
సూర్యాపేట జిల్లా : ఇద్దరు పిల్లలు, భార్యను వదిలేసి మరో యవతితో కాపురం పెట్టాడో భర్త. కుటుంబాన్ని వదిలేసి రహస్యంగా ప్రియురాలితో ఉంటున్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది మొదటి భార్య ప్రియాంక. సూర్యాపేటలో ఈ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న భానుప్రకాశ్ భార్య పిల్లలను వదిలేసి మరో యువతితో కాపురం వేరుగా ఉంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య ప్రియాంక.. తన కుటుంబ సభ్యులతో కలిసి భర్త, అతని ప్రయురాలిని చితకొట్టింది. తన వివాదం కోర్టులో నడుస్తుండగా.. రహస్యంగా వివాహం చేసుకొని కాపురం పెట్టాడని మొదటిభార్య ఆరోపించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువురిని స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment