narayanpur
-
మిడ్ డే మీల్స్ తిని 50 మంది పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్..
-
తుల్తులీ ఎన్కౌంటర్ మృతులు 38 మంది
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్ చరిత్ర లోనే అతి పెద్దదిగా పరిగణిస్తున్న తుల్తులీ ఎన్కౌంటర్లో రోజులు గడిచేకొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆ రాష్ట్రంలోని అబూజ్మడ్ అడవుల్లో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఈనెల 4న నారాయణపూర్ జిల్లా పరిధిలోని తుల్తులీ, గవాడీ గ్రామాల మధ్య ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో తొలి రోజు 31మంది చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు.అందులో 22మందిని గుర్తించగా మిగిలిన వారిని గుర్తించలేకపోయారు. ఘటన జరిగిన 10 రోజుల తర్వాత మావో యిస్టులు లేఖ విడుదల చేస్తూ ఈ ఎదురు కాల్పుల్లో మొత్తం 35మంది చనిపోయినట్లు వెల్లడించారు. ఇక్కడితోనే మృతుల సంఖ్య ఆగిపోతుందని అంతా అనుకున్నారు. అయితే దంతెవాడ ఎస్పీ గౌరవ్రాయ్ శుక్రవారం ఈ ఎన్‌కౌంటర్‌పై మరిన్ని వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం తుల్తులీ ఎన్కౌంటర్లో మొత్తం 38మంది చనిపోయారని వెల్లడించారు. మృతులపై ఉన్న రివార్డు మొత్తం రూ.2.60 కోట్లుగా ఉంది. -
అక్కా తమ్ముడు-అన్నా చెల్లెళ్లకు ఆ ఆలయంలోకి నో ఎంట్రీ!
సాధారణంగా ఏ గుడికైన కుటుంబ సమేతం వెళ్లి దర్శించుకుంటాం. కానీ ఓ గుడికి మాత్రం అక్కా-తమ్ముడు, అన్నా-చెల్లెళ్ల కలిసి వెల్లకూడదట. అలాంటి వింత ఆలయం భారత్‌లో ఒకటి ఉంది. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది? ఎందుకని ఈ నిషేధం విధించారంటే.. ఆ ఆలయం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ గ్రామంలో ఉంది. అది సాక్షాత్తు భోళా శంకరుడు ఆలయం. ఈ శివాలయాన్నిఏడు, ఎనిమిదో శతాబ్దకాలంలో కాలచూరి పాలకులు ఎరుపు, నలుపు రంగులతో కూడిన ఇసుకరాయితో నిర్మించారట. ఆలయ స్తంభాలపై అనేక అందమైన శిల్పాలు పర్యాటకులను అమితతంగా ఆకర్షిస్తాయి. ఈ దేవాలయంలోనే ఓ చిన్న మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియం వివిధ రకాల విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. ఎందుకు ఈ నిషేధం అంటే.. ఈ ఆలయాన్ని కేవలం రాత్రుళ్లులోనే నిర్మించారట. అయితే ఆ గుడిని నిర్మించే శిల్పి నారాయణ్ నగ్నంగా ఈ ఆలయాన్ని నిర్మించేవాడట. రోజూ అతడి భార్యే అతనికి భోజనం తీసుకొచ్చేదట. కానీ, ఓ రోజు నారాయణ్ చెల్లెలు భోజనం తీసుకుని ఆలయంలోకి వచ్చింది. నగ్నంగా ఉన్న అతడిని ప్రమాదవశాత్తు చూస్తుంది. దీన్ని నారాయణ్ చాలా అవమానంగా భావించి ఆ గుడిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అప్పటి నుంచి సోదర సోదరీమణులు ఈ ఆలయంలోకి రాకూడదని ఆ గ్రామ పెద్దలు నిషేధం విధించారు. అంటే అక్క తమ్ముడు, అన్నా- చెల్లికి మ్రాతమే నో ఎంట్రీ. అంటే అక్కా చెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లుకు ఇది వర్తించదు. ఏదీఏమైన కొన్ని దేవాలయాల నిర్మాణ శైలి, ఆచారాలు అత్యంత విచిత్రంగా ఉంటాయి. (చదవండి: ప్రపంచంలోనే బెస్ట్ డెజెర్ట్గా భారతీయ స్వీట్! ఎన్నో స్థానంలో నిలిచిందంటే..) -
ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సల్స్ మృతి
నారాయణ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్ జిల్లా భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. నెల్నార్ ఏరియా కమిటీ కార్యదర్శి అరబ్ అలియాస్ కమ్లేశ్, లోకల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్(ఎల్వోఎస్)కమాండర్ సోందు సారథ్యంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు ఓర్ఛా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోమగల్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం గాలింపు చేపట్టారు. సాయంత్రం రెండు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో పరిశీలించగా ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు, రెండు తుపాకులు లభ్యమైనట్లు ఒక అధికారి తెలిపారు. మృతులను గుర్తించాల్సి ఉందన్నారు. -
మావోయిస్టుల కాల్పులు.. ఇద్దరు కార్మికులు మృతి
సాక్షి, ఛత్తీస్‌గఢ్: నారాయణపూర్ అంబైడ్‌గనిలో మావోయిస్టుల దాడికి పాల్పడ్డారు. జేసీబీ సహా 6 వాహనాలను మావోయిస్టులు తగలబెట్టారు. సూపర్వైజర్ సహా కార్మికులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. కార్మికుల కిడ్నాప్‌ను అడ్డుకునేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా యత్నించాయి. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. -
నారాయణపూర్ రేవ్ పార్టీ: వెలుగులోకి కొత్త విషయాలు
-
ఎన్కౌంటర్: ఐదుగురు మావోయిస్టుల హతం
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరోసారి తుపాకీల మోత మోగింది. భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్ జిల్లా అంబుజ్‌మడ్ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో గాలింపు చేపట్టిన బలగాలకు వారు ఎదురుపడ్డారు. దీంతో తుపాకుల మోతమోగించారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దగ్గరలోని బేస్‌క్యాంపుకి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా తాజా ఎన్‌కౌంటర్‌తో అటవీ ప్రాంతంలో అలజడి మొదలైంది. మరికొంత మంది మావోయిస్టులు దాగిఉన్నారని సమాచారం అందడంతో కూబింగ్‌ను కొనసాగిస్తున్నారు. -
జూరాల.. పారాల!
- ఆల్మట్టికి 1.30 లక్షల క్యూసెక్కుల మేర వరద - మరో 50 టీఎంసీలు చేరితే జూరాలకు ప్రవాహాలు మొదలు - నారాయణపూర్‌కూ భారీ ప్రవాహాలు సాక్షి, హైదరాబాద్: వానమ్మ కరుణించింది. కృష్ణమ్మ పరవశించింది. ఎగువన వాన వెల్లువైంది. దిగువన ఉన్న ప్రాజెక్టులకు వరద వచ్చే వేళ అయింది. ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల్లో గడిచిన వారం రోజులుగా వానలు జోరుగా కురుస్తున్నాయి. మహారాష్ట్రలోని మహాబలేశ్వరం ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది విశ్వరూపం చూపుతోంది. అక్కడి ప్రధాన ప్రాజెక్టు కోయినా డ్యామ్‌తోపాటు ఇతర చిన్న తరహా ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో కర్ణాటకకు భారీగా ప్రవాహాలు వస్తున్నాయి. దీంతో గడిచిన 4 రోజులుగా 40 నుంచి 50 వేల క్యూసెక్కుల మేర ఆల్మట్టిలోకి ప్రవాహాలుండగా, అవి ఆదివారానికి ఏకంగా 1.30 లక్షల క్యూసెక్కులకు చేరింది. రోజుకు ఏకంగా 12 టీఎంసీల మేర నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 78.91 టీఎంసీలకు చేరింది. ప్రవాహాలు పెరగడంతో 33 వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నారాయణపూర్‌కు వదిలేస్తున్నారు. దీంతో నారాయణపూర్‌కు 30,966 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టులో 37.64 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్య ముండగా ప్రస్తుతం 26.61 టీఎంసీలకు చేరింది. ఈ రెండు ప్రాజెక్టుల్లో 50 టీఎంసీల మేర నిల్వలు పెరిగితే దిగువన ఉన్న జూరాలకు నీటి ప్రవాహాలు మొదలయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న వరదే మరిన్ని రోజులు కొనసాగితే 5 రోజుల్లోనే జూరాలకు నీటి ప్రవా హం మొదలయ్యే అవకాశముం ది. ఇక తుంగభద్రకు కూడా ఇన్‌ఫ్లో పెరిగింది. రెండ్రోజుల కిం దటి వరకు 20 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు నమోదు కాగా, ప్రస్తుతం అక్కడ 51,162 క్యూసె క్కుల ఇన్‌ఫ్లో ఉంది. దీంతో 100 టీఎంసీలకుగానూ అక్కడ 26.61 టీఎంసీల నిల్వలున్నాయి. ఆత్రుతగా దిగువ ప్రాజెక్టులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రవాహాలకు నోచుకోని రాష్ట్ర ప్రాజెక్టులు నీటి కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రాజెక్టులకు కేవలం 10 టీఎంసీల మేర నీరు వచ్చింది. మరో 390 టీఎంసీల మేర నీరు వస్తే కానీ ప్రాజెక్టులు నిండే అవకాశం లేదు. శ్రీశైలంలో 215 టీఎంసీలగానూ కేవలం 19 టీఎంసీల నీరే నిల్వ ఉండగా, సాగర్‌లో 312 టీఎంసీలకు 117 టీఎంసీల నీరే ఉంది. ఈ రెండు ప్రాజెక్టుల నిల్వల్లో వినియోగార్హమైన నీరు 2 టీఎంసీలకు మించి ఉండదు. ఇక జూరాలలో 9.6 టీఎంసీలకుగానూ 6.8 టీఎంసీ నిల్వ ఉండగా, ఈ నీటిని సాగు అవసరాలకు విడుదల చేయాలని ఇప్పటికే డిమాండ్లు పెరిగాయి. అయితే, ఎగువ ప్రవాహాలు మొదలైతే కానీ నీటి విడుదలపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. -
యాదాద్రిలో మావోయిస్టు పోస్టర్ల కలకలం
నారాయణపూర్: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండల కేంద్రంలో మావోయిస్టు పోస్టుర్లు కలకలం రేపుతున్నాయి. మండల కేంద్రంతో పాటు వావిళ్లపల్లి, జనాగం గ్రామాల్లో పోస్టర్లు వెలవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్ నియంత పాలన నశించాలి, లంచగొండి ఎమ్మెల్యే ఖబడ్దార్ అంటూ పోస్లర్లపై రాసి ఉంది. రాచకొండ ప్రకృతి సంపద కాపాడుకుందాం అంటూ సీపీఐ(ఎంఎల్) మావోయిస్టు రాచకొండ దళం పేరిట పోస్టర్లు దర్శనమివ్వడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ
ఛత్తీస్‌గఢ్: మవోయిస్టులుకు మరో ఎదురుదెబ్బ తగలింది. నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా రెండు రోజుల క్రితం దంతెవాడ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. అలాగే అక్టోబర్‌లో ఏవోబీ ఎన్కౌంటర్లో 32మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. -
గర్భిణీ స్త్రీలకు సంజీవనిలా తోడై..
నారాయణ్‌పూర్: ఎజెన్సీ ప్రాంతాల్లో ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రాణాలు గాల్లో దీపాలు అయ్యేవి. అప్పటికప్పుడు వారిని మోసుకెళితే అదృష్టం కొద్ది ప్రాణాలు దక్కితే దక్కేవి లేకుంటే అంతే సంగతులు. ఇక గర్భిణీ స్త్రీల పరిస్ధితి అయితే మరీ దారుణం. ఎందుకంటే ఎక్కడో అడవి లోపల కొండలమధ్యలో నివసించే చత్తీస్‌గఢ్ ఎజెన్సీ ప్రాంత ప్రజల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. రోడ్డు సౌకర్యం ఉండదు. ఉన్నా కాలిబాటకంటే కొంచె వెడల్పుగా వాహనం వెళ్లలేనంత ఇరుకుగా ఉంటుంది. దీంతో అక్కడ ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే అంతే సంగతులు ఉండేది. కానీ, ఇప్పుడు ఆపరిస్థితి మారింది. చాలా చోట్ల అక్కడ ఇప్పుడు బైక్ అంబులెన్స్ లు దర్శనం ఇస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఇవి మరీ కీలకంగా మారాయి. ఇప్పటి వరకు దాదాపు 200 మంది గర్భిణీ స్త్రీల ప్రాణాలను అవి నిలబెట్టాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి అంబులెన్స్ లు ఆఫ్రికాలో విజయవంతం కావడంతో వాటిని తిరిగి యునెస్కో సలహాతో చత్తీస్ గఢ్ ప్రాంతంలో ప్రవేశపెట్టగా అవి చాలా చక్కటి సేవలు అందిస్తూ సంజీవనిలా మారాయి. -
పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు
చత్తీస్‌గఢ్: పోలీసులకు-మావోయిస్టులకు మరోమారు భీకరపోరు సంభవించింది. చత్తీస్‌గఢ్ రాష్ర్టంలో నారాయణపూర్ జిల్లా దౌడాయి, ఝరాఘాటి అడవుల్లో మంగళవారం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు అకస్మికంగా దాడికి దిగారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. పోలీసులు ఎదురుదాడికి దిగడంతో ఒక మావోయిస్టు కూడా మృతి చెందాడు. ఇరుపక్షాల నడుమ అరగంటకు పైగా కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో మరికొంతమంది జవాన్లు గాయపడినట్లు సమాచారం.