పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది.
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. శనివారం జరిగిన ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది.
ప్రత్యేక అధికారులు అమలు చేసిన గ్రాంట్లను టీడీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ రద్దు చేయగా, వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్లు అధికార పక్షాన్ని నిలదీశారు. ఇరు పక్షాల మధ్య వాగ్వాదం జరగడంతో సమావేశం గందరగోళంగా మారింది.