jagtiala
-
అన్నదాతకు అండగా.. ‘సాక్షి’ అక్షర సమరం
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ ముసాయిదా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సాగించిన ఉద్యమానికి ‘సాక్షి’ అండగా నిలిచింది. భూమిని నమ్ముకుని జీవిస్తున్న అన్నదాతలకు నిత్యం అండగా ఉంటూ ‘కథనోత్సాహం’తో అక్షర పోరు సాగించింది. ‘చిక్కుముడుల మాస్టర్ ప్లాన్’ అంటూ డిసెంబర్ 2న ప్రచురితమైన కథనంతో ముసాయిదాలోని లొసుగులు వెలుగులోకి వచ్చాయి. మాస్టర్ ప్లాన్‌లో ఏముందో అంటూ ముసాయిదాలో పేర్కొన్న చాలా అంశాలను ప్రముఖంగా ప్రచురించడంతో బాధి త రైతులు జాగృతమయ్యారు. సుమారు యాభై రోజులు అలుపెరుగని పోరు సలిపారు. మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలకు ప్రాధాన్యతనిస్తూ, రైతుల ఆవేదనకు ‘సాక్షి’గా నిలిచింది. ఉద్యమంలో పాల్గొన్న అన్నివర్గాలు, పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అందరి మనన్నలు అందుకుంది. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. భూమికోసం సాగించిన సమరంలో తమకు దన్నుగా నిలిచిన ‘సాక్షి’కి రైతన్నలు కృతజ్ఞతలు తెలిపారు. -
సినిమాను తలపించేలా ఫొటోషూట్స్
కరీంనగర్ (జగిత్యాలటౌన్) : గతంలో పెళ్లి, ప్రత్యేక సందర్భాలకే పరిమితమైన ఫొటోలు.. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా పోస్ట్ వెడ్డింగ్, ప్రివెడ్డింగ్, ఫొటోషూట్స్, హల్దీ, మెహందీతో పాటు సినిమా సాంగ్స్‌కు అనుగుణంగా అపురూపమైన ఫొటోలను కరిజ్మా, క్యాన్వెరా అల్బమ్లతో ముస్తాబు చేసి అందిస్తున్న ఫొటోలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్‌ను తమ ఉపాధిగా మల్చుకుంటున్నారు యువత. లెన్స్ కెమెరాలతో పాటు డ్రోన్, క్రేన్ కెమెరాలతో ఓవైపు షూట్ చేస్తూనే మరోవైపు జరుగుతున్న షూటింగ్‌ను లైవ్ ద్వారా వీక్షించేలా ఫంక్షన్ హాల్ నలువైపులా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రీవెడ్డింగ్ సాంగ్స్‌తో పెళ్లిల్లకు కొత్త అందాలు అద్దుతూ ఔరా అనిపిస్తున్నారు. షూట్ చేసిన ఫొటోలను ఆకర్షణీయమైన ఆల్బమ్స్ తయారు చేస్తూ పెళ్లిళ్లు, శుభకార్యాలు, సంబరాలను చిరకాలం గుర్తుండే మధుర స్మృతిగా మలుస్తున్నారు. యువతకు ఉపాధి.. ఫొటోగ్రఫీలో వస్తున్న కొత్త ట్రెండును పట్టణ జిల్లా ప్రజలు ఆహ్వానిస్తుండటంతో ఫొటోగ్రఫీని స్థానిక యువత ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. ప్రివెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, హల్దీ, మెహందీ, సంగీత్ లాంటి ఫొటో షూట్లతో కలిపి సినిమా ఫొటోగ్రఫీ, వీడియో క్యాన్వెరా, ఎల్ఈడీ స్క్రీన్స్, క్యాండెట్ ఫొటోగ్రఫీ అల్బమ్‌తో సహా కస్టమర్ రిక్వైర్మెంట్ను బట్టి రూ.20వేల నుంచి రూ.2లక్షల వరకు చార్జ్ చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలో దాదాపు 240మంది ఫొటోగ్రాఫర్లు ఉండగా 40 నుంచి 50కి పైగా ఫొటో స్టూడియోలు, మిక్సింగ్ సెంటర్లు, అల్ఫా డిజైనర్స్ ఈ రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఔట్‌డోర్ ఫొటో షూట్.. పెళ్లికి ముందు జరిపే ప్రివెడ్డింగ్ షూట్ల ను ఔట్డోర్లలో అత్యాధునిక లెన్స్ కెమెరాలు, డ్రోన్, క్రేన్ కెమెరాలను వినియోగిస్తూ సినిమా షూటింగ్‌ను తలపించేలా షూట్ చేయడం ట్రెండ్‌గా మారింది. ఔట్‌డోర్ ఫొటోషూట్లకు నగర శివారు ప్రాంతాలతో పాటు హైదరా బాద్, నిజామాబాద్(డిచ్పల్లి), సిద్దిపేట లాంటి దూర ప్రాంతాలకు వెళ్లి ఫొటోషూట్ చేస్తున్నా రు. ఈ షూటింగ్‌ను చూస్తున్న చాలామంది సినిమా షూటింగ్ అని భ్రమపడుతున్నారు. ఉపాధి కల్పిస్తున్నాను టీనేజ్‌లో ఫొటోగ్రఫీ నా హాబీగా ఉండేది. సొంత ఫొటోలను మాత్రమే తీసుకునే నేను ప్రస్తుతం ఫొటోగ్రఫీని ఉపాధిగా మార్చుకుని వెడ్డింగ్ షూటింగ్, వీడియో మిక్సింగ్, ఆల్బమ్ మేకింగ్ చేస్తూ నాతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నాను. – శ్రీనివాస్, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ ఆల్బమ్ మేకింగ్ చేసిస్తాం జిల్లా కేంద్రంలో ఎడిట్ పాయింట్ నిర్వహిస్తున్నాను. కొత్త జంటల తొలి కలయికలకు సంబంధించిన మధురమైన స్మృతులను పదికాలాల పాటు దాచుకునేలా షూటింగ్, ఎడిటింగ్‌తో పాటు, ఆల్బమ్ మేకింగ్ కూడా చేసిస్తాం. ఒక్కో వెడ్డింగ్‌కు అన్ని ఫార్మాలిటీస్ కలుపుకుని రూ.20వేల నుంచి రూ.2లక్షల వరకు చార్జ్ చేస్తాం. – గంటె మహేశ్, ఎడిట్ పాయింట్ -
ఫెయిల్ అవుతాననే భయంతో..
జగిత్యాలక్రైం: వార్షిక పరీక్షలు సరిగా రాయలేదని, దీంతో ఫెయిల్ అవుతాననే భయంతో ఇంటర్ విద్యార్థి ద్యాగల సంజయ్‌కుమార్(19) శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని లింగంపేటలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. లింగంపేటకు చెందిన సంజయ్‌కుమార్ పట్టణంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్(సీఈసీ) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 6 నుంచి 19వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు హాజరయ్యాడు. అయితే, పరీక్షలు సరిగా రాయలేదని కొద్దిరోజులుగా మానసికంగా కుంగిపోతున్నాడు. ఇంట్లో ఎవరితోనూ మాట్లాడటంలేదు. పరీక్షల్లో ఫెయిలైనా ఏమీకాదని కుటుంబసభ్యులు ధైర్యం చెప్పినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి భోజనం చేశాక తన గదిలోకి వెళ్లాడు. శనివారం ఉదయం వరకూ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు..గది వెనకాల ఉన్న కిటికీలోంచి చూడగా.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి లక్ష్మీరాజం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కిశోర్ తెలిపారు. -
కొడుకులకు భారం కాకూడదని..
జగిత్యాలక్రైం: ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు.. వయోభారం మరోవైపు ఆ వృద్ధ దంపతులను మనస్తాపానికి గురిచేశాయి. పిల్లలకు తాము భారం కాకూడదనే ఉద్దేశంతో సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. జగిత్యాల రూరల్ మండలం రఘురాములకోటకు చెందిన సింహరాజు మునీందర్ (70), సులోచన (65) దంపతులు. వీరి కుమారులు గోవర్ధన్, సంతోష్. వీరు తమ కుటుంబాలతో వేరుగా ఉంటున్నారు. పెద్దకుమారుడు గోవర్ధన్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా, రెండో కుమారుడు సంతోష్ బట్టల దుకాణంలో పనిచేస్తున్నారు. వీరి ఆదాయం అంతంతమాత్రమే. తండ్రి మునీందర్ పనిచేస్తున్న కట్టె కోత మిల్లును కొంతకాలం కిందట యజమాని అమ్మేయడంతో ఆయన ఉపాధి కోల్పోయారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పట్నుంచి తమ కొడుకులకు భారం కాకూడదని మునీందర్ దంపతులు బాధపడుతుండే వారని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత వృద్ధ దంపతులు గదిలో పడుకున్నారు. సోమవారం ఉదయం గోవర్ధన్.. తల్లిదండ్రులుండే ఇంటి వద్దకు వెళ్లగా ఇద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. పరిశీలించగా పురుగులమందు తాగిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ ఎస్సై అనిల్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. నిరుపేద కుటుంబం కావడంతో గ్రామస్తులు చందాలు పోగుచేసుకుని అంత్యక్రియలు పూర్తిచేశారు. -
కొండగట్టు అంజన్న చినజయంతికి పోటెత్తిన భక్తజనం
సాక్షి,కొండగట్టు (చొప్పదండి): జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధానంకు లక్షలాది మంది భక్తులు, దీక్షాపరులు తరలిరావడంతో కాషాయమయమైంది. హనుమాన్ చినజయంతి సందర్భంగా తెలంగాణతోపాటు ఆంధ్ర, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు, దీక్షాపరులు తరలివచ్చారు. కొందరు పాదయాత్ర ద్వారా కొండగట్టుకు చేరుకున్నారు. మరికొందరు సొంత వాహ నాలు, ఆర్టీసీ బస్సుల్లో తరలివచ్చారు. తొలుత కోనేటిలో స్నానాలు ఆచరించారు. తలనీలాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశాక మాల విరమణ చేశారు. వీరికోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
‘నాన్న.. దుబాయ్ నుంచి రాంగ సెల్‌ఫోన్ తీసుకురా అన్నావే’
సాక్షి,ధర్మపురి: ‘నాన్న.. దుబాయ్ నుంచి రాంగ సెల్‌ఫోన్, టీవీ తీసుకురా.. ఇక్కడ చెల్లె నేను మంచిగ చదువుకుంటున్నం అంటూ రోజూ ఫోన్లో మాట్లాడినవు.. నీ మాటలు దూరమయ్యాయి. బిడ్డా నువ్వు వెళ్లిపోయావా.. దుబాయ్ నుంచి నీ కోసం అచ్చిన లే బిడ్డా’.. అంటూ తండ్రి కిషన్.. ‘మరో మూడు నెలల్లో రావాలని అనుకుంటే నాన్నను ఇప్పుడే నీ దగ్గర కు రప్పించుకున్నావా కోడుకా’.. అంటూ తల్లి పుష్పలత రోదించిన తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. మండలంలోని తుమ్మెనాల చెరువులో ఆదివారం ఈత కోసం వెళ్లి ముగ్గరు చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకున్న విసయం తెలిసిందే. చివరిచూపు కోసం.. చెరువులో ఆదివారం మృతిచెందిన మారంపెల్లి శరత్, పబ్బతి నవదీప్‌ల మృతదేహాలను తుమ్మెనాలలో బాడీ ప్రీజర్లలో భద్రపరిచారు. సోమవారం మధ్యాహ్నం మృతుడు శరత్ మృతదేహానికి తండ్రి సతీశ్ దహన సంస్కారాలు నిర్వహించాడు. ఈక్రమంలో మంగళవారం నవదీప్‌కు తుమ్మెనాల గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. దుబాయ్ నుంచి తండ్రి కిషన్ కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించాడు. తల్లిదండ్రులకు తలకొరివి పెట్టాల్సిన కొడుకుకే తండ్రి తలకొరివి పెట్టడం అందరినీ కంటతడి పెట్టించింది. చదవండి: Bholakpur Corporator: పోలీసులకు వార్నింగ్.. కేటీఆర్ సీరియస్.. ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్ -
కౌన్సిలర్ కుమారుడి వీరంగం.. గ్యారేజీ యజమానితో గొడవపడి..
సాక్షి,జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని తులసీనగర్ ప్రాంతానికి చెందిన కౌన్సిలర్ కుమారుడు సోమవారం సాయంత్రం వీరంగం సృష్టించాడు. తులసీనగర్ ప్రాంతంలో ప్రశాంత్ అనే వ్యక్తి కార్ల రిపేరు సెంటర్ నిర్వహిస్తున్నాడు. రిపేరు కోసం వచ్చిన 11 కార్లను అక్కడ పార్కింగ్ చేసి ఉంచాడు. అయితే, అదే ప్రాంతానికి చెందిన అరుముల్ల నర్సమ్మ (25వ వార్డు కౌన్సిలర్) కుమారుడు అరుముల్ల పవన్.. సోమవారం గ్యారేజీ యజమాని ప్రశాంత్‌తో గొడవ పడ్డాడు. తర్వాత ఆగ్రహంతో అక్కడే ఉన్న 11 కార్ల అద్దాలను ధ్వంసం చేశాడు. బాధితులు పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా.. పవన్ అక్కడకు కూడా వెళ్లి ఫిర్యాదుదారులను భయాందోళనకు గురిచేశాడు. గ్యారేజీ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కిశోర్ తెలిపారు. కౌన్సిలర్ కుమారుడి తీరు కలకలం రేపింది. మరో ఘటనలో.. వ్యక్తి అదృశ్యం జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట గ్రామానికి చెందిన గాదం స్వామి (41) అదృశ్యమైనట్లు రూరల్ ఎస్సై అనిల్ తెలిపారు. స్వామి గతనెల 27న ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. స్వామి భార్య విజయ సోమవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. చదవండి: ‘కొడుకా.. ఎంత పని జేత్తివి బిడ్డా.. ’ -
‘కొడుకా.. ఎంత పని జేత్తివి బిడ్డా.. ’
సాక్షి,ధర్మపురి(కరీంనగర్): ‘కొడుకా.. ఒక్కగానొక్కడివి.. అల్లారు ముద్దుగా పెంచితిమి.. మంచి సదువులు సదివి ముసలోల్లమయ్యాక మమ్మల్ని సాకుతవని ఆశపడ్తిమి.. నీ మీద ఎన్నో కలలు కంటిమి.. మధ్యల నువ్ గిట్ల జేత్తివి బిడ్డా.. ఇక మేం ఎవరి కోసం బతుకుడు బిడ్డా’ అంటూ మారంపెల్లి శరత్ తండ్రి మారంపెల్లి సతీశ్ రోదించిన తీరు కంటతడి పెట్టించింది. తుమ్మెనాలకు చెందిన మారంపెల్లి శరత్(12,) పవ్బం నవదీప్(12), యాదాద్రి భువనగిరి జిల్లా దాసారం గ్రామానికి చెందిన గొలుసుల యశ్వంత్(13) ఆదివారం ఈతకోసమని పాఠశాల సమీపంలోని చెరువులోకి వెళ్లి నీట మునిగి చనిపోయిన విషయం విదితమే. కన్నకొడుకు చనిపోయాడనే సమాచరం అందుకున్న సతీశ్.. బెహరాన్ నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. స్వగ్రామంలో ఉపాధి లేక, కొడుకు, భార్యను సాకేందుకని సురేశ్ 4నెలల క్రితమే బెహరాన్ వెళ్లాడు. అతడి భార్య రజిత గ్రామంలో కూలీ పనులు చేస్తూ కొడుకును అల్లారు ముద్దుగా చూసుకుంటోంది. మరో ఇద్దరు మిత్రులతో కలిసి ఈత కోసం చెరువులోకి వెళ్లి కొడుకు మృతి చెందడంతో ఆమె కలలు కల్లలయ్యాయి. బెహరాన్ నుంచి వచ్చిన సురేశ్.. ప్రీజర్‌లో ఉంచిన కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యాడు. కుమారుడి చితికి నిప్పంటించి అంత్యక్రియలు పూర్తిచేశాడు. ఉపాధ్యాయుల సంతాపం ముగ్గురు విద్యార్థుల మృతికి ప్రధానోపాధ్యాయుడు గాదె శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాఠశాలలో రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు. విషాదంలో నవదీప్ కుటుంబం.. కిషన్ – పుష్పలత దంపతులకు కుమారుడు పబ్బతి నవదీప్, ఓ కూతురు ఉంది. కిషన్ ఉ పాధి కోసం విదేశాలకు వెళ్లాడు. అతడు మంగళవారం స్వగ్రామానికి వచ్చే అవకాశం ఉంది. నవదీప్ మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచా రు. తండ్రి వచ్చాక అంత్యక్రియలు పూర్తిచేస్తారు. మృతి చెందిన మరో విద్యార్థి గొలు సుల యశ్వంత్ మృతదేహాన్ని స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లాకు తీసుకెళ్లారు. చదవండి: దొంగతనం కేసు.. సెల్ఫీ వీడియో తీసి.. -
పూత నిలవలె..పిందె ఎదగలె
జగిత్యాల అగ్రికల్చర్/ కొల్లాపూర్: ఫలరాజుగా పేరుగాంచిన మామిడి గత రెండేళ్లు ఆశించిన స్థాయిలో దిగుబడులు ఇచ్చింది. కానీ కరోనా నేపథ్యంలో గిట్టుబాటు ధర రాలేదు. ఈ ఏడాది గిట్టుబాటు ధర లభిస్తున్నా.. దిగుబడులు లేకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. అధిక వర్షాలతో పూత ఆలస్యం కావడం, అవే వర్షాలు పురుగులు, తెగుళ్లు ఆశించడానికి దోహదపడటంతో..పూత నిలవక, పిందె ఎదగక రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే ఎకరానికి 3.5 టన్నుల చొప్పున రావాల్సిన దిగుబడి.. ప్రస్తుతం 1 నుంచి 1.5 టన్నుకు తగ్గిపోయే అవకాశముందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో మామిడి పండ్లకు ప్రసిద్ధి చెందిన ఉమ్మడి పాలమూరు జిల్లా కొల్లాపూర్‌లో సైతం దిగుబడి 60 శాతం తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 3.17 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు తెలంగాణ రాష్ట్రంలో 3.17 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. జగిత్యాల, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సిద్దిపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే నేలల రకాన్ని బట్టి ఎకరానికి 3.5 టన్నుల చొప్పున 11.10 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ అధికారుల తొలుత అంచనా వేశారు. ఎర్రనేలల్లో ఎకరాకు 4 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని భావించారు. అధిక వర్షాలతో తేమ ఆరక.. అయితే మామిడి దిగుబడిపై ఈ ఏడాది అధిక వర్షాలు ప్రభావం చూపాయి. సాధారణంగా జూన్, జూలైలోనే వర్షాలు ప్రారంభమై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు కురుస్తాయి. కానీ గత ఏడాది నవంబర్ చివరివరకూ అధిక వర్షాలు కురిశాయి. దీంతో నేలల్లో తేమ శాతం పెరిగింది. తేమ ఆరక, చెట్టుకు పూత రాకుండా కొమ్మలు చిగురించాయి. సాధారణంగా డిసెంబర్, జనవరిలో రావాల్సిన పూత ఆలస్యమైంది. తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి..ఇలా నాలుగు దఫాలుగా పూత కాసింది. దీంతో కొన్నిచోట్ల పూత ఉంటే, కొన్నిచోట్ల పిందెలు వచ్చాయి. కొన్నిచోట్ల కాయ దశకు చేరుకున్నాయి. రసం పీల్చిన పురుగులు అధిక వర్షాలతో దున్నడం, ఎండిన కొమ్మలను తొలగించడం వంటి పనులకు ఆటంకం ఏర్పడింది. దీంతో నల్ల తామర, తేనెమంచు పురుగులు పంట కాలానికి ముందు చెట్టు కాండం, కొమ్మల బెరడులో దాక్కుని పూత, పిందె సమయంలో చెట్టు పైకి వచ్చి నష్టం చేశాయి. పురుగులు గుంపులుగా చేరి పూలు, పిందెల నుంచి రసం పీల్చాయి. దీంతో పూత రాలిపోయింది. నల్ల తామర పురుగులు పిందెల దశలో చర్మాన్ని గోకి రసం పీల్చి నష్టం కలిగించాయి. తగ్గనున్న దిగుబడులు.. పురుగులు, తెగుళ్లకు తోడు పోషకాల లోపంతో ఈ ఏడాది మామిడి దిగుబడి ఎకరాకి టన్ను నుంచి 1.5 టన్నుల వరకు పడిపోయే అవకాశం ఉందని ఉద్యాన అధికారులు అంటున్నారు. రాష్ట్రం మొత్తం మీద 5–6 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కొద్దిరోజులుగా 41– 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉన్న పిందెలు, కాయలు కూడా రాలిపోతున్నాయి. కొల్లాపూర్ మామిడికీ కరువే ఉమ్మడి జిల్లాలో భారీగా తగ్గిన దిగుబడులు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ మామిడి పండ్లకు బాగా ప్రసిద్ధి. అందులోనూ బేనీషాన్ రకం పండ్లకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ పండించే మామిడి పండ్లను దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు విదేశాలకు సైతం ఎగుమతి చేస్తారు. ఇంతటి ప్రఖ్యాతి గాంచిన కొల్లాపూర్ మామిడి పండ్లకు ఈసారి కరువొచ్చే పరిస్థితి ఏర్పడింది. తెగుళ్లు, వాతావరణ పరిస్థితుల కారణంగా పంట దిగుబడి భారీగా తగ్గిపోయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 60 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. వీటిలో కొల్లాపూర్ నియోజకవర్గంలోనే అత్యధికంగా 37,670 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. చిన్నరసాలు, పెద్దరసాలు, దెసేరీ, నీలిషాన్ తదితరాలతో పాటు ప్రధానంగా బేనీషాన్ రకం మామిడిని రైతులు పండిస్తుంటారు. అయితే ఈసారి 60 శాతం తోటల్లో జనవరి చివర్లో, ఫిబ్రవరి మొదటి వారంలో పూత వచ్చింది. ఇదే సమయంలో వర్షాలు పడడంతో పూతను దెబ్బతీసింది. దీనికితోడు గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్చి పంటకు సోకే నల్ల తామర పురుగు మామిడి పంటకు సోకి దిగుబడిపై ప్రభావం చూపింది. ఉద్యాన శాఖ అధికారుల అంచనాల ప్రకారం కేవలం 40 శాతం తోటల్లోనే మామిడి కాపు కాసింది. టన్ను ధర లక్ష పైచిలుకే.. పంట దిగుబడి బాగా తగ్గడంతో ఈసారి మామిడి కొనుగోళ్లకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. హైదరాబాద్, ముంబై వ్యాపారులు నేరుగా తోటల వద్దకే వచ్చి మామిడి కాయలు కొనుగోలు చేస్తున్నారు. కేజీ రూ.100 నుంచి రూ.120 దాకా చెల్లిస్తున్నారు. అంటే దాదాపుగా టన్ను ధర రూ.లక్ష పైచిలుకు పలుకుతోంది. పెట్టుబడి కూడా వచ్చేట్టు లేదు నాకు ఐదు ఎకరాల మామిడి తోట ఉంది. ఎకరాకి రూ.50 వేల చొప్పున పెట్టుబడి పెట్టిన. రెండు, మూడుసార్లు రసాయన మందులు చల్లినా పూత నిలువలేదు. పిందె ఎదగలేదు. కాయలను చూస్తే.. పెట్టుబడి కూడా వచ్చేట్టు కనిపించడం లేదు. – పడిగెల రవీందర్‌రెడ్డి, రాయికల్, జగిత్యాల జిల్లా తేనె మంచుతో రాలిన పూత సాధారణంగా నవంబర్ నెలాఖరులో, డిసెంబర్లో మామిడిపూత ప్రారంభం కావాలి. కానీ ఆలస్యంగా ప్రారంభమైన పూత ఈ ఏడాది మార్చి వరకు వస్తూనే ఉంది. ఆ సమయంలోనే తేనె మంచు ఆశించింది. పూత రాలిపోయింది. – ప్రతాప్‌సింగ్, జిల్లా ఉద్యాన అధికారి, జగిత్యాల ఒక్క కాయ కూడా తెంచలేదు సొంత భూమి 30 ఎకరాలతో పాటు మరో 30 ఎకరాల మామిడి తోట కౌలు కు తీసుకున్నా. రూ.35 లక్షలు ఖర్చు చేశా. తెగుళ్లు, వాతావరణ మార్పులతో ఒక్క తోటలోనూ పూత నిలబడ లేదు. ఇప్పటివరకు ఒక్క కాయ కూడా తెంచలేదు. – పెద్దూరి లక్ష్మయ్య, మామిడి రైతు, కొల్లాపూర్ అధికారులకు నివేదించాం.. మామిడి దిగుబడి ఈసారి 60 శాతం తగ్గింది. సకా లంలో పూత రాకపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడం, నల్ల తామర తెగులు సోక డంతో పంట దిగుబడి తగ్గింది. ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉంది. పంటనష్టం, దిగుబడి వివరాలను అధికారులకు చెప్పాం. – లక్ష్మణ్, ఉద్యానవన అధికారి, కొల్లాపూర్ -
ఏడాదిన్నర క్రితం వివాహం, మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత ఆమెను..
మెట్పల్లి(కోరుట్ల): అత్తింటి వేధింపులకు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై సదాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మెట్పల్లి సాయిరాంకాలనీకి చెందిన రమ్య(20)కు అదే కాలనీకి చెందిన దొమ్మాటి నరేందర్‌తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. మొదట్లో బాగానే ఉన్నా తర్వాత నరేందర్, అతని తల్లి జమునలు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించారు. దీంతో జీవితంపై విరక్తి చెంది, గత నెల 31న ఇంట్లో ఎలుకల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గురువారం నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. చదవండి: వ్యాన్ డ్రైవర్‌తో జూనియర్ లెక్చరర్ ప్రేమ పెళ్లి, చివరకు.. -
పాపం.. ఏం కష్టమొచ్చిందో కొడుకులతో కలిసి మహిళ
సాక్షి, జగిత్యాల: ఉమ్మడి కరీంగనర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ ఇద్దరు కుమారులతో కలిసి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల జిల్ల రాయికల్ మండటం కిష్టంపేటలో ఈ విషాదం చోటు చేసుకుంది. లావణ్య అనే మహిళ ఇద్దరు కుమారులతో కలిసి బావిలోకి దూకింది. ఈ ఘటనలో లావణ్య, ఆమె పెద్ద కుమారుడు మరణించగా.. చిన్న కుమారుడ హర్షవర్థన్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
సాక్షి కథనం: మానవత్వం చాటుకున్న మెజిస్ట్రేట్
సాక్షి, మేడిపెల్లి(వేములవాడ): మేడిపెల్లి మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన చిట్టితల్లి నవనీత దీనస్థితికి చలించిపోయారు కోరుట్ల మెజిస్ట్రేట్ జె.శ్యామ్‌కుమార్. గురువారం చిట్టితల్లి ఇంటికి వచ్చి నోట్‌పుస్తకాలు, పెన్నులు, బ్యాగ్‌లు, పండ్లు, దుస్తులతోపాటు ఆర్థికసాయం అందించి మానవత్వం చాటుకున్నారు. దమ్మన్నపేటకు చెందిన పడకంటి నవనీత తల్లిదండ్రులను కోల్పోయింది. జూన్ 16న సాక్షి దినపత్రికలో ‘చిట్టితల్లికి ఎంతకష్టం’శీర్షికన కథనం ప్రచురితమైంది. ప్రభుత్వ న్యాయవాది కట్కం రాజేంద్రప్రసాద్ కోరుట్ల మెజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లగా చలించిన ఆయన స్వయంగా చిట్టితల్లి దగ్గరకు వచ్చి సాయం అందజేశారు. అదైర్య పడొద్దని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని చదివి ఉన్నతంగా ఎదగాలని సూచించారు. అనాథ పిల్లలకు కోర్టులు కూడా అండగా ఉంటాయని ధైర్యం చెప్పారు. అనంతరం గ్రామానికి వచ్చిన జడ్జిని గ్రామస్తులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ కాచర్ల సురేశ్, హెచ్ఎం రాజు, పంచాయతీ కార్యదర్శి రవిరాజ్, ఉపాధ్యాయులు మురళీకృష్ణ, సత్యనారాయణ, శంకర్, అడ్లగట్ట ప్రకాశ్, బండ్ల గజానందం, బండ్ల నరేశ్ ఉన్నారు. చదవండి: చనిపోయాడనుకున్న వ్యక్తి ప్రత్యక్షమవడంతో.. -
ధరణి పోర్టల్‌లో సమస్యలు.. తహసీల్దార్‌పై డీజిల్ పోసిన మహిళ..
సాక్షి, జగిత్యాలటౌన్: మెదక్ జిల్లా శివ్వంపేట తహసీల్దార్ భానుప్రకాశ్‌పై డీజిల్ పోయడం అమానుషమని ట్రెసా జిల్లా అధ్యక్షుడు ఎండీ.వకీల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ భవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధరణి వెబ్సైట్లో అన్ని ఆప్షన్లు లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ అధికారులపై ఇలాంటి దాడులు సబబు కాదని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణ, నాయబ్ తహసీల్దార్లు పాల్గొన్నారు. చదవండి: ‘కోవాగ్జిన్’ ఒప్పందానికి బ్రేక్ -
‘బీజేపీకి దమ్ముంటే కేసీఆర్‌పై సీబీఐ విచారణ చేయించాలి’
సాక్షి, రాయికల్(జగిత్యాల): తాను పీసీసీ రేసులో ఉన్నప్పటికీ పదవి రాలేదని ఏరోజూ బాధపడలేదని, కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకు న్నా తాను కట్టుబడి ఉంటానని అన్నారు. ఏ రోజు కూడా పదవుల కోసం ఆశపడలేదని తెలి పారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కష్టపడిన వారికి తప్పకుండా గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉందని అభిప్రాయపడ్డారు. అందరితో ఐకమత్యంగా ఉంటూ పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. మిషన్ భగీరథ విషయంలో బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్‌పై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథపై విచారణ జరిపించాలి మిషన్ భగీరథ పథకంలో చోటుచేసుకున్న అక్రమాలపై దమ్ముంటే బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్‌పై సీబీఐ విచారణ చేయించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం పేరిట రూ.50 వేల కోట్లతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా మిషన్ భగీరథ నీరు క్లోరినేషన్ చేసి సరఫరా చేయడం లేదని ఆరోపించారు. ఆ నీటితో బట్టలు ఉతకడం, మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకే వినియోగిస్తున్నారని తెలిపారు. మిషన్ భగీరథకు వెచ్చించిన నిధులతో ప్రతీ గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి స్వ చ్ఛమైన తాగునీరు అందించే వీలుందని అన్నా రు. ఈసందర్భంగా కైరిగూడెంలో మిషన్ భగీ రథనీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు జీవన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన గ్రామానికి చేరుకుని అధికారుల తీరుపై ఆగ్రహంవ్యక్తం చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజిరెడ్డి, నాయకులు రవీందర్రావు, కొయ్యడి మహిపాల్‌రెడ్డి, మ్యాకల రమేశ్, బాపురపు నర్సయ్య, ఎద్దండి దివాకర్‌రె డ్డి,మహేందర్‌గౌడ్,నర్సింహారెడ్డి పాల్గొన్నారు. చదవండి: సీఎం స్టాలిన్‌తో నటుడు అర్జున్ భేటీ -
బల్దియాపై ఏసీబీ దాడులు.. రికార్డులు మాయం..
సాక్షి, జగిత్యాల: ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం.. అధికారుల ధనదాహం.. వెరసి జగిత్యాల మున్సిపాలిటీలో తవ్విన కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. నల్లా బిల్లులు, ఆస్తిపన్నులు, మ్యుటేషన్ల ద్వారా వచ్చిన సొమ్మును బల్దియా ఖజానాకు జమచేయడంలో కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈవిషయంలో బాధితులు కొందరు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఉప్పందించారు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. మున్సిపాలిటీలోని రెవెన్యూ విభాగంలో పలు దఫాలుగా తనిఖీలు చేస్తూనే ఉన్నారు. తాజగా మంగళవారం మరోసారి దాడులు చేయడం కలకలం సృష్టించింది. ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్.. బల్దియాలోని రెవెన్యూ విభాగంలో ఈనెల 13న ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. మ్యుటేషన్ రశీదుల్లో వ్యత్యాసం రావడంతో విచారణ జరిపారు. బాధ్యులైన సీనియర్ అసిస్టెంట్ అనూక్ కుమార్, బిల్‌కలెక్టర్ అనిల్‌ను 17న సస్పెండ్ చేశారు. ఇదే అంశంపై లోతుగా విచారణ జరిపేందుకు మంగళవారం ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో మరోసారి తనిఖీలు చేపట్టారు. రికార్డులు నిశితంగా ప రిశీలించారు. అయితే, కొన్ని కీలకమైన ఫైళ్లు, రికార్టులు సిబ్బంది మాయం చేసినట్లు సమాచారం. తీరు మారని మున్సిపాలిటీ.. మున్సిపాలిటీలో చోటుచేసుకుంటున్న అక్రమాలపై ఈ ఏడాది జనవరి 12న “అక్రమాల పర్వం’ శీర్షికన “సాక్షి’ కథనం ప్రచురించింది. రెవెన్యూ విభాగంలో అక్రమాలను నిగ్గుతేల్చింది. దీంతో ఫిబ్రవరి 9న ఏసీబీ అధికారులు దాడులు చేశారు. టౌన్‌ప్లానింగ్ అధికారితో పాటు అవుట్సోర్సింగ్ సిబ్బంది, లైసెన్స్డ్ ఇంజినీర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం ఓ ప్రభుత్వ వైద్యుడి నుంచి టౌన్‌ప్లానింగ్ అధికారి బాలానందస్వామి, అవుట్సోర్సింగ్ సిబ్బంది రాము, లైసెన్స్డ్ ఇంజినీర్ నాగరాజు కలసి రూ.లక్ష డిమాండ్ చేశారు. రూ.95 వేలకు ఒప్పందం చేసుకున్నారు. దీంతో సదరు వైద్యుడు ఏసీబీని ఆశ్రయించారు. తనిఖీల్లో 12 మందితో కూడిన బృందం ► బల్దియాలో అక్రమాలు భారీగా ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు.. మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేశారు. ► ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో 12 మంది సభ్యులుగల బృందం రెవెన్యూ సెక్షన్లో రికార్డులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ► ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకూ కొనసాగుతూనే ఉంది. అన్నీ అక్రమాలే.. బల్దియాలోని రెవెన్యూ విభాగంలో మ్యుటేషన్ ప్రక్రియ అక్రమాలకు అనుకూలంగా మారింది. 2016లో ఆస్తుల మార్కెట్ వాల్యు ప్రకారం మ్యుటేషన్ కోసం 1.5 శాతం ఫీజు చెల్లించాలి. గత అక్టోబర్‌లో ప్రభుత్వం మ్యుటేషన్ ఫీజు 0.1శాతానికి తగ్గించింది. దీనిని ఆసరాగా చేసుకున్న సిబ్బంది 1990–95 మధ్య మ్యుటేషన్ కోసం వచ్చిన దరఖాస్తు దారుల నుంచి 1.5 శాతం ఫీజు వసూలు చేయాల్సి ఉంది. కానీ ఇక్కడే దందాకు తెరలేపారు. మ్యుటేషన్ ఫీజు 0.1శాతం తగ్గిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ఆధారంగా చేసుకుని 1.5 శాతం ఫీజు తీసుకున్నారు. కానీ, 0.1శాతం ఫీజు తీసుకున్నట్లు ఆన్లైన్లో నమోదు చేశారు. మిగతా సొమ్ము నొక్కేశారు. శ్రీధర్ అనే వ్యక్తి తన ఆస్తి మ్యుటేషన్ కోసం ఇటీవల దరఖాస్తు చేశాడు. ఆస్తి విలువలో 1.5శాతం ఫీజు తీసుకుని 0.1శాతం రశీదు ఇచ్చారు. అనుమానం వచ్చిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రెవెన్యూ సెక్షన్‌పై ప్రత్యేక నజర్ ► రెవెన్యూ సెక్షన్లో 2016 నుంచి మ్యుటేషన్లకు సంబంధించిన రికార్డులను ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ► 2016 వరకు 1.5శాతం ఫీజు వసూలు చేయాల్సి ఉండగా, అధికారులు ఎంత వసూలు చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. ► రశీదులు, ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలన్నింటినీ చెక్ చేస్తున్నారు. ► మధ్యాహ్నం తనిఖీలు ప్రారంభించామని, ఏ సమయం వరకైనా విచారణ చేస్తామని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు. రికార్డులు మాయం! రెవెన్యూ విభాగంలోని మ్యుటేషన్ ఫైళ్లు 2016 సంవత్సరం నుంచి తమకు ఇవ్వాలని ఏసీబీ అధికారులు మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. 2016 నుంచి ఇప్పటిదాకా నమోదు చేసిన ఫైళ్లు లభించడంలేదని తెలుస్తోంది. అప్పట్నుంచి అసలు రికార్డులు రాశారా? లేదా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ మొత్తం ఫైళ్లు లభించకుంటే సిబ్బందిపై తగిన చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రికార్డులు పరిశీలిస్తున్నారు. రెవెన్యూ సెక్షన్లో పనిచేస్తున్న వారే మాయం చేశారా? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. చదవండి: కేసీఆర్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తా -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై, కానిస్టేబుల్..
సాక్షి, వేములవాడ(జగిత్యాల): ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారనే కారణంతో పట్టుకున్న ట్రాక్టర్‌ను విడుదల చేసేందుకు డబ్బు డిమాండ్ చేసిన ఎస్సై దూలం పృథ్వీధర్‌గౌడ్, స్టేషన్ రైటర్ ఉరుమల్ల రమేశ్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆదివారం వలపన్ని పట్టుకున్నారు. మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కోరుట్ల మండలం నాగులపేట గ్రామానికి చెందిన ఆరెల్లి సా యికుమార్ ట్రాక్టర్‌ను ఇటీవలే అదే గ్రామానికి చెందిన ఉప్పరపెల్లి నాగరాజు కొనుగోలు చేశా రు. ఈనెల 18న కథలాపూర్ మండలం తక్కళ్లపెల్లి శివారులోని వాగులోంచి ఇసుక తరలిస్తుండగా పోలీసులు ట్రాక్టర్ పట్టుకుని సీజ్ చేశారు. కేసు నమోదైంది. స్టేషన్ బెయిల్‌తోపాటు ట్రాక్టర్ విడుదలకోసం స్టేషన్ రైటర్ రమేశ్, ఎస్సై పృథ్వీధర్‌గౌడ్ తమకు రూ.15వేలు లంచడం ఇవ్వాలని ట్రాక్టర్ యజమాని నాగరాజును డి మాండ్ చేశారు. అంతడబ్బు ఇవ్వలేనని నాగరా జు వారికి బదులిచ్చారు. చివరకు రూ.10 వేల కు బేరం కుదిరింది. ఈ క్రమంలో శనివారం నా గరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు ఆదివారం మధ్యాహ్నం రూ.10 వేలు స్టేషన్ రైటర్ రమేశ్‌కు కథలాపూర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో నాగరాజు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా రు. ఎస్సై డబ్బు తీసుకోవాలని సూచించడంతో నే తాను తీసుకున్నట్లు రమేశ్ ఏసీబీ అధికారులకు చెప్పారు. దీంతో ఎస్సై పృథ్వీధర్‌గౌడ్, కా నిస్టేబుల్ రమేశ్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుస్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎస్సై పృథ్వీధర్‌గౌడ్ నివాసం ఉండే క్వార్టర్లో తనిఖీలు చేపట్టారు. ఎస్సై, కానిస్టేబుల్‌ను సోమవారం కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ భద్రయ్య, సీఐలు రవీందర్, రాము, సంజీవ్, తిరుపతితోపాటు 30 మంది సిబ్బంది పాల్గొన్నారు. వేధింపులతో విసిగి వేసారి.. ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోందని, అధికారులు అరికట్టడంలేదని పలువురు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో ఈనెల 14న స్పెషల్ బ్రాంచి పోలీసులు కథలాపూర్ శివారులో అక్రమంగా నిల్వచేసిన 200 ట్రాక్టర్ లోడ్ల ఇసుక కుప్పలు గుర్తించారు. వాటిని మండల స్థాయి అధికారులకు అప్పగిస్తే వాటిని సీజ్ చేశారు. ఎస్బీ పోలీసులు గుర్తించేవరకూ ఇసుక అక్రమ నిల్వలను స్థానిక అధికారులు గుర్తించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే, ఆదివారం ఇసుక విషయంలోనే ఎస్సై, కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడటం గమనార్హం. కథలాపూర్ మండలంలో పనిచేస్తున్న ముఖ్య శాఖల అధికారులు ఏళ్లతరబడి ఇక్కడే ఉండటంతో అక్రమ వ్యాపారాలకు ఆజ్యం పోస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే ఇసుక అక్రమ వ్యాపారంలో స్థానిక మండలవాసులతోపాటు కోరుట్ల మండలవాసులు పాలుపంచుకున్నట్లు చర్చించుకుంటున్నారు. నాలుగుసార్లు వేధించారు తక్కళ్లపెల్లి శివారువాగులోంచి ట్రాక్టర్లో ఇసుక తీసుకెళ్తుండగా ఎస్సై, కానిస్టేబుళ్లు నాలుగు సార్లు పట్టుకొని డబ్బు కో సం వేధించారు. అ ప్పట్లో ఎంతోకొంత ఇచ్చి ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్ నుంచి విడిపించుకుని వెళ్లా. ఈనెల 18న మళ్లీ నా ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకొని డబ్బు కోసం వేధించారు. విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించా. వారి సూచనల మేరకు లంచం డబ్బులు ఇచ్చి ఎస్సై, కానిస్టేబుల్‌ను పట్టించా. – ఉప్పరపెల్లి నాగరాజు, ఫిర్యాదుదారు, నాగులపేట చదవండి: కొంప ముంచిన ఆర్ఎంపీ వైద్యం.. బాలిక పరిస్థితి విషమం.. -
PV Narasimha Rao: ఇంతింతై వటుడింతై అన్నట్లుగా..
సాక్షి, మంథని(జగిత్యాల): ఇంతింతై వటుడింతై అన్నట్లుగా.. లక్నేపల్లి అనే ఒక కుగ్రామంలో పుట్టి, రాజకీయ పరమపదసోపానంలో ఒక్కో మెట్టును అధిగమించి భారత ప్రధానిగా అత్యున్నత స్థానాన్ని అధిష్టించిన అపర చాణక్యుడు పీవీ నరసింహారావుకు నేడు శత జయంతి. 1921 జూన్ 28లో జన్మించిన పీవీ 1957లో మొట్టమొదటిసారిగా మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించారు. ఇప్పటికీ ఆయన జ్ఞాపకాలు ఈ ప్రాంత ప్రజల మదిలో కదలాడుతూనే ఉన్నాయి. పీవీ శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. మంథని నుంచే ప్రారంభం విద్యాభ్యాసం అనంతరం న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించేందుకు వచ్చిన పీవీ, స్వామి రామానంద తీర్థ శిష్యరికంలో మొదట 1952లో కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. అటు తర్వాత 1957లో మొదటిసారిగా మంథని నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం వరుసగా 1962, 1967, 1972 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రిగా సేవలందించిన ఆయనను కాంగ్రెస్ అధిష్టానం 1972లో ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయడంతో 1977 వరకు పనిచేశారు. ఆ తర్వాత హన్మకొండ నుంచి రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు. 1984లో హన్మకొండ, మహారాష్టలోని రాంటెక్ నుంచి ఎంపీగా పోటీ చేయగా హన్మకొండలో ఓటమి చవిచూసినా, రాంటెక్‌లో విజయం సాధించారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ మంత్రివర్గంలో వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించిన ఆయన అపార అనుభవాన్ని గడించారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు గాడితప్పిన భారత ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు నూతన సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రపంచ ముఖచిత్రంలో మన దేశ ఖ్యాతిని నిలబెట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ. 1991లో భారత ఆర్థిక నిల్వలు తరిగిపోయి ప్రధాని చంద్రశేఖర్ హయాంలో బంగారం నిల్వలను విదేశాల్లో తనఖా పెట్టాల్సిన పరిస్థితుల్లో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన పీవీ ఆర్థిక నిపుణుడు మన్మోహన్‌సింగ్‌కు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించాడు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా నూతన ఆర్థిక సంస్కరణలకు తెర తీశారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడమే కాకుండా అభివృద్ధి చెందేందుకు దోహద పడ్డాడు. కేంద్రీయ విద్యాలయాలు. భూసంస్కరణలు, వన్యప్రాణి సంరక్షణ చట్టాలు లాంటి అనేక సంస్కరణలకు రూపకర్త అయిన పీవీ చిరస్మరణీయుడు. ప్రధానిగా పీవీ 1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉన్న పీవీని ప్రధాని పదవి వెతుక్కుంటూ వచ్చింది. దేశంలో కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీ రావడంతో ప్రధానిగా పీవీ పేరునే పార్టీ పెద్దలు ప్రతిపాదించారు. పీవీనే ప్రధాని పదవికి అర్హుడని ఏకగ్రీవంగా మద్దతు తెలుపడంతో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆరు నెలల్లో కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేసి, 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1991 నుంచి 1996 వరకు ప్రధానిగా పనిచేశారు. ప్రధానిగా దేశంలో ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కరించిన పీవీ ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారు. చదవండి: Jagananna Colonies: 3 రోజుల్లో లక్షల ఇళ్లు -
Kondagattu: అంజన్న భక్తులకు శఠగోపం..
సాక్షి, కొండగట్టు(జగిత్యాల): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీఆంజనేయస్వామి సన్నిధిలో భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఇలాంటి అక్రమాలను అడ్డుకునేందుకు కొండపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండాపోతోంది. అంజన్న దర్శనం కోసం తరలివస్తున్న భక్తుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. 20 కెమెరాలు.. రూ.10లక్షల వ్యయం భక్తుల రక్షణ, అక్రమాలు అరికట్టే ఉద్దేశంతో ఐదేళ్లక్రితం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో 20 కెమెరాలకు రూ.8లక్షల – రూ.10లక్షల వరకు వె చ్చించారు. ఆలయంలో 16, వై జంక్షన్ వద్ద రెండు, ఇతర ప్రదేశాల్లో మరోరెండు సీసీ కెమెరాలు బిగించారు. ఆలయంలోని టెంకాయ కొట్టేచోట కెమెరా లేదు. టెండర్‌దారులు భక్తుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకొని వె ళ్తున్న వారిని కొందరు అర్చకులు మరీ పిలిపించుకు ని గోత్రానామాలు చదవడం, స్వామివారి కుంకు మ, పండ్లు ఇవ్వడం ద్వారా రూ.100 – రూ.500వరకు దండుకుంటున్నారు. ఈ తంతు సీసీ కెమెరాల సాక్షిగా సాగుతోంది. అయినా వారిలో భయం, భక్తీలేదు. రూ.వేలల్లో వేతనాలు తీసుకునే అర్చకులు.. ఆలయ హుండీల్లోకి వెళ్లే సొమ్మును సైతం తమ జేబుల్లోకి మళ్లిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. హిందూ వాహిని సంస్థకు చెందిన కొందరు.. భక్తుల నిలువుదోపిడీ చూడలేక ఇటీవల ఆలయ ఈవోకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అర్చకులు, టెంకాయ కొట్టేచోట దోపిడీ ఆగినా.. కరోనా లాక్డౌన్ ఎత్తివేశాక.. ఇప్పుడు మళ్లీ మొదలైంది. కెమెరాల ముందే దోపిడీ జరుగుతున్నా.. ► ఇప్పటికే ఆలయంలోని పలుచోట్ల 20 సీసీ కెమెరాలు ఉన్నాయి. మరో 30 కెమెరాలు ఏర్పాటుచేస్తే అంతటా నిఘా ఉంచినట్లవుతుంది. ► ఇటీవల రూ.10లక్షలు వెచ్చించి మరికొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఈ ప్రోక్యూర్మెంట్ పిలిచారు. ► రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సాక్షిగా భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. అయినా పట్టించుకునే నాథుడేలేడు. ► ఇప్పటికిప్పుడు రూ.10లక్షలు వెచ్చించి కెమెరాలు ఏర్పాటు చేసినా ఎవరు పర్యవేక్షిస్తారో అధికారులకే తెలియాలి. ► ఇదే సొమ్ముతో ఆలయ అధికారులు నేరుగా కెమెరాలు కోనుగోలు చేస్తే రూ.5లక్షల లోపే ఖర్చవుతుందని భక్తులు అంటున్నారు. ► రూ.లక్ష వెచ్చించి నిరంతరం సీసీ కెమెరాలను పర్యవేక్షించినా రూ.6లక్షల్లో ఈప్రక్రియ పూర్తవుతుందని, ఇందుకు రూ.4లక్షలు చేర్చి రూ.పదిలక్షలతో టెండర్ పిలవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నిఘా వ్యవస్థ పనిచేస్తే.. ► భక్తుల భద్రతకు ఢోకా ఉండదు. ► కట్నాలు, కానుకల రూపంలో స్వామివారికి సమర్పించే సొమ్మంతా హుండీల్లోకే వెళ్తుంది. ► తద్వారా అంజన్న ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ► దొంగలు, అక్రమాలకు పాల్పడేవారు ఆలయ పరిసరాల్లోకి వస్తే గుర్తుపట్టడం సులభమవుతుంది. ► ఇతరత్రా నేరాలు, అఘాయిత్యాలు అరికట్టే వీలుంటుంది. ► సీసీ ఫుటేజీలు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారుతాయి. నిఘా ఉన్నా భయం లేదు కొండపై టెంకాయ కొట్టేచోట కొందరు అర్చకులు భక్తులను దోపిడీ చేస్తున్నారు. మేం ఈవోకు ఫిర్యాదు చేశాం. ఆయన స్పందించి అక్రమార్కులను హెచ్చరించారు. కొద్దిగా దోపిడీ తగ్గింది. ఇప్పుడు మళ్లీ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీసీ కెమెరాలు పనిచేస్తే అక్రమార్కులపై చర్య తీసుకునే అవకాశం ఉంది. – కె.అనిల్‌గౌడ్, హిందూ వాహిని ప్రతినిధి, కొడిమ్యాల రూ.లక్షలు వృథా ఎందుకు? గతంలో పదిలక్షల రూపాయలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటితో ఎవరూ భయపడతలేరు. ఇప్పుడు మరో పదిలక్షల రూపాయలతో మళ్లీ సీసీ కెమెరాలు పెడితే ఏం లాభం? వాటి నిర్వహణకు ఓ టెక్నీషియన్‌ను నియమించండి. ఆ పనిచేయకుండా సీసీ కెమెరాలు ఎన్ని ఏర్పాటు చేసినా వృథానే. – ఎ.వపన్ భక్తుడు, జగిత్యాల బాధ్యులపై చర్యలు తప్పవు కొండపై భక్తులను ఇబ్బందులకు గురిచేస్తే వారు ఎవరైనా చర్యలు తప్పవు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ఈ ప్రొక్యూర్మెంట్ పిలిచాం. ఫ్రైస్ బిడ్ ఫైనల్ కాలేదు. సీసీ కెమెరాల ఏర్పాటు టెండర్ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. వారి ఆదేశాల మేరకు టెండర్ ఫైనల్ చేస్తాం. ఎలాంటి అపోహలకు తావులేదు. –ఎ.చంద్రశేఖర్, ఈవో చదవండి: బాధిత కుటుంబాలకు తక్షణమే సాయం -
ఆసుపత్రిలో నర్సును లైంగికంగా వేధించిన డాక్టర్..
సాక్షి, కోరుట్ల(జగిత్యాల): ప్రజలను ఆరోగ్యంవంతులను చేసి కాపాడాల్సిన డాక్టరే సాటి నర్సుపట్ల కామాంధుడిగా వ్యవహరించాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. ఈ ఘటన, స్థానిక శ్రీలక్ష్మీ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. కాగా, సదరు వైద్యుడు అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సును లైంగికంగా వేధించినందుకు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్ తెలిపారు. ఆసుపత్రి వైద్యుడు రాజేశ్ తనను లైంగికంగా వేధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని సోమవారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైద్యుడు రాజేశ్ లైంగిక వేధింపుల చట్టంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
కరోనా మృతురాలి మెడలోంచి పుస్తెలతాడు మాయం..
సాక్షి, జగిత్యాలక్రైం: మృతురాలి మెడలోని బంగారు పుస్తెలతాడు మాయమైనట్లు కరీంనగర్ పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల మండలం పొలాస గ్రామానికి చెందిన సద్దినేని సాయమ్మ కుటుంబ సభ్యులంతా జగిత్యాల జంబిగద్దె ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం సాయమ్మకు కరోనా సోకడంతో కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 3 గంటల సమయంలో ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని ఆస్పత్రి వారు అప్పగిస్తున్న సమయంలో మృతురాలి బంగారు కమ్మలు మాత్రమే అప్పగించారు. ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడు లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి వారిని నిలదీయగా తమ వద్దకు రోగి వస్తున్నప్పుడు మెడలో పుస్తెలతాడు లేదని బుకాయించారు. రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడు మాయం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వైరస్ ఉధృతి: అనుమానితులు ఎక్కువ.. కిట్లు తక్కువ
సాక్షి, జగిత్యాల: జిల్లాలో కిట్ల కొరత తీవ్రంగా ఉంది. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో పీహెచ్‌సీలకు అనుమానితులు బారులు తీరుతున్నారు. పీహెచ్‌సీలకు అరకొర కిట్లు వస్తుండడంతో పలువురు పరీక్షలు చేయించుకోకుండానే వెనుదిరుగుతున్నారు. మళ్లీ మరుసటి రోజు వచ్చి లైన్లో ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. నిత్యం వందలకొద్ది అనుమానితులు వస్తుండగా పరీక్షలు మాత్రం వందలోపే చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నిత్యం 1600లకు మించి పరీక్షలు చేయడం లేదు. బారులు తీరుతున్న జనం జిల్లాలోని ప్రతీ ఆరోగ్య కేంద్రంతోపాటు కమ్యూనిటీ ఆస్పత్రుల్లో నిర్ధారణ పరీక్షలు చేస్తున్నప్పటికీ సరిపోవడం లేదు. కమ్యూనిటీ ఆస్పత్రుల్లో 100, జిల్లా ఆస్పత్రిలో 200, పీహెచ్‌సీల్లో 50 చొప్పున కిట్లు కేటాయిస్తూ రోజుకు అంతమందికే చేస్తున్నారు. సెకండ్‌వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అనుమానితులు సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. మొదట్లో టీకాలు వేసుకునేందుకు ముందుకురాని వారు, సెకండ్‌వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మొదట కరోనా పరీక్షలు చేసుకుని టీకాలు వేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ముందు పరీక్షలు చేయించుకుందామంటే ర్యాపిడ్టెస్ట్ కిట్ల కొరత ఏర్పడింది. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో ఉదయం నుంచే బారులు తీస్తున్నారు. పూర్తిస్థాయిలో కిట్లు పంపిణీ కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొరత ఉన్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. రోజుకు 1,600 మాత్రమే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడంతో టెస్ట్‌ల కోసం అనుమానితులు బారులుతీరుతున్నారు. గతంలో పరీక్షలు చేసుకునేందుకు ముందుకురాని వారు ప్రస్తుతం వైరస్ ఉధృతిని చూసి పరుగులు పెడుతున్నారు. దీంతో కిట్ల నిల్వలు తగ్గిపోతున్నాయి. సరఫరా సైతం అంతంతే ఉండడంతో కొరత ఏర్పడుతోంది. జగిత్యాలలోనే ఆర్టీపీసీఆర్ జగిత్యాలలోని ఓల్డ్హైస్కూల్లో ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో ర్యాపిడ్ టెస్ట్‌లు చేస్తున్నారు. ర్యాపిడ్ టెస్ట్‌ల్లో నెగెటివ్ వస్తే ఆర్టీపీసీఆర్కు పంపుతున్నారు. ఆర్టీపీసీఆర్లో పాజిటివ్ వస్తుండడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. -
సెల్‌టవర్ నిర్మాణం అగ్రిమెంట్ పేరుతో మోసం..
సాక్షి, జగిత్యాల: సాంకేతికరంగం రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కూడా సాంకేతికరంగాన్ని ఉపయోగిస్తూ బడా వ్యాపారుల నుంచి మొదలుకుని సామాన్య రైతులు, రైతు కూలీలను మోసం చేస్తున్నారు. తమ భూ మిలో సెల్‌టవర్ నిర్మిస్తామని నమ్మించి అగ్రిమెంట్ పేరుతో రూ.22,700 ఫోన్‌పే చేయించుకుని రైతును మోసం చేశారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన బోడుగం బాపురెడ్డి అనే రైతుకు పొరండ్ల గ్రామ శివారులో రెండు స్థలాల్లో భూమి ఉంది. 10 రోజుల నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి తమ భూమిని ఐడియా సెల్‌టవర్ నిర్మాణానికి 10 ఏళ్లపాటు అద్దెకివ్వాలని కోరాడు. తాము ల్యాండ్ కూడా చూశామని నమ్మించి రూ.20 లక్షలు బ్యాంక్‌లో డిపాజిట్ పెడతామని, నెలకు రూ.25 వేల అద్దె, ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని నమ్మించారు. దీంతో సోమవారం బాపురెడ్డికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి అగ్రిమెంట్ చార్జీలు రూ.5200 సెల్ నంబరు 8195911026కు ఫోన్ ద్వారా చెల్లించారు. తర్వాత వారు రైతుకు ఐటీ రిటర్న్ లేదని, ట్యాక్స్ పేరున రూ.17,500 జమచేస్తే బ్యాంక్ ఖా తాలో రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తామని నమ్మించారు. రూ.17,500 జమచేసిన తర్వాత బ్యాంక్‌లో రూ.10 లక్షలు జమకాకపోవడంతో రైతు వారికి ఫోన్ చేయగా బ్యాంక్ డబ్బులు జమచేసినట్లు ఓ నకిలీ రశీదును పంపించారు. “మరో రూ.25 వేలు చెల్లిస్తే ఖాతాలో అరగంటలో రూ.10 లక్షలతో పాటు మీరు వేసిన రూ.25 వేలు మీ ఖాతాలోనే జమ అవుతాయి’ అని నమ్మించారు. కానీ రైతు అనుమానం వచ్చి వారు పంపించిన డాక్యుమెంట్లు పరిశీలించగా మోసపోయామని తెలుసుకున్నాడు. దీంతో అతడు సోమవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. -
కాల్వలోకి కారు.. ప్రాణాలు కోల్పోయిన అడ్వకేట్
సాక్షి, జగిత్యాల: జిల్లాలో సోమవారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. మేడిపల్లి మండలం కట్లకుంట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారు ఎస్సారెస్పీ కెనాల్లోకి దూసుకెళ్లడంతో ముగ్గురు గల్లంతయ్యారు. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారు కోరుట్ల మండలం జోగినిపల్లికి చెందిన న్యాయవాది అమరేందర్ రావు కుటుంబసభ్యులుగా గుర్తించారు. అమరేందర్ రావు భార్య శిరీషా కూతురు శ్రేయా, కుమారుడు జయంత్ నలుగురు కారులో హైదరాబాద్ వెళ్ళి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు కారుతో సహ గల్లంతయ్యారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ జయంత్ బయటికి వచ్చి చెప్పేవరకు కారు కెనాల్లో పడ్డ విషయం ఎవరికీ తెలియదు. ప్రమాదం గురించి తెలిసిన పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని కెనాల్లో నీటిని నిలిపివేసి గాలింపు చర్యలు చేపట్టారు. కాలువలో గల్లైంతన అమరేందర్ రావు, ఆయన భార్య శిరీషా, కూతురు శ్రేయా ముగ్గురు మరణించారు. అధికారులు క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. అమరేందర్ రావు జగిత్యాలలో న్యాయవాదిగా పనిచేస్తారని స్థానికులు తెలిపారు. బయటపడ్డ జయంత్ మాట్లాడేందుకు నిరాకరించారు. చదవండి: వరంగల్: కాలువలోకి దూసుకెళ్లిన కారు -
జగిత్యాల జిల్లాలో నవ వధువు కిడ్నాప్
సాక్షి, జగిత్యాల : నవ వదువు కిడ్నాప్ జగిత్యాలలో కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకుందని కుటుంబ సభ్యులు మరికొందరితో కలిసి నవవధువును కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన జిల్లాలోని సమీప పొరండ్లలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన వేముల రాకేశ్, సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన కొంపల సమత ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఈ నెల 7న మల్యాల మండలం ఒబులాపూర్ వీరభద్రస్వామి దేవాలయంలో వివాహం చేసుకున్నారు. అదే రోజు తమకు రక్షణ కావాలంటూ నూతన జంట సారంగాపూర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు యువతి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. దంపతులు రాకేశ్–సమత పొరండ్ల గ్రామంలో ఉంటున్నారు. సోమవారం మధ్యాహ్నం సమత సోదరుడు సాయికుమార్‌తోపాటు మల్యాల మండలం రాజారం గ్రామానికి చెందిన బుర్రల ప్రవీణ్ కారులో పొరండ్ల గ్రామానికి వచ్చి మరో నలుగురు రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చి రాకేశ్, అతని కుటుంబ సభ్యులపై దాడిచేసి సమతను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. దీంతో భర్త వేముల రాకేశ్ జగిత్యాల రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్సై సతీశ్ కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
కూతురి హత్య.. తండ్రికి జీవిత ఖైదు
సాక్షి, జగిత్యాల : కన్న కూతురుకు వివాహం చేయడం.. ఆమెకు వరకట్నం ఇవ్వడం భారంగా భావించిన తండ్రి, సవతి తల్లి, సవతి తల్లి సోదరుడు సదరు యువతిని హత్య చేసిన ఘటనలో ముగురికీ జీవిత ఖైదు విధిస్తూ జగిత్యాల న్యాయమూర్తి తీర్పునిచ్చారు. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెన్గుమట్లకు చెందిన పాట్కూరి సత్యనారాయణరెడ్డికి పెగడపల్లి మండలం మద్దులపల్లికి చెందిన ప్రేమలతతో వివాహమైంది. వీరికి కూతురు మాన్యశ్రీ జన్మించింది. ఆ తర్వాత భా ర్యాభర్తల మధ్య గొడవలు చోటుచేసుకోవడంతో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో మాన్యశ్రీ వివాహానికి ఎంత ఖర్చయినా తానే భరిస్తానని సత్యనారాయణరెడ్డి ఒప్పంద పత్రం రాసిచ్చాడు. కూతురుకి వివాహ వయసు రావడంతో అతను గ్రామంలో ఉన్న తన 20 గుంటల భూమిని విక్రయించాడు. ఈ నేపథ్యంలో పెళ్లి సంబంధాలు చూస్తుండగా హైదరాబాద్ నుంచి మంచి సంబంధం వచ్చింది. మగ పెళ్లివారు రూ.25 లక్షల వరకట్నం అడిగారని మాన్యశ్రీ తన తండ్రి సత్యనారాయణరెడ్డికి 07.09. 2015న ఫోన్లో తెలిపింది. మరుసటి రోజు అతను కూతురుకు ఫోన్ చేసి, 20న వెన్గుమట్లకు రావాలని చెప్పడంతో కరీంనగర్ నుంచి వెళ్లింది. అదే రోజు రాత్రి తండ్రి సత్యనారాయణరెడ్డి, సవతి తల్లి లత, సవతి తల్లి సోదరుడు కళ్లెం రాజులు పథకం ప్రకారం మాన్యశ్రీని గొంతు నుమిలి హత్య చేశారు. మృతురాలి తల్లి ప్రేమలత గొల్లపల్లి ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తి చేసి, సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో జగిత్యాల సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి జి.సుదర్శన్ ముగ్గురు నిందితులకు జీవితఖైదుతో పాటు రూ.12 వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పునిచ్చారు. అప్పటి గొల్లపల్లి ఎస్సై రమేశ్, ధర్మపురి సీఐ వెంకటరమణ, 18 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పీపీ శ్రీవాణి, గొల్లపల్లి కోర్టు కానిస్టేబుల్ కిరణ్‌కుమార్‌లను ఎస్పీ సింధూశర్మ అభినందించారు.