
మెట్‌పల్లి(కోరుట్ల): అత్తింటి వేధింపులకు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై సదాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మెట్‌పల్లి సాయిరాంకాలనీకి చెందిన రమ్య(20)కు అదే కాలనీకి చెందిన దొమ్మాటి నరేందర్‌తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. మొదట్లో బాగానే ఉన్నా తర్వాత నరేందర్, అతని తల్లి జమునలు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించారు.
దీంతో జీవితంపై విరక్తి చెంది, గత నెల 31న ఇంట్లో ఎలుకల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గురువారం నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
చదవండి: వ్యాన్ డ్రైవర్‌తో జూనియర్ లెక్చరర్ ప్రేమ పెళ్లి, చివరకు..
Comments
Please login to add a commentAdd a comment