మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి.పేగు తెంచుకు పుట్టిన కుమారులే తల్లిదండ్రులను దారుణంగా హతమారుస్తున్నారు.. ఆర్థిక లావాదేవీలు, పొలాలు, ఇళ్ల విషయాల్లో సొంత అన్నదమ్ములు హత్యలకు తెగబడుతున్నారు.. వివాహేతర సంబంధాల అనుమానాలు కట్టుకున్న భార్య, రక్తం పంచుకు పుట్టిన పిల్లలను తిరిగిరాని లోకాలకు చేరుస్తున్నాయి. వీటన్నింటిలో మనిషే సమిధవుతున్నాడు. జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు మానవ విలువలను పతనం చేసేలా ఉంటున్నాయి. ఒక్క నవంబర్‌లోనే జిల్లాలో 18 హత్యలు జరిగాయి. వీటిపై ‘సాక్షి’ ఫోకస్...
పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది
అక్టోబర్ 14న మా రెండో కూతు రు స్వప్నశ్రీ భర్త రాజయ్య గుప్తా చేతిలోనే హత్యకు గురైంది. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అనుమానంతో ఎంతో మా బిడ్డను ఎంతో వేధించాడు. పిల్లలు పుట్టిన తర్వా త కూడా మారలేదు. ఆ అనుమానంతోనే మా మనవరాలు వినీత ను పదో తరగతి వరకే చదివించి, ఆ తర్వాత చదువు మాన్పిం చాడు. వినీతకు పెళ్లి కుదిరి, నిశ్చితార్థం జరిగే సమయంలో ఈ సంఘటన జరగడం మేము జీర్ణించుకోలేకపోతున్నారు. స్వప్నశ్రీ అనేక క ష్టాలు అనుభవించి, చివరికి భర్త చేతిలో హత్యకు గురై పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చిపోయింది.
- నందారం మురళమ్మ, రాజేందర్‌గుప్తా, కొడంగల్
నాలుగేళ్లుగా జిల్లాలో జరిగిన హత్యలు, దోపిడీలు
ఆస్తి తగదాలు, వివాహేతర సంబంధాలు, అదనపు కట్నం...తదితర కారణాలే చాలావరకు హత్యలకు దారి తీస్తున్నాయి. నవమాసాలు మోసి కనిపెంచి న కొడుకులే తల్లిని దారుణంగా హత్య చేయడం... తల్లి పిల్లలను కడతేర్చ డం... కట్టుకున్న భార్యను అనుమానంతో అంతమొం దిచడం... ఆస్తికోసం కొడుకులను తండ్రి చంపడం... వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీయడం... ఇలాంటి సంఘటనలతో జిల్లాలో సంచలనం రేకెత్తిస్తున్నాయి. మద్యం మత్తు లో ఎక్కువగా హత్యలు, దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ హత్యలు కూడా ఎక్కువగా షాద్‌నగర్, కొడంగల్, వనపర్తి, మహబూబ్‌నగర్ పరిధిలోనే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. దారిదోపిడీలు ఎక్కువగా జాతీయ రహదారిపైనే చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది నవంబర్ వర కు జిల్లాలో 150హత్యలు చోటు చేసుకున్నట్లు పోలీ సుల గణాంకాలు చెబుతున్నాయి. గత నాలుగేళ్లలో వివిధ కారణాలతో 566వరకు హత్యలు జరి గాయి.
ఒక్క నవంబర్‌లోనే జిల్లాలో 18హత్యలు జరిగా యి. ఈఏడాది ఇంతవరకు 30వరకు దారి దోపిడీలు జరి గాయి. వెలుగు చూడనివి మరెన్నో ఉన్నాయి. దుండగులు ఎక్కువగా బ్యాంకులనే టార్గెట్‌గా చేస్తున్నారు. బాలానగర్‌లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ)లో భారీ మొత్తంలో నగదు, బంగారం దోచుకెళ్లి ఐదు నెలలవుతున్నా పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. క్షణికావేశంలో జరిగే ఇ లాంటి సంఘటనల వల్ల సమాజంలో ప్రశాంత వాతావరణం కలుషితమవుతుందని తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్న వయసులోనే సన్మార్గంలో నడిపించేందుకు కృషి చేయాలని, ఇందులో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో అవసరమని మాన సిక వైద్య నిపుణులంటున్నారు.
దిక్కులేకుండా పోయింది
‘‘ నా భర్త బురాన్ ఏడేళ్ల క్రితం చనిపోయాడు. నా ఇద్దరు కొడుకులు అబ్దుల్‌ఖాదర్, నవాజ్‌ఖాన్‌లతో కలిసి ఉంటున్నా. పెద్దోడు ఖాదర్ పెళ్లి చేస్తే రెండేళ్ల క్రితం వదిలేశాడు. విడాకుల కోసం అన్నదమ్ములు కలిసి లక్షకు పైగా అప్పు చేశారు. గీ విషయంలో రోజూ అన్నదమ్ములు కొట్లాడేటోళ్లు. నవంబర్ 29 రాత్రి చిన్నోడు నవాజ్ గొడ్డలితో పెద్దోడిని నరికి చంపిండు. ఓ కొడుకు చనిపోయి, ఇంకో కొడుకు జైలుకుపోయిండు. ఒంటరిగా ఇంట్లో ఉండలేకపోతున్నా. పని చేయడానికి చేతకాక, తిండికి కూడా కష్టమైతుంది. ఈ వయస్సులో నాకు దిక్కులేకుండా పోయింది. రోజూ కొడుకులను తలుచుకుని ఏడుస్తున్నా.’’
- ఇస్రత్‌బేగం, కందూరు,
అడ్డాకుల మండలం
30రోజులు.. 18హత్యలు
Published Sun, Dec 14 2014 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM
Advertisement
Advertisement