సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ ముసాయిదా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సాగించిన ఉద్యమానికి ‘సాక్షి’ అండగా నిలిచింది. భూమిని నమ్ముకుని జీవిస్తున్న అన్నదాతలకు నిత్యం అండగా ఉంటూ ‘కథనోత్సాహం’తో అక్షర పోరు సాగించింది. ‘చిక్కుముడుల మాస్టర్ ప్లాన్’ అంటూ డిసెంబర్ 2న ప్రచురితమైన కథనంతో ముసాయిదాలోని లొసుగులు వెలుగులోకి వచ్చాయి. మాస్టర్ ప్లాన్‌లో ఏముందో అంటూ ముసాయిదాలో పేర్కొన్న చాలా అంశాలను ప్రముఖంగా ప్రచురించడంతో బాధి త రైతులు జాగృతమయ్యారు. సుమారు యాభై రోజులు అలుపెరుగని పోరు సలిపారు.
మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలకు ప్రాధాన్యతనిస్తూ, రైతుల ఆవేదనకు ‘సాక్షి’గా నిలిచింది. ఉద్యమంలో పాల్గొన్న అన్నివర్గాలు, పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అందరి మనన్నలు అందుకుంది. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. భూమికోసం సాగించిన సమరంలో తమకు దన్నుగా నిలిచిన ‘సాక్షి’కి రైతన్నలు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment