యాదాద్రిలో మావోయిస్టు పోస్టర్ల కలకలం
Published Thu, May 4 2017 11:19 AM | Last Updated on Tue, Oct 9 2018 2:38 PM
నారాయణపూర్: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండల కేంద్రంలో మావోయిస్టు పోస్టుర్లు కలకలం రేపుతున్నాయి. మండల కేంద్రంతో పాటు వావిళ్లపల్లి, జనాగం గ్రామాల్లో పోస్టర్లు వెలవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్ నియంత పాలన నశించాలి, లంచగొండి ఎమ్మెల్యే ఖబడ్దార్ అంటూ పోస్లర్లపై రాసి ఉంది. రాచకొండ ప్రకృతి సంపద కాపాడుకుందాం అంటూ సీపీఐ(ఎంఎల్) మావోయిస్టు రాచకొండ దళం పేరిట పోస్టర్లు దర్శనమివ్వడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Advertisement
Advertisement