Property disputes
-
ఆస్తి తగాదాలకు ఇద్దరు బలి
మైలార్‌దేవ్‌పల్లి: ఇంటి విక్రయమై తలెత్తిన తగాదాలు ఇద్దరు వ్యక్తులను బలి తీసుకున్నాయి. ఓ యువకుడు ఇనుప రాడ్డుతో దాడి చేసి తండ్రిని, మేనమామను చంపిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ బాబుల్‌రెడ్డినగర్‌కు చెందిన అల్లంపల్లి లక్ష్మీనారాయణ (55), అనిత దంపతులు. వీరికి కుమారులు మల్లేష్, రాకేష్ (24), కూతురు ఆమని ఉన్నారు. రాకేష్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయభేదాలు.. మల్లేష్ కర్ణాటక రాష్ట్రంలోని ఓ పుణ్య క్షేత్రానికి వెళ్లగా.. ఇంట్లో రాకేష్ తో పాటు తండ్రి లక్ష్మీనారాయణ, తల్లి అనిత, సోదరి ఆమని ఉన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకు అప్పు తీర్చేందుకు లక్ష్మీనారాయణ ఇంటిని ఇదే బస్తీకి చెందిన ఓ వ్యక్తికి విక్రయించారు. అడ్వాన్స్‌గా రూ.50 వేలు తీసుకున్నారు. బ్యాంకులో తాకట్టు పెట్టిన ఇంటి పేపర్లను రూ.15 లక్షలు అప్పు తెచ్చి విడిపించుకున్నారు. అప్పటినుంచి ఇంట్లో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. ఇంటిని రిజిస్ట్రేషన్ చేయాలని అడ్వాన్స్ ఇచి్చన వ్యక్తి పట్టుబడుతున్నాడు. కానీ.. ఇంటి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. దీంతో లక్ష్మీనారాయణ ఏపీలోని మంత్రాలయంలో ఉన్న తన బావమరిది శ్రీనివాసులు (60)æను పిలుపించుకున్నాడు. శనివారం సాయంత్రం ఇంటి విక్రయ విషయంపై మాట్లాడుకుంటున్నారు. అప్పులు ఎలా తీర్చాలని తండ్రీ కొడుకుల మధ్య వివాదం చోటుచేసుకుంది. తండ్రిని రాకేష్ కొట్టుకుంటూ బయటికి గెంటివేశాడు. దీంతో ఆయన ఇంటి మెట్లపై పడిపోయాడు. కిందపడిన లక్ష్మీనారాయణను లేపడానికి బావమరిది శ్రీనివాసులు వచ్చాడు. కోపోద్రిక్తుడైన రాకేష్ ఇంట్లోంచి ఇనుప రాడ్డు తీసుకువచ్చి తండ్రి, మేనమామలపై బలంగా కొట్టాడు. దీంతో వారిద్దరూ తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిపోయారు. నిందితుడు రాకేష్ అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న లక్ష్మీనారాయణ, శ్రీనివాసులును ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. -
దంపతులను బలి తీసుకున్న పాతకక్షలు
అయ్యంకి(మొవ్వ): గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగిన జంట హత్యలు కృష్ణాజిల్లాలో కలకలం రేపాయి. ఆస్తి తగాదాలు, పాత కక్షలు భార్య భర్తలను బలితీసుకున్నాయి. మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో గురువారం చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అయ్యంకి గ్రామానికి చెందిన వీరంకి చిన ఆంజనేయులుకు కుమారులు వీరంకి వీరకృష్ణ, వీరంకి పూర్ణచంద్రరావు, కుమార్తె అమ్ములు ఉన్నారు. ఆంజనేయులుకి గ్రామంలో 3.01 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి వల్ల ఏర్పడిన వివాదాల కారణంగా 2008లో తండ్రి చినఆంజనేయులును, 2012లో తమ్ముడు పూర్ణచంద్రరావును వీరకృష్ణ హత్య చేశాడనే ఆరోపణలొచ్చాయి. అయితే ఈ కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు కేసును కొట్టివేసింది. కాగా, పూర్ణచంద్రరావు హత్యానంతరం అతడి భార్య స్వర్ణ, ముగ్గురు కుమారులు గణేశ్, లోకేశ్, భువనేశ్ అయ్యంకి గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఇటీవల స్వర్ణ తన పొలానికి పట్టాదారు పాసు పుస్తకానికి అప్లయ్ చేయగా లింక్ డాక్యుమెంట్స్ లేవంటూ వీఆర్వో, ఆర్ఐలు రిజక్ట్ చేశారు. దీనిపై వివరణ కోరేందుకు తాజాగా ఆమె తన కుమారులు ముగు్గరితో కలిసి గురువారం మధ్యాహ్నం అయ్యంకిలోని వీఆర్వో కార్యాలయానికి వచ్చింది. ఈ సందర్భంగా పాస్‌పుస్తకాల విషయంలో స్వర్ణ కుటుంబానికి, అక్కడే ఉన్న వీరకృష్ణకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తులైన స్వర్ణ కుమారులు వెంట తెచ్చుకున్న కత్తులతో పెదనాన్న వీరకృష్ణను విచక్షణా రహితంగా నరికి హత్య చేశారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న అన్న సమారాధన కార్యక్రమం వద్ద ఉన్న వీరకృష్ణ భార్య వరలక్ష్మిని సైతం కత్తులతో పొడిచి హత్యచేసి పరారయ్యారు. గుడివాడ డీఎస్పీ శ్రీకాంత్, పామర్రు సీఐ ఎన్.వెంకటనారాయణ, కూచిపూడి ఎస్ఐ డి.సందీప్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. పక్కా ప్లాన్‌తోనే వీరకృష్ణ, వరలక్ష్మి దంపతుల హత్య జరిగినట్లు తెలిపారు. వీరకృష్ణ తమ్ముడి భార్య స్వర్ణ, ఆమె కొడుకులే హత్యలకు కారణమని వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మృతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
తండ్రీ కొడుకుల దారుణ హత్య
హైదరాబాద్(ఉప్పల్): ఉప్పల్‌లో శుక్రవారం తెల్లవారుజామున జంట హత్యలు చోటు చేసుకున్నాయి. గుర్తుతెలియని ఇద్దరు దుండగులు తండ్రీకొడుకుల్ని దారుణంగా చంపేశారు. ఆస్తి తగాదాలే ఈ దారుణానికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఎస్ఓటీ పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, హతుల కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం... ఉప్పల్ గాంధీ బొమ్మ సమీపంలోని హనుమసాయినగర్‌కు చెందిన నర్సింహుల నర్సింహ శర్మ (78) పురోహితుడు. ఆయన భార్య పదేళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు కొన్నాళ్లుగా మరో ప్రాంతంలో ఉంటున్నారు. దీంతో చాలాకాలం నర్సింహ ఒక్కరే హనుమసాయినగర్‌లో ఉన్నారు. ఈ విషయం తెలిసిన చిన్న కుమారుడు, మలేషియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన నర్సింహుల శ్రీనివాస్ (45) తండ్రి బాగోగులు చూడటానికి మూడు నెలల కిందట ఇక్కడికి వచ్చి తండ్రితో కలిసి ఉంటున్నారు. రోజూ మాదిరిగానే శుక్రవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో పని మనిషి ఇంటి గేటు తీసుకుని లోపలకు వెళ్లింది. అప్పటికే ఆ ప్రాంతంలో వేచి ఉన్న ఇద్దరు దుండగులు భుజానికి ఉన్న బ్యాగ్‌తో ఆ ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించారు. పంతులు గారిని పిలవాలంటూ పని మనిషికి చెప్పడంతో ఆమె ‘మీ కోసం ఎవ్వరో వచ్చారు అయ్యగారు’ అంటూ నర్సింహకు చెప్పింది. దీంతో పూజలో ఉన్న ఆయన గది నుంచి బయటకు వచ్చి పోర్టికోలో ఉన్న కుర్చీలో కూర్చున్నారు. ‘ఎవరు మీరు? ఏం కావాలి?’ అని అడుగుతుండగానే ఓ దండగుడు ఆయన సమీపంలోకి వెళ్లి వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. ఏదో జరుగుతోందని భావించిన నర్సింహ్మ గట్టిగా అరిచారు. ఈ అరుపులు విని అక్కడకు వచ్చిన పనిమనిషి జరుగుతోంది చూసి భయంతో అరుస్తూ పరుగులు పెట్టింది. ఈలోపే మరో దుండగుడు తనతో తెచ్చుకుని కత్తితో నర్సింహ గొంతు కోశాడు. దీంతో ఆయన పక్కకు పడిపోయారు. ఈ గొడవ విన్న చిన్న కుమారుడు శ్రీనివాస్ ఇంటి మొదటి అంతస్తు నుంచి హడావుడిగా కిందికి వచ్చాడు. అప్పటికే తమ పని పూర్తి చేసుకుని వెళ్లిపోతున్న దుండగులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో గేటు సమీపంలో శ్రీనివాస్ పైనా వాళ్లు విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేశారు. అక్కడికక్కడే కుప్పకూలిన అతడు కన్నుమూశాడు. ఈలోపు అక్కడకు చేరుకున్న స్థానికులు దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వాళ్లు కత్తులతో బెదిరించడంతో వెనక్కు తగ్గారు. ముఖానికి ఎలాంటి ముసుగులు లేకుండా టీషర్టులు ధరించి వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టడం, తదితర పరిణామాల నేపథ్యంలో వీళ్లు కిరాయి హంతకులై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. జంట హత్యలపై సమాచారం అందుకున్న మల్కాజిగిరి డీసీపీ రక్షితా కె.మూర్తి, ఏసీపీ నరేష్ రెడ్డి, ఉప్పల్ ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. ఇద్దరి మృతదేహాల వద్ద నుంచి బయలుదేరిన పోలీసు జాగిలాలు సమీపంలోనే దుండగులు పడేసిన బ్యాగ్ వరకు వెళ్లి వెనక్కు వచ్చాయి. ఆ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు తెరిచిన చూడగా... అందులో కుంకుమ, పుసుపు, అగర్బత్తీలు కనిపించాయి. ఆస్తి తగాదాలు...కోర్టు వ్యాజ్యాలు నర్సింహకు కొందరితో ఆస్తి తగాదాలతో పాటు కోర్టులో వ్యాజ్యాలు ఉన్నాయి. వాళ్లు రెండేళ్ల క్రితం ఓసారి నర్సింహపై దాడి చేశారు. గొంతు నులిమి హత్య చేయడానికి ప్రయత్నించారని ఆయన కుటుంబీకులు చెబుతున్నారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హతుల ఇంటితో పాటు వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజీ పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే దుండగులు ముగ్గురిగా అనుమానిస్తున్నారు. మూడో వ్యక్తి కాస్త దూరంలో ఉండి ఇద్దరిని నర్సింహ ఇంటికి పంపినట్లు భావిస్తున్నారు. నిందితుల కోసం ఏడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తండ్రి కోసం మలేషియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకుని వచ్చిన శ్రీనివాస్ పాత కక్షలకు బలయ్యాడంటూ కుటుంబీకులు విలపించారు. వారం రోజుల రెక్కీ.. నర్సింహ హత్యకు రంగంలోకి దిగిన దుండగులు వారం రోజుల పాటు పక్కాగా రెక్కీ చేశారు. దీనికోసం వాళ్లు హతుల ఇంటి ఎదురుగానే ఉన్న ఓ డీలక్స్ హాస్టల్లో బస చేశారు. అక్కడ ఉంటూనే ప్రతి రోజూ నర్సింహ ఇంటిని పరిశీలించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎవరెవరు వస్తుంటారు? ఆ ఇంటి పరిసరాలు, చుట్టు పక్కల ప్రాంతాలు ఏ సమయంలో ఎలా ఉంటాయి? తదితర అంశాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. చివరకు తెల్ల వారుజాము సమయమే తమకు అనుకూలమని భావించి శుక్రవారం తమ పని పూర్తి చేసి పారిపోయారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న దుండగుల బ్యాగ్‌లో పూజా సామాగ్రితో పాటు కారం ప్యాకెట్ కూడా ఉన్నట్లు గుర్తించారు. హత్యకు ప్రత్యక్ష సాక్షి అయిన ఆ ఇంటి పని మనిషి నుంచి వాంగ్మూలం సేకరించారు. -
కొడుకే యముడై..
సనత్‌నగర్: కన్నబిడ్డల్ని చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడి విద్యాబుద్ధులు నేర్పించడానికి తండ్రి రెక్కలుముక్కలుగా చేసుకుని కష్టపడతాడు. అలాంటి తండ్రిని వృద్ధాప్యంలో మేమున్నామంటూ ఆదరించి చూసుకోవాలి. కానీ.. ఓ కుమారుడు కర్కశంగా మారాడు. ఆస్తి గొడవలతో కన్నతండ్రినే కడతేర్చాడు. గొడ్డలితో నరికి దారుణంగా చంపిన విషాదకర ఘటన ఆదివారం బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో విమాన్‌నగర్‌లో జరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు చెప్పిన వివరాల ప్రకారం.. బేగంపేట విమాన్‌నగర్‌కు చెందిన అబ్రహం లింకన్ (84) ఆర్మీలో ఉద్యోగ విరమణ అనంతరం బీహెచ్ఈఎల్ పని చేసి అక్కడ రిటైర్డ్ అయ్యారు. ఆయన మొదటి భార్య మహబూబ్‌నగర్‌లో ఉంటోంది. ఆమెకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. వీరిలో కుమారుడు, ఓ కుమార్తె చనిపోయారు. ప్రస్తుతం ఒక కుమార్తె మాత్రమే ఉంది. రెండో భార్య శేరిలింగంపల్లిలో నివాసం ఉంటోంది. ఆమెకు ఒక కుమారుడు కిరణ్ (30), కుమార్తె ఉన్నారు. అబ్రహం లింకన్‌ను ఇద్దరు భార్యలు, పిల్లలు ఎవరూ పట్టించుకోకపోవడంతో విమాన్‌నగర్‌లోని రాహుల్ రెస్టారెంట్లో వంట మనిషిగా పని చేస్తూ అక్కడేనివాసం ఉంటున్నాడు. తండ్రికి తెలియకుండా ప్లాట్ల విక్రయం.. : అబ్రహం లింకన్‌కు షాద్‌నగర్‌లో ప్రభుత్వం నాలుగన్నర ఎకరాల భూమి రిటైర్డ్ ఆర్మీ కోటాలో కేటాయించింది. శేరిలింగంపల్లిలో 200 గజాలవి 2ఖాళీ ప్లాట్లున్నాయి. కొద్ది రోజుల క్రితం రెండో భార్య కుమారుడు కిరణ్ ఈ స్థలాలను తండ్రికి తెలియకుండా నకిలీ గిఫ్ట్ డీడ్‌తో రూ.75 లక్షలకు విక్రయించాడు. అబ్రహాం లింకన్‌కు డబ్బు అవసరం ఉండటంతో ఈ రెండు ప్లాట్లను విక్రయించేందుకు యత్నించగా ఆయన కుమారుడు ఇతరులకు విక్రయించినట్లు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవలతో ఈ స్థలాలు కొన్న వారు మరో రూ.25 లక్షలు ఇస్తామని చెప్పారు. భూమి తన పేరిట రాయాలని.. :కిరణ్ షాద్‌నగర్‌లో ఉండే నాలుగున్నర ఎకరాల భూమి కూడా తన పేరుపై రాయాలని, అదనంగా వచ్చే రూ.25 లక్షలు తనకే ఇవ్వాలని తండ్రిపై ఒత్తిడి తెస్తున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు తీవ్రరూపం దాల్చాయి. ఆదివారం ఉదయం కిరణ్ తనతో పాటు కొడవలిని తీసుకుని విమన్‌నగర్‌లోని తండ్రి వద్దకు వచ్చాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుండగానే కొడవలితో తండ్రి మెడపై నరికాడు. తీవ్ర గాయాలపాలైన అబ్రహం లింకన్‌ను స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మాట వినడం లేదని భార్య దారుణం.. భర్తకు పూటుగా మద్యం తాగించి..
సాక్షి, దేవరకొండ (నల్లగొండ): నాలుగు ఎకరాల భూమిని తన పేరిట పట్టా చేయడం లేదని ఓ వివాహిత దారుణానికి తెగబడింది. మద్యంలో పురుగుల మందు కలిపి భర్తను మట్టుబెట్టింది. ఈ దారుణ ఘటన దేవరకొండ మండలం శేరిపల్లి పెద్దతండాలో గురువారం వెలుగులోకి వచ్చింది. సీఐ బీసన్న, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరిపల్లి పెద్దతండాకు చెందిన రమావత్ మోతీలాల్(45) భార్య లలితతో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. గొడవపడి వేర్వేరుగా.. దంపతుల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకుంటుండడంతో లలిత ఆరేళ్లుగా పిల్లలతో కలిసి హైదరాబాద్‌లోని గుర్రంగూడలో నివాసం ఉంటోంది. అక్కడే కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటుండగా మోతీలాల్ స్వగ్రామంలోనే వ్యవసాయం, కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. బంధువుల శుభకార్యానికి వచ్చి.. కాగా, మోతీలాల్ పేరిట ఉన్న నాలుగు ఎకరాల భూమిని తన పేరిట చేయాలని కొంతకాలంగా లలిత కోరుతోంది. ఇదే విషయం ఇద్దరి మధ్య తరచూ గొడవలు కూడా జరుగుతున్నాయి. కాగా బుధవారం స్వగ్రామమైన శేరిపల్లి పెద్ద తండాలో బంధువులు శుభకార్యానికి లలిత హైదరాబాద్ నుంచి వచ్చింది. రాత్రి సమయంలో ఇదే అదునుగా భావించిన లలిత మద్యంలో పురుగుల మందు కలిపి భర్తకు తాగించింది. దీంతో మోతీలాల్ మృతిచెందాడు. అతిగా మద్యం తాగి మృతిచెందాడని.. కాగా, గురువారం తెల్లవారుజామున లలిత బోరున విలపిస్తుండడంతో ఇరుగుపొరుగు వచ్చారు. ఏం జరిగిందని ఆరా తీయగా అతిగా మద్యం తాగి తన భర్త మోతీలాల్ మృతిచెందాడని తెలిపింది. లలిత ప్రవర్తనపై అనుమానం వచ్చిన బంధువులు నిలదీయడంతో మద్యంలో పురుగుల మందు కలిపి హత్య చేసినట్లు నేరం అంగీకరించింది. హైదరాబాద్‌లో లలిత మరొకరితో సఖ్యతగా మెలుగుతూ మోతీలాల్‌ను మట్టుబెట్టిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సమాచారం మేరకు సీఐ బీసన్న ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి సోదరుడు శివరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ బీసన్న పేర్కొన్నారు. కాగా, నేరం అంగీకరించిన నిందితురాలు లలితను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. చదవండి: గిట్టనివారు చేతబడి, మంత్రాలు చేస్తున్నారని.. మూడేళ్లలో.. -
కాల్ రికార్డర్‌తో కన్నమేశాడు.. భార్యతో కలిసి తండ్రి ఇంట్లోనే..
సాక్షి, హైదరాబాద్: ఆస్తి వివాదాల నేపథ్యంలో తండ్రినే లక్ష్యంగా చేసుకున్నాడో కుమారుడు.. ఆయన లేని సమయం చూసి భార్యతో కలిసి ఇంటికి కన్నం వేశాడు. దీనికోసం ఆటోమేటిక్ కాల్ రికార్డర్ యాప్‌ను వినియోగించాడు. ఈ విషయం గుర్తించిన తండ్రి సోమవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమారుడు చేసిన పనికి బాధితుడు కుమిలిపోతూ పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ►కరీంనగర్ పట్టణానికి చెందిన వైకుంఠం అనే వ్యక్తికి ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు హైదరాబాద్‌లో ఉంటున్నారు. రెండో అతను కరీంనగర్‌లోనే వేరుగా నివసిస్తున్నాడు. స్థిరాస్తులకు సంబంధించిన వైకుంఠానికి కుమారులతో తరచూ వాగ్వాదాలు జరుగుతుండేవి. ఇవి వివాదంగా మారడంతో తండ్రి వద్ద ఉన్న సొత్తును కాజేయాలని రెండో కుమారుడు కుట్ర పన్నాడు. దీనికి అతడి భార్య కూడా సహకరించింది. వైకుంఠం ఎవరెవరితో సంప్రదిస్తున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? తెలుసుకోవడానికి ఇతగాడు ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ యాప్‌ను వాడాడు. ►వైకుంఠానికి తెలియకుండా, అనుమతి లేకుండా అదను చూసుకుని ఫోన్లో దీన్ని ఇన్‌స్టల్ చేశాడు. రికార్డు అయిన ప్రతి కాల్ తన ఈ– మెయిల్ రూపంలో తన మెయిల్ ఐడీకి చేరేలా సింక్ చేశాడు. ఇలా తన ఈ– మెయిల్ ఐడీకి వస్తున్న ప్రతి కాల్‌ను రెండో కుమారుడు వినేవాడు. వైకుంఠం ఇటీవల హైదరాబాద్‌లోని కుమారుల వద్దకు రావాలని భావించారు. ఈ విషయం వారికి ఫోన్లో చెప్పగా... వాళ్లు ఇంటికి తాళాలు పక్కగా వేయాలని, వాటిని భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. ►వైకుంఠం ఆ తాళాలను ఫలానా రహస్య ప్రాంతంలో దాచి వస్తానంటూ బదులిచ్చాడు. ఈ సంభాషణ మొత్తం ఆటోమేటిక్ కాల్ రికార్డర్ యాప్ ద్వారా రికార్డు కావడంతో పాటు రెండో కుమారుడి మెయిల్‌కు చేరింది. అలా విషయం తెలుసుకున్న అతగాడు భార్యతో కలిసి తండ్రి ఇంటికి వెళ్లాడు. రహస్య ప్రాంతం నుంచి తాళాలు తీసుకుని ఇంట్లోకి ప్రవేశించారు. ►బీరువా తెరిచి అందులోని రూ.25 లక్షల విలువైన నగదు, నగలు కాజేశారు. ఆపై యథావిధిగా తాళాలు వేసి ఆ రహస్య ప్రాంతంలోనే పెట్టేశారు. భార్యతో కలిసి హైదరాబాద్ వచ్చిన వైకుంఠం కొన్ని రోజులకు కరీంనగర్‌కు తిరిగి వెళ్లారు. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నా.. బీరువాలో ఉండాల్సిన డబ్బు, బంగారంతో పాటు ఆస్తి పత్రాలు ఆయనకు కనిపించలేదు. ►ఈ విషయాన్ని హైదరాబాద్‌లో ఉన్న కుమారులకు చెప్పిన ఆయన అసలు ఏం జరిగి ఉంటుందో ఆలోచించారు. తన ఫోన్‌ను, అందులోని యాప్స్‌ను నిశితంగా గమనించిన వైకుంఠం.. ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ యాప్ ఉండటాన్ని గుర్తించారు. దాన్ని తెరిచి అధ్యయనం చేయగా.. రెండో కుమారుడి ఈ– మెయిల్ ఐడీతో సింకై ఉన్నట్లు తెలుసుకున్నారు. తన సంభాషణలు విన్న అతగాడు ఈ పని చేసినట్లు నిర్ధారించుకుని సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
కన్నవారికే ‘ప్రాణ భయం’ ..
సాక్షి, నాగోలు(హైదరాబాద్): తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుమారుడు ఆస్తి కోసం వృద్ధ తల్లిదండ్రులను ఇంట్లో నుంచి గెంటేశాడు. అంతే కాకుండా వేధింపులకు గుర్తి చేస్తున్న తన కుమారుడిపై తల్లి ఫిర్యాదు చేసిన సంఘటన గురువారం ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం... మాన్సూరాబాద్ శ్రీరాంనగర్‌కాలనీ చెందిన కౌసల్యదేవి, లింగయ్య భర్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురి వివాహం జరిగింది. పెద్ద కుమారుడు భార్యాపిల్లలతో మరో ప్రాంతంలో ఉంటున్నాడు. చిన్న కుమారుడు రాజశేఖర్ తల్లిదండ్రులతో ఉంటూ ఆస్తి కోసం ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. రెండేళ్లుగా తమను చీకటి గదిలో బంధించి సరిగా తిండి పెట్టకుండా వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. చిన్న కుమారుడు రాజశేఖర్ నుంచి తమకు ప్రాణహాని ఉందన్నారు. తమకు రక్షణ కల్పించాలని ఎల్బీనగర్ పోలీసులను వేడుకున్నారు. ఈ మేరుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మాటల్లో దించి.. మాయచేసి.. -
జూబ్లీహిల్స్: లైసెన్స్డ్ గన్‌కు పని చెప్పమంటావా..?
సాక్షి, బంజారాహిల్స్: తాము కోరుకున్న విధంగా ఆస్తి పంపకాలు చేయకపోతే అంతం చేస్తామంటూ గ్లోబల్ హాస్పిటల్స్ గ్రూప్ ఫౌండర్ చైర్మన్, డైరెక్టర్ డా.కంచర్ల రవీంద్రనాథ్ను బెదిరించిన వ్యవహారంలో ఆయన అల్లుడు, వియ్యంకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెం 25లో ఉంటున్న డా.రవీంద్రనాథ్‌కు ఇటీవల ఆస్తి పంపకాల్లో కుటుంబ సభ్యులతో గొడవలు జరుగుతున్నాయి. తన ఆస్తుల్లో సుమారు 70 శాతం గ్లోబల్ యూనివర్సిటీ ఫౌండేషన్‌కు ఇస్తానని డాక్టర్ రవీంద్రనాథ్ చెప్పడంతో కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఎమ్మెల్యే కాలనీలో నివసించే అల్లుడు పొట్లపల్లి సూరజ్‌తేజ్ జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ రవీంద్రనాథ్ ఇంటికి వచ్చాడు. రావడంతోనే ఇద్దరి మధ్య ఆస్తుల విషయమై గొడవ జరిగింది. తాము చెప్పినట్లు ఆస్తులను సమానంగా పంచకపోతే అంతు చూస్తానని, తన వద్ద లైసెన్స్డ్ గన్ కూడా ఉందని దానికి పని చెప్పమంటావా అంటూ బెదిరించాడు. చెన్నైలో ఉంటున్న తన కుమారుడి మామ(వియ్యంకుడు) పరుచూరి రాజారావుతో చేతులు కలిపిన అల్లుడు సూరజ్‌తేజ్ కొంత కాలంగా తన ఫోన్‌ను కూడా హ్యాక్ చేసి తన కదలకలను గమనిస్తున్నాడని మూడో వ్యక్తికి తాను మాట్లాడుతున్న విషయాలను చేరవేస్తున్నారన్నాడు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ డాక్టర్ రవీంద్రనాథ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని, తన అడ్డు తొలగించుకునేందుకు అల్లుడు, వియ్యంకుడు కిరాయి మనుషులను ఏర్పాటు చేశారని ఆరోపించాడు. మూడు నెలల్లోగా ఆస్తుల పంపకాలు చేయకపోతే హత్య చేసేందుకు కూడా వెనుకాడబోమని బెదిరింపులకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు నిందితుడు సూరజ్‌తేజ్, వియ్యంకుడు రాజారావులపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. చదవండి: బల్దియా చరిత్రలోనే మొదటిసారి.. ప్రతిపక్షాల విమర్శలు విచ్చలవిడిగా డ్రోన్ల వినియోగం.. హైదరబాద్కూ ముప్పు! -
ఆస్తి మొత్తం మూడో కూతురికేనా.. మాకేదీ!
సాక్షి,పాలకుర్తి: ఆస్తి పంపకాల్లో వచ్చిన విభేదాల కారణంగా కన్నతండ్రి అంత్యక్రియలను సొంత కూతుళ్లే అడ్డుకున్నారు. ఆస్తిని సమానంగా పంచాల్సిందేనంటూ పట్టుబట్టారు. జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన దీకొండ చంద్రయ్య(74)కు నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుమారులు లేరు. చంద్రయ్య అనారోగ్యానికి గురైనప్పటి నుంచి మూడో కుమార్తె ఆయన బాగోగులు చూస్తోంది. ఈ క్రమంలో చంద్రయ్య అనారోగ్యంతో మంగళవారం ఉదయం మృతి చెందారు. తండ్రి ఆస్తి మొత్తం మూడో కుమార్తె తీసుకుందని ఆరోపిస్తూ మిగతా కూతుళ్లు దహన సంస్కారాలను అడ్డుకున్నారు. ఆస్తిని సమానంగా పంచాలన్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్ఐ గండ్రాతి , పాలకుర్తి సర్పంచ్ వీరమనేని యాకాంతరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దహన సంస్కారాలు పూర్తయ్యాక మాట్లాడుదామని నచ్చజెప్పడంతో కూతుళ్లు అంగీకరించారు. తల్లిదండ్రుల ఆస్తి కోసం కుమార్తెలు గొడవకు దిగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
నా ఇంట్లో నేను గోడ దూకితే తప్పేంటి?
సాక్షి, హైదరాబాద్ : దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు కుమారులు అరుణ్ కుమార్, ప్రభుల మధ్య ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తనపై అన్న ప్రభు చేసిన ఆరోపణలపై దాసరి అరుణ్ స్పందించారు. ఇంటికి గోడ దూకి వెళ్లింది నిజమేనని, కానీ దాడిమాత్రం చేయలేదని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్ ఫిల్మ్‌ఛాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తమ మధ్య ఆస్తి గొడవలు తప్ప మరేం లేవని స్పష్టం చేశారు. దాసరి ప్రభు తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు. (చదవండి : దాసరి ఇంట పంచాయితీ: పోలీసులకు ఫిర్యాదు) ‘ఈ నెల 24న గోడ దూకి ఇంటికి వెళ్లింది నిజమే. ఇటీవల నాకు కొరియర్ వచ్చింది. తీసుకోవడానికి వెళ్లాను. బెల్ కొడితే డోర్ తీయలేదు. అందుకే గోడదూకాను. లోపలి వెళ్లాక ప్రభు వచ్చాడు. నా డాక్యుమెంట్ ఇస్తే వెళ్లిపోతానని చెప్పాను. కానీ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ముందే నా డాక్యుమెంట్ తీసుకొని వెళ్లాను. నా ఇంట్లో నేను గోడ దూకితే తప్పేంటి? నేను మద్యం తాగి గోడదూకితే పడిపోవాలి కదా? పోలీసుల ముందు కొడితే అప్పుడే అరెస్ట్ చేసేవాళ్లు కదా? ప్రభు ఉంటున్న ఇల్లు ముగ్గురిది. మా సోదరితో పాటు నాకు దాంట్లో పొత్తు ఉంది. అన్నయ్యకు,నాకు, సోదరికి ఎలాంటి వివాదాల్లేవు. ఆయన డిప్రెషన్లో ఉన్నారు. అందుకే ప్రతిసారి మీడియా, పోలీసుల దగ్గరకు వెళ్తున్నారు. ఆస్తి వివాదంపై సినీ పెద్దలు జోక్యం చేసుకొని పరిష్కరిస్తామంటే నాకెలాంటి అభ్యంతరం లేదు’ అని అరుణ్ కుమార్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఇల్లు విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఇల్లు నాదంటే నాదంటూ.. అరుణ్-ప్రభు తగువులాడుకుంటున్నారు. ఈ క్రమంలో దాసరి అరుణ్‌పై ఆయన సోదరుడు ప్రభు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరుణ్ అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి బీరువా తెరిచేందుకు ప్రయత్నించాడని.. అడ్డుకున్న తమపై దాడికి చేశాడని ప్రభు ఫిర్యాదులో పేర్కొన్నారు. మా ఇంటికి కాలింగ్ బెల్ లేదు : దాసరి ప్రభు కాగా, దాసర్ అరుణ్ ఆరోపణపై ఆయన సోదరుడు ప్రభు స్పందించారు. తాను ఎలాంటి డిప్రెషన్లో లేనన్నారు. అరుణ్ కావాలనే అర్థరాత్రి గోడదూకి ఇంట్లోకి వచ్చాడని ఆరోపించారు. తమ ఇంటికి కాలింగ్ బెల్ లేదని, అలాంటప్పుడు ఆయన కాలింగ్ బెల్ ఎలా కొట్టాడని ప్రశ్నించారు.తనకు ఫోన్ చేస్తే కచ్చితంగా గేట్లు తీసేవాడినన్నారు. అరుణ్ వెనుక కొంతమంది ఉండి ఇలా మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. తాను ఆర్థికంగా బాగాలేనని, అందుకే సినీపెద్దలను ఆశ్రయించానని చెప్పారు. -
ఆస్తి తగదా: మీడియా ముందుకు దాసరి అరుణ్
సాక్షి, హైదరాబాద్ : దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు కుమారులు అరుణ్ కుమార్, ప్రభుల మధ్య ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో దాసరి అరుణ్‌పై ఆయన సోదరుడు ప్రభు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరుణ్ అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి బీరువా తెరిచేందుకు ప్రయత్నించాడని.. అడ్డుకున్న తమపై దాడికి చేశాడని ప్రభు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై అన్న ప్రభు చేసిన ఆరోపణపై అరుణ్ స్పందించారు. ఈ రోజు మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు చెబుతానని పేర్కొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు దాసరి అరుణ్ మీడియా ముందుకు రానున్నారు. (చదవండి : దాసరి ఇంట పంచాయితీ: పోలీసులకు ఫిర్యాదు) జూబ్లీహిల్స్‌లోని ఇల్లు విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఇల్లు నాదంటే నాదంటూ.. అరుణ్-ప్రభు తగువులాడుకుంటున్నారు. ఆ ఇల్లు తన కూతురి పేరు మీద దాసరి వీలునామా రాశారని ప్రభు చెబుతున్నారు. సినీ పెద్దలు కలగజేసుకొని తనకు న్యాయం చేయాలని దాసరి పెద్ద కుమారుడు ప్రభు కోరుతున్నారు. -
దాసరి కుటుంబంలో ఆస్తి పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: దివంగత దర్శకనిర్మాత దాసరి నారాయణరావు ఇంట ఆస్తి వివాదం మరోసారి రాజుకుంది. ఆయన కొడుకులు దాసరి అరుణ్ కుమార్, ప్రభుల మధ్య ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో దాసరి అరుణ్‌పై ఆయన సోదరుడు ప్రభు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 24న రాత్రి అరుణ్ తన ఇంటి గేటు దూకి లోపలికి వచ్చి తనపై, తన కుటుంబసభ్యులపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభు ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా తన తమ్ముడు నుంచి ప్రాణహానీ ఉందని పోలీసులే రక్షణ కల్పించాలని కోరారు. సినీ ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఈ వివాదాన్ని పరిష్కరించాలని ప్రభు విజ్ఞప్తి చేశారు. సినీ ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్‌గా నిలిచినటువంటి దివంగత దాసరి నారాయణరావు కుటుంబంలో ఆస్తి పంచాయితీ నెలకొనడం పట్ల ఆయన అభిమానులు, సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదానికి త్వరగా ఫుల్స్టాప్ పెట్టి ఆయన గౌరవాన్ని కాపాడాలని పలువురు వాపోతున్నారు. ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ.. ‘ ఈ నెల 24న రాత్రి దాసరి అరుణ్‌తో పాటు అతడి డ్రైవర్ మా ఇంటి గేటు దూకి లోపలికి వచ్చాడు. మద్యం తాగి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతూ నా భార్య, నాపై దాడి చేశాడు. అంతేకాకుండా మా నాన్న బీరువా తెరవడానికి ప్రయత్నించాడు. మా నాన్న(దాసరి) రాసిన వీలునామా ప్రకారం ఆయన మనవరాలు, నా కూతురు ఈ ఇంటికి అర్హురాలు. ఆస్తుల కోసం దాసరి అర్జున్ దౌర్జన్యం చేస్తున్నాడు. సి. కళ్యాణ్, మురళీమోహన్, మోహన్‌బాబు వంటి సినీ పెద్దలు ఈ విషయంపై స్పందించి పరిష్కరించాలి. అదేవిధంగా దాసరి అరుణ్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం’ అని అన్నారు. -
స్పృహ తప్పడంతో చనిపోయాడనుకుని..
సాక్షి, యలహంక(కర్ణాటక) : ఆస్తి అమ్మకానికి నిరాకరించాడని అక్క సొంత తమ్మున్ని హతమార్చడానికి పన్నాగం పన్నగా, మహిళతో పాటు నలుగురు సుపారి గ్యాంగ్ సభ్యులను యలహంక పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు యలహంక బిబి రోడ్డులో నివాసముంటున్న సందీప్‌రెడ్డి అక్క సుమలత. ఆమె భర్త క్యాట్ రాజు ఓ కేసులో నిందితునిగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతన్ని జైలు నుంచి బెయిలుపై విడిపించడానికి డబ్బు కావాలని అందుకు తమ్ముడు సందీప్‌రెడ్డికి సంబంధించిన ఆస్తిని అమ్మమని అక్క ఒత్తిడి చేస్తోంది. అందుకు తమ్ముడు నిరాకరిస్తున్నాడు. దీంతో ఎలాగైనా తమ్మున్ని హతమార్చి ఆస్తి కాజేసి అమ్మి వచ్చిన డబ్బుతో జైలులో శిక్ష అనుభవిస్తున్న భర్తను విడిపించుకోవాలని దురాలోచన చేసింది. తమ్మున్ని చంపే పనిని ఒక కిరాయి ముఠాకు అప్పగించింది. (ఎంపీ రంగయ్యకు ప్రధాని మోదీ లేఖ) అందరూ కలిసి సందీప్ రెడ్డిని హతమార్చడానికి పథకం రచించారు. మే 29వ తేదీ అర్ధరాత్రి మారణాయుధాలతో సందీప్ రెడ్డిపై దాడి చేయడంతో అతడు గాయపడి స్పృహ తప్పిపడిపోయాడు. చనిపోయాడని భావించి వెళ్లిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న సందీప్ రెడ్డి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ సంఘటనపై యలహంక పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారించగా అక్క సుమలత, కిరాయి మూకలు మంజు, గౌతమ్, వినాయక్, మౌలాలి ఖాన్ల పాత్ర బయటపడడంతో వారిని అరెస్టు చేశారు. డిసిపి భీమాశంకర్, ఎసిపి శ్రీనివాస్ సూచనలతో సిఐ రామకృష్ణ రెడ్డి నిందితులను అరెస్టు చేశారు. (కొద్ది సేపట్లో భర్త రెండో పెళ్లి.. ) దెయ్యం విడిపిస్తానని లైంగికదాడి మైసూరు: దెయ్యం విడిపిస్తానని చెప్పి యువతిపై ఒక ధర్మ గురువు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మైసూరు జిల్లాలో జరిగింది. చిల్కుంద గ్రామానికి చెందిన యువతి మానసికంగా ఇబ్బంది పడుతోంది. ఆమెకు దయ్యం పట్టిందని భావించిన బంధువు... హణసూరు లాల్‌బన్ వీధికి చెందిన ధర్మగురువు జబీవుల్లా వద్దకు తీసుకొచ్చాడు. ఆమెపై మంత్ర ప్రయోగం జరిగిందని, దయ్యం పట్టుకుందని పిరియాపట్టణ దర్గా వద్దకు తీసుకొస్తే దెయ్యాన్ని విడిపిస్తానని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో బంధువు ఆ యువతిని దర్గా వద్దకు తీసుకెళ్లాడు. యువతి వద్ద ఉంటే నీకూ దెయ్యం పడుతుందని బంధువును దూరంగా పంపించాడు. అనంతరం యువతికి స్నానం చేయాలనే నెపంతో తీసుకెళ్లి జబీవుల్లా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ పైశాచిక కృత్యంతో బెదిరిపోయిన యువతి జరిగిన సంగతిని తన తండ్రికి తెలిపింది. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుణసూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి జబీవుల్లాను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. -
హత్యా..? ఆత్మహత్యా?
సాక్షి, మనూరు(నారాయణఖేడ్): అనుమానస్పద స్థితిలో తల్లి కొడుకు మృతిచెందిన సంఘటన నాగల్గిద్ద మండలం కరస్‌గుత్తి గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. కరస్‌గుత్తి గ్రామానికి చెందిన చింతాకి వెంకట్‌రెడ్డి భార్య కవిత(28), నాలుగేళ్ల కుమారుడు అయిన దినేష్‌రెడ్డితో కలిసి బుధవారం మధ్యాహ్నం సమయంలో కిరోసితో నిప్పు అంటించుకొని చనిపోయింది. భార్యను కుమారుడిని భర్తే చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం బుధవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. తొమ్మిదేళ్లు హైదరాబాద్‌లో నివాసం.. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని ఔరాద్ తాలుక పరిధిలోని బిజల్‌వాడి గ్రామానికి చెందిన తిప్పారెడ్డి, ఉక్కమ్మ దంపతుల కుమార్తె కవిత. ఈమెకు 2009లో నాగల్గిద్ద మండలం కరస్‌గుత్తి గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డితో వివాహం జరిగింది. వివాహం అనంతరం బతుకుదెరువు కోసం తొమ్మిది సంవత్సరాలు హైదరాబాద్‌లో ఉన్నారు. ఏడాది క్రితం స్వగ్రామం కరస్గుత్తికి వచ్చారు. ఆస్తి భార్యపేరు మీదకి రావడంతో గొడవలు.. గ్రామంలో వెంకట్‌రెడ్డికి ఉన్న ఎనిమిది ఎకరాల భూమిలో కొంత భాగం అమ్మాడు. వచ్చిన డబ్బులతో ‘తుఫాన్’ వాహనం కొనుగోలు చేసిన వెంకట్‌రెడ్డి, తానే స్వయంగా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మరికొంత భూమిని సైతం అమ్మడానికి ప్రయత్నించడంతో కుటుంబ సభ్యులు నాలుగు ఎకరాల మేర భూమిని వెంకట్‌రెడ్డి భార్య కవిత పేరుమీదకు మార్చారు. దీంతో అప్పటి నుంచి పలుమార్లు గొడవలు పడినట్లు స్థానికులు పేర్కొన్నారు. గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు అనుమానాస్పద మృతి సంఘటనపై గ్రామంలో తీవ్ర విషాధ ఛాయలు అలుముకున్నాయి. మృతిరాలితోపాటు నాలుగేళ్ల బాలుడు సైతం మృత్యువాత పడటాని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే గ్రామంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం మూడో సారి కావడంతో గ్రామంలో తీవ్ర చర్చనీయాంశమైంది. భర్తను అదుపులోకి తీసుకున్నాం: సీఐ హత్యకు సంబంధించి తాము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మృతురాలి భర్త చింతాకి వెంకట్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని ఆయన వెల్లడించారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కేసు నమోదు చేస్తామన్నారు. ఆయన వెంట స్థానిక ఎస్ఐ శేఖర్, పోలీసు సిబ్బంది ఉన్నారు. మృతిపై పలు అనుమానాలు మృతి సంఘటనపై స్థానికులతోపాటు మృతురాలి కుటుంబ సభ్యులు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. మృతి చెందిన సంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. హత్య చేసిన అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసి దగ్ధం చేశారని అభిప్రాయపడ్డారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడితే ఇళ్లంతా పలు ఆనవాళ్లు కనిపించేవని కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. పక్కనే ఉన్న బట్టలు సైతం కాలిపోకుండా ఉండటమే ఇందుకు నిదర్శనమంటున్నారు. కిరోసిన్ కాకుండా పెట్రోల్ వాడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో విచారణ సంఘటనపై పలు అనుమానాలు బలపడటంతో నారాయణఖేడ్ సీఐ వెంకటేశ్వర్రావు క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌లను రప్పించి విచారణ చేయించారు. ఇందుకు సంబంధించిన పలు వస్తువులను సైతం సేకరించారు. కాగా తనిఖీకి వచ్చి డాగ్ ఇంట్లో తిరుగుతూ ఎదురుగా ఉన్న ఓ ఇంటివద్ద నుంచి నేరుగా కరస్‌గుత్తి పీడబ్ల్యూడీ రోడ్డుకు వెళ్లి కూర్చుంది. -
పెళ్లయిన రెండు నెలలకే కాటికి
సాక్షి, గిద్దలూరు: పెళ్లి బాజాలు చప్పుడు ఇంకా చెవుల్లో రింగుమంటూ ఉండగానే.. ఆ ఇళ్లలో చావు డప్పు మోగింది.. కనీసం రెండు నెలలైనా కలిసి కాపురం చేయక ముందే నవ దంపతులు కాటికి పయనమయ్యారు.. ఆనందం నిండాల్సిన లోగిళ్ళలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. కళకళలాడుతూ తిరగాల్సిన కొత్త జంట విగత జీవులుగా మారారు. ముళ్ల పొదల్లో నిర్జీవంగా పడి ఉన్న మృతదేహాలను చూసి, వారి కన్నపేగులు తల్లడిల్లిపోయాయి. ఆషాడ మాసమని దూరంగా ఉన్న కొత్త జంట ఒకే చోట శవాలుగా దర్శమివ్వడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. వారి రోధనలు తీరు చూసి అక్కడి వారికి కంటనీరు ఆగలేదు. కట్టుకున్న భార్యను బండరాయితో మోది చంపిన భర్త ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం గిద్దలూరు మండలంలో కలకలం రేపింది. పెళ్లయి రెండు నెలలు కాకముందే నూతన జంట పరలోకాలకు పయనం కావడం రెండు గ్రామాల్లో తీవ్ర విషాదం నింపింది. సేకరించిన వివరాల ప్రకారం.. గిద్దలూరు మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన పిక్కిలి కాశయ్య అంకాలమ్మ దంపతుల కుమారుడు రామయ్య (22) ప్రొక్లెయిన్ డ్రైవరుగా పని చేస్తుంటాడు. అతడికి ఈ ఏడాది మే 19న అదే మండలం ఆదిమూర్తిపల్లెకు చెందిన మండ్ల శ్రీనివాసులు, రమాదేవి దంపతుల కుమార్తె చంద్రకళ (19)తో వివాహమైంది. ఆషాఢం ప్రారంభం కావడంతో చంద్రకళ వారం రోజుల కిందట పుట్టింటికి వెళ్లింది. ఈనెల 9వ తేదీ ఉదయం రామయ్య అత్తింటికి వెళ్లాడు. కంభంలో తన సోదరి ఇంటికి వెళ్లి ఫొటోలు దిగాలని చెప్పి చంద్రకలను బైక్‌పై తీసుకువచ్చాడు. కానీ, కంభం వైపు వెళ్లకుండా బోదివాగు సమీపంలోని తమ పొలం వద్దకు తీసుకెళ్లాడు. బుధవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు వారు రామయ్య, చంద్రకళలు పక్కపక్కనే విగత జీవులుగా పడి ఉండటం చూసి, పోలీసులకు సమాచారం అందించారు. చంద్రకళ మృతదేహంపై ఉన్న గాయాలు, ఘటనా స్థలంలో గుర్తించిన రక్తపు మరకలు ఉన్న బండరాయి, పురుగుల మందు డబ్బాను పోలీసులు పరిశీలించారు. రామయ్యే బండరాయితో తలపై మోది చంద్రకళను హతమార్చాడని, ఆపై పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే నిర్ధారణకు వచ్చారు. ఎస్సై సమందర్‌వలి సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు పట్టణంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. యర్రగొండపాలెం సీఐ మారుతికృష్ణ గిద్దలూరు పోలీసుస్టేషన్‌కు వచ్చి ఘటనకు గల కారణాల పై విచారణ చేపట్టారు. ఆస్తి తగాదాలే కారణమా..? ఆస్తి తగాదాల వల్ల నా బిడ్డను చంపి ఉంటారని చంద్రకళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ అల్లుడు రామయ్యకు అతడి తండ్రి కాశయ్యతో ఆస్తి పంపకాల విషయంలో ఘర్షణలు జరిగాయని, ఆ విషయంలో మానసికంగా ఒత్తిడికి గురైన రామయ్య తన కుమార్తెను చంపి ఉంటారని వారు పేర్కొంటున్నారు. తమ కుమార్తె జీవితంపై ఎన్నో కలలు కన్న మండ్ల శ్రీను, రమాదేవి దంపతులు తమ కూతురు సుఖంగా ఉంటుందని నమ్మి పక్కనే ఉన్న గ్రామంలో వ్యక్తికిచ్చి వివాహం చేశారు. ఊరికి దగ్గరే కుమార్తె ఉంటే కళ్ల ముందే ఉంటుందని భావించారు. అయితే తమ కుమార్తె ఇలా కట్టుకున్న భర్త చేతిలోనే హత్యకు గురికావడాన్ని జీర్ణించుకోలేక హత్య జరిగిన ప్రదేశంలో కుమార్తె మృతదేహం వద్ద కన్నీరు మున్నీరు అయ్యేలా విలపించారు. వారి ఆర్తనాదాలను చూసిన బందుమిత్రులతో పాటుగా, గ్రామస్తుల హృదయాలు చలించిపోయాయి. చుట్టు పక్క గ్రామాలల్లోని ప్రజలు సంఘటనా స్థలం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చి మృతుల తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేశారు. -
అన్నను హత్య చేసిన తమ్ముడు
పోడూరు(ప.గో జిల్లా) : పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం పెనుమదం గ్రామం చిలకరత్నం పేటలో విషాదం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాల కారణంగా సొంత అన్ననే తమ్ముడు హత్య చేశాడు. ఆస్తితగాదాల నేపథ్యంలో తమ్ముడు రంగినీడి దుర్గారావు-అన్న రంగినీడి నాగేశ్వరరావు(34)ను ఇనుప రాడ్‌తో తల పై కొట్టి హత్య చేశాడు. పోడూరు పోలీసులు మర్డర్ (302) కేసు నమోదు చేసి దుర్గారావును అరెస్టు చేశారు. -
మహిళ దారుణ హత్య
తోటపల్లిగూడూరు: ఆస్తి తగాదాల నేపథ్యంలో మండంలోని నరుకూరుకు చెందిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసుల కథనం మేరకు.. నరుకూరు పంచాయతీ తూర్పు గమళ్లపాళెంకు చెందిన వేగూరు వెంకటరమణయ్య, వేగూరు బలరామయ్య కుటుంబాల మధ్య కొద్ది కాలంగా ఆస్తి వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఇటీవల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో వేగూరు వెంకటరమణయ్య భార్య పద్మమ్మ (40) శనివారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైంది. పాత కక్షలు, ఆస్తి వివాదాల నేపథ్యంలో వేగూరు బలరామయ్య, వేగూరు పద్మమ్మ, వేగూరు భాస్కర్, వేగూరు శివకుమార్, వేగూరు శ్రీహరి ఇంట్లో ఒంటరిగా ఉన్న పద్మమ్మ రాడ్లతో తీవ్రంగా దాడిచేసి దారుణంగా హత మార్చారు. పద్మమ్మ కుమారుడు వేగూరు సతీష్ ఆదివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు మేరకు.. నెల్లూరురూరల్ డీఎస్సీ రాఘవరెడ్డి, కృష్ణాపట్నం పోర్టు సీఐ శ్రీనివాసరావు, ఎస్సై శివకృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని హత్యకు దారి తీసిన వివరాలను సేకరించారు. శవపంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు నిందితులు వేగూరు బలరామయ్య, పద్మమ్మ, భాస్కర్, శివకుమార్, శ్రీహరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కృష్ణపట్నం పోర్టు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న నెల్లూరురూరల్ డీఎస్పీ రాఘవరెడ్డి కృష్ణపట్నం పోర్టు సీఐ శ్రీనివాసరావు -
మాటు వేసి.. మట్టుబెట్టి
కాజీపేట: ఆస్తి కోసం కుటుంబ సభ్యులు అమానవీయంగా ప్రవర్తించారు. పైసల కోసం పేగు బంధాన్ని మరిచారు. చనిపోతే తలకొరివి పెట్టి పున్నామ నరకం నుంచి రక్షిస్తారనున్నకున్న కుమారులే కన్నతండ్రితో పాటు పినతల్లిని హత్య చేశారు. ఈ సంఘటన వరంగల్ నగరంలోని కాజీపేట పరిధిలోని సోమిడి శివారులో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మృతుల బంధువుల కథనం ప్రకారం.. సోమిడి శివారులో నివాసముంటున్న సుంచు ఎల్లయ్య(72), ఎల్లమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. గతంలో ఎల్లయ్య రైల్వేలో ఉద్యోగం చేసి ఉద్యోగ విరమణ పొందాడు. 12 ఏళ్ల క్రితం భార్య ఎల్లమ్మ మృతి చెందడంతో హసన్పర్తికి చెందిన పూలమ్మ(60)ను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కుమారులు ముగ్గురు తరచూ ఎల్లయ్యతో ఆస్తి, పింఛన్ డబ్బుల కోసం గొడవపడుతుడేవారు. దీంతో అతడు సోమిడి శివారులో వేరొక ఇల్లు నిర్మించుకుని నివాసముంటున్నాడు. ఈ క్రమంలోనే సోమిడిలో ఎకరం భూమిని ఎల్లయ్య ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి డెవలప్మెంట్ కోసం ఇచ్చాడు. భూమి అమ్మగా వచ్చిన డబ్బుల్లో ముగ్గురు కుమారులకు వాటా ఇవ్వడంతోపాటు తండ్రి వాటా తీసుకున్నాడు. పింఛన్ డబ్బులు తమకు ఇవ్వకపోవడమేగాక భూమి డబ్బుల్లో కూడా వాటా తీసుకోవడంతో కోపం పెంచుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున వృద్ధ దంపతుల ఇంటి ఆవరణలో మాటు వేసి, పూలమ్మ బయటికి రాగానే గొడ్డళ్లు, కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఆ తర్వాత ఇంట్లో నిద్రిస్తున్న ఎల్లయ్యను హత్య చేశారు. ఉదయం పాలు పోయడం కోసం వచ్చిన మహిళ ఆరుబయట రక్తపు మడుగులో పడి ఉన్న పూలమ్మను చూడడంతో ఘటన వెలుగు చూసింది. పథకం ప్రకారమే హత్య ? మంగళవారం తెల్లవారుజామున ఇంటి ఆవరణలో ఉన్న బాత్రూమ్కు వెళ్లడానికి బయటకు వచ్చిన పూలమ్మపై నిందితులు ఒక్కసారిగా మారణాయుధాలతో దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే బెడ్రూంలో నిద్రిస్తున్న ఎల్లయ్యపై ఒక్కసారిగా దాడి చేసి కత్తులు, గొడ్డలితో నరికి చంపినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఎల్లయ్య మృతదేహంపై దాదాపు 30కిపైగా కత్తిపోట్లు జల్లెడ పట్టినట్లుగా ఉన్నాయని బంధువులు తెలిపారు. హత్య అనంతరం శివాలయంలో పూజలు ? వృద్ధ దంపతులను హత్య చేసిన తర్వాత ఓ నిందితుడు కాజీపేటలోని శివాలయానికి వెళ్లి పూజలు చేసి వచ్చినట్లు తెలిసింది. ఏమి తెలియనట్లుగానే మృతదేహాల ముందుకు వచ్చి బోరున విలపించారు. తీరా వారే నిందితులని పోలీసులు గుర్తించడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. నిందితుల ఇళ్లలో దుస్తులు పిండి ఉండడంతోపాటు దారి పొడవునా రక్తపు మరకలను అధికారులు గుర్తించారు. ఆస్తి కోసమే కుటుంబ సభ్యులు ఇద్దరిని హత్య చేశారని మృతురాలు పూలమ్మ తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో ఉందని, త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. నిందితుల జాడ చూపిన డాగ్‌స్క్వాడ్ సమాచారం అందుకున్న డీసీపీ వెంకట్రామ్రెడ్డి, ఏసీపీ సత్యనారాయణ, సీఐ అజయ్ క్లూస్ టీంతోపాటు జాగిలాలతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. జాగిలాలు మృతదేహాలను వాసన చూశాక నేరుగా హతుడి కుమారుల ఇళ్లతోపాటు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ఆగిపోయాయి. పోలీసులు వెంటనే అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. -
ఆస్తి కోసం తమ్ముడినే చంపేశాడు
మహబూబ్‌నగర్ : తోడబుట్టిన తమ్ముడు అని ప్రేమకూడా లేదు. ఆస్తి కోసం అన్నదమ్ముల అనుబంధాన్ని మరిచిపోయాడు. ప్రాణం తీస్తే ఆస్తి అంతా తనదే అనుకున్నాడు. అనుకున్నప్రకారం అదునుచూసి తమ్ముడిపై కత్తితో దాడి చేసి నిండు ప్రాణం తీశాడు. వివరాల్లోకి వెళ్తే అచ్చంపేట, ఛత్రపతి కాలనీకి చెందిన శ్రీనివాసులు, నవీన్‌లు అన్నదమ్ములు. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య ఆస్తి వివాదాలు నడుస్తున్నాయి. దీంతో అన్న శ్రీనివాసులు తమ్ముడు నవీన్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అదును చూసి కత్తితో తమ్ముడిపై దాడి చేశాడు. ఇరుగు పొరుగు రావడంతో శ్రీనివాసులు పారిపోయాడు. వెంటనే తీవ్రంగా గాయపడిన నవీన్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ కాసేపటికే మృతిచెందాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహబూబాబాద్ జిల్లాలో దారుణం
దంతాలపల్లి: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి దారుణ సంఘటన వెలుగుచూసింది. ఆస్తి కోసం మృతి చెందిన ఓ మహిళ మృతదేహాన్ని మూడు రోజులుగా ఇంట్లోనే ఉంచిన సంఘటన పట్టణంలో కలకలం రేపింది. వివరాలు.. పడమటిగూడకు చెందిన సునితకు దంతాలపల్లికి చెందిన నగేష్‌తో పన్నెండేళ్ల క్రితం వివాహమైంది. వారికి అచ్యుత్ అనే ఓ బాబు ఉన్నాడు. కాగా.. నగేష్ గత కొన్నేళ్లుగా మానసిక వ్యధితో బాధపడుతూ మతిస్థిమితం కోల్పోయాడు. ఈ క్రమంలో సునీతే కుటుంబానికి పెద్ద దిక్కుగా మారి బాబుతో పాటు భర్తను చూసుకుంటోంది. నగేష్‌కు ఉన్న ఆస్తి విషయంలో గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురై మంచం పట్టిన సునిత ఈ నెల 20(సోమవారం) మృతిచెందింది. సునిత మృతితో అచ్యుత్‌తో పాటు నగేష్‌లు ఒంటరయ్యారు. దీంతో సునీత తమ్ముడు బావకు రావాల్సిన ఆస్తి బాబు పేరుతో రిజిస్ర్టర్ చేయించాలని కోరాడు. దీనికి ఒప్పుకున్న కుటుంబ సభ్యులు అప్పటి నుంచి కనిపించకుండా పోయారు. కాగా మృతదేహాన్ని ఇంటి దగ్గరే ఉంచారు. తల్లికి ఏమయిందో తెలియక మృత దేహం పక్కనే కూర్చొని ఉన్న చిన్నారిని చూసి స్థానికులు చలించిపోతున్నారు. -
బావే సూత్రధారి
⇒సింహాద్రి హత్య కేసులో ముగ్గు్గరిని అరెస్ట్ చేసిన ద్వారకా పోలీసులు ⇒ఇద్దరితో రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న మృతుని బావవివరాలు వెల్లడించిన ఏసీపీ ⇒రామచంద్రరావు, సీఐ రాంబాబు సీతమ్మధార (విశాఖ ఉత్తరం) : ఆస్తి తగాదాలు, చిన్నచిన్న గొడవలు పెరిగి పెద్దవై హత్యకు దారి తీశాయి. సొంత చెల్లెలి భర్తే కిరాయి మనుషులతో బావమరిదిని హత్య చేసేందుకు రూ.5లక్షలకు ఒప్పందం కుదుర్చుకునేలా చేశాయి. నగరంలోని గాంధీనగర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన వంకల సింహాద్రి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. గతంలో ఉన్న ఆస్తి తగాదాల వల్లే సొంత చెల్లెలు భర్త పథకం ప్రకారం హత్య చేయించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మంగళవారం మధ్యాహ్నం ద్వారక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ పి.రామచంద్రరావు వెల్లడించారు. గాంధీనగర్ ప్రాంతానికి చెందిన వంకల సింహాద్రి చాలా కాలంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆస్తి విషయంలో చెల్లెలి భర్త వీనుకొండ వీర వెంకట సురేష్‌తో తరచూ గొడవలు జరుగుతుండేవి. నిత్యం ఏదో ఒక విషయంపై సింహాద్రి మీద పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించేందుకు బావ ప్రయత్నించేవాడు. ఈ నేపథ్యంలో మార్చి నెల ప్రారంభంలో (హత్య జరగడానికి వారం రోజుల ముందు) జరిగిన కొట్లాటలో బావను సింహాద్రి కొట్టాడు. దీంతో పగ తీర్చుకోవడంతోపాటు ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని సురేష్ భావించాడు. రూ.5 లక్షలకు ఒప్పందం కొటక్ మహేంద్రలో బీమా మేనేజర్‌గా పనిచేస్తున్న సురేష్ తన వద్ద ఏజెంట్‌గా పనిచేస్తున్న కొల్లపల్లి జ్యోతి భాస్కర్ శ్రీధర్(20)కు జరిగిన కొట్లాట విషయం చెప్పి ఎలాగైనా సింహాద్రిని అంతమొందించాలని కోరారు. రాజమండ్రి ప్రాంతానికి చెందిన శ్రీధర్ ఉద్యోగరీత్యా ఏడాది కిందట నగరానికి వచ్చి మద్దిలపాలెం సమీపంలోని కృష్ణా కళాశాల వద్ద నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో ఉంటున్న తన స్నేహితుడు కాండ్రేగుల సాయిరాం (22) అలియాస్ చిరుతను సురేష్‌కు పరిచయం చేశాడు అనాథ అయిన సాయిరాం గతంలో చిన్నచిన్న నేరాలకు పాల్పడ్డాడు. సింహాద్రి హత్య చేసేందుకు వీరిరువురితో సురేష్ రూ.5లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం మంచి ఉద్యోగాలు ఇప్పస్తానని కూడా చెప్పారు. తీవ్ర పెనుగులాట తర్వాత హత్య ఈ నెల 9న గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో సింహాద్రి ఇంటికి శ్రీధర్, సాయిరాం వెళ్లి తలుపుకొట్టారు. సింహాద్రి తలుపు తీసిన వెంటనే ఇద్దరూ ఒక్కసారిగా దాడి చేశారు. అనూహ్య ఘటనతో బిత్తరపోయిన సింహాద్రి ప్రతిఘటించడంతో ఆ ప్రాంతంలోనే ఉన్న బీరువా, టీవీ అద్దం పగిలి ధ్వంసమయ్యాయి. అక్కడే లభించిన గాజు ముక్కతో సింహాద్రి గొంతులో సాయిరాం గుచ్చడంతో కుప్పకూలిపోయి మరణించాడు. హత్య జరిగిన తర్వాత నిందితులిద్దరూ చేతులు కడుక్కునేందుకు సురేష్ నీళ్లిచ్చి సత్యం జంక్షన్ వద్ద ఉండమని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వెళ్లి వారిద్దరికీ తగిలిన గాయాలకు చికిత్స చేయించుకోమని రూ.15వేలు ఇచ్చాడు. మరసటి రోజు ఇసుకతోట దరి ఒక బార్ వద్దకు వెళ్లి ఇద్దరికీ రూ.30 వేలు ఇచ్చాడు. మిస్టరీ ఛేదించిన పోలీసులు హత్య జరిగిన రెండు రోజుల తర్వాత సింహాద్రి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల సమాచారంతో ఈ నెల 11న ద్వారక పోలీసులు రంగంలోకి దిగారు. ముందు నుంచీ ఆస్తి తగాదాలే హత్యకు దారితీసి ఉంటాయని భావించిన పోలీసులు మృతుడి బావ సురేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.అతడి ఫోన్‌కాల్స్ ఆధారంగా విచారణ చేపట్టి హత్య చేసిన ఇద్దరితోపాటు సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరుస్తామని ఏసీపీ రామచంద్రరావు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన సీఐ, ఎస్ఐలు, సిబ్బందిని అయన అభినందించి రివార్డులు అందజేశారు. సమావేశంలో సీఐ రాంబాబు, ఎస్ఐలు బి.మురళి, కె.మధుసూదనరావు, అడపా సత్యారావు, ఏఎస్ఐ ఆనంద్, కానిస్టేబుళ్లు ఎన్.జ్యోతేశ్వరరావు, శంకర్, ఆగస్టిన్ పాల్గొన్నారు. -
మహిళా న్యాయవాది దారుణ హత్య
-
మహిళా న్యాయవాది దారుణ హత్య
కనేకల్లు : అనంతపురం జిల్లాలో ఓ మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. కనేకల్లు మండలకేంద్రంలో సునీత(32) అనే న్యాయవాదిని గుర్తు తెలియని వ్యక్తి బుధవారం సాయంత్రం అత్యంత దారుణంగా హత్య చేశాడు. సునీత ఇంట్లోనే జిరాక్స్ సెంటర్‌తో పాటు ఇంటర్నెట్ షాపును నిర్వహిస్తోంది. ఆమె షాపులో ఉండగా ఓ వ్యక్తి వేటకొడవలితో గొంతు కోసి హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి నిందితుడు పరారయ్యారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విషం
పట్టుకోండి చూద్దాం కొందరు కాలంతో కలిసి ముందుంటారు.కొందరు కాలంతో పాటు ప్రయాణించ లేరు. ఎక్కడో ఆగిపోతారు. అది చాదస్తంగా కనిపించవచ్చు. అయితే... వారి వాదన వింటే మాత్రం... అందులోనూ ఎంతో కొంత సత్యం ఉందనిపిస్తుంది.‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్..’ అని కూడా అనిపిస్తుంది.అరవై రెండు సంవత్సరాల సుందరానికి ఆస్తిపాస్తులకు కొదవ లేదు. అయితే ఆత్మశాంతికి మాత్రం తీవ్రమైన కొరత ఉంది.ఆ లోటు భర్తీ చేసుకోవడానికి పుస్తకాలు బాగా చదివే వాడు. మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు ఎక్కువగా జరిపేవాడు. సుదీర్ఘమైన లేఖలు రాస్తూ పోస్ట్ చేస్తుండేవాడు.‘‘ఫోన్ చేసి మాట్లాడవచ్చు కదా’’ అని ఎవరైనా అంటే...‘‘అక్షరాల్లో పలికే భావాలు... మాటల్లో పలకవు’’ అనేవాడు.ఆయన మాటలు అందరికీ విచిత్రంగా అనిపించేవి. సుందరం ఇంట్లో పని చేసే వంటవాళ్లు తరచుగా మారుతుంటారు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి.జీతం సరిపోలేదని కొందరు...సుందరం చాదస్తం సరిపడక కొందరు...సుందరం లెక్చర్లు వినలేక కొందరు... పని మానేసేవాళ్లు.‘వంట చేయుటకు వ్యక్తి కావలెను’ అనే ప్రకటన కూడా పేపర్లో ఇచ్చేవాడు సుందరం.దీంతో... ఎక్కడెక్కడి నుంచో వంటవాళ్లు వచ్చి చేరేవారు.శీనయ్య అనే వంటగాడు కొత్తగా పనిలో చేరాడు.శీనయ్య ఏ వంట అయినా సరే... అద్భుతంగా చేస్తాడు. ‘ఆహా’ అనిపిస్తాడు. మరో విశేషం ఏమిటంటే... శీనయ్యకు పద్యాల మీద మంచి పట్టు ఉంది. తాత తనకు చిన్నప్పుడు ఎన్నో పద్యాలు నేర్పించాడు.సాహిత్యం అంటే ఇష్టపడే సుందరానికి శీనయ్య చేసే వంటతో పాటు పద్యాలు కూడా ఇష్టం.గంటలకు గంటలు పద్యాల గురించి వాళ్లు మాట్లాడుకునేవాళ్లు.‘‘అబ్బ... ఇన్నాళ్లకు సుందరాన్ని తట్టుకొనే వ్యక్తి దొరికాడు’’ అనుకున్నారు చుట్టుపక్కల వాళ్లు. సుందరానికి ఆస్తి తగాదాలు కూడా ఉండడంతో తరచుగా కోర్టుల చుట్టూ తిరుగుతుండేవాడు.‘నా వాళ్లే నన్ను మోసం చేస్తున్నారు’‘నా అనుకునేవాళ్లే నన్ను శవంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు’ శీనయ్యతో అంటూ బాధ పడేవాడు సుందరం.కానీ వివరాలేమీ చెప్పేవాడు కాదు.‘అయ్యా... ఈ ఆస్తి తగాదాలేమిటి? మీకు ఎవరితో శతృత్వం ఉంది?’లాంటి ప్రశ్నలేమీ అడిగేవాడు కాదు శీనయ్య.‘బాధపడకండయ్యా... అన్నీ సర్దుకుంటాయి’ అని మాత్రం ధైర్యం చెప్పేవాడు.‘నిన్ను ఆ దేవుడే నా దగ్గరకు పంపిచాడురా’ అంటుండేవాడు సుందరం. సుందరయ్య చనిపోయాడనే వార్త గుప్పుమంది. సుందరంపై విషప్రయోగం జరిగిందని చెప్పారు వైద్యులు. ఇన్స్పెక్టర్ నరసింహ, శీనయ్యను విచారించాడు.ఆ విచారణలో శీనయ్య చెప్పిన విషయాలు...లంచ్ తరువాత సుందరంగారు ఒక పెద్ద ఉత్తరం రాశారు. ∙కవర్‌పై అంటించడానికి స్టాంపులు కావాలంటే తెచ్చి ఇచ్చాను. ∙కవర్‌కు స్టాంపులు అంటించిన తరువాత... పోస్టాఫీసులో ఉన్న పెద్ద పోస్ట్‌బాక్స్‌లో వేసి రమ్మన్నారు. ∙పోస్టాఫీసు నుంచి తిరిగి వచ్చిన తరువాత చూస్తే... సుందరంగారు చనిపోయి ఉన్నారు.సుందరం తీసుకున్న ఆహారం, నీళ్లు... ఎక్కడా కూడా విషం జాడ కనిపించలేదు. పాయిజన్ బాటిల్ కూడా ఎక్కడా కనిపించలేదు. మరోవైపు చూస్తే... విషప్రభావం వల్లే సుందరం చనిపోయాడని వైద్యులు చెబుతున్నారు. అసలేం జరిగింది? అద్దంలో ఆన్సర్ విషం పూసిన స్టాంపులను సుందరానికి ఇచ్చాడు శీనయ్య. ఆ స్టాంపులను అంటించడానికి తడి కోసం నాలుకకు తగిలించుకున్నాడు సుందరం. కొద్దిసేపట్లోనే... విషం ఒంట్లో చేరింది. సుందరం చనిపోయాడు. సుందరం శత్రువులే శీనయ్యతో ఈ పని చేయించారు. -
అన్నదమ్ముల మధ్య ఘర్షణ..ఒకరి మృతి
తాడిపత్రి(అనంతపురం జిల్లా): తాడిపత్రి పట్టణంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ తగాదాలో తమ్ముడి నెత్తిపై అన్న బండరాయితో మోదడంతో తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. వివరాలు..పట్టణంలో ఉన్న రాజా లాడ్జి యజమాని రాజారెడ్డి, శేఖర్‌రెడ్డిలు అన్నదమ్ములు. వీరి మధ్య కొంతకాలంగా ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. గతంలో వీరి మధ్య ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకున్నారు. ఆదివారం కోపోద్రిక్తుడైన అన్న శేఖర్‌రెడ్డి తమ్ముడిని బండరాయితో మోది చంపాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు శేఖర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లిపై తనయుడి దాడి: పరిస్థితి విషమం
ఏలూరు: జంగారెడ్డిగూడెంలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో తల్లిపై తనయుడు దాడిచేసిన సంఘటన శుక్రవారం అక్కంపేట గ్రామంలో చోటుచేసుకుంది. పులపాకుల వెంకటలక్ష్మిపై ఆమె కుమారుడు రామకృష్ణ దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కొన ఊపిరితో ఉన్న ఆమెను స్థానికులు జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
కోర్టుకు వెళ్తుంటే దాడి: ఒకరి మృతి
