తాడిపత్రి పట్టణంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
తాడిపత్రి(అనంతపురం జిల్లా): తాడిపత్రి పట్టణంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ తగాదాలో తమ్ముడి నెత్తిపై అన్న బండరాయితో మోదడంతో తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. వివరాలు..పట్టణంలో ఉన్న రాజా లాడ్జి యజమాని రాజారెడ్డి, శేఖర్‌రెడ్డిలు అన్నదమ్ములు. వీరి మధ్య కొంతకాలంగా ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. గతంలో వీరి మధ్య ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకున్నారు.
ఆదివారం కోపోద్రిక్తుడైన అన్న శేఖర్‌రెడ్డి తమ్ముడిని బండరాయితో మోది చంపాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు శేఖర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.