kethepally
-
రథాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతం
నాంపల్లి: నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో శ్రీసీతారామచంద్ర స్వామి రథం తరలింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి రథాన్ని ఆలయం నుంచి మరో చోటుకు తరలిస్తుండగా విద్యుత్ తీగలకు తగలడంతో షాక్ తగిలి ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కేతేపల్లి గ్రామంలోని గుట్టపై ఉన్న శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ఉత్సవాలు ఏప్రిల్ 10న ముగిశాయి. అయితే రథం ఆలయ ఆవరణలోనే ఉండిపోయింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రథం తడుస్తుండడంతో దానిని తయారు చేయించిన దాత దయానందరెడ్డి రథాన్ని సురక్షిత ప్రదేశానికి తరలించేందుకు శనివా రం సాయంత్రం గ్రామానికి చెందిన పలువురిని గుట్టపైకి తీసుకెళ్లారు. అందులో 8 మంది తాళ్ల సహాయంతో.. మరో నలుగురు దానిని పట్టు కుని లాగుతుండగా ఇనుముతో చేసి న రథం కరెంటు తీగలకు తగలడంతో దానిని పట్టుకుని లాగుతున్న రాజబోయిన యాదయ్య(45), పొగాకు మోహనయ్య(36) దాసరి ఆంజనేయులు (26) విద్యు దాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు. రాజబో యిన వెంకటయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. చదవండి: ‘ఏ తప్పూ చేయలేదు.. నా చావును కోరుకుంటున్నారు కదా.. మీ కోరిక తీరుస్తా’ -
అభ్యర్థులకు పెళ్లిళ్ల తిప్పలు
సాక్షి, కేతేపల్లి: ఈ నెల 15న సహకార ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదేరోజు అధికంగా పెళ్లిళ్లు ఉండడంతో నేతలు, డైరెక్టర్ స్థానాలకు పోటీలో ఉన్న అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని 15న ఓటింగ్‌కు రావాలని కోరితే చాలా మంది వివాహాలు ఉన్నాయని చెబుతున్నారని అభ్యర్థులు వాపోతున్నారు. గ్రామాల్లో ఉన్న వారు కూడా ఇతర ప్రాంతాల్లో ఉండే బంధువుల ఇంట జరిగే వివాహాలకు ఒకట్రెండు రోజుల మందు వెళ్లే అవకాశముంది. పక్కాగా తమకే పడతాయన్న ఓట్లు పెళ్లిళ్ల కారణంగా పోలయ్యే అవకాశం కనిపించకపోవడంతో అభ్యర్థులకు పాలుపోవడం లేదు. పెళ్లి కాగానే వచ్చి ఓటేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే పోలింగ్ ఉండడంతో దూర ప్రాంతాలకు వెళ్లిన వారిని ఓటింగ్ పూర్తయ్యే సమయానికి తీసుకొచ్చే వీలుండదు. పెళ్లి మూహూర్తాలు పోలింగ్‌పై తప్పకం ప్రభావం చూపనున్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘అమ్మ’ను ఎక్కడికి పంపిస్తారు సార్..!?
మాతృదేవో భవ.. పితృదేవో భవ.. ఆచార్య దేవోభవ అంటారు. విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకుంటూ.. విద్యాబుద్ధులు నేర్పుతారు కాబట్టే భారతీయ సంస్కృతి గురువుకు తల్లిదండ్రుల తర్వాతి స్థానం కల్పించింది. అయితే ఆ స్థానాన్ని నిలబెట్టుకునే వారు కొంతమందే ఉంటారు. నీలాంబరి ప్రిన్సిపల్ ఆ కోవకు చెందినవారే. అందుకే అమ్మలా ఎల్లప్పుడూ తమ వెంట ఉండి నడిపించిన ఆమెను అధికారులు బదిలీచేస్తే పిల్లలు తట్టుకోలేకపోయారు. ఆందోళనకు దిగి.. రోడ్లవెంట పరుగులు తీశారు. ఆఖరికి విజయం సాధించారు. సాక్షి, నల్గొండ : పాఠశాల స్పెషల్ ఆఫీసర్(ఎస్ఓ) బదిలీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు ఆందోళన చేసిన సంఘటన కేతేపల్లి మండలంలోని చెర్కుపల్లి కస్తూరిబా గాంధీ(కేజీబీవీ) బాలికల పాఠశాలలో గురువారం చోటు చేసుకుంది. మండలంలోని చెర్కుపల్లి కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపల్ నీలాంబరి పదిరోజుల క్రితం సెలవులపై వెళ్లారు. కాగా ఇటీవల ఆమెను కట్టంగూర్ కేజీబీవీ పాఠశాల బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నాంపల్లి పాఠశాల ఎస్ఓ వసంతను చెర్కుపల్లి పాఠశాలకు బదిలీ చేశారు. దీంతో చెర్కుపల్లి పాఠశాలలో బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన ఎస్ఓ వసంతను చూసి విద్యార్థినులు పాఠశాల ప్రధాన గేటును మూసి ఆందోళనకు దిగారు. కొత్తగా వచ్చిన ఎస్ఓ బాధ్యతలు స్వీకరించకుండా అడ్డుకున్నారు. తమను సొంత పిల్లలా చూసుకుంటూ విద్యాబుద్ధులు నేర్పుతున్న పాత ఎస్ఓ నీలాంబరిని అధికారులు అకారణంగా బదిలీ చేశారని, బదిలీ ఉత్తర్వులను తక్షణమే రద్దు చేసి ఎస్ఓగా నీలాంబరిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న జీసీడీఓ అరుణశ్రీ, కేతేపల్లి తహసీల్దార్ డి.వెంకటేశ్వర్లు, గోలి చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్ఐ శ్యాంసుందర్‌రెడ్డి పాఠశాల వద్దకు చేరుకున్నారు. విద్యార్థినులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం పాఠశాల నుంచి విద్యార్థినులు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాతీయ రహదారి వైపు పరుగులు తీశారు. కేతేపల్లి, నకిరేకల్ ఎస్ఐలు రామకృష్ణ, హరిబాబులు తమ సిబ్బందితో కొండకింది గూడెం శివారులో ఏఏమార్పీ డీ-49 కాల్వ వద్ద విద్యార్థినులను అడ్డగించారు. దీంతో రోడ్డుపైనే బైఠాయించిన విద్యార్థినులు ఆందోళనకు దిగటంతో డీఈఓ భిక్షపతి విద్యార్థినులతో ఫోన్లో మాట్లాడారు. ఎస్ఓ బదిలీని రద్దుచేసి ఇక్కడే కొనసాగించేలా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇవ్వడంలో సాయంత్రం ఆరు గంటలకు ఆందోళన విరమించిన విద్యార్థినులు పాఠశాల బాట పట్టారు. -
అనుమానంతో భార్యపై దాడి..ఆపై ఆత్మహత్య
సూర్యాపేట జిల్లా : కేతేపల్లి మండలం తుంగతుర్తిలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కత్తితో దాడి చేసి కాళ్లు చేతులు నరికేశాడు. వివరాలు..తుంగతుర్తి గ్రామానికి చెందిన జాతంగి శ్రీనివాస్(35)కు 13 ఏళ్ల క్రితం రజిత అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు, ఒక కూతురు. కొన్నాళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో కొద్ది రోజుల నుంచి గొడవలు మొదలయ్యాయి. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నదనే అనుమానం శ్రీనివాస్‌లో మొదలైంది. ఈ నేపథ్యంలోనే కోపోద్రిక్తుడైన శ్రీనివాస్ మంగళవారం భార్యపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి అనంతరం కరెంటు తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య రజితకు తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: ఇద్దరి మృతి
-
ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: ఇద్దరి మృతి
నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని కేతెపల్లి వద్ద బుధవారం రాత్రి ఆర్టీసీ బస్సు ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, 20 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ముగిసిన ఆందోళన
–మృతదేహానికి అంత్యక్రియలు కేతేపల్లి: మండలంలోని కొత్తపేట గ్రామంలో విద్యుదాఘాతంతో మృతిచెందిన చిట్టిమళ్ల జానయ్య అంత్యక్రియలను బుధవారం ఆయన స్వగ్రామంలో నిర్వహించారు. గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు మరమతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి లోనైన జానయ్య మృతిచెందటం, అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ మంగళవారం రాత్రి పొద్దు పోయేంత వరకు బందువులు, గ్రామస్తులు, మృతదేహంతో కేతేపల్లి సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన చేసిన విషయం తెలిసిందే. బుధవారం ట్రాన్స్‌కో అధికారులు, మృతుడి బందువులతో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడి రాజీ కుదిర్చారు. మృతుని కుటుంబానికి శాఖ పరంగా వచ్చే రూ.4లక్షల అర్థికసాయంతో పాటు, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ భీమా కింది రూ.2లక్షలు, ట్రాన్స్‌కో యూనియన్ తరుపున రు.లక్ష ఇచ్చే విధంగా ఒప్పందం కుదిర్చారు. దీంతో మృతుడి బంధువులు ఆందోళన విరమించారు. మృతదేహానికి నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఎమ్మెల్యే పరామర్శ: విద్యుదాఘాతంతో మృతి చెందిన చిట్టిమల్ల జానయ్య మృతదేహాన్ని బుధవారం స్థానిక ఎమ్మెల్యే సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహం దహన సంస్కారాల నిమిత్తం రూ.5వేలు మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాస్‌యాదవ్, బి.సుందర్, నాయకులు బుర్రి యాదవరెడ్డి, కె.మల్లేష్‌యాదవ్, కత్తుల వీరయ్య, ఆర్.సైదులు తదితరులు ఉన్నారు.