కోర్టుకు వెళుతున్నవారి ఆటోను అటకాయించి మారణాయుధాలతో దాడి చేసిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం నేలపాడు సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కొల్లిపర మండలం తూములూరుకు చెందిన ఆళ్ల సీతమ్మ తన కుమార్తె శ్రీలక్ష్మి, అల్లుడు బలరామిరెడ్డి.. ఓ కేసుకు సంబంధించి సాక్షి దేవయ్యతో కలిసి బుధవారం ఉదయం ఆటోలో తెనాలి కోర్టుకు వెళుతున్నారు. వీరి వాహనం కొల్లిపర మండలం సిరిపురం, తెనాలి మండలం నేలపాడు గ్రామాల మధ్యకు రాగానే అప్పటికే మాటు వేసి ఉన్న దుండగులు కారుతో అడ్డగించారు. ఆటో పంటకాల్వలోకి బోల్తాకొట్టింది. వెంటనే కారులోని వారు దిగి మారణాయుధాలతో దాడి చేశారు. ఘటనలో బలరామిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో డ్రైవరు నానిసహా మిగిలిన వారు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆస్తి తగాదాల కారణంగా సీతమ్మ రెండో అల్లుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని శ్రీలక్ష్మి ఆరోపిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తమ్ముడిని కొట్టి చంపిన అన్న
ఆస్తి కోసం ఓ అన్న సొంత తమ్మున్నే దారుణంగా కొట్టి చంపాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పలుకూరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న అన్నదమ్ముల మధ్య గత కొన్ని రోజులుగా ఆస్తి విషయంలో తగాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన అన్న కర్రతో తమ్ముడి పై దాడి చేయడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
'భూ వివాదాలను నెలాఖరులోపు పరిష్కరించాలి'
- ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ కర్నూలు సిటీ: ఎస్సీ, ఎస్టీల భూ వివాదలపై వచ్చిన ఫిర్యాదులను ఈ నెల 31లోపు పరిష్కరించాలని ఎస్టీ, ఎస్టీ కమిషన్ చెర్మన్ కారెం శివాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెవెన్యూ, పోలీసు, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. మొదట జిల్లాలో భూ వివాద సమస్యలు ఎదుర్కొంటున్న వారి నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ భూ దురాక్రమణల పట్ల రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. కారణాలు చూపకుండా ఫిర్యాదు వచ్చిన వెంటనే నిర్దేశించిన గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. వివాదాస్పద భూముల్లో ఇతరులకు పట్టాలు ఇస్తే చర్యలు తప్పవన్నారు. జేసీ కోర్టులో ఇలాంటి వివాదాలకు పరిష్కారం చూపి బాధితులకు న్యాయం చేకూర్చాలన్నారు. ఓర్వకల్లు మండలంలో సాగు చేసుకుంటున్న భూములపై విచారణ చేసి న్యాం చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా శ్మశాన వాటికలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూములను సేకరించాలన్నారు. ఇందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. వివాదాలపై ఫిర్యాదులు వస్తే ఆ కాపీతో పాటు పరిష్కారాన్ని నివేదిక రూపంలో కమిషన్‌కు పంపాలన్నారు. ప్రత్యేక కౌంటర్లలో 188 ఫిర్యాదులు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ భూముల వివాదాలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు ఈ నెల 1 నుంచి 10 తేది వరకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని జేసీ హరికిరణ్ తెలిపారు. ఈ కేంద్రాలకు మొత్తం 188 ఫిర్యాదులు రాగా, ఇప్పటికే 60 పరిష్కరించామన్నారు. అధికారులు ప్రజా సాధికార సర్వేలో ఉండడం వల్ల మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయని, ప్రతి నెల 4వ సోమవారం ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ భూముల వివాదాలపై విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గత 17 నెలల కాలంలో ఈ సమావేశాలకు 950 ఫిర్యాదులు రాగా 856 అర్జీలు పరిష్కారం అయ్యాయన్నారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు కమిషన్ చైర్మెన్ కారెం శివాజీకి వినతులు ఇచ్చారు. సమావేశంలో ఏఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, డీఆర్ఓ గంగాధర్ గౌడు, ఆయా శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. -
కన్నకొడుకే చంపుతానంటున్నాడు..
పట్నంబజారు (గుంటూరు) : ఆస్తి కోసం కన్న వారినే చంపుతానంటున్న ఓ కఠినాత్ముడిపై సోమవారం రూరల్ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో వృద్ధ దంపతులు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాలాలా ఉన్నాయి. అమృతలూరు మండలం ఇంటూరు గ్రామానికి చెందిన కట్టుపల్లి దేవపాల్ పంచాయతీ కార్యాలయంలో వాచ్‌మెన్‌గా పని చేస్తుంటారు. ఆయన భార్య చంద్రలీల ఇంట్లోనే ఉంటారు. అయితే కుమారుడు మణికిరణ్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం సేవించి తల్లితండ్రులను మానసికంగా వేధించ టం ప్రారంభించాడు. భార్య పద్మ సైతం వదలి వెళ్ళిపోవటంతో మణికుమార్‌కు ఉన్న ఇద్దరు సంతానాన్ని దేవపాల్ దంపతులే సాకుతున్నారు. మనవరాలు శృతి 7వ తరగతి చదువుతుండగా.. మనవడు సుజిగ్ 5వ తరగతి చదువుతున్నాడు. అయితే మద్యానికి బానిసగా మారి చెడు స్నేహాలు చేస్తూ.. ఉన్న 5 సెంట్ల స్థలాన్ని అమ్మి డబ్బులు ఇవ్వాలని వేధింపులకు పాల్పడుతున్నాడని దేవపాల్ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. స్థలాన్ని పిల్లల పేరున రాసేస్తామంటే తమను చితకబాదుతున్నాడని వాపోయారు. స్థలాన్ని నమ్ముకుని ఉన్న తమ పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదన్నారు. స్థలాన్ని ఇవ్వకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడని భయాందోళనలు వ్యక్తం చేశారు. గతంలో అమృతలూరు ఎస్సైకి ఫిర్యాదు చేయగా ఏ మాత్రం పట్టించుకోలేదని, జెడ్పీలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనబడలేదన్నారు. కుమారుడు తమ ఇబ్బందులకు గురి చేయకుండా చూడాలని కోరారు. -
అత్త మృతి.. అల్లుడిపై అనుమానాలు!
నర్సాపూర్ రూరల్: ఓ మహిళ పట్టపగలే దారుణహత్యకు గురైంది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నాగులపల్లిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. అయితే, కుటుంబీకులపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగులపల్లి పంచాయతీ తావుర్యా తండాకు చెందిన మెగావత్ విఠల్ భార్య తార(48) నేటి ఉదయం నాగులపల్లి పాఠశాల వైపు నుంచి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను కల్లు సీసాతో విచక్షణారహితంగా పొడిచి హత్యచేశారు. తార మృతదేహాన్ని పక్కనే ఉన్న కుంటలో పడేసి నిందితులు వెళ్లిపోయారు. సమీపంలో ఉన్న పాఠశాల విద్యార్థులు అటుగా మూత్రవిసర్జనకు వెళ్లగా ఆమె మృతదేహం కనిపించింది. వారు వెంటనే ఉపాధ్యాయులకు ఈ విషయాన్ని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. విఠల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అల్లుడిపై ఎన్నో అనుమానాలు! ఆస్తి తగాదాల నేపథ్యంలో ఆమెను అల్లుడు జగదీషే చంపి ఉంటాడని బంధువులు, భర్త ఆరోపిస్తున్నారు. పోలీసులు సైతం అదే కోణంలో విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. అత్త చనిపోయిన విషయం తెలిసినా అతడు రాకపోవటంతో అనుమానాలకు ఊతమిచ్చినట్లు అయింది. -
ఉలిక్కిపడ్డ బుక్కరాయసముద్రం
దారుణం ► వివాదంలో ఉన్న భూమి దున్నేందుకు ప్రయత్నం ► అభ్యంతరం తెలిపిన చిన్నాన్నను వేటకొడవలితో నరికి చంపిన వైనం ► ఆపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన నిందితుడు ఆస్తి.. బంధాలు, బంధుత్వాలను విడదీస్తుంది. విధ్వేషాలను పెంచుతుంది. కక్షలకు ఆజ్యం పోస్తుంది. అవసరమైతే ప్రాణాలు తీస్తుంది. ఈ విషయం మరోసారి రుజువైంది. చిన్నాన్ననే వేటకొడవలితో నరికి చంపి, నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు వరుసకు కొడుకయ్యే ఓ వ్యక్తి. ఈ సంఘటనతో ఊరు ఉలిక్కిపడింది. రెండు కుటుంబాల మధ్య తలెత్తిన కక్షలకు ఓ నిండు ప్రాణం బలైపోవడం సంచలనం సృష్టించింది. - బుక్కరాయసముద్రం బుక్కరాయసముద్రానికి చెందిన బసన్న(65)ను అతని అన్న కుమారుడైన వెంకటేశ్ విచక్షణారహితంగా వేటకొడవలితో చంపడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. దేవరకొండ గ్రామ సర్వే నంబర్ 376లో ఎనిమిదెకరాల పొలం ఉండగా, పై రెండు కుటుంబాల మధ్య మూడేళ్లుగా భూ వివాదం నడుస్తోంది. ఈ విషయంగా వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పొలాన్ని చూసేందుకు వెళ్లగా... సోమవారం ఉదయమే బసన్న తన మనవుడు వాసుతో కలసి బైక్‌లో పొలం చూసేందుకు వెళ్లారు. అప్పటికే అక్కడ వెంకటేశ్ తన భార్య ఎర్రమ్మతో కలసి ట్రాక్టర్‌తో దున్నుతుండడాన్ని గమనించారు. వెంటనే అక్కడికి వెళ్లి ప్రశ్నించారు. వివాదంలో ఉండగానే పొలాన్ని ఎలా దున్నుతావంటూ నిలదీశారు. ఈ విషయంగా మారి మధ్య మాటామాటా పెరిగింది. రేయ్.. నువ్విక్కడి నుంచి వెళ్లిపో... బసన్న మనవడు వాసుని ‘రేయ్ నువ్విక్కడి నుంచి వెళ్లిపో.. అంటూ వెంకటేశ్ గట్టిగా అరిచాడు. ఆ తరువాత తన వెంట తెచ్చుకున్న వేటకొడవలితో బసన్నపై విచక్షణారహితంగా దాడి చేసి అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆ తరువాత భార్య ఎర్రమ్మను ఇంటికి పంపేసి, నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు వెంకటేశ్. బోరుమన్న కుటుంబ సభ్యులు విషయం తెలిసిన వెంటనే బసన్న కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల గ్రామాల వారు భారీగా పొలం వద్దకు చేరుకున్నారు. పొలంలోనే రక్తపు మడుగులో పడి ఉన్న బసన్నను చూసి అతని గుండెలపై పడి కుటుంబ సభ్యులు రోదించారు. వారిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. రంగంలోకి పోలీసులు ఇన్చార్జ్ ఎస్ఐ శివ, ఏఎస్ఐలు వెంకటేశ్వర్లు, భాస్కర్, సిబ్బంది నేర స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
యువకుడి సజీవదహనానికి యత్నం...
