ఫోన్‌లో యాంకర్‌ని వేధిస్తున్న అన్నదమ్ముల అరెస్టు | Brothers Harassments On TV Anchor In Krishna | Sakshi
Sakshi News home page

ఫోన్‌లో యాంకర్‌ని వేధిస్తున్న అన్నదమ్ముల అరెస్టు

Published Fri, Jul 20 2018 12:00 PM | Last Updated on Wed, Sep 26 2018 6:15 PM

Brothers Harassments On TV Anchor In Krishna - Sakshi

పోలీసుల అదుపులో ఉన్న పరుచూరి పెద్దబాబు, పరుచూరి చిన్నబాబు

కృష్ణలంక (విజయవాడ తూర్పు) : సెల్‌ఫోన్‌లో యువతి పట్ల అసభ్య పదజాలంతో మాట్లాడుతూ వేధింపులకు పాల్పడిన ఇద్దరు నిందితులను కృష్ణలంక పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఒక ప్రయివేటు చానల్‌లో యాంకర్‌గా పని చేస్తున్న యువతిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వేర్వేరు నెంబర్‌ల నుంచి ఫోన్‌ చేసి అసభ్యకరంగా మాట్లాడుతూ వేధింపులకు పాల్పడుతున్నారు. వీరి వేధింపులు రోజురోజుకు శ్రుతిమీరటంతో ఈ నెల 1న యువతి కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ఉపయోగించిన ఫోన్‌ నెంబర్‌ల ఆధారంగా వారి వివరాలు తెలుసుకున్నారు. నెల్లూరుకు చెందిన పరుచూరి పెద్దబాబు, పరుచూరి చిన్నబాబు ఇద్దరు అన్నదమ్ములు.

వీరు అదే గ్రామంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జులాయిగా తిరుగుతుంటారు. వారు సీరియల్‌గా కొన్ని ఫోన్‌ నెంబర్‌లను వరుసగా డయల్‌ చేస్తారు. ఎవరైనా ఆడవారు మాట్లాడితే చాలు వారు తమ బుద్ధిని బయటపెట్టి అసభ్య పదజాలంతో మాట్లాడుతూ బయటకు చెప్పుకునేందుకు వీలులేని విధంగా తమ మాటలతో వేధింపులకు పాల్పడుతుంటారు. వీరిపై నిఘా పెట్టిన పోలీసులు వారి ఫోన్‌ సిగ్నల్‌ ద్వారా పరుచూరి పెద్దబాబును బెంగళూరులోను, పరుచూరి చిన్నబాబును నెల్లూరులోనూ అదుపులోకి తీసుకుని వారిని అరెస్టు చేశారు. వీరు గతంలోనూ ఇదే తరహాలో అనేక మంది మహిళలతో ఇలాగే వ్యవహరించినట్లు పోలీసుల దర్యాప్తులో తెలినట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement