డిండి(నల్లగొండ): పురుగుల మందు తాగి ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా దిండి మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా మాడ్గులకు చెందిన సరిత(20), ఈ రోజు డిండిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అయితే ఈ క్రమంలో ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.