మెదక్: మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. పెద్దశంకరంపేటలో ఆస్తి వివాదాల నేపథ్యంలో గురువారం సాయంత్రం ఓ యువకుడ్ని బంధువులు సజీవదహనం చేయడానికి యత్నించడంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తమ్ముడు, మరదలి దారుణ హత్య
* కుమారుడి పరిస్థితి విషమం * ఆస్తి తగాదాలే కారణం * విద్యుత్తు ఆపి, కాపు కాసి.. దాడి * పోలీసుల అదుపులో అన్న గంగవరం: ఆస్తి తగాదాల్లో సొంత తమ్ముడిని, అతని భార్యను దారుణంగా హత్యకు పాల్పడిన సంఘటన గంగవరం మండలంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకొంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని గాంధీనగర్‌కు చెందిన ఆనంద్(36), శివకుమార్ (34) అన్నదమ్ములు. ఆనంద్ పలమనేరు కొత్తపేటలోను, శివకుమార్ గాంధీనగర్‌లో ఉంటున్నారు. వీరికి కొంతకాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. పలుమార్లు గొడవ పడి పోలీసుస్టేషనకు వెళ్లారు. అదేవిధంగా 15 రోజుల క్రితం మామిడి తోపు అమ్మే విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. దీంతో ఎలాగైనా శివకుమార్ కుటుంబాన్ని అంతమొందించాలని ఆనంద్ నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా మూడు రోజులుగా గాంధీనగర్‌లో ఉన్న తన ఇంట్లో మకాం పెట్టాడు. ఆదివారం అర్ధరాత్రి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఆపి విద్యుత్ సరఫరా ఆపేశాడు. వేసవి కావడంతో శివకుమార్, అతని భార్య నాగరత్నమ్మ(26), కుమారుడు యుగంధర్(8), యతీష్ (5) ఇంటి ముందు నిద్రించారు. ఆనంద్ ముందుగా ఘాడ నిద్రలో ఉన్న నాగరత్నమ్మను కత్తితో నరికేశాడు. తరువాత తమ్ముడు శివకుమార్‌ను నరికాడు. అతని కేకలు విన్న బాలుడు యుగంధర్ నిద్ర నుంచి మేల్కొని గట్టిగా అరిచాడు. దీంతో ఆనంద్ బాలుడిపైనా కత్తితో దాడి చేశాడు. బాలుడు స్పృహతప్పి పడిపోయాడు. వీరి అరుపులు విన్న గ్రామస్తులు నిద్ర నుంచి మేల్కొని అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. గ్రామస్తులు పరిశీలించగా శివకుమార్, నాగరత్నమ్మ మృతిచెందినట్లు గుర్తించారు. రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలుడు యుగంధర్‌ను వెంటనే పలమనేరు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకోసం తిరుపతి స్విమ్స్‌కు తీసుకెళ్లారు. నిందితిడు పోలీసులకు లొంగిపోయాడు. గ్రామస్తులు రాకపోయి ఉంటే శివకుమార్ చిన్న కుమారుడు యతీష్పైనా దాడి చేసేవాడు. సీఐ రవికుమార్, ఎస్ఐ దిలీప్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆస్తి తగాదాలతో తమ్ముడిని, మరదలిని చంపిన అన్న
గంగవరం: చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టాయి. ఓ అన్న తన తమ్ముడి కుటుంబంపై పైశాచికంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తమ్ముడు, మరదలు మరణించగా వారి కుమారుడిని తీవ్రంగా గాయపడ్డాడు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన శివకుమార్(38), అతని అన్న ఆనంద్‌కు మధ్య కొన్నాళ్లుగా ఆస్తి విషయమై గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శివకుమార్, అతని భార్య నాగరత్నమ్మ(32) కుమారుడు గంగాధర్‌పై ఆనంద్ ఆదివారం అర్థరాత్రి కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలతో శివకుమార్ దంపతులు అక్కడికక్కడే చనిపోగా గంగాధర్ తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం ఉదయం కుటుంబసభ్యులు గమనించి గంగాధర్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఘట్కేసర్లో కత్తిపోట్లు.. ఒకరి పరిస్థితి విషమం
ఘట్కేసర్: రంగారెడ్డి జిల్లాలో ఆస్తి తగాదాలు తీవ్ర ఘర్షణకు దారితీశాయి. ఘట్కేసర్లోని మైసమ్మగుట్ట వద్ద ఆదివారం రాత్రి జరిగిన గొడవల్లో పలువురు గాయపడ్డారు. రెండు కుటుంబాల మధ్య తలెత్తిన ఆస్తి తగాదాలు ఒక్క కుటుంబంపై మరో కుటుంబం కత్తులతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో నలుగురికి కత్తిపోట్లు తగిలాయి. ఈ ఘటనలో గాయపడిన సంజీవ్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆస్తి కోసం వదినను చంపిన మరిది
ఆస్తి తగాదాల్లో ఓ వ్యక్తి సొంత వదినను నరికి చంపేశాడు. కర్నూలు జిల్లా రుద్రవరం మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానిక పడమట వీధికి చెందిన బోయ వెంకట లక్ష్మమ్మ(50) భర్త ఐదేళ్ల క్రితం మృతి చెందాడు. ఆ దంపతులకు పిల్లల్లేరు. దీంతో వారికి ఉన్న ఆస్తిని తన పిల్లల పేరిట రాసివ్వాలని ఆమె మరిది నర్సింహుడు కొన్ని రోజులుగా గొడవపడుతున్నాడు. ఈ నేపథ్యంలో వెంకట లక్ష్మమ్మ సోమవారం సాయంత్రం స్థానిక సంతకు వెళ్లి వస్తుండగా నర్సింహుడు ఆమెను గొడ్డలితో నరికాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. నిందితుడు పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆస్తి కోసం తల్లిపై గొడ్డలితో దాడి
హిందూపురం (అనంతపురం) : ఆస్తి కోసం కన్నతల్లి మీదే కర్కశంగా ప్రవర్తించాడో ప్రబుద్ధుడు. ఇల్లు తన పేర రాయలేదనే అక్కసుతో కన్నతల్లిపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి మెడపై తీవ్రగాయం కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో శనివారం జరిగింది. వివరాల ప్రకారం.. పట్టణంలోని రహమత్ నగర్‌కు చెందిన షానుబీ(55) తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది. కాగా చాలా రోజుల నుంచి ఇంటిని తన పేర రాయమని కుమారుడు అల్లాబక్షు(32) ఆమెను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం కూడా ఇద్దరి మధ్య ఇంటి విషయమై గొడవ జరిగింది. ఆవేశానికి లోనైన కొడుకు గొడ్డలితో తల్లి మెడపై వేటు వేశాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇది గమనించిన స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా.. అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
తండ్రిపై కొడుకు కత్తితో దాడి
జుత్తిగ(పెనుమంట్ర) : ఆస్తి తగాదాల నేపథ్యంలో పెద్దకొడుకు తండ్రిపై కక్ష పెంచుకుని బుధవారం కత్తితో దాడిచేసిన ఘటన జుత్తిగలో జరిగింది. జుత్తిగకు చెందిన సత్తి రామకృష్ణారెడ్డి, అతని పెద్ద కుమారుడు శ్రీనివాసరెడ్డి మధ్య ఆస్తి పంపకాల విషయంలో వివాదం చోటు చేసుకుంది. శ్రీనివాసరెడ్డి అదే గ్రామంలో వేరే చోట నివాసం ఉంటున్నాడు. బుధవారం ఉదయం సుమారు 7 గంటలకు తండ్రి ఇంటికి కత్తితో వచ్చి తనకు రావలసిన ఆస్తి ఇచ్చి తీరాలని పట్టుబట్టాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. శ్రీనివాసరెడ్డి తండ్రిపై కత్తితో దాడిచేసి ఉదరం, భుజాలపై విచక్షణా రహితంగా నరికాడు. కుప్పకూలిపోయిన రామకృష్ణారెడ్డిని స్థానికులు 108 వాహనంలో తణుకులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పెనుమంట్ర ఎస్సై కె.వీరబాబు తణుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామకృష్ణారెడ్డి వాంగ్మూలం మేరకు కేసునమోదు చేసి విచారణ చేపట్టారు. -
ఆస్తి తగాదాలతో తండ్రిని చంపిన కొడుకు
చుండూరు(గుంటూరు): ఆస్తి వివాదాల నేపథ్యంలో ఓ కిరాతకుడు కన్నతండ్రిని హతమార్చాడు. ఈ దారుణం గుంటూరు జిల్లాలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. జిల్లాలోని చుండూరుకు చెందిన పులుగు వెంకట్‌రెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు శ్రీనివాసరెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. ఆస్తి పంపకాల విషయంలో శ్రీనివాసరెడ్డికి తండ్రితో విభేదాలున్నాయి. వీటిని మనసులో పెట్టుకున్న అతడు బుధవారం రాత్రి రాయితో బలంగా మోది తండ్రిని హత్య చేశాడు. అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. స్థానిక మిల్లులో పనిచేస్తున్న ఈశ్వరమ్మ అర్థరాత్రి ఇంటికి వచ్చేసరికి భర్త రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆమె వెంటనే స్థానికుల సాయంతో భర్త వెంకట్ రెడ్డిని గుంటూరు ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గురువారం ఉదయం శ్రీనివాసరెడ్డి ఇంటికి చేరుకుని ఏమీ తెలియనట్లు ఉన్నాడు. అయితే, శ్రీనివాసరెడ్డిపై అనుమానం ఉన్న గ్రామస్తులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. -
పున్నేలులో దారుణం:పసివాడి నోట్లో విషపు గుళికలు
వరంగల్: వర్ధన్నపేట మండలం పున్నేలు గ్రామంలో దారుణం జరిగింది. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల కారణంగా 5నెలల హర్షవర్ధన్ నోట్లో విషపు గుళికలు పోశారు. ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. రాజు అనే వ్యక్తికి తన సోదరునితో ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఆ తగాదాలను దృష్టిలోపెట్టుకొని, తన కక్షని అయిదు నెలల బాబుపై చూపించాడు. రాజు తమ్ముడు కుమారుడు హర్షవర్ధన్ నోట్లో విషపు గుళికలు వేశాడు. ఆ బాలుడిని ఏజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.