నందమూరి మల్టీ స్టారర్ 'బ్రదర్స్'..? | Ntr, Kalyan ram multi starer Brothers | Sakshi
Sakshi News home page

నందమూరి మల్టీ స్టారర్ 'బ్రదర్స్'..?

Published Tue, Oct 4 2016 10:38 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

నందమూరి మల్టీ స్టారర్ 'బ్రదర్స్'..?

నందమూరి మల్టీ స్టారర్ 'బ్రదర్స్'..?

తెలుగు తెర మీద మరో భారీ ఫ్యామిలీ మల్టీ స్టారర్కు రంగం సిద్ధమవుతోందా..? ప్రస్తుతం ఈ వార్తకు సంబందించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి చేసిన మనం ఘనవిజయం సాధించటంతో ఇతర ఫ్యామిలీల నుంచి కూడా అలాంటి సినిమాలనే ఆశిస్తున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా మెగా, నందమూరి ఫ్యామిలీల నుంచి ఈ తరహా సినిమాల కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి త్వరలోనే ఓ భారీ మల్టీ స్టారర్ తెరకెక్కే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా ఎన్టీఆర్ట్స్ బ్యానర్పై 'బ్రదర్స్' అనే టైటిల్ను రిజిస్టర్ చేయించారన్న వార్త వినిపిస్తోంది. ఈ టైటిల్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు కలిసి చేయబోయే సినిమా కోసమే అంటున్నారు.  ఇప్పటికే బ్రదర్స్ పేరుతో సూర్య హీరోగా ఓ సినిమా వచ్చింది. దీంతో నందమూరి హీరోలు చేసే సినిమాకు ఏదైనా ట్యాగ్ లైన్ యాడ్ చేసే అవకాశం ఉంది.

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు అన్నదమ్ములుగా నటిస్తారని భావిస్తున్నారు. జనతా గ్యారేజ్ సినిమా తరువాత ఎన్టీఆర్ ఇంతవరకు ఏ సినిమాను ఎనౌన్స్ చేయలేదు. ఈ నెల 5న జరగబోయే ఇజం ఆడియో వేడకలో ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అది నందమూరి మల్టీస్టారర్ అయి ఉండాలని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement