Municipal Council
-
అన్నదాతకు అండగా.. ‘సాక్షి’ అక్షర సమరం
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ ముసాయిదా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సాగించిన ఉద్యమానికి ‘సాక్షి’ అండగా నిలిచింది. భూమిని నమ్ముకుని జీవిస్తున్న అన్నదాతలకు నిత్యం అండగా ఉంటూ ‘కథనోత్సాహం’తో అక్షర పోరు సాగించింది. ‘చిక్కుముడుల మాస్టర్ ప్లాన్’ అంటూ డిసెంబర్ 2న ప్రచురితమైన కథనంతో ముసాయిదాలోని లొసుగులు వెలుగులోకి వచ్చాయి. మాస్టర్ ప్లాన్‌లో ఏముందో అంటూ ముసాయిదాలో పేర్కొన్న చాలా అంశాలను ప్రముఖంగా ప్రచురించడంతో బాధి త రైతులు జాగృతమయ్యారు. సుమారు యాభై రోజులు అలుపెరుగని పోరు సలిపారు. మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలకు ప్రాధాన్యతనిస్తూ, రైతుల ఆవేదనకు ‘సాక్షి’గా నిలిచింది. ఉద్యమంలో పాల్గొన్న అన్నివర్గాలు, పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అందరి మనన్నలు అందుకుంది. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. భూమికోసం సాగించిన సమరంలో తమకు దన్నుగా నిలిచిన ‘సాక్షి’కి రైతన్నలు కృతజ్ఞతలు తెలిపారు. -
జగిత్యాల, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ల రద్దు! కౌన్సిళ్ల కీలక నిర్ణయం
సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్/ జగిత్యాల: తమ పంట భూములను కాపాడుకునేందుకు రైతులు చేసిన పోరాటం ఫలించింది. కామారెడ్డి, జగిత్యాల పట్టణాల్లో కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాలను రద్దు చేయాలంటూ వారు చేపట్టిన ఆందోళనకు ప్రభుత్వం తలొగ్గింది. ఈ రెండు చోట్ల మాస్టర్ ప్లాన్ ముసాయిదా ప్రక్రియలను నిలిపివేస్తూ మున్సిపల్ పాలకవర్గాలు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి. రైతుల భూములు ఎక్కడికీ పోవని, ఆవేదన చెందవద్దని ప్రకటించాయి. రైతుల భూములకు నష్టం కలగకుండా ప్రణాళికలను రూపొందిస్తామని అధికారులు తెలిపారు. రైతుల ఉధృత ఉద్యమంతో.. కామారెడ్డి మున్సిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్‌కు సంబంధించి డీటీసీపీ, ఢిల్లీకి చెందిన డీడీఎఫ్ సంస్థలు కలిసి ముసాయిదా రూపొందించడం, అందులో పంట భూములను పారిశ్రా మిక, వాణిజ్య జోన్లుగా చూపడాన్ని తప్పుపడుతూ రైతులు ఆందోళనకు దిగడం తెలిసిందే. జెడ్పీ మాజీ చైర్మన్ కె.వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఉద్యమానికి దిగారు. దీనికి వివిధ రాజ కీయ పక్షాలు మద్దతుగా నిలి చాయి. అయితే అడ్లూర్ ఎల్లా రెడ్డికి చెందిన రైతు పయ్యవుల రాములు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనతో పోరాటం ఉధృతమైంది. చివరికి మాస్టర్‌ప్లాన్ ముసాయిదాను రద్దు చేస్తూ శుక్రవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. మరోవైపు పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్ కామారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ జితేష్ వి.పాటిల్, అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, మున్సిపల్ కమిషనర్ దేవేందర్‌లతో సమీక్షించారు. అనంతరం ముసా యిదా ప్రక్రియను నిలిపివేస్తున్నామని అరవింద్‌కుమార్ ప్రక టించారు. విలీన గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసు కుని కొత్త మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తామని తెలిపారు. రైతుల భూమిని సేకరించే ఉద్దేశంతో మాస్టర్‌ప్లాన్ తయారు చేయ లేదని, రైతుల భూములు ఎక్కడికీ పోవని చెప్పారు. కొత్త రోడ్ల నిర్మాణంలో రైతులకు నష్టం జరగకుండా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు, నేతలు హర్షం వ్యక్తం చేశారు. అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో టపాసులు కాల్చారు. ఉద్యమానికి అండగా నిలిచారంటూ జెడ్పీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డిని అభినందించారు. జగిత్యాల మున్సిపాలిటీలోనూ.. జగిత్యాల మున్సిపాలిటీలోనూ ముసాయిదా మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తూ పాలకవర్గం శుక్రవారం తీర్మానించింది. జగిత్యాల మున్సిపాలిటీలో పట్టణ శివార్లలోని హుస్నాబాద్, తిప్పన్నపేట, మోతె, తిమ్మాపూర్, ధరూర్, నర్సింగాపూర్ గ్రామాలను విలీనం చేస్తూ గత ఏడాది డిసెంబర్లో మాస్టర్ ప్లాన్ ముసాయిదా రూపొందించారు. పలుగ్రామాల్లోని వ్యవసాయ భూములను రిక్రియేషన్, ఇండస్ట్రియల్, కమర్షియల్ జోన్ల పరిధిలో చేర్చారు. దీనిపై ఆయా గ్రామాల ప్రజ లు, రైతులు ఆందోళనలకు దిగారు. ధర్నాలు, రాస్తారో కోలు, కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, వంటావార్పుతో నిరసనలు తెలిపారు. గురువారం జగిత్యాల మున్సిపాలిటీ ముట్టడి, పట్టణ దిగ్బంధం కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ పాలకవర్గం శుక్రవారం అత్యవసరంగా సమావేశమై.. మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేసింది. -
‘మాస్టర్ ప్లాన్’పై కౌన్సిల్లో తీర్మానం చేయండి
కామారెడ్డి టౌన్: మునిసిపల్ మాస్టర్ ప్లాన్ వల్ల తాము తీవ్రంగా నష్టపోతు న్నామని రైతు జేఏసీ ఆధ్వర్యంలో సోమ వారం కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరికీ వినతి పత్రాలను అందజేశారు. చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్పర్సన్ ఇందుప్రియలతో పాటు 49 మంది కౌన్సిల్ సభ్యులకు ఇళ్లకు వెళ్లి వినతి పత్రాలను అందజేశారు. చైర్పర్సన్ అందుబాటులో లేకపో వడంతో ఆమె తండ్రి నిట్టు వేణుగోపాల్ రావుకు విన్నవించుకున్నారు. తమకు న్యాయం జరిగేలా కౌన్సిల్లో చర్చించి తీర్మానం చేయాలని రైతులు కోరారు. ఈనెల 11న అభ్యంతరాలకు గడువు ముగుస్తుందని, 12న అత్యవ సర సమావేశం పెట్టుకుని తమకు న్యాయం చేయాలని వేడుకు న్నారు. ప్రభుత్వ విప్, కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం తమకు న్యాయం జరుగుతుందని భావించి ఉద్యమానికి తాత్కాలి కంగా విరామం ప్రకటిస్తున్నామన్నారు. ఈ కార్య క్రమంలో ఇల్చిపూర్, దేవునిపల్లి, టేక్రియాల్, అడ్లూర్, రామేశ్వరపల్లి, అడ్లూర్ఎల్లారెడ్డి గ్రామాల రైతులు, రైతు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. -
చర్చ లేదు రచ్చే.. రసాభాసగా జీహెచ్ఎంసీ సమావేశం..
సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ఎలాంటి చర్చ లేకుండా రచ్చతోనే అర్ధాంతరంగా ముగిసింది. గందరగోళం.. రసాభాసలతో, సభ్యుల సస్పెన్షన్లు ఉంటాయో, ఉండవో కూడా తెలియని అయోమయంతో అభాసుపాలైంది. జీహెచ్ఎంసీ చరిత్రలోనే తొలిసారిగా సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు సభకు అధ్యక్షత వహించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రకటించారు. అనంతరం కొద్ది సేపటికి సభనే ముగించారు. శనివారం జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ఆద్యంతం రచ్చే అయింది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2023–24)సంబంధించిన బడ్జెట్ ప్రత్యేక సమావేశం, నగర ప్రజల సమస్యలపై చర్చించాల్సిన సాధారణ సమావేశం రెండూ ఒకేరోజు ఏర్పాటు చేశారు. అజెండా మేరకు తొలుత బడ్జెట్ సమావేశంలో భాగంగా మేయర్ బడ్జెట్ ప్రతిలోని వివరాలు చదవడం ప్రారంభించగానే బీజేపీ సభ్యులు అడ్డుకొని పోడియం వైపు దూసుకెళ్లారు. ప్రశ్నోత్తరాలపై పట్టుబట్టడంతో.. ► తొలుత బడ్జెట్ బదులు ప్రజల సమస్యలపై ప్రశ్నోత్తరాలు నిర్వహించాలని పట్టుబట్టారు. గందరగోళంతో మేయర్ సభను పదినిమిషాలు వాయిదా వేశారు. తిరిగి సమావేశమయ్యాక సైతం వారు ఆందోళన కొనసాగిస్తుండగానే మేయర్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపేవారి చేతులెత్తాలని చెప్పి, బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులను పరిగణనలోకి తీసుకొని ఆమోదం పొందినట్లు ప్రకటించారు. దాన్ని అడ్డుకుంటూ బీజేపీ సభ్యులు మేయర్ పోడియం ముందు బైఠాయించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు.గందరగోళం తీవ్రంగా మారడంతో మరోసారి సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. తిరిగి 11.50 గంటలకు సమావేశం ప్రారంభమయ్యాక సైతం అదే సీన్ పునరావృతమైంది. బీజేపీ సభ్యులు పోడియం చుట్టుముట్టారు. బడ్జెట్‌పై చర్చ జరగకుండానే బడ్జెట్‌ను ఎలా ఆమోదిస్తారంటూ పట్టుబట్టారు. ► ఆమోదం పొందాక తిరిగి చర్చ ప్రశ్నే లేదని, ప్రశ్నోత్తరాలు ప్రారంభిస్తానని, తొలుత మీకే అవకాశమిస్తానని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. ప్రశ్నల కోసం పేర్లు పిలవగా ఒకరిద్దరు బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు లేచి మాట్లాడారు. వారు మాట్లాడుతున్నప్పటికీ బీజేపీ ఆందోళన ఆగలేదు. వీధిదీపాలు వెలగడం లేవని ఎంఐఎం.. అభివృద్ధి కార్యక్రమాలకు ఢిల్లీ వారు నగరానికి అవార్డులిస్తున్నా, గల్లీ వారికి కనిపించడం లేవని బీఆర్ఎస్ ప్రస్తావించాయి. బీజేపీ సభ్యులెంతసేపటికీ పోడియం దిగి రాకపోవడం.. గందరగోళ పరిస్థితి సద్దుమణగకపోవడంతో రెండు మూడు పర్యాయాలు సస్పెన్షన్ హెచ్చరికలు చేసిన మేయర్ 12.11 గంటలకు పోడియంవద్ద ఉన్న బీజేపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు, మేయర్, కమిషనర్ తమ సీట్లనుంచి లేచి వెళ్లిపోయారు. తిరిగి 12.44 గంటలకు సీట్లోకి వచి్చన మేయర్ మాట్లాడుతూ ‘మంచిగా చెబుతున్నా కూర్చోండి. చర్చిద్దాం’ అన్నా పోడియంను చుట్టుముట్టిన వారు వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో సమావేశాన్ని ముగిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. రూ. 6224 కోట్లతో బడ్జెట్ ఆమోదం 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ.6224 కోట్ల బడ్జెట్ మెజారిటీ సభ్యులతో సభ ఆమోదం పొందినట్లు మేయర్ ప్రకటించారు. స్టాండింగ్ కమిటీ ఆమోదించిన బడ్జెట్‌ను యథాతథంగా ఆమోదించారు. బీజేపీ, కాంగ్రెస్ ధర్నాలు.. ప్రజా సమస్యలపై చర్చించాలని, అభివృద్ధి పనులి్నచేపట్టాలనే డిమాండ్లతో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు వేర్వేరుగా ఆందోళనలు, ధర్నాలు చేశారు. కాంగ్రెస్ సభ్యులు మేయర్ చాంబర్ ఎదుట ‘సేవ్ డెమోక్రసీ.. సేవ్ జీహెచ్ఎంసీ’ ప్లకార్డులను ప్రదర్శించారు. బీజేపీ సభ్యులు మేయర్ ప్రవేశ ద్వారం ఎదుట ధర్నా చేశారు. పోలీసులు వారిని అక్కడినుంచి తరలించారు. సస్పెన్షన్ ఉంటుందా.. ? జీహెచ్ఎంసీ నిబంధనల మేరకు సభ్యులను సస్పెండ్ చేసే అధికారం లేనట్లు మునిసిపల్ వ్యవహారాల నిపుణుడొకరు పేర్కొన్నారు. సభను నిర్వహించలేని పరిస్థితులు ఎదురైతే అందుకు కారణమైన వారిని బయటకు పంపించడమో, లేక సభనే ముగించడమో మినహా సభ్యులను సస్పెండ్ చేయడమన్నది ఉండదని, గతంలో సైతం ఎలాంటి సస్పెన్షన్లు లేకపోవడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మేయర్ తెలిసో, తెలియకో సస్పెండ్ చేస్తున్నానని ప్రకటించాక పునరాలోచనలో పడి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నయాపైసా తెప్పించని కిషన్‌రెడ్డి: మేయర్ విజయలక్ష్మి సమావేశానంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కేంద్రమంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి జీహెచ్ఎంసీతో పాటు పరిసరాల్లోని మున్సిపాలిటీలకూ ఒక్క పైసా తేలేకపోయారన్నారు. మున్సిపాలిటీలకు వచ్చే నిధులు ఇప్పించలేక పోయారన్నారు. బీజేపీ సభ్యులు బడ్జెట్ గురించి కానీ, ప్రజల సమస్యల గురించి కానీ చర్చించకపోవడంతో వారికి సమస్యలపై పట్టింపు లేదని వెల్లడైందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ఎస్సార్డీపీ, ఎస్ఎన్డీపీ, సీఆర్ఎంపీల ద్వారా జీహెచ్ఎంసీ నిధులతోనే ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. బీజేపీ వారికి మాట్లాడేందుకు విషయం లేనందునే గందరగోళానికి దిగారని ఆరోపించారు. మహిళా మేయర్‌ను అని కూడా చూడకుండా పోడియంను చుట్టిముట్టి అగౌరవంగా ప్రవర్తించారన్నారు. జీహెచ్ఎంసీకి