
సాక్షి, తిరుమలగిరి (తుంగతుర్తి) : పిల్లలను ఇంట్లోనే వదిలి వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన తిరుమలగిరిలో ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన పాము సరిత ఈ నెల 18వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి తిరిగి రాలేదు. సరితకు 11సంవత్సరాల కూతురు, ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె భర్త పి.మహేష్ బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ప్రొబేషనరీ ఎస్‌ఐ ఉదయ్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment