brothers
-
తాతయ్య చివరి కోరిక కోసం..
‘అమ్మా... ఆ చెట్టును నువ్వొకసారి తాకి రావాలి’ అని కోరాడు ఆమె తాత చనిపోయే ముందు. అమ్మమ్మలు, తాతయ్యల మాటల్ని చాదస్తంగా తీసి పారేసేవారు ఉన్న ఈరోజుల్లో ఆ మనవరాలు తాత చివరి కోరిక నెరవేర్చడానికి పాకిస్తాన్‌కు వెళ్లింది. దేశ విభజనకు ముందు తన తాత ఏ చెట్టునైతే పొలంలో తన నీడగా చేసుకున్నాడో ఆ చెట్టును తాకింది.తన పూర్వీకుల స్వగ్రామంలోని మట్టిని మూట గట్టుకుంది. ఇంకా అక్కడే ఉన్న తన వాళ్లను చూసి ఆనందబాష్పాలు రాల్చింది. పెద్దవాళ్ల గుండెల్లో గాఢంగా కొన్ని కోరికలు ఉంటాయి. వాటిని వారు జీవించి ఉండగానే నెరవేరిస్తే ఆనందం. మరణించాక నెరవేరిస్తే మనశ్శాంతి.‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు వచ్చి, ఇంత పేరు గడించినా సినీ కవి గుల్జార్‌కి గుండెలో ఒక కోరిక ఉండిపోయింది. అది పాకిస్తాన్‌లోని తన పూర్వీకుల సొంత ఊరిని చూసి రావాలనేది. ఒకటి రెండుసార్లు ప్రయత్నించినా అతనికి అనుమతి దొరకలేదు. చనిపోయేలోపు చూస్తానో లేదో అంటాడాయన. దేశ విభజన వల్ల రాత్రికి రాత్రి కుటుంబాలు చెదిరిపోయి కొందరు ఇండియా చేరారు... కొందరు పాకిస్తాన్‌లోనే ఉండిపోయారు. ఇరు దేశాలలో సెటిల్ అయిన వారి తలపోతల గురించి ఎంతో సాహిత్యం వచ్చింది. రాకపోకలు జటిలం అయ్యాక ఇక బంధాలు ఫోన్లకు పరిమితం అయ్యాయి. పంజాబీలు అధికంగా ఈ ఎడబాటును భరించారు. రెండేళ్ల క్రితం 90 ఏళ్ల వయసున్న రీనా చిబ్బేర్ అనే ఆమె ‘రావల్పిండిలో మా పూర్వీకుల ఇల్లు చూసి రావడానికి అనుమతి ఇవ్వండి’ అని వేడుకుంటే ప్రభుత్వం అనుమతి ఇస్తే ఆమె ఎంతో సంబరంగా వెళ్లడం ప్రధాన వార్తాంశం అయ్యింది. అయితే దేశ విభజన సమయంలో జలంధర్‌కు వచ్చి స్థిరపడిన బహదూర్ సింగ్‌కి మాత్రం అలాంటి కోరిక నెరవేరలేదు. 1947లో అతను తన చిన్న తమ్ముణ్ణి తీసుకుని ఇండియా వచ్చేశాడు. నడిమి తమ్ముడు అక్కడే ఉండిపోయాడు. ‘మా తాత చనిపోయే వరకూ కూడా పాకిస్తాన్లో ఉన్న తమ్ముణ్ణి గుర్తు చేసుకుని ఏడ్చేవాడు. ఆ అన్నదమ్ములు మళ్లీ జీవితంలో కలవకుండానే కన్ను మూశారు’ అని తెలిపింది కరమ్‌జిత్ కౌర్. ఆమె ఇటీవలే తాత కోరిక నెరవేర్చడానికి పాకిస్తాన్‌లోని సియోల్‌కోట్‌కు దగ్గరగా ఉన్న తమ పల్లెను దర్శించింది.ఆ ఇల్లు... ఆ చెట్టు‘మా తాతది సియోల్‌కోట్ దగ్గర ఉన్న పల్లెటూరు. ఆయన పొలంలో పెద్ద రావిచెట్టు ఉంది. ఆ ఇంటిని, చెట్టును ఆయన ఎప్పుడూ గుర్తు చేసుకునేవారు. వాటి గురించి కథలు కథలు చెప్పేవారు. ఆ చెట్టును ఒకసారి తాకి రావాలి. తల్లీ అనేవారు నాతో. జలంధర్ వచ్చేశాక ఆయన తన తమ్ముడికి ఎన్నో ఉత్తరాలు రాశారు. కానీ 1986లో గాని వాటికి జవాబు రాలేదు. అప్పటికే మా తాత నడిమి తమ్ముడు ఇస్లాంలోకి మారాడు. అయితే మా ఇంటి పేరును ‘గుమర్’ని వదలకుండా తన పేరు గులామ్ ముహమ్మద్ గుమర్ అని పెట్టుకున్నాడు. ఆ ఇంటిని ఆ చెట్టును అలాగే కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన చనిపోయాక ఆయన కొడుకు కుటుంబం మా జ్ఞాపకాలను పదిలంగా ఉంచిందని అర్థమయ్యాక ఎలాగైనా వెళ్లాలని తాతయ్య కోరిక నెరవేర్చాలని నిశ్చయించుకున్నాను’ అంది కరమ్‌జిత్ కౌర్.ఘన స్వాగతం‘నేను పాకిస్తాన్ వెళుతున్నానంటే మా అత్తగారి కుటుంబం వద్దంటే వద్దంది. నాక్కూడా చాలా భయాలు కలిగాయి. కాని అక్కడ నేను అడుగు పెట్టగానే మా నడిమి తాత కుమారుడు నన్ను పట్టుకుని గట్టిగా ఏడ్చేశాడు. నా పెళ్లి కార్డు జాగ్రత్తగా దాచుకుని ఉన్నారు. మా తాత రాసిన ఉత్తరాలు ఉన్నాయి. అప్పట్లో మా ఇంట్లో వాడిన తిరగలి అలాగే ఉంది. మా పొలంలో రావిచెట్టు సంగతి చెప్పనక్కర్లేదు. కళకళలాడుతోంది. మా బంధువులు, రక్త సంబంధీకులు అందరూ కన్నీటి పర్యంతం అయ్యి మర్యాదలు చేశారు. మా వూరి మట్టి తీసుకుని తిరిగి వస్తున్నాను’ అని తెలిపింది కరమ్‌జిత్ కౌర్.కష్టసాధ్యమైన తాత కోరికను కొద్దిగా అయినా తీర్చిందీ మనవరాలు. ‘ఒరేయ్... కాశీ చూపించరా’, ‘మా ఊరు చూపించరా’, ‘ఫలానా బంధువు ఇంటికి తీసుకెళ్లరా’ అని పెద్దవాళ్లు కోరితే కాదనవద్దు. ఆ కోరిక లోతు మనకు తెలియదు. చెప్పినా అర్థం కాదు. చేయవలసిందల్లా కోరింది తీర్చడమే.కుటుంబాలు కలిపే సంస్థతాత మరణించాక లండన్‌లో స్థిరపడిన కరమ్‌జిత్‌కు... కఠినమైన వీసా నియమాల వల్ల పాకిస్తాన్‌కు వెళ్లడం అంత సులువు కాలేదు. అయితే దేశ విభజన సమయంలో విడిపోయిన పంజాబీ కుటుంబాలను తిరిగి కలిపేందుకు ‘జీవే సంఝా పంజాబ్’ పేరుతో ఒక సంస్థ పని చేస్తోంది. ఆ సంస్థ ప్రయత్నంతో వాఘా బోర్డర్ మీదుగా పాకిస్తాన్లోకి అడుగు పెట్టేందుకు కరమ్‌జిత్ కౌర్‌కు అనుమతి లభించింది. ‘నేను పాకిస్తాన్‌కు వెళుతున్నానని తెలిసి మా చిన్నతాత కుమారుడు తనని కూడా తీసుకెళ్లమని ఎంతో ఏడ్చారు. కాని ఆయన వయసు రీత్యా వీల్‌చైర్‌లో ఉన్నారు. నీ కోసం మన ఊరి మట్టి తీసుకొస్తానులే పెదనాన్నా అని చెప్పి వచ్చాను’ అంటుందామె భావోద్వేగంతో. -
సరోగసీ టూరిజం నేరం
సరోగసీపై చట్టాన్ని ఇటలీ విస్తృతం చేసింది. సరోగసీ టూరిజాన్ని నేరంగా పరిగణిస్తూ చట్టం చేసింది. బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ ప్రతిపాదించిన బిల్లును సెనేట్ 58–84 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఈ చట్టం 2004 నుంచే ఇటలీలో అమలులో ఉన్న సరోగసీ నిషేధాన్ని యునైటెడ్ స్టేట్స్, కెనడా వంటి దేశాలకు వెళ్లేవారికి వర్తింపజేస్తుంది. దీనిని ఉల్లంఘించిన వారికి ఒక మిలియన్ డాలర్ల వరకు జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే సరోగసీ ద్వారా జని్మంచిన పిల్లలను ఇప్పటికే దేశంలో నమోదు చేసుకున్న తల్లిదండ్రులను ఈ చట్టం ప్రభావితం చేయబోదు. అయితే తమ పిల్లలు పాఠశాలలో చేరి్పంచే సమయంలో సమస్యల పాలవుతామని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సెనేట్ నిర్ణయాన్ని ప్రధానమంత్రి జార్జియా మెలోని స్వాగతించారు. కాగా, కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ సెనేట్ దగ్గర కొందరు నిరసన ప్రదర్శనలు చేశారు. ఎల్జీబీటీక్యూ జంటలను తల్లిదండ్రులుగా మారకుండా చేసే ఈ చట్టాలు మధ్యయుగాల నాటివని విమర్శించారు. మెలోనీ 2022లో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అత్యంత సాంప్రదాయిక సామాజిక ఎజెండాను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. స్వలింగ సంఘాలను చట్టబద్ధం చేసిన చివరి యురోపియన్ దేశాల్లో ఇటలీ ఒకటి. ఇటాలియన్ కేథలిక్ చర్చి ఒత్తిడితో స్వలింగ వివాహాలకు మాత్రం ఇంకా చట్టబద్ధత ఇవ్వలేదు. పోప్ ఫ్రాన్సిస్ సరోగసీపై ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రపంచ నిషేధానికి పిలుపునిచ్చారు. పిల్లలు దేవుడు ఇచ్చే బహుమతి అని, వాణిజ్య ఒప్పందం కాదని నొక్కి చెప్పారు. ఎల్జీబీటీక్యూ వ్యక్తులను చర్చికి స్వాగతిస్తూ ఫ్రాన్సిస్ చర్చి విధానాలను మార్చారు. అబార్షన్, సరోగసీలను మాత్రం బలంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ కొత్త చట్టం రాజకీయంగా మెలోనికి సవాలుగా మారవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చిన్న వయసులోనే సీయీవో అయ్యారు!
ఎడ్యుకేషన్ యాప్ ‘అల్ఫా బెట్’. ఎమర్జెన్సీ సర్వీస్ యాప్ ‘ఎమర్జెన్సీ’ గేమింగ్ యాప్ ‘సూపర్ హీరో అండ్ కార్ రేసింగ్ ఒకటి కాదు రెండు కాదు 150 యాప్స్ క్రియేట్ చేశారు ఈ బ్రదర్స్.ఫ్రెండ్స్ ఈరోజు మనం చెన్నైకి చెందిన శ్రావణ్, సంజయ్ బ్రదర్స్ గురించి తెలుసుకుందాం. పది, పన్నెండేళ్ల వయసులోనే ఈ బ్రదర్స్ ఒక యాప్‌ను డెవలప్ చేసి బోలెడు పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు...‘గో డైమన్షన్స్’ పేరుతో ఒక కంపెనీని మొదలుపెట్టారు. యంగెస్ట్ సీయీవోలుగా దేశం దృష్టిని ఆకర్షించారు.వారి తండ్రి కుమరన్ సురేంద్రన్ వల్ల శ్రావణ్, సంజయ్‌లకు సాంకేతిక విషయాలపై ఆసక్తి పెరిగింది.‘కంప్యూటర్లు ఎలా పని చేస్తాయి?’ నుంచి లేటెస్ట్ టెక్నాలజీ వరకు తండ్రి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకునేవారు.టెక్నాలజీకి సంబంధించిన విషయాలను చందమామ కథల్లాగా ఆసక్తిగా వినేవారు.ఏ మాత్రం సమయం దొరికిన కంప్యూటర్లో రకరకాల కొత్త విషయాల గురించి తెలుసుకునేవారు.అలా ఎన్నో యాప్‌ల గురించి తెలుసుకున్నారు.కొత్త కొత్త యాప్‌ల గురించి తెలుసుకునేటప్పుడు తమకు కూడా యాప్ తయారు చేయాలనిపించింది.‘క్యాచ్ మీ కాప్’ పేరుతో ఈ బ్రదర్స్ రూపోందించిన యాప్‌కు మంచి పేరు వచ్చింది. ఇది పిల్లల ఆటలకు సంబంధించిన యాప్. దీంతో పాటు రూపోందించిన ఎడ్యుకేషన్ యాప్ ‘అల్ఫా బెట్’. ఎమర్జెన్సీ సర్వీస్ యాప్ ‘ఎమర్జెన్సీ’ గేమింగ్ యాప్ ‘సూపర్ హీరో అండ్ కార్ రేసింగ్ ఒకటి కాదు రెండు కాదు 150 యాప్స్ క్రియేట్ చేశారు.ఫ్రెండ్స్, శ్రావణ్, సంజయ్ గురించి మీరు చదివారు కదా... మరి మీ గురించి కూడా గొప్పగా రాయాలంటే.... మీరు కూడా ఏదైనా సాధించాలి. మరి ఒకేనా! -
వారణాసిలో ఏపీకి చెందిన అన్నదమ్ముల బలవన్మరణం
వారణాసి/ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక సెల్ఫీ వీడియోలు తీసి ఆత్మహత్య చేసుకోవడంతో విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఏలూరు జిల్లా ఉంగటూరులోని నారాయణపురానికి చెందిన అన్న దమ్ములు వినోద్, లక్ష్మీనారాయణలు రియల్ ఎస్టేట్,ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండేవారు. వ్యాపార నిర్వహణకు స్నేహితులు, స్థానికుల వద్ద అప్పులు చేశారు.అయితే వ్యాపారంలో నష్టాలు రావడం, తమ డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడంతో అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు .అనంతరం ఏపీ నుంచి వారణాసికి వెళ్లారు. అక్కడ ఆంధ్రా ఆశ్రమంలో గదిని అద్దెకు తీసుకుని.. అందులోనే ఉంటున్నారు.ఇదీ చదవండి : ప్రశ్నార్ధకంగా విశాఖ ఉక్కు పరిశ్రమఈ తరుణంలో వ్యాపారంలో నష్టాలు, అప్పులు ఇచ్చిన వారిని నుంచి ఒత్తిడి పెరిగిపోతుందని, తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియో తీశారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. సెల్ఫీ వీడియోపై సమాచారం అందుకున్న వారాణాసి పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అన్నదమ్ములిద్దరు ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించారు. అన్నదమ్ముల మృతిపై ఏపీలోని వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
చేపల వేటకు వెళ్లి ముగ్గురు సోదరుల మృతి
ఆదిలాబాద్ రూరల్: వాగులో చేపల వేటకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్‌రూరల్ మండలం పొచ్చర గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నా యి. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన నాగుల్వార్ విజయ్(28), నాగుల్వార్ ఆకాశ్(26), నాగుల్వార్ అక్షయ్(22) ముగ్గురు అన్నదమ్ములు. తాంసి మండలంలోని బండల్‌నాగాపూర్‌లో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ముగ్గురూ పొచ్చర గ్రామ సమీపంలోని వాగు వద్దకు చేపల వేటకు ఉదయం వెళ్లారు. చేపలు పడుతున్న క్రమంలో అక్షయ్ ప్రమాదవశాత్తు కాలుజారి వాగులో పడిపోగా...అతడిని రక్షించేందుకు ఇద్దరన్నదమ్ములూ వాగులోకి దూకేశారు. అయితే వీరికి కూడా ఈత రాకపోవడంతో ముగ్గురు వాగులో కొట్టుకుపోయారు. వీరితో పాటే అక్కడికి వెళ్లిన వీరి సమీప బంధువు కాంబ్లే శ్రీనివాస్ గ్రామస్తులకు, పోలీసులకు సమాచారమివ్వగా వారు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఈ ముగ్గురూ వాగులో కొట్టుకుపోయారు. దీంతో గజ ఈతగాళ్లను రప్పించి వీరి కోసం గాలించగా...ముందుగా విజయ్ తర్వాత ఆకాశ్, అక్షయ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. -
పెళ్లి వేడుకలో కంగనా.. ఫ్యామిలీతో సంతోషంగా.. (ఫోటోలు)
-
హత్య కేసులో.. అన్నదమ్ములకు యావజ్జీవం!
కరీంనగర్: తమపై పెట్టిన హత్యాయత్నం కేసు ను రాజీ కుదర్చుకోవడం లేదనే కారణంతో ఓ వ్యక్తి ని హత్య చేసిన అన్నదమ్ములకు యావజ్జీవ శిక్షతోపా టు రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తూ జగిత్యా ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.నీలిమ మంగళవారం తీర్పు చెప్పారు.పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్లికా ర్జున్ కథనం ప్రకారం.. మెట్పల్లి మండలం వేంపేట కు చెందిన ధనరేకుల రాజేందర్ వ్యవసాయంతోపా టు ఉపాధిహామీలో మేట్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడంటూ సదరు మహిళ భర్త జెల్ల రమేశ్, అతని తమ్ముడు జెల్ల మహేశ్ 2020 మార్చి 3న కత్తితో రాజేందర్‌పై దాడి చేశారు. దీంతో రాజేందర్ మెట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అన్నదమ్ములపై కేసు నమోదైంది.ఇద్దరూ జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చారు. ఆ కేసును రాజీ చేసుకోవా లంటూ పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ జరిగింది. రాజీకి రాజేందర్ ససేమిరా అన్నాడు. దీంతో అతడిని ఎలాగైనా చంపాలని అన్నదమ్ములు నిర్ణయించుకున్నారు. 2020 మే 19న గ్రా మ శివారులో ఉపాధి హామీ పనులకు వెళ్లిన రాజేందర్‌పై జెల్ల రమేశ్, జెల్ల మహేశ్ విచక్షణరహితంగా కత్తులతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందా డు.రాజేందర్ భార్య హరిణి ఫిర్యాదు మేరకు అప్ప టి మెట్పల్లి ఎస్సై ఎన్.సదాకర్ కేసు నమోదు చేశా రు. అప్పటి సీఐలు రవికుమార్, ఎల్.శ్రీనివాస్ దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధి కారులు కిరణ్‌కుమార్, రంజిత్‌కుమార్ సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టారు. వాటిని పరిశీలించిన జడ్జి రమేశ్, మహేశ్‌కు యావజ్జీవ శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. -
Celebrity Siblings: సినీ ఇండస్ట్రీలో సత్తా చాటిన అన్నదమ్ములు (ఫోటోలు)
-
భార్యతో గొడవ పడొద్దని మందలించిన అన్నను దారుణంగా..
నిజామాబాద్: భార్యతో గొడవ పడొద్దని మందలించిన అన్నను తమ్ముడు గొడ్డలితో అతికిరాతకంగా నరికి చంపిన ఘటన కోటగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పొతంగల్‌లో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పాత పొతంగల్‌కు చెందిన దిమ్మెల గోవింద్ (58), విఠల్ అన్నాదమ్ముళ్లు. గోవింద్ మండల కేంద్రంలో క్షౌ రశాల నడుపుతూ జీవిస్తున్నాడు. విఠల్ తన భార్యతో తరచూ గొడవపడుతుండడంతో అన్న గోవింద్ మందిలించేవాడు. ఈ క్రమంలో గోవింద్‌పై విఠల్ కక్షపెంచుకున్నాడు. రోజులాగే గురువారం పనిపూర్తి చేసుకొని రాత్రి ఇంటికి చేరుకున్న గోవింద్‌ను విఠల్ గొడ్డలితో నరికి హతమర్చాడు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ జయేశ్‌రెడ్డి, ఏఎస్సై శ్రీనివాస్‌గౌడ్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. మృతుడి భార్య విఠల్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తనను మందలించినందుకు గోవింద్‌ను విఠల్ హతమర్చాడా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇవి చదవండి: పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఒక్కసారిగా.. -
అక్కా తమ్ముడు-అన్నా చెల్లెళ్లకు ఆ ఆలయంలోకి నో ఎంట్రీ!
సాధారణంగా ఏ గుడికైన కుటుంబ సమేతం వెళ్లి దర్శించుకుంటాం. కానీ ఓ గుడికి మాత్రం అక్కా-తమ్ముడు, అన్నా-చెల్లెళ్ల కలిసి వెల్లకూడదట. అలాంటి వింత ఆలయం భారత్‌లో ఒకటి ఉంది. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది? ఎందుకని ఈ నిషేధం విధించారంటే.. ఆ ఆలయం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ గ్రామంలో ఉంది. అది సాక్షాత్తు భోళా శంకరుడు ఆలయం. ఈ శివాలయాన్నిఏడు, ఎనిమిదో శతాబ్దకాలంలో కాలచూరి పాలకులు ఎరుపు, నలుపు రంగులతో కూడిన ఇసుకరాయితో నిర్మించారట. ఆలయ స్తంభాలపై అనేక అందమైన శిల్పాలు పర్యాటకులను అమితతంగా ఆకర్షిస్తాయి. ఈ దేవాలయంలోనే ఓ చిన్న మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియం వివిధ రకాల విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. ఎందుకు ఈ నిషేధం అంటే.. ఈ ఆలయాన్ని కేవలం రాత్రుళ్లులోనే నిర్మించారట. అయితే ఆ గుడిని నిర్మించే శిల్పి నారాయణ్ నగ్నంగా ఈ ఆలయాన్ని నిర్మించేవాడట. రోజూ అతడి భార్యే అతనికి భోజనం తీసుకొచ్చేదట. కానీ, ఓ రోజు నారాయణ్ చెల్లెలు భోజనం తీసుకుని ఆలయంలోకి వచ్చింది. నగ్నంగా ఉన్న అతడిని ప్రమాదవశాత్తు చూస్తుంది. దీన్ని నారాయణ్ చాలా అవమానంగా భావించి ఆ గుడిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అప్పటి నుంచి సోదర సోదరీమణులు ఈ ఆలయంలోకి రాకూడదని ఆ గ్రామ పెద్దలు నిషేధం విధించారు. అంటే అక్క తమ్ముడు, అన్నా- చెల్లికి మ్రాతమే నో ఎంట్రీ. అంటే అక్కా చెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లుకు ఇది వర్తించదు. ఏదీఏమైన కొన్ని దేవాలయాల నిర్మాణ శైలి, ఆచారాలు అత్యంత విచిత్రంగా ఉంటాయి. (చదవండి: ప్రపంచంలోనే బెస్ట్ డెజెర్ట్గా భారతీయ స్వీట్! ఎన్నో స్థానంలో నిలిచిందంటే..) -
జోగానీ బ్రదర్స్ కేసు : బిజినెస్ టైకూన్‌కి వేల కోట్ల షాక్!
భారతదేశానికి చెందిన ఐదుగురు సోదరుల మధ్య రెండు దశాబ్దాలుగా సాగిన జటిలమైన కుటుంబ స్థిరాస్తి వివాదంలో లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్టులో నలుగురు తోబుట్టువులకు తీర్పునిచ్చింది. బిజినెస్ టైకూన్ హరేష్ జోగాని తన నలుగురు సోదరులకు దాదాపు 20వేల కోట్ల రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అమెరికా చరిత్రలో ఇప్పటివరకు కోర్టు ప్రకటించిన ఇదే అతిపెద్దనష్టపరిహారం అని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. జోగాని వర్సెస్ జోగానిగా పాపులర్ అయిన 21 ఏళ్ల నాటి కేసును విచారించిన కోర్టు తాజా తీర్పు వెలువరించింది. హరేష్ జోగానీపై, అతని సోదరులు శశికాంత్, రాజేష్, చేతన్ , శైలేష్ జోగానీఆస్తి పంపకాల విషయమై సుదీర్ఘ భాగస్వామ్యాన్ని ఉల్లంఘించాడనే ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఐదు నెలల విచారణ త తాజా 7 బిలియన్ డాలర్ల విలువైన తీర్పునిచ్చింది. సోదరులకు హరీష్ 2.5 బిలియన్ల డాలర్ల (రూ. 20 వేల కోట్ల) నష్టపరిహారం చెల్లించాలని, వందల కోట్ల డాలర్ల విలువైన దాదాపు 17,000 అపార్ట్మెంట్లతో కూడిన దక్షిణ కాలిఫోర్నియా రియల్ ఎస్టేట్ ఆస్తిని వాటాల ప్రకారం విభజించాలని ఆదేశించింది. భారతదేశంలోని గుజరాత్‌కు చెందిన జోగాని కుటుంబం, ఐరోపా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం ఉత్తర అమెరికాలో ప్రపంచ వజ్రాల వ్యాపారంతో రాణించింది. అలాగే శశికాంత్ లేదా "శశి" జోగాని 1969లో 22 ఏళ్ల వయస్సులో కాలిఫోర్నియాకు వెళ్లాడు. అక్కడ సొంతంగా రత్నాల వ్యాపారంలో సోలో సంస్థను ప్రారంభించి సక్సెస్ అయ్యాడు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చి బాగా విస్తరించాడు కూడా. అయితే 1990ల ప్రారంభంలో మాంద్యం కారణంగా వీరు ఆస్తులు నష్టపోయారు. దీంతో పాటు 1994 నార్త్‌రిడ్జ్ భూకంపం సందర్భంగా శశికి చెందిన భవనం ఒక దానిలో 16 మంది చనిపోవడంతో ఇది మరింత ముదిరింది. ఈ క్రమంలో శశికాంత్ తన సోదరులను బోర్డు లోకి తీసుకువచ్చి, వారిని తన సంస్థ భాగస్వాములుగా చేసుకున్నాడు. రియల్ ఎస్టేట్హోల్డింగ్ ద్వారా దాదాపు 17,000 అపార్ట్మెంట్ యూనిట్లను నిర్మించారు. దీని తర్వాతే వివాదం మొదలైంది. హరేష్ మేనేజ్మెంట్ నుండి తనను బలవంతంగా తొలగించి, తమకు రావాల్సిన దానిని అడ్డు కున్నాడని 2003లో శశి జోగాని ఫిర్యాదు చేశాడు. అయితే రాతపూర్వక భాగస్వామ్యం ఏదీ లేదని హరేష్ జోగాని వాదించాడు. విచారణ తర్వాత హరేష్ మౌఖిక ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు జ్యూరీ గుర్తించింది. 170కి పైగా అపార్ట్మెంట్ భవనాలున్న పోర్ట్‌ఫోలియోకు హరేష్ జోగాని ఏకైక యజమాని కాదని, ఇందులో శశికాంత్(72) కు 50 శాతం , హరేష్ 24 శాతం, రాజేష్ 10 శాతం, శైలేష్ 9.5 శాతం, చేతన్ 6.5 శాతం వాటాలు ఉన్నట్టు జ్యూరీ నిర్ధారించింది. ఇంకా చర్చలు జరుపుతున్నందున,ప్రతివాది హరేష్ జోగాని తరపు న్యాయవాది రిక్ రిచ్మండ్ వ్యాఖ్యానించడానికి నిరాకరించినట్టు సమాచారం. -
పొలం వద్ద ఉన్న పారతో అన్నను తమ్ముడు దారుణంగా..
మహబూబాబాద్: బోరుబావి వివాదంలో సొంత అన్నపై తమ్ముడు దాడి చేయగా తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని సూర్యబండా తండాలో ఆదివారం జరిగింది. తండావాసులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. తండాకు చెందిన భూక్యా సదన్లాల్కు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కాగా సదన్లాల్ తనకున్న వ్యవసాయ భూమిని, బోరు మోటరును కుమారులు రవీందర్, రమేశ్‌కు ఇవ్వడంతో దానిని ఉమ్మడిగా వాడుకుంటున్నారు. కాగా కొంతకాలంగా బోరుబావి విషయంలో అన్నదమ్ముల మధ్య పంచాయితీ నెలకొంది. ఈక్రమంలో ఆదివారం అన్నదమ్ముల మధ్య సయోధ్యకు పెద్దమనుషులు ప్రయత్నిస్తుండగా తమ్ముడు రమేశ్ పొలం వద్ద ఉన్న పారతో అన్న రవీందర్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేర రమేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఇవి చదవండి: ఆర్టీసీ బస్సు, డీసీఎం ఘోర రోడ్డు ప్రమాదం! పొగ మంచు, అతివేగమే కారణమా? -
మరణంలోనూ వీడని బంధం! తల్లడిల్లిన తల్లి హృదయం..
కరీంనగర్: ఆ కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు.. అనూహ్యంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మలివయసులో అండగా ఉంటారనుకున్న ఇద్దరు కుమారు హఠాత్తుగా చనిపోవడంతో ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. ఈ విషాద సంఘటన మంథనిలో విషాదం నింపింది. పుట్టినప్నుంచి ఎంతో ఆప్యాయంగా పెరిగి వారి బంధాలు.. మరణంలోనూ ఒకటిగా కలిసే పోవడంతో స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. ఎస్సై కిరణ్ కథనం ప్రకారం.. మంథని పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన తాటి నాగరాజు(42), ఆయన సోదరుడు నవీన్(35) రామగిరి మండలం బేగంపేటకు శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై పనినిమిత్తం వెళ్తున్నారు. అయితే, లక్కేపూర్ క్రాస్ రోడ్డు సమీపంలోకి వెళ్లగానే ఎదురుగా, అతివేగం వచ్చిన ట్రాక్టర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. నాగరాజును స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన అక్కేపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్‌గా గుర్తించారు. అన్నదమ్ములను ఢీకొట్టిన ట్రాక్టర్ సమీపంలోని ప్లాట్ల వద్ద అదుపుతప్పి పడిపోయినట్లు సమాచారం. ప్లాట్లలో మట్టి పడి ఉంది. ట్రాక్టర్ బోల్తాపడిన ఆనవాళ్లు ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. ట్రాక్టర్‌ను సరిచేసుకొని డ్రైవర్ అక్కడి పారిపోయినట్లు భావిస్తున్నారు. కాగా ప్రమాదంలో మృతి చెందిన నాగరాజుకు భార్య, కూతురు(12) ఉన్నారు. అలాగే నవీన్‌కు భార్య, సంవత్సరం, మూడేళ్ల కుమారులు ఉన్నారు. మృతులిద్దరూ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. తల్లి రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. కదిలించిన హృదయాలు.. మంథని సుభాష్‌నగర్‌కు చెందిన తాటి రాధ– బాపు దంపతులకు నలుగురు కుమారులు. అనారోగ్యంతో బాపు మూడేళ్ల క్రితం మృతి చెందాడు. భర్తను కోల్పోయిన రాధ.. దుఃఖాన్ని కడుపులోనే దాచుకుని తన కుమారులను చూసుకుంటోంది. ఇందులో ఇద్దరు డ్రైవర్లుగా పనిచేస్తుండగా, చిన్న కుమారుడు హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. మరో కుమారుడు అమాయకుడు కావడంతో ఇంటివద్దే ఉంటున్నాడు. కాగా, నాగరాజుకు కుమారుడు లేడు. దీంతో కూతురుతో చితికి నిప్పంటించారు. అలాగే నవీన్ పెద్దకుమారుడు(3)తో చితికి నిప్పు పెట్టించడంతో అక్కడున్నవారుకన్నీటి పర్యంతమయ్యారు. అందరితో కలివిడిగా ఉండే అన్నదమ్ములు ఒకేరోజు ప్రమాదంలో మృతి చెందడం విషాదం నింపింది. ఇవి కూడా చదవండి: ఆన్లైన్ గేమ్స్‌తో జాగ్రత్త! లేదంటే ఇలా జరుగుతుందేమో!? -
ప్రిన్స్ యావర్‌కు లవ్ స్టోరీ.. బ్రదర్స్ ఏమన్నారంటే?
ప్రిన్స్ యావర్ ఈ పేరు గురించి ఇప్పుడు పరిచయం చేయాల్సిన పనిలేదు. మోడలింగ్‌లో ఇప్పటికే సత్తా చాటిన యావర్.. బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు సరిగా రాకపోయినా హౌస్‌లో అడుగుపెట్టి అదరగొడుతున్నాడు. చివరివారం వరకు హౌస్‌లో ఉండి గ్రాండ్ ఫినాలేకు అర్హత సాధించాడు. అంతకుముందు ఎవరికీ తెలియని యావర్ తెలుగులో ఓ సీరియల్లో నటించారు. ఆ తర్వాత కరోనా సమయంలో ఛాన్సులు లేక తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు ప్రిన్స్ యావర్. ఏదైనా ఉద్యోగం చేద్దామని అమీర్‌పేట్‌లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అలాంటి యావర్ ఇప్పుడు బిగ్‌బాస్‌తో అందరికీ చేరువయ్యాడు. ఈ వారం గ్రాండ్ ఫినాలే జరుగుతున్న సందర్భంగా యావర్ బ్రదర్స్ ఓ ఇంటర్వ్యూకూ హాజరయ్యారు. యావర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కాగా.. యావర్‌కు ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు. యావర్ హౌస్‌లో అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని తెలిపారు. గేమ్‌లో భాగంగానే యావర్ సీరియస్‌గా రియాక్ట్ అయి ఉంటారని చెప్పారు. గేమ్‌లో అలాంటివన్నీ భాగం.. అందుకే హౌస్‌లో ఏం జరిగినప్పటికీ మేం ఫీల్ అవ్వడం లేదన్నారు. తాను ట్రోఫీ గెలవాలని ఆశిస్తున్నామని తెలిపారు. ప్రశాంత్, యావర్, శివాజీ ఫ్రెండ్షిప్ వెరీ గుడ్.. వాళ్లను అలా చూస్తుంటే మాకు సంతోషంగా ఉందన్నారు. వారిలో ఎవరు ట్రోఫీ గెలిచినా మాకు సంతోషమేనన్నారు. అయితే గ్రాండ్ ఫినాలేలో యావర్‌కు మనీ ఆఫర్ చేస్తే ట్రోఫీ తీసుకుంటాడా? మనీ తీసుకుంటాడా? అని యాంకర్ ప్రశ్నించారు. అయితే దీనికి యావర్ బ్రదర్ మాట్లాడుతూ.. యావర్‌కు చాలా లోన్స్ ఉన్నాయి.. అందువల్ల మనీకే ప్రయారిటీ ఇస్తాడని చెప్పుకొచ్చారు. అయితే యావర్ హౌస్‌లో అందరితో ఫ్రెండ్‌గానే ఉంటారని తెలిపారు. యావర్‌కు ఎలాంటి లవ్ స్టోరీ లేదని వివరించారు. ఎవరైనా ప్రపోజల్స్ వచ్చనా.. అతను పెద్దగా రియాక్ట్ కాడని చెప్పుకొచ్చారు. ఇంట్లో కూడా యావర్ చాలా సింపుల్‌గా ఉంటాడని బ్రదర్స్ వెల్లడించారు. -
రొట్టె కోసం రక్తపాతం..అన్నను హత్య చేసిన తమ్ముడు!
యూపీలోని కాన్పూర్‌లో రొట్టె ముక్కకోసం అన్నదమ్ములు రక్తం కళ్లజూసుకున్నారు. రొట్టె కోసం జరిగిన వివాదంలో తమ్ముడు అన్నను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అన్నయ్య.. తమ్ముని కోసం ప్రత్యేకంగా రొట్టెలు తయారు చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అన్నను హత్య చేసిన తమ్ముడు అంతటితో ఆగక సోదరుని మృతదేహంతో ఏమి చేశాడో తెలిస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. ఈ ఉదంతం కాన్పూర్‌లోని బిల్హౌర్ పరిధిలోని నానామవు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలోని ఒక ఇంటిలో కల్లూ, భూరా అనే అన్నదమ్ములుంటున్నారు. వీరిలో కల్లూ పెద్దవాడు. అతనికి ఇంకా వివాహం కాలేదు. అయితే అతని సోదరుడు భూరాకు వివాహం జరిగింది. అతని భార్య రక్షాభంధన్ కోసం పుట్టింటికి వెళ్లి, ఇంకా తిరిగి రాలేదు. ఆమె ఇంటిలో ఉన్నప్పుడు భర్తకు, కల్లూకు వంటవండేది. తాజాగా భూరా పనిమీద ఇంటి నుంచి బయటకు వెళుతూ అన్నతో తాను ఇంటికి వచ్చేసరికి రొట్టెలు తయారు చేసిపెట్టాలని కోరాడు. అయితే రాత్రి భూరా ఇంటికి వచ్చేసరికి కల్లూ అతని కోసం రొట్టెలు తయారు చేయలేదు. వెంటనే కోపంతో రగిలిపోయిన భూరా తన అన్నను ‘రొట్టెలు ఎందుకు తయారు చేయలేదని’ అడిగాడు. దానికి సమాధానంగా కల్లూ ‘నువ్వు నాకు రొట్టెలు తయారు చేయలేదు కనుక నేను నీకు రొట్టెలు తయారు చేయలేదు’ అని అన్నాడు. ఈ నేపధ్యంలో వీరిద్దరి మధ్య వివాదం మొదలయ్యింది. ఇంతలో తమ్మడు ఇంటి బయట ఉన్న పెద్ద బండరాళ్లు తీసుకు వచ్చి ఏకధాటిగా అన్నపై దాడి చేశాడు. ఈ దాడిలో అన్న అక్కడికక్కడే మృతి చెందాడు. అన్న మృతిచెందినా తమ్ముని ఆగ్రహం ఇంకా చల్లారలేదు. అన్న మృతదేహానికి తాడుకట్టి, దానికి లాక్కుంటూ గ్రామం శివారులకు తీసుకువచ్చాడు. అక్కడున్న నదిలోని పడవలో అన్న మృతదేహాన్ని ఉంచి, నది మధ్యలో దానిని వదిలివేశాడు. అయితే తమ్ముడు అన్న మృతదేహాన్ని రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకువెళుతున్నప్పుడు గ్రామానికి చెందిన కొందరు దానిని గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ విజయ్ ఢులా మాట్లాడుతూ తమ విచారణలో నిందితుడు.. రొట్టె కోసం తనకు, తన అన్నకు వివాదం జరిగిందని, ఈ నేపధ్యంలోనే తాను అన్నను హత్యచేశానని తెలిపాడన్నారు. నదిలోని కల్లూ మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: ‘హైదరాబాద్ హౌస్’ యజమాని ఎవరు? డబ్బును నీళ్లలా ఎందుకు ఖర్చు చేశారు? -
ఏఐ సాయంతో అశ్లీల వీడియోలు.. పోలీసు అధికారి కుమారులు అరెస్ట్!
మహారాష్ట్రలోని పాల్ఘర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (ఏఐ)ని వినియోగించిన తీరుచూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే. ఈ ప్రాంతానికి చెందిన పోలీసు అధికారి కుమారులిద్దరు ఏఐ వినియోగించి, పలువురు యువతులు, మహిళల అశ్లీల వీడియోలను రూపొందించి, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. యువతులు దీనిని వ్యతిరేకించడంతో వారిపై ఈ ఇద్దరు యువకులు దాడికి దిగారు. ఈ ఘటన అనంతరం ఇద్దరు యువతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆ యువకులను పోలీసులు అరెస్టు చేశారు. పాల్ఘర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులిద్దరి వయసు 20 ఏళ్లు ఉంటుందని, వారి తండ్రి ముంబైలో పోలీసు అధికారి అని గుర్తించామన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులిద్దరూ యువతుల, మహిళల ఫొటోలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ వినియోగించి అశ్లీల వీడియోలు తయారు చేస్తున్నారు. వీరి బారినపడిన ఇద్దరు బాధిత యువతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమొదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: అది రాఖీ నాడు మాత్రమే తెరుచుకునే ఆలయం.. విష్ణు అవతారం ఇక్కడేనట! -
గుండెపోటుతో తమ్ముడు.. పెద్ద కర్మరోజు అన్నకు కూడా..
కరీంనగర్: తమ్ముడి మృతి ని తట్టుకోలేక అన్న గుండె ఆగింది. తమ్ముడు గుండెపోటుతో మృతిచెందగా.. పెద్దకర్మరోజు అన్న కూడా గుండెపోటుతో కుప్పకూలాడు. చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశాడు. ఈ విషాద ఘటన తిమ్మాపూర్ మండలం రేణికుంటలో జరిగింది. రేణికుంటకు చెందిన ఉమ్మెంతల చంద్రారెడ్డికి ఇద్దరు కొడుకులు సంతోష్‌రెడ్డి(30), మధుకర్‌రెడ్డి(26) ఉన్నారు. పెద్దకొడుకు సంతోష్‌రెడ్డి కరీంనగర్లో, మధుకర్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరికీ పెళ్లికాలేదు. 20 రోజుల క్రితం మధుకర్‌రెడ్డికి జ్వరం వచ్చింది. హైదరాబాద్‌లోనే ఓ ఆస్పత్రిలో చేరగా రక్తకణాలు తగ్గినట్లు డాక్టర్లు చెప్పారు. చికిత్స తీసుకుంటున్న క్రమంలో గుండెపోటుకు గురై ఈనెల 3న మృతిచెందాడు. తమ్ముడి పెద్ద కర్మరోజు సంతోష్ రెడ్డి గుండెపోటుకు గురయ్యాడు. ఆయనను కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు. చికిత్సకు సుమారు రూ.20 లక్షలకు పైగా ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో నిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం సంతోష్ మృతిచెందాడు. పక్షం రోజుల వ్యవధిలో ఇద్దరు కొడుకులు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
అన్నల మద్యం అలవాటుకు చెల్లెలు బలి.. సూసైడ్ నోట్లో మరో యువకుని పేరు?
ఉత్తరప్రదేశ్‌లోని కౌషాంబీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులకు ఆ బాలిక ఇంటిలో ఒక సూసైడ్ నోట్ లభ్యమయ్యింది. దానిలో ఆమె తాను సూసైడ్ చేసుకునేందుకు గల కారణాలను వివరించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ బాలిక సోదరులు మద్యానికి బానిసగా మారి ఇంటిలోని వారిని ఇబ్బంది పెడుతుంటారు. ఈ ఇబ్బందులను భరించలేకనే వారి సోదరి ఆత్మహత్య చేసుకుంది. కౌషాంబీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్-4లో ఉంటున్న ఆ బాలిక ఇంటిలో ఎవరూలేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారికి ఆ ఇంటిలో మృతురాలు స్వయంగా రాసిన సూసైడ్ నోట్ లభ్యమయ్యింది. మద్యం మత్తుకు బానిసలైన సోదరులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 16 ఏళ్ల బాలిక తన తల్లి, ఇద్దరు సోదరులతో పాటు ఈ ప్రాంతంలో ఉంటోంది. ఆ బాలిక తండ్రి కొన్నేళ్ల క్రితమే మృతిచెందాడు. తల్లి ఇంటి భారాన్నిమోస్తోంది. ఆ బాలిక ఇద్దరు సోదరులు నిత్యం మద్యం మత్తులో మునిగితేలుతుంటారు. తల్లీకూతుర్లు ఈ విషయమై వారిని హెచ్చరించినా వారు తమ వ్యసనాన్ని విడిచిపెట్టలేదు. కొన్ని రోజుల క్రితం ఒక సోదరుడు ఏదో కేసులో జైలుకు వెళ్లాడు. తాజాగా ఆ బాలిక ఇంటిలో ఉన్న సోదరునికి తన ఫోను ఇచ్చి, మరమ్మతు చేయించి తీసుకురమ్మని చెప్పి బయటకు పంపింది. తల్లి కూడా పని కోసం వెళ్లింది. సూసైడ్ నోట్లో మరో యువకుని పేరు? ఇంటిలో ఎవరూలేని సమయం చూసుకుని ఆ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి ముందు ఆమె ఒక సూసైడ్‌నోట్ రాసింది. దానిలో ఆమె తన సోదరులు మద్యానికి బానిస కావడంపై ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు పేర్కొంది. కాగా ఆ బాలిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. పెద్దగా చదువుకోకపోయినా ఆ బాలిక సూసైడ్ నోట్‌ను ఇంగ్లీషులో రాసింది. ఆ నోట్లో ఆమె ఒక యువకుని పేరు రాసింది. అతను తన సోదరుని స్నేహితుడని, తన మృతదేహాన్ని చూసేందుకు అతనికి అవకాశం కల్పించాలని కోరింది. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, దర్యాప్తు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: ఆగస్టు 14.. చాలామందికి జ్వరం?.. మీరూ ఆ జాబితాలో ఉన్నారా?.. పిచ్చెక్కిస్తున్న మీమ్స్! -
'బుద్ధి'.. గడ్డి తినడం కాదు!..గడ్డిప్లేట్లోనే తిందాం!
బుద్ధి గడ్డి తినడం కాదిది. బుద్ధిగా గడ్డి ప్లేట్లో తినడం. పర్యావరణ పరిరక్షణ పట్ల బుద్ధి వచ్చిన తర్వాత చేసే పని. దీనికి పెట్టిన అందమైన పేరే బయో డిగ్రేడబుల్ టేబుల్ వేర్. కేరళకు చెందిన రిషభ్, రోషన్ సోదరుల ప్రయోగం ఇది. సముద్రాన్ని కూడా వదలని కాలుష్యం నుంచి తీసుకున్న నిర్ణయం. వీళ్లు ప్లేట్ల తయారీకి వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగిస్తున్నారు. వేడుకల సందర్భంగా ఇప్పుడు ఉపయోస్తున్న ఫైబర్, పాలిథిన్ పొర ఉన్న పేపర్ ప్లేట్లలో భోజనం చేసి బయట పారేసినప్పుడు చెత్త కుండీల దగ్గర చేరిన కుక్కలు, ఆవులు, ఇతర జంతువులు ఆ ప్లేట్లలో మిగిలిపోయిన ఆహారంతోపాటు ప్లేట్లను కూడా నమిలి మింగేస్తుంటాయి. దాంతో అవి అనారోగ్యాల బారిన పడుతుంటాయి. ఫైబర్ బదులు బయో డీగ్రేడబుల్ ప్లేట్ వాడినట్లయితే... మూగజీవులు మనం పారేసిన మిగులు ఆహారంతోపాటు ప్లేట్‌ని తిన్నప్పటికీ వాటి ఆరోగ్యానికి ఎటువంటి హానీ కలగదు. ఈ ప్లేట్లను నానబెట్టి ఎరువుగా మార్చుకుని పంటకు వాడుకోవచ్చు. ఏమీ చేయకుండా వదిలేసినా కూడా ఈ మెటీరియల్ మట్టిలో కలిసిపోయి ఆ మట్టి జవజీవాలను పెంచుతుంది. గడ్డి కంచం ఇలా పుట్టింది! అసలీ గడ్డి ప్లేట్ ఆలోచన ఎలా వచ్చిందంటే... రిషభ్‌కి సర్ఫింగ్ ఇష్టం. కేరళ, కోవళమ్, అరేబియా సముద్రంలో సర్ఫింగ్ చేసేవాడు. సముద్రపు అలలను తప్పించుకుంటూ బోర్డు మీద పెడలింగ్ చేయడం అత్యంత సాహసంతో కూడిన ఆట. ప్రాక్టీస్‌లో ఉన్నప్పుడు రిషభ్ తలకు, దేహానికి పాలిథిన్ పేపర్, ప్లాస్టిక్ వస్తువులు తగులుతుండేవి. ఒక్కోసారి పాలిథిన్ షీట్ వచ్చి కాళ్లకు చుట్టుకునేది. ఇలాంటిదే మరో సంఘటన ఈ సోదరులిద్దరికీ ఆఫ్రికాలోని ఉగాండా దేశంలో ఎదురైంది. అక్కడి పర్వత శిఖరాల మీదకు ట్రెకింగ్ చేస్తున్నప్పుడు ఎటు చూసినా ప్లాస్టిక్ కాలుష్యమే. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడం కంటే పాలిథిన్ వ్యర్థాలను తప్పించుకుంటూ అడుగులు వేయడంతోనే ట్రెకింగ్ పూర్తయింది. ఈ సమస్య ఒక్క కేరళనే కాదు, ప్రపంచం అంతటినీ వేధిస్తోందనిపింంది. పర్యావరణం ఎదురుగా భూతంలా నిలిన ఈ సవాల్‌కు జవాబు వెతికే ప్రయత్నంలో వీరికి వచి్చన ఆలోచన ఈ బయో డీగ్రేడబుల్ టేబుల్‌వేర్. క్వాడ్రాట్ పేరుతో మొదలు పెట్టిన ఈ ప్రయోగంలో ప్లేట్ తయారీకి తవుడు, పొట్టు, గడ్డి ఉపయోగించారు. ఇరవై నెలల నిరంతర పరశోధన, ప్రయోగాలతో ఒక రపం వచ్చింది. వేడుకల్లో ఉపయోగించే పేపర్ ప్లేట్, అల్యమినియం ఫాయిల్ అద్దుకున్న ప్లేట్, ఫైబర్ ప్లేట్ల స్థానాన్ని భర్తీ చేయగలుగుతుందా అనే పరీక్షలన్నింటినీ ఈ బయోడీగ్రేడబుల్ ప్లేట్ పాసయింది. ఇలా చేస్తున్నారు! పంట పొలాల నుంచి గడ్డిని, రైస్ మిల్లుల నుంచి తవుడు, పొట్టు సేకరించి శుభ్రం చేసిన తర్వాత హీటర్‌లో వేడి చేసి, మెత్తగా పొడి చేసి ప్లేట్, కప్పు, స్పన్ ఆకారంలో ఉన్న మౌల్డ్ ఆధారంగా రపం తెస్తారు. ఈ ప్లేట్లు భోజనం చేసే లోపు నానిపోతాయేమో అనే సందేహం కలుగుతుంది. పులుపు, రసం, మజ్జిగతో హాయిగా భోజనం చేయవచ్చని, నీటిలో నానబెట్టిన తర్వాత అరగంట సేపటి వరకు వాటి షేప్ మారదని చెప్పారు. అలాగే కప్పులు మరింత దృఢంగా 70 నిమిషాల సేపు ద్రవాలను నిలిపి ఉంచుతాయి. ఒకసారి తయారైన ఈ టేబుల్ వేర్ని ఏడాది పాటు నిల్వ ఉంచుకోవచ్చు. బయో డీగ్రేడబుల్ ప్లేట్లో ఆహారపదార్థాలు విదేశాలకెళ్తున్నాయి! ఢిల్లీ, ముంబయి, బెంగళరు నగరాలతోపాటు అండవన్ నికోబార్ దీవులు, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాలు ఈ ప్రత్యామ్నాయాన్ని ఆదరిస్తున్నాయి. అంతేకాదు, యూఎస్, యూకే, కెనడా, మెక్సికోలు కూడా ఈ బయోడీ గ్రేడబుల్ టేబుల్ వేర్‌కు స్వాగతం పలికాయి. నెలకు ప్లేట్లు, కప్పులు, స్ట్రాలు, స్పన్లు అన్నీ కలిపి పాతిక వేలు అమ్ముడవుతున్నాయని చెప్పారు రిషభ్, రోహన్‌లు. పొట్ట ఉబ్బిపోతుంది! జంతువులు మనం తినే ఆహారం వైపు చూస్తున్నాయంటే వాటికి వాటి ఆహారం దొరకడం లేదని అర్థం. వీధికుక్కలతోపాటు ఆవులు మరికొన్ని జంతువులు ఓ దశాబ్దకాలంగా జీర్ణవ్యవస్థ సమస్యలతో మరణిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ప్లాస్టిక్ వ్యర్థాలే. ప్లాస్టిక్ వ్యర్థాలను వరుసగా నెలరోజుల పాటు తిన్నాయంటే వాటి పెద్దపొట్టలో పదహారు నుంచి పద్దెనిమిది కిలోల ప్లాస్టిక్ పేరుకుంటుంది. ఐదారు కిలోలు చేరినప్పటి నుంచి వాటికి ఇబ్బందులు మొదలవుతాయి. గ్యాస్‌తో కడుపు ఉబ్బిపోతుంది. అక్యూట్ బ్లోటింగ్‌తో కొద్ది రోజుల్లోనే మరణిస్తాయి. ఎవరి పెంపకంలో లేని జంతువులకు ఈ ప్రమాదం ఎక్కువ. పరిస్థితి ఎంత దయనీయమంటే... ఆవులు నెమరు వేసుకునే ప్రక్రియలో ఆహారాన్ని తిరిగి నోట్లోకి తెచ్చుకున్నప్పుడు ఫైబర్, ప్లాస్టిక్ వ్యర్థాలు ముక్కలు ముక్కలుగా బయటపడుతుంటాయి. బయటపడడం కొంతలో కొంత నయం. పాలిథిన్ కవర్లు లోపల చుట్టచుట్టుకుని పోతే వాటంతట అవి బయటకు రాలేవు. ఆపరేషన్ చేయడమే మార్గం. ఈ జంతువులకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడాలన్నా కూడా ప్లాస్టిక్ పెద్ద పొట్టలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. అవి విసర్జక వ్యవస్థలోకి వెళ్లాయంటే ఇక ఏమీ చేయలేం. మరణాన్ని ఆపలేం. – డాక్టర్ మల్లేశ్ పాటిల్, అసిస్టెంట్ డైరెక్టర్, యానిమల్ హజ్బెండరీ, ఆంధ్రప్రదేశ్ (చదవండి: ఆ సమోసాల అమ్మే వ్యక్తి..ఓ గొప్ప జీవిత పాఠాన్ని నేర్పాడు!) -
తమ్ముడి వివాహేతర సంబంధం.. అన్న దారుణ హత్య...
పెద్దపల్లి: డబ్బుపై ఆశ.. వివాహేతర సంబంధం కారణంగా వారికి రక్త బంధం గుర్తు రాలేదు.. తోబుట్టువులే కాలయములై ఇంట్లో నిద్రిస్తున్న తమ అన్నపై పెట్రోల్ పోసి, నిప్పంటించి, కడతేర్చారు.. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కొత్తూరులో చోటుచేసుకుంది. దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. కొత్తూరుకు చెందిన గాలిపెల్లి బక్కయ్య–వినోద దంపతులకు ఇద్దరు కూమారులు, ఒక కూతురు ఉన్నారు. కూతురు పుష్పలతను సుల్తానాబాద్ మండలంలోని సుగ్లాంపల్లికి చెందిన బైరి అనిల్‌కు ఇచ్చి, వివాహం చేశారు. పెద్ద కుమారుడు అశోక్(36) ఐదేళ్లు దుబాయిలో ఉండి, పది నెలల క్రితమే స్వగ్రామం వచ్చాడు. అతని తమ్ముడు నరేశ్ జూలపల్లి మండల కేంద్రంలో బైక్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అశోక్ దుబాయిలో ఉంటూ సంపాదించిన డబ్బులను తన తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. వాటితో నరేశ్ ధర్మారం మండల కేంద్రంలో రెండు గుంటల భూమి కొనుగోలు చేసి, తన పేరిటే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తండ్రి బక్కయ్య అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడంతో ఇంటి వ్యవహారాలు చూసుకున్నాడు. తమ్ముడికి వివాహేతర సంబంధం.. ఈ క్రమంలో కొత్తూరుకే చెందిన ఓ వివాహితతో అశోక్ తమ్ముడు నరేశ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెను ఇంటికి తీసుకువస్తానని దుబాయి నుంచి వచ్చిన తన అన్నతో చెప్పాడు. దీనికి అతను కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందని, తనకు పెళ్లి కావాల్సి ఉందని అభ్యంతరం చెప్పాడు. నరేశ్ ప్రవర్తన నచ్చని అశోక్ తాను పంపించిన డబ్బుల లెక్క చెప్పాలని నిలదీశాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని చెల్లి, బావపై ఒత్తిడి అశోక్ తన బావ అనిల్‌కు కూడా అవసరం నిమిత్తం దుబాయి నుంచి డబ్బులు పంపించాడు. వాటిని తిరిగి ఇవ్వాలని చెల్లి పుష్పలత, బావపై ఒత్తిడి చేశాడు. దీంతో ఎలాగైనా అశోక్‌ను చంపాలని నరేశ్, పుష్పలత, అనిల్ నిర్ణయించుకున్నారు. 20 రోజుల క్రితం రాత్రి అతను ఇంట్లో నిద్రిస్తుండగా దాడి చేశారు. ఈ విషయమై అశోక్ ధర్మారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇది కుటుంబ వ్యవహారంగా భావించిన పోలీసులు కులపెద్దల సమక్షంలో పంచాయితీ చేసుకొని, కలిసి ఉండాలని సూచించారు. స్నేహితుల ఇళ్లలో ఉన్నాడు.. 5 రోజుల క్రితం కులపెద్దలు అశోక్, నరేశ్‌లను పిలిపించి తల్లిదండ్రులు బతికున్నంత కాలం ఆస్తుల జోలికి వెళ్లవద్దని, చెరో రూ.లక్ష వారి వద్ద నుంచి తీసుకోవాలని సూచించారు. దీనికి అన్నదమ్ములిద్దరూ అంగీకరించారు. అయితే తనకు ప్రాణహాని ఉందని అనుమానించిన అశోక్ ఇంటికి రాకుండా గ్రామంలోని స్నేహితుల ఇళ్లలో ఉన్నాడు. దీంతో బయట ఎందుకు ఉంటున్నావని ఇంటికి వెళ్లి, కలిసి ఉండాలని కుల పెద్దలు సూచించారు. దీంతో మంగళవారం రాత్రి ఇంటికి వచ్చి నిద్రించాడు. బుధవారం తెల్లవారుజామున నరేశ్, పుష్పలత, అనిల్ అతను బయటకు రాకుండా తలుపు గడియపెట్టారు. కిటికీలో నుంచి నిప్పంటించారు.. నిద్రలో ఉన్న అశోక్‌పై కిటికిలో నుంచి పెట్రోల్ పోసి, నిప్పంటించారు. మంటలకు అశోక్ లేచి, బయటకు వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి వరుసకు అన్న అయిన కొక్కుల రాంనారాయణ ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. సంఘటన స్థలాన్ని పెద్దపల్లి ఏసీపీ మహేశ్, సీఐ అనిల్, ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ పరిశీలించి, వివరాలు సేకరించారు. నరేశ్, పుష్పలత, అనిల్‌పై స్థానికులు దాడి చేసేందుకు ప్రయత్నించగా అడ్డుకొని, పోలీస్ వాహనంలో ధర్మారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
అన్నదమ్ముల అరెస్టు
ఆదిలాబాద్: ఈ నెల 15న వడూర్ గ్రామంలో అన్నదమ్ముల మధ్య గొడవలో వారిని సముదాయించే యత్నంలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు కందకూరి ప్రశాంత్ తండ్రి నర్సింగ్ ఈనెల 16న ఫిర్యాదు చేయగా బామిని గంగాధర్, పవన్‌కళ్యాణ్‌ను 17న వడూర్ బస్‌స్టాప్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు ఇచ్చోడ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అన్నదమ్ములు వారి సోదరికి తులం బంగారం విషయమై గొడవ పడుతుండగా, ప్రశాంత్ ఆపేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ప్రశాంత్ తులసీ గద్దైపె పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ క్రమంలో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సై సాయన్న, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
ఒకే కుటుంబంలోని ముగ్గురు సోదరులు మృతి
ఒడిశాలో చోటుచేసుకున్న రైలు ప్రమాదం ఘోర విషాదాన్ని మిగిల్చింది. పలు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. కొన్ని కుటుంబాలు ఇంటికి పెద్ద దిక్కును కోల్పోగా, మరికొన్ని కుటుంబాల్లో ఎదిగొచ్చిన పిల్లలు అకాల మృత్యువు పాలయ్యారు. అలాంటి ఉదంతం ఒకటి అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఉపాధి కోసం పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురు సోదరులు రైలులో తమిళనాడు బయలుదేశారు. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వీరు దుర్మరణం పాలయ్యారు. వీరిని 24 పరగణా జిల్లాలోని చర్నీఖలీ గ్రామానికి చెందిన హరన్ గోయెన్(40) నిశికాంత్ గోయన్(35) దివాకర్ గోయెన్(32)గా గుర్తించారు. వీరు ఏడాదిలో చాలాకాలం తమిళనాడులోనే ఉంటూ, అక్కడ దొరికిన పనులు చేస్తుంటారు. ఇటీవలే వీరు స్వగ్రామానికి వచ్చారు. కొన్నాళ్లు ఉన్నాక తిరిగి తమిళనాడు వెళ్లేందుకు కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. రైలు ప్రమాదంలో ఈ ముగ్గురు సోదరులు మరణించారనే వార్త తెలియగానే వారి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు సోదరులలో ఒకరైన హరన్ భార్య అంజిత చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇప్పుడు ఆమె గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. మృతి చెందిన ముగ్గురు సోదరుల తమ్ముడు ఇటీవలే ఒక హోటల్లో పనిలో చేరాడు. తండ్రిలేని ఈ కుటుంబానికి దిక్కు లేకుండా పోయిందని స్థానికులు విలపిస్తున్నారు. నిశికాంత్ కుటుంబం విషయానికొస్తే ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ రైలు ప్రమాదంలో 24 పరగణా జిల్లాకు చెందిన 12 మంది మృతి చెందారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. 110 మంది ఆచూకీ తెలియడం లేదు. ఇప్పుటి వరకూ 16 మంది బాధితులు వారి ఇళ్లకు చేరుకున్నారు. -
అంత్యక్రియలకొచ్చి అనంతలోకాలకు.. ప్రమాదంలో అన్నదమ్ములు మృతి
అక్కన్నపేట(హుస్నాబాద్): బంధువుల అంత్యక్రియలకు హాజరై తిరిగి వెళ్తుండగా, మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కారు అదుపు తప్పి చౌటపల్లి గ్రామానికి చెందిన నలుగురు అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఎరుకల కృష్ణ(47), సంజీవ్(43), సురేష్(38), వాసు(35)లు కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఐదు రోజుల క్రితం స్వగ్రామంలో చిన్నాన్న ఎరుకుల కనకయ్య మృతి చెందడంతో వారంతా కుటుంబసభ్యులతో కలిసి చౌటపల్లికి వచ్చారు. అంత్యక్రియలు పూర్తి కావడంతో మంగళవారం మధ్యాహ్నం నలుగురు అన్నదమ్ములూ భార్యా పిల్లలను గ్రామంలో వదిలేసి, కారులో సూరత్‌కు బయలుదేరారు.అర్ధరాత్రి దాటిన తర్వాత మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద వీరు ప్రయా ణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందగా, కొద్దిసేపటికి మరొకరు మృతి చెందారు. జాతీయ అన్నదమ్ముల దినోత్సవం మే 24న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు మృతి చెందడంతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలోనూ విషాదఛాయలు అలముకున్నాయి. -
ఫ్లాప్స్ తట్టుకోలేక యూ టర్న్ తీసుకున్న అక్కినేని బ్రదర్స్
-
అన్నదమ్ముల అదృశ్యం..!
-
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్నదమ్ముల సవాల్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్నదమ్ముల మధ్య సవాల్ ఆసక్తిని రేపుతోంది. కర్ణాటక దివంగత ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప కుమారులిద్దరూ మరోసారి పోటీపడుతున్నారు. శివమొగ్గ జిల్లాలోని సొరబ నియోజకవర్గం నుంచి కుమార్ బంగారప్ప బీజేపీ నుంచి, మధు బంగారప్ప కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. బంగారప్ప 1967 నుంచి 1994 వరకు సొరబ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. చిట్టచివరి సారిగా ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం సొరబ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కుమార్ బంగారప్ప మరోసారి ఎన్నిక కావాలని తహతహలాడుతున్నారు. 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు గుడ్ బై కొట్టేసి బీజేపీలో చేరిన కుమార్, అప్పటికే జేడీ(ఎస్) సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మధుపై 3,286 ఓట్ల తేడాతో నెగ్గారు. 2021లో కాంగ్రెస్‌లో చేరిన మధు బంగారప్ప మరోసారి అదే నియోజకవర్గం బరిలో దిగడంతో అన్నదమ్ముల మధ్య పోరు ఉత్కంఠకు దారి తీస్తోంది. -
Viajayawada: ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
‘‘క్యారెక్టర్ ఉన్న పేదవాడికైనా సీటు ఇస్తే ఎంపీనే కాదు ఏదైనా చేస్తా... కానీ భూకబ్జాదారులు, దావూద్ ఇబ్రహీం లాంటి మాఫియా డాన్లు, చార్లెస్ శోభరాజ్ లు, రియల్ ఎస్టేట్ మోసగాళ్లు, కాల్‌మనీ సెక్స్ రాకెట్, పేకాట క్లబ్‌లు, నడిపేవారికి మద్దతు ఇవ్వను’’... ఇవన్నీ ఎన్టీఆర్ జిల్లాలోని టీడీపీ నేతలను ఉద్దేశించి విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన సంచలన వ్యాఖ్యలు... సాక్షి, విజయవాడ: సంక్రాంతి పండుగ రోజు టీడీపీలో సంకుల సమరం ఊపందుకుంది. కొన్నేళ్లుగా ఆధిష్టానం తీరుపై మండిపడుతున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈసారి ఏకంగా టికెట్ల పంచాయితీనే తెరపైకి తెచ్చారు. తన తమ్ముడు కేశినేని చిన్నితో పాటు, మరో ముగ్గురు, నలుగురికి టికెట్లు ఇవ్వటానికి వీల్లేదని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఆ జాబితాలో మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమా, విజయవాడ పశ్చిమ నియోజక వర్గ నేత బుద్ధా వెంకన్న, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ ఉండటం గమనార్హం. తద్వారా విజయవాడలో తాను చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలని కేశినేని నాని చెప్పడం అధిష్టానానికి మింగుడు పడటం లేదు. ఇటీవల మైలవరంలో దేవినేని ఉమాను టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్లు చేశారు. ఆయనతో పాటు కొంతమంది పార్టీకి దూరంగా ఉండి కొత్తవారికి అవకాశం ఇస్తే బెటరనే కామెంట్లు చేశారు. నాలుగు సార్లు గెలిచానని విర్రవీగొద్దని దేవినేనిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. టికెట్టు ఇస్తే ఓడిపోవడం ఖాయమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆ వేడి తగ్గక ముందే తీవ్రస్థాయిలో తన తమ్ముడు చిన్నితో పాటు, మరో నలుగురికి పార్టీ టికెట్లు ఇవ్వవద్దంటూ అధిష్టానం పెద్దలకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. పార్టీ ప్రత్యర్థుల మీద, అధిష్టానం మీద ఆఫ్ ద రికార్డుగా కాకుండా ఆన్ రికార్డుగానే లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వటం ప్రస్తుతం ఆ పారీ్టలో చర్చనీయాంశంగా మారింది. లోకేష్‌కు కౌంటర్ స్టేట్మెంట్? తాను విజయవాడ వెస్ట్ నియోజక వర్గం నుంచి పోటీచేస్తానని బుద్ధా వెంకన్న ప్రకటించిన కొన్ని రోజులకే ఎంపీ కేశినేని నాని కౌంటర్ ఇవ్వడం ప్రా«ధాన్యత సంతరించుకొంది. లోకేష్ అండతోనే బుద్ధా వెంకన్న ఆ ప్రకటన చేశారన్నది బహిరంగ రహస్యం. ఆ విషయం తెలిసి కూడా బుద్ధా వెంకన్నకు టికెట్టు ఇవ్వటానికి వీల్లేదని చెప్పడం, మరోవైపు తన తమ్ముడు చిన్నిని ప్రోత్సహిస్తున్న లోకేష్‌కు పరోక్షంగా కేశినేని నాని కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చినట్టయింది. తనకో క్లారిటీ ఉందని కరప్షన్ కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, జీవితంలో ఎవరినీ మోసం చేయలేదని కేశినేని నాని చంద్రబాబుకు సైతం పరోక్షంగా చురకలంటించారు. ఎన్టీఆర్ గొప్ప ఆశయంతో టీడీపీని స్థాపించారని, ఆ ఆశయంతో పనిచేసేవారు చేయొచ్చునని, కాదని ఇలాంటి వారికి సీట్లు ఇస్తే పారీ్టకి గడ్డు పరిస్థితులు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీని ప్రక్షాళన చేయాలని ఘాటు వ్యాఖ్యలు చేయడం పార్టీలో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. పక్కా వ్యూహంతోనే... పక్కా వ్యూహంతోనే ఎంపీ కేశినేని నాని పార్టీపై తిరుగుబాటు చేయడంతో చంద్రబాబు, లోకేష్ నుంచి కనీసం ప్రతిస్పందన లేకుండా పోయింది. లోకేష్ అండతో హడావుడి చేస్తున్న ఆ నలుగురు కూడా కిమ్మనకుండా ఉండటం గమనార్హం. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఎంపీ కేశినేని నాని ఈ దాడిని మరింత పెంచే సూచనలు కనిపిస్తున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. దీంతో పార్టీలో నేతల మధ్య మరింత అంతరం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయనే భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. ఈ పరిణామాలను బట్టి టీడీపీలో మున్ముందు వర్గపోరు మరింత బజారున పడే అవకాశాలు స్పష్టంగా కనిసిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
గంటల వ్యవధిలోనే అన్నదమ్ములిద్దరూ గుండెపోటుతో మృతి
సాక్షి, మెట్పల్లి (కోరుట్ల): గంటల వ్యవధిలోనే అన్నదమ్ములిద్దరూ మృతి చెందిన విషాదకర ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో చోటుచేసుకుంది. తమ్ముడు గుండెపోటుతో మృతి చెందగా, అంత్యక్రియలకు హాజరైన అన్నకూడా గుండెపోటుకు గురై మరణించాడు. మెట్పల్లి పట్టణంలోని చైతన్యనగర్‌కు చెందిన బోగ భూషణ్, లత దంపతులకు ముగ్గురు కుమారులు. ఇందులో రెండో కుమారుడు శ్రీనివాస్ (30) హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఏడాది వయసుగల పాప ఉంది. శనివారం రాత్రి ఇంట్లో ఉన్న శ్రీనివాస్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే గుండెపోటుతో మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఆదివారం ఉదయం మెట్‌పల్లికి తీసుకొచ్చారు. అంత్యక్రియలు జరపడానికి మృతదేహాన్ని శ్మశానికి తరలిస్తుండగా, అప్పటికే అక్కడికి వెళ్లిన శ్రీనివాస్ అన్న సచిన్ (33) ఒక్కసారిగి కూప్పకూలాడు. ఇది గమనించిన బంధువులు మొదట ప్రైవేట్ ఆస్పత్రికి.. ఆ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సచిన్ మృతి చెందినట్లు తెలిపారు. గంటల వ్యవధిలోనే అన్నదమ్ములిద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాద ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. పలువురు ప్రముఖులు ఆ కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. చదవండి: (Hyderabad: ఇంటర్ విద్యార్థులకు టెన్షన్ టెన్షన్!) -
అన్నదమ్ముల సవాల్.. బెజవాడ టీడీపీలో ఏం జరుగుతోంది?
తెలుగుదేశం ఎప్పుడో ప్రజలకు దూరమైపోయింది. రాష్ట్రంలో ఏ నియోజకవర్గం చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీని ప్రజలకు దగ్గర చేయడానికి ప్రయత్నించని తెలుగు తమ్ముళ్ళు తమలో తాము కుమ్ములాడుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో అన్నదమ్ములే సవాళ్ళు విసురుకుంటున్నారు. ఇద్దరూ కలిసి చెరో రెండు కుంపట్లు రగిల్చారు. ఇంతకీ సవాళ్ళు విసురుకుంటున్న ఆ అన్నదమ్ములెవరో చూద్దాం. నాని వర్సెస్ చిన్ని గత ఎన్నికల్లో ఏపీలో టీడీపీ గెలిచిన మూడు ఎంపీ సీట్లలో విజయవాడ ఒకటి. అయితే స్థానిక ఎన్నికల్లో మాత్రం పచ్చ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇదే సమయంలో బెజవాడ ఎంపీ కేశినేని నాని క్రమంగా పార్టీ అధినేత చంద్రబాబుకు దూరంగా జరిగారు. దీంతో పార్టీలో నాని సోదరుడు చిన్నిగా పిలిచే శివనాథ్‌ను చంద్రబాబు ఎంకరేజ్ చేయడం ప్రారంభించారు. పార్టీలో తనను కాదని.. తమ్ముడిని పైకి తీసుకువస్తున్న చంద్రబాబు తీరుతో కేశినేని నాని ఇప్పటికే అసమ్మతి కుంపట్లు రగిలిస్తున్నారు. ఇప్పుడు విజయవాడ వెస్ట్‌లో అన్నదమ్ముల సవాళ్ళతో తెలుగు తమ్ముళ్లు బిత్తరపోతున్నారట. పొమ్మనలేక పొగబెట్టారు కొంతకాలం క్రితం విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఇన్చార్జ్గా ఎంపీ కేశినేని నానిని చంద్రబాబు నియమించారు. అక్కడ పార్టీని బాగుచేయాలని ఆదేశించారు. అయితే అప్పటికే చంద్రబాబు తీరుతో గుర్రుగా ఉన్న నాని తన బాధ్యతలను పట్టించుకోలేదు. పైగా నానితో పొసగని బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా వంటి నేతలకు చంద్రబాబు నిర్ణయం మింగుడు పడలేదు. బెజవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడింది. దీంతో కేశినేని నానితో బుద్ధా వెంకన్న , నాగుల్ మీరాల వైరం మరింతగా పెరిగింది. ఇక కేశినేని నాని పెళ్లిళ్లకు , ఫంక్షన్లకు మినహా పశ్చిమ నియోజకవర్గంలో అడుగు పెట్టడం కూడా మానేశారట. గత మూడేళ్ల కాలంలో ఒక్క రోజు కూడా పార్టీ కార్యక్రమాల్లో నాని పాల్గొనలేదట. ఈ పరిణామాలతో లోకల్ కేడర్‌తో కూడా నానికి బాగా దూరం పెరిగింది. చిన్ని వెనక బాబు కేశినేని నాని అటు పార్టీ అధినేతకు..ఇటు పార్టీ కేడర్‌కు దూరం కావడంతో..ఆయన తమ్ముడు చిన్నిని చంద్రబాబు తెరపైకి తెచ్చారు. చిన్ని ఎంట్రీతో పశ్చిమ నియోజక వర్గంలో మార్పులు మొదలయ్యాయట. కేశినేని నాని అంటే గిట్టని బుద్ధా వెంకన్న , నాగుల్ మీరాలు ఇప్పుడు చిన్ని నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారట. మైనార్టీ ఓట్లనే లక్ష్యంగా చేసుకున్న చిన్ని ఒకప్పుడు తన అన్నకు ముఖ్య అనుచరుల్లో ఒకరైన ఫతావుల్లాను తనవైపు తిప్పుకున్నారట. పరిణామాలన్నీ గమనిస్తున్న కేశినేని నాని..తమ్ముడు తననే దెబ్బతీసేవిధంగా వ్యవహరిస్తుండటంతో ఇటీవల తిరిగి పశ్చిమ నియోజకవర్గంపై దృష్టి పెట్టారట. ప్రస్తుతం పశ్చిమలో తనకు ముఖ్య అనుచరుడిగా ఉన్న ఎంకే బేగ్ ను తెరపైకి తెచ్చారట. నాని ఆదేశాలతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంకే బేగ్ బిజీ అయ్యారు. ఇంతవరకు వెస్ట్‌లో లేని టీడీపీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారట. ఐతే ఇన్నేళ్ల పశ్చిమ టీడీపీ చరిత్రలో పార్టీకి కార్యాలయం అంటూ ఎరుగని కార్యకర్తలు ప్రస్తుతం నాని వర్సెస్ చిన్నిల మధ్య పోరులో భాగంగా వస్తున్న మార్పులను చూసి ఆశ్చర్య పోతున్నారట . వెన్నుపోటు రాజకీయాలు ఇదిలా ఉంటే కేశినేని నాని మీద ఉన్న కోపంతో చిన్నికి జై కొడుతున్న బుద్ధా వెంకన్న , నాగుల్ మీరాల్లో తాజాగా కొత్త గుబులు మొదలైందట. 2024లో వెస్ట్ టిక్కెట్ తనకే ఇవ్వాలని నాగుల్ మీరా గట్టిగా పట్టుపడుతున్నారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గానో... లేక వేరే పార్టీలోకి మారైనా పోటీ చేస్తానని ఇప్పటికే చాలామార్లు నాగుల్ మీరా స్పష్టం చేశాడట. ఇటువంటి సమయంలో.. నాని తరపున ఎంకే బేగ్, చిన్ని తరపున ఫతావుల్లా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండటంతో పశ్చిమ క్యాడర్ లో కన్ఫ్యూజన్ మొదలైందట. కేశినేని సోదరుల రాజకీయం పుణ్యమా అని విజయవాడ వెస్ట్ టీడీపీలో నాలుగు గ్రూపులు తయారయ్యాయి. దీంతో మొదట్నుంచి పార్టీలో కొనసాగుతున్న టీడీపీ కార్యకర్తలు కలవరపడుతున్నారట. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
‘చీకోటి’ కేసులో ఈడీ దూకుడు.. ఎమ్మెల్సీ రమణకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో కేసినో వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. ప్రత్యేక విమానాల్లో శ్రీలంక, నేపాల్, ఇండోనేషియా తీసుకెళ్లి అక్కడ కేసినో ఆడించిన వ్యవహారంలో ఇప్పటికే చీకోటి ప్రవీణ్‌పై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోదరులు మహేశ్, ధర్మేందర్ సంబంధాలపై ఈడీ బుధవారం ప్రశ్నించింది. చీకోటి నిర్వహించిన ఈ కేసీనోలకు వీరు కూడా హాజరయ్యారన్న సమాచారం మేరకు అధికారుల వారి నుంచి కూపీ లాగుతున్నారు. విదేశాల్లో కేసినో నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై వారిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఇక్కడ కరెన్సీని విదేశాలకు హవాలా ద్వారా చేరవేసి, అక్కడ కరెన్సీ తీసుకున్నారా? నిబంధనల ప్రకారం మార్పిడి చేశారా?.. ఇలా పలు అంశాలపై మంత్రి సోదరులను ప్రశ్నించినట్లు తెలిసింది. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా జరిగిన విదేశీ ప్రయాణాల విమాన టికెట్ల బుకింగ్ వ్యవహారాలనూ ఈడీ సేకరించినట్లు చెబుతున్నారు. వీరిని గురువారం కూడా మరోసారి విచారించనున్నట్లు తెలిసింది. చీకోటి ప్రవీణ్, ఆయన ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ రికార్డులను పరిశీలించిన ఈడీ అధికారులు ఈ కేసీనో వ్యవహారంలో ఎవరెవరూ ఉన్నారన్న పూర్తి సమాచారాన్ని రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిలో దాదాపు వంద మంది వరకు ఉన్నట్లు గుర్తించి.. ఆ మేరకు జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది. కేసీనోలతో సంబంధమున్న వారికి నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది. అందులో భాగంగానే శుక్రవారం విచారణకు హాజరుకావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇదీ చదవండి: కేసీఆర్ కాళ్లుమొక్కిన ఉన్నతాధికారి.. ఎమ్మెల్యే టిక్కెట్ కోసమేనా! -
క్యాసినో వ్యవహారం.. ఈడీ ముందుకు తలసాని సోదరులు
సాక్షి, హైదరాబాద్: చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ మళ్లీ విచారణ షురూ చేసింది. హవాలా లావాదేవీలపై దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే చీకోటి ప్రవీణను పలుమార్లు విచారించిన ఈడీ.. ప్రస్తుతం ఈ కేసులో పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎల్ రమణ, మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. చీకటితో కలిసి నేపాల్‌కు వెళ్లిన ప్రముఖులను విచారించనుంది. వీరితోపాటు మంత్రి తలసాని శ్రీనివాస్ సోదరులు మహేష్, ధర్మేందర్ యాదవ్‌కు నోటీసులు అందగా.. బుధవారం వారు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.. మనీలాండరింగ్, హవాలా వ్యవహారంలో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. చీకటితో కలిసి తలసాని మహేష్, ధర్మేందర్ యాదవ్ విదేశాలకు వెళ్లిన్నట్లు గుర్తించారు. ఎనిమిది గంటలుగా తలసాని సోదరులను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. విదేశాల్లో కేసినో నిర్వహణ, ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రశ్నిస్తోంది. ఫెమా యాక్ట్ నిబంధనలు, మనీ ల్యాండరింగ్‌పై ఈడీ కూపీ లాగుతోంది. హవాలా చెల్లింపులపై కూడా ఈడీ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే మరికొందరికి నోటీసులు ఇచ్చిన ఈడీ.. సుమారు వంద మంది కేసినో కస్టమర్లను చీకోటి ప్రవీణ్, మాధవ్ రెడ్డిల కాల్ డేటా ఆధారంగా ఈడీ వివరాలు సేకరించింది. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ఫ్లైట్స్ టికెట్స్ బుకింగ్స్ వివరాలు ఈడీ సేకరించింది. చదవండి: CM KCR: కేంద్రం టార్గెట్‌గా సీఎం కేసీఆర్ కొత్త వ్యూహం! -
అన్నదమ్ముల ప్లాన్: కారులో వస్తారు.. కాజేస్తారు!
సాక్షి, చెన్నై: వేలూరు పట్టణంలోని వేలపాడికి చెందిన మణిగండన్ ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని ఇంటిలో ఎవరూ లేని సమయాన్ని చూసి గత నెలలో గుర్తు తెలియని వ్యక్తులు 22 సవర్ల బంగారం, రూ. 15 లక్షల నగదు చోరీ చేశారు. అదే విధంగా సత్‌వచ్చారిలోని ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న మరో డాక్టర్ ఇంటిలోనూ అమెరికా డాలర్లతో పాటూ నగదు, బంగారం చోరీ చేశారు. దీంతో తరచూ చోరీలు చేస్తున్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌గా ఏర్పడి ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించగా వేలపాడి డాక్టర్ ఇంటి వద్దకు ఒక కారు వచ్చి వెళ్లినట్లు పోలీసుల నిర్ధారించారు. దీంతో నెల రోజులుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పళ్లిగొండ సమీపంలోని జాతీయ రహదారిపై వస్తున్న ఓ వాహనాన్ని పోలీసులు నిలిపి అందులోని వారిని ప్రశ్నించగా ధర్మపురి జిల్లాకు చెందిన మైదీన్, ఇతని తమ్ముడు షాజహాన్‌గా తెలిసింది. అన్నదమ్ములిద్దరూ తరచూ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు 20 చోట్ల చోరీలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు. వీరిద్దరూ ఓ కారులో నకిలీ డాక్టర్ స్టిక్కర్‌ను అంటించుకుని డాక్టర్ల జాబితాను రూపొందించుకుని.. వారు ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. అనంతరం వారి వద్ద నుంచి రూ. 2500 అమెరికా డాలర్లు, రూ. 10. 50 లక్షల నగదు, మూడు సవర్ల బంగారం, ఓ కారు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చదవండి: 29 మంది పైలట్లు దుర్మరణం: ప్రధాన కారణం ఇదే! -
అగ్గి రాజేసిన భార్యలు.. ఆ అన్నదమ్ములు మళ్లీ ఒక్కటయ్యేనా?
రాజకుటుంబంలో మునుపెన్నడూ చూడని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఊహించలేనంతగా కుటుంబంలో మనస్పర్థలు తారాస్థాయికి చేరుకున్నాయి. దివంగత ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ డయానాకు పుట్టిన బిడ్డలిద్దరూ.. తిరిగి మునుపటిలా అనోన్యంగా పలకరించుకునే పరిస్థితులు కనిపించడం లేవు. అందుకు కారణం భార్యాలు రాజేసిన చిచ్చే కారణమనే చర్చ నడుస్తోంది అక్కడ. తల్లి ప్రిన్సెస్ డయానా(బ్రిటిష్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ చార్లెస్ మొదటి భార్య) చనిపోయి పాతికేళ్లు గడుస్తున్నాయి. ఆమె సంతానం ప్రిన్స్ విలియమ్(40), హ్యారీ(37)ల మధ్య మనస్పర్థలు మాత్రం ఏళ్లు గడుస్తున్నా సమసిపోవడం లేదు. మెగ్జిట్(రాయల్ డ్యూటీస్ నుంచి ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ తప్పుకుంటున్నట్లు ప్రకటించడం) తర్వాత ఈ ఇద్దరూ మాట్లాడుకోవడం కనిపించింది లేదు. విలియం.. రాయల్ స్థాపనను స్వీకరించి.. మరిన్ని బాధ్యతలను చేపట్టి హుందాగా ముందుకెళ్తున్నాడు. ఇక హ్యారీ ఏమో కాలిఫోర్నియాలో జీవితం కోసం రాజ సంప్రదాయాలను తిరస్కరించి, భార్యతో కలిసి రాజప్రసాద వ్యవహారాలపై సంచలన ఆరోపణలు చేశాడు. ► అన్నదమ్ముల వైరం చాలా దూరం వెళ్లిందని, వాళ్లు తిరిగి కలుసుకోవడం అనుమానమేనని రాజ కుటుంబ వ్యవహారాలపై తరచూ స్పందించే రిచర్డ్ ఫిట్జ్‌విలియమ్స్ పేర్కొన్నాడు. పరిస్థితులనేవి ఎలా మారిపోయాయో ఆయన పాత సంగతుల్ని గుర్తు చేస్తూ మరీ చెప్తున్నారాయన. ► 1997 ఆగష్టు 31వ తేదీన 36 ఏళ్ల వయసులో డయానా రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటికి విలియమ్ వయసు 15, హ్యారీ వయసు 12. ► ఇద్దరూ ఎటోన్ బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నారు. విలియమ్ పైచదువులకు యూనివర్సిటీ వెళ్లగా.. హ్యారీ మాత్రం మిలిటరీ ట్రైనింగ్ తీసుకున్నాడు. ► తన ప్రియురాలు కేట్ మిడెల్టన్తో 2011లో విలియమ్ వివాహం జరిగే నాటికి.. ఈ అన్నదమ్ముల అనుబంధం చాలా బలంగా ఉండిపోయింది. ► ఈ అన్నదమ్ముల వల్లే రాజకుటుంబం బలోపేతం అయ్యిందంటూ చర్చ కూడా నడిచింది. కానీ.. ► హ్యారీ 2018లో మేఘన్‌ను వివాహం చేసుకోవడం, భార్య కోసం రాజరికాన్ని వదులుకోవడంతో పరిస్థితులు తారుమారు అయ్యాయి. ► రాజకుటుంబంలో చెలరేగిన అలజడి.. అంతర్గతంగా ఏం జరిగిందో బయటి ప్రపంచానికి ఓ స్పష్టత లేకుండా పోయింది. కానీ, అప్పటి నుంచి ఆ అన్నదమ్ముల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. ► ఏడాది తర్వాత ఓ ఇంటర్వ్యూలో ‘మా అన్నదమ్ముల దారులు వేరంటూ’ హ్యారీ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ► ఆపై హ్యారీ, మేఘన్‌లు రాజరికాన్ని వదిలేసుకుంటూ.. అమెరికాకు వెళ్లిపోవడంతో ఇంటి పోరు రచ్చకెక్కింది. ► ఓఫ్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో.. మేఘన్, కేట్ మీద సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై విస్తృత స్థాయిలో చర్చ కూడా నడిచింది. ► తన తల్లి డయానాను వెంటాడిన పరిస్థితులే తన భార్యకూ ఎదురుకావడం ఇష్టం లేదంటూ హ్యారీ చేసిన వ్యాఖ్యలు రాజకుటుంబంలో కలహాల తీవ్రతను బయటపెట్టాయి. ► ఓఫ్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో భార్యాభర్తలిద్దరూ చేసిన వ్యాఖ్యలపై ప్రిన్స్ విలియమ్ స్పందించాడు. తమదేం రేసిస్ట్ ఫ్యామిలీ కాదంటూ ఆరోపణల్ని ఖండించాడు. ► చాలాకాలం ఎడమొహం పెడమొహం తర్వాత.. 2021 జులైలో కెన్సింగ్టన్ ప్యాలెస్ బయట డయానా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఈ ఇద్దరు అన్నదమ్ములు హాజరయ్యారు. దీంతో ‘ఒక్కటయ్యారంటూ’ కథనాలు వచ్చాయి. ► అయితే.. ఓఫ్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో సోదరుడు, అతని భార్య చేసిన వ్యాఖ్యలపై ప్రిన్స్ విలియమ్ తీవ్రంగానే నొచ్చుకున్నట్లు ఉన్నాడు. అందుకే ఆ తర్వాత సోదరుడిని కలుసుకున్నప్పటికీ ముఖం చాటేస్తూ వచ్చాడు. ► ఆ ప్రభావం జూన్ 2022 క్వీన్ ఎలిజబెత్ 2 ప్లాటినం జూబ్లీ వేడుకల్లో స్పష్టంగా కనిపించింది. ► ఏ కార్యక్రమంలోనూ ఈ ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకోలేదు. ► హ్యారీ, మేఘన్‌లు ఈ సెప్టెంబర్‌లో యూకే వెళ్లనున్నారు. రాణి విండ్సోర్ ఎస్టేట్‌లో బస చేయనున్నారు. ఇది ప్రిన్స్ విలియమ్ కొత్త ఇంటికి దగ్గర్లోనే ఉండడం గమనార్హం. ► ఇక ప్రిన్స్ విలియమ్ కూడా ఎర్త్‌షాట్ ప్రైజ్ సమ్మిట్ కోసం సెప్టెంబర్‌లోనే కాస్త వ్యవధితో న్యూయార్క్‌కు వెళ్తున్నాడు. ఆ సమయంలో హ్యారీని కలిసే అవకాశాలు కనిపించడం లేదు. ► అయితే ఈ పర్యటనలోనూ విలియమ్-హ్యారీ కలిసే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ఎంత మనస్పర్థలు నెలకొన్నప్పటికీ ఈ ఇద్దరూ కలుస్తారనే ఆశాభావంలో ఉన్నారు రాజకుటుంబ బాగోగులు కోరుకునేవాళ్లు. -
ఉడేగోళంలో విషాదం... అన్నదమ్ములని బలిగిన్న కరెంట్
కణేకల్లు: ఇద్దరు అన్నదమ్ములను కరెంట్ బలిగొంది. ఈ ఘటనతో కణేకల్లు మండలం 43 ఉడేగోళం గ్రామం విషాదంలో మునిగిపోయింది. మాజీ సర్పంచ్ కురుబ యల్లప్ప (లేట్)ది రైతు కుటుంబం. ఈయనకు ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయమే వీరికి ప్రధాన జీవనాధారం. హెచ్చెల్సీకి నీరు విడుదల చేయడంతో బోర్లున్న రైతులు ముందుగానే వరినారు పోసుకోవడం ఆనవాయితీ. యల్లప్ప కుమారులు రమేష్ (34), దేవేంద్ర (28), వన్నూరుస్వామి తమ పొలంలో మూడ్రోజుల కిందట వరి నారు పోశారు. ఆదివారం నారు మడికి నీరు పెట్టి పొలంలో చిన్నాచితక పనులు చేసుకొద్దామని ఈ ముగ్గురూ పొలానికి వెళ్లారు. రమేష్ స్టార్టర్ ఆన్ చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్‌షాక్‌కు గురై కుప్పకూలిపోయాడు. అన్నను లేపేందుకు వెళ్లిన దేవేంద్ర కూడా షాక్‌కు గురయ్యాడు. వీరిని కాపాడేందుకు వెళ్లిన వన్నూరుస్వామి షాక్ కొట్టగానే ఎగిరి పడ్డాడు. వెంటనే పక్కపొలం రైతులు, స్థానికులకు, కుటుంబ సభ్యులకు సమాచారమందించాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన చేరుకుని వారిని కణేకల్లు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే రమేష్, దేవేంద్ర మృతి చెందారు. వీరిని కాపాడే క్రమంలో గాయపడ్డ మరో సోదరుడు వన్నూరుస్వామి బళ్లారిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల్లో రమేష్‌కు భార్య జ్యోతి, ఇద్దరు కూతుళ్లు, దేవేంద్రకు భార్య కస్తూరి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విద్యుత్ షాక్‌తో ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాత పడటంతో కుటుంబంతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దేవుడా ఎంత పనిచేశావయ్యా.. పొలానికి వెళ్లి తొందరగా వస్తామని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతిరా.. మీరు లేని జీవితం ఎలా గడపాలి.. పిల్లలకు ఏమని సమాధానం చెప్పాలి’ అంటూ మృతుడు రమేష్ భార్య జ్యోతి, దేవేంద్ర భార్య కస్తూరి గుండెలవిసేలా రోదించారు. ‘అక్కా... అని ప్రేమగా పలకరించే చిన్నోడి (దేవేంద్ర)ని తీసుకెళ్లి ఎందుకింత అన్యాయం చేశావు దేవుడా’ అంటూ విలపించిన అక్క జయమ్మను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. ఆ దేవుడు నన్నైనా తీసుకుపోయి ఉంటే బాగుండేదంటూ కన్నీరు మున్నీరయ్యారు. ‘దేవురే ఒబ్బరల్లా... ఇబ్బుర్ని (దేవుడా ఒకరిని కాదు ఇద్దరిని) ఎంగే తకొండు హోగిదియప్పా(ఎలా తీసుకెళ్లావు?)’ అంటూ అక్కాచెల్లెళ్లు విలపించడం అందర్నీ కలచి వేసింది. (చదవండి: పార్థుడి పనైపోయిందా!.. చంద్రబాబు 'బాది'పోయాడా?) -
అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్
Sara Ali Khan Janhvi Kapoor Dating With Two Brothers: అత్యధిక ప్రజాధరణ పొందిన టాక్ షోలలో 'కాఫీ విత్ కరణ్' ఒకటి. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ షోలో సెలబ్రిటీలు వచ్చి తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటారన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ షో 7వ సీజన్ ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్లో రణ్వీర్ సింగ్, అలియా భట్ అలరించగా.. రెండో ఎపిసోడ్లో బాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ సందడి చేశారు. అయితే వీరిద్దరూ పార్టిస్పేట్ చేసిన ఎపిసోడ్ ఫుల్ వీడియో గురువారం (జులై 15)న రిలీజైంది. ఈ ఎపిసోడ్లో సారా, జాన్వీలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు హోస్ట్ కరణ్ జోహార్. కాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోలో వీరిద్దరు రౌడీ హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలనుందని చెప్పిన విషయం తెలిసిందే. దీనికి విజయ్ కూడా రెస్పాండ్ అయ్యాడు. అయితే ఈ క్రమంలోనే సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ అన్నదమ్ములతో డేటింగ్ చేసినట్లు తెలిపాడు కరణ్ జోహార్. దీనికి షాకైన ఈ ముద్దుగుమ్మలు 'ఇంత ఓపెన్‌గా షోలో చెప్పేస్తావా ?' అని అన్నారు. తర్వాత ఆ అన్నదమ్ములతో స్నేహం లాక్డౌన్ సమయంలో జరిగినట్లు చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఆ బ్రదర్స్ ఇద్దరూ సారా, జాన్వీ పొరుగింట్లో ఉండేవాళ్లని తెలిపారు. కరణ్ చేప్పిన మాటలు నిజం కావడంతో సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది. View this post on Instagram A post shared by veersara (@veerandsara) సారా, జాన్వీతో డేటింగ్ చేసిన ఆ అదృష్టవంతులు వీరేనంటూ పలు రకాల వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. వారు డేటింగ్ చేసిన బ్రదర్స్ వీర్ పహారియా, శిఖర్ పహారియా (వరుసగా సారా, జాన్వీ)గా తెలుపుతున్నారు నెటిజన్స్. అంతేకాకుండా వారి ఫొటోలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఈ వీర్, శిఖర్ ఇద్దరూ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవళ్లు కావడంతో ఈ వార్త జోరందుకుంది. కాగా 'కాఫీ విత్ కరణ్' టాక్ షో ఏడో సీజన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. for everyone whose wondering which brother duo janhvi and sara dated, it’s these two brothers called veer (sara) and shikhar (janhvi) pahariya, both maternal grandsons of the former chief minister of maharashtra! THANK ME LATER #KoffeewithKaranSeason7 pic.twitter.com/X1dO9uxgyn — siddhi. 👼🏻 (@aphrcdeityy) July 14, 2022 Who are the brothers #JhanviKapoor and #SaraAliKhan dated? 👀🙄 #KoffeewithKaranSeason7 — Ana 🌻💛 (@AnaaaWalia) July 14, 2022 Who were the siblings whom #SaraAliKhan and #JanhviKapoor dated and who lives in Karan's building?#KoffeeWithKaran — Mayank (@sarcasm_taken) July 14, 2022 Saif Ali Khan's daughter Sara Ali Khan with her boyfriend Veer Pahariya. Aren't they luk'n cute 2gether? pic.twitter.com/wjDjsvSTfX — Music India (@MusicIndiaTV) May 6, 2016 Janhvi Kapoor: Jahnavi Kapoor was seen very close by X boyfriend in Lonavla! – actress janhvi kapoor cozy photo with rumored ex boyfriend shikhar pahariya is viral on internet https://t.co/i6sPccV35R pic.twitter.com/iAtWQ6MGVS — TEJAS D KULKARNI (@kultejas18) January 28, 2020 Is Saif Ali Khan’s beautiful daughter Sara Ali Khan dating Veer Pahariya, grandson of… https://t.co/9hF3zx5LaV pic.twitter.com/IX7cGpwWga — Saif Ali Khan Online (@SaifOnline) May 6, 2016 -
అమెరికా టు కరీంనగర్.. సాఫ్ట్వేర్ రంగంలో దేశంలోనే రెండో బ్రాంచ్
శోధించి సాధించాలన్న తపన ఉంటే ఎంతటి లక్ష్యమైనా చిన్నదైపోతుందని నిరూపించారు కరీంనగర్‌కు చెందిన అన్నదమ్ములు. హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసి తామేందుకు కంపెనీ పెట్టకూడదన్న ఆలోచన చేశారు. వెంటనే ఆచరించారు. నేడు అగ్రరాజ్యానికి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీని కరీంనగర్ కేంద్రంగా నడుపుతూ 30మందికి ఉపాధినిస్తున్నారు.. కరీంనగర్ పాతబజార్‌కు చెందిన అన్నదమ్ములు శశిధర్, మనోజ్ కుమార్. అమెరికాకు చెందిన ఆ కంపెనీ బ్రాంచీలు దేశవ్యాప్తంగా బెంగళూర్‌లో ఒకటి ఉండగా.. రెండోది కరీంనగర్ కావడం విశేషం. – కరీంనగర్‌టౌన్ కంపెనీ స్థాపనే లక్ష్యంగా పన్నెండేళ్ల క్రితం మెట్రోనగరాలకే పరిమితమైన సాఫ్ట్వేర్ కంపెనీని కరీంనగర్లో సైతం నెలకొల్పాలనే సంకల్పాన్ని పెట్టుకున్నారు శశిధర్, మనోజ్ కుమార్. ఎంబీఏ పూర్తిచేసి 2010లో హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. కొద్ది నెలల పాటు పని చేశారు. వీరి పనితనం చూసిన మరో కంపెనీ ప్రతినిధి ‘మీలో సత్తాఉంది.. సొంతంగా చేసుకోండి’ అంటూ... ఆ కంపెనీకి సంబంధించిన బ్రాంచి ఇచ్చాడు. ఏం ఆలోచించకుండా సహస్ర సాఫ్ట్వేర్ సర్వీసెస్ పేరుతో కరీంనగర్‌కు 2010లోనే కంపెనీని తీసుకొచ్చారు. ఇద్దరితో మొదలై.. 2010లో కరీంనగర్‌లోని పాతబజార్‌లో సహస్ర సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీలో అన్నదమ్ములిద్దేరే ఉద్యోగులు. కేవలం రెండు కంప్యూటర్లతో రెండేళ్లపాటు ఇద్దరే రేయింబవళ్లు కష్టపడ్డారు. 2012లో కంపెనీస్థాయి పెరిగి, పనిభారం ఎక్కువ కావడంతో దశలవారీగా మరో ఆరుగురిని నియమించుకున్నారు. ప్రస్తుతం 30మంది సాఫ్ట్వేర్లతో సహస్ర సర్వీసెస్ కంపెనీ విజయవంతంగా ముందుకు సాగుతోంది. లాక్డౌన్లో సైతం సక్సెస్‌గా నడుస్తున్న తరుణంలో ఒక్కసారిగా కరోనా మహమ్మారి రాకతో ఆందోళ చెందాం. కంపెనీ పరిస్థిత ఎలా ఉండబోతుందోన్న టెన్షన్. అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వర్క్‌ఫ్రం హోం ఇచ్చారు. మా కంపెనీ ఇవ్వలేదు. దీంతో మేం కొంత మందిని ఉద్యోగాలనుంచి తీసివేసి వర్క్ కొనసాగించాం. మా కష్టం ఫలించింది. కరోనాలోనూ బాగా నడిచింది. ప్రస్తుతం తీసేసిన వారందరిని మళ్లీ తీసుకున్నాం. – నేదునూరి శశిధర్ మరింత మందికి ఉపాధి ఇద్దరితో మొదలై 30మందితో ప్రస్తుతం కంపెనీ నడిపిస్తున్నాం. భవిష్యత్‌లో మరింత మందికి ఉద్యోగాలివ్వడమే మా లక్ష్యం. కంపెనీని అంచెలంచెలుగా పైకి తీసుకొచ్చి కరీంనగర్ పేరు అగ్రరాజ్యానికి వినపడేలా చేస్తాం. గతంలో కరీంనగర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం అనగానే ఏదోలా చూసేవారు. నేడు ఐటీ టవర్ రావడం, పలు కంపెనీలు మేం ఉద్యోగాలు ఇస్తాం అంటూ ముందుకురావడం శుభపరిణామం. – నేదునూరి మనోజ్ కుమార్ -
‘రెండు గుంటలు’.. రెండు హత్యలు
సాక్షి, జగిత్యాల (కరీంనగర్): ప్రేమానురాగాలు మరిచారు.. స్నేహం, బంధుత్వాలు పట్టవనుకున్నారు.. కేవలం రెండు గుంటల భూమి కోసం నెలకొన్న వివాదం అన్నదమ్ముల కుటుంబాల్లో చిచ్చు పెట్టింది.. పరస్పరం ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లింది.. ఈ నేపథ్యంలో జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామ శివారులో ఈరిశెట్టి రాజేశ్(28) దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ► ధరూర్‌కు చెందిన ఈరిశెట్టి బుచ్చిలింగంకు నలుగురు కుమార్తెలు. వీరిలో ముగ్గురికి వివాహాలు చేశారు. మరో కూతురు రాజేశ్వరికి మల్యాల మండలం రాజారాం గ్రామానికి చెందిన బక్కశెట్టి గంగారెడ్డితో పెళ్లి జరిపించి, అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాడు. ► బుచ్చిలింగం అన్న కుమారుడు ఈరిశెట్టి వెంకన్న, అల్లుడు గంగారెడ్డిలకు ఒకేచోట చెరో రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో వెంకన్నకు రెండు గుంటల భూమి ఎక్కువ ఉందనే కారణంతో ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ► ఈ రెండు గుంటల్లో తనకో గుంట ఇవ్వాలని గంగారెడ్డి, తాను ఇవ్వబోనని వెంకన్న ఘర్షణ పడుతున్నారు. పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు జరిగాయి. ► ఈ క్రమంలో 24 మే 2020న గంగారెడ్డి, అతడి కుమారులు వేణు, సతీశ్, సంతోష్‌లు వెంకన్న ఇంటికి వెళ్లారు. తమకు గుంట భూమి ఇవ్వాల్సిందేనని గొడవకు దిగారు. ఆగ్రహించిన వెంకన్న, అతని కుమారులు రాజేశ్, రాకేశ్‌లు గంగారెడ్డిని కత్తితో పొడిచి, చంపారు. ► ఈ కేసులో వెంకన్న, రాజేశ్, రాకేశ్‌లు జైలుకు వెళ్లి, ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. అయి తే, తమ తండ్రిని చంపిన వారిని ఎలాగైనా హతమార్చాలని గంగారెడ్డి కుమారులు భావించారు. ఇందుకు మరికొందరి సాయం తీసుకున్నారు. ► ఆదివారం ఉదయం వెంకన్న కుమారుడు రాజేశ్ తన మొక్కజొన్న చేను వద్దకు వెళ్తుండగా గ్రామ శివారులో తల్వార్, ఇనుపరాడ్లతో కొట్టి, హత్య చేశారు. ►జగిత్యాల రూరల్ సీఐ కృష్ణకుమార్, ఎస్సై అనిల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం పోలీస్ బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ► రాజేశ్‌కు భార్య లత, కూతురు అక్షర(4), కుమారుడు మన్విత్(3) ఉన్నారు. లత ఐదోవార్డు సభ్యులుగా కొనసాగుతున్నారు. అతని మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ► మృతుడి సోదరుడు రాకేశ్ ఫిర్యాదు మేరకు వేణు, సంతోష్, సతీశ్‌తోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. -
వలస కుటుంబాన్ని వెంటాడుతున్న మృత్యువు
సాక్షి, అర్వపల్లి (నల్లగొండ): పొట్టకూటి కోసం రాజస్థాన్ నుంచి ఇక్కడకు వచ్చి జీవనం సాగిస్తున్న ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడుతోంది. ఒకే ఏడాది ఇద్దరు సోదరులు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని జోద్పూర్ ప్రాంతానికి చెందిన దేవాసి కైలాస్ అలియాస్ సురేశ్, దేవాసి చెన్నారాం అలియాస్ రమేశ్ సోదరులు. వీరు చిన్న వయసులోనే బతుకు దెరువు నిమిత్తం ఇక్కడికి వచ్చి అర్వపల్లి మెయిన్‌రోడ్డులో రాజస్థాన్ టీస్టాల్, స్వీట్‌హౌస్ నడుపుతున్నారు. అయితే, ఈ ఏడాది జనవరి 29న సురేశ్ బైక్‌పై నల్లగొండ జిల్లా శాలిగౌరారంనకు తన బంధువుల వద్దకు వెళ్లి టీపొడి తీసుకొని వస్తూ జాజిరెడ్డిగూడెం–మాదారం మధ్య హైవేపై రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో కుటుంబ సభ్యులు స్థానికుల వద్ద రూ.1.20 లక్షలు చందాలు సేకరించి అంబులెన్స్‌లో మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేసి వచ్చారు. ఆ తర్వాత సురేశ్ సోదరుడు రమేశ్ టీస్టాల్‌ను నడిపిస్తున్నాడు. వీరిద్దరు సోదరులు కూడా సేవాతత్పరులు కావడంతో స్థానికులు వారిని తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారు. అయితే లాక్డౌన్, ఇతర సమయాల్లో ఇద్దరు సోదరులు ఎందరో పేదలకు తమ వంతు సాయమందించారు. రాజస్థాన్‌లో మరో సోదరుడు.. కాగా, రమేశ్ 15 రోజుల క్రితం తల్లిదండ్రులను చూసేందుకు రాజస్థాన్‌లోని స్వగ్రామానికి వెళ్లాడు. అయితే పోయేటప్పుడు పెద్ద సోదరుడు మోహన్‌ను రాజస్థాన్ నుంచి ఇక్కడికి పిలిపించి టీస్టాల్ నడిపించమని చెప్పి వెళ్లాడు. అయితే ఆదివారం రాత్రి వారి స్వరాష్ట్రం రాజస్థాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రమేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో విషయం తెలిసి స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఏడాది తిరక్కముందే ఇద్దరు సోదరులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇక్కడి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. కాగా వీరిద్దరి ఆధార్‌కార్డులు, రేషన్ కార్డులు ఇక్కడే తీసుకున్నారు. చదవండి: రైల్వే కోచ్ రెస్టారెంట్ సూపర్ సక్సెస్ -
సరదా ఈత.. కన్నవారికి కడుపుకోత!
సరదా ఈత రెండు నిండు ప్రాణాల్ని బలిగొంది. చెట్టంత కొడుకుల్ని దూరం చేసి తల్లిదండ్రులకు గర్భ శోకం మిగిల్చింది. మొహర్రం పండుగ ఆనందాన్ని ఆవిరి చేసి ఆ కుటుంబాన్ని దుఃఖ తీరాలకు చేర్చింది. గుండెను పిండేసే ఈ విషాద ఘటన చిన్నమండెం మండలం సద్దలగుట్టపల్లె సమీపంలోని దేవర చెరువులో జరిగింది. చిన్నమండెం: చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం కలిచెర్ల గ్రామానికి చెందిన దొరస్వామి నాయక్, లక్ష్మి దేవి కొన్నేళ్ల నుంచి తిరుపతిలో స్థిరనివాసం ఉంటున్నారు. అక్కడే కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. ఈ క్రమంలో దొరస్వామి నాయక్ తన ఇద్దరు కుమారులు తరుణ్‌నాయక్(18), ఉపేంద్రనాయక్(16), కుమార్తెతో కలిసి మొహర్రం పండగ కోసం బంధువులైన సద్దలగుట్టపల్లెకు చెందిన చంద్రానాయక్ ఇంటికి వచ్చారు. పిల్లలందరూ బుధవారం మధ్యాహ్నం భోజనం అనంతరం సరదా కోసం సద్దలగుట్టపల్లెకు సమీపంలో ఉన్న దేవరచెరువు దగ్గరకు వచ్చారు. తరుణ్, ఉపేంద్ర ఇద్దరూ ఈత కొట్టేందుకు అక్కడే ఉన్న బావిలోకి దూకారు. వారు నీటిలో మునిగిపోయిన విషయాన్ని ఒడ్డు పైనుంచి గమనించిన చెల్లెలు వెంటనే కుటుంబీకులకు సమాచారం ఇచ్చింది. హుటాహుటిన వారు గ్రామస్తులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులకు, అగ్నిమాపక శాఖాధికారులకూడా అక్కడికి చేరుకున్నారు. అప్పటికే నష్టం జరిగిపోయింది. స్థానిక యువకులైన రెడ్డిబాబు, పవన్, కాలీతో కలిసి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
హెలికాప్టర్ బ్రదర్స్ అరెస్ట్.. చిక్కుల్లో మాజీ మంత్రి..
సాక్షి, చెన్నై: ఫైనాన్స్ మోసం కేసులో హెలికాప్టర్ బ్రదర్స్‌ను తంజావూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఇక మాజీ మంత్రి రాజేంద్రబాలాజీ మెడకు అక్రమాస్తుల కేసు ఉచ్చు బిగిసింది. తంజావూరు జిల్లా కుంభకోణంకు చెందిన హెలికాప్టర్ బ్రదర్స్ ఎంఆర్ గణేషన్, ఎంఆర్ స్వామినాథన్ దక్షిణ తమిళనాడులో పలుచోట్ల ఫైనాన్స్ సంస్థను నెలకొల్పారు. సొంతంగా హెలికాప్టర్ ఉండబట్టే, తమ పేరుకు ముందు ఈ ఇద్దరు హెలికాప్టర్‌ను చేర్చుకున్నట్టు ఆ జిల్లాలో చెబుతుంటారు. ఈ బ్రదర్స్ బీజేపీలోనూ చేరి, రాజకీయంగా ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో హఠాత్తుగా కొన్ని బ్రాంచ్‌లను మూసివేసినట్టు, రెట్టింపు ఆదాయం పేరిట తమను ఈ బ్రదర్స్ మోసం చేసినట్టుగా బాధితులు బుధవారం పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో తంజావూరు పోలీసులు రంగంలోకి దిగి విచారించారు. తమ పేరిట అతి పెద్ద పాడి పరిశ్రమ ఉన్నట్టు, విదేశాలకు ఇక్కడి ఉత్పత్తుల ఎగుమతులు, ఫైనాన్స్ సంస్థలో రెట్టింపు ఆదాయం అంటూ ఈ బ్రదర్స్ కోట్లాది రూపాయల్ని ఆర్జించినట్టు విచారణలో తేలింది. దీంతో గురువారం మధ్యా హ్నం ఈ ఇద్దర్ని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, విరుదునగర్‌జిల్లా రాజపాళయం కేంద్రంగా ఫైనాన్స్ సంస్థను నడిపి వందలాది మందిని మోసం చేసిన మరో కేసులో రాధాకృష్ణన్, లోకనాథన్, శంకరనారాయణ, మణిగండన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి చెందిన రూ. ఏడు కోట్ల విలువగల ఆస్తులను గురువారం జప్తు చేశారు. చిక్కుల్లో మాజీ మంత్రి.. 2011–13 కాలంలో మంత్రిగా ఉన్నప్పుడు కేటీ రాజేంద్ర బాలాజీ అక్రమాస్తులు కేసు కోర్టులో విచారణ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ అక్రమార్జనకు సంబంధించిన ఆధారాల అన్వేషణలో డీఎంకే ప్రభుత్వం ఉంది. ఈ విచారణ నిలుపుదలకు రాజేంద్రబాలాజీ కోర్టును ఆశ్రయించారు. అయితే, విచారణను కొనసాగించేందుకు అంగీకరిస్తూ, స్టే ఇవ్వడానికి కోర్టు గురువారం నిరాకరించింది. దీంతో అక్రమాస్తుల కేసు ఉచ్చు కేటీ రాజేంద్ర బాలాజీ మెడకు బిగిసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. -
27 ఏళ్ల తర్వాత.. ఫేస్బుక్ ద్వారా
మంచిర్యాలరూరల్ (హాజీపూర్): వారు అన్నదమ్ములు.. చిన్నప్పుడే విడిపోయారు.. ఇన్నాళ్లు ఎక్కడు న్నారో ఏమయ్యారో తెలియదు. 27 ఏళ్ల తర్వాత వారిని ఫేస్బుక్ కలిపింది. తల్లిదండ్రులు చనిపోవడంతో... మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నంనూర్ గ్రామానికి చెందిన ఆడెపు శంకరయ్య, శంకరమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు గురువయ్య, లక్ష్మణ్, సతీశ్, కూతురు రమ్య ఉన్నారు. 27 ఏళ్ల క్రితం శంకరయ్య, శంకరమ్మ దంపతులు రెండేళ్ల వ్యవధిలో చనిపోయారు. పిల్లల పోషణ బాధ్యతలను బంధువులు తలా ఒకరు తీసుకున్నారు. అప్పుడు రెండేళ్ల వయసున్న రమ్య బాధ్యతను శంకరయ్య సోదరుడు తీసుకోగా..అప్పటికి 15 ఏళ్ల వయసున్న గురువయ్య లక్సెట్టిపేటలోని బంధు వుల వద్ద, మిగతా ఇద్దరు నంనూర్‌లోనే బంధువుల వద్ద ఉండిపోయారు. గురువయ్య కొన్నాళ్లు బంధువుల వద్ద ఉండగా.. వారి ఇబ్బందులు, వేధింపులు తట్టుకోలేక చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. వరంగల్, హన్మకొండలలో హోటళ్లలో పనిచేస్తూ వంట మాస్టర్‌గా పేరు సంపాదించి చివరికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో స్థిరపడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. చిన్ననాటి ఫొటోతో గుర్తించి.. చిన్నవాడైన సతీశ్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూ మెరుగైన స్థితిలో ఉన్నాడు. తన ఇంటి పేరుతో ఫేస్బుక్లో ఎవరైనా ఉన్నారా అని సతీశ్ వెతకగా ఓ వ్యక్తిని గుర్తించాడు. ఆ వ్యక్తి ప్రొఫైల్ చూడగా..అందులో ఓ ఫొటో సతీశ్ వద్ద ఉన్న ఓ ఫొటో రెండూ ఒకేలా ఉండటంతో అతడి నుంచి వెంటనే ఫోన్ నంబర్ తీసుకుని వివరాలు తెలుసుకోవడంతో అతను తన పెద్దన్నయ్య గురవయ్య అని నిర్ధారణకు వచ్చాడు. తన రెండో సోద రుడు లక్ష్మణ్‌కు చెప్పి ఇతర బంధువులతో కలసి శుక్రవారం హుస్నాబాద్‌కు వెళ్లి సోదరుడిని కలుసు కుని అతడిని నంనూర్ గ్రామానికి తీసుకువచ్చారు. బంధువులందరూ గురువయ్యను చూసి ఉద్వేగానికి లోనయ్యారు. -
బైక్‌ను వెంబడించిన చిరుత; కేక్‌తో ప్రాణాలు కాపాడుకున్నారు
భోపాల్: తమను వెంబడిస్తున్న చిరుతపులిపై బర్త్‌డే కేక్‌ను విసిరి ఇద్దరు సోదరులు వారి ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ఆశ్చర్యకర ఘటన మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. ఫిరోజ్, సబీర్ మన్సూరీ ఇద్దరు అన్నదమ్ములు. కాగా గురువారం ఫిరోజ్ తన కుమారుడు పుట్టినరోజు కావడంతో కేక్ కొనుగోలు చేసేందుకు అతని సోదరుడు సబీర్ మన్సూరితో కలిసి బైక్‌పై జిల్లా కేంద్రానికి వెళ్లాడు. కేక్ కొనుగోలు చేసి తిరిగి గ్రామానికి వస్తుండగా దారి మధ్యలో ఉన్న చెరుకుతోట వద్ద ఒక చిరుతపులి వీరి బైక్‌ను వెంబడించింది. భయంతో వారిద్దరు తమ బైక్‌ను వేగంగా పోనిచ్చినప్పటికి చిరుత పులి వేగంగా వారిని సమీపించింది. బైక్‌పై వెనుకాల కూర్చున్న సబీర్ ఏం చేయాలో తెలియక తన చేతొలో ఉన్న కేక్‌బాక్స్‌ను చిరుత మీదకు విసిరాడు. అయితే అది ఏదైనా మారణాయుధం అని భావించిన చిరుత పులి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. అప్పటివరకు ప్రాణభయంతో పరుగులు పెట్టిన వారిద్దరు బతుకుజీవుడా అంటూ గ్రామానికి చేరుకున్నారు. ఊర్లోకి వెళ్లిన తర్వాత గ్రామస్థులకు విషయం చెప్పడంతో స్థానిక అటవీ అధికారులకు సమాచారం అందించారు. అయితే ఫిరోజ్ అందించిన సమాచారం మేరకు చిరుత పులి వారి బైక్‌ను దాదాపు 500 మీటర్ల దూరం వెంబడించిందని అధికారులు తెలిపారు. తమ ప్రాణాలను రక్షించుకోవడం కోసం తమ చేతిలో ఉన్న కేక్‌బాక్స్‌ను విసిరేసి అక్కడి నుంచి తప్పించుకున్నట్లు పేర్కొన్నారు. -
ఈరోజు స్పెషల్: బ్రదర్స్ డే.. ఎందుకో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: మే 24వ తేదీకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈరోజు అంతర్జాతీయ అన్నదమ్ముల దినోత్సవం. ప్రతి సంవత్సరం ఫాదర్స్, మదర్స్ డే, లవర్స్ డే మాదిరి బ్రదర్స్ డేగా ప్రపంచ దేశాలు నిర్వహించుకుంటున్నాయి. సోదరుడు అంటే అన్నాతమ్ముడు ఎవరైనా కావొచ్చు. మనతో ఆత్మీయంగా స్నేహితుడి మాదిరి ఉండే వ్యక్తి సోదరుడు. సోదరులు ఉంటే రక్త సంబంధమే కాదు. మనతో ఆత్మీయంగా ఉండే స్నేహితులను కూడా సోదరులుగా భావించవచ్చు. వారికి కూడా విషెస్ చెప్పొచ్చు. ఈ బ్రదర్స్ డే గురించి ఆసక్తికర విశేషాలు తెలుసుకోండి. 2005 నుంచి సోదరుల దినోత్సవం చేసుకోవడం మొదలైంది. అమెరికాలోని అలబామా రాష్ట్రానికి చెందిన శిల్పి, రచయిత సి డేనియర్ రోడ్స్ బ్రదర్స్ డేను తొలిసారిగా చేసుకున్నాడు. అప్పటి నుంచి సోదరుల దినోత్సవం చేసుకోవడం మొదలైంది. మొదట బ్రదర్స్ డేను కేవలం అమెరికాలో చేసుకునేవారు. తర్వాతర్వాత అన్ని దేశాల్లో మొదలైంది. ఈ రోజున సోదరులు పరస్పరం బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. కొన్ని దేశాల్లో వారి సోదరులకు ఇష్టమైనవి వంటకాలు చేసి కలిసి భుజిస్తారు. బ్రదర్స్ డేకు కొన్ని దేశాల్లో సెలవు దినం (Public Holiday) కూడా ప్రకటించారు. అన్నాదమ్ములు పరస్పరం తమపై ప్రేమ చాటుకునేందుకు ఉద్దేశించినదే ‘ప్రపంచ సోదరుల దినోత్సవం’. -
సొంత చెల్లిపై అత్యాచారం.. అమ్మ, పెద్దమ్మ సపోర్టు..
సాక్షి, ఖమ్మం : మానవత్వం రోజురోజుకీ మంటగలిసి పోతుంది. రక్త సంబంధాలు కూడా మరిచిపోయి దిగజారి ప్రవర్తిస్తున్నారు. విలువలు, వరుసలు మరిచి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. సభ్యసమాజం తలదించుకునే ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. గత కొన్నేళ్లుగా యువతిపై తోడబుట్టిన సోదరులే బలవంతంగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అయితే సోదరులు ఇలా తనపై అత్యాచారానికి ఒడిగడుతున్నారని తల్లికి చెప్పినా ఆమె పట్టించుకోలేదు. అంతేగాక నిందితులకు తన తల్లి, పెద్దమ్మ కూడా సహకరించారు. దీంతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగు చూసుంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టౌన్లో సొంత చెల్లిపై అన్నతోపాటు పెద్దమ్మ కొడుకు బలవంతంగా లైంగిక దాడి చేశారు. గత కొన్ని నెలల నుంచి చెల్లిని చిత్రహింసలు పెడుతూ వచ్చారు. అన్నలు ఇబ్బందులు పెడుతున్న విషయం మా అమ్మకు, పెద్దమ్మ, పెద్దనాన్నకు చెప్పానని, అయిన వారు పట్టించుకోకపోగా వారికే సపోర్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలిస్ స్టేషన్‌కు వెళ్లి పిర్యాదు చేస్తానని చెప్పినప్పుడల్లా తనను చంపుతానని బెదిరించేవారని దీంతో పోలీసులకు చెప్పలేకపోయానని వాపోయింది. తన తండ్రి లేకపోవడతో అలుసుగా చేసుకొని ఈ దారుణాలకు పాల్పడుతున్నారని చెప్పుకోచ్చింది. రోజు రోజుకు అన్న చిత్రహింసలు భరించలేక కొత్తగూడెం టూ టౌన్ పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అయితే ఈ దారుణ విషయం బయటపడటంతో లైంగిక దాడి చేసిన పెద్దమ్మ కొడుకు ఇంట్లో ఊరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. చదవండి: మైనర్‌పై లైంగిక దాడి.. ఆరు నెలల గర్భం.. ఆపై బాలికపై కామాంధుల ఘాతుకం.. 20 ఏళ్ల జైలు -
గేదె గడ్డి మేసిన వివాదం, సోదరుడిపై హత్యాయత్నం
సాక్షి, రాజేంద్రనగర్: గేదెలు వ్యవసాయ వర్సిటీలో గడ్డిమేసిన విషయమై ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాస్తా హత్యాయత్నానికి దారితీసింది.. బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఏసీపీ సంజయ్‌కుమార్ తెలిపారు. వివరాలు.. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన ఎం.బాల్‌రాజ్ అలియాస్ బాలయ్య (38), ఎం.రమేష్(37) వరుసకు సోదరులు. రమేష్‌కు చెందిన 3 గేదెలు బుధవారం రాత్రి వ్యవసాయ వర్సిటీలో గడ్డిమేశాయి. ఈ విషయాన్ని బాలయ్య వర్సిటీ అధికారులకు తెలపడంతో రమేష్‌కు అపరాధరుసుం విధించారు. ఇదేవిషమై గురువారం ఎన్ఐఆర్డీ కమాన్ వద్ద బాల్‌రాజ్, రమేష్ మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. బాల్‌రాజ్ తనవెంట తెచ్చుకున్న కొడవలితో రమేష్‌పై దాడి చేశాడు. స్థానికులు బాల్‌రాజ్‌ను నియంత్రించి కొడవలిని లాగివేయడంతో ప్రమాదం తప్పింది.తీవ్రంగా గాయపడ్డ రమేష్‌ను ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా బాల్‌రాజ్.. రమేష్‌పై దాడి చేస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న రాజేంద్రనగర్‌కు చెందిన నారాయణ, నరేష్ ధైర్యంగా ముందుకు వెళ్లి బాల్‌రాజ్‌ను అడ్డుకుని గాయపడ్డ రమేష్‌ను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్‌కుమార్ వారిని అభినందించారు. గతంలో బాల్‌రాజ్‌పై హత్యారోపణలు.. కాగా బాల్‌రాజ్‌పై గతంలో రెండు హత్యారోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయి. రాజేంద్రనగర్ ప్రాంతంలో బాల్‌రాజ్ నిత్యం మద్యం తాగి దౌర్జన్యం చేయడంతో పాటు దాడులకు పాల్పడుతూ ఉండేవాడని స్థానికులు తెలిపారు. సోదరుడిపై దాడిచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. -
తమ్ముడి ఆత్మహత్య.. ఆవేదనతో అన్న కూడా
సాక్షి, మైసూరు: అన్న మందలించాడని మనస్తాపంతో తమ్ముడు ఆత్మహత్య చేసుకోగా తమ్ముడు మరణాన్ని జీర్ణించుకోలేక అన్న కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. హెడీకోటే తాలుకాల ఎలెగుండి గ్రామానికి చెందిన వెంకటేష్(28), హరీశ్(26), అన్నదమ్ములు. ఇద్దరు రైతులు. తమ్ముడు హరీశ్ ఇటీవల ట్రాక్టర్‌ను వేగంగా నడపడంతో వెంకటేష్‌తోపాటు అతని తండ్రి మందలించారు. ఆవేదనకు లోనైన హరీశ్ గురువారం రాత్రి ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ్ముడి ఆత్మహత్యకు తానే కారణమని భావించిన వెంకటేష్ తాను కూడా సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ‘కేటీఆర్ పీఏ’నంటూ ఫోన్.. డబ్బు డిమాండ్ -
పెళ్లి వేడుకలకు వెళ్తున్నామని.. తాగిన మైకంలో!
సాక్షి, సిర్పూర్(ఆదిలాబాద్): పెళ్లి వేడుకలకు వెళ్తున్నామని తల్లిదండ్రులకు చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన అన్నదమ్ములు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మండల కేంద్రంలో బెస్తకాలనీలో శనివారం తీవ్ర విషాదాన్ని నింపింది. జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ సురేష్ గౌడ్ వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని బెస్తకాలనీకి చెందిన దివిటే బావోజీ, శశాబాయి దంపతులకు నలుగురు కుమారులు. చిన్నవారైన దివిటే దిలీప్(26) తాపీ మేస్త్రీగా పని చేస్తుండగా దివిటే శ్రీకాంత్(21) కూలీ పని చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. చదవండి: కూతురి ఎఫైర్: తండ్రికి నిప్పంటించి.. ఇద్దరు అన్నదమ్ములు మూడు రోజులుగా మద్యం మత్తులోనే ఉంటున్నారు. శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఓ పెళ్లి వేడుకకు వెళ్తున్నామని తల్లిదండ్రులకు చెప్పి బయటకు వచ్చారు. అర్ధరాత్రి సమయంలో మద్యం తాగి బెస్తకాలనీ సమీపంలోని రైల్వేట్రాక్ వద్దకు చేరుకున్నారు. మద్యం మత్తులో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం ఉదయం మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలకు సిర్పూర్(టి) ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యే మనవళ్లను మింగిన కరోనా
దాచేపల్లి : కరోనా మహమ్మారి అన్నదమ్ములను మింగేసింది. 20 రోజుల వ్యవధిలో కరోనాతో ఇద్దరూ మృత్యువాత పడిన విషాద ఘటన దాచేపల్లి మండలం ముత్యాలంపాడులో చోటుచేసుకుంది. గురజాల మాజీ ఎమ్మెల్యే కొత్త వెంకటేశ్వర్లు మనువళ్లు కొత్త నరేష్ (35), కొత్త రామకృష్ణ (32) కరోనాకు బలయ్యారు. కొత్త వెంకటేశ్వర్లు కుమారుడు కోటేశ్వరరావు, రత్నకుమారి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు నరేష్ పిడుగురాళ్లలో వ్యాపారం చేస్తుండగా చిన్న కుమారుడు రామకృష్ణ వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. గత నెలలో నరేష్ అనారోగ్యానికి గురికావటంతో కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్ తేలింది. కరోనాతో బాధపడుతున్న నరేష్ వద్ద సేవలు చేసేందుకు తమ్ముడు రామకృష్ణ ఉన్నాడు. ఈ క్రమంలో కరోనాతో వైద్యం పొందుతున్న నరేష్ గత నెల 21వ తేదీన మృతి చెందాడు. నరేష్ మృతి చెందిన తరువాత రామకృష్ణ కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స చేయించుకున్నాడు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ రామకృష్ణ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అన్నదమ్ముల మృతితో ముత్యాలంపాడులో విషాదఛాయలు అలముకున్నాయి. రామకృష్ణ మృతి పట్ల గురజాల శాసనసభ్యులు కాసు మహేష్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీలో క్రీయశీలకంగా పనిచేసిన రామకృష్ణ మృతి తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. రామకృష్ణ మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు. -
ఆ బ్రదర్స్‌కు సెల్యూట్! పేదల ఆకలి తీర్చటానికి..
బెంగళూరు : రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఓ ఇద్దరు అన్నదమ్ములు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దినసరి కూలీలకు నిత్యావసరాలను అందించటానికి సొంత స్థలాన్ని అమ్మారు. వివరాల్లోకి వెళితే.. కోలార్ జిల్లాకు చెందిన అన్నదమ్ములు తాజమ్ముల్ పాశా, మజమ్మిల్ పాశాలు లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు సహాయపడాలనుకున్నారు. తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దినసరి కూలీల కుటుంబాలను చూసి వారు చలించిపోయారు. వీలైనంత త్వరగా వారిని ఆదుకోవాలనుకున్నారు. ఇందుకోసం తమకు చెందిన స్థలాన్ని అమ్మి డబ్బు రూ. 25లక్షలు సమకూర్చారు. ( లాక్డౌన్ రూల్స్ బ్రేక్.. పబ్ సీజ్ ) ఆ డబ్బుతో వారికి అవసరమైన నిత్యావసరాలను కొని అందించారు. అంతేకాకుండా అన్నార్థుల కోసం భోజన పొట్లాలు పంచే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘‘ మా చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించారు. అప్పుడు మేము కోలార్‌లోని మా అమ్మమ్మ గారి ఇంటికి వచ్ఛేశాము. ఆ సమయంలో మా మతంతో సంబంధం లేకుండా.. హిందువులు, సిక్కులు, ముస్లింలు మాకు సహాయం చేశారు. కడుపేదరికంలో పెరిగాము. అన్ని వర్గాల ప్రజల అండదండల తోటే మేము బ్రతికామ’’ని తెలిపారు. -
మాజీ మంత్రి ఆది సోదరులపై కేసు నమోదు
జమ్మలమడుగు రూరల్: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అనుచరులపై దాడి చేసిన కేసులో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఆయన సోదరులు ఎమ్మెల్సీ శివనాథరెడ్డి, రామాంజనేయరెడ్డి, కుమారుడు గోవర్థన్‌రెడ్డి, మరో 80మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మధుసూదన రావు తెలిపారు. తమపై దాడి చేసినట్లు బాధితులు రెడ్డయ్య, రామాంజనేయులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా దేవగుడి గ్రామంలో 30 యాక్టు చట్టాన్ని ఉల్లంఘించి సమావేశాన్ని నిర్వహించారన్నారు. శనివారం అర్ధరాత్రి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 324, 307,147,148,188 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
49 రోజులు.. 501 దేవాలయాల సందర్శన
బంజారాహిల్స్: వారిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు.. సొంత అన్నదమ్ములు.. అటు తమిళనాడుతోనూ ఇటు తెలంగాణతోనూ అనుబంధం పెంచుకున్నారు. అందరిలా కాకుండా తమకంటూ గుర్తింపు తెచ్చుకునే క్రమంలో ఈ ఇద్దరూ కలిసి చేసిన ఆధ్యాత్మిక ప్రయాణం అందరినీ ఆకట్టుకుంది. ఈ యాత్ర కోసం వీరు ప్రత్యేకంగా ఓ కారును కూడా తయారు చేసుకున్నారు. ఆ కారుపై వివిధ ఆలయాల నమూనాలు కూడా ఆకట్టుకున్నాయి. సమాజంలో చోటుచేసుకుంటున్న అత్యాధునిక మార్పులు ప్రతి ఒక్కరి జీవితాల్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ మార్పులు కొంతవరకు మేలు చేస్తుండగా అధికశాతం చెడు మార్గాల వైపు మళ్లిస్తున్నాయి. ప్రధానంగా తమ భవిష్యత్‌ను, కెరీర్‌ను అత్యద్భుతంగా తీర్చిదిద్దుకోవాల్సిన యువత స్మార్ట్ఫోన్ల మోజులో పడి తమ వ్యక్తిగత జీవితాల్ని నాశనం చేసుకుంటున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. మరికొందరు పని ఒత్తిడిని ఎదుర్కోలేక వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోగా అసాంఘిక కార్యకలాపాల వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్‌నెంబర్–10లో నూర్‌నగర్‌లో నివసించే తమిళనాడుకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు పండిదురై(32), కార్తికేయన్(28)లు ఇటీవల అత్యద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు. గత ఏడాది నవంబరులో ప్రారంభమైన వీరి ఆధ్యాత్మికయాత్ర 49 రోజుల పాటు 20,800 కిలోమీటర్లు సాగింది. ఈ ప్రయాణంలో వీరు 501 దేవాలయాల్ని దర్శించుకున్నారు. తమ స్వగ్రామంలో ప్రారంభమైన ఈ యాత్ర బంజారాహిల్స్‌లో ఇటీవలనే ముగిసింది. ఈ సందర్భంగా పాండిదురై మాట్లాడుతూ తాము నిర్వహించిన ఆధ్యాత్మిక యాత్ర తమ జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నారు. ఇక్కడి యువతలో ఆధ్యాత్మిక భావాలు తగ్గిపోయాయని, దేశవ్యాప్తంగా తాము దేవాలయాల సందర్శన ద్వారా అనే అంశాలను అవగాహన చేసుకున్నామన్నారు. దేవాలయాల వ్యవస్థను ఆధ్యాత్మిక సంపదను, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు పెద్దలు చేస్తున్న ప్రయత్నాలకు యువత తోడ్పాటు ఎంతో అవసరం ఉందన్నారు. తాము నిర్వహించిన ఆధ్యాత్మిక యాత్రకు అడుగడుగునా అపురూపమైన ఆదరణ లభించిందన్నారు. ఈ సందర్భంగా తాము గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజ్‌ను కూడా కలుసుకున్నామని, తమ యాత్రను అభినందించారని చెప్పారు. -
వృత్తి చెత్త సేకరణ.. ప్రవృత్తి బైక్ రైడ్
వారిద్దరు అన్నదమ్ములు. వారి జీవనశైలి విభిన్నం. సాధారణ బస్తీలో పుట్టి పెరిగిన వీరు బైక్‌పై సాహస ప్రయాణం చేసి స్ఫూర్తిగా నిలిచారు. బైక్ రైడింగ్‌లో వారేమైనా శిక్షణ పొందారా అంటే అదేమీలేదు. వారికికావాల్సిన పరికరాలు లేవు. నైపుణ్యం అంతకంటే లేదు. ధైర్యాన్నే నమ్ముకున్నారు.జమ్మూ కశ్మీర్, లదాక్‌లకు వెళ్లివచ్చారు. బుల్లెట్ రైడ్‌తో మంచుకొండలనుచుట్టివచ్చారు. బస్తీ కుర్రోళ్లు భలే సాహసగాళ్లుఅనిపించుకున్నారు. యువతకుఆదర్శంగా నిలిచారు. అంబర్‌పేట :నగరంలోని బాగ్‌అంబర్‌పేట బతుకమ్మకుంట చెంచు బస్తీకి చెందిన ఎన్.రమేష్, ఎన్. మహేష్‌లు అన్నదమ్ములు. వీరు చెత్త సేకరిస్తూ జీవనోపాధి పొందుతుంటారు. జీహెచ్ఎంసీ ఇచ్చిన చెత్త సేకరణ ఆటో, రిక్షాలను నడుపుతూ జీవనం సాగిస్తారు. ఇంటింటికీ తిరిగి సేకరించిన చెత్త ద్వారా వచ్చే డబ్బులే వీరికి ప్రధానం ఆదాయం. బైక్‌రైడ్, దూరప్రాంతాలను సందర్శించాలనే అభిరుచి వారిని కశ్మీర్ మంచు కొండలను చుట్టి వచ్చేలా చేసింది. నెలరోజుల క్రితం వీరిద్దరూ రెండు బుల్లెట్ వాహనాలపై హైదరాబాద్ నుంచి జమ్మూ కశ్మీర్, లదాక్ ప్రాంతాల్లో పర్యటించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. సాహస ప్రయాణం.. బుల్లెట్ వాహనాలపై అన్నదమ్ములిద్దరూ 12 రోజుల పాటు 6,300 కిలో మీటర్ల ప్రయాణం చేశారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ, అమృత్సర్, వాఘా సరిహద్దును సందర్శించి దేశభక్తిని చాటుకున్నారు. అక్కడి నుంచి శ్రీనగర్, కార్గిల్ మీదుగా లదాక్, కార్దుంగ్లా, మనాలీ, చండీగఢ్ నుంచి తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. మైనస్ 5 డిగ్రీల ఉష్ణోగ్రతలో వీరు బుల్లెట్ వాహనాలపై మంచుకొండల్లో ప్రయాణించారు. ఒళ్లు గడ్డకట్టే చలి, ఆక్సిజన్ కొరత ఉండే ప్రాంతాల్లో బైక్‌రైడ్ చేసి ఔరా అనిపించారు. దారిలో ఎదురైన ఆంక్షలను సైతం ఎదుర్కొని ప్రయాణం సాగించారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో.. ప్రతియేటా ఏదో సాహస యాత్ర చేస్తాం. గత ఏడాది ముంబైని చుట్టి వచ్చాం. ఈ ఏడాది జమ్మూ కశ్మీర్, లదాక్ ప్రాంతాలకు వెళ్లి వచ్చాం. పెట్రోల్‌కే రూ.10 వేల ఖర్చు అయ్యింది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం.. మాలోని లాంగ్ డ్రైవ్ ఆసక్తే సాహసయాత్రకు శ్రీకారం చుట్టింది. చెత్త సేకరణ ఆటో ఆగకుండా ఇతరులకు బాధ్యత అప్పగించి 12 రోజులపాటు సాహస యాత్ర చేశాం. – రమేష్ నేపథ్యానికి భిన్నంగా... బతుకమ్మకుంట చెంచు బస్తీ అంటేనే స్థానికంగా ప్రత్యేక అభిప్రాయం ఉంది. వీరంతా నిరక్షరాస్యులు. ఎవరి మాటా వినరనే ప్రచారం ఉంది. అంతా చెత్త సేకరించే కుటుంబాలు అనే దృష్టి కూడా ఉంది. ఈ ఇద్దరు యువకులు తమకు జీవనోపాధిని ఇచ్చే వృత్తిని చిన్నచూపు చూడకుండానే దేశాన్ని చుట్టి వచ్చే సంకల్పానికి దిగారు. తెల్లవారుజామున 5 గంటలకే చెత్త ఆటోతో బయలుదేరేవారు బుల్లెట్ వాహనాలపై కశ్మీర్ లోయకు వెళ్లిరావడం విశేషం. కేవలం తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వెళ్లి వచ్చినట్లు వారు పేర్కొన్నారు. 12 రోజుల పాటు చెత్త సేకరణకు సెలవిచ్చి దేశాన్ని చుట్టి రావడం గమనార్హం. చిన్న సాహసం చేసి ప్రచారం చేసుకునే ఈ రోజుల్లో వీరు సరదాగా సాహసం చేయడం విశేషం. -
ఎమ్మెల్యేలుగా గెలిచిన అన్నదమ్ములు వీరే..
సాక్షి, అమరావతి: ఈసారి శాసనసభలో ఎమ్మెల్యేలుగా గెలిచిన అన్నదమ్ములు సందడి చేయనున్నారు. వైఎస్సార్సీపీ తరఫున ఉత్తరాంధ్ర నుంచి ధర్మాన, బొత్స సోదరులు, రాయలసీమ నుంచి పెద్దిరెడ్డి, రాంపురం సోదరులు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించనుండటం ఆసక్తికరంగా మారింది. నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, ఆయన అన్నయ్య ధర్మాన కృష్ణదాస్ 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 1989, 1999 ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 ఎన్నికల్లో ఆయన అన్నయ్య కృష్ణదాస్ రాజకీయాల్లోకి వచ్చారు. దాంతో 2004 ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి, కృష్ణదాస్ నరసన్నపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009 ఎన్నికల్లో కూడా అవే నియోజకవర్గాల నుంచి వారిద్దరూ గెలవడం విశేషం. మళ్లీ ఇప్పుడు 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఆ రెండు నియోజకవర్గాల నుంచే పోటీ చేసి విజయం సాధించారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి సోదరులు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి సోదరులు వైఎస్సార్సీపీ తరఫున అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 1989, 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన పుంగనూరు నుంచి, ఆయన సోదరుడు ద్వారకానాథ్‌రెడ్డి తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేలుగా.. ముగ్గురు అన్నదమ్ములు కాగా, ఈ ఎన్నికల్లో ముగ్గురు అన్నదమ్ములు ఎమ్మెల్యేలుగా గెలవడం విశేషం. రాంపురం సోదరులుగా గుర్తింపు పొందిన సాయిప్రసాదరెడ్డి, బాలనాగిరెడ్డి, వెంకటరామిరెడ్డి వైఎస్సార్సీపీ తరఫున ఈ ఘనత సాధించారు. వారిలో సాయిప్రసాదరెడ్డి, బాలనాగిరెడ్డి కర్నూలు జిల్లా ఆదోని, మంత్రాలయంల నుంచి, వెంకటరామిరెడ్డి అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వడం విశేషం. సాయిప్రసాదరెడ్డి 2004లో కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యేగా గెలిచారు. బాలనాగిరెడ్డి కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి 2009లో టీడీపీ అభ్యర్థిగా, 2014లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. విజయనగరం జిల్లాలో బొత్స సోదరులు బొత్స సత్యనారాయణ 1999లో విజయనగరం జిల్లాలోని బొబ్బిలి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత 2004, 2009ల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2009లోనే బొత్స తమ్ముడు బొత్స అప్పలనరసయ్య గజపతినగరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మళ్లీ ఇప్పుడు బొత్స సోదరులిద్దరూ వైఎస్సార్సీపీ తరఫున చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. -
అన్నదమ్ములు దారితప్పి..దొంగలయ్యారు
సాక్షి, విశాఖపట్నం: ఉన్నత చదువులు చదివే క్రమంలో వ్యసనాలకు బానిసలయ్యారు. జల్సాల కోసం సులువుగా డబ్బు సంపాదించేందుకు చైన్‌స్నాచింగ్‌ల బాట పట్టారు. ఈ క్రమంలో కన్నతల్లే సలహాలు ఇస్తూ... చోరీ సొత్తును భద్రపరుస్తుండడంతో మరింతగా చెలరేగిపోయారు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కి ముగ్గురూ జైలు పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా బుధవారం వెల్ల డించారు. స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగి ఎంపాడ వెంకటరమణ కుమారులు ఎంపాడ చంద్రశేఖర్‌రెడ్డి బీటెక్, ఎంపాడ గోపీనాథ్ రెడ్డి డిప్లమో చదువుకున్నారు. డ్రగ్స్ తీసుకుంటూ వ్యసనాలకు బానిసలైన వీరు జల్సాల కోసం డబ్బు సంపాదించేందుకు దొంగతనాల బాటపట్టారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసుకొని 2016 నుంచి ఇప్పటి వరకు 51 చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. చంద్రశేఖర్ 22, గోపీనాథ్ 11, ఇద్దరూ కలిపి 18 చైన్‌స్నాచింగ్‌లు చేశారు. ఈ బంగారు ఆభరణాలను విక్రయించి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేశారు. కొన్ని సందర్భాల్లో ఈ బంగారాన్ని వీరి తల్లి సరోజిని భద్రపరిచేది. మరికొన్ని సందార్భల్లో ఎక్కడైనా ఒంటరి మహిళలు ఉంటే వారి సమాచారాన్ని కుమారులకు చేరవేసేది. మొత్తంగా నగరంలో చైన్‌స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగిపోవడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా వీరిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అనేక విషయాలు వెలుగుచూశాయి. మొత్తం 51 దొంగతనాల్లో 1382.90 గ్రాముల బంగారం అపహరించారు. వీరి నుంచి 1142.50 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు బంగారంతోపాటు ఐదు బైక్‌లు అపహరించారని సీపీ తెలిపారు. ఈ దొంగతనాల వ్యవహారంలో మిగిలిన కుటుంబ సభ్యులకు సంబంధం లేదని ఆయన తెలిపారు. 2016 నుంచి 2019 వరకు చైన్ స్నాచింగ్ కేసులు తగ్గుతూ వచ్చాయని, 2017లో 1727 కేసులు, 2018లో 1261 కేసులు, 2019 ఏప్రిల్ వరకు 261 కేసులు నమోదయ్యాయన్నారు. సమావేశంలో ఏడీసీపీ సురేష్‌బాబు, ఏసీపీ ప్రభాకర్ బాబు, ఏసీపీ త్రినాథ్‌రావు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. నిందితులు గోపీనాథ్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి నిందితులపై కేసుల వివరాలివీ నిందితులు చంద్రశేఖర్, గోపీనాథ్‌లపై గాజువాక పోలీస్ స్టేషన్లో 21 కేసులు, దువ్వాడ పీఎస్‌లో 5, ఎంవీపీ పోలీస్ స్టేషన్లో 6, స్టీల్‌ప్లాంట్ పీఎస్‌లో 4, న్యూ పోర్ట్ పీఎస్‌లో 4, కంచరపాలెం పీఎస్‌లో 1, త్రీటౌన్‌లో 2, ఫోర్త్ టౌన్లో 1, మల్కాపురం పీఎస్‌లో 1, పెందుర్తి స్టేషన్లో 2, గోపాలపట్నం స్టేషన్లో 2, అనకాపల్లి స్టేషన్లో 3, మునగపాక స్టేషన్లో 2 కేసులు నమోదయయ్యాయి. ప్రత్యేక బృందానికి అభినందనలు విశాఖ నగరంలో చైన్ స్నాచింగ్స్ తరచూ జరుగుతుండడంతో ప్రత్యేక బృందాన్ని సీపీ ఏర్పాటు చేశారు. ఈ బృందానికి ఇన్స్పెక్టర్ ఎం.అవతారం నాయకత్వం వహించారు. దర్యాప్తులో భాగంగా చంద్రశేఖర్‌రెడ్డి, గోపీనాథ్‌రెడ్డి, వారి తల్లిపై అనుమానం రావడంతో ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో వారు నివాసం ఉంటున్న పరవాడలోని అనూష అపార్ట్‌మెంట్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చాకచక్యంగా పట్టుకున్నారు. సీఐ అవతారంతోపాటుగా సౌత్ సబ్ డివిజన్ క్రైం విభాగంలో ఎస్సైలు జి.తేజేశ్వరరావు, ఎల్.దామోదర్‌రావు, బి.లూథర్‌బాబు, డి.సూరిబాబు, మిగతా సిబ్బందిని సీపీ మహేష్‌చంద్ర లడ్డా అభినందించారు. -
కోరని వరం
ఎవరైతే కోరికలన్నింటినీ విడిచిపెట్టి భగవంతుని వైపుకు సాగుతారో.. సముద్రం వంటి విశాలమైన మనసున్న అటువంటి వారిని.. నదులు సముద్రంలో కలిసినట్లుగా నదులవంటి విషయభోగాలు వెతుక్కుంటూ వస్తాయి. ఒకసారి అన్నదమ్ములైన రావణ, కుంభకర్ణ, విభీషణులు ముగ్గురూ కలిసి బ్రహ్మను గురించి తపస్సు చేశారు. వీరి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. రావణుడు తనకు ఎవరి వలనా మరణం కలగకూడదు అనే వరాన్ని కోరాడు. అప్పుడు బ్రహ్మ ‘అది అసాధ్యం. దీనికి బదులు వేరే ఏదైనా వరం కోరుకో’ అన్నాడు. రావణుడు ఆలోచించాడు– నరులు, వానరాలు అల్పప్రాణులు, బలం లేని వారు కనుక వారి వలన మరణం ఎలాగూ రాదు. బలవంతులైన యక్షులు, రాక్షసులు, దేవతలు మొదలైన వారితోనే మరణం లేకుండా వరం కోరుకుంటే చాలు అనుకున్నాడు. బ్రహ్మని కూడా అదే కోరాడు. ‘తథాస్తు’ అన్నాడు బ్రహ్మ. కుంభకర్ణుడు కూడా చావు లేని వరాన్ని పొందాలనే ఉద్దేశంతోనే తపస్సు చేసినా చివరకు బుద్ధి భ్రమించి ‘తనకు చక్కగా నిద్ర రావాలి’ అనే వరం కోరుకున్నాడు. మహా సాత్వికుడైన విభీషణుడు రావణ కుంభకర్ణులవలె తనకు ఎప్పుడూ మరణం రాకూడదని ఆశపడలేదు. ‘ఎంతటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నా నా బుద్ధి చెడు దారి పట్టకూడదు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతుని మరవకుండా ఉండునట్లు వరాన్ని ఇస్తే చాలు. ఇదొక్కటే నా కోరిక’ అన్నాడు. విభీషణుడి మాటలను విని సంతోషపడిన బ్రహ్మదేవుడు రాక్షసుడిగా జన్మించి ఉత్తమమైన సంస్కారం లేకపోయినా, నీ బుద్ధి మాత్రం అధర్మం వైపు సాగటం లేదు. నీలో ఉన్న ఈ సుగుణాలను చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే ‘నీవు అడగకపోయినా నిన్ను చిరంజీవిగా ఉండేట్లు వరం ఇస్తున్నానని’ అన్నాడు.అమరత్వం కోసం వందల సంవత్సరాలు తపస్సు చేసినా రావణుడికి తాను కోరుకున్నది దక్కనేలేదు. తనకు చావు రాకూడదు అని ఎప్పటికీ కోరని విభీషణుడికి మాత్రం అమరత్వం దక్కింది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పే మాట ఇదే. మానవుడు విషయభోగాల వెంటపడి పరిగెత్తినంత కాలం అతడు కోరుకున్న భోగాలు అతడి నుంచి మరింత దూరమవుతాయి. – డి.వి.ఆర్. -
బ్రదర్స్.. అదుర్స్
పశ్చిమగోదావరి, పోడూరు: జిన్నూరు నర్సింహరావుపేటకు చెందిన పెచ్చెట్టి నాగచైతన్య, పెచ్చెట్టి రాధాకృష్ణ సోదరులిద్దరూ చిన్ననాటి నుంచే క్రీడల్లో రాణిస్తున్నారు. అన్న నాగచైతన్య జిన్నూరు ఐడియల్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు. తమ్ముడు రాధాకృష్ణ 2వ తరగతి చదువుతున్నాడు. నాగచైతన్య కరాటేలో రాణిస్తూ పలు పతకాలను సాధించాడు. పాలకొల్లు, నిడదవోలు పట్టణాల్లో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చి పతకాలను, ప్రశంసాపత్రాలను అందుకున్నాడు. రాధాకృష్ణ రన్నింగ్‌లో చిచ్చరపిడుగు. స్కూల్‌స్థాయిలో ఎప్పుడు పోటీలు నిర్వహించినా ఫస్ట్ వస్తాడు. ఇటీవల పాలకొల్లులో అపుస్మా ఆధ్వర్యంలో జోనల్‌స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ప్రథమస్థానం సాధించాడు. భవిష్యత్తులో మరింత రాణిస్తామని చెప్పారు. -
ఆ ఒక్క ఆవు
ఓ గ్రామంలో ఇద్దరు సోదరులు ఉన్నారు. అన్న దగ్గర తొంభై తొమ్మిది ఆవులు, తమ్ముడి దగ్గర ఒకే ఒక్క ఆవు ఉన్నాయి. తమ్ముడు ఆ ఒక్క ఆవు పాలు పితికి ఇంటికి అవసరమైనంత వాడుకుని మిగిలిన వాటిని అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఇల్లు గడుపుతున్నాడు. తొంభై తొమ్మిది ఆవులున్న అన్నయ్యకు మాత్రం తన దగ్గరున్న ఆవులకు మరొక ఆవును కలిపి వంద ఆవులకు యజమానిని అని చెప్పుకోవాలని తాపత్రయం. ఇందుకోసం తన తమ్ముడి దగ్గరున్న ఆ ఒక్క ఆవుని సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో ఓ రోజు తమ్ముడి ఇంటికి వెళ్లాడు. ‘‘తమ్ముడూ.. నీదగ్గరున్న ఆ ఆవు కాస్తా ఉన్నట్టుండి తప్పిపోయిందనుకో ఏం చేస్తావు’’ అని అడిగాడు. అప్పుడు తమ్ముడు.. ‘‘ఏముంది.. కష్టంగానే అనిపిస్తుంది. ఉన్న కాస్త పొలంతోనే సరిపెట్టుకుంటాను’’ అన్నాడు. దాంతో అన్నయ్య ‘‘నిజమేరా నువ్వన్నది. నువ్వు ఒక ఆవును ఉంచుకోవడమూ, అసలు ఆవే లేకపోవడమూ ఒక్కటే. నన్ను చూడు. తొంభై తొమ్మిది ఆవులున్నాయి కదా, మరొక్క ఆవుగానీ ఉంటే నేను వంద ఆవులకు యజమానినవుతాను. ఆ మాట ఈ ఊళ్లో ఉన్నవారందరూ చెప్పుకోవాలని నా ఆశ’’ అని అన్నాడు. అందుకు ఆ తమ్ముడు ‘‘అవునన్నా.. అప్పుడు నిన్నందరూ వంద ఆవుల యజమాని అంటారు. కనుక నా దగ్గరున్న ఈ ఒక్క ఆవునీ నువ్వే తీసేసుకో.. నిన్నలా అనుకోవడం నాకానందమే’’ అని చెప్పాడు. అందుకోసమే ఎదురుచూస్తున్న అన్న ఎంతో ఆనందించాడు. జెన్ గురువులు ఈ కథను చెప్తూ మనిషి మనసు ఇలానే ఆలోచిస్తుంది. తమ దగ్గర ఎంత ఉన్నా సరే, ఇంకా ఇంకా కావాలనే కోరుకుంటుంది తప్ప తృప్తి పడదు. ఇలాంటి మనసు నరకం లాంటిది. అదే ఉన్న దానితోనే సంతృప్తి పడే వారి మనసు స్వర్గమే అవుతుంది. కాబట్టి మీరు మనసును స్వర్గధామం చేసుకోండి అని వారు చెప్పేవారు. – యామిజాల జగదీశ్ -
అండగా ఉంటానన్న ఆ అన్నయ్య ఎక్కడున్నాడు?
రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములకైనా, స్నేహితుల్లో, బంధువుల్లో ఉన్న అన్నదమ్ములకైనా తమ అక్క చెల్లెళ్లకు అన్యాయం జరిగినప్పుడు కలిగే బాధ... ఇంకో ఆడపిల్ల విషయంలో ఎందుకు అనిపించడం లేదు? అన్నా! ఇది అన్యాయం కాదా? రాఖీ పండుగరోజు చెల్లెమ్మ రాఖీ కడితే, ‘అండగా ఉంటానమ్మా!’ అనే ఒక ధైర్యాన్నిచ్చేస్తారు అన్నలు. ఇష్టంగా ఒక చిన్న బహుమతిని కూడా ఇచ్చేస్తారు. కానీ ఎల్లప్పుడూ అండగా ఉంటున్న అన్నయ్యలు ఎందరు? ఎంత మంది చెల్లెళ్లు ఈరోజు ఈ సమాజంలో ఇబ్బంది పడుతున్నారు! అండగా ఉంటానన్న ఆ అన్నయ్య ఎక్కడున్నాడు? రక్షాబంధన్... రాఖీ... అదొక అన్నాచెల్లెళ్ల పండుగ. ఒక పండుగ అనే కంటే పవిత్రమైన ప్రమాణాల వేడుక. అంటే ఒక ముఖ్యమైన బాధ్యతను ప్రతినిత్యం గుర్తు చేసుకోవచ్చునేమో. రాఖీ ఎలా పుట్టింది? పురాణాలు ఏం చెబుతున్నాయి? మొదటి రాఖీ కట్టిన ఆమె ఏ సంబంధం ఉన్న అతనికి కట్టింది, దాని ఫలితమేంటి? అనే చారిత్రక అంశాలు తెలిసినా, తెలియకపోయినా రాఖీ అంటే రక్షణ కల్పించే ఒక నమ్మకం. మతాలకు అతీతంగా అక్కా చెల్లళ్లు అన్నదమ్ములకు రాఖీలు కడతారు. ఒక పండుగ వాతావరణంతో ఆ రోజంతా గడుస్తుంది. బుడిబుడి అడుగులు వేసుకుంటూ చిట్టిచిట్టి చేతులతో వచ్చీరాని ముడులు వేసే వయసులో అన్న అల్లరిగా గెంతుతూ కళ్ల ముందే ఉంటాడు. నూనూగు మీసాల అన్నయ్య తను దాచుకున్న డిబ్బీ పైసలలోంచి చెల్లెలికి ఒక రంగుల పుస్తకమో, బొమ్మలో కొనిచ్చినప్పుడు కంటి నిండా కనిపిస్తాడు. అక్క పెళ్లికి ముందు జరిగే ఆఖరి రాఖీ పండుగ రోజున తనకిష్టమైన నెమలికంఠం రంగు జరీ చీర కొనిచ్చి ఆజన్మాంతం నీకు రక్షణ కల్పిస్తానని ప్రమాణం చేసినప్పుడు చెట్టంత మనిషిలా, నిలువెత్తు భరోసాలా కనువిందు చేస్తాడు. అదేంటో బావమరిదిగా మారినా, ఇంటి కొడుకుగా నిలబడాల్సి వచ్చినా ఆ అన్న మాయమౌతాడు. ఏది ఏమైనా తన అక్క లేక చెల్లి మెట్టినింటే ఉండాలనుకుంటాడు. తన ఇంటి ఆడబిడ్డ భర్త దగ్గర దెబ్బలు తింటున్నా బావకు ఆర్థికంగా సహకరిస్తే అక్కను బాగా చూసుకుంటాడని నమ్ముతాడు. కానీ అన్నగా తమ్ముడిగా కనుమరుగవుతుంటాడు. మళ్లీ ఏడాది రాఖీనాడు కనిపిస్తాడు. అన్నగా తమ్ముడిగా రాఖీలు కట్టించుకునే వాడిగా. ఈ అన్నదమ్ముల్ని నిర్వీర్యం చేసేదేమిటి? తమ అక్కలకు చెల్లెళ్లకు తమ నుంచి ఏ కష్టం రాకుండా చూసుకుంటే సరిపోతుందా? అదీ ఎన్నోసార్లు కష్టతరమే. రోజూ సొంత ఇంట్లోనే వివక్షకు గురవుతున్న చెల్లెళ్లకు, ఆఫీసుల్లో చిల్లర చూపులకు బలవుతున్న అక్కలకు, రోడ్ల మీద, మెట్టినిళ్లలో అవమానాలకు, అఘాయిత్యాలకు బలవుతున్న ఆడబిడ్డలకు ఈ అన్నదమ్ములు ఏమీ చేయలేరా? వీళ్లు చేయాల్సింది నిరంతరం ఇంటి ఆడవారి వెన్నంటే ఉండి రక్షించడం కాదు, వారికి ఆత్మరక్షణ పద్ధతులను నేర్పించడమే కాదు, ఈ తోడబుట్టిన అన్నదమ్ములందరూ ప్రతి మగాడికీ తెలిసేలా తమను తాము సంస్కరించుకోవడం. ఈ బంధాల కన్నా స్త్రీలు భయపడకుండా తిరగగలిగే స్వేచ్ఛనివ్వడమే గొప్పది. రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములైనా, స్నేహితుల్లో, బంధువుల్లో ఉన్న అన్నదమ్ములైనా తమ అక్క చెల్లెళ్లకు అన్యాయం జరిగినప్పుడు కలిగే బాధ ప్రతి ఆడపిల్లకూ ఎందుకు వర్తించడం లేదు? ఇటీవల సంచలనం సృష్టించిన చలనచిత్రం క్లైమాక్స్‌లో మోసం చేసిన ప్రేయసిని ప్రియుడు హింసిస్తున్న సన్నివేశాలను దాదాపు ప్రతి యువకుడూ ఈలలతో అరుపులతో రాక్షసానందం పొందుతూ చూశాడు. వీళ్లందరికీ ఇళ్లల్లో ఆడపడుచులు ఉన్నా లేకపోయినా సాటి మనిషిగా స్త్రీని గుర్తించి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేదెవరు? తప్పుకి లింగభేదం ఉండదు. దానికి చట్టం ఉంది. ఎప్పుడైతే స్త్రీ ఆత్మరక్షణ పద్ధతులను భయం వల్ల నేర్చుకుంటుందో అప్పుడు ఆ సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టే! ఆ ధైర్యాన్ని నిర్భయాన్ని మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఈ అన్నలు తమ్ముళ్లు అనేవాళ్లు తమ తోటి స్నేహితులతో కలసి స్త్రీ సమాజానికి అభయహస్తం అందించాలని ఎందుకు చర్చించుకోలేకపోతున్నారు? ఒక అఘాయిత్యమో, అత్యాచారమో జరిగిన తర్వాత ఆ నేరం చేసిన వాడిని ఆమె అన్న లేక తమ్ముడు వెళ్లి శిక్షించడం లేదు. అసలు అటువంటి పరిస్థితులు రాకుండా పురుషులందరూ కలసి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని ఒక ఎరుక ఉండాలి. తమ వర్గంలో ఎందుకిన్ని నేరాలు జరుగుతున్నాయని చర్చలు జరపాలి. అడపాదడపా కళాశాలల్లో జరిగే చర్చోపచర్చల్లో మగపిల్లలు మాట్లాడే మాటలు, వారి వాదన చూస్తుంటే భయం కలగక మానదు. ‘ఆడపిల్లలు తక్కువ తీసిపోరు. మోసం చేస్తారు. కురచ దుస్తులు ధరిస్తారు. అటువంటప్పుడు అఘాయిత్యాలు జరగక మానవు’ అన్న ఆలోచనలు, ఆ ధోరణి యువకుల్లో చూస్తుంటాం. అవును! ఆడపిల్లలూ తప్పులు చేస్తారు. ఎందుకంటే దేవతలు కారు. మనుషులు. ఆడపిల్లల్లో కూడా చదువు అబ్బని మొద్దులుంటారు. ఘరానా మోసాలు చేసేవారు ఉంటారు. నేరాలు చేసేవారు ఉంటారు. అచ్చు మగవాళ్లలాగానే! ప్రతి పురుషుడూ నీచుడు కానట్టే ప్రతి ఆడపిల్లా మంచిది కాకపోవచ్చు. అయితే, ఆమె తప్పు చేసిందని ఆమెకు ‘తగిన‘ శాస్తి చేయడానికి ఏ పురుషుడికీ హక్కు లేదు. ఎవరూ ఎవరికీ నేరం చేసి గుణపాఠం నేర్పాల్సిన పని లేదు. నిజానికి నిర్భయ ఘట్టం ఈ ‘గుణపాఠం’ అనే ఆలోచనలోంచే అంతటి విషాదం జరిగిందని చెప్పవచ్చు. ఆమె అర్ధరాత్రి స్నేహితుడితో ఎందుకు బయట తిరగాలి? అనే దానికి ఆ నేరస్తులే సొంత పరిష్కారం సృష్టించుకుని ఆమెను అతి కిరాతకంగా, భయానకంగా అత్యాచారం చేసి చంపేశారు. ఆ సందర్భంలో వేలాదిగా యువతీ యువకులు ఢిల్లీలో నిర్భయకు మద్దతుగా నిలిచారు. పోలీసు దెబ్బలు తిన్నారు. అయితే కొన్ని రోజులకే ఆ ఆవేశమంతా చల్లారిపోయింది. పదేపదే పల్లెల్లో, మురికివాడల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో అత్యాచారం, లైంగికదాడి, ఆకతాయితనం అరికట్టడంపై సదస్సులు నిర్వహిస్తుండాలి. ప్రతినిత్యం పురుషులు ఒకరికొకరు గుర్తు చేసుకుంటూ ఉండాలి. సాటి మనుషులను ఏ రకమైన హింసకు గురిచేయకుండా గౌరవించాలన్న స్పృహ ఉండాలి. ఇతరుల్లో పెంచాలి. సాధారణంగా ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు జరిగినప్పుడు పూర్వం ‘నీకు అక్కా చెల్లెళ్లు లేర్రా!’ అని అంటుండేవారు. ఇప్పడైతే ‘ఇదే నీ అక్కనో చెల్లినో అయితే చేస్తావా?’ అంటున్నారు. లేదా ‘ప్రతి స్త్రీలో అమ్మతనం ఉంటుంది కాబట్టి అమ్మాయిలను ఎలా అవమానిస్తావు’ అనో, ‘స్త్రీని దేవతగా పూజించే ఈ దేశంలో ఆడదాన్ని ఎలా హింసిస్తార’నో అంటుంటారు. వాస్తవానికి ప్రతి పురుషుడిలో తండ్రిని, అన్నని చూడనట్టే ప్రతి స్త్రీలో అమ్మను చూసి గౌరవించడం అనేది జరగదు. స్త్రీ ముందుగా ఒక మనిషి. ఆ తర్వాతే ఆమె ఒకరికి కూతురు, అక్కా చెల్లెలు వగైరా. స్త్రీని గౌరవించడానికి, ఆమెపై అన్యాయం జరపకుండా ఉండటానికి ఆమెలో తోబుట్టినదాన్ని వెతుక్కోవాల్సిన పనిలేదు. ఆమెను మనిషిగా చూస్తే చాలు. ఒక పురుషుడు తనను ఎలా గౌరవించాలని, సమానంగా చూడాలని కోరుకుంటాడో స్త్రీతో అదే విధంగా నడుచుకుంటే చాలు. ఇవన్నీ ఇలా ఉంటే అన్నదమ్ములు, తండ్రుల తర్వాతి స్థానం తీసుకుని ఇంట్లోని ఆడవారిపై జులుం చేస్తుంటారు. ఎటువంటి బట్టలు వేసుకోకూడదు దగ్గర నుంచి ఇంటికి ఎప్పుడు తిరిగి రావాలి వరకు వీరు ఆంక్షలు విధిస్తుంటారు. అది వారి ధర్మంగా ఒంటబట్టించుకుంటారు. వీళ్లే కూతుళ్లకూ కొడుకులకూ వారి వారి కర్తవ్యాలుగా ఈ వివక్షను పెట్టి పెంచి పోషిస్తుంటారు. దీనిని ఏదో ఒక తరంలో అన్నదమ్ములే అరికట్టాలి. చదువుకున్న కుటుంబాలలో కట్నం ఆచారాల విషయంలో కాకపోయినా, కనీసం ఆడపిల్లల పెంపకంలో చాలా మార్పును కనబరుస్తున్నారు. ఏది ఏమైనా ఒక పండుగ వస్తుందంటే మనం ఇల్లు శుభ్రం చేసుకుని ఆ రోజుకు మాత్రం అతి భక్తి నటిస్తూ ఉంటామో, లేదా ఏ స్వాతంత్య్ర దినోత్సవం నాడో, గణతంత్ర దినోత్సవం నాడో దేశభక్తిని సామాజిక మాధ్యమాల్లో మన పేర్ల తరఫున నింపేస్తుంటామో అదేవిధంగా ఈ రాఖీ పండుగ కూడా మిగిలిపోవడం విషాదం. ఆ రోజు అన్నలు తమ్ముళ్లు తమ అక్కలను చెల్లెళ్లను సంరక్షించుకుంటామని వారికి భరోసా ఇచ్చే కంటే ముందే వారివల్ల ఏ ఆడపిల్లకూ హాని జరగదని ప్రమాణం చేసుకోవాల్సిన అవసరం కూడా అంతే ఉంది. రక్షాబంధన్ వేడుకను వర్ణించడానికి వాడే అన్నాచెల్లెళ్ల బంధం, ఆ పవిత్రతను నిజమైన అర్థంలో సంపూర్ణంగా జరుపుకోవాలని ఆశిద్దాం. రక్షణ కోసం అన్నదమ్ముల అవసరం రాని రోజు కోసం ఎదురు చూద్దాం. మొదటి రాఖీ కట్టిన ఆమె ఏ సంబంధం ఉన్న అతనికి కట్టింది, దాని ఫలితమేంటి? అనేది తెలిసినా, తెలియకపోయినా రాఖీ అంటే రక్షణ కల్పించే ఒక నమ్మకం. ఇదీ అక్కాచెల్లెళ్ల పరిస్థితి మహిళలకు భద్రత కరువైన దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానానికి చేరుకోవడం తాజా పరిణామం. ‘నిర్భయ’ సంఘటన తర్వాత దేశంలోని పరిస్థితులు మరింతగా దిగజారాయి. మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గత ఏడాది విడుదల చేసిన లెక్కల ప్రకారం... 1ని. 39 నేరాలు దేశంలో మహిళలపై ప్రతి నిమిషానికి 39 నేరాలు జరుగుతున్నాయి. 83% నేరాలు - గత దశాబ్ద కాలంలో... అంటే, 2007–17 కాలంలో మహిళలపై నేరాలు 83% పెరిగాయి. 25 లక్షలకు పైగా ఇదే దశాబ్ద కాలంలో మన దేశంలోని మహిళలపై 25 లక్షలకు పైగా నేరాలు జరిగాయి. 11% గడచిన ఏడాది వ్యవధిలోనే మహిళలపై అత్యాచారాలు 11.5 శాతం పెరిగాయి. 25% గడచిన ఏడాది కాలంలో మహిళలపై లైంగిక దాడులు 25 శాతం పెరిగాయి. 19% గడచిన ఏడాది కాలంలో మహిళలు, బాలికల కిడ్నాప్‌లు 19 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాల కేసులు ప్రతి గంటకు నాలుగు చొప్పున నమోదవుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన లెక్కలన్నీ దేశంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా వెల్లడించినవి మాత్రమే. దేశంలో వాస్తవంగా మహిళలపై జరుగుతున్న నేరాలతో పోలిస్తే, పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులు నామమాత్రమేనని, నమోదు కాని సంఘటనలు 99 శాతానికి మించే ఉంటాయని గత ఏడాది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నివేదిక వెల్లడించింది. దేశంలోని అక్క చెల్లెళ్ల పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఈ లెక్కలు చాలవూ! రాఖీరోజు అన్నలు తమ్ముళ్లు తమ అక్కలను చెల్లెళ్లను సంరక్షించుకుంటామని వారికి భరోసా ఇచ్చే కంటే ముందే వారివల్ల ఏ ఆడపిల్లకూ హాని జరగదని ప్రమాణం చేసుకోవాల్సిన అవసరం కూడా అంతే ఉంది. – మానస ఎండ్లూరి రాఖీ విశేషాలు రక్షాబంధన్ ఆచారం మన దేశంలో ప్రాచీనకాలం నుంచే ఉంది. పురుషులు యుద్ధాలకు బయలుదేరేటప్పుడు వారి విజయం కోసం మహిళలు పూజలు చేసేవారు. పూజల తర్వాత పురుషుల నుదుట వీరతిలకం దిద్ది, ముంజేతికి నూలుదారాలతో అల్లిన సన్నని తాడును రక్షాబంధనంగా కట్టేవారు. బలి చక్రవర్తి స్వర్గంపై దండెత్తి, ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని కైవసం చేసుకున్నాడు. స్వర్గం రాక్షసరాజ్యంగా మారింది. పదవీచ్యుతుడైన తన భర్తకు విజయం దక్కేట్లు చూడాల్సిందిగా శచీదేవి విష్ణువును కోరింది. విష్ణువు ఆమెకు నూలుదారాలతో అల్లిన తాడును ఇచ్చాడు. ‘ఈసారి యుద్ధానికి వెళ్లే ముందు నీ భర్త ముంజేతికి ఈ రక్షాబంధనాన్ని కట్టు. తప్పక విజయం సాధించగలడు’ అని చెబుతాడు. బలి చక్రవర్తిపై తిరిగి యుద్ధానికి సిద్ధపడిన ఇంద్రుడికి శచీదేవి విష్ణువు ఇచ్చిన రక్షాబంధనాన్ని కడుతుంది. ఇంద్రుడు బలిచక్రవర్తిని ఓడించి, తిరిగి స్వర్గాధిపత్యం సాధిస్తాడు. ఇది భవిష్యపురాణంలోని గాథ. వామనావతారంలో వచ్చిన విష్ణువు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసిన కథ తెలిసిందే కదా! మహాభక్తుడైన బలిచక్రవర్తి ఆ సమయంలో విష్ణువును నిత్యం తన వద్దనే ఉండాలంటూ కోరుకుంటాడు. బలి కోరిక మేరకు విష్ణువు పాతాళంలోనే ఉండిపోతాడు. లక్ష్మీదేవి వైకుంఠంలో ఒంటరిగా మిగిలిపోతుంది. తన భర్తను తిరిగి తనతో తీసుకుపోవడానికి లక్ష్మీదేవి స్వయంగా వచ్చి బలి చక్రవర్తికి రక్షాబంధనం కడుతుంది. కానుకగా ఏం కావాలని బలి అడిగినప్పుడు తన భర్తను తనతో పాటే వైకుంఠానికి పంపమని కోరుతుంది. బలి సరేననడంతో పతీసమేతంగా లక్ష్మీదేవి వైకుంఠానికి చేరుకుంటుంది. ఈ గాథ భాగవతంలోను, విష్ణుపురాణంలోను ఉంది. ఆయువు తీరినవారి ప్రాణాలను హరించడంలోను, నరకానికి వచ్చిన పాపుల పాప విచారణ చేసి, వారికి శిక్షలు విధించడంలోను నిరంతరం తలమునకలుగా ఉండే యమధర్మరాజు ఒకసారి పన్నెండేళ్ల పాటు తన చెల్లెలు యమునను చూడటానికి వెళ్లలేకపోయాడు. అన్నను చూసి ఏళ్లు గడుస్తున్న కొద్దీ యమున దిగులుతో కుంగిపోసాగింది. గంగ వద్ద ఒకసారి ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. అప్పుడు గంగ యముడి వద్దకు వెళ్లి యమున బాధను వివరిస్తుంది. అప్పుడు యముడు నరకాన్ని వీడి బయలుదేరి యమున వద్దకు వస్తాడు. ఇంటికి వచ్చిన అన్నకు యమున షడ్రసోపేతమైన భోజనం వడ్డించి, రక్షాబంధనాన్ని కడుతుంది. కనీసం ఏడాదికి ఒకసారైనా తనను చూడటానికి రావాలని కోరుకుంటుంది. అలెగ్జాండర్ భార్య రుక్సానా కేకయ రాజు పురుషోత్తముడికి, చిత్తోడ్ రాణి కర్ణీదేవి మొఘల్ చక్రవర్తి హుమాయూన్కు రక్షాబంధనాలను పంపి, వారి సాయం కోరినట్లుగా చారిత్రక గాథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, వీటికి స్పష్టమైన ఆధారాలు ఎక్కడా లేవు. -
పాత కక్షలతోనే అన్నదమ్ముల హత్య
నిజామాబాద్ క్రైం (నిజామాబాద్ అర్బన్) : జిల్లా కేంద్రంలో శనివారం ఇద్దరు అన్నదమ్ముల దారుణహత్య ఘటన పాత కక్షల కారణంగానే జరిగిందని నిజామాబాద్ ఏసీపీ మంత్రి సుదర్శన్ తెలిపారు. ఆదివారం రాత్రి ఏసీపీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నదమ్ముల హత్య కేసు వివరాలను వెల్లడించారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. హమల్వాడీకి చెందిన మొగుల్ల సాయిప్రసాద్ అలియాస్ తల్వార్ సాయి, అతని తమ్ముడు మొగుల్ల మహేందర్, ధాత్రిక సంజయ్ అలియాస్ నానిలు ఆదర్శనగర్‌కు చెందిన బద్రి పవన్ కళ్యాణ్ అలియాస్ బబ్లూ, అతని తమ్ముడు బద్రి నర్సింగ్ యాదవ్‌లను పాత కక్షలతోనే తల్వార్‌తో పొడిచి చంపారు. పవన్ కళ్యాణ్, సాయి ప్రసాద్‌లు కొంతమంది యువకులతో కలిసి గ్రూపులు కట్టారు. ఈ రెండు గ్రూప్‌ల మధ్య ఏడు నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. శనివారం ఉదయం మరోమారు రెండు గ్రూప్‌ల మధ్య గొడవలు జరిగాయి. దీనిని మనస్సులో పెట్టుకున్న తల్వార్ సాయి పవన్ కళ్యాణ్ మరోసారి తమ జోలికి రాకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్ ప్రకారమే.. పవన్ కళ్యాణ్‌ను అడ్డు తొలగించుకోవాలని తల్వా ర్ సాయి నిర్వయించుకున్నాడు. శనివారం సా యంత్రం పవన్ కళ్యాణ్ ఓ ఫంక్షన్లో ఉండగా తల్వార్ సాయి అతడికి ఫోన్ చేసి రెచ్చగొట్టే మా టలు మాట్లాడాడు. ఎవరి సత్తా ఏమిటో చూసు కుందామని, హమల్వాడీ పక్కన గల రైల్వే కోర్టు కు చెందిన మైదానంలోకి రావాలని ఇద్దరు చా లెంజ్ చేసుకున్నారు. ఇందులో భాగంగా సాయం త్రం 5 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్, తల్వా ర్ సాయిల గ్రూపులకు చెందిన కొంతమంది రైల్వే మైదానానికి చేరుకున్నారు. వీరి మధ్య మాట మాట పెరిగి కొట్టుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ తన తమ్ముడు నర్సింగ్ యాదవ్‌కు ఫోన్ చేసి గొడవ జరుగుతున్న విషయాన్ని తెలపడంతో అతను తన స్నేహితులను వెంటబెట్టుకుని మైదానానికి చేరుకున్నాడు. తల్వార్ సాయి తన వద్దనున్న తల్వార్‌తో పవన్ కళ్యాణ్‌పై దాడి చేశాడు. అతని తమ్ముడు మహేందర్, సంజయ్‌లు క్రికెట్ బ్యాట్‌తో వారిపై దాడి చేశారు. ఘటనలో పవన్ కళ్యాణ్ అతడి గొంతు తెగడంతో అక్కడే పడిపో యాడు. అన్నపై దాడిని నివారించేందుకు తమ్ము డు నర్సింగ్‌యాదవ్ అడ్డుపడగా అతని చాతిలో, కడుపులో తల్వార్‌తో పొడవగా అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కొన ఊపిరితో ఉన్న పవన్‌ను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. జరుగుతున్న గొడవను నర్సింగ్యాదవ్తో వచ్చిన ప్రేమ్‌కుమార్ ఫోన్లో చిత్రీకరిస్తుండగా అతనిపై దాడికి పాల్పడ్డారు. దాడుల విషయమై ప్రేమ్‌కుమార్ మూడో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అక్కడకు చేరుకుని నర్సింగ్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుల తండ్రి నగేశ్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు రంగంలోకి దిగి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు శారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు నిందితులు తల్వార్ సాయి, మహేందర్, సంజయ్లదిళ్ల వద్ద కాపుకాసి వారిని పట్టుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ ముగ్గురిపై హత్య నేరం కింద సెక్షన్లు నమోదు చేసి అరెస్టు చేసినట్లు చెప్పారు. సమావేశంలో నగర సీఐ నరేశ్, 3వ టౌన్ ఎస్సై కృష్ణ పాల్గొన్నారు. అన్నదమ్ముల అంత్యక్రియలు పూర్తి దారుణ హత్యకు గురైన ఇద్దరు అన్నదమ్ములకు ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్త య్యాయి. ఆదర్శనగర్‌కు చెందిన పవన్ కళ్యాణ్(21), నర్సింగ్ యాదవ్(19)ల మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం జరిగింది. అనంతరం పోలీసులు మృతదేహాలను కుటుంబీకులకు అందజేశారు. వారి మృతదేహాలను ఆదర్శనగర్‌కు తరలించారు. ఒకేసారి ఇద్దరు కొడుకులు మృతిచెందడంతో తండ్రి నగేశ్, అతని కుటుంబ సభ్యులు, బంధువులు బోరుమని విలపించారు. అంత్యక్రియలకు బంధువులు, మృతుల స్నేహితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దుబ్బ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తిచేశారు. -
ఫోన్లో యాంకర్ని వేధిస్తున్న అన్నదమ్ముల అరెస్టు
కృష్ణలంక (విజయవాడ తూర్పు) : సెల్ఫోన్లో యువతి పట్ల అసభ్య పదజాలంతో మాట్లాడుతూ వేధింపులకు పాల్పడిన ఇద్దరు నిందితులను కృష్ణలంక పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఒక ప్రయివేటు చానల్లో యాంకర్‌గా పని చేస్తున్న యువతిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వేర్వేరు నెంబర్ల నుంచి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతూ వేధింపులకు పాల్పడుతున్నారు. వీరి వేధింపులు రోజురోజుకు శ్రుతిమీరటంతో ఈ నెల 1న యువతి కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ఉపయోగించిన ఫోన్ నెంబర్ల ఆధారంగా వారి వివరాలు తెలుసుకున్నారు. నెల్లూరుకు చెందిన పరుచూరి పెద్దబాబు, పరుచూరి చిన్నబాబు ఇద్దరు అన్నదమ్ములు. వీరు అదే గ్రామంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జులాయిగా తిరుగుతుంటారు. వారు సీరియల్‌గా కొన్ని ఫోన్ నెంబర్లను వరుసగా డయల్ చేస్తారు. ఎవరైనా ఆడవారు మాట్లాడితే చాలు వారు తమ బుద్ధిని బయటపెట్టి అసభ్య పదజాలంతో మాట్లాడుతూ బయటకు చెప్పుకునేందుకు వీలులేని విధంగా తమ మాటలతో వేధింపులకు పాల్పడుతుంటారు. వీరిపై నిఘా పెట్టిన పోలీసులు వారి ఫోన్ సిగ్నల్ ద్వారా పరుచూరి పెద్దబాబును బెంగళూరులోను, పరుచూరి చిన్నబాబును నెల్లూరులోనూ అదుపులోకి తీసుకుని వారిని అరెస్టు చేశారు. వీరు గతంలోనూ ఇదే తరహాలో అనేక మంది మహిళలతో ఇలాగే వ్యవహరించినట్లు పోలీసుల దర్యాప్తులో తెలినట్లు సమాచారం. -
అన్నను హత్య చేసిన తమ్ముడు
పోడూరు(ప.గో జిల్లా) : పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం పెనుమదం గ్రామం చిలకరత్నం పేటలో విషాదం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాల కారణంగా సొంత అన్ననే తమ్ముడు హత్య చేశాడు. ఆస్తితగాదాల నేపథ్యంలో తమ్ముడు రంగినీడి దుర్గారావు-అన్న రంగినీడి నాగేశ్వరరావు(34)ను ఇనుప రాడ్‌తో తల పై కొట్టి హత్య చేశాడు. పోడూరు పోలీసులు మర్డర్ (302) కేసు నమోదు చేసి దుర్గారావును అరెస్టు చేశారు. -
ఆస్తి వివాదం.. అన్నను నరికేశాడు..
సాక్షి, గుంటూరు : ఆస్తి వివాదం ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఆస్తి విషయంలో అన్నను చంపేశాడు ఓ తమ్ముడు. ఈ ఘటన శనివారం గుంటూరు జిల్లా గొల్లపల్లి మండలం గరికపాడులో చోటుచేసుకుంది. వివరాలివి.. గత కొద్ది రోజులుగా అన్నదమ్ములు ఆస్తి వివాదం చెలరేగింది. ఈక్రమంలోనే మరొసారి ఆస్తి విషయంలో మాట్లాడుకుంటున్నారు. మాట మాట పెరిగి అది గొడవకు దారితీసింది. ఈ నేపథ్యలోనే అన్న గోపాల్‌ను తమ్ముడు గొడ్డలితో నరికాడు. దీంతో అతను రక్తపు మడుగులో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చిచ్చు పెట్టిన ఫొటో
సాక్షి, రాజంపేట : అన్న, తమ్ముడి మధ్య ఓ ఫొటో చిచ్చు పెట్టింది. ఈ సంఘటన శనివారం పట్టణంలోని బీఎస్ థియేటర్ సమీపాన ఉన్న ఓ ఇంటిలో చోటు చేసుకుంది. కరీముల్లా, షమీవుల్లా అన్నదమ్ముళ్లు. రంజాన్‌ను ఆ కుటుంబం సంతోషంగా జరుపుకొంది. ఇంతలోనే తమ్ముడు షమీ వుల్లా అన్న భార్య ఫొటో తీశారు. ఈ క్రమంలో అన్న కరీముల్లా అభ్యం తరం చెప్పారు. గొడవ వాతావరణం నెలకొంది. పైగా అనుమానం కలిగి ఉన్న అన్న తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. గాయపడిన తమ్ముడిని స్థానిక పెద్దాసుపత్రికి తరలించారు. ఈ విషయంపై సీఐ నరసింహులు మాట్లాడుతూ తమ్మునిపై అన్నకు అనుమానం ఉందని తెలిపారు. ఈ సందర్భంలో ఘర్షణ చోటుచేసుకుందని ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
ప్రాణం తీసిన సిగరెట్ గొడవ
బనశంకరి: సిగరెట్ కోసం గొడపడిన ఘటనలో అన్నదమ్ములు హత్యకు గురైన ఉదంతం కేజీ.హళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు... గోవిందపుర మెయిన్‌రోడ్డు వీరణ్ణగడ్డ నివాసి అమీన్ (32) టెంపో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి గోవిందపుర మెయిన్‌రోడ్డులోని మాలిక్ అలీ దుకాణంలో అమీన్ సిగరెట్ తీసుకుని డబ్బు ఇవ్వకుండా వెనుతిరిగాడు. ఈ సమయంలో దుకాణం యజమాని మాలిక్ అలీ సిగరెట్ డబ్బు ఇవ్వాలని అడగటంతో కోపోద్రిక్తుడైన అమీన్, మాలిక్‌అలీని ఇష్టానుసారం చితకబాదాడు. తక్షణం మాలిక్‌అలీ కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో బంధువులు కర్రలు, మరణాయుధాలతో ఘటనాస్ధలానికి చేరుకుని అమీన్‌పై ప్రతిదాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న అమీన్ సోదరుడు మతీన్ (30) ఘటనాస్ధలానికి చేరుకుని గొడవపడుతున్న వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేయగా ఇతడిపై కూడా మాలిక్ అలీ బంధువులు ఇష్టానుసారం దాడికి పాల్పడి ఉడాయించారు. గాయపడిన అమీన్, మతీన్‌లను అంబేడ్కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి పొద్దుపోయిన మతిన్ మృతిచెందాడు. నిమ్హాన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమీన్ కూడా మృతిచెందాడు. మృతుల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసుల ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కేజీ హళ్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
వేటకత్తితో తమ్ముడిపై అన్న దాడి
సాక్షి, భీమిని(నెన్నెల) : నెన్నెల మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డిపై అన్న బాపురెడ్డి బుధవారం నెన్నెల తహసీల్దార్ కార్యాలయంలోనే వేట కత్తితో హత్యాయత్నం చేశాడు. భూతగాదనే అన్నదమ్ముల మధ్య గొడవకు దారితీసింది. బొప్పారం గ్రామశివారులో సర్వేనంబర్707/1లో 3.14ఎకరాలు, 708 సర్వే నంబర్లో 4.36ఎకరాలు ఉన్న ఈ భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య గతకొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. బాపురెడ్డి తన వాటలోని కొంత భూమిని ఇతరులకు అమ్ముకున్నాడు. ఆ భూమి రిజిస్ట్రేషన్ చేయించేందుకు తమ్ముడు సంతకం చేయాల్సి ఉంది. కాగా బుధవారం రిజిస్ట్రేషన్ కోసం నెన్నెల తహసీల్దార్ కార్యాలయానికి అన్నదమ్ములిద్దరు వేర్వేరుగా వచ్చారు. తమ్ముడు అభ్యంతరం చెప్పాడని ముందుగానే ఊహించిన బాపురెడ్డి పథకం ప్రకారం తన వెంట ఓ కవర్లో కారంపొడి, వేటకత్తి తెచ్చుకున్నాడు. తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ విషయమై మాటమాట పెరిగి గొడవకు దిగారు. అంతలోనే అందరు చూస్తుండగానే లక్ష్మారెడ్డి కళ్లలో కారంకొట్టిన బాపురెడ్డి కత్తితో దాడిచేశాడు. ఇంతలోనే కొందరు యువకులు తేరుకొని బాపురెడ్డిని అడ్డుకున్నారు. అప్పటికే లక్ష్మారెడ్డి తలపై రెండుచోట్ల గాయాలయ్యాయి. యువకులు ధైర్యం చేసి అడ్డుకోకపోతే లక్ష్మారెడ్డి ప్రాణాలు దక్కేవి కావని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే తహసీల్దార్ రాజలింగు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాపురెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మారెడ్డికి నెన్నెల పీహెచ్సీలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నెన్నెల ఎస్సై చందర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆస్తికోసం అన్నదమ్ముల మధ్య ఘర్షణ
-
మృత్యువులోనూ ఒక్కటై..
చిత్తూరు, శ్రీకాళహస్తి: తోడ పుట్టకపోయినా వారు ముగ్గురూ వరసకు అన్నదమ్ములు.. అంతకుమించి ప్రాణ స్నేహితులు.. కష్టమైనా సుఖమైనా పంచుకునేవారు. ఎక్కడికైనా కలిసే వెళ్లేవారు.. ఆఖరుకు మృత్యువు దగ్గరకూ కలిసే వెళ్లిపోయి పుట్టెడు విషాదాన్ని నింపారు. గురువారం రాత్రి భయానక వాతావరణంలో పిడుగుపాటుతో ముగ్గురూ విగతజీవులయ్యారు. ఈ దుర్వార్తతో తొట్టంబేడు మండలం ఎగువ సాంబ య్యపాళెం శోకంలో మునిగిపోయింది. తొట్టంబేడు మండలం ఎగువ సాంబయ్యపాళెం గ్రామానికి చెందిన దగ్గొలు మునేంద్రరెడ్డి(23), దగ్గొలు దశర«థరెడ్డి (28), దగ్గొలు గురవారెడ్డి(42) చిన్నాన్న, పెద్దన్నాన్న పిల్లలు. వీరంతా వివాహితులే. ముగ్గురికీ పిల్లలున్నారు. వీరి అనుబంధం చూసి గ్రామస్తులు ముచ్చటపడేవారు. కొద్దిపాటి భూమి సాగు చేసుకుంటూ బతుకునీడుస్తున్న ఈ చిన్నరైతులు పంటల్లేనప్పుడు కూలి పనులకు వెళ్లేవారు. కుటుంబ పోషణకు ఆర్థిక ఇబ్బందులు తప్పేవికావు. దాంతో గురవారెడ్డి గొర్రెలను కొని పెంచితే బాగుంటుందని భావించి సోదరులకు చెప్పాడు. వారిద్దరూ సరేనన్నారు. కూడబెట్టుకున్న రూ.80 వేలు తీసుకుని గురువారం సాయంత్రం ముగ్గురూ కేవీబీపురం మండలంలోని కంచనపల్లికి వెళ్లారు. పని పూర్తి చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో గురువారం రాత్రి తమ ఇంట వివాహ వేడుక కోసం బహుమతి కొందామని కంచనపల్లి నుంచి శ్రీకాళహస్తి వచ్చారు. బహుమతి తీసుకుని పెళ్లికి బయలుదేరారు. రాత్రి 9 గంటలకు చెన్నై రోడ్డులోని ఆర్సీపీ స్కూల్ సమీపంలోకి చేరుకున్నారు. వర్షం జోరందుకోవడంతో చెట్టు కింద ఆగారు. ఇంతలోనే పిడుగు పడింది. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో వీరి కుటుంబ సభ్యులంతా వివాహ వేడుకలో ఉన్నారు. వీరి కోసం రాత్రంతా చూశారు. తెల్లారేసరికి వీరి మృతదేహాలను స్థానికులు గుర్తించారు. విగత జీవులుగా పడి ఉన్న దశర«థరెడ్డి,మునేంద్రరెడ్డి, గురవారెడ్డిని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. డీఎస్పీ వెంకటకిశోర్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. -
బావిలోపడి అన్నదమ్ముల దుర్మరణం
చిలుకూరు (కోదాడ) : ఆ అన్నదమ్ములిద్దరు బీఈడీ వరకు చదువుకున్నారు. గ్రామంలోనే ఉంటూ వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఈ క్రమంలో తన పొలానికి పురుగు మందు పిచికారీ చేసేందుకు వెళ్లి.. ప్రమాదవశాత్తు బావిలో పడి దుర్మరణం పాలయ్యారు. మండలంలోని కొండాపురంలో గురువారం జరిగిన ఈ సంఘటన ఆ కుటుంబానికి తీరనిశోకాన్ని మిగిల్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పల్లా రంగయ్యకు ఇద్దరు కుమారులు పల్లా గోపాలరావు(32), పల్లా నరేష్(28). ఇద్దరు గురువారం ఉదయం గ్రామశివారులో బేతవోలు చెరువు పక్కన గల తమ వ్యవసాయ పొలంలో పురుగు మందు పిచికారి చేయడం కోసం తమతో పాటు మందు కొట్టేందుకు గ్రామానికి చెందిన పిల్లుట్ల బాలకృష్ణను వెంట తీసుకెళ్లారు. ట్యాంక్‌తో బాలకృష్ణ మదు కొడుతుండగా గోపాలకృష్ణ బావిలో నుంచి నీళ్లు అందిస్తున్నాడు. తమ్ముడు నరేష్ నీటిని తీసుకెళ్లి ట్యాంక్‌లో పోస్తున్నాడు. ఈ క్రమంలో గోపాలరావు ప్రమాదవశాత్తు జారి బావిలో పడిపోయాడు. గోపాలరావుకు ఈత రాకపోవడంతో.. మునిగి పోతున్నాడు. గమనించిన తమ్ముడు నరేష్ అన్నను కాపాడబోయి.. తనకూడా నీటిలో మునిగిపోయాడు. దీంతో ట్యాంకులో నీళ్లు పోసేందుకు ఇద్దరూ రాకపోవడంతో బాలకృష్ణ బావి వద్దకు వెళ్లాడు. అప్పటికే ఇద్దరు బావిలో పడి మృతి చెందారు. విషయాన్ని వెంటనే బాలకృష్ణ మృతుల తండ్రి రంగయ్యకు తెలియజేశాడు. దీంతో గ్రామస్తులు బావి వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఇద్దరూ మృతిచెందడంతో.. గ్రామస్తుల సాయంతో బావిలోని మృతదేహాలను బయటకు తీశారు. గోపాలరావుకు భార్య ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. నరేష్‌కు భార్య ఒక కుమారుడు ఉన్నారు. నరేష్ రైతు సమన్వయ సమితి కొండాపురం గ్రామ కోఆర్డి నేటర్‌గా ఇటీవల నియామకమయ్యాడు. చెరువు వెంట బావి ఉండడం వల్లే.. వీరి వ్యవసాయ బావి చెరువు వెంట ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని.. పలువురు పేర్కొంటున్నారు. బావి చాలా పెద్దగా ఉండడం.. చెరువు బావి కలిసినట్లు ఉండడం వల్ల అన్నను కాపాడే ప్రయత్నంలో నరేష్ కూడా మృతి చెందాడని అంటున్నారు. గ్రామంలో విషాదఛాయలు ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. చేతికొచ్చిన ఇద్దరు కుమారులు మృతి చెందడంతో తండ్రి రంగయ్య, తల్లి ఆర్తనాదాలు పలువురుని కంటతడి పెట్టించాయి. రంగయ్య సర్పంచ్‌గా అందరి పరిచయస్తుడు కావడంతో ప్రజలు పెద్దఎత్తున్న సంఘటన స్థలానికి చేరుకున్నారు. గోపాలరావు, నరేష్ భార్యాపిల్లలను చూసి బోరున విలపించారు. సంఘటన స్థలాన్ని కోదాడ డీఎస్పీ రమణారెడ్డి, రూరల్ సీఐ రవి పరిశీలించారు. తండ్రి రంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ నర్సయ్య తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
వ్యవసాయ బావిలో పడి అన్నదమ్ములు మృతి
-
ఈత రాక ముగ్గురు అన్నదమ్ముల మృతి
అడ్డాకుల (దేవరకద్ర): వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఏటా రామలింగేశ్వరుడి జాతరకు కుటుంబ సమేతంగా వచ్చేవారు. ఈ సారి కూడా ఎప్పటిలాగే వచ్చారు. కోనేరులో స్నానాలు చేద్దామని తండ్రితోపాటు ముగ్గురు కుమారులు లోపలికి దిగారు. దరి అంచున నిలబడి స్నానాలు చేద్దామనుకుంటుండగా చిన్న కుమారుడు ప్రమాదవశాత్తు కాలుజారి నీళ్లలో మునిగిపోయాడు. అతడిని కాపాడే యత్నంలో మిగిలిన ఇద్దరు కుమారులు ఒక్కొక్కరుగా నీళ్లలోకి జారుకున్నారు. ఈత రాని తండ్రి కూడా లోపలికి వెళ్లినా ముగ్గురిని కాపాడలేకపోయాడు. తన ప్రాణాలకు ముప్పు ఉందని గుర్తించి వెంటనే కేకలు వేయడంతో.. భార్య చీర విసరడంతో దాన్ని పట్టుకుని ఒడ్డుకు చేరాడు. తన కళ్ల ముందే ముగ్గురు కొడుకులు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఈ దుర్ఘటన మండలంలోని కందూరు రామలింగేశ్వరస్వామి క్షేత్రం వద్ద గురువారం చోటుచేసుకుంది. 20 ఏళ్ల క్రితం వలస.. ఖిల్లాఘనపురం మండలం కమాలొద్దీన్‌పూర్ గ్రామానికి చెందిన ఉప్పరి కేశవులు 20ఏళ్ల క్రితం తన కుటుం బంతో కలిసి మహబూబ్‌నగర్ సమీపంలోని ఏనుగొండకు వెళ్లి స్థిరపడ్డాడు. ఆయనకు భార్య చంద్రమ్మ, ఒక కుమార్తెతోపాటు కుమారులు రవికుమార్(29), పవన్‌కుమార్(25), ఆంజనేయులు(20) ఉన్నారు. రవికుమార్ ఆటోడ్రైవర్‌గా పని చేస్తుండగా ఆయనకు భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పవన్‌కుమార్ జిల్లా ఆస్పత్రిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా ఏడాది క్రితమే శ్రీలతతో పెళ్లయింది. మూడో కుమారుడు ఆంజనేయులు పాలిటెక్నిక్ చదువుకుంటున్నాడు. తండ్రి కేశవులు భవన నిర్మాణ పనులు చేసేవాడు. ప్రతి ఏటా కుటుంబ సభ్యులంతా కలిసి రామలింగేశ్వరుడి జాతరకు వచ్చి వెళ్లేవారు. మెట్లు లేకపోవడంతో.. గురువారం 9మంది కుటుంబ సభ్యులు జాతరకు రాగా తండ్రీకొడుకులు స్నానం చేయడానికి ఆలయం పక్కనే ఉన్న కోనేరు వద్దకు వెళ్లారు. కుమారులు ముగ్గురికి ఈత రాకపోవడంతో కోనేరు దరి వద్దనే నిలబడి స్నానం చేస్తున్నారు. ఈక్రమంలో కాలు జారి చిన్న కుమారుడు ఆంజనేయులు నీళ్లలో మునిగిపోయాడు. రక్షించడానికి వెళ్లిన పెద్ద కుమారుడు రవికుమార్, తర్వాత రెండో కుమారుడు పవన్‌కుమార్ వెళ్లి ముగ్గురూ నీటిలో మునిగిపోయారు. వీరిని గుర్తించిన తండ్రి సైతం నీళ్లలోకి వెళ్లాడు. ఆయనకు కూడా ఈత రాకపోవడంతో నీళ్లల్లో మునిగిపోయే దశలో కేకలు వేశాడు. కోనేరు గడ్డపై ఉన్న కేశవులు భార్య చంద్రమ్మ చీరను నీళ్లలోకి విసరడంతో దాన్ని పట్టుకుని ఒడ్డుకు చేరి ప్రాణాలను దక్కించుకున్నాడు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు జరిగేదంతా చూస్తూ లబోదిబోమంటూ కేకలు వేశారు. ఆలయం వద్ద ఉన్న భక్తుల్లో కొందరు నీళ్లలోకి దిగి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. తండ్రితో సహా ముగ్గురు కుమారులకు ఈత రాకపోవడం.. కోనేరు వద్ద మెట్లు లేకపోవడమే ప్రమాదానికి కారణమైంది. రోదిస్తున్న మృతుల తల్లిదండ్రులు కేసు నమోదు.. కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద కోనేరులో ముగ్గురు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోవడంతో ఘటనా స్థలాన్ని జడ్చర్ల రూరల్ సీఐ రవీందర్‌రెడ్డి పరిశీలించారు. మృతదేహాలను అడ్డాకుల ఎస్ఐ సతీష్ ట్రాక్టర్లో వేయించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కొరవడిన ముందుచూపు.. ఆలయం వద్ద పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కొత్తగా మెట్లు కట్టాలని పాత మెట్లను తొలగించారు. జాతర వచ్చినా పనులు చేయకపోవడంతో మెట్లు లేవు. మెట్ల వద్ద కొంత మట్టిని కూడా గతంలో తొలగించారు. దీంతో నీళ్లలోకి దిగి రెండడుగులు వేసినా లోపలికి పడిపోతారు. ఇదే ఇప్పుడు ముగ్గురు ప్రాణాలు పోవడానికి కారణమైంది. కోనేరులో కొంతదూరం వరకు గతంలో ఇనుప రక్షణ కంచెను ఏర్పాటు చేసేవారు. ఈసారి దాన్ని ఏర్పాటు చేయకపోవడం కూడా మరో కారణమైంది. గతేడాది మినహా ప్రతి ఏటా జాతరలో ఒకరిద్దరు కోనేరులో ముగిని ప్రాణాలు కోల్పోతున్నా ముందుచూపు కరువైందని పలువురు విమర్శిస్తున్నారు. -
సోదరుల చేతిలో తమ్ముడు హతం
తాను పస్తులుండి.. తన కొడుకుల కడుపునింపిందా తల్లి.. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది. చివరికి ఆ తల్లే వారికి భారమైంది. ఆమెను పోషించాడానికి అన్నదమ్ములు గొడవపడ్డారు. కర్రతో దాడి చేసి ఆ ఇద్దరు సోదరులు తమ్ముడిని హతమార్చారు. కాసిపేట(బెల్లంపల్లి) : కాసిపేట మండలం ధర్మరావుపేట లంబాడితండాలో తల్లిపోషణ విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. మద్యంమత్తులో ఇద్దరు అన్నలు కలిసి తమ్ముడు అరికెల్ల సాయికుమార్(25)పై కర్రతో దాడిచేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. దేవాపూర్ ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం.. ధర్మరావుపేట లంబాడితండా గ్రామానికి చెందిన భీమయ్య, పోశమ్మ దంపతులకు నలుగురు కుమారులు. భీమయ్య మృతిచెందగా నలుగురు కుమారులు భూమయ్య, కొమురయ్య, గంగరాజు, సాయికుమార్ భార్యపిల్లలతో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మూడో కుమారుడు గంగరాజు ధర్మరావుపేటలోని తన సొంతఇంట్లో ఆదివారం శుభకార్యం నిర్వహించారు. సాయికుమార్ వెంకటపూర్‌లో నివాసం ఉంటుండగా అన్న ఇంట్లో శుభకార్యానికి వచ్చాడు. కార్యక్రమం ముగించుకుని ఇంటికి వెళ్లిన సాయికుమార్‌ను అన్నలు ఫోన్‌చేసి పిలిచి మద్యం తేవాలని ఒత్తిడి చేశారు. రాత్రి 9గంటల అనంతరం సాయికుమార్ మద్యం తీసుకువచ్చాడు. అన్నదమ్ములుంతా కలిసి ఆదివారం అర్ధరాత్రి వరకు మద్యం సేవించినట్లు∙తెలిపారు. మద్యంమత్తులో తల్లి పోశమ్మ, ఇంటివిషయాల గురించి గొడవ పడగా మూడో అన్న గంగరాజు సాయికుమార్‌ను కర్రతో కొట్టే ప్రయత్నంలో మరో అన్న భూమయ్య సాయిని గట్టిగా పట్టుకున్నాడు. కర్రతో కొట్టడంతో తీవ్రంగా రక్తస్రావమై సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు గంగరాజు, భూమయ్యపై కేసునమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రిలో సీఐ రాంచందర్‌రావు మృతదేహాన్ని పరిశీలించారు. -
ఆస్తి కోసం తండ్రిని, తమ్ముళ్లని చంపాడు!
తల్లి చిన్నప్పుడే వదిలేసి వెళ్లిపోయింది.. తండ్రి వృద్ధుడు.. ఏ పనీ చేయలేడు.. తోడబుట్టిన తమ్ముళ్లు అనే ధ్యాస, వారిని తానే చూసుకోవాలనే బాధ్యత మరిచిన ఓ అన్న కసాయిగా మారి.. వారిని కర్కశంగా కొట్టిచంపాడు.. చిన్ననాటి నుంచే జులాయిగా తిరిగే ఆ యువకుడు కన్నతండ్రి మాటలను పెడచెవిన పెడుతూ మద్యానికి బానిసగా మారిపోయాడు.. తనకు భూమిలో వాటా ఇవ్వాలంటూ వేధింపులకు గురిచేసేవాడు.. ఈ క్రమంలోనే మానవ మృగంలా మారి.. తండ్రి, ఇద్దరు తమ్ముళ్లను రాళ్లతో అతి కిరాతకంగా మోది చంపాడు.. ఈ అమానవీయ సంఘటన ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లిలో ఆదివారం తీవ్ర కలకలం రేపింది.. ఉప్పునుంతల (అచ్చంపేట): మండలంలోని మామిళ్లపల్లి గ్రామానికి చెందిన సామ భాస్కరయ్య(60), భూలక్ష్మమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు మల్లేష్, శ్రీశైలం(20), రామస్వామి(18). అయితే భాస్కరయ్య భార్య భూలక్ష్మమ్మ ఇంట్లో సర్దుబాటు లేక గత పదిహేళ్ల క్రితమే ఇంట్లో నుంచి వెళ్లిపోయి తన తమ్ముళ్ల వద్ద వంగూరు మండలం అన్నారంలో ఉంటుంది. అప్పటి నుంచి తండ్రితోపాటు ము గ్గురు కుమారులు మాత్రమే మామిళ్లపల్లిలో ఉండేవారు. వీరిలో పెద్ద కొడుకు మల్లేష్ ఏ పనిచేయకుండా మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతుండేవాడు. దీంతో రెండో కుమారుడు శ్రీశైలం తండ్రితో కలిసి తమకున్న 4 ఎకరాల పొలంలో వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తుండగా.. చిన్నకుమారుడు రామస్వామి తెలకపల్లిలో ని ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతు న్నాడు. ఈ క్రమంలో పెద్దకొడుకు మల్లేష్ తర చూ ఇంట్లో వస్తువులు, డబ్బులను దొంగిలిస్తూ మద్యం తాగేవాడు. అలా గే తన వాటాకు వచ్చే పొలాన్ని పంచి ఇవ్వమని తరచూ తండ్రి, తమ్ముళ్లతో గొడవపడేవాడు. కేసు నమోదు.. సమాచారం తెలుసుకున్న అచ్చంపేట డీ ఎస్పీ రవికుమార్, సీఐ రామకృష్ణ, లింగాల, బల్మూరు ఎస్ఐలు విష్ణు, వెంకన్న, ఉప్పునుంతల ఏఎస్ఐ నాగశేషా జీ సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో వివరాలు సేకరించారు. ఈ మేరకు నిందితుడు మల్లేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నామని సీఐ రామకృష్ణ తెలి పారు. శవా లను పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జులాయిగా తిరుగుతూ.. సామ మల్లేష్ చిన్నప్పటి నుంచి పెద్దల భయం లేకుండా పెరగడంతో జులాయిగా తిరుగుతూ కసాయిగా మారాడని గ్రామస్తులు ఆరోపించారు. తల్లి చిన్నప్పుడే వదిలిపెట్టి పోవడం, తండ్రి మాట పెడచెవిన పెట్టి అడ్డదిడ్డంగా తిరుగుతూ పెరిగిన మల్లేష్ చివరకు తన సోదరులతోపాటు తండ్రిని చంపే స్థాయి చేరాడన్నారు. ఎలాంటి పనులు చేయకుండా మద్యం తాగడం, జులాయిగా తిరగడం, ఇంట్లో డబ్బులు, పొలం వద్ద ఇతర సామగ్రి దొంగిలించడం వంటివి చేసేవాడన్నారు. అలాగే తండ్రి, తమ్ముళ్లను డబ్బుల కోసం వేధిస్తూ పొలంలో పశుగ్రాసానికి నిప్పుపెట్టిన సంఘటనలు సైతం ఉన్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చే తల్లి భూలక్ష్మమ్మను కూడా మల్లేష్ కొట్టడంతోనే ఆమె వెళ్లిపోయేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని నెట్టుకొచ్చిన శ్రీశైలం.. చిన్నతనంలోనే తల్లి పిల్లలను విడిచి వెళ్లిపోవడం, అన్న ఎవరి మాట వినకపోవడంతో ఇబ్బందికర పరిస్థితుల్లో నడిపి కొడుకు శ్రీశైలం తండ్రితో కలిసి వ్యవసాయ పనులు చేస్తూ తమ్ముడు రామస్వామిని చదివిస్తున్నాడు. ఖాళీ సమయంలో ఇతరుల వద్దకు కూలీ పనికి వెళ్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. రామస్వామి సైతం సెలవు రోజుల్లో తండ్రి, అన్నకు పొలం పనుల్లో సాయం చేసేవాడు. చివరకు అన్న మల్లేష్ అనారోగ్యానికి గురైన సమయంలో కూడా డబ్బులు ఖర్చుచేసి బాగుచేయించినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి తమ్ముళ్లను చంపడానికి అతనికి చేతులు ఎలా వచ్చాయంటూ బోరుమన్నారు. పొలంలోనే దారుణం ఇదిలా ఉండగా శనివారం రాత్రి తమ్ముళ్లు శ్రీశైలం, రామస్వామి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పంటకు కాపలాగా వేర్వేరుచోట్ల పడుకున్నారు. అర్ధరాత్రిపూట అక్కడికి చేరుకున్న మల్లేష్ ఇద్దరినీ పడుకున్న దగ్గరే రాళ్లతో తలపై మోది చంపాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి తండ్రి భాస్కరయ్యను నిద్రలేపి నమ్మించి పొలం వద్దకు తీసుకెళ్లాడు. మార్గమధ్యలో అతని తలపై రాళ్లతో మోది చంపేశాడు. అయితే పొలం వద్ద నుంచి ఇంటికి వస్తున్న గ్రామానికి చెందిన మల్లయ్యకు తండ్రిని తీసుకుని పొలం వద్దకు తీసుకువెళ్తూ మల్లేష్ కనిపించాడు. ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో నిందితుడు మల్లేష్ అన్నారంలో ఉన్న తన మేనమామ వెంకటయ్యకు ఫోన్‌చేసి ఇద్దరు తమ్ముళ్లను, తండ్రిని చంపినట్లు చెప్పాడు. దాంతో ఆ విషయం గ్రామంలో పాకడంతో వారి దాయాదులు, గ్రామస్తులు వెళ్లి పొలంలో వెతకగా ముగ్గురు శవాలు మూడు చోట్ల పడి ఉన్నాయి. ఆ సమయంలోనే నిందితుడు మల్లేష్ తెల్కపల్లిలో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న అతని పెద్దనాన్న కొడుకు రామస్వామి అక్కడికి వెంటనే వెళ్లి మల్లేష్‌ను పట్టుకుని తెలకపల్లి పోలీసులకు అప్పగించాడు. -
దారితప్పిన అన్నదమ్ములు
విశాఖ క్రైం: వారిద్దరూ సొంత అన్నదమ్ములు. వ్యసనాలకు బానిసలు కావడంతో దొంగతనాల బాట పట్టారు. బంధువులు, స్నేహితులనే టారెŠగ్ట్ చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో మానవత్వం మరిచిపోయి సొంత మేనత్త పీక నులిమి ఆమె మెడలోని గొలుసు అపహరించుకుపోయారు. సుమారు నాలుగేళ్ల పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లకు నమ్మకంగా వెళ్లి దొంగతనాలు చేసిన వీరిరువురు... గడిచిన ఏడాదిన్నర నుంచి ఒంటరిగా కనిపించే మహిళల మెడలోని చైన్లు తెంపుకుపోవడమే పనిగా పెట్టుకున్నారు. పలు స్టేషన్లలో 15 కేసుల్లో నిందితులుగా ఉన్న వీరిలో ఒకరు పోలీసులకు గురువారం చిక్కాడు. వీరికి సహకరించిన బంగారం వ్యాపారిని, 144 గ్రాముల బంగారు ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏ2 నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇందుకు సంబంధించి కమిషనరేట్ సమావేశ మందిరంలో క్రైం డీసీపీ షిమోషి బాజ్‌పాయ్ వివరాలు వెల్లడించారు. గండిగుండం గ్రామానికి చెందిన గండ్రెడ్డి అప్పలరాజు (36), గండ్రెడ్డి సత్తిబాబు(32) అన్నదమ్ములు. కూలి పని చేసుకుంటూ, ఆటో నడుపుకొని జీవనం సాగించే వీరు వ్యసనాలకు బానిసలయ్యారు. ఈ క్రమంలో సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో 2013 నుంచి దొంగతనాల బాటపట్టారు. చోరీ చేసిన బంగారం విక్రయించేందుకు గోపాలపట్నం ప్రాంతానికి చెందిన గొరస రమేష్‌తో పరిచయం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో అడవివరం బైరవస్వామి గుడి ప్రాంతంలో ఎక్కువగా చైన్‌స్నాచింగ్‌లు జరుగుతుండడంతో ఎస్ఐ గోపి నిఘా పెంచారు. చేతికి ఆరు వేళ్లు కలిగిన వ్యక్తి చోరీలకు పాల్పడుతున్నట్లు వివరాలు సేకరించారు. ఈ క్రమంలో చేతికి ఆరు వేళ్లు కలిగిన గండ్రెడ్డి అప్పలరాజు ఈ ప్రాంతంలో గురువారం అనుమానాస్పదంగా సంచరించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలన్నీ వెలుగుచూశాయి. మొత్తం 15 కేసుల్లో నిందితునిగా ఉన్న గండ్రెడ్డి అప్పలరాజును, ఆభరణాలు కొనుగోలు చేసిన రమేష్‌ను పోలీస్‌లు అరెస్ట్ చేశారు. ఎ – 2 నిందితుడు సత్తిబాబు పరారీలో ఉన్నాడని, అతని కోసం వెతుకుతున్నట్లు క్రైం డీసీపీ షిమోషి బాజ్‌పాయ్ ప్రకటించారు. ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టిన బంగారంతోపాటు 144 గ్రాముల బంగారు ఆభరణాలు రికవరి చేశామని తెలిపారు. సమావేశంలో క్రైం ఏడీసీపీ వి.సురేష్‌బాబు, ఎస్ఐలు గోపి, జి.డి.బాబు(పెందుర్తి), సుధాకర్, పోలీస్ కానిస్టేబుల్ చిట్టిబాబు, అప్పలరాజు, నర్శింగరావు పాల్గొన్నారు. బంధువులు, స్నేహితులే బలి ♦ గండ్రెడ్డి అప్పలరాజు, గండ్రెడ్డి సత్తిబాబు తమ దొంగతనాలను మేనత్త ఇంటి నుంచే ప్రారంభించారు. 2013 ఏప్రిల్ నెలలో గండిగుండం గ్రామానికి చెందిన తమ మేనత్త వాకాడ సింహాచలం ఇంటిలో రెండు బంగారు నక్లెస్‌లు దొంగతనం చేశారు. ♦ 2014 ఏప్రిల్‌లో మేనత్త వాకాడ సింహాచలం జీడితోటలో పిక్కలు ఏరుతుండగా... ఆమె ముక్కు, నోరు మూసి పీక నులిమేసి హత్య చేశారు. అనంతరం ఆమె మెడలోని 29 గ్రాముల బంగారు గొలుసు అపహరించుకుపోయారు. ఈ బంగారాన్ని పెందుర్తి ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కంపెనీలో అప్పలరాజు తాకట్టుపెట్టాడు. ♦ 2014 అక్టోబర్‌లో అక్కిరెడ్డిపాలెంలో బంధువు కోన దుర్గమ్మ ఇంటిలో బంగారు గొలుసు అపహరించారు. ♦ 2015 జనవరిలో సరిపల్లి గ్రామంలోని బంధువు అడ్డూరి కొండమ్మ ఇంటిలో రెండు బంగారు ఎత్తుగొలుసులు చోరీ చేశారు. ♦ 2015 మే నెలలో శొంఠ్యాం గ్రామంలోని స్నేహితుడు బొద్దపు పోలినాయుడు ఇంటిలో బంగారు తాడు దొంగతనం చేశారు. ♦ 2016 మార్చి, ఏప్రిల్‌లో స్నేహితుల ఇళ్లలో పుస్తెల తాడు, చైను అపహరించుకుపోయారు. ♦ 2016 అక్టోబర్ నెలలో సరిపల్లి గ్రామంలో సొంత అత్త ఇంటిలోని జుంకాలను అప్పలరాజు అపహరించాడు. ♦ 2016 అక్టోబర్ నెలలో సింహాచలం బస్టాండ్ వద్ద ఒక మహిళ మెడ నుంచి పుస్తెల తాడు తెంపుకొని ఉడాయించారు. ♦ 2017 సెస్టెంబర్లో మామిడిలోవ గ్రామంలోని స్నేహితుడు రవి ఇంటిలో బంగారు నల్లపూసల దండ దొంగతనం చేశారు. ♦ 2017 ఆగస్టు, అక్టోబర్, నవంబర్ నెలల్లో పలు ప్రాంతాల్లోని ఐదుగురు మహిళల మెడల్లోని పుస్తెల తాళ్లు తెంపుకుపోయారు. -
అన్న... తమ్ముడు... క్రికెట్!
కొత్త బంగారం అరవింద్ అడిగా ముంబయిలో నివసిస్తున్న కుమార్ల కుటుంబంతో నవల ప్రారంభం అవుతుంది. 14 ఏళ్ల రాధాకృష్ణ (రాధ), 13 ఏళ్ల మంజునాథ్ (మంజు), తండ్రి మోహన్! ఆయన తన కొడుకులను పేరొందిన క్రికెటర్లుగా తయారు చేయడానికి, కర్ణాటక నుండి ముంబయి మురికివాడకు వస్తాడు. కుర్రాళ్లు తమ బాల్యాలను ఆరోగ్యం, శుభ్రత కోసం త్యాగం చేయవలసి వచ్చినప్పుడు, తండ్రిని అసహ్యించుకుంటారు. భార్య వదిలేసి పోతుంది. మోహన్ రైల్లో ప్రయాణికులతో చెప్తుంటాడు: ‘నేను అద్భుతమైన చట్నీలమ్ముతాను. రోజుకి 24 రకాలైన చట్నీలు. పుదీనా, వెల్లుల్లీ, మిరపా, తీపీ. అన్నీ నూరు శాతం శాకాహారం’. అబ్బాయిలు టీనేజీలోకి ప్రవేశించినప్పుడు, ముంబయి క్రికెట్ అసోసియేషన్ కోసం పని చేసే ‘టామీ సర్’ కుర్రాళ్ళ ప్రతిభ గుర్తించి, స్పాన్సర్షిప్ ఇప్పిస్తాడు. ఆ డబ్బుని మితంగా ఖర్చుపెడుతూ కుమార్ల కుటుంబం చెంబూర్‌కు మారుతుంది. మంజూ, రాధా క్రికెట్ ఆడుతున్నప్పుడు, వారి జట్టులో ఉండే జావెద్ అన్సారీ వాళ్ళకి పోటీగా నిలబడతాడు. అన్నదమ్ములకీ తండ్రికీ మధ్య ఘర్షణ ఎక్కువవుతూ ఉంటుంది. సెలెక్షన్ డే సమీపిస్తున్నప్పుడు, తనవల్ల ఇతరులకి కావలసినదేమిటో, తనకోసం తాను కోరుకున్నదేమిటో అని పరిశీలించుకునే అవసరం పడుతుంది మంజుకి. ఇక, సెలెక్షన్ డే నాడు తండ్రి నమ్మకం పెట్టుకున్న రాధ ఎంపికవక, క్రికెట్ ఆడటం ఇష్టం లేని మంజు ఎంపికవుతాడు. అన్నదమ్ముల మధ్య ఈర్షా్యద్వేషాలు పుడతాయి. మంజుకీ, జావెద్కీ ఉన్న సంబంధం లైంగిక రూపం దాలుస్తుంది. పుస్తకంలో స్త్రీలు ఉండరు. వారి గురించిన క్లుప్తమైన ఉదహరింపులుంటాయంతే. నవలలో అధికభాగం తోబుట్టువుల మధ్య పోటీ గురించినదే. పుస్తకం, క్రికెట్లో పేరు ప్రఖ్యాతుల కోసం మార్గం వెతకడం కన్నా, ఆ క్రీడవల్ల మూసుకోబడిన ఇతర మార్గాల గురించినది. తన పాత్రలకున్న భయాలనీ, మనఃస్థితులనీ, తమకి తాము నిర్మించుకున్న వారి ఖైదులనీ– రచయిత వారి అంతర్గత కంఠాల లోపలకీ, బయటకీ త్వరితంగా ప్రయాణిస్తూ, వర్ణిస్తారు. చిన్న పాత్రలకి కూడా రచయిత విషాదాన్నీ, గంభీరతనీ ఆపాదిస్తారు. వ్యంగ్య చిత్రాలు లేవు నవల్లో. ఇతివృత్తం ఆహ్లాదకరమైనది. 1983 అనంతరపు క్రికెట్ చుట్టూ కథ అల్లారు రచయిత. నవల నేపథ్యం క్రికెట్ మీదనున్న భారతదేశపు ఆరాధన. ఆ క్రీడ మీద సవిమర్శక పరిశీలనతోనే నడిచే నవల ఇది. క్రికెట్ అంటే మనకి దేవుడు, అది జాతీయ వ్యామోహమే కాక ఒక మతంలా కూడా తయారయిందన్న ఉదహరింపులున్నాయి. పుస్తకం, లైంగిక మేల్కొలుపు గురించినది కూడా! రచయిత రాసిన విధానం వల్ల కథను ఆస్వాదించాలంటే పాఠకులకి క్రికెట్ గురించి తెలియాల్సిన అవసరం ఉండదు. క్రీడల మీద రాయబడిన ఇతర పుస్తకాల్లాగే ఇక్కడ కూడా, క్రికెట్ అన్న అంశం– విస్తృత సమస్యలను అన్వేషించే పరికరం మాత్రమే. ఈ క్రీడ మనుష్యులని ఎలా ఏకం చేస్తుందో, విడదీస్తుందో, ఉత్తేజపరుస్తుందో అన్న సంగతులనీ, తెర వెనకాతల సాగే లంచగొండితనాలూ, సాధికారతలన్నిటినీ రచయిత వర్ణిస్తారు.తన తొలి నవల ‘ద వైట్ టైగర్’కు 2008లో బుకర్ ప్రైజ్ గెలుచుకున్న అరవింద్ అడిగా మూడో నవల ఈ ‘సెలెక్షన్ డే’. 2016లో వచ్చింది. u క్రిష్ణవేణి -
అప్పు చేశారు.. అందకుండా పోయారు!
రణస్థలం: మరో ఆర్థిక నేరం. మొన్న నరసన్నపేట, నిన్న సంతకవిటి సంఘటనలు మర్చిపో క ముందే రణస్థలం మండలం పైడిభీమవరంలో ఇంకో మోసం వెలుగు చూసింది. జ్యూయలరీ షాపు అధినేతలుగా చెలామణీ అవుతున్న ఇద్దరు అన్నదమ్ములు రూ.15 కోట్లకుపైగా అప్పులు చేసి ఇప్పుడు ఎవరికీ కనిపించకుం డా పోయినట్లు తెలిసింది. దీనిపై బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక వడ్డీ ఆశతో అప్పులు ఇచ్చిన వారు పోలీసులను కూడా ఆశ్రయించలేకపోతున్నారు. అధిక వడ్డీ ఆశ చూపి.. రణస్థలం మండలంలోని పైడిభీమవరంలో ఏడెనిమిదేళ్లుగా వెంకటరామ జ్యూయలర్స్ యజమానులుగా చలామణీ అవుతున్న దన్నాన రామినాయుడు, లక్ష్మణ కస్టమర్లతో సన్నిహితంగా మెలిగేవారు. నూటికి రూ.6, రూ.10లు చొప్పున వడ్డీ ఇస్తూ చాలా మంది వద్ద అప్పులు చేశారు. అయితే నెలకు ఒక రోజు ముందే వడ్డీ ఇచ్చేస్తుండడంతో వీరికి అప్పులు ఇచ్చే వారి సంఖ్య బాగా పెరిగింది. రెండు మూడేళ్ల పాటు అదే మండలంలోని పైడిభీమవరం, నారువ, అక్కయ్యపాలెం పరిసర ప్రాంతవాసుల నుంచి సుమారు రూ.6కోట్ల వరకు అప్పులు చేశారు. ఇక్కడే కాకుండా శ్రీకాకుళం, విశాఖపట్నం, బెజ్జిపురం గ్రామాల్లో కూడా ఇలా ఆధిక వడ్డీ ఆశ చూపి రూ.కోట్లలో అప్పులు చేసినట్లు సమాచారం. దీంతో పాటు బంగారం ఆర్డర్లు తీసుకుని తిరిగి వస్తువులు ఇవ్వకుండా తిప్పించిన దాఖలాలు కూడా ఇప్పుడే బయటపడుతున్నాయి. దాదాపు 200 తులాల వరకు బంగారం వస్తువులను వీరు వినియోగదారులకు ఇవ్వాల్సి ఉందని తెలిసింది. అయితే పది రోజులుగా వీరు కనిపించకపోవడంతో అప్పులు ఇచ్చిన వారిలో ఆందోళన పెరిగింది. వ్యసనాలకు అలవాటు పడేనా..? అన్నదమ్ముల్లో చిన్నవాడు లక్ష్మణకు అన్ని వ్యసనాలకు అలవాటు పడి, బెట్టింగ్‌లు ఇతరత్రా కార్యక్రమాలు చేసేవాడని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. అన్నదమ్ములు పది రోజులుగా పత్తా లేకుండా పోవడంతో సుమారు 50 మంది బాధితులు ఈ అన్నదమ్ముల స్వగ్రామమైన బెజ్జిపురానికి వెళ్లి ఆ గ్రామ పెద్దలను కలిసి విషయం చెప్పారు. దీంతో అక్కడ పెద్దలు ఇచ్చిన సమాచారం విని వీరు అవాక్కయ్యారు. సొంత గ్రామంలో కూడా ఈ అన్నదమ్ములు అధిక వడ్డీల ఆశ చూపి రూ.కోట్లు అప్పులు చేశారని, ఆ అప్పులు చెల్లించలేక వారి వద్ద ఉన్న సుమారు రెండెకరాల భూమిని రాసిచ్చేశారని తెలియడంతో బాధితుల్లో భయం పెరిగింది. తమ డబ్బులకు ఇక దిక్కెవరు అంటూ వీరు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అధిక వడ్డీలకు పెద్ద మొత్తంలో డబ్బులు అప్పుగా ఇవ్వడంతో పోలీసులను కూడా ఆశ్రయించలేక లోలోపలే కుమిలిపోతున్నారు. దీనిపై జేఆర్ పురం ఎస్సై వి.సత్యనారాయణను వివరణ కోరగా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని, ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. -
రయ్ రయ్‌మంటూ...
ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో సినిమాను పట్టాలెక్కించేస్తున్నారు హీరోలు. తమిళ హీరో సూర్య ఒక అడుగు ముందుకేసి నెక్స్ట సినిమానే కాకుండా ఆ తర్వాతి చిత్రాన్ని కూడా ఓకే చేశారు అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం ‘తానా సేందకూట్టమ్’ (తెలుగులో ‘గ్యాంగ్’)లో చేస్తోన్న సూర్య తదుపరి చిత్రాన్ని దర్శకుడు సెల్వ రాఘవన్‌తో చేయనున్నారు. ఆ తర్వాత కెమెరామేన్ నుంచి దర్శకుడిగా మారిన కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇదివరకు వీరి కాంబినేషన్లో ‘వీడొక్కడే, బ్రదర్స్’ వంటి చిత్రాలు వచ్చాయి. అవిభక్త కవలలు కాన్సెప్ట్‌తో ‘బ్రదర్స్’ సినిమా ఉంటుంది. ఈసారి కూడా సూర్య, ఆనంద్ ఒక ప్రయోగాత్మక చిత్రంతోనే హ్యాట్రిక్ సాధించాలనుకుంటున్నారని చైన్నై టాక్. -
మరణంలోనూ వీడని అన్నదమ్ముల బంధం
-
బ్రదర్స్ బాడీ బిల్డర్స్
బాడీ బిల్డింగ్ అంటే ఆ అన్నదమ్ములకు ఎంతో ఇష్టం. ఇంటి సమీపంలోని ఫిట్నెస్ క్లబ్‌ను చిన్నప్పటి నుంచి దైవంగా భావించేవారు. ఇప్పుడు అక్కడే శిక్షకులుగా మారారు. ఓవైపు చదువుకుంటూ.. మరోవైపు బాడీ బిల్డింగ్‌లో రాణిస్తున్నారు. వారే ముస్తఫా మెహసిన్, ముర్తుజా మెహసిన్. వీరి చిన్నాన్న మోతేశం అలీఖాన్ 2008లో మిస్టర్ వరల్డ్ పోటీలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఇద్దరు పనిచేస్తున్నది.. రాటుదేలుతున్నది ఆయన ఫిట్నెస్ క్లబ్‌లోనే. మోతేశం పర్యవేక్షణలోనే వీరు శిక్షణ పొందుతున్నారు. కాలం ఎంతో విలువైనదని భావించే వీరు ఓవైపు డిగ్రీ చేస్తూనే.. మరోవైపు లక్ష్య సాధనకు శ్రమిస్తున్నారు. పొద్దంతా విద్యాభ్యాసం, సాయంత్రం నుంచి రాత్రి వరకు జిమ్‌లో ప్రాక్టీస్.. ఇదే వీరి జీవనం ఇప్పుడు. బంగారం, వెండి.. మనదేనండి ముస్తఫా డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, ముర్తుజా మెకానికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం. ముస్తపా ఇప్పటికే ‘మిస్టర్ ఉస్మానియా యూనివర్సిటీ’ పోటీలో సిల్వర్ మెడల్, మిస్టర్ తెలంగాణ పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచాడు. ముర్తుజా మిస్టర్ తెలంగాణ పోటీల్లో సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. నవంబర్‌లో బెంగళూర్‌లో జరిగిన ‘మిస్టర్ మజిల్ మేనియా’ బాడీ బిల్డింగ్ అండ్ బెస్ట్ ఫిజిక్ చాంపియన్‌షిప్–2017లో పాల్గొని సత్తా చాటారు. దేశం నలుమూలల నుంచి 300 మంది బాడీ బిల్డర్లు పాల్గొన్న ఈ పోటీల్లో... ముర్తుజా బంగారు పతకం సాధించగా, ముస్తఫా సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. ప్రోత్సాహం అవసరం నేను 2008లో అమెరికాలో జరిగిన ప్రపంచ బాడీ బిల్డింగ్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించాను. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి నన్ను బాగా ప్రోత్సహించారు. ఆయన కొన్ని ప్రోత్సాçహకాలు ప్రకటించారు. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం ఇతర క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్లుగానే మాకూ సాయం చేయాలి. – మీర్ మోతేశం అలీఖాన్, ప్రపంచ బాడీ బిల్డర్ చిన్నాన్న మోతేశంతో అన్నదమ్ములు -
సోదరులు ఫుల్లుగా తాగి.. పట్టాలపై పడుకుని!
గ్రేటర్ నోయిడా: వరుసకు అన్నదమ్ములయ్యే ముగ్గురు యువకులు మద్యం తాగి రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమబుద్ధనగర్ జిల్లా బాదల్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దాద్రి సమీపంలోని పట్వారీ గ్రామానికి చెందిన బాలు యాదవ్, కపిల్ యాదవ్, రోహిత్ యాదవ్ వరుసకు అన్నదమ్ములు. మంగళవారం సాయంత్రం ఈ ముగ్గురూ మద్యం తాగి వారి ఇళ్లకు వెళ్లగా కుటుంబసభ్యులు లోనికి రానివ్వలేదు. మద్యం మత్తులో ఉన్న ఈ ముగ్గురూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకుని నిర్ణయించుకున్నారు. అందుకోసం మళ్లీ మద్యం సేవించారు. అనంతరం రైలు పట్టాలపైకి వెళ్లి పడుకున్నారు. రైలు వారిపై నుంచి వెళ్లటంతో ఈ అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. వీరిది హత్యా.. లేక ఆత్మహత్యా అని అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. -
విషాదం
- జీవితంపై విరక్తి చెంది అన్నదమ్ముల ఆత్మహత్య కోడుమూరు రూరల్: తల్లిదండ్రులు కన్నుమూశారు.. కట్టుకున్న భార్యలు విడిచి వెళ్లారు.. అప్పులకు ఆస్తులు కరిగిపోయాయి.. అక్కున చేర్చుకునే వారు కరువయ్యారు.. చివరకు వారికి మరణమే దిక్కైంది. ఒంటరి జీవితంతో మనస్తాపంతో చెందిన అన్నదమ్ములు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన కోడుమూరులో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక కోటవీధికి చెందిన బచ్చం ఈశ్వర్‌రెడ్డి కుమారులు జగన్నాథరెడ్డి (48), మల్లికార్జునరెడ్డి (40) చెడు వ్యసనాలకు బానిసలై కుటుంబాలను పట్టించుకోలేదు. కట్టుకున్న భార్యలు వాళ్లని విడిచి పిల్లలతో పాటు వారి పుట్టినిళ్లకు వెళ్లిపోయారు. ఆస్తులన్నీ అప్పుల్లోకి జమయ్యాయి. ఉంటున్న ఇల్లును కూడా తాకట్టు పెట్టి అప్పు తీర్చుకున్నారు. అప్పు తీర్చకపోవడంతో అప్పుదారుడు ఇంటిని స్వాధీనం చేసుకొని తాళం వేశాడు. దీంతో రెండేళ్ల నుంచి ఇంటి కాపౌండ్‌లో ఉంటూ ఎవరైనా పెట్టింది తింటూ కాలం గడిపేవారు. చివరకు జీవితంపై విరక్తి చెంది ఆదివారం రాత్రి వారుంటున్న మిద్దెపైన కూల్‌డ్రింక్‌లో పురుగు మందు కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం మధ్యాహ్నం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోడుమూరు సీఐ శ్రీనివాస్, ఎస్ఐ మహేష్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు జగన్నాథరెడ్డికి మొదటి భార్య చనిపోగా రెండో భార్య పావని, కుమార్తె, మొదటి భార్య కుమారుడు ఉన్నారు. అలాగే మల్లికార్జునరెడ్డికి భార్య సుమలత, ఇద్దరు కుమారులున్నారు. ప్రస్తుతం మృతుల అంత్యక్రియలు నిర్వహించేందుకు రావడానికి కూడా కుటుంబీకులు విముఖత చూపుతున్నట్లు తెలిసింది.