అధికార పార్టీ.. నీటి రాజకీయాలు
పాలకొల్లు: పాలకొల్లు మున్సిపాలిటీలో అధికారిక పార్టీ నీటి రాజకీయాలు చేస్తోంది. ఎండాకాలం కావడంతో నీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజల కష్టాలను చూసి వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్ ఉచిత వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. దీంతో అధికార పార్టీలు నేతలు అతనిపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఆ వాటర్ ట్యాంక్ పై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బొమ్మ ఉండటంతో మున్సిపాలిటీ వాళ్లు నీరు ఇవ్వమన్నారు. టీడీపీ నేతల ఒత్తిడితో కౌన్సిల్ నీరు ఇవ్వమని తీర్మానం చేశారు.
అదే అధికార పార్టీ ఎమ్మెల్యే రామానాయుడు ధర్మారావు ఫౌండేషన్ పేరుతో చంద్రబాబు, లోకేష్ బొమ్మలతో తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయినా అధికార పార్టీ కాబట్టి అధికారులు పట్టించుకోకుండా చూసి చూడనట్టు వదిలేశారు. చివరకు నీటి సరఫరా విషయంలో కూడా అధికార పార్టీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షం విమర్శించింది. అధికార పార్టీకి ఒక న్యాయం, మాకు మరో న్యాయమా అని ప్రతిపక్షం అధికారులను ప్రశ్నించింది. అధికార పార్టీ చేస్తున్న కక్ష సాధింపులపై పాలకొల్లు ప్రజలు తీవ్ర .అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.