తొలిరోజు 31 మృతదేహాలు స్వాధీనం
35మంది చనిపోయినట్లు మావోయిస్టుల ప్రకటన
38మందితో తాజాగా జాబితా విడుదల చేసిన పోలీసులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్ చరిత్ర లోనే అతి పెద్దదిగా పరిగణిస్తున్న తుల్‌తులీ ఎన్‌కౌంటర్‌లో రోజులు గడిచేకొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆ రాష్ట్రంలోని అబూజ్‌మడ్ అడవుల్లో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఈనెల 4న నారాయణపూర్ జిల్లా పరిధిలోని తుల్‌తులీ, గవాడీ గ్రామాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో తొలి రోజు 31మంది చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు.
అందులో 22మందిని గుర్తించగా మిగిలిన వారిని గుర్తించలేకపోయారు. ఘటన జరిగిన 10 రోజుల తర్వాత మావో యిస్టులు లేఖ విడుదల చేస్తూ ఈ ఎదురు కాల్పుల్లో మొత్తం 35మంది చనిపోయినట్లు వెల్లడించారు. ఇక్కడితోనే మృతుల సంఖ్య ఆగిపోతుందని అంతా అనుకున్నారు. అయితే దంతెవాడ ఎస్పీ గౌరవ్‌రాయ్ శుక్రవారం ఈ ఎన్‌కౌంటర్‌పై మరిన్ని వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం తుల్‌తులీ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 38మంది చనిపోయారని వెల్లడించారు. మృతులపై ఉన్న రివార్డు మొత్తం రూ.2.60 కోట్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment