బాడీ బిల్డింగ్ అంటే ఆ అన్నదమ్ములకు ఎంతో ఇష్టం. ఇంటి సమీపంలోని ఫిట్‌నెస్ క్లబ్‌ను చిన్నప్పటి నుంచి దైవంగా భావించేవారు. ఇప్పుడు అక్కడే శిక్షకులుగా మారారు. ఓవైపు చదువుకుంటూ.. మరోవైపు బాడీ బిల్డింగ్‌లో రాణిస్తున్నారు. వారే ముస్తఫా మెహసిన్, ముర్తుజా మెహసిన్.
వీరి చిన్నాన్న మోతేశం అలీఖాన్ 2008లో మిస్టర్ వరల్డ్ పోటీలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఇద్దరు పనిచేస్తున్నది.. రాటుదేలుతున్నది ఆయన ఫిట్‌నెస్ క్లబ్‌లోనే. మోతేశం పర్యవేక్షణలోనే వీరు శిక్షణ పొందుతున్నారు. కాలం ఎంతో విలువైనదని భావించే వీరు ఓవైపు డిగ్రీ చేస్తూనే.. మరోవైపు లక్ష్య సాధనకు శ్రమిస్తున్నారు. పొద్దంతా విద్యాభ్యాసం, సాయంత్రం నుంచి రాత్రి వరకు జిమ్‌లో ప్రాక్టీస్.. ఇదే వీరి జీవనం ఇప్పుడు.
బంగారం, వెండి.. మనదేనండి
ముస్తఫా డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, ముర్తుజా మెకానికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం. ముస్తపా ఇప్పటికే ‘మిస్టర్ ఉస్మానియా యూనివర్సిటీ’ పోటీలో సిల్వర్ మెడల్, మిస్టర్ తెలంగాణ పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచాడు. ముర్తుజా మిస్టర్ తెలంగాణ పోటీల్లో సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. నవంబర్‌లో బెంగళూర్‌లో జరిగిన ‘మిస్టర్ మజిల్ మేనియా’ బాడీ బిల్డింగ్ అండ్ బెస్ట్ ఫిజిక్ చాంపియన్‌షిప్–2017లో పాల్గొని సత్తా చాటారు. దేశం నలుమూలల నుంచి 300 మంది బాడీ బిల్డర్లు పాల్గొన్న ఈ పోటీల్లో... ముర్తుజా బంగారు పతకం సాధించగా, ముస్తఫా సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు.
ప్రోత్సాహం అవసరం
నేను 2008లో అమెరికాలో జరిగిన ప్రపంచ బాడీ బిల్డింగ్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించాను. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి నన్ను బాగా ప్రోత్సహించారు. ఆయన కొన్ని ప్రోత్సాçహకాలు ప్రకటించారు. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం ఇతర క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్లుగానే మాకూ సాయం చేయాలి. – మీర్ మోతేశం అలీఖాన్, ప్రపంచ బాడీ బిల్డర్
చిన్నాన్న మోతేశంతో అన్నదమ్ములు
Comments
Please login to add a commentAdd a comment