కేంద్ర మంత్రి నిధులిస్తారా? హెచ్ఎంసీలో పాలన గాడి తప్పింది. నిధులెలా వస్తున్నాయో.. ఎలా ఖర్చు చేస్తున్నారో తెలియడం లేదు. ఎక్కడ వసూలైన నిధుల్ని అక్కడ వినియోగించాలి. పాతబస్తీ నుంచి ట్యాక్సుల రూపేణా ఎంత వసూలవుతుందో.. ఎంత ఖర్చు చేస్తున్నారో, అలాగే న్యూసిటీనుంచి ఎంత వసూలవుతుందో, ఎంత వెచి్చస్తున్నారో వెల్లడించాలి. హైటెక్‌సిటీలో హంగులు తప్ప ఇంకెక్కడా ఏమీ లేదు. గోడలకు రంగులేసి విశ్వనగరం చేస్తున్నామని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఇండిపెండెంట్ బాడీ. ఎలా నడపాలో చేతగాక కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ప్రస్తావిస్తూ నిధులివ్వలేదనడం విడ్డూరంగా ఉంది. – బండ కార్తీకరెడ్డి, మాజీ మేయర్, బీజేపీ నాయకురాలు చదవండి: Roundup 2022: నిషా ముక్త్ షహరే.. డ్రగ్ ఫ్రీ సిటీ దిశగా! -
నల్లగొండ టీఆర్ఎస్లో గందరగోళం
-
ట్రేడ్ లైసెన్సు లేకుంటే భారీ జరిమానా
సాక్షి, హైదరాబాద్: ట్రేడ్ లైసెన్స్ లేని వ్యాపారాలపై సర్కారు కొరడా ఝళిపించనుంది. మున్సిపల్ ప్రాంతాల్లో ట్రేడ్ లైసెన్సు తీసుకోకుండా వ్యాపారాలు చేసేవారిపై, గడువు తీరిన లైసెన్సులతో వ్యాపారాలు, పరిశ్రమలు నిర్వహించేవారిపై భారీ జరిమానాలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ట్రేడ్‌లైసెన్సు తీసుకోకపోతే వ్యాపారం ప్రారంభమైన నాటి నుంచి తొలి మూడు నెలల వరకు 25 శాతం, ఆ తర్వాత నుంచి లైసెన్సు తీసుకునే వరకు 50 శాతం లైసెన్సు ఫీజును జరిమానాగా విధించాలని అధికారులను ఆదేశించింది. గడువు తీరిన ట్రేడ్‌లైసెన్సుతో వ్యాపారాలు నిర్వహించేవారికి సంబంధిత ఏడాది జూన్ వరకు 25 శాతం, జూలై 1 నుంచి ట్రేడ్‌లైసెన్సు పునరుద్ధరించుకునే నాటి వరకు 50 శాతం లైసెన్సు ఫీజును జరిమానాగా విధించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ మున్సిపాలిటీల ట్రేడ్ లైసెన్సు నిబంధనలు–2020ను ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ విడుదల చేశారు. వ్యాపారాలను బట్టి లైసెన్సులు వ్యాపారాల స్వభావాన్ని బట్టి డేంజరస్ అండ్ అఫెన్సివ్(ప్రమాదకర, ఉపద్రవ), సాధారణ వ్యాపారాలు/దుకాణాలు/కార్యాలయాలు, పారిశ్రామిక సముదాయాలు, తాత్కాలిక వ్యాపారాలు అనే నాలుగు కేటగిరీలుగా విభజించి ట్రేడ్ లైసెన్సులు జారీ చేయనున్నారు. ట్రేడ్ లైసెన్సు లేకుండా మున్సిపాలిటీల పరిధిలో ఎలాంటి వ్యాపారాలు నిర్వహిం చడానికి వీలులేదని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాపారాలు/పరిశ్రమల నిర్వహణకు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులతోపాటు లైసెన్సు ఫీజు చెల్లించిన తర్వాతే లైసెన్సులు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించింది. ప్రాంతం ప్రాధాన్యత, విస్తీర్ణం ఆధారంగా లైసెన్సుల జారీకి ప్రభుత్వం రేట్లను నిర్ణయించింది. ప్రమాదకర వ్యాపారాలతోపాటు సాధారణ వ్యాపారాలు/దుకాణాలు/కార్యాలయాలకు సింగిల్ లైన్ రోడ్డు ఉంటే ప్రతి చదరపు అడుగుకు కనీసం రూ.3, డబుల్‌లైన్ ప్రాంతంలో కనీసం రూ.4, మల్టీలైన్ రోడ్డు ఉంటే కనీసం రూ.5 చొప్పున మొత్తం ప్రాంతం విస్తీర్ణానికి లెక్కించి లైసెన్సుఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఐదు నక్షత్రాల హోటళ్లు, కార్పొరేట్ ఆస్పత్రులు చదరపు అడుగుకు కనీసం రూ.6 చొప్పున ఫీజులు చెల్లించాల్సి ఉండనుంది. పరిశ్రమల స్థాయిని బట్టి కనీసం రూ.4 నుంచి రూ.7 వరకు ప్రతి చదరపు అడుగు స్థలానికి చెల్లించాల్సి ఉంటుంది. కౌన్సిళ్లు నిర్ణయించాలి.. ఇక తాత్కాలిక వ్యాపారాల కోసం వసూలు చేసే లైసెన్సు ఫీజులను స్థానిక మున్సిపల్ కౌన్సిళ్లు నిర్ణయించాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రతి మూడేళ్లకోసారి మున్సిపల్ కౌన్సిళ్లు ట్రేడ్‌లైసెన్సు ఫీజులను పెంచాలని, ఒకవేళ మున్సిపల్ కౌన్సిళ్లు పెంచకపోతే జిల్లా కలెక్టర్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. -
ఫుడ్ ఏటీఎం
రైతు కష్టపడి పండించిన పంటను మనం ఇంటికి తెచ్చుకుని వండుకుని తింటున్నాం. వండుకున్నది మిగిలిపోతే పడేస్తున్నాం. రైతు పడిన కష్టం మనకు తెలియదు. అందుకే ఆహారం విలువ కూడా తెలియట్లేదు. విందు వినోదాలలోనైతే టన్నుల కొద్దీ ఆహారం వృథా అవుతుంటుంది. ఈ వృథాను అరికట్టేందుకు కొన్ని సేవా సంస్థలు మిగిలిన పదార్థాలను సేకరించి పేదలకు అందజేస్తుంటాయి. తాజాగా ఒడిశాలోని సంబల్పూర్లో ‘తృప్తి’ పేరున ఒక ఏటీఎంను నెలకొల్పారు. పేదలకు ఉచితంగా తినడానికి ఇంత ముద్ద అందజేయడం కోసమే ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు. ‘స్వచ్ఛ’ అనే ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో సంబల్పూర్ మునిసిపల్ కౌన్సిల్ ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముందుగా తమ దగ్గరకు వచ్చిన ఆహారం స్వచ్ఛంగా, శుభ్రంగా ఉందో లేదో పరీక్షించిన తరువాత మాత్రమే ఏటీఎంలో భద్రపరుస్తామని స్వచ్ఛ సంస్థ సభ్యులలో ఒకరైన దిలీప్ పాండా చెబుతున్నారు. అది కూడా కేవలం ప్యాక్డ్ శాకాహారం మాత్రమే విరాళంగా అందజేయాలట. పేదవారికి, అనాథలకు ఉచితంగా ఆహారం అందజేయడం కోసమే ఈ పథకాన్ని ప్రారంభించారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఇక్కడ ఆహారం దొరుకుతుంది. పేరుకు ఏటీఎం అయినా.. ఇందుకు కార్డులేమీ అవసరం లేదు. ఆకలి ఉంటే చాలు. 700 లీటర్ల సామర్థ్యం గల రిఫ్రిజిరేటర్లో ఈ ఆహారాన్ని నిల్వ చేస్తున్నారు. సంబల్ పూర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రి దగ్గర ఇది కనిపిస్తుంది. -
‘ప్రత్యేకం’లో పరిష్కారమయ్యేనా..!
సాక్షి, కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల పాలన గడువు 2వ తేదీన ముగిసింది. ఐదేళ్ల కాలంలో తమ వంతుగా పాలకులు పట్టణాభివృద్ధికి పాటుపడ్డారు. కానీ పట్టణంలో చేయాల్సిన అభివృద్ధి పనులు ఇంకా భారీగానే ఉన్నాయి. కోట్ల రూపాయలతో చేపట్టనున్న పాత, నూతన పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధాన అభివృద్ధి పనులను పూర్తి చేయకుండా కౌన్సిల్ సభ్యులు పదవీకాలం ముగించుకుని గద్దెదిగారు. ప్రస్తుతం ప్రత్యేకపాలన అధికారిగా కలెక్టర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ సత్యనారాయణ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించక ముందు గతంలో మున్సిపల్ శాఖలోనే విధులు నిర్వహించారు. ఆయనకు మున్సిపల్ శాఖపై పూర్తిస్థాయిలో పట్టు ఉంది. ప్రత్యేక పాలనలో కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపిస్తే పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. నిలిచిన రూ. 2 కోట్ల మురికాలువ, ఫుట్‌పాత్ పనులు జిల్లా ఏర్పడిన తర్వాత పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా మురికి కాలువ, ఫుట్‌పాత్ నిర్మాణం కోసం టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ. కోటీ 99 లక్షలతో పనులను ఎమ్మెల్యే గతేడా జూలై 28న ప్రారంభించారు. అయితే కొత్త బస్టాండ్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ఇరువైపులా తవ్వకాలు జరిపి పనులు పూర్తి చేయకుండానే నిలిపివేశారు. పనులు అర్ధం తరంగా నిలిచిపోవడంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. అదనపు టెండర్లతో ఖర్చు వ్యయం పెంచాలని, చేసిన పనుల బిల్లులు చెల్లించాలని ఈ పనులు నిలివేశారు. అయితే ఈ పనులను కౌన్సిల్‌లోని పాలకురాలి భర్తనే చేపడుతుండడం గమనార్హం. స్లాటర్ హౌజ్, మటన్ మార్కెట్ ఊసేలేదు 2003లో ఐడీసీఎంస్ కేంద్ర నిధులు రూ. 63లక్షలతో సుభాష్‌రోడ్డులో 60కి పైగా దుకాణాలతో మటన్ మార్కెట్ సముదాయాలను నిర్మించారు. వాటికి టెండర్లు నిర్వహించకపోవడంతో ఇప్పటి వరకు అద్దెలు, అడ్వాన్స్‌ల రూపంలో రూ.2 కోట్లకుపైగానే బల్దియా ఆదాయం కోల్పోయింది. అలాగే రూ. 10 లక్షలతో సిరిసిల్ల రోడ్డులో జంతువధశాల నిర్మించి వదిలేశారు. ప్రస్తుతం పెద్ద, చిన్నకసాబ్ గల్లి, బతుకమ్మకుంట తదితర ప్రాంతాలలో జనవాసాల మధ్య జంతువులను వధిస్తూ మాంసం విక్రయిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాలలో జంతువుల కళేబరాలు, రక్తం మురికాలువల్లో, రోడ్లపై పడేయడంతో దుర్గధంతో స్థానికులు అవస్థలు పడుతూ, రోగాల బారిన పడుతున్నారు. గాడితప్పిన పారిశుధ్యం బల్దియాలో 5 ఏళ్లుగా సానిటరీ ఇన్స్పెక్టర్లు లేకపోవడంతో ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం పట్టణంలోని ఈ విభాగం అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే మురికికాల్వలు నిండి రోడ్లపైకి మురుగునీరు వస్తోంది. సుభాష్‌రోడ్డు, జేపీఎన్ రోడ్డు, అయ్యప్పనగర్, దళిత వాడ, ఇస్లాంపూర, విద్యానగర్‌కాలనీ తదితర ప్రాంతాల్లో రోడ్లపైకి మురుగునీరు ప్రవహిస్తోంది. జవాన్లను, కార్మికులకు ప్రణాళికాబద్ధంగా పనులు అప్పగించే వారు లేక సైతం పనులు సక్రమంగా జరగడం లేవు. టౌన్‌ప్లానింగ్‌లో ఆరోపణలెన్నో.. పట్టణంలో పార్కింగ్ స్థలాలు లేకుండానే, సెల్లార్ అనుమతులు లేకుండానే జిల్లాకేంద్రంలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు చేపట్టారు. నిజాంసాగర్ చౌరస్తాలో, నిజాంసాగర్ రోడ్, పాత బస్టాండ్, సిరిసిల్ల రోడ్ తదితర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల్లో పార్కింగ్ స్థలాలు లేకున్నా, సెల్లార్లు లేకున్నా అనుమతులు ఇచ్చారు. ఈ అనుమతులపై అధికారులు, కౌన్సిల్ సభ్యులపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. పాత బస్టాండ్‌లో సెల్లార్ అనుమతి లేదని స్వయంగా అధికారులు కూల్చివేయించినా మళ్లీ యధావిధిగా నిర్మాణాలు ఉన్నాయి. నిజాంసాగర్ చౌరస్తాలో భవన నిర్మాణాలపై పార్కింగ్ స్థలాలు, సెల్లార్ అనుమతులు లేవని, ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కాంగ్రెస్ నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మాస్టర్ ప్లాన్ అమలు కావడం లేదు. మార్కింగ్‌లు వేసి నోటీసులు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా చర్యలులేవు. ఇళ్లలో ఇంకుడు గుంతలకు డబ్బులు వసూళ్లు చేసి ఇప్పటివరకు ఒక్క ఇంకుడు గుంత నిర్మాణానికి చర్యలు లేవు. ఆదాయ మార్గాలున్నా.. జిల్లా కేంద్రంలో ట్రేడ్ లైసెన్స్‌లు, రెన్యూవల్ పేరి ట కేవలం యేటా రూ.3 నుంచి 4 లక్షలకు వర కు మాత్రమే ఆదాయం తీసుకొస్తున్నారు. కానీ జిల్లాకేంద్రంలో రైస్‌మిల్లులు, పెద్ద పెద్ద షాపింగ్‌మాల్స్, వ్యాపార సముదాయాలు, చిన్నపాటి వ్యాపార దుకాణాలు, షోరూంలు ఇలా 3 వేలకు పైగానే ఉంటాయి. అంటే ఏటా ట్రెడ్ లైసెన్స్ పేరిట సుమారు రూ. 20 లక్షల వరకు ఆదాయం సమకూర్చవచ్చు. కానీ సానిటేషన్ విభాగంలో పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రధాన రోడ్లపై వ్యాపార ప్రకటనల కోసం హోర్డింగ్, బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిపైనా ఏటా ఎలాంటి ఆదాయం సమకూరడం లేదు. మటన్ మార్కెట్ సముదాయం టెండర్లు చేయకపోవడంతో రూ. కోట్లతో ఆదాయం కోల్పోయింది. నిషేధిత ప్లాస్టిక్ బ్యాగులు విక్రయిస్తున్న జరిమానాలు వేయడం లేదు. కలెక్టర్ చొరవ చూపితే.. కలెక్టర్ సత్యనారాయణ గతంలో మున్సిపల్ శాఖలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహించారు. మున్సిపాలిటీపై ఆయనకు చాలానే అనుభవం ఉంది. ఈ బల్దియాపై ప్రత్యేక దృష్టి సారిస్తే పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, సానిటేషన్, నీటి విభాగం, వీధిలైట్లు, రెవెన్యూ విభాగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. -
మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో దూషించుకున్న టీడీపీ, బీజేపీ శ్రేణులు
-
మాంసం దుకాణాల కూల్చివేత
♦ 40 దుకాణాలు నేలమట్టం ♦ భారీగా పోలీసు బందోబస్తు ♦ పంతం నెగ్గించుకున్న పురపాలక సంఘం అధికారులు జయపురం : జయపురం పురపాలక సంఘం అధికారులు మాంసం దుకాణాలను రెండవ దైనిక బజారుకు తరలించాలన్న తమ పట్టుదలను నెగ్గించుకున్నారు. పట్టణంలో మొదటి దైనిక బజారులో ఉన్న చేపలు, మాంసం దుకాణాలను ఈ నెల 15వ తేదీలోగా ఎత్తివేసి రెండవ దైనిక బజారుకు తరలించాలని పురపాలక సంఘం ఆదేశాలు జారీ చేసినా వ్యాపారులు స్పందించలేదు. దీంతో పురపాలక సంఘం అధికారులు శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వెంటనే దుకాణాలను తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు దుకాణదారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఉదయాన్నే పొక్లయినర్లతో సహా మార్కెట్‌కు వచ్చి ఆయా దుకాణాలను కూల్చి నేలమట్టం చేశారు. జయపురం పురపాలక సంఘం కార్యనిర్వాహక అధికారి బాధ్యతలు నిర్వహిస్తున్న జయపురం సబ్ కలెక్టర్ చక్రవర్తి సింగ్ రాథోర్ పోలీసు బలగాలతో, మున్సిపాలిటీ సిబ్బందితో వచ్చి బిద్యాధర సింగ్ దవేవ్ దైనిక బజారులో మాంసాలు అమ్మకాల కోసం గతంలో ఏర్పాటు చేసిన దుకాణాలను పడగొట్టించారు. ఈ మార్కెట్లో మాంసం, చేపలు, ఎండు చేపలు అమ్మే దాదాపు 40 దుకాణాలను ఆదివారం నేలకూల్చారు. ఉదయం బోరున వర్షం పడుతున్నా దుకాణాలను నేలమట్టం చేశారు. ఈ ఆపరేషన్‌కు ఎవరూ అంతరాయం కలిగించకుండా మార్కెట్ ప్రవేశమార్గం వద్ద అధిక సంఖ్యలో పోలీసులు మోహరించి ఎవరినీ లోనికి వెళ్లనీయలేదు. కేవలం పత్రికల వారిని మాత్రం లోనికి అనుమతించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రాథోర్ పోలీసు అధికారులతో చర్చించారు. ఈ ఆపరేషన్‌ను మున్సిపాలిటీ హెల్త్ ఆఫీసర్ అరుణకుమార్ పాఢీ, మున్సిపాలిటీ ఇంజినీర్, పోలీసు అధికారులు పర్యవేక్షించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా దుకాణాలు కూల్చే ఆపరేషన్ ముగిసింది. రెండవ దైనిక బజారుకు వెళ్లాలంటే కష్టమే పట్టణ నడిబొడ్డున ఉన్న బిద్యాదర్ దైనిక బజారులో అనేక దశాబ్దాలుగా ఉన్న మాంస దుకాణాలను రెండవ దైనిక బజారుకు తరలించటంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఈ చర్య మంచిదే అయినా రెండవ దైనిక బజారుకు తరలించటంతో పట్టణంలోని దాదాపు 70 శాతం మంది ప్రజలకు మార్కెట్ దూరం అవుతుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అంత దూరం వెళ్లాలి అంటే కష్టం అని అందుచేత పట్టణ ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు మాంసం చేపల దుకాణాలు ఏర్పాటు చేయాలని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. గాంధీ జంక్షన్, ప్రసాదరావుపేట, కెల్లానగర్, సాంబారు తోట, డెప్పిగుడ, కరణం వీధి, లేబర్ కాలనీ, పారాబెడ, నారాయణతోట వీధి, గైడ వీధి, మహారాణిపేట, భ««ధ్య వీధి, భూపతి వీధి, భోయివీధి, మిల్లు వీధి, జైలు రోడ్డు మొదలగు అనేక ప్రాంతాల నుంచి రెండవ దైనిక బజారుకు వెళ్లాలంటే ఆటోలపైనే వెళ్లాలని, ఇది ప్రజలకు వ్యయంతో కూడినది అని అంటున్నారు. అంతేకాకుండా రెండవ దైనిక బజారు రోడ్డు చాలా ఇరుకుగా ఉండటంతో వాహనాలు వెళ్లేందుకు ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందని అభిప్రాయ పడుతున్నారు. అందుచేత ప్రసాదరావుపేట, గాంధీ జంక్షన్, పారాబెడ, మొదలగు ప్రాంతాలలో మత్స్య మాంస దుకాణాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
రిజిస్ట్రేషన్లలో నోటరీలకు స్వస్తి!
మున్సిపాల్టీల్లో మార్టిగేజ్ రిజిస్ట్రేషన్లపై స్పష్టత ఇచ్చిన రిజిస్ట్రేషన్ల శాఖ సాక్షి, హైదరాబాద్: పురపాలక సంఘాల్లో భూమి/భవ నాల తనఖాకు సంబంధించి నోటరీలు చెల్లవని రిజిస్ట్రే షన్ల శాఖ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి 2013 డిసెంబర్లోనే ఉత్తర్వులిచ్చినా అమలుకు నోచుకోవడం లేదు. రిజిస్ట్రేషన్ల శాఖకు వార్షికాదాయం తగ్గడానికి ఇది కూడా కారణమని గ్రహించిన ఉన్నతాధికారులు తాజాగా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇకపై పట్టణ ప్రాంతాల్లోని ఏ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ నోటరీలను పరిగ ణలోకి తీసుకోవద్దని సబ్రిజిస్ట్రార్లకు ఆదేశాలిచ్చారు. ఏదైనా భవన నిర్మాణానికి పురపాలక సంఘాల నుంచి అనుమతి తీసుకునేటప్పుడు నిబంధనల ప్రకారం 10 శాతం భూమి లేదా భవనాన్ని సదరు మున్సిపాలిటీకి మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంప్‌డ్యూటీ రూ.5వేలతో పాటు మార్కెట్ వాల్యూలో 0.5శాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. 2013కు ముందు భవన నిర్మాణ అనుమతి కోసం పురపాలక సంఘాలకు దరఖా స్తు చేసుకునే యజమానులు 10 శాతం భూమి/భవనాన్ని తనఖా పెట్టినట్లుగా నోటరీ చేయించేవారు. 2013 తరువాత కూడా ఇది కొనసాగించడం వల్ల శాఖ ఆదాయానికి గండి పడుతోంది. దీంతో శాఖ తాజా నిర్ణయం తీసుకుంది. -
వంద ‘ఫీట్ల’ విస్తరణ
► ఇష్టారాజ్యంగా పనులు ► అనధికారికంగా ఇరువైపులా కలిపి 80 ఫీట్లకే కుదింపు ► డ్రెయినేజీ నిర్మాణంలోనూ నిబంధనలు గాలికి.. గోదావరిఖని: రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి ఫైవింక్లయిన్ చౌరస్తా వరకు ప్రధాన రహదారిని విస్తరించాలని గతంలో నిర్ణయించారు. ఈమేరకు 2015 ఫిబ్రవరి 28న జరిగిన సాధారణ సమావేశంలో పాలకవర్గం తీర్మానించింది. జీవో 199, ఎంఏ 11–05–2001 ప్రకారం వంద ఫీట్ల వెడల్పుతో విస్తరించనున్నట్లు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. తారు రోడ్డు నిర్మాణం చేపట్టిన సింగరేణి గోదావరిఖని పట్టణంలో 3.1 కిలోమీటర్ల మేర ఉన్న ప్రధాన రహదారిని విస్తరించేందుకు పాలకవర్గంతోపాటు ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, కార్మిక సంఘాల నాయకులు సింగరేణి యాజమాన్యాన్ని రహదారి పనులు చేపట్టాలని కోరడంతో అంగీకరించింది. రూ.6.50 కోట్లను విడుదల చేయడంతో మంచిర్యాలకు చెందిన కాంట్రాక్టర్ ద్వారా రూ.5.75 కోట్ల మేరకు తారురోడ్డు పనులను పూర్తి చేయించారు. మొత్తం వంద ఫీట్ల రోడ్డు విస్తరణలో డివైడర్ నుంచి ఇరువైపులా 50 ఫీట్ల రోడ్డులో 25 ఫీట్ల మేర సింగరేణి ఆధ్వర్యంలో తారురోడ్డు నిర్మించారు. మిగతా 25 ఫీట్లలో ఇరువైపులా ఎవరు రహదారిని ఆక్రమించకుండా చివరలకు ఐదు ఫీట్ల వరకు రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో డ్రెయినేజీని నిర్మించాలకి నిర్ణయించారు. తారు రోడ్డుకు, డ్రెయినేజీ నిర్మాణానికి మధ్యలో ఉన్న 20 ఫీట్లమట్టి రోడ్డును ఖాళీగానే వదిలి పెట్టాలి. ఏం జరుగుతుంది...? కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రూ.రెండు కోట్ల 92 లక్షల 50వేల కార్పొరేషన్ నిధులతో రహదారికిరువైపులా వర్షపు నీరు వెళ్లేందుకు 2016 మే 1న డ్రెయినేజీ పనులకు రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రధాన చౌరస్తా సమీపం వరకు అక్కడక్కడ పనులు చేపట్టగా...అవి అస్తవ్యస్తంగా మారాయి. కార్పొరేషన్ కార్డుల్లో వంద ఫీట్ల రహదారి విస్తరణ చేపట్టి అందుకనుగుణంగా డ్రెయినేజీ పనులు చేస్తున్నట్లు నమోదు చేసినా... వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. సాక్షాత్తు కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోనే రహదారి విస్తరణ 80 ఫీట్లకు కుదించగా...డ్రెయినేజీ పనులూ ఇరువైపులా వేర్వేరుగా సాగుతున్నాయి. కార్పొరేషన్ కార్యాలయం, రాజేశ్ టాకీస్ ఏరియా, గాంధీనగర్ వద్ద, టీఎన్ టీయూసీ కార్యాలయం వద్ద డ్రెయినేజీ పనులను ఒక్కోక్క చోట 40 నుంచి 50 ఫీట్లుగా మార్కింగ్ చేసి చేపట్టారు. దీంతో కాలువ వంకరటింకరగా మారింది. జూనియర్ కళాశాల ఎదురుగా ఒక వైపు డ్రెయినేజీ పనులు ఎక్కువ వెడల్పుతో, మరో వైపు రహదారిపై ఉన్న నిర్మాణాలకు నష్టం కలగకుండా తక్కువ వెడల్పుతో నిర్మించారు. ఇలా ఒకే రహదారిపై ఒక్కో చోట రహదారి కుదించుకుపోవడం అనుమానాలకు తావిస్తోంది. సింగరేణి ప్రహరీని ముట్టుకోని కార్పొరేషన్ రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా సింగరేణి యాజమాన్యం కార్మికుల కోసం క్వార్టర్లను నిర్మించింది. ఈక్రమంలో బయటివ్యక్తులు సింగరేణి స్థలంలో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారనే ఉద్దేశంతో క్వార్టర్ల చుట్టూ ప్రహరీ నిర్మించింది. అయితే వంద ఫీట్ల రహదారిని విస్తరించే క్రమంలో సింగరేణి ప్రహరీఅడ్డురావడంతో దానిని కూల్చివేయడానికి కార్పొరేషన్ యంత్రాంగం మార్కింగ్ చేసింది. ఇదిలా ఉండగా...ఈ గోడ ఎత్తు పెంచేందుకుగాను కార్పొరేషన్ అనుమతినివ్వాలని కోరుతూ సింగరేణి ఆర్జీ–1 జీఎం 2015 నవంబర్ 19న కార్పొరేషన్ కమిషనర్‌కు లేఖ రాశారు. కానీ వందఫీట్లతో రహదారిని విస్తరిస్తున్నందున అడ్డుగా ఉన్న ప్రహరీని కూల్చివేయాలని, ప్రస్తుతం దాని ఎత్తు పెంచేందుకు వీలు లేదంటూ కార్పొరేషన్ నుంచి సింగరేణికి లేఖ పంపించారు. ప్రస్తుతం రహదారి విస్తరణలో సింగరేణి ప్రహరీగోడను కూల్చకపోగా.. దానికి అనుకుని ఉన్న డ్రెయినేజీ కాల్వనే కొనసాగించడం గమనార్హం. పేరుకు వంద ఫీట్లతో కాగితాలపై రాసుకున్న పాలకవర్గం ఆచరణలో 80 ఫీట్లు, అంతకన్నా తక్కువగా విస్తరించడం, డ్రెయినేజీ పనులు అస్తవ్యస్తంగా, ఇష్టారాజ్యంగా చేపట్టడం ప్రమాదాలను నెలవుగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు రాజేశ్ టాకీస్ నుంచి మార్కండే కాలనీమీదుగా అడ్డగుంటపల్లి వరకు రహదారి విస్తరణలో భవనాలను బలవంతంగా కూల్చివేయిస్తున్న పాలకవర్గం మరోవైపు కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఫైవింక్లయిన్ చౌరస్తా వరకు ఇష్టంవచ్చినట్టుగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. -
మిర్యాలగూడలో రియల్ దందా..
► జోరుగా అనధికార లే అవుట్లు ► కొరవడిన అధికారుల పర్యవేక్షణ ► మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి జోరుగా అనధికార లే అవుట్లు మిర్యాలగూడను నల్లగొండ జిల్లాలోనే కొనసాగించాలని అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం.. ఇప్పటికే వ్యాపార పరంగా అభివృద్ధి చెందడంతో ఈ పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ జోరందుకుంది. వ్యాపారులు పట్టణ పరిసరాల్లోని పంట పొలాలను అనుమతులు లేకుండానే అనధికార లే అవుట్లుగా మార్చారు. వాటిని ప్లాట్లుగా విభజించి విక్రయిస్తూ రూ. కోట్లు గడిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో మున్సిపల్ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. - మిర్యాలగూడ :- మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలను మళ్లీ రియల్ భూతం వెంటాడుతోంది. పట్టణ చుట్టు పక్కన ఉన్న పంట పొలాలు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల గుప్పిట్లో ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే వాటిని ప్లాట్లుగా విభజించి ఆకర్షవంతమైన ప్రకటనలో వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. రూ.లక్షలకు కొనుగోలు చేసిన పొలాలను ప్లాట్లుగా చేసి రూ.కోట్లు గడిస్తున్నారు. పట్టణ పరిసర ప్రాంతాలలోని అద్దంకి - నార్కట్‌పల్లి రహదారి వెంట, తాళ్లగడ్డ, బాపూజీనగర్, ఏడుకోట్లతండా సమీపంలో అనుమతి లేని వెంచ ర్లు వెలుస్తున్నా యి. వెంచర్లలో మున్సిపల్ అధికారు లు గుర్తిం చకుం డా రా ళ్లను భూమిలోపలికి పాతి ప్లాట్ల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం లేఅవుట్లో పది శాతం భూమిని మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేయా ల్సి ఉంది. అలా చేయకుండానే మొత్తం స్థలాన్ని ప్లాట్లుగా విభజించి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. 150 గజాల స్థలం రూ.నాలుగు నుంచి ఐదు లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. అనధికారిక లేఅవుట్ల కారణంగా మున్సిపాలిటీకి చెందాల్సిన స్థలం రాకపోవడంతో పాటు పన్ను రూపంలో రావల్సిన ఆదాయం కూడా కోల్పోవాల్సి వస్తోంది. అధికారుల అండదండలు..? పట్టణంలో జోరుగా సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అధికారుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. అనధికారిక లే అవుట్ల యాజమాన్యాలపై మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. పురపాలక సంఘం చట్టం 1965 సెక్షన్ 184, 185 ప్రకారం అనధికారిక లే అవుట్ల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవల్సి ఉంది. కానీ అధికారులు గతంలో అనుమతి లేని లే అవుట్ల వద్ద కొలత రాళ్లను తీసివేసి చేతులు దులుపుకున్నారు. కానీ తిరిగి యథావిథిగా లే అవుట్ల వ్యాపారం జరుగుతూనే ఉంది. 13 అనధికారిక వెంచర్లు మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాల్లో 13 అనధికారిక వెంచర్లు వెలిసినట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. ఈ వెంచర్లలో సుమారుగా 30 ఎకరాల వరకు పంట పొలాలను ప్లాట్లుగా విభజించినట్లు తెలిసింది. అనధికారిక వెంచర్ల వల్ల మున్సిపాలిటీకి చెందాల్సిన 10 శాతం భూమితో పాటు ఎకరానికి రూ.30 వేల ఆదాయం పన్ను రూపంలో రావల్సింది కోల్పోతున్నారు. 30 ఎకరాలకు గాను మున్సిపల్ అధికారులు సుమారుగా 10 లక్షల ఆదాయం కోల్పోయారు. అనధికారికంగా వెలిసిన వెంచర్లలో 2015కు ముందుగా కొనుగోలు చేసిన వారు మున్సిపల్ స్థలాల క్రమబద్ధీకరణలో భాగంగా మున్సిపాలిటీకి దరఖాస్తులు పెట్టుకున్నారు. దాని ద్వారా సుమారుగా మూడు కోట్ల రూపాయల ఆదాయం లభించింది. కానీ 2015 తర్వాత వెలిసిన వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి మున్సిపాలిటీ వారు ఇంటి నిర్మాణానికి అనుమతులు కూడా ఇవ్వడం లేదు. లే అవుట్లకు ఉండాల్సిన నిబంధనలు: ► మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం ఉండాలి. ► రోడ్లకు, పాఠశాల బిల్డింగ్‌కు, పార్కు, ఇతర సౌకర్యాల కోసం 10 శాతం భూమిని మున్సిపాలిటీ పేర రిజిస్ట్రేషన్ చేయాలి. ► మంచినీటి వసతికి ట్యాంకు నిర్మించాలి. ► రోడ్లు, వీధి దీపాలు, మురుగు కాలువలు నిర్మించాలి. ► ఇవన్నీ ఏర్పాటు చేశాక లేఅవుట్ల కోసం మున్సిపల్ కార్యాలయంలో తగిన ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ► డెరైక్టర్ ఆఫ్ టౌన్ కంట్రోల్ ప్లానింగ్ అనుమతితో వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తారు. నోటీసులు జారీ చేస్తాం పట్టణంలో అనుమతి లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తే నోటీసులు జారీ చేస్తాము. 2015 తర్వాత అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే ఇంటి నిర్మాణానికి మున్సిపాలిటీ అనుమతులు నిలిపివేశాము. 2015కు ముందుగా అనుమతి లేని వెంచర్లలో కొనుగోలు చేసిన వారికి మాత్రం ప్రభుత్వ నిబంధనల మేరకు రెగ్యులరైజేషన్ కింద దరకాస్తులు తీసుకున్నాము. అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దు. అన్ని అనుమతులు ఉన్న ప్లాట్లలో కొనుగోలు చేయాలి. - కందుల అమరేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, మిర్యాలగూడ -
పాలకొల్లు మున్సిపల్ సమావేశంలో రభస
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. శనివారం జరిగిన ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రత్యేక అధికారులు అమలు చేసిన గ్రాంట్లను టీడీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ రద్దు చేయగా, వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్లు అధికార పక్షాన్ని నిలదీశారు. ఇరు పక్షాల మధ్య వాగ్వాదం జరగడంతో సమావేశం గందరగోళంగా మారింది. -
పావనపర్వానికి పటిష్టమైన ఏర్పాట్లు
సాక్షి, రాజమండ్రి :గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది జరిగే పుష్కరాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండ మాణిక్యాలరావు ఉభయగోదావరి జిల్లాల అధికారులను ఆదేశించారు. పుష్కర సన్నాహకంగా తొలి సమావేశాన్ని ఆదివారం రాజమండ్రి నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో రెండు జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించారు. పుష్కరాలకు దక్షిణ భారతం నుంచే కాక ఉత్తరాది రాష్ట్రాల నుంచీ భక్తులను ఆహ్వానించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి చెప్పారు. గత పుష్కరాల కన్నా రెట్టింపు భక్తులు తరలి వస్తారని అంచనాలు వేస్తున్నందున వర్షాలు కురిసినా, వరద వచ్చినా భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. గత పుష్కరాల్లో పని చేసిన అధికారుల సూచనలు తీసుకోవాలని, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను సంప్రదించాలని సూచించారు. పుష్కరాల కోసం నియమించనున్న మంత్రుల కమిటీ ఈ నెల 8న రాజమండ్రిలో సమావేశం అయ్యే అవకాశం ఉందని, ఆలోగా అన్ని శాఖల అధికారులు నివేదికలను తయారు చేయాలని ఆదేశించారు. భక్తులకు ఆహారాది సేవలందించేందుకు పలు సేవా సంస్థలు ఇప్పటి కే తనను సంప్రదిస్తున్నాయన్నారు. రాజమండ్రిలో గతంలో ఏర్పాటు చేసినట్టు.. ఈసారి ఉభయగోదావరి జిల్లాల్లోని అన్ని స్నానఘట్టాల వద్ద షవర్ బాత్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. నిధులు కేంద్రం ఇచ్చినా, రాష్ట్రానివైనా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేని రీతిలో పుష్కరాల నిర్వహణ ఉంటుందని హామీ ఇచ్చారు. రెండు కోట్ల మంది వస్తారని అంచనా.. వివిధ శాఖల అధికారులు వారంలోగా నివేదికలు సిద్ధం చేస్తే వాటిని పరిశీలించి సాధ్యమైనంత త్వరగా తుదిరూపు ఇవ్వడానికి వీలవుతుందని తూర్పుగోదావరి కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ అన్నారు. ఈ పుష్కరాలకు కనీసం రెండుకోట్లమంది వస్తారని అంచనా వేస్తున్నారని, వారికోసం కొత్త ఘాట్ల నిర్మాణం అవసరమని పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఘాట్లలో కొన్నింటిని పునర్నిర్మించాలని, కొత్తగా తొమ్మిది నిర్మించాల్సి ఉందని ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదించినట్టు చెప్పారు. గత పుష్కరాలకు ఏ శాఖకు నిధులెన్ని వచ్చాయి, ఇప్పుడెన్ని కావాలి అనే అంశాలను నివేదికల్లో స్పష్టంగా పొందుపరచాలన్నారు. ప్రభుత్వం అందించే నిర్ణీత ప్రొఫార్మాలోనే ప్రతిపాదనలు అందించాలన్నారు. రెండు జిల్లాల ప్రతిపాదనల ఆధారంగా సంయుక్తంగా కార్యాచరణ చేపట్టనున్నట్టు చెప్పారు. త్వరలో మరో సమావేశం.. పశ్చిమగోదావరి జిల్లాలో గత నెల 31న తొలి సమావేశం నిర్వహించామని ఆ జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ వెల్లడించారు. త్వరలో మరో సమావేశం ఏర్పాటుచేసి తుది నివేదికలు తీసుకుంటామన్నారు. తర్వాత రెండు జిల్లాల కలెక్టర్లు సమావేశమై ప్రతిపాదనలను ఖరారు చేస్తామన్నారు. కార్పొరేషన్ నుంచి మెరుగైన సేవలు..కార్పొరేషన్ పరంగా అందించే సేవలను మెరుగుపరుస్తామని రాజమండ్రి మేయర్ పంతం రజనీ శేషసాయి చెప్పారు. ప్రభుత్వపరమైన ఏర్పాట్లను ఘనంగా చేపట్టాలని మంత్రిని కోరారు. పుష్కరాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలని రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మంత్రిని కోరారు. తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు, రాజమండ్రి ఆర్డీఓ నాన్‌రాజు, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, రెండు జిల్లాల పంచాయతీరాజ్, ఆర్టీసీ, ఆర్అండ్బీ, విద్యుత్తు, పోలీసు, వైద్య, ఆరోగ్య తదితర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రణాళికాబద్ధంగా నివేదికలివ్వండి.. గత పుష్కరాలలో పశ్చిమగోదావరి జాయింట్ కలెక్టర్‌గా పనిచేసి ఇప్పుడు దేవాదాయ శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న అనూరాధ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఆర్థిక మంత్రి అధ్యక్షతన ప్రభుత్వం ఐదుగురు కేబినెట్ మంత్రులతో సబ్ కమిటీ వేస్తోంది. వివిధ శాఖల కార్యదర్శి స్థాయి అధికారులతో కూడా రాష్ట్ర స్థాయి అధికారిక కమిటీనీ నియమిస్తున్నారు. రెండు జిల్లాల్లో జిల్లాలవారీగా ప్రజా ప్రతినిధులతో ఒక కమిటీ, కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల కమిటీలు వేస్తారు. పుష్కర తేదీల నిర్ణయంలో తర్జనభర్జనలతో నిమిత్తం లేకుండా పనులను చేపట్టాలి. పితృదేవతలకు తర్పణాలు ఇచ్చే వస్తువుల ధరలు గతంలో ఆకాశాన్నంటాయి. ఈసారి మార్కెట్ కమిటీలతో చర్చించి నిర్ణీత ధరలకు అందించే ఏర్పాటుచేయాలి. తూర్పుగోదావరిలో 81, పశ్చిమాన 50 ఘాట్ల జాబితా అధికారులు ఇచ్చారు. వీటిలో కొన్నింటిని భవిష్యత్తు అవసరాలకు కూడా ఉపయోగపడేలా అభివృద్ధి చేసుకోవాలి. పుష్కరాలను ఓ అవకాశంగా భావించి అవసరమైన పనులతోపాటు అవసరం లేని పనులను అనుబంధంగా ప్రతిపాదించవద్దు. గతంలో ఇలాంటి పనులు నిధుల్లేక అసంపూర్తిగా నిలిచిపోయాయి. పనుల్లో ఆర్భాటం, అందం వంటి వాటి కన్నా వసతులు, భక్తుల సౌకర్యాలకే పెద్దపీట వేయాలి. వరదలు వస్తాయని భావించి వాటికి అనుగుణంగానే బారికేడ్లు నిర్మించాలి. ఘాట్లలో మూడంచెల భద్రతను అమలు చేయాలి. భక్తుల విశ్వాసాలు, అవసరాలను ప్రాధాన్యంగా పరిగణించి ఆలయాలను అభివృద్ధి చేయాలి. దేశంలోని వివిధ ప్రాంతాల సాంప్రదాయాలకు అద్దం పట్టేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కళాకారులను ముందు నుంచే గుర్తించాలి. ఒకేసారి వివిధ సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలి. భక్తులతోపాటు వివిధ ప్రాంతాలనుంచి వచ్చి విధులు నిర్వహించే ఉద్యోగులపై కూడా దృష్టిపెట్టాలి. అర్చకులు ఎవరు ఏయే ఘాట్లలో ఉండాలి, ఏ సేవకు ఎంత మొత్తం వసూలు చేయాలో ధరలు, జాబితాలు దేవాదాయ శాఖ అధికారులు ముందుగానే తయారుచేసి ఉంచాలి. ట్రాఫిక్, యాత్రికుల భద్రత తదితర రక్షణ చర్యలను పోలీసుశాఖ ఓ ప్రణాళికతో అమలు చేయాలి. -
ఇసుక అక్రమార్కులపై చర్యలు
తాండూరు: ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నిర్వహించిన తాండూరు మున్సిపల్ కౌన్సిల్ తొలి సాధారణ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తాండూరులోని కాగ్నా నది (వాగు) నుంచి ఇసుక తవ్వకాలను అరికట్టేలా అధికారులను ఆదేశిస్తామన్నారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే ఉపేక్షించమని,వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. జిల్లాలోనే ప్రముఖ వ్యాపార కేంద్రమైన తాండూరులో సిమెంట్ కంపెనీలు, నాపరాతి పరిశ్రమలు అధికంగా ఉన్నాయన్నారు. ఉత్పత్తులు, ఇతర సరుకుల రవాణా కోసం తాండూరుకు నిత్యం వందలాది లారీలు రాకపోకలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. లారీలు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నందున ట్రాఫిక్ సమస్యతోపాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రమాదాలు తగ్గించి, ట్రాఫిక్ సమస్య ను పరిష్కరించేందుకు తాండూరులో ఔట ర్ రింగురోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. ఇందుకు సు మారు రూ.50 కోట్లు అవసరమవుతాయని మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారన్నారు. రూ.80 కోట్ల కేంద్రం నిధులతో కోట్‌పల్లి ప్రాజె క్టు నుంచి తాం డూరు పట్టణంలోని అన్ని వార్డులకు తాగునీరు సరఫరా మెరుగు పర్చడం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి ఈ నిధులు త్వరగా మంజూరయ్యేలా చూస్తానన్నారు. కాగ్నాలో రూ.8.52కోట్లతో చెక్‌డ్యాం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమయ్యేలా చూస్తానన్నారు. తాండూరులో ప్రొ.జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పట్టణ మధ్యలో ఉన్న లారీ పార్కింగ్‌కు అవసరమైన స్థలం కేటాయిస్తామన్నారు. ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ సీఎం కేసీఆర్ కచ్చితంగా నెరవేరుస్తారన్నారు. ఎంత భారం పడినా, ఇబ్బందులు వచ్చినా తెలంగాణ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందన్నారు. పల్లెలు,పట్టణాల్లో చిన్న ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. జిల్లా,ఏరియా ఆస్పత్రుల్లో వైద్యుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ‘మన ఊరు-మన ప్రణాళిక’లో గుర్తించిన ప్రజల అవసరాలను ఐదేళ్లలో ప్రణాళిక బద్ధంగా తీర్చడం జరుగుతుందన్నారు. మున్సిపాలిటీలతోపాటు గ్రామాల అభివృద్ధికి పాటుపడతానన్నారు. జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధికి జిల్లా పరిషత్ నుంచి నిధులు కేటాయిస్తామన్నారు. తాండూ రు మున్సిపాలిటీకి సుమారు రూ.56లక్షలు, వికారాబాద్‌కు రూ.70లక్షల బీఆర్జీఎఫ్ నిధులను మంజూరు చేయనున్నట్టు ఆమె చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ గోపయ్య తదితరులు పాల్గొన్నారు.