![Encounter In Narayanpur Forest Area - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/24/narayanpur.jpg.webp?itok=-QGN577v)
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరోసారి తుపాకీల మోత మోగింది. భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్ జిల్లా అంబుజ్‌మడ్ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో గాలింపు చేపట్టిన బలగాలకు వారు ఎదురుపడ్డారు. దీంతో తుపాకుల మోతమోగించారు.
ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దగ్గరలోని బేస్‌క్యాంపుకి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా తాజా ఎన్‌కౌంటర్‌తో అటవీ ప్రాంతంలో అలజడి మొదలైంది. మరికొంత మంది మావోయిస్టులు దాగిఉన్నారని సమాచారం అందడంతో కూబింగ్‌ను కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment