
శ్రీనివాస్ మృతదేహాన్ని మోసుకెళ్తున్న బంధువులు(ఇన్‌సెట్లో గాయపడిన శ్రీనివాస్ భార్య రజిత)
సూర్యాపేట జిల్లా : కేతేపల్లి మండలం తుంగతుర్తిలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కత్తితో దాడి చేసి కాళ్లు చేతులు నరికేశాడు. వివరాలు..తుంగతుర్తి గ్రామానికి చెందిన జాతంగి శ్రీనివాస్(35)కు 13 ఏళ్ల క్రితం రజిత అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు, ఒక కూతురు. కొన్నాళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో కొద్ది రోజుల నుంచి గొడవలు మొదలయ్యాయి. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నదనే అనుమానం శ్రీనివాస్‌లో మొదలైంది.
ఈ నేపథ్యంలోనే కోపోద్రిక్తుడైన శ్రీనివాస్ మంగళవారం భార్యపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి అనంతరం కరెంటు తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య రజితకు తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment