు... స్పందించని పోలీసులు పరిస్థితి చేయిదాటకుండా కొందరు మధ్యవర్తులు కృష్ణమూర్తికి మద్దతుగా రంగంలోకి దిగి బేరమాడుతున్నట్లు సమాచారం. ఎంతో కొంత ముట్టజెప్పి చేతులు దులుపుకునేందుకు వీరు యత్నిస్తన్నట్లు తెలిసింది. బాధితులు సుమారు రెండు గంటలు ఆందోళన చేశారు. ఈ మేరకు సమాచారం అందినా పోలీసులు స్పందించకపోవడం గమనార్హం. తుదకు బాధితులే 100కు సమాచారం ఇచ్చారు.