Saritha
-
అర్ధరాత్రి తాగొచ్చి నటిని కొట్టేవాడు.. అలాంటి వ్యక్తిని గెలిపించారు!
ఇంటి ఇల్లాలిని చూసుకోలేనోడు సమాజాన్ని మాత్రం ఏం ఉద్ధరిస్తాడు? భార్య కంట నీళ్లు తెప్పించినవాడు ప్రజల గోసలు పట్టించుకుంటాడా? అసలు ఇంటినే గెలవలేనివాడికి అందరి మనసులో స్థానం సంపాదించుకునే అర్హత ఇంకెక్కడిది? కానీ ఇవన్నింటికీ విరుద్ధంగా ఓ వ్యక్తి మాత్రం దర్జాగా ఎమ్మెల్యే పోస్టు సంపాదించాడు. అది కూడా వరుసగా రెండుసార్లు! అతడే ముఖేశ్ మాధవన్..ప్రేమ పెళ్లి విఫలంముఖేశ్ నటుడు, నాయకుడు.. 1988లో సరితను ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. మొదట్లో బాగానే ఉన్నప్పటికీ రానురానూ దంపతుల మధ్య కలహాలు మొదలయ్యాయి. అవి కాస్తా పెద్దవి కావడంతో 2011లో విడిపోయారు. ఆ తర్వాత 2013లో క్లాసికల్ డ్యాన్సర్ దేవికను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. 2021లో విడాకులు తీసుకున్నారు.క్యారెక్టర్ లేనివాడుసీపీఎమ్లో కొనసాగుతున్న ఈయన 2016, 2019లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. మాజీ భర్త ముఖేశ్ ఎలాంటివాడో చెప్పిన సరిత పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. అందులో ఆమె ఏమందంటే.. ముఖేశ్‌కు క్యారెక్టర్ లేదు. ఎదుటివారికి కూసింత గౌరవం కూడా ఇచ్చేవాడు కాదు. పైగా నన్ను అనునిత్యం వేధించేవాడు. అతడి తండ్రి ముందే తాగొచ్చి కొట్టేవాడు. తండ్రి ముందే తాగొచ్చి..అలాగే అమ్మాయిలను వెంటేసుకుని సరాసరి ఇంటికి వచ్చేవాడు. ఎందుకు ఆలస్యమైందని అడిగితే పనివాళ్లముందు జుట్టు పట్టుకుని లాక్కొచ్చి కొట్టి చీడపురుగులా చూసేవాడు. ఒకసారైతే ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా కడుపులో తన్నాడు అంటూ సరిత ఎమోషనలైంది. ఇలాంటి వ్యక్తిని సమాజం నమ్మడం, తమనేదో ఉద్ధరిస్తాడని అందలం ఎక్కించడం నిజంగా విడ్డూరమే!చదవండి: దసరా బాక్సాఫీస్.. రజినీకాంత్ - సూర్య ఫ్యాన్స్ మధ్య వార్! -
భర్త వేధింపులు తాళలేక భార్య విషాదం!
మహబూబ్‌నగర్: భర్త వేధింపులు తాళలేక భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ముమ్మళ్లపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మంజునాథ్‌రెడ్డి కథనం మేరకు.. పాన్‌గల్ మండలం బుసిరెడ్డిపల్లికి చెందిన కృష్ణయ్య కుమార్తె సరిత (25)ను కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లికి చెందిన నాయిని మారుతికిచ్చి ఆరేళ్ల కిందట వివాహం జరిపించారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. మారుతి జిల్లాకేంద్రంలోని మార్కెట్‌యార్డులో కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవారు. బుధవారం ఉదయం భర్త, పిల్లలు బంధువుల ఇంట్లో జరిగే వివాహానికి వెళ్లారు. ఒంటరిగా ఉన్న సరిత ఇంట్లో ఉరేసుకుంది. ఇంటికి వచ్చిన మారుతి తలుపులు తెరిచి చూడగా సరిత ఉరేసుకొని కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ సరిత తల్లిదండ్రులతో వివరాలు సేకరించారు. కొంతకాలంగా మారుతి అదనపు కట్నం కోసం భార్యను వేధించేవాడని తండ్రి వాపోయాడు. కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. ఇవి చదవండి: భర్త, అత్త వేధింపులతో వివాహిత తీవ్ర నిర్ణయం..! చివరికి.. -
రెండు పెళ్లిళ్లు.. విడాకులు.. స్టార్ హీరోయిన్గా క్రేజ్.. 10 ఏళ్ల తర్వాత!
తను స్క్రీన్‌పై కనిపిస్తే చూపు తిప్పుకోవడం కష్టమే! తన క్రేజ్ చూసి స్టార్ హీరోలు సైతం కుళ్లుకునేవారు. 1980వ దశకంలో స్టార్ హీరోయిన్గా రాణించిందీ నటి. దక్షిణాదిన పలు భాషల్లో అగ్రతారగా వెలుగొందిన ఈ సీనియర్ హీరోయిన్ దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించింది. వెండితెర ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసిన ఆమె నిజ జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఆవిడే సరిత.. తన ప్రస్థానాన్ని నేటి కథనంలో చూసేద్దాం.. కెరీర్‌ను మలుపు తిప్పిన మరో చరిత్ర సరిత తెలుగింటి అమ్మాయి. గుంటూరులోని మునిపల్లెలో జన్మించింది. ఈమె నటించిన తొలి చిత్రం 'మంచికి స్థానం లేదు'. కానీ దీనికంటే ముందు సరిత నటించిన 'మరో చరిత్ర' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కమల్ హాసన్ సరసన కథానాయికగా నటించింది. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హిట్ కావడంతో సరితకు తెలుగు, తమిళంలో బోలెడన్ని ఆఫర్లు వచ్చాయి. అలా ఆమె నటించిన సినిమాలు గ్రాండ్ సక్సెస్ అందుకున్నాయి. అటు మలయాళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది సరిత. ఎన్నో అవమానాలు.. తెలుగులో మహేశ్‌బాబు అర్జున్ సినిమాలో పోషించిన ఆండాలు పాత్రకుగానూ నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంది. నిజానికి సరిత అందంగా లేదని, ఆమె హీరోయినేంటని చాలామంది నవ్వుకున్నారు. కానీ అలా అవమానించినవారితోనే చప్పట్లు కొట్టేలా చేసింది నటి. కొన్ని సన్నివేశాల్లో సరిత డామినేషన్ చూసి ఆ సీన్లు తొలగించాలని కూడా చెప్పేవారట. కావాలంటే హీరోనైనా మారుస్తాం కానీ సరిత సీన్లు తొలగించేదేలేదని దర్శకులు మొండిగా బదులిచ్చేవారట. ఇక ఆమె కెరీర్ ఎదుగుదలను చూసి ఎందరో తారలు ఓర్వలేకపోయారని కూడా అంటుంటారు. ఎందరో హీరోయిన్లకు గొంతు అరువిచ్చింది.. సాధారణంగా ఒక సెలబ్రిటీ స్థాయికి రాగానే గర్వం తలకెక్కుతుందంటారు. కానీ సరిత మాత్రం ఎప్పుడూ పక్కింటి అమ్మాయిలాగే కనిపించేది, అలాగే మసులుకునేది. ఇతర హీరోయిన్లకు గొంతు అరువివ్వడానికి కూడా ఎప్పుడూ వెనుకాడలేదు. విజయశాంతి, సుహాసిని, మాధవి, సౌందర్య, రమ్యకృష్ణ, నగ్మా, సిమ్రాన్, టబు, సుష్మితా సేన్, రోజా, రాధిక, ఆర్తి అగర్వాల్.. ఇలా ఎందరో తారలకు డబ్బింగ్ చెప్పింది. అమ్మోరు, మా ఆయన బంగారం, మావిచిగురు, అంతపురం సినిమాలకు డబ్బింగ్ చెప్పినందుకుగానూ ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నాలుగు నందులు గెలుచుకుంది. ప్రేమ పెళ్లి.. గొడవలు, వివాదం.. 1988లో మలయాళ నటుడు ముఖేశ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది సరిత. వీరికి ఇద్దరు కొడుకులు శ్రవన్, తేజస్ సంతానం. కొంతకాలం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. ఈ గొడవలు విడాకులకు దారి తీశాయి. 2009లో ముఖేశ్.. సరిత నుంచి వివాహ రద్దు కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాడు. సుదీర్ఘకాలంపాటు ఈ కేసు విచారణ జరగ్గా 2013లో వీరికి విడాకులు మంజూరయ్యాయి. ఆ తర్వాత ముఖేశ్.. మిధుల అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. చిన్న వయసులోనే పెళ్లి? విడాకుల వ్యవహారం తర్వాత కుమారుడు శ్రవన్‌తో కలిసి దుబాయ్ వెళ్లిపోయిన సరిత ఇటీవలే చెన్నైకి తిరిగొచ్చింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత శివకార్తికేయన్ 'మావీరన్' సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. అయితే ముఖేశ్ కంటే ముందు తెలుగు నటుడు వెంకట సుబ్బయ్యతో 16 ఏళ్లకే సరిత పెళ్లి జరిగిందని, ఆరు నెలల పాటు కలిసున్న వీరు తర్వాత విడిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇక సరిత రెండో కొడుకు శ్రవణ్ డాక్టర్, యాక్టర్ కూడా. ఇతడు కల్యాణం అనే సినిమాలో నటించాడు. చదవండి: ఆవేశంతో కుటుంబాన్ని కాల్చిన తెలుగు సినిమా విలన్ -
'వరకట్నం వేధింపులు' భరించలేక వివాహిత తీవ్ర నిర్ణయం!
సాక్షి, మంచిర్యాల: భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్యాంపటేల్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని శ్రావణ్‌పల్లికి చెందిన సరిత (25), జెండావెంకటా పూర్‌కు చెందిన గొడిసెల స్వామి ఆరేళ్ల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. కొంతకాలంవారి దాంపత్య జీవితం సజావుగా సాగింది. ఏడాది క్రితం నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్యను అనుమానించడంతో పాటు వరకట్నం తేవాలని వేధిస్తుండేవాడు. ఇదే క్రమంలో శుక్రవారం ఇద్దరి మధ్య గొడవ జరగగా సరిత ఇంట్లోనే పురుగుల మందు తాగింది. గమనించిన స్వామి వెంటనే ఆటోలో మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. మృతురాలి తండ్రి మాలోతు జిత్తు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
46 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి సరిత విజయం
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని 39వ డివి జన్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో పాత ఫలితమే పునరావృతమైంది. ప్రస్తుత కార్పొరేటర్, బీఆ ర్ఎస్ అభ్యర్థి కొండపల్లి సరిత 46 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డివిజన్ ఓట్ల రీకౌంటింగ్ నిర్వహించగా, అభ్యర్థులంతా గత ఓట్లనే సాధించారు. 2020 జనవరిలో జరిగిన నగరపాలకసంస్థ ఎన్నికల్లో 39వ డివిజన్‌కు సంబంధించి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కొండపల్లి సరిత 46 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి వూట్కూరి మంజుల భార్గవిపై విజయం సాధించారు. అయితే బ్యాలెట్ పత్రాలు తారుమారాయ్యాయని, మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టాలని మంజుల భార్గవి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు శనివారం జిల్లా కోర్టులో 39వ డివిజన్ ఎన్నికల ఓట్ల లెక్కింపును తిరిగి చేపట్టారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఓట్ల లెక్కింపు కొనసాగింది. జిల్లా కోర్టు జడ్జి సమక్షంలో న్యాయవాది, ప్రభుత్వ ఉద్యోగులు, నగరపాలకసంస్థ సిబ్బంది బ్యాలెట్ బాక్స్‌లు ఓపెన్‌చేసి ఓట్లు లెక్కించారు. ఓట్ల లెక్కింపులో 2020 జనవరి ఎన్నికల్లో వచ్చిన తరహాలోనే అభ్యర్థులు ఓట్లు సాధించారు. ఓట్లలో ఎలాంటి మార్పు లేకపోవడంతో కొండపల్లి సరితను విజేతగా జిల్లా న్యాయమూర్తి ప్రకటించారు. ధర్మమే గెలిచింది రీ కౌంటింగ్‌లోనూ ధర్మమే గెలిచింది. ఎన్నికలు, ఓట్ల లెక్కింపు నిష్పక్షపాతంగా జరిగాయి. ప్రజలు మాపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకుంటాం. మంత్రి గంగుల కమలాకర్, మేయర్ యాదగిరి సునీల్‌రావు సహకారంతో డివిజన్ సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా. – కొండపల్లి సరిత, కార్పొరేటర్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు అన్నమనేని నిహారిక (బీజేపీ) 466 కొండపల్లి సరిత (బీఆర్ఎస్) 876 జ్యోతి ఉప్పుగండ్ల (కాంగ్రెస్) 31 కోట శారద (స్వతంత్ర) 120 మంజుల భార్గవి వూట్కూరి (స్వతంత్ర) 830 సునీత గూడ(స్వతంత్ర) 49 ఫలితం: 46 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి కొండపల్లి సరిత గెలుపు 39వ డివిజన్ ఓట్ల వివరాలు మొత్తంఓట్లు 3,898 పోలైనవి 2,401 చెల్లనివి 18 నోటా 11 -
బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేతలు
సాక్షి, న్యూఢిల్లీ/గద్వాల రూరల్: జోగుళాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్, బీఆర్ఎస్ నాయకురాలు సరితా తిరుపతయ్య దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన కార్యక్రమంలో సరితా తిరుపతయ్య కాంగ్రెస్‌లో చేరారు. ఇక, వీరితో పాటు బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ఆరెంజ్ ట్రావెల్స్ సునీల్ రెడ్డి. మాజీ మార్కెట్ యార్డు చైర్పర్సన్ బండ్ల లక్ష్మీదేవి దంపతులు, గట్టు సర్పంచ్ ధనలక్ష్మి దంపతులు, ధరూరు మండలానికి సీనియర్ నేతలు రాఘవేంద్రరెడ్డి, సోము, మల్దకల్ మండలం సీనియర్ నేత అమరవాయి కృష్ణారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరి వెంట ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: కోర్టులో కలుద్దాం.. మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు సుఖేశ్ లేఖ -
మీకోసం ఎదురెళ్లడానికి సిద్ధంగా ఉన్నా..
గద్వాల రూరల్: నేనంటే గద్వాలలోని కొందరు నాయకులకు భయం.. అందుకే నేను మీటింగ్‌కు వస్తే కరెంట్ తీశారు.. నేను కుల, మత భేదాలు తెలియకుండా అందరి మధ్య పెరిగిన వ్యక్తిని. కానీ, నడిగడ్డలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఇక్కడ కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఎస్సీలను ముట్టుకోరు.. దగ్గరకు రానీయరు.. ఇలాంటి పరిస్థితి ఎక్కడా చూడలేదు. ఇక్కడ రాజ్యాధికారం అంతా కొందరి చేతిలో బంధీ అయింది. ఇక్కడ జరుగుతున్న మీటింగ్‌కు చాలామంది రావాల్సి ఉన్నా.. కొందరు నాయకుల దౌర్జన్యానికి భయపడి రాలేకపోయారు. దీంతో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలను కేవలం బానిసలుగా చూస్తున్నారు.. ఈ పరిస్థితి మారాలంటే మనకే రాజ్యాధికారం దక్కాలి.. ఇక్కడున్న వారికి ఎవరికి అవకాశం వచ్చినా నేను అండగా నిలబడతాను.. మీకోసం ఎదురెళ్లడానికి సిద్ధంగా ఉన్నా.. నాకు మీరు అండగా నిలబడాలి అంటూ జెడ్పీ చైర్పర్సన్ కె.సరిత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మల్దకల్లో నిర్వహించిన గద్వాల యువచైతన్య సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమే రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గద్వాలలో ఒక్కసారి బలహీన వర్గానికి చెందిన గట్టుభీముడికి అవకాశం వచ్చిందని, అన్న భీముడు అన్ని వర్గాలకు అండగా నిలబడ్డాడని, ఇప్పుడు నాకు అవకాశం ఇస్తే బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు సేవ చేస్తూ అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు. మన ఓటు మనమే వేసుకుందామని, మనల్ని మనమే గెలిపించుకుందామన్నారు. మార్పు ఒక్కరితోనే మొదలవుతుంది. ఆ ఒక్కరు నేనై మొదలుపెడతానని, నాకు మీరంత అండగా నిలబడాలని కోరారు. గద్వాలలో మనల్ని అణచివేతకు గురిచేస్తున్నారని, అందుకే మిమ్మల్ని పదే పదే అడుగుతున్నా.. ముఖ్యంగా యువత చెబుతున్నా.. మీరు ఇక్కడికి రాకపోవడానికి రకరకాల భయాలే కారణమని తెలుసు.. కానీ, నేను చెప్పేది మీరు కచ్చితంగా వింటారు. ఎందుకంటే ఫేస్బుక్లో ఎంతమంది నన్ను ఫాలో అవుతారో నాకు తెలుసు. చదువుకున్న యువత ముందుకు రావాలి. ఎన్నికల సమయంలో మీకు క్రికెట్ టోర్నమెంట్ అంటూ పక్కదోవ పట్టించి మోసం చేసేందుకు ఇక్కడి కొందరు నాయకులు కుయుక్తులు పన్నుతారు. వారి కుతంత్రాలకు మోసపోకుండా చైతన్యులు కావాలి. అప్పుడే మనం అభివృద్ధి చెందుతాం. వెనకబడ్డ జాతులు బాగుపడటానికి ముందుకొచ్చిన నాయకుడికి నేను అండగా ఉంటా.. నాకు మీరు అండగా ఉండాలి. నా దృష్టిలో రెండే కులాలున్నాయి. ఒకటి మంచితనం, రెండు చెడుతనం. జనాలకు మేలు చేసే కులం అగ్రకులమైతది కానీ, తెల్లబట్టలు వేసుకుని జనాలకు కీడు చేసుకుంటూ హింసిస్తూ నేను అగ్రకులస్తుడిని అంటే సరిపోదంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సభలో పాల్గొన్న పలువురు వక్తలు ఈసారి అన్ని రాజకీయ పార్టీలు బీసీలకే టికెట్ ఇవ్వాలని డిమాండు చేశారు. లేదంటే రాబోయే ఎన్నికల్లో బీసీ బలమేంటో చూపిస్తాం అన్నారు. -
Video: వైకల్యం శరీరానికి మాత్రమే! మనసుకు కాదు.. బాహుబలిలో నటించా!
ప్రతిభ, ఉన్నత స్థానాన్ని అధిరోహించాలన్న పట్టుదల ఉంటే శారీరక వైకల్యం ఏమాత్రం అడ్డుకాదని నిరూపించింది వరంగల్ జిల్లాకు చెందిన సరిత. తన అకుంఠిత దీక్ష, ఆత్మవిశ్వాసంతో మోడల్ ఎదిగి పలు అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. ఫ్యాషన్ మోడల్‌గా కెరీర్‌ను నిర్మించుకుంటోంది. తొలుత మిస్ తెలంగాణ డెఫ్ అండ్ డంబ్‌గా ఎంపికైన సరిత.. ఇటీవల టాంజానియా మిస్టర్ అండ్ మిస్ డెఫ్ అండ్ డంబ్ బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొని రన్నరప్‌గా కిరీటం అందుకుంది. తద్వారా అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటింది. చిన్ననాటి నుంచే స్కూల్లో ఉన్ననాటి నుంచే మోడలింగ్‌పై మక్కువ పెంచుకున్న సరిత.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. వైకల్యాన్ని జయించి విజయాలను చిరునామాగా మార్చుకుని తన ప్రయాణం కొనసాగిస్తోంది. మూగ, చెవుడు వంటి సమస్యల కారణంగా ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ చిరునవ్వుతోనే వాటిని దాటుకుంటూ సినిమాల్లోనూ తన ప్రతిభ నిరూపించుకుంటోంది. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌లతో పాటు కీర్తి సురేశ్ తన ఫేవరెట్ అంటున్న సరిత స్ఫూర్తిదాయక కథ పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూసేయండి! తన కాళ్ల మీద తాను నిలబడి సొంతంగా ఇక్కడి దాకా చేరుకున్న సరిత మరిన్ని విజయాలు సాధించాలని ఆల్ ది బెస్ట్ చెప్పేయండి! చదవండి: ట్రెండ్: కుటుంబాలకు రీల్స్ గండం -
భారత రెజ్లర్ సరిత స్వర్ణ సంబరం...
భారత మహిళా స్టార్ రెజ్లర్ సరితా మోర్ ఈ ఏడాది తన ఖాతాలో తొలి స్వర్ణ పతకాన్ని జమ చేసుకుంది. కజకిస్తాన్‌లో జరుగుతున్న యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్ సిరీస్ టోర్నీ బొలాత్ టర్లీఖనోవ్ కప్‌లో సరితా 59 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది. సరిత గెలిచిన మూడు బౌట్లూ టెక్నికల్ సుపీరియారిటీ (ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం రాగానే విజేతగా ప్రకటిస్తారు) పద్ధతిలోనే రావడం విశేషం. ఫైనల్లో సరిత 10–0తో జాలా అలియెవ్ (అజర్బైజాన్)పై, సెమీఫైనల్లో 12–2తో ఐజాన్ ఇస్మగులోవా (కజకిస్తాన్)పై, రెండో రౌండ్లో 11–0తో డయానా (కజకిస్తాన్)పై గెలిచింది. ఇదే టోర్నీలో భారత రెజ్లర్లు మనీషా (65 కేజీలు) స్వర్ణం... బిపాసా (72 కేజీలు) రజతం, సుష్మా (55 కేజీలు) కాంస్యం సాధించారు. -
సెల్ఫోన్లో మగవాళ్లతో ఎక్కువ మాట్లాడుతోందని...
సాక్షి, చెన్నై: సెల్ఫోన్లో మగవాళ్లతో ఎక్కువ సమయం మాట్లాడుతుందనే కారణంతో భార్యను హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ట్రిప్లికేన్కు చెందిన పుగల్‌కొడి అలియాస్ ఢిల్లీ (29) ఫుడ్ డెలివరీ సంస్థలో పని చేస్తున్నాడు. ఇతని భార్య సరిత (21). మైలాపూర్‌లోని ఓ ప్రైవేటు హోటల్లో పని చేస్తోంది. ఈ క్రమంలో సరిత తన స్నేహితుడు జగదీశన్‌తో ఎక్కువ సమయం సెల్ఫోన్లో మాట్లాడుతుండటంతో దంపతుల మధ్య తరచూ గొడవ జరిగేది. గత 17వ తేదీ ఏర్పడిన ఘర్షణ లో పుగల్‌కొడి తన భార్య సరితపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సరిత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. ఈ మేరకు కన్నగినగర్ పోలీసులు పుగల్కొడిని అరెస్టు చేసి పుళల్ జైలుకు తరలించారు. చదవండి: (జరిమానా విధించినందుకు ఎస్ఐ గొంతు కోశాడు.. సీఎం పరామర్శ) -
పిల్లలను ఇంట్లో వదిలి వివాహిత అదృశ్యం
సాక్షి, తిరుమలగిరి (తుంగతుర్తి) : పిల్లలను ఇంట్లోనే వదిలి వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన తిరుమలగిరిలో ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన పాము సరిత ఈ నెల 18వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి తిరిగి రాలేదు. సరితకు 11సంవత్సరాల కూతురు, ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె భర్త పి.మహేష్ బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ప్రొబేషనరీ ఎస్ఐ ఉదయ్‌కుమార్ తెలిపారు. -
అక్క కోసం చెల్లించింది!
జీడిమెట్ల: అక్కకు నాలుగుసార్లు అబార్షన్ అయి పిల్లలు పుట్టకపోవడంతో ఆమె బాధకు చలించిన ఓ చెల్లి రాష్ట్ర ప్రభుత్వ దత్తత నియమాలు అనుసరించకుండా రూ.22 వేలకు మగ శిశువును కొన్న వ్యవహారం జీడిమెట్ల ఠాణా పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా దత్తత తీసుకున్న ఇద్దరితో పాటు మధ్యవర్తులు ఇద్దరిపై, మగ శిశువును అమ్మిన తల్లిదండ్రులపై జువెనైల్ జస్టిస్ యాక్ట్‌లోని 80, 81 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే... మహబూబాబాద్ జిల్లా కాచీపుట్లకు చెందిన దంపతులు మదన్‌సింగ్, సరిత 15 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి గాజులరామారం బతుకమ్మబండ ప్రాంతంలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు (6 ఏళ్లు, 2 నెలలు). అడ్డా కూలి అయిన మదన్‌సింగ్ మద్యానికి అలవాటుపడ్డాడు. లాక్డౌన్ సమయంలో పని దొరకకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అయితే ఇదే సమయంలో వీరి ఇంటి పక్కనే ఉండే మహేష్, యాదమ్మలు వీరి పరిస్థితిని ఎల్లమ్మబండలో ఉంటున్న శేషు అనే మహిళకు వివరించారు. అంతకుముందే శేషు తన అక్క దేవీ పెంచుకునేందుకు ఓ బాబు కావాలని.. ఎవరన్నా ఉంటే చెప్పమని.. వీరికి చెప్పింది. అయితే మధ్యవర్తిత్వం వహించిన మహేశ్, యాదమ్మలకు కొంత డబ్బు ఇచ్చిన శేషు... మదన్ సింగ్ దంపతులకు కూడా రూ.22 వేలు చెల్లించింది. అలాగే దత్తత తీసుకున్నట్లు బాండ్ పేపర్ రాయించుకున్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో వారికి 2 నెలల బాబును ఇచ్చిన సరిత.. ఆదివారం ఉదయం ఏడుస్తూ ఉండటంతో చుట్టుపక్కల వాళ్లు ఏం జరిగిందని అడిగారు. దీంతో ఆమె జరిగిన విషయమంతా చెప్పడంతో కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఆ బాబును తీసుకొని వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేటకు శేషు, అరవింద్ (శేషు అన్న కొడుకు) వాహనంలో వెళుతుండగా బోయిన్పల్లి, సికింద్రాబాద్ మధ్యలో జీడిమెట్ల పోలీసులు వెంబండించి పట్టుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని విచారించడంతో తన అక్కకు నాలుగుసార్లు అబార్షన్ అయిందని, పిల్లలు పెంచుకోవాలన్న ఉద్దేశంతో కొనుక్కొని తీసుకెళుతున్నామని చెప్పింది. ఆ తర్వాత మదన్‌సింగ్, సరితను కూడా జీడిమెట్ల ఠాణాకు తీసుకొచ్చారు. చట్టవిరుద్ధంగా దత్తత తీసుకున్నారని, ఇందుకు మధ్యవర్తిత్వం వహించారని, అలాగే బాబును అమ్మారని... ఇలా ఆరుగురిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాబును శిశువిహార్‌కు తరలించారు. అయితే బాబును అమ్మేందుకు మధ్యవర్తిత్వం వహించిన మహేశ్, యాదమ్మలు గతంలో ఇలాంటివి ఏమైనా చేశారనే దిశగా విచారణ సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా ఇటువంటి ఉదంతాలపై కఠినంగా వ్యవహరించాలని బాలల హక్కుల సంఘం చైర్మన్ అచ్యుతారావు.. బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డిని డిమాండ్ చేశారు. -
అమెరికాలో తెలుగు జడ్జిమెంట్
ట్రంప్ నోటి వెంట తెలుగు పేరు.. ఒక్కసారిగా కరోనా లాక్డౌన్ దిగులు పోయి ఉత్సాహం పొంగింది.. ఆ పేరు... సరితా కోమటిరెడ్డి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమెను ఫెడరల్ కోర్టు జడ్జిగా నియమించారు. ఇప్పుడు ఆమె న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి. అమెరికాలోని తెలుగు సంతతికి చెందిన మహిళ సాధించిన ఈ గౌరవం కరోనా తెచ్చిన నిరాశను మరిపించింది.. ఉత్సాహాన్ని పంచింది.. సరిత తలిదండ్రుల స్వస్థలం తెలంగాణలోని నల్లగొండ జిల్లా చిట్యాల. తల్లి గీతారెడ్డి రుమటాలజిస్ట్. తండ్రి హనుమంత్ రెడ్డి కార్డియాలజిస్ట్. అమెరికాలో స్థిరపడ్డారు. సరిత పుట్టి పెరిగింది అమెరికాలోనే. చిన్నప్పటి నుంచి ఆమె ప్రతిభ గల విద్యార్థినే. బీఏ డిగ్రీలోనూ హార్వర్డ్ లా స్కూల్ నుంచి న్యాయశాస్త్రంలోనూ డిస్టింక్షన్ సాధించింది. లాయర్‌గా కొలంబియా సర్క్యూట్ అప్పీల్స్ కోర్ట్ జడ్జి బ్రెట్ కెవనా దగ్గర అసిస్టెంట్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆ తర్వాత అమెరికాలోని అతి పెద్ద చమురు ఉత్పత్తి కంపెనీ అయిన ‘బీపీ డీప్‌వాటర్ హారిజన్ ఆయిల్ స్పిల్ అండ్ ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్’పై ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్‌లో న్యాయసలహాదారుగా పనిచేసింది. 2018లో ‘ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ అండ్ మనీ లాండరింగ్’ డిప్యూ్యటీ చీఫ్‌గా, కంప్యూటర్ హ్యాకింగ్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కోఆర్డినేటర్‌గానూ ఉన్నారు. న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జిగా నియామకానికి ముందువరకూ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులోని అమెరికా అటర్నీ ఆఫీస్ జనరల్ క్రైమ్స్ విభాగానికి డిప్యూటీ చీఫ్‌గా పనిచేశారు. కొలంబియా లా స్కూల్లో న్యాయశాస్త్రం బోధిస్తున్నారు. సరితా తొలి బాస్ అయిన జడ్జి బ్రెట్ కెవనా సిఫారసు మేరకే సరితను న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జిగా నియమించారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఈ నియామకం ఫిబ్రవరిలోనే జరగాల్సింది. కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడి ఇప్పుడు సాధ్యమైంది. ఒకవైపు భారతీయుల అమెరికా వీసాల పట్ల కఠినంగా ఉంటూనే ఇంకోవైపు భారత సంతతి ప్రతిభను ఆస్థానంలో చేర్చుకుంటున్నాడు ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటిదాకా భారత సంతతికి చెందిన మహిళలకు కీలకపదవులు ఇచ్చి భారతీయ మహిళల ప్రజ్ఞాపాటవాల పట్ల తనకున్న గౌరవాన్ని ఇలా చాటుకున్నాడు. -
వైరలవుతున్న ఏపీ పోలీస్ అధికారిణి పాట!
-
నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత
సర్వం శ్రీనివాస్, రవళి, సరిత, మధుశ్రీ, లావణ్య రెడ్డి, పూజ ముఖ్య తారలుగా అతిమల్ల రాబిన్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్వం సిద్ధం–నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత’. సినెటేరియా మీడియా వర్క్స్ పతాకంపై శ్రీలత బి. వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ని దర్శకులు వీఎన్ ఆదిత్య, ‘అమ్మ’ రాజశేఖర్ విడుదల చేశారు. వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టీజర్‌ను చూశాక సినిమా రంగంలోని అలనాటి రోజులు గుర్తుకు వచ్చాయి. టీజర్లో చూపించినట్లుగా ఒక్కరోజైనా సినీ దర్శకునిగా సెట్లో మెలగాలనే ఆకాంక్ష చాలా మందికి ఉంటుంది’’ అన్నారు. ‘‘టీజర్ చూస్తుంటే సినిమా 100 శాతం కామెడీ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది’’ అన్నారు ‘అమ్మ’ రాజశేఖర్. ‘‘సినిమా చూసే ప్రేక్షకులకు పొట్ట చెక్కలవ్వడం ఖాయం’’ అని అతిమల రాబిన్ నాయుడు అన్నారు. శ్రీలత బి.వెంకట్, సినెటేరియా గ్రూప్ సీఈవో వెంకట్ బులెమోని, ఎన్.సి.సి మార్కెటింగ్ హెడ్ శ్రీవికాస్, సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సంచాలకులు డా. రవి కుమార్ జైన్, టెక్స్టైల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అమ్మనబోలు ప్రకాశ్, ‘సమరం’ చిత్రం హీరో సాగర్ జి, లావణ్య, పూజ, ఫరీనా, నటులు సర్వం శ్రీనివాస్, కెమెరామేన్ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డేవిడ్ జి. -
విషం తాగి మహిళ ఆత్మహత్య
పహాడీషరీఫ్: కుటుంబ కలహాల కారణంగా ఓ గృహిణి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.ఈ సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ నాగేశ్వర్ రావు తెలిపిన మేరకు.. సిరిగిరిపురానికి చెందిన దాసరి రమేష్ కుమార్తె సరిత (30) వివాహం మంఖాల్‌కు చెందిన కావలి శ్రీనివాస్‌తో 2007లో జరిగింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. ఇటీవల శ్రీనివాస్ తల్లికి అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి ఖర్చుల విషయంలో శ్రీనివాస్‌కు, అతని సోదరుడి నడుమ చిన్న పాటి గొడవ జరిగింది. దీనికి పర్యావసనంగానే గ్రామ వీఆర్ఏ (కావలికారు) గా కొనసాగుతున్న శ్రీనివాస్ స్థానంలో తాను కూడా చేస్తానంటూ అతని సోదరుడు మొండికేయడంతో కుటుంబంలో గొడవలు కొనసాగుతున్నాయి. దీనిపై మనస్థాపానికి గురైన సరిత బుధవారం మధ్యాహ్నం గుర్తు తెలియని విషం తాగింది. అనంతరం భర్తకు ఫోన్ చేసి కిరోసిన్ తాగినట్లు వెల్లడించింది. వెంటనే భర్త కుటుంబ సభ్యులతో కలిసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందింది. కిరోసిన్ కాకుండా గుర్తు తెలియని విషం తాగి ఉంటుందని వైద్యులు తెలిపారని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
‘కామన్వెల్త్’ స్వర్ణం సాధిస్తా: సరిత
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధిస్తాననే నమ్మకముందని భారత బాక్సర్ సరితా దేవి ఆశాభావం వ్యక్తం చేసింది. గోల్డ్‌కోస్ట్‌లో జరిగే ఈ టోర్నీలో విజేతగా నిలిచేందుకు 100 శాతం కృషి చేస్తానని ఆమె చెప్పింది. పెరిగిన పోటీకి తగినట్లుగా సంసిద్ధం అవుతున్నానని ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన సరితా దేవి తెలిపింది. ‘ప్రాక్టీస్ చాలా బాగా జరుగుతోంది. కామన్వెల్త్లో విజేతగా నిలవడమే నా లక్ష్యం. బరిలో దిగిన తర్వాత ప్రతీ ప్రత్యర్థిని ఓడించడంపైనే దృష్టి పెడతా. కానీ ఆటలో గెలుపోటములు సహజం. గతంతో పోలిస్తే మన పరిస్థితి చాలా మెరుగైంది. ఇప్పుడు నాణ్యమైన కోచ్‌లతో పాటు, అంతర్జాతీయ అనుభవం కూడా పెరిగింది. భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) నుంచి లభిస్తోన్న ప్రోత్సాహం మరు వలేనిది. పురుషులతో సమానంగా మహిళల బాక్సింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు’ అని పేర్కొంది. మాజీ ప్రపంచ చాంపియన్ అయిన సరిత 60 కేజీల వెయిట్ విభాగంలో ఇటీవలే జరిగిన ఇండియన్ ఓపెన్‌లో రజతాన్ని సాధించింది. -
సారథి..సరిత
ప్రతిరోజు ఇంటి ఎదుట నుంచి దూసుకెళ్లే రైళ్లను చూసి అబ్బురపడింది. రైలుకు రథసారథి కావాలనే ఆమె కోరికకు అదే ఊపిరి పోసింది. మరి.. మహిళ రైలు నడపగలదా? అనే ప్రశ్న తలెత్తినప్పుడు... ఆమె ధైర్యంతో ముందుకెళ్లింది. అమ్మానాన్న అండగా నిలిచారు.. ప్రోత్సహించా రు. ఆమె సాధించింది. అసిస్టెంట్ లోకోపైలట్‌గా విధుల్లో చేరి... లోకోపైలట్‌గా ఎదిగింది. ఆమే సరిత. దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్లో రైళ్ల నిర్వహణలో క్రియాశీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సరిత ప్రస్థానం ఆమె మాటల్లోనే... సాక్షి, సిటీబ్యూరో : మా సొంతూరు నాగ్‌పూర్. రైల్వే ఉద్యోగుల క్వార్టర్లకు ఆనుకొని, రైలు పట్టాలకు సమీపంలో మా ఇల్లు ఉండేది. నాన్న టెక్స్టైల్ కంపెనీలో పని చేసేవారు. అమ్మ గృహిణి. చాలా పెద్ద కుటుంబం. అన్నయ్య, ఇద్దరు చెల్లెళ్లు. నాన్నకొచ్చే జీతం చాలా తక్కువ. ఇంటి అవసరాలకే చాలా ఖర్చయ్యేది. ఇక నాన్న జీతంతో మేం పైచదువులు చదువుకోవడం చాలా కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో అమ్మ చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది. చదువుకుంటేనే మన కష్టాలు తీరుతాయని, ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడే వరకు చదువుకోవాలని చెప్పేది. అలా మా నలుగురినీ చదివించింది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ నాన్న మా చదువు విషయంలో మాత్రం శ్రద్ధ చూపారు. నిజానికి నేను డిప్లొమాలో చేరేందుకు కావాల్సిన రూ.1,000 ఫీజు కూడాచెల్లించలేని పరిస్థితి. అప్పు చేసి కాలేజీలో చేరాల్సివచ్చింది. అప్పుడు అమ్మ అండగా నిలబడక.. ఇక చాల్లే చదువులని ఆపేస్తే ఇప్పుడు ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు. ఈ పని సవాలే... ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు సికింద్రాబాద్ స్టేషన్లో రైళ్ల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కొన్నింటిని శుభ్రం చేసేందుకు యార్డ్‌కు తరలించి, తిరిగి ప్లాట్‌ఫామ్‌కి తీసుకురావాలి. ప్లాట్‌ఫామ్‌లు ఖాళీగా లేని సమయం లో కొన్ని రైళ్లను వికారాబాద్, చర్లపల్లి తదిత ర దూరప్రాంతాలకు తరలించి హాల్ట్ చేయా ల్సి ఉంటుంది. ఈ క్రమంలో రైళ్లు నడుపుకుంటూ వెళ్లేటప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాలు జరగొచ్చు. బోగీలు అటాచ్, డిటాచ్ చేయడంలో ఎంతో సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. విధి నిర్వహణ ఎంతో సవాల్‌గానే ఉంటుంది. ఆ సవాళ్లను స్వీకరించి పూర్తి చేయడంలో ఎంతో సంతృప్తి కూడా ఉంటుంది. అమ్మానాన్నల స్ఫూర్తి.. అడుగడుగునా అమ్మ నన్ను ప్రోత్సహించింది. ‘నువ్వు రైలు నడపగలవు. ఆ ధైర్యం, పట్టుదల నీలో ఉన్నాయి. మగవాళ్లతో సమానంగా నిలబడగలవంటూ’ వెన్నుతట్టి ప్రోత్సహించింది. అమ్మాయిలు కూడా ఆర్థికంగా నిలబడాలని నాన్న ఎప్పుడూ చెప్పేవారు. ఆ స్ఫూర్తే నన్ను ఇంతదూరం తీసుకొచ్చాయి. మా ఇంటి ముందు నుంచే కోల్‌కతా వేళ్లే రైళ్లు నడిచేవి. పైగా చుటుపక్కలంతా రైల్వే కుటుంబాలు. దీంతో సహజంగానే రైల్వే ప్రభావం నాపై పడింది. చిన్నప్పటి నుంచి రైలు నడపాలనే కోరిక కూడా అందుకు ఊపిరి పోసింది. ఈ విషయం అమ్మానాన్నలకు చెబితే వాళ్లూ సరేనన్నారు. అలా డిప్లొమా పూర్తిచేసి 2006లో అసిస్టెంట్ లోకోపైలట్‌గా చేరాను. అప్పటి నుంచి సికింద్రాబాద్‌లోనే పని చేస్తున్నాను. -
నానిగాడి ప్రేమకథ
దుర్గాప్రసాద్ కథానాయకుడిగా నటిస్తూ మెట్రో ఫిలింస్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘నానిగాడు’. సీపీరెడ్డి దర్శకుడు. సరిత కథానాయిక. యస్. లక్ష్మి, చింతా చాతుర్య సహ నిర్మాతలు. ‘‘లవ్, కామెడీ, యూత్‌ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. అంతా కొత్తవారే నటించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి చింతా శివకుమార్ రెడ్డి, చింతా మహేశ్‌రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరించారు. -
విషజ్వరంతో చిన్నారి మృతి
చౌటపల్లిలో మూడుకు చేరిన మృతుల సంఖ్య పర్వతగిరి : మండలంలోని చౌటపల్లి లో ఉన్న హట్యాతండాకు చెందిన అజ్మీర సరిత(9) సోమవారం అర్ధరాత్రి విష జ్వరంతో కన్నుమూసింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. అజ్మీర బీచ్చ్య, రంగమ్మ దంపతులకు వివాహం జరిగిన 15 సంవత్సరాల తర్వాత సరిత జన్మించింది. అజ్మీర సరిత తీగరాజుపల్లి ఆదర్శ పాఠశాలలో రెండోతరగతి చదువుతోంది. గత శుక్రవారం ఆమెకు జ్వరం వచ్చినట్లు తల్లిదండ్రులు గుర్తించారు. మరుసటి రోజు శనివారం వరంగల్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఆ డాక్టర్ రాసిన మం దులను వాడుతున్న క్రమంలో జ్వరం మరింత పెరిగింది. దీంతో స్థానిక ఆర్ఎంపీ సూచన మేరకు వరంగల్‌లోనే ఉన్న మరో ఆస్పత్రిలో సోమవారం మధ్యాహ్నం చేర్పిం చారు. రక్త, మూత్ర పరీక్షలు ఇతరాలకు రూ.6వేల బిల్లు చెల్లించారు. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలకు సరిత పరిస్థితి బాగా లేదని మరో ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లాలని అప్పటిదాకా చికిత్స అందించిన ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. దీంతో చిన్నారిని వారు ఆటోలో మరో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతిచెందింది. పాప చనిపోయిన అనంతరం ఆస్పత్రి సిబ్బంది తమ వద్ద నుంచి బిల్లులు లాక్కున్నట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా, మండలంలోని చౌటపల్లి గ్రామంలో విషజ్వరంతో మృతిచెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. -
కూతురి ప్రేమాయణం.. పరువు హత్య!
పావగడ (కర్ణాటక): కూతురు ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం నడుపుతుండటాన్ని అవమానంగా భావించిన ఓ తండ్రి ఆమెను హతమార్చాడు. పావగడ తాలూకా కిలార్లహళ్లి సమీపంలో ఎనిమిది నెలల క్రితం జరిగిన ఈ సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. పావగడ సీఐ ఆనంద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా మడకశిర మండలం తిరుమలదేవరపల్లి (టీడీపల్లి) తండాకు చెందిన శంకరనాయక, గౌరమ్మ కుమార్తె సరిత(18) అదే గ్రామానికి చెందిన వరుసకు మామ అయిన ఆనందనాయక అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న శంకరనాయక కుమార్తెను మందలించాడు. కొన్నాళ్ల పాటు కూతుర్ని బంధువుల ఇళ్లలో ఉంచాడు. అయినా ఆమె మనసు మారలేదు. దీంతో కుమార్తెను చంపాలని నిర్ణయించుకున్నాడు. పథకంలో భాగంగా పావగడ తాలూకాలోని తన అత్త ఊరు కిలార్లహళ్లికి తీసుకెళుతున్నానని చెప్పి గతేడాది సెప్టెంబర్ 22న కుమార్తెతోపాటు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. కిలార్లహళ్లి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి రాగానే గొంతుకు చున్నీ బిగించి, తలపై బండ రాయితో మోది ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గుర్తు తెలియని యువతి హత్యకు గురైనట్లు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఓ వ్యక్తి అందించిన సమాచారంతో హత్యకు గురైంది సరిత అని, చంపింది తండ్రేనని నిర్ధారణకు వచ్చారు. నిందితుణ్ని బుధవారం అరెస్ట్ చేసి మధుగిరి కోర్టులో హాజరుపరిచారు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. లక్సెట్టిపేట మండలం చందారం గ్రామానికి చెందిన ఆకుల సరిత కుటుంబంలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన ఆమె గురువారం సాయంత్రం కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో మృతిచెందింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు. -
ఇంట్లో వాళ్లకు మత్తు మందిచ్చి...ఉడాయించింది
లక్నో: కుటుంబ సభ్యులకు మత్తుమందు ఇచ్చి భారీగా నగలు, నగదుతో పాటు తుపాకీతో ఓ మహిళ పరారైన వైనం ఉత్తర ప్రదేశ్ లోని ఫిరోజాబాద్‌లో కలకలం రేపింది. ఫిరోజాబాద్ కు చెందిన సరిత సుమారు రూ.20 లక్షల నగదు, విలువైన బంగారు ఆభరణాలతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. గత రాత్రి కుటుంబ సభ్యులకు మత్తు మందు కలిపి ఇచ్చిన ఆమె వారు మత్తులోకి జారుకోగానే, ఇంట్లో ఉన్న లైసెన్స్డ్ తుపాకీతో సహా ఉడాయించింది. తెల్లారి తేరుకున్న కుటుంబ సభ్యులు ...సరిత కనిపించకపోవడంతో పాటు ఇంట్లో విలువైన వస్తువులు మాయం కావడంతో స్థానిక కొత్వాల్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై విచారణ నిమిత్తం ఒక కమిటీని నియమించినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. యువతి పారిపోవడానికి గల కారణాలను ఆరా తీస్తున్నామని, ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదన్నారు. -
యువతి ఆత్మహత్య
డిండి(నల్లగొండ): పురుగుల మందు తాగి ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా దిండి మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా మాడ్గులకు చెందిన సరిత(20), ఈ రోజు డిండిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అయితే ఈ క్రమంలో ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. -
హస్తినలో తొలి మహిళా డ్రైవర్.. తెలంగాణ బిడ్డ
న్యూఢిల్లీ: మేము సైతం అంటూ మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారనడానికి తాజా ఉదాహరణ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ)కి తొలి మహిళా డ్రైవర్ ఎంపిక. దేశ రాజధాని నగరానికి తొలి మహిళా డ్రైవర్‌ను అందించిన ఘనత తెలంగాణ దక్కించుకుంది. రాష్ట్రానికి చెందిన 30 ఏళ్ల వి. సరిత ఆ అవకాశాన్ని కొట్టేశారు. ఉత్సాహవంతులైన మహిళా డ్రైవర్లు కావాలన్న ప్రభుత్వ పత్రికా ప్రకటనకు ఏడుగురు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఒక్క సరిత మాత్రమే మెడకల్గా ఫిట్‌గా ఉన్నారని డీటీసీ మెడికల్ బోర్డు పరీక్షల్లో తేలింది. దీంతో 28 రోజుల శిక్షణ తరువాత, తొలి మహిళా డ్రైవర్‌గా సరోజినినగర్ డిపో లో ఆమె నియమితులయ్యారు. సో...తెలంగాణ ఆడబిడ్డ ఇకనుంచి ఢిల్లీ రోడ్లమీద డీటీసీ బస్సును పరుగులు పెట్టించనున్నారనన్నమాట. నల్గొండ జిల్లాకు చెందిన పేదరైతు కుటుంబంలో పుట్టిన సరితను మగపిల్లలు లేకపోవడంతో తండ్రి ఆమెను అబ్బాయి లాగా పెంచారట.....తన హెయిర్ స్టయిల్, తన డ్రెస్సింగ్ స్టయిల్ అంతా నాన్న ఛాయిస్సే అంటున్న సరిత మహిళలు సాధించలేనిది ఏదీ లేదని చెప్పాలన్నదే తన ఉద్దేశ్యమని చాలా ఆత్మ విశ్వాసంతో చెబుతున్నారు. ఇక్కడ బస్సు నడపటం కత్తిమీద సామే అయినప్పటికీ నల్లొండలో ఆటోను, హైదరాబాద్‌లో కాలేజీ మినీ బస్సు నడిపిన అనుభవం బాగా ఉపయోగపడుతోందంటున్నారు. డ్రైవింగ్‌లో సరితకు శిక్షణ ఇచ్చిన పర్వేష్ శర్మ అయితే ఆమె డ్రైవింగ్ స్కిల్స్ చూసి ముచ్చటపడుతున్నారు. భవిష్యత్తుల్లో చాలా మంచి డ్రైవర్ అవుతుందంటూ కితాబులిచ్చారు. మొదట్లో మహిళలకు ట్రైనింగ్ అంటే కొంచెం భయపడ్డా...ఢిల్లీలాంటి నగరాల్లో డ్రైవింగ్ వారి వల్ల కానే కాదు అనుకున్నా...కానీ సరిత చాలా తొందరగా నేర్చుకున్నారంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. తమ నిర్ణయం మరింతమంది మహిళలను డ్రైవింగ్ వృత్తిలోకి రావడానికి ఉత్సాహపరుస్తుందని భావిస్తున్నామని ఢిల్లీ ప్రభుత్వం అంటోంది. కొత్త రంగాల్లో మహిళలను ఎంకరేజ్ చేయడంలో తమ ప్రభుత్వం ముందుంటుందనీ, ఇది ప్రారంభం మాత్రమేనని ఢిల్లీ రవాణామంత్రి గోపాల్ రాయ్ అన్నారు.