సాక్షి, వేములవాడ(జగిత్యాల): ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారనే కారణంతో పట్టుకున్న ట్రాక్టర్‌ను విడుదల చేసేందుకు డబ్బు డిమాండ్ చేసిన ఎస్సై దూలం పృథ్వీధర్‌గౌడ్, స్టేషన్ రైటర్ ఉరుమల్ల రమేశ్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆదివారం వలపన్ని పట్టుకున్నారు. మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కోరుట్ల మండలం నాగులపేట గ్రామానికి చెందిన ఆరెల్లి సా యికుమార్ ట్రాక్టర్‌ను ఇటీవలే అదే గ్రామానికి చెందిన ఉప్పరపెల్లి నాగరాజు కొనుగోలు చేశా రు. ఈనెల 18న కథలాపూర్ మండలం తక్కళ్లపెల్లి శివారులోని వాగులోంచి ఇసుక తరలిస్తుండగా పోలీసులు ట్రాక్టర్ పట్టుకుని సీజ్ చేశారు. కేసు నమోదైంది. స్టేషన్ బెయిల్‌తోపాటు ట్రాక్టర్ విడుదలకోసం స్టేషన్ రైటర్ రమేశ్, ఎస్సై పృథ్వీధర్‌గౌడ్ తమకు రూ.15వేలు లంచడం ఇవ్వాలని ట్రాక్టర్ యజమాని నాగరాజును డి మాండ్ చేశారు. అంతడబ్బు ఇవ్వలేనని నాగరా జు వారికి బదులిచ్చారు.
చివరకు రూ.10 వేల కు బేరం కుదిరింది. ఈ క్రమంలో శనివారం నా గరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు ఆదివారం మధ్యాహ్నం రూ.10 వేలు స్టేషన్ రైటర్ రమేశ్‌కు కథలాపూర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో నాగరాజు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా రు. ఎస్సై డబ్బు తీసుకోవాలని సూచించడంతో నే తాను తీసుకున్నట్లు రమేశ్ ఏసీబీ అధికారులకు చెప్పారు. దీంతో ఎస్సై పృథ్వీధర్‌గౌడ్, కా నిస్టేబుల్ రమేశ్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుస్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎస్సై పృథ్వీధర్‌గౌడ్ నివాసం ఉండే క్వార్టర్‌లో తనిఖీలు చేపట్టారు. ఎస్సై, కానిస్టేబుల్‌ను సోమవారం కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ భద్రయ్య, సీఐలు రవీందర్, రాము, సంజీవ్, తిరుపతితోపాటు 30 మంది సిబ్బంది పాల్గొన్నారు.
వేధింపులతో విసిగి వేసారి..
ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోందని, అధికారులు అరికట్టడంలేదని పలువురు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో ఈనెల 14న స్పెషల్ బ్రాంచి పోలీసులు కథలాపూర్ శివారులో అక్రమంగా నిల్వచేసిన 200 ట్రాక్టర్ లోడ్‌ల ఇసుక కుప్పలు గుర్తించారు. వాటిని మండల స్థాయి అధికారులకు అప్పగిస్తే వాటిని సీజ్ చేశారు. ఎస్‌బీ పోలీసులు గుర్తించేవరకూ ఇసుక అక్రమ నిల్వలను స్థానిక అధికారులు గుర్తించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే, ఆదివారం ఇసుక విషయంలోనే ఎస్సై, కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడటం గమనార్హం. కథలాపూర్ మండలంలో పనిచేస్తున్న ముఖ్య శాఖల అధికారులు ఏళ్లతరబడి ఇక్కడే ఉండటంతో అక్రమ వ్యాపారాలకు ఆజ్యం పోస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే ఇసుక అక్రమ వ్యాపారంలో స్థానిక మండలవాసులతోపాటు కోరుట్ల మండలవాసులు పాలుపంచుకున్నట్లు చర్చించుకుంటున్నారు.
నాలుగుసార్లు వేధించారు
తక్కళ్లపెల్లి శివారువాగులోంచి ట్రాక్టర్‌లో ఇసుక తీసుకెళ్తుండగా ఎస్సై, కానిస్టేబుళ్లు నాలుగు సార్లు పట్టుకొని డబ్బు కో సం వేధించారు. అ ప్పట్లో ఎంతోకొంత ఇచ్చి ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్ నుంచి విడిపించుకుని వెళ్లా. ఈనెల 18న మళ్లీ నా ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకొని డబ్బు కోసం వేధించారు. విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించా. వారి సూచనల మేరకు లంచం డబ్బులు ఇచ్చి ఎస్సై, కానిస్టేబుల్‌ను పట్టించా.
– ఉప్పరపెల్లి నాగరాజు, ఫిర్యాదుదారు, నాగులపేట
చదవండి: కొంప ముంచిన ఆర్‌ఎంపీ వైద్యం.. బాలిక పరిస్థితి విషమం..
Comments
Please login to add a commentAdd a comment