ఏఐ సాయంతో అశ్లీల వీడియోలు.. పోలీసు అధికారి కుమారులు అరెస్ట్‌! | Two brothers arrested for making objectionable videos of women using AI - Sakshi
Sakshi News home page

ఏఐ సాయంతో అశ్లీల వీడియోలు.. పోలీసు అధికారి కుమారులు అరెస్ట్‌!

Published Thu, Aug 24 2023 11:01 AM | Last Updated on Thu, Aug 24 2023 11:10 AM

brothers arrested for making objectionable videos - Sakshi

మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌ (ఏఐ)ని వినియోగించిన తీరుచూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే. ఈ ప్రాంతానికి చెందిన పోలీసు అధికారి కుమారులిద్దరు ఏఐ వినియోగించి, పలువురు యువతులు, మహిళల అశ్లీల వీడియోలను రూపొందించి, వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. యువతులు దీనిని వ్యతిరేకించడంతో వారిపై ఈ ఇద్దరు యువకులు దాడికి దిగారు. 

ఈ ఘటన అనంతరం ఇద్దరు యువతులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆ యువకులను పోలీసులు అరెస్టు చేశారు. పాల్‌ఘర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులిద్దరి వయసు 20 ఏళ్లు ఉంటుందని, వారి తండ్రి ముంబైలో పోలీసు అధికారి అని గుర్తించామన్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులిద్దరూ యువతుల, మహిళల ఫొటోలకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టూల్‌ వినియోగించి అశ్లీల వీడియోలు తయారు చేస్తున్నారు. వీరి బారినపడిన ఇద్దరు బాధిత యువతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమొదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: అది రాఖీ నాడు మాత్రమే తెరుచుకునే ఆలయం.. విష్ణు అవతారం ఇక్కడేనట!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement