రాజుపాలెం: సాగు నీటి కోసం అన్నదమ్ముల మధ్య తలెత్తిన విభేదం ఒకరిని బలితీసుకుంది. వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం తుండలదిన్నె గ్రామానికి చెందిన పెద్ద దస్తగిరి, చిన్న దస్తగిరి అన్నదమ్ములు. సోదరులిద్దరూ శుక్రవారం ఉదయం పొలాలకు నీరు పెట్టుకునేందుకు వెళ్లారు. పక్కపక్కన ఉండటంతో నీటి విషయమై ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. దీంతో ఆవేశంతో పెద్ద దస్తగిరి తమ్ముడిని పారతో కొట్టటంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు దువ్వూరు ఎస్సై మధుసూదనరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.