Thungathurthi
-
తుంగతుర్తి కాంగ్రెస్‌లో ముసలం.. రహస్య ప్రాంతంలో అసమ్మతి నేతలు
సాక్షి, సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో లొల్లి కొనసాగుతోంది. ఎమ్మెల్యే మందుల సామేల్‌కు వ్యతిరేకంగా ఉదయం 11 గంటలకు జాజిరెడ్డిగూడెంలో అసమ్మతి వర్గం సమావేశం సమావేశం కానుంది. దగా పడ్డా కాంగ్రెస్ సీనియర్ ల్లారా కదలిరండి పేరుతో కార్యక్రమం చేపట్టారు. డీసీసీ ఉపాధ్యక్షుడు యోగానంద చారి అధ్యక్షతన సమావేశం జరగనుంది. గత కొంతకాలంగా సామేల్, యోగానంద చారి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. గతంలో జాజిరెడ్డిగూడెం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా యోగానంద నిరసన కార్యక్రమం చేయించారు. అసమ్మతి వర్గం వెనుక ఓ మాజీ మంత్రి ఉన్నట్లు ఎమ్మెల్యే అనుచరులు ఆరోపిస్తున్నారు.కాగా, జాజిరెడ్డిగూడెంలో కాంగ్రెస్ అసమ్మతి నేతలను ముందస్తు అరెస్ట్ చేసినట్లు సమాచారం. జాజిరెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు మోరపాక సత్యం, తుంగతుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డితో పాటు పలువురు నేతలను అరెస్టు చేసి రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం.అసమ్మతి నేతలను ముందస్తు అరెస్ట్ చేశారని.. కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యే అవకాశం కూడా పార్టీలో లేదా అంటూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు. సామేల్ కాంగ్రెస్‌లో ఉన్నారా? బీఆర్ఎస్లో ఉన్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్ చేసిన నేతలను విడిచిపెట్టకపోతే జాజిరెడ్డిగూడెం బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: సర్కార్‌పై సమరానికి సై! -
తుంగతుర్తిలో ఈవీఎంల తరలింపుపై హైటెన్షన్
-
తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూర్ లో ఎమ్మెల్యే గాదరి ఎన్నికల ప్రచారం
-
కర్ణాటక నుంచి వచ్చి మనకు సుద్దులు చెబుతున్నారు: సీఎం కేసీఆర్
సాక్షి, సూర్యాపేట: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి(డీకే శివకుమార్) వచ్చి మనకు సుద్దులుచెబుతున్నారని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. మా దగ్గర 5 గంటల కరెంట్ ఇస్తున్నాం, వచ్చి చూడమని చెప్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తుందని పేర్కొన్నారు. ఉద్యమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారా? అని ప్రశ్నించారు. దళితుల అభ్యున్నతి కోసమే దళిత బంధు ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు. దళితుల అభివృద్ధి గురించి గత ప్రభుత్వాలు ఏనాడైనా ఆలోచించాయా? అని ప్రశ్నించారు. నెహ్రూ ప్రధాని అయిన రోజే దళితుల అభివృద్ధికి కృషి చేస్తే బతుకులు మారేవని పేర్కొన్నారు. తెలంగాణలో కులవృత్తులకు జీవం పోశామని చెప్పారు. త్వరలో దేవాదుల ప్రాజెక్టు నుంచి నీరు అందిస్తామని, బునదిగాని కాల్వ వెడల్పు చేసి సాగునీరు అందిస్తామని తెలిపారు. ‘తుంగతుర్తిని చూస్తే తృప్తిగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యామాని లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చాయి. ఎన్నికలు రాగానే కొందరు ఓట్ల కోసం వస్తారు. ఎవరెన్ని చెప్పినా మీరు ఆలోచించి ఓటు వేయండి. గాదారి కిషోర్‌ను లక్ష మెజార్టీతో గెలిపిస్తే తుంగతుర్తి యోజకవర్గానికి మొత్తానికి దళితబంధు ఇస్తాం. భయంకరమైన ఉద్యమంతో తెలంగాణ వచ్చింది. సంక్షేమ పథకాలు, పెన్షన్లు తమాషాకు ఇవ్వడం లేదు. పేదల కోసం ఆలోచించి రూ. వెయ్యితో పెన్షన్ ప్రారంభించుకున్నాం. చదవండి: సోనియా కాళ్లు మొక్కిన కేసీఆర్, తర్వాత రోజే మాట మార్చాడు: ఖర్గే దశలవారీగా కళ్యాణలక్ష్మీ, పెన్షన్‌ను పెంచుకున్నాం. రైతు బంధును ఎమ్ఎస్ స్వామినాథన్ ప్రశంసించారు. యూపీ, బిహార్ నుంచి వరినాట్లు వేయడానికి వస్తున్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ 1గా ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ గోడలపై రాతలు కన్పించేవి. బస్మాపూర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు రాబోతున్నాయి. సుమారు రెండు లక్ష ఎకరాలకు నీళ్లు వస్తాయి తెలంగాణకు ముందు ఎవరైనా మాట్లాడితే నక్సలైట్ ముద్రేసి జైల్లో వేసేవారు. మనతో పొత్తు పట్టుకొని కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. 14 ఏళ్లు మనల్ని గోస పెట్టుకుంది. చెరుకు సధాకర్‌ను జైల్లో వేశారు. ప్రాణాలను బలి తీసుకొని తెలంగాణ ఇచ్చారు. ఆనాడు చెంచాగరి చేసినోళ్లు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ధరణిని రద్దు చేస్తాం అంటున్నారు. అది ఎంత ప్రమాదమో ఆలోచన చేయాలి ధరణి రావడం వల్ల అవినీతి అంతం అయింది. ధరణి రద్దు అయితే అవినీతి రాజ్యం వస్తుంది. మళ్ళీ కొట్లాటలు వస్తాయి. రైతు బంధు కూడా రాదు. ధరణి రైతులకు గుండె కాయ లాంటిది. రైతు బంధు వృధా అని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పాలి’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. -
తుంగతుర్తిలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం
-
పిల్లలను ఇంట్లో వదిలి వివాహిత అదృశ్యం
సాక్షి, తిరుమలగిరి (తుంగతుర్తి) : పిల్లలను ఇంట్లోనే వదిలి వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన తిరుమలగిరిలో ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన పాము సరిత ఈ నెల 18వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి తిరిగి రాలేదు. సరితకు 11సంవత్సరాల కూతురు, ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె భర్త పి.మహేష్ బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ప్రొబేషనరీ ఎస్ఐ ఉదయ్‌కుమార్ తెలిపారు. -
సకుటుంబ సమేతం ..
సాక్షిప్రతినిధి, సూర్యాపేట : జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల కుటుంబాలు ప్రచారంలో మునిగాయి. అభ్యర్థుల సతీమణులు, తనయులు, సోదరులు, ఇతర బంధువర్గం అంతా రంగంలోకి దిగడంతో పోటాపోటీగా ప్రచారం సాగుతోంది. ప్రధానంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు కుటుంబ సభ్యులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల తరఫున వారి సతీమణులు, కుటుంబంలోని మహిళలు.. మహిళా ఓటర్లకు బొట్టుపెట్టి, పార్టీ గుర్తులను చూపిస్తూ ఈ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రణాళిక ప్రకారం రోజుకూ పట్టణాల్లో వార్డులు, గ్రామాల్లో ప్రచారం చేస్తూ ముందుకుసాగుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే కుటుంబ సభ్యులు బృందాలుగా ప్రచార రథాలతో బయటకు వెళ్లి సాయంత్రం వరకు వస్తున్నారు. ఇక మిగిలిన ఈ పది రోజుల్లో ఎక్కడెక్కడ ప్రచారం చేయాలో ప్లాన్ ప్రకారం ముందుకు కదులుతున్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సతీమణి సునీత, ఆయన సోదరుల తనయులు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్రావు సతీమణి లక్ష్మి, కుమారులు వరుణ్, అరుణ్, కోడళ్లు సుష్మ, అనూష నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్‌రెడ్డి కుమారుడు సర్వోత్తమ్‌రెడ్డి, ఆయన సోదరులు కృష్ణారెడ్డి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కోదాడలో టీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్ సతీమణి ఇందిర, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి చెల్లెలు భవాని నియోజకవర్గంలో పాల్గొంటున్నారు. తుంగతుర్తిలో ప్రచారం చేస్తున్న గాదరి కిశోర్ సతీమణి కమల తుంగతుర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్ సతీమణి కమల, బీజేపీ అభ్యర్థి రాంచంద్రయ్య సతీమణి సరస్వతి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు.హుజూర్నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి, కోదాడ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.పద్మావతి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆమె రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరఫున ఆయన భార్య రజితారెడ్డి, తల్లి సత్యవతి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇలా నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల కుటుంబాలు ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. నేరేడుచర్ల : కందులవారిగూడెంలో ప్రచారం చేస్తున్న శానంపూడి సైదిరెడ్డి సతీమణి రజిత -
విజయం కోరుతూ.. అరగుండుతో ప్రచారం
సాక్షి, యాదాద్రి భువనగిరి : ఎన్నికల వేళ తమ అభిమాన నాయకున్ని గెలిపించుకునేందుకు కార్యకర్తలు విభిన్న రీతిలో ప్రచారం చేస్తుంటారు. కొందరు గుడికి వస్తాననో.. మరికొందరు కానుకలు వేస్తాననో వేడుకుంటారు. తుంగతుర్తి కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ విజయాన్ని కోరుతూ ఓ అభిమాన్ని వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నాడు. తుంగతుర్తిలోని లక్ష్మిదేవి కాల్వ గ్రామానికి చెందిన బండి మధు అనే కార్యకర్త అరగుండు, అర మీసంతో ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. తన అభిమాన నాయకుడు అద్దంకి దయాకర్ గెలవాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని తాను ఈ విధంగా ప్రచారం చేస్తున్నట్లు మధు తెలిపారు. కాగా తుంగతుర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌పై దయాకర్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో మంచి వాగ్ధాటి గల నేతగా గుర్తింపు పొందిన దయాకర్ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నారు. -
టికెట్.. భగభగలు
సాక్షిప్రతినిధి, సూర్యాపేట : టికెట్ రాకపోవడంతో అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. టికెట్ రాక భంగపడినవారి అనుచరగణం ఆగ్రహంతో ఊగిపోతోంది. తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ వడ్డేపల్లి రవికి కేటాయించలేదని ఆయన అనుచరులు తుంగతుర్తిలో హల్చల్ చేశారు. పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలను చిం చారు. అద్దంకిదయాకర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. కోదాడ టీఆర్ఎస్ టికెట్ బొల్లం మల్లయ్యకు కేటాయించడంతో ఈ టికెట్ ఆశించిన శశిధర్‌రెడ్డి, ఆయన అనుచరులు ఆందోళన చేశారు. అద్దంకి గో బ్యాక్ అంటూ నినాదాలు.. వడ్డేపల్లి రవి వర్గీయులు నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఫ్లెక్సీలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అద్దంకి దయాకర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్‌పార్టీ నాయకులు మాట్లాడుతూ వడ్డేపల్లి రవి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటున్నారని, కార్యకర్తలు, ప్రజలు ఏకమై అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీని బతికించింది వడ్డేపల్లి రవి అని పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా కాంగ్రెస్‌పార్టీకి, కార్యకర్తలకు అండగా ఉంటూ నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పరిష్కరించారన్నారు. వడ్డేపల్లి రవికి కాకుండా నియోజకవర్గాన్ని ఏనాడూ పట్టించుకోని అద్దంకి దయాకర్‌కు టిక్కెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. మంత్రి ఇంటి ఎదుట ఆందోళన.. కోదాడ టీఆర్ఎస్ అభ్యర్థిగా బొల్లం మల్లయ్యయాదవ్‌ను ప్రకటిస్తున్నారని ముందే తెలుసుకున్న పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శశిధర్‌రెడ్డి, ఆయన అనుచరులు ఆదివారం ఉదయం సూర్యాపేటలోని మంత్రి జగదీశ్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. మంత్రి అక్కడ లేకపోవడంతో శశిధర్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ అనుచరులు ఆందోళన చేశారు. ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆందోళన వ్యక్తం చేసింది. అనంతరం కోదాడ కు వచ్చి పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ తనకే టికెట్ ఇస్తుందని, సోమవారం నామినేషన్ వేస్తానని ప్రకటించారు. ఇదే సమయంలో బొల్లం మల్లయ్యయాదవ్ శశిధర్‌రెడ్డి ఇంటికి వచ్చారు.తొలుత ఆయనతో మాట్లాడడానికి నిరాకరించిన శశిధర్‌రెడ్డి కార్యాలయం నుంచి బయటకు వెళ్లి పోయారు. కొందరు వారించడంతో మళ్లీ తిరిగి వచ్చి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో పలువురు కార్యకర్తలు టికెట్ వద్దని చెప్పాలని పట్టుబట్టారు. చివరకు సాయంత్రం మల్లయ్యకు టికెట్ ప్రకటించినట్లు న్యూస్ చానళ్లలో రావడంతో శిశిధర్‌రెడ్డి అనుచర గణం ఆగ్రహం వ్యక్తం చేసింది. -
‘తుంగతుర్తి టికెట్‌పై పునరాలోచించాలి’
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ‘2001 నుంచి ఇప్పటి వరకు తుంగతుర్తి నియోజకవర్గంలో పార్టీ నాయకుడిగా తెలంగాణ కోసం ఉద్యమించా.. పార్టీని నియోజకవర్గంలో నేనే బలోపేతం చేశా.. తుంగతుర్తి నియోజకవర్గ టికెట్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పునరాలోచించాలి. నాకు టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీ తో గెలుస్తా’అని టీఆర్ఎస్ నేత, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి వరకు తన అనుచరులతో కలసి కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చోట్ల టీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. 2014లో ఓయూ నేతకు టికెట్ ఇస్తే కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ అభ్యర్థి విజయం కోసం కృషి చేశానన్నారు. తాను ఎప్పటికీ కేసీఆర్ వెంటే ఉంటానని, టికెట్ విషయంలో పునరాలోచించాలని అన్నారు. ర్యాలీలో నియోజకవర్గ ముఖ్య నేతలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
అనుమానంతో భార్యపై దాడి..ఆపై ఆత్మహత్య
సూర్యాపేట జిల్లా : కేతేపల్లి మండలం తుంగతుర్తిలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కత్తితో దాడి చేసి కాళ్లు చేతులు నరికేశాడు. వివరాలు..తుంగతుర్తి గ్రామానికి చెందిన జాతంగి శ్రీనివాస్(35)కు 13 ఏళ్ల క్రితం రజిత అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు, ఒక కూతురు. కొన్నాళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో కొద్ది రోజుల నుంచి గొడవలు మొదలయ్యాయి. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నదనే అనుమానం శ్రీనివాస్‌లో మొదలైంది. ఈ నేపథ్యంలోనే కోపోద్రిక్తుడైన శ్రీనివాస్ మంగళవారం భార్యపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి అనంతరం కరెంటు తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య రజితకు తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తెలంగాణలో ఇంకా కుటుంబ పాలనే!
సాక్షి, తుంగతుర్తి : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికాంలోకి వచ్చాక దేశంలో 40 ఏళ్ల కుటుంబ పాలనను పారదోలారు.. కానీ తెలంగాణలో ఇంకా కుటుంబ పాలనే సాగుతోందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో జరిగన బీజేపీ జన చైతన్య యాత్రలో ఆయన పాల్గొన్నారు. తొలుత తెలుగులో ప్రసంగం మొదలుపెట్టిన జవదేకర్ కార్యకర్తలను ఉత్సహపరిచారు. ఆయన మాట్లాడుతూ.. ‘పంచపాండవులైన బీజేపీ ఎమ్మెల్యేలు.. 100 మంది ఉన్న టీఆర్ఎస్ కౌరవులతో యుద్ధం చేస్తే గెలుపు ఎవరిదో ఆలోచించండి. మోదీ 14 పంటలకు మద్దతు ధర పెంచడం ద్వారా రైతుల 50 ఏళ్ల కలను సాకారం చేశారు. పెంచిన ధరల ప్రకారం ఎకరా వరికి 6 వేల రూపాయలకు పైగా పెంపు వర్తిస్తోంది. తెలంగాణలో 24 గంటల కరెంటు రావడానికి కేంద్ర ప్రభుత్వమే కారణం. గతంలో ముడుపులు లేనిదే ఏ పని జరిగేది కాదు.. కానీ మోదీ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోంది. రాజీవ్ గాంధీ ప్రభుత్వం 100 రూపాయలు పంపిస్తే ప్రజల వద్దకు 15 రూపాయలు చేరేవి. మోదీ వచ్చాక 100కు వంద రూపాయలు చేరుతున్నాయి. ఉజ్వల పథకం క్రింద తుంగతుర్తిలో 2000మందికి గ్యాస్ కనెక్షన్లు వచ్చాయని ఇక్కడి ప్రజలు చెప్పారు. గత ఎన్నికల్లో సంకినేని వెంకటేశ్‌కు టిక్కెట్ ఇవ్వలేకపోయాం. కానీ ఈ సారి వెంకటేశ్ ఘన విజయం సాధిస్తారు. టీడీపీతో మేం స్నేహంగానే ఉన్నప్పటికీ.. వాళ్లు మాకు వెన్నుపోటు పొడిచారు. ఇకముందు పొడుస్తారు. జనచైతన్య యాత్ర విజయవంతగా సాగుతోంది. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లాగానే, బీసీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును లోక్‌సభలో అమోదిస్తే.. రాజ్యసభలో కొందరు అడ్డుకున్నారు. వచ్చే సమావేశాల్లో ఈ బిల్లును పాస్ చేస్తాం. జన చైతన్య యాత్ర ఇంతటితో ఆగిపోదు.. సంవత్సరమంతా కొనసాగుతోంది. ఈ యాత్రతో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తోంద’ని తెలిపారు. -
దాహార్తి తీరింది..!
♦ బోరు అద్దెకు తీసుకుని నీటి సరఫరా ♦ మరో బోరుకు కూడా మరమ్మతులు ♦ రాజనాయక్ తండావాసుల్లో సంబరం తుంగతుర్తి: పదేళ్లుగా తాగునీటి కోసం అల్లాడుతున్న ఆ తండా వాసుల దాహర్తి తీరింది. నీటి సమస్య తీవ్రంగా ఉండటంతో ఆ తండాకు పిల్లను కూడా ఎవరూ ఇవ్వడం లేదు. వారి ఆవేదనను వివరిస్తూ ‘పానీ చేనికన్.. ఛార్విన్ దేరేకొని’ శీర్షికన శనివారం ‘సాక్షి’ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. ఈ క్రమంలో మంగళవారం తండాకు నీటి సరఫరా చేశారు. సూర్యాపేట జిల్లా లోని తిరుమలగిరి మండలం మారుమూల గ్రామమైన జలాల్పురం శివారు రాజనాయక్ తండాలో పదేళ్లుగా గిరిజనులు నీటి కోసం కష్టాలు పడుతున్నారు. తండాలో బోర్లు వేసినా నీరు పడకపోవడంతో కిలోమీటర్ల దూరం నడిచి వ్యవసాయ బావులు, బోర్ల వద్ద నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సాక్షి కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్, రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్ సురేంద్రమోహన్.. నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. సాధ్యమైనంత త్వరలో తండావాసుల నీటి కష్టాలు తీర్చాలని ఆదేశించారు. దీంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సోమ, మంగళవారాల్లో తండాను సందర్శించి నీటి వనరులను సమీక్షించారు. తండాకు కిలోమీటర్ దూరంలో ఉన్న వ్యవసాయ బోరులో నీరు ఉండటంతో ఆ రైతును పిలిచి డబ్బులు చెల్లిస్తాం వేసవిలో నీటి సరఫరా చేయాలని కోరారు. అనంతరం తండా వెలుపల ఉన్న మరో బోరుకు మరమ్మతులు చేయడంతో కొద్దిగా నీరు వస్తోంది. ఈ రెండు బోర్లద్వారా తండాలోని ట్యాంక్‌ను నింపి మంగళవారం నీటిని సరఫరా చేశారు. నీటి సమస్య తీరడంలో ఆ తండావాసుల ఆనందానికి హద్దులు లేవు. నీటి సమస్య పరిష్కారానికి తోడ్పడిన సాక్షి దినపత్రికకు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు. ‘సాక్షి’కి కృతజ్ఞతలు మా తండాకు 10 ఏళ్ల నుంచి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. సాక్షి పత్రిక వారు మా బాధలను తెలుసుకొని కథనాన్ని రాశారు. దీంతో అధికారులు స్పందించి మా తండాకు నీటిని సరఫరా చేశారు. సాక్షి పత్రికవారికి కృతజ్ఞతలు. – మాలోతు హరిలాల్, రాజనాయక్ తండా మాకు ఎంతో సంతోషంగా ఉంది ఎన్నో సంవత్సరాలుగా నీటి కోసం ఇబ్బందులు పడ్డాం. వేసవిలో నీటి సమస్య తీవ్రంగా ఉండేది. ఈ సమస్యను పరిష్కరించి, మా తండాకు నీటిని తెచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా. కిలోమీటర్ దూరం నడిచే బాధ తీరింది. – మాలోతు బుజ్జి, రాజనాయక్ తండా -
పడిన చోటే మళ్లీ గండి..
పెద్దవూర: ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని చెరువులు, కుంటలు నిండి అలుగులు పోస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో శుక్రవారం ఉదయం తుంగతుర్తి ఊరచెరువుకు గండి పడింది. ఏఎమ్మార్పీ కాలువలకు నీటిని విడుదల చేయడం, ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తుంగతుర్తి ఊర చెరువు నిండిపోయింది. గురువారం రాత్రి కుండపోతగా కురిసిన వర్షానికి పైనుంచి వరద ఎక్కువగా రావడంతో ఒత్తిడికి కట్టకు గండిపడింది. దీనికింద సాగవుతున్న 250 ఎకరాలలో పంటలు నీటిలో మునిగిపోయాయి. తుంగతుర్తి- అల్వాల తండా రోడ్డు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. గూనలు మాత్రమే మిగిలాయి. తుంగతుర్తి- చింతపల్లి రోడ్డు సైతం అర కిలోమీటర్ మేర నీటిలో మునిగిపోయింది. తుంగతుర్తి-చింతపల్లి, అల్వాలతండా, చలకుర్తి, చింతపల్లి-అల్వాల రోడ్లు దెబ్బతినడంతో ఆయా గ్రా మాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం వేకువజామున పొలాల్లోకి వెళ్లిన రైతులు చుట్టూ నీరు చేరడంతో మధ్యాహ్నం వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. మళ్లీ అక్కడే.. గత యేడాది అక్టోబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు తుంగతుర్తి చెరువుకు గండి పడింది. దీనిని రూ.4లక్షల ఎఫ్డీఆర్ (ఫ్లడ్ డ్యామేజీ రిఫైర్) నిధులతో తాత్కాలిక మరమ్మతులు చేశారు. ఇసుక నింపిన బస్తాలను గండికి అడ్డంగా వేసి మట్టితో కట్టపోశారు. వరద ఉధృతికి అదేచోట మళ్లీ గండి పడింది. దీంతో నీరంతా వెళ్లి చెరువు ఖాళీ అయ్యింది. గత ఏడాదీ.. ఇదే పరిస్థితి ఏఎమ్మార్పీ ప్రధాన కాలువ, లోలెవల్ వరద కాలువలకు నీటిని విడుదల చేయడం, చెరువులోనూ నీళ్లు ఉండడంతో తుంగతుర్తి రైతులు వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి పత్తి విత్తనాలు, వరినాట్లు వేశారు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వంతో గత యేడాది ఇదే చెరువుకు గండి పడటంతో తీరా పంట చేతికి వచ్చే సమయంలో పంటలన్నీ వరద నీటిలో కొట్టుకుపోయాయి. పొలాలలో ఇసుక మేటలు వేశాయి. దీంతో వేల రూపాయలు పెట్టి ఇసుక మేటలను తొలగించి మళ్లీ వరినాట్లు వేశారు. ఇంతలోనే ప్రకృతి శాపమో, అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ పంటలన్నీ వరద నీటిలో కొట్టుకుపోయాయి. మళ్లీ పొలాలలో ఇసుక మేటలు వేసే పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెగిన డైవర్షన్ రోడ్డు.. కనగల్ : కురంపల్లి-దోరెపల్లి ప్రధాన రహదారిలోని రేగట్టె వాగులో ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు గురువారం రాత్రి వరద ఉధృతికి తెగింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వాగులో నూతనంగా బ్రిడ్డి నిర్మిస్తున్నందున ప్రయాణికుల సౌకర్యార్థం వాగులో ప్రత్యామ్నాయ మట్టిరోడ్డును నిర్మించారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురువడంతో వాగులో వరద ఉధృతికి రోడ్డు తెగిపోయింది. గూనలు కొన్ని వరదలో కొట్టుకుపోయాయి. దీంతో చండూరు తదితర ప్రాంతాలతోపాటు పరిసర గ్రామాలైన కురంపల్లి, శాబ్దులాపురం, రేగట్టెలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
పరువుహత్య కేసులో నిందితుల లొంగుబాటు
తుంగతుర్తి :పరువుహత్య కేసులో నిందితులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. కులాంతర వివాహం చేసుకుని తమ పరువు మంటకలిపిందనే కోపంతోనే కూతురిని దారుణంగా అంతమొందించినట్లు ఒప్పుకున్నారు. సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన స్వప్న తల్లిదండ్రులు బయ్య లింగమల్లు, బచ్చమ్మను సీఐ పార్థసారథి మీడియా ముందు ప్రవేశపెట్టారు. హత్యకు గల కారణాలు, నింది తుల వివరాలు వెల్లడించారు. తిరుమలగిరి మండలం మామిడిపెల్లి గ్రామానికి చెందిన లింగమల్లు, బచ్చమ్మలు పదిహేనేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం మండలంలోని గానుగుబండకు వలస వచ్చారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు స్వప్న అదే గ్రామానికి చెందిన జలగం ప్రవీణ్‌ను ప్రేమించుకున్న విషయం గత ఏడాది తల్లిదండ్రులకు తెలి సింది. వారి ప్రేమ ఇష్టం లేని తల్లిదండ్రులు తమ కూతురుకు వేరే వ్యక్తితో వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత నెల 14వ తేదీన స్వప్న తన ప్రియుడు ప్రవీణ్‌తో వెళ్లి భద్రాచలంలో వివాహం చేసుకుంది. అనంతరం కొద్దిరోజులకు స్వప్న తన భర్తతో కలసి వచ్చి గ్రామంలో నివసిస్తుండడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఈ నెల 9వ తేదీన రాఖీ పండగకు తీసుకొచ్చి దారుణంగా హత్య చేశారని వివరించారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్ఐ గౌరినాయుడు ఉన్నారు.