మహబూబాబాద్ జిల్లాలో దారుణం
Published Wed, Mar 22 2017 3:05 PM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM
దంతాలపల్లి: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి దారుణ సంఘటన వెలుగుచూసింది. ఆస్తి కోసం మృతి చెందిన ఓ మహిళ మృతదేహాన్ని మూడు రోజులుగా ఇంట్లోనే ఉంచిన సంఘటన పట్టణంలో కలకలం రేపింది. వివరాలు.. పడమటిగూడకు చెందిన సునితకు దంతాలపల్లికి చెందిన నగేష్‌తో పన్నెండేళ్ల క్రితం వివాహమైంది. వారికి అచ్యుత్ అనే ఓ బాబు ఉన్నాడు. కాగా.. నగేష్ గత కొన్నేళ్లుగా మానసిక వ్యధితో బాధపడుతూ మతిస్థిమితం కోల్పోయాడు. ఈ క్రమంలో సునీతే కుటుంబానికి పెద్ద దిక్కుగా మారి బాబుతో పాటు భర్తను చూసుకుంటోంది. నగేష్‌కు ఉన్న ఆస్తి విషయంలో గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరగుతున్నాయి.
దీంతో మనస్తాపానికి గురై మంచం పట్టిన సునిత ఈ నెల 20(సోమవారం) మృతిచెందింది. సునిత మృతితో అచ్యుత్‌తో పాటు నగేష్‌లు ఒంటరయ్యారు. దీంతో సునీత తమ్ముడు బావకు రావాల్సిన ఆస్తి బాబు పేరుతో రిజిస్ర్టర్ చేయించాలని కోరాడు. దీనికి ఒప్పుకున్న కుటుంబ సభ్యులు అప్పటి నుంచి కనిపించకుండా పోయారు. కాగా మృతదేహాన్ని ఇంటి దగ్గరే ఉంచారు. తల్లికి ