Water issue
-
ఢిల్లీ: కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా ఇరుకునపెట్టారు. అసలే కష్టాల్లో ఉన్న ఆయనను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో ఉన్న మంచి నీటి సమస్యపై కేజ్రీవాల్‌కు మంగళవారం(ఏప్రిల్16) ఒక బహిరంగ లేఖ రాశారు. గత పదేళ్ల నుంచి ఢిల్లీ మంచి నీటి సమస్యను తీర్చడానికి ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో ఎల్జీ విమర్శించారు. ప్రస్తుతం వచ్చిన మంచినీటి సమస్య సడెన్‌గా రాలేదని, ప్రతి ఏడాది ఈ సమస్య వస్తోందని గుర్తు చేశారు. మంచినీటి సమస్యపై గతంలో మీడియా ప్రచురించిన కథనాలను లేఖకు ఎల్జీ జత చేశారు. మంచి నీటి సరఫరా విషయంలో ఢిల్లీ కంటే ముంబై,చెన్నై,పుణె నగరాలు బెటర్‌గా ఉన్నాయని తెలిపారు. కాగా, లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదీ చదవండి.. నా షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయ్.. కోర్టులో కేజ్రీవాల్ -
కృష్ణా జలాలు తీసుకుంది చాలు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగం విషయంలో తెలంగాణ రాష్ట్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి నీళ్లను తీసుకోవడాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని తెలంగాణ రాష్ట్రాన్ని కృష్ణా నదీయాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) ఆదేశించింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్యులు డాక్టర్ ఆర్ఎన్ శంఖువా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఈ నెల 2న లేఖ రాశారు. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ జరిపిన కేటాయింపులకు మించి 7.391 టీఎంసీ లను తెలంగాణ వాడుకుందని ఫిర్యాదు చేస్తూ ఈ నెల 1న ఏపీ రాసిన లేఖకు స్పందించి ఆయన ఈ లేఖ రాయడం గమనార్హం. ఉభయ జలాశయాల్లో నిల్వలు అడుగంటిపోవడంతో మిగిలిన కొద్దిపాటి జలాలను తాగునీటి అవసరాలకు వాడుకొనే విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరింది. కృష్ణాబోర్డుపై తెలంగాణ గరం.. శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి కేటాయింపులకు మించి 7.391 టీఎంసీలను తెలంగాణ వాడుకున్నట్టు ఏపీ చేసిన ఆరోపణలతో ఏకీభవిస్తూ కృష్ణాబోర్డు తెలంగాణను కట్టడి చేసేందుకు తాజాగా చర్యలు చేపట్టింది. మరోవైపు ఈ వ్యవహారంలో కృష్ణాబోర్డు తీరు పట్ల తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. త్వరలో రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కృష్ణాబోర్డుకు తమ నిరసనను తెలుపుతూ లేఖ రాయనున్నట్టు తెలిసింది. కృష్ణా ట్రిబ్యునల్–1 అవార్డు ప్రకారం శ్రీశైలం, సాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం వాడుకున్న జలాల్లో 20శాతాన్ని మాత్రమే లెక్కించాల్సి ఉండగా, 100 శాతం జలాలను కృష్ణాబోర్డు లెక్కించడాన్ని చాలాకాలంగా తెలంగాణ తప్పుబట్టుతోంది. ఈ వాదనలను ఇప్పటికే కృష్ణాబోర్డు తిరస్కరించింది. 2022–23లో తమ రాష్ట్రానికి కేటాయించిన జలాల్లో 18.701 టీఎంసీలను వాడుకోకుండా నాగార్జునసాగర్‌లో నిల్వ చేసుకున్నామని, ఆ నీళ్లను ప్రస్తుత నీటి సంవత్సరం 2023–24లో సైతం తమ రాష్ట్రానికి పునః కేటాయింపులు(క్యారీ ఓవర్) జరపాలని తెలంగాణ చేసిన మరో డిమాండ్‌ను సైతం కృష్ణాబోర్డు తిరస్కరించింది. ఈ రెండు డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని రెండు రాష్ట్రాల నీటి వినియోగం లెక్కలను పునఃసమీక్షిస్తే తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఇంకా మిగిలి ఉంటాయని, ఏపీ కేటాయింపులకు మించి వాడుకున్నట్టు తేలుతుందని తెలంగాణ వాదిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో కనీసం 18.7 టీఎంసీల జలాలు ఇంకా తమకు రావాల్సి ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు లెక్క తేలి్చనట్టు సమాచారం. 2022–23లో సైతం ఏపీ కేటాయింపులకు మించి 51.745 టీఎంసీలను వాడుకుందని తెలంగాణ ఆరోపిస్తోంది. నేటి త్రిసభ్య కమిటీ భేటీకి రాలేం ఏపీ విజ్ఞప్తి మేరకు గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణాబోర్డు.. త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించతలపెట్టగా, ఈ సమావేశానికి రాలేమని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తెలియజేశాయి. సమావేశాన్ని వాయిదా వేయాలని కోరినట్టు తెలిసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయిన నేపథ్యంలో రానున్న కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కృష్ణాబోర్డు భావిస్తోంది. త్రిసభ్య కమిటీ కనీ్వనర్‌గా కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పూరే, సభ్యులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్సీలు ఉంటారు. ఆ 8 టీఎంసీలు తెలంగాణకు కావాలి నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 512.5 అడుగులకు పడిపోగా నిల్వలు 136.95 టీఎంసీలకు తగ్గిపోయాయి. నాగార్జునసాగర్ కనీస నిల్వమట్టం(డెడ్ స్టోరేజీ) 505 అడుగులు కాగా, బుధవారం నాటికి జలాశయంలో కనీస నిల్వమట్టానికి ఎగువన వాడుకోవడానికి వీలుగా 13.617 టీఎంసీలు మాత్రమే లభ్యతగా ఉన్నాయి. ఏపీ చేసిన విజ్ఞప్తి మేరకు ఆ రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి కుడి ప్రధాన కాల్వకు ఈ నెల 8 నుంచి 5 టీఎంసీల జలాలను విడుదల చేసినా, మిగిలిన 8.61 టీఎంసీలను హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు కేటాయించడానికి వీలుంటుందని తెలంగాణ నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం దృష్టికి కృష్ణా జలాల పంచాయితీ శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో మిగిలి ఉన్న కొద్దిపాటి నిల్వల వినియోగం విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాన్ని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని తాజాగా కృష్ణాబోర్డు నిర్ణయించింది. ఈ విషయంలో తదుపరి కార్యాచరణను సూచించాలని విజ్ఞప్తి చేస్తూ జలశక్తి శాఖకు కృష్ణాబోర్డు లేఖ రాయనున్నట్టు తెలిసింది. ఈ నెల 1న ఏపీ రాసిన లేఖకు స్పందించి ఆయన ఈ లేఖ రాయడం గమనార్హం. ఉభయ జలాశయాల్లో నిల్వలు అడుగంటిపోవడంతో మిగిలిన కొద్దిపాటి జలాలను తాగునీటి అవసరాలకు వాడుకొనే విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరింది. కృష్ణాబోర్డుపై తెలంగాణ గరం.. శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి కేటాయింపులకు మించి 7.391 టీఎంసీలను తెలంగాణ వాడుకున్నట్టు ఏపీ చేసిన ఆరోపణలతో ఏకీభవిస్తూ కృష్ణాబోర్డు తెలంగాణను కట్టడి చేసేందుకు తాజాగా చర్యలు చేపట్టింది. మరోవైపు ఈ వ్యవహారంలో కృష్ణాబోర్డు తీరు పట్ల తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. త్వరలో రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కృష్ణాబోర్డుకు తమ నిరసనను తెలుపుతూ లేఖ రాయనున్నట్టు తెలిసింది. కృష్ణా ట్రిబ్యునల్–1 అవార్డు ప్రకారం శ్రీశైలం, సాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం వాడుకున్న జలాల్లో 20శాతాన్ని మాత్రమే లెక్కించాల్సి ఉండగా, 100 శాతం జలాలను కృష్ణాబోర్డు లెక్కించడాన్ని చాలాకాలంగా తెలంగాణ తప్పుబట్టుతోంది. ఈ వాదనలను ఇప్పటికే కృష్ణాబోర్డు తిరస్కరించింది. 2022–23లో తమ రాష్ట్రానికి కేటాయించిన జలాల్లో 18.701 టీఎంసీలను వాడుకోకుండా నాగార్జునసాగర్‌లో నిల్వ చేసుకున్నామని, ఆ నీళ్లను ప్రస్తుత నీటి సంవత్సరం 2023–24లో సైతం తమ రాష్ట్రానికి పునః కేటాయింపులు(క్యారీ ఓవర్) జరపాలని తెలంగాణ చేసిన మరో డిమాండ్‌ను సైతం కృష్ణాబోర్డు తిరస్కరించింది. ఈ రెండు డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని రెండు రాష్ట్రాల నీటి వినియోగం లెక్కలను పునఃసమీక్షిస్తే తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఇంకా మిగిలి ఉంటాయని, ఏపీ కేటాయింపులకు మించి వాడుకున్నట్టు తేలుతుందని తెలంగాణ వాదిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో కనీసం 18.7 టీఎంసీల జలాలు ఇంకా తమకు రావాల్సి ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు లెక్క తేలి్చనట్టు సమాచారం. 2022–23లో సైతం ఏపీ కేటాయింపులకు మించి 51.745 టీఎంసీలను వాడుకుందని తెలంగాణ ఆరోపిస్తోంది. నేటి త్రిసభ్య కమిటీ భేటీకి రాలేం ఏపీ విజ్ఞప్తి మేరకు గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణాబోర్డు.. త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించతలపెట్టగా, ఈ సమావేశానికి రాలేమని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తెలియజేశాయి. సమావేశాన్ని వాయిదా వేయాలని కోరినట్టు తెలిసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయిన నేపథ్యంలో రానున్న కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కృష్ణాబోర్డు భావిస్తోంది. త్రిసభ్య కమిటీ కనీ్వనర్‌గా కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పూరే, సభ్యులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్సీలు ఉంటారు. ఆ 8 టీఎంసీలు తెలంగాణకు కావాలి నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 512.5 అడుగులకు పడిపోగా నిల్వలు 136.95 టీఎంసీలకు తగ్గిపోయాయి. నాగార్జునసాగర్ కనీస నిల్వమట్టం(డెడ్ స్టోరేజీ) 505 అడుగులు కాగా, బుధవారం నాటికి జలాశయంలో కనీస నిల్వమట్టానికి ఎగువన వాడుకోవడానికి వీలుగా 13.617 టీఎంసీలు మాత్రమే లభ్యతగా ఉన్నాయి. ఏపీ చేసిన విజ్ఞప్తి మేరకు ఆ రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి కుడి ప్రధాన కాల్వకు ఈ నెల 8 నుంచి 5 టీఎంసీల జలాలను విడుదల చేసినా, మిగిలిన 8.61 టీఎంసీలను హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు కేటాయించడానికి వీలుంటుందని తెలంగాణ నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం దృష్టికి కృష్ణా జలాల పంచాయితీ శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో మిగిలి ఉన్న కొద్దిపాటి నిల్వల వినియోగం విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాన్ని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని తాజాగా కృష్ణాబోర్డు నిర్ణయించింది. ఈ విషయంలో తదుపరి కార్యాచరణను సూచించాలని విజ్ఞప్తి చేస్తూ జలశక్తి శాఖకు కృష్ణాబోర్డు లేఖ రాయనున్నట్టు తెలిసింది. -
సీతారామ ప్రాజెక్టుతో ఆగస్టు నాటికి సాగునీరు అందించాలి : మంత్రి తుమ్మల
ఖమ్మం: సీతారామ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆగస్టు నాటికి సాగునీరు అందించాలని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. దమ్మపేట మండలం గండుగులపల్లిలోని సీతా రామ లిఫ్ట్ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేసవి కాలంలో మట్టి పనులు పూర్తి చేయాలని, మిగిలిన పనులు వర్షాకాలంలో చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఇతర ప్రాంతాల్లో కూడా కాల్వలు తవ్వే పనులు వేసవికి ముందే పూర్తి చేయాలన్నారు. ఈ క్రమంలో రహదారులు, రైల్వే లైన్లు, అటవీ భూములు, పోడు భూములు, గిరిజనుల సాగులో ఉన్న అటవీ భూముల వంటివి ఏవి ఉన్నా నిర్వాసితులకు పరిహారం కోసం ఉమ్మడి జిల్లాల కలెక్టర్లను సంప్రదించాలని చెప్పారు. కేంద్రం లేదా రాష్ట్రంలో ఏ ప్రభుత్వ శాఖ అనుమతి కావాలన్నా తనను కలవాలని, సంబంధిత మంత్రిత్వ శాఖతో చర్చించి సకాలంలో సాధిస్తానని భరోసా ఇచ్చారు. అనంత రం మ్యాప్ ద్వారా అధికారులు పనుల పురోగతిని వివరించారు. టన్నెళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతోందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించే ఏజన్సీ లను సంప్రదించాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు సూచించారు. రూ.7,500 కోట్లు వెచ్చించినా ఇంకా పనుల్లో జాప్యం తగదన్నారు. ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఏం చేయాలో ఆలోచించి ముందుకు సాగాలని సూచించారు. ఆధునిక సాంకేతికతతో టన్నెళ్ల నిర్మాణం, జెన్కో టెండర్లు, పంపుల నిర్మా ణం వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది 1.50 లక్షల ఎకరాలకు నీరు.. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది 1.50 లక్షల ఎకరాలకు, వచ్చే ఏడాది మరో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి తుమ్మల వివరించారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం ఆయన అక్కడే విలేకరులతో మాట్లాడారు. గోదావరి నది పోలవరం ప్రాజెక్టు వద్ద ఉన్న ఫుల్ రిజర్వాయర్ లెవల్‌కు సమానంగా ప్రాజెక్టు ఎత్తును నిర్వహించడం ద్వారా ఎంత పెద్ద ఉప్పెన వచ్చినా తెలంగాణలో ముంపు ఏర్పడదని అధికారులు చెప్పారు. అనంతరం ఖమ్మం ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదనలను అఽధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా కొత్త కలెక్టరేట్‌కు ఇబ్బంది కాకుండా, మరెవరికీ ఆటంకం కలుగకుండా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలో కొండరెడ్లు 80 ఏళ్ల క్రితం నుంచి ఉంటున్నారని.. వారు అంతరించిపోతున్న తెగగా గుర్తించబడ్డారని.. వారికి రవాణా సౌకర్యం కోసం గతంలోనే తాను రూ.30 కోట్ల ఎల్‌డబ్ల్యూఈ నిధులను మంజూరు చేశానని కలెక్టర్ ప్రియాంక ఆలకు గుర్తు చేశారు. సంబంధిత అధికారులతో చర్చించి ఆ నిధులు వెనక్కు మళ్లకుండా వారికి రహదారి సౌకర్యం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఖమ్మం కలెక్టర్ వీ.పీ.గౌతమ్, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సీఈ ఎ. శ్రీనివాసరెడ్డి, ఎస్ఈలు ఎస్. శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, అశ్వారావుపేట ఈఈ సురేష్‌కుమార్, డీఈఈ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: TS గవర్నమెంట్ కీలక నిర్ణయం! ఉపాధ్యాయుల్లో ఆందోళన.. -
లోకేశ్ పాదయాత్ర వెలవెల
నరసాపురం రూరల్/పాలకొల్లు అర్బన్: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో నారా లోకేశ్ గురువారం నిర్వహించిన పాదయాత్రకు జనస్పందన కరువైంది. నరసాపురం నియోజకవర్గంలో జనం లేక పాదయాత్ర వెలవెలబోయింది. దీంతో స్థానిక టీడీపీ నేతలపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. పాలకొల్లు మండలం దిగమర్రు నుంచి పెదమామిడిపల్లి వరకు నిర్వహించిన పాదయాత్రకు జన స్పందన కరువైంది. దిగమర్రు మూడు రోడ్ల కూడలిలో ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మహిళలతో ఖాళీ బిందెలు ప్రదర్శించి మంచినీటి సమస్య ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. దిగమర్రు గ్రామంలో కల్లుగీత కార్మికులతో మాట్లాడారు. పెదమామిడిపల్లి చేరుకునేసరికి చీకటి పడింది. దీంతో టీడీపీ కార్యకర్తలు కాగడాలు వెలిగించి ఆగస్టులో కూడా విద్యుత్ కోతలంటూ దుష్ప్రచారం చేశారు. కార్యకర్తలకు పెట్రోల్ కోసం రూ.100, మగవారికి రూ.500, ఆడవారికి రూ.300 చెల్లించి పాదయాత్రకు తరలించినట్టు సమాచారం. పాదయాత్రలో జై బాలయ్య, జై జై నిమ్మల అనే నినాదాలే వినిపించాయి. ఎక్కడా లోకేశ్‌కు అనుకూల నినాదాలు చేయకపోవడం గమనార్హం. లోకేశ్ టీమ్ నిర్లక్ష్యంతో దంపతులకు గాయాలు యువగళం బృందం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పాదయాత్ర సందర్భంగా ఓ దంపతులు గాయాల పాలయ్యారు. నరసాపురం మండలం చిట్టవరం వద్ద లోకేశ్ టీమ్‌కు చెందిన కారు డోరు ఒక్కసారిగా తెరవడంతో నరసాపురం వైపు వస్తున్న మోటార్ బైక్‌కు బలంగా తగిలింది. బైక్‌పై ప్రయాణిస్తున్న కడలి మోహనరావు, సరోజిని దంపతులు కిందపడిపోయి గాయాలపాలయ్యారు. పోలీసులు వెంటనే వారిద్దరినీ వాహనంలో తీసుకెళ్లి పాలకొల్లులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. -
సుజలాం సుఫలాం
ఇంట్లో నీటి సమస్యను తీర్చడానికి దేశంలో చాలా చోట్ల మహిళలు పడే అవస్థల గురించి మనకు తెలిసిందే. అలాంటి ఊరందరి నీటి సమస్యను తీర్చాలంటే ఇంకెంత అవస్థ పడాలి. తమ గ్రామాలకు వచ్చిన నీటి కష్టం తీరాలంటే పూడుకుపోయిన చెరువును పునరుద్ధరించాలని, నదిని పునరుజ్జీవింపచేయాలని, కుళాయిలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలు చేసి, దానిని అమలు చేస్తున్నారు గంగా రాజ్‌పుత్, గాయత్రీదేవి, శారదాదేవి, అనితా చౌదరి, కె.ఆశా. వీరిని కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ గుర్తించి ఈ యేడాది స్వచ్ఛ్ సుజల శక్తి సమ్మాన్ పురస్కారంతో సన్మానించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఢిల్లీలో వీరికి అవార్డులు అందజేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఈ మహిళలు పురుషాధిపత్యం పైనే కాదు, మూఢనమ్మకాలపైనా పోరాడుతూ తమ గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్యను తీర్చడానికి నడుం కట్టారు. గంగా ప్రవాహం... మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్కు చెందిన 35 ఏళ్ల గంగా రాజ్‌పుత్ తన గ్రామంలో తీవ్ర నీటి కొరతను తీర్చడానికి ఒక చెరువును పునరుద్ధరించాలని ఆలోచన చేసింది. ఈ క్రమంలో అయితే, ఆమె ఆలోచనను అమలులో పెట్టడానికి పితృస్వామ్యంపైనే కాదు మూఢనమ్మకాలపై కూడా పోరాడాల్సి వచ్చింది. దశాబ్దాల క్రితం జరిగిన ఓ దుర్ఘటన కారణంగా గ్రామస్తులు చెరువును వదిలేశారు. దానిని పునరుద్ధరిస్తే ఎవరికైనా చెడు జరుగుతుందని స్థానికుల గట్టి నమ్మకం. దాంతో ఆ గ్రామంలో నీటి సంక్షోభం రోజు రోజుకూ తీవ్రతరం అవుతోంది. ఆ నీటి ఎద్దడిని తీర్చే ఏకైక ఆధారం ఆ చెరువే. ‘మూఢనమ్మకాలతో కన్నా నీటి కోసం చనిపోవడం మేలు’ అని అభ్యంతరం చెప్పిన ప్రతీసారి గ్రామస్తులకు పదే పదే చెబుతూ వచ్చింది గంగ. మెల్లగా ఓ పాతిక మంది మహిళలతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. స్థానిక ఎన్జీవోల మద్దతుతో చెరువును శుభ్రం చేసి, పునరుద్ధరణ పనులు చేపట్టింది. ఊరికి నీటి ఎద్దడి తీరింది. నదికి జీవకళ గంగా రాజ్‌పుత్ మాదిరిగానే రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉంటున్న గాయత్రీదేవి సంభార్ సరస్సు చుట్టూ ఉన్న 15 గ్రామాలకు చెందిన మహిళలకు వర్షపు నీటి సంరక్షణలో సహాయం చేయడానికి కృషి చేస్తోంది. అలాగే, ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌కు చెందిన శారదాదేవి కూడా తన గ్రామంలోని నీటి ఎద్దడిని పరిష్కరించడానికి స్థానిక బారువా నదిని పునరుజ్జీవింపజేయడానికి తోటివారిని కార్యోన్ముఖులను చేసి విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లోని చింద్వార్ జిల్లాకు చెందిన అనితా చౌదరి తన గ్రామంలోని ఇతర మహిళలు నీటి కోసం పడే కష్టాలను చూసింది. ఈ సమస్యను పరిష్కరించే అవకాశం వచ్చినప్పుడు ఆమె వెనకడుగువేయలేదు. రెండేళ్లుగా తన గ్రామమైన గర్మౌలో ప్రభుత్వ హర్ ఘర్ జల్ పథకాన్ని అమలు చేయడానికి కృషి చేసింది. మరో అవార్డు గ్రహీత తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన కె.ఆశా, తన గ్రామంలో ఏ ఇంటì వద్ద కుళాయి నీటి సరఫరాలో చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తుంది. -
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు నీటి పంపిణీ
-
అన్నాతమ్ముళ్ల గొడవ.. కింద పడేసి...
సాక్షి, చిత్తూరు: సాగునీటి పంపకం విషయంలో అన్నదమ్ముళ్ల మధ్య మొదలైన వివాదం వేటకొడవళ్లతో దాడి చేసుకునే వరకూ వెళ్లింది. వివరాలోలకెళ్తే.. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం నాయునివారిపల్లిలో చోటుచేసుంది. నీటి విషయంలో వివాదం తలెత్తడంతో పెద్దనాన్న, ఆయన కొడుకుపై తమ్ముడి కుటుంబం కొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు. -
మిషన్ భగీరథ పనులు అస్తవ్యస్తం
సాక్షి, ఉప్పునుంతల: మండలంలో మిషన్ భగీరథ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటివరకు వాటర్ ట్యాంకుల పనులు, పైప్లైన్ల పనులు పూర్తికాలేదు. కొన్ని గ్రామాల్లో ట్యాంక్‌ల నిర్మాణం పనులు నేటికీ ప్రారంభించలేదు. మరికొన్ని గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణం అర్ధాంతరంగా నిలిపేశారు. పనులు పెండింగ్‌లో ఉండడంతో కొన్ని గ్రామాలకు ఇప్పటివరకు నీటి సరఫరా కావడం లేదు. పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. భగీరథలో చేపడుతున్న వాటర్ ట్యాంకులు, ఇతర పైప్లైన్ల పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడంలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నాణ్యతతో పనులు త్వరితగతిన పూర్తిచేయించాలని వారు కోరుతున్నారు. మండలంలో సగం వాటర్ ట్యాక్‌లు పూర్తి.. మండలంలోని 27 పంచాయతీల పరిధిలో ఉన్న 38 ఆవాస గ్రామాల్లో మిషన్ భగీరథ పథకంలో 31 వాటర్ ట్యాంకులు మంజూరయ్యాయి. వాటిలో ఇప్పటివరకు 14 వాటర్ ట్యాంకులు పూర్తయ్యాయి. 17 వాటరు ట్యాంకుల పనులు పూర్తికాలేదు. మూన్య తండాలో ఇప్పటివరకు ట్యాంక్ పనులు ప్రారంభించలేదు. బిల్లులు రాలేదంటూ సంబంధిత కాంట్రాక్టర్ రంగంపేట తదితర గ్రామాల్లో ట్యాంకు పనులు బెస్మెంట్ వరకు మాత్రమే నిలిపేశారు. ఇంటర్‌గ్రిడ్ పనుల్లో జాప్యం.. మండలంలో ఇంటర్‌గ్రిడ్ పనుల్లో తీవ్ర జాప్యం చేస్తున్నారు. చిన్న చిన్న గ్రామాలు, తండాల్లోని కాలనీల్లో ఇళ్లలోకి కనెక్షన్లు ఇవ్వడానికి పైప్లైన్లు వేసి ఉంచినా నల్లాలు అమర్చలేదు. కొన్ని గ్రామాలకు మెయిన్ గ్రిడ్ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో నీళ్లు రావడంలేదు. రంగంపేట, మూన్య తాండ, కొత్తరాంనగర్ తదితర గ్రామాల్లో ట్యాంకులు, ఇంటర్‌గ్రిడ్ పనులు పూర్తిచేయకపోవడంతో భగీరథ నీళ్లు అందడంలేదు. గుట్టమీది తండాలో అసంపూర్తిగా పైపులైన్ పనులు , ఉప్పునుంతలలో పూర్తికాని ఇంటర్ గ్రిడ్ పైపులైన్ -
నవ్విన చోటే నిలిచి.. గెలిచి..!
తాగునీటి కోసం గ్రామీణ మహిళల కష్టాలు ఆమెను కదిలించాయి. నీటి సమస్య పరిష్కారానికి ఎన్నో మార్లు అధికారులకు విన్నవించారు. స్వచ్ఛంద సేవలను ఆశ్రయించారు. తన నగలను తాకట్టు పెట్టి మçహారాష్ట్ర, రాజస్తాన్ వెళ్లారు. అన్నాహజరే, రాజేంద్రసింగ్ల సలహాలు తీసుకున్నారు. మొదట ఓ కొలను తవ్వారు. ఈ ప్రయత్నానికి కొందరు నవ్వుకున్నారు.ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నా కుంగిపోలేదు. కొలను నిండడంతో పరిసరాల్లో భూగర్భజలాలు కొంత మేరకు పెరిగాయి. అదే స్ఫూర్తితో స్వచ్ఛంద సంస్థల, యువత సహకారం తీసుకుని మరో ఎనిమిదికొలనులు తవ్వించారు. ప్రస్తుతం కొలనులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. నవ్వినచోటే నిలిచి గెలిచారు తిరువళ్లూరు సమీపంలోని నల్లటూరు గ్రామానికి చెందిన సుమతి. తిరువళ్లూరు: సాగర చక్రవర్తి అశ్వమేధయాగం చేయతలపెట్టగా ఇంద్రుడు ఆ అశ్వాన్ని దొంగిలించి కపిల మహర్షి దగ్గర కట్టేశాడట. ఆ ఆశ్వాన్ని చూసిన యువరాజులు ఆ మహర్షిని నిందించడంతో ఆగ్రహించిన రుషి వారందరిని భస్మం చేశాడట. నిజం తెలుసుకున్న సాగరచక్రవర్తి రెండో భార్య కుమారుడు అసమంజ రాజకుమారుల ఆత్మకు శాంతి ప్రసాదించాలని రుషిని ప్రార్థించగా.. దేవలోకం నుంచి గంగను భూమికి తీసుకువస్తే వారి ఆత్మకు శాంతి కలుగుతుందని తెలిపాడట. దీంతో అసమంజ మనవుడు భగీరథుడు కఠోర తపస్సు చేసి గంగను భూమి మీదకు తెచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇదే విధంగా అదిగత్తూరు సమీపం 5 గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి భగీరథ యత్నమే చేసింది ఆమె. భర్త సహకారం, సమీప పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామ యువకులతో వర్షం నీటి ఆదాకు కొలను తవ్వకానికి నిధులు సేకరించారు. అలా పదేళ్ల క్రితం ప్రారంభించి ఇప్పటివరకు గ్రామంలో తొమ్మిది కొలనుల తవ్వించారు. పచ్చదనం కోసం రెండు వేల మొక్కలను నాటి శభాష్ అనిపించుకుంటున్నారు సమాజికవేత్త సుమతి. కుటంబ నేపథ్యం.. తిరువళ్లూరు సమీపం, నల్లటూరు గ్రామానికి చెందిన సుమతి డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆమెకు 14 ఏళ్ల క్రితం చిదంబరనాథన్తో వివాహం జరిగింది. వివాహం జరిగిన మరుసటి రోజు నుంచే కన్నీటి కష్టాలు ఎదురయ్యాయి. తాగునీటి కోసం మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయబావి వద్ద తాగునీటిని తెచ్చుకోవాలి. ఇలా నీటికోసం పడిన కష్టాలు ఆమెను కదిలించాయి. సమస్య పరిష్కారం ఆమె మాటల్లోనే.. ఈ శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టా. 2006లో నిర్వహించిన గ్రామసభలో ఏకాటూరు వద్ద ఉన్న కూవం నదిపై అనకట్ట కట్టాలని తీర్మానం చేశాం. అధికారులు సైతం వచ్చి వెళ్లినా పని కాలేదూ కదా.. మళ్లీ సమస్య ఉగ్రరూపం దాల్చింది. అప్పడే ఇండియా వాటర్‌మెన్ రాజస్థాన్‌కు చెందిన రాజేంద్రసింగ్, అన్నాహజారే గురించి పుస్తకాల్లో చదివా. గ్రామాల్లో నీటిని ఆదాచేయడానికి స్వచ్ఛంద సంసల సహకారంతో కొలను తవ్వారన్నది అందులోని సారాంశం. ప్రభుత్వాన్ని నమ్మి ప్రయోజనం లేదని నగలను తాకట్టు పెట్టి మహరాష్ట్ర, రాజస్తాన్‌కు బయలుదేరా. అన్నాహజరే, రాజేంద్రసింగ్‌ను కలిసి గ్రామంలోని తాగునీటి సమస్యను వివరించా. కొలను తవ్వి నీటిని ఆదా చేయమని చెప్పారు రాజేంద్రసింగ్. మొదట్లో నమ్మకం లేకపోయినా హజారే స్వగ్రామమైన రాలేగన్ సిద్ధి్ద, రాజస్థాన్‌లో తవ్విన కొలనులను పరిశీలించాక నమ్మకం ఏర్పడింది. నిధుల కోసం వినతి.. గ్రామపంచాయతీ అధ్యక్షుడికి కొలను తవ్వకం కోసం నిధులను సేరించాలని కోరా. అయితే అందుకు అయ్యే ఖర్చును గుర్తుచేస్తూ నన్ను ఎగతాలి చేశారు. అయినా నేను గ్రామంలోని యువకులు, స్వచ్ఛంద సంస్థలు, సమీప కంపెనీలను ఆశ్రయించి నిధులు సేకరించా. ఆ నిధులతో తాగునీటి ట్యాంకర్ కోసం ఏర్పాటు చేసిన బోరుకు సమీపంలో పెద్ద కొలనును ఆరునెలల పాటు శ్రమించి తవ్వాం. కొలనుకు నాలుగు వైపులా రాళ్లను పేర్చాం. ఆ ఏడాదే మంచి వర్షం. కొలను నీటితో నిండి జలకళను సంతరించుకుంది. దీంతో భూగర్భజలాలు కొంత మేరకు పెరగడంతో ఆరు నెలల పాటు తాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది. మొత్తం తొమ్మిది కొలనులు.. అదే జోష్‌తో మరో ఎనిమిది కొలనులను తవ్వాలని పనులు ప్రారంభించా. మొదట్లో మమ్మిల్ని ఎగతాళి చేసిన వారే మాతో చేతులు కలిపారు. ఏడాదికి ఒక కొలను చొప్పున ఎనిమిదింటిని పూర్తి చేశాం. ప్రస్తుతం గ్రామంలో తొమ్మిది కొలనులను తవ్వాం. ప్రవేటు వ్యక్తి చేతిలో ఆక్రమణకు గురైన మరో కొలనును స్వాధీనం చేసుకుని మరమ్మతులు చేశాం. కొలనుల తవ్వడానికి తాను చేసిన ప్రయత్నంలో ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నప్పుడు కొంచెం బాధపడ్డా. కానీ కొలనుల్లో నీరు నిండి ప్రవహిస్తుండడంతో పలువురు శభాష్ అంటూ ప్రశంసిస్తుంటే ఆ బాధను మరిచిపోతున్నా. భర్త సహకారం.. సుమతి సాధించిన విజయం వెనుక భర్త చిదంబరనాథన్ ప్రోత్సహం, యువకుల సహకారం ఎంతో ఉంది. ప్రస్తుతం అదే టీం లక్ష మొక్కలను నాటాలని నిర్ణయించి రెండువేల మొక్కలను నాటి పరిరక్షిస్తున్నారు. సుమతి సమాజసేవకు గాను పలు అవార్డులు వచ్చాయి. గ్రామస్తులు సైతం పంచాయతీ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. అయితే ఎన్నికలు నిలిచిపోయాయి. భవిష్యత్‌లో పంచాయతీ అధ్యక్షురాలిగా ఎన్నికై సమాజ సేవ చేయాలని ఆశిద్దాం. -
అధికార పార్టీ.. నీటి రాజకీయాలు
-
అధికార పార్టీ.. నీటి రాజకీయాలు
పాలకొల్లు: పాలకొల్లు మున్సిపాలిటీలో అధికారిక పార్టీ నీటి రాజకీయాలు చేస్తోంది. ఎండాకాలం కావడంతో నీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజల కష్టాలను చూసి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ ఉచిత వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. దీంతో అధికార పార్టీలు నేతలు అతనిపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఆ వాటర్ ట్యాంక్ పై వైఎస్ జగన్మోహన్రెడ్డి బొమ్మ ఉండటంతో మున్సిపాలిటీ వాళ్లు నీరు ఇవ్వమన్నారు. టీడీపీ నేతల ఒత్తిడితో కౌన్సిల్ నీరు ఇవ్వమని తీర్మానం చేశారు. అదే అధికార పార్టీ ఎమ్మెల్యే రామానాయుడు ధర్మారావు ఫౌండేషన్ పేరుతో చంద్రబాబు, లోకేష్ బొమ్మలతో తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయినా అధికార పార్టీ కాబట్టి అధికారులు పట్టించుకోకుండా చూసి చూడనట్టు వదిలేశారు. చివరకు నీటి సరఫరా విషయంలో కూడా అధికార పార్టీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షం విమర్శించింది. అధికార పార్టీకి ఒక న్యాయం, మాకు మరో న్యాయమా అని ప్రతిపక్షం అధికారులను ప్రశ్నించింది. అధికార పార్టీ చేస్తున్న కక్ష సాధింపులపై పాలకొల్లు ప్రజలు తీవ్ర .అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. -
కష్టాల్లో ఖరీఫ్ నిజమే
ఇరిగేషన్ ఎస్ఈ రాంబాబు వర్షాభావ పరిస్థితుల వల్లే నీటి ఎద్దడి పీబీసీ, ఏలేరు పరిధిలో ఇంకా 10వేల ఎకరాల్లో పూర్తి కానినాట్లు పదిరోజుల్లో సమస్యను అధిగమిస్తామని హామీ ఏలేరు, పీబీసీ ద్వారా 950 క్యూసెక్కులు నీటి విడుదల గొల్లప్రోలు : నెల రోజులుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని ఇరిగేషన్ ఎస్ఈ బి.రాంబాబు తెలిపారు. జిల్లాలో నెలకొన్న నీటి ఎద్దడి పరిస్థితుల వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఎండిపోతున్న పంటలపై సాక్షిలో ‘కష్టాల్లో ఖరీఫ్’ శీర్షికన వెలువడిన కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో నీటి ఎద్దడిని పరిశీలించారు. ఎస్ఈ నేతృత్వంలో అధికారులు, నీటిసంఘం ప్రతినిధుల బృందం పీబీసీ, ఏలేరు పరిధిలోని సామర్లకోట నుంచి తొండంగి మండలం కోదాడ వరకు ఉన్న ఆయకట్టు ప్రాంతాల్లో ఆదివారం పర్యటించి అక్కడి పరిస్థితులను స్థానిక అధికారులు, నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధుల ద్వారా తెలుసుకున్నారు. అనంతరం ఆర్ఆర్బీ ట్యాంకును పరిశీలించి పూర్తిగా అడుగంటిపోవడాన్ని ఆయన గుర్తించారు. శిథిలావస్థలో ఉన్న 14 స్లూయిస్‌లను, షట్టర్లును పూర్తి స్థాయిలో మరమత్తులు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధవళేశ్వరం నుంచి సామర్లకోట వరకు వచ్చే నీటిని పీబీసీ ద్వారా 500 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నామన్నారు. మరో 50క్యూసెక్కులు అదనంగా విడుదల చే స్తామన్నారు. అలాగే ఏలేరు నుంచి 400 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ఏలేరు, పీబీసీ పరిధిలోని 53వేల ఎకరాలకు 43వేల ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయని, ఇంకా పది నుంచి 11వేల ఎకరాల్లో నాట్లు వేయాల్సి ఉందన్నారు. పది రోజుల్లో పూర్తి స్థాయిలో నీటి ఎద్దడిని నివారిస్తామన్నారు. ఏలేరు, గోదావరి అనుసంధానానికి రూ1650కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఆమోదం తెలిపారన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి అనుసంధానం ప్రక్రియపూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఇరిగేషన్ ఈఈలు పి అప్పలరాజు, ఎస్ జగదీశ్వరరావు, కృష్ణారావు, డీఈ శేషగిరిరావు, ఏఈలు రెహమాన్, అప్పారావు, నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ యనమల నాగేశ్వరరావు, మాజీ చైర్మన్ యనమల రామారావు, నీటి సంఘం అధ్యక్షుడు వింజరపు కొండ, మాజీ అధ్యక్షుడు కడిమిశెట్టి కుమార భాస్కరరెడ్డి, పాలపర్తి చలమయ్య తదితరులు పాల్గొన్నారు. -
అదును తప్పుతోంది!
వరుణుడు పలకరిస్తున్నా నిండని ‘ఏలేరు’ పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలు ప్రస్తుత నీటినిల్వలు 2.87 టీఎంసీలే 53 వేల ఎకరాల్లో సాగుపై సందిగ్ధత నాట్లు వేసేందుకు దగ్గర పడుతున్న సమయం ఆందోళన చెందుతున్న రైతులు జగ్గంపేట : తొలకరి చినుకులు పలకరించడంతో ఏరువాక చేపట్టిన ‘ఏలేరు’ రైతన్న.. నాట్లు వేయాలో లేదో అర్థంకాని పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. జలాశయంలో చాలినన్ని నీటినిల్వలు లేకపోవడమే ఇందుకు కారణం. ఖరీఫ్‌నాటికి జలకళతో కళకళలాడాల్సిన ఏలేరు జలాశయంలో ప్రస్తుతం 2.87 టీఎంసీల నీటినిల్వలు మాత్రమే ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా జోరుగా వర్షాలు పడుతున్నా.. ఏలేరు క్యాచ్మెంట్ ఏరియాలో వరుణుడి కరుణ అంతగా కానరావడంలేదు. దీంతో రోజుకు సరాసరి 350 క్యూసెక్కుల వరకూ మాత్రమే ఇ¯Œæఫ్లో ఉంటోంది. మరోపక్క ఖరీఫ్‌కు అదును దాటుతూండడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. నారుమడులు వేసుకుని, నాట్లు వేసేందుకు నీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఏలేరు జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు. దీనికింద 67 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా వాస్తవానికి 53 వేల ఎకరాలే సాగవుతోంది. ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం నియోజకర్గాల పరిధిలోని ఏడు మండలాల రైతులు ఏలేరు ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఖరీఫ్‌తో పాటు రబీ కూడా సాగు చేసే ఏలేరు రైతులు ప్రస్తుత పరిస్థితిపై ఆవేదన చెందుతున్నారు. నెలాఖరులోగా నాట్లు వేస్తే దిగుబడి బాగుంటుందని, ఆలస్యమైతే దిగుబడి తగ్గి నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. దమ్ములు చేపట్టలేదు ఏలేరు ఆయకట్టు కింద ఖరీఫ్ దమ్ములు చేపట్టలేదు. నాట్లు ఆలస్యమవుతున్నాయి. అధికారులు స్పందించి వెంటనే నీరు విడుదల చేయాలి. కొటారి సూరిబాబు, రైతు, కిర్లంపూడి నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి ఏలేరును ఆధునికీకరించి ఉంటే ప్రాజెక్టులో నీరు ఉండేది. అధికారుల నిర్లక్ష్యంతోనే ఏలేరుకు ఈ దుస్థితి ఏర్పడింది. వెంటే ఆధునికీకరించి ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరివ్వాలి. చిక్కాల చిన్న, రైతు, కిర్లంపూడి నాట్లకు నీరివ్వాలి అదును తప్పుతున్నందున ఏలేరు కింద నాట్లు వేసుకునేందుకు వెంటనే నీరు విడుదల చేయాలి. నీరు ఆలస్యమైతే సాగుపై ప్రభాపం చూపి నష్టపోతాం. దోమాల వెంకన్న, రైతు, వేలంక -
'టీ20వరల్డ్ కప్ టైమ్‌లో ఏం చేశారు?'
న్యూఢిల్లీ: కరువు పీడిత మహారాష్ట్ర నుంచి 13 ఐపీఎల్ మ్యాచ్‌లను తరలించాలంటూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పు బీసీసీఐని బిత్తరపోయేలా చేసింది. ప్రస్తుత పరిస్థితిలో ఐపీఎల్ మ్యాచ్‌లు తరలించడం సమస్యే అయినప్పటికీ, బీసీసీఐ ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేస్తున్నదని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. కరువు పీడిత ప్రాంతాలకు నీటి సరఫరా చేయడంతోపాటు సీఎం రిలీఫ్ పండ్‌కు నిధులు ఇస్తామని బీసీసీఐ చెప్పినప్పటికీ, ఏప్రిల్ 30 తర్వాత మహారాష్ట్రలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించొద్దంటూ హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ తీర్పు నేపథ్యంలో శుక్లా విలేకరులతో మాట్లాడుతూ 'ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ చాలా పెద్ద పని. ఇప్పుడు మ్యాచ్‌లు మార్చడం అంత సులభం కాదు. ఇప్పటికే ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి. ఇప్పుడు మ్యాచుల తరలింపు అంటే సమస్యే. అయినప్పటికీ కోర్టు ఉత్తర్వులను మేం గౌరవిస్తాం. మొత్తం 19 మ్యాచ్‌లలో 13ని మహారాష్ట్ర నుంచి తరలించాల్సి ఉంది. ఇందుకు మేం కష్టపడాలి' అని అన్నారు. 'మ్యాచ్‌లు తరలించాల్సి వస్తే.. ఎక్కడికి తరలించాలి? ఎలా తరలించాలి? అన్నది సమస్య. టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ఇటీవల 24 మ్యాచ్‌లు నిర్వహించినప్పుడు ఒక్కరూ కూడా ఈ అంశాన్ని (నీటి సమస్యను) లేవనెత్తలేదు. గత ఆరు నెలల్లో ఎవరూ ఈ అంశాన్ని లేవనెత్తలేదు. మహారాష్ట్రలో ఎన్నో సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటికి ఎంతో నీటి అవసరముంది. అయినా ఆ అంశాన్ని ఎవరూ లేవనెత్తడం లేదు. అన్ని సమకూరుస్తామన్నా.. ఐపీఎల్ విషయంలోనే ఈ విషయాన్ని లేవనెత్తారు' అని శుక్లా పేర్కొన్నారు. ఐపీఎల్ ను లక్ష్యంగా చేసుకున్నారన్న రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారు. -
నీటి కోసం తమ్ముడిని చంపిన అన్న
రాజుపాలెం: సాగు నీటి కోసం అన్నదమ్ముల మధ్య తలెత్తిన విభేదం ఒకరిని బలితీసుకుంది. వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం తుండలదిన్నె గ్రామానికి చెందిన పెద్ద దస్తగిరి, చిన్న దస్తగిరి అన్నదమ్ములు. సోదరులిద్దరూ శుక్రవారం ఉదయం పొలాలకు నీరు పెట్టుకునేందుకు వెళ్లారు. పక్కపక్కన ఉండటంతో నీటి విషయమై ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. దీంతో ఆవేశంతో పెద్ద దస్తగిరి తమ్ముడిని పారతో కొట్టటంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు దువ్వూరు ఎస్సై మధుసూదనరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తెగని నీళ్ల పంచాయితీ!