సాధారణంగా ఏ గుడికైన కుటుంబ సమేతం వెళ్లి దర్శించుకుంటాం. కానీ ఓ గుడికి మాత్రం అక్కా-తమ్ముడు, అన్నా-చెల్లెళ్ల కలిసి వెల్లకూడదట. అలాంటి వింత ఆలయం భారత్‌లో ఒకటి ఉంది. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది? ఎందుకని ఈ నిషేధం విధించారంటే..
ఆ ఆలయం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ గ్రామంలో ఉంది. అది సాక్షాత్తు భోళా శంకరుడు ఆలయం. ఈ శివాలయాన్నిఏడు, ఎనిమిదో శతాబ్దకాలంలో కాలచూరి పాలకులు ఎరుపు, నలుపు రంగులతో కూడిన ఇసుకరాయితో నిర్మించారట. ఆలయ స్తంభాలపై అనేక అందమైన శిల్పాలు పర్యాటకులను అమితతంగా ఆకర్షిస్తాయి. ఈ దేవాలయంలోనే ఓ చిన్న మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియం వివిధ రకాల విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి.
ఎందుకు ఈ నిషేధం అంటే..
ఈ ఆలయాన్ని కేవలం రాత్రుళ్లులోనే నిర్మించారట. అయితే ఆ గుడిని నిర్మించే శిల్పి నారాయణ్ నగ్నంగా ఈ ఆలయాన్ని నిర్మించేవాడట. రోజూ అతడి భార్యే అతనికి భోజనం తీసుకొచ్చేదట. కానీ, ఓ రోజు నారాయణ్ చెల్లెలు భోజనం తీసుకుని ఆలయంలోకి వచ్చింది. నగ్నంగా ఉన్న అతడిని ప్రమాదవశాత్తు చూస్తుంది. దీన్ని నారాయణ్ చాలా అవమానంగా భావించి ఆ గుడిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అప్పటి నుంచి సోదర సోదరీమణులు ఈ ఆలయంలోకి రాకూడదని ఆ గ్రామ పెద్దలు నిషేధం విధించారు. అంటే అక్క తమ్ముడు, అన్నా- చెల్లికి మ్రాతమే నో ఎంట్రీ. అంటే అక్కా చెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లుకు ఇది వర్తించదు. ఏదీఏమైన కొన్ని దేవాలయాల నిర్మాణ శైలి, ఆచారాలు అత్యంత విచిత్రంగా ఉంటాయి.
(చదవండి: ప్రపంచంలోనే బెస్ట్ డెజెర్ట్‌గా భారతీయ స్వీట్! ఎన్నో స్థానంలో నిలిచిందంటే..)
Comments
Please login to add a commentAdd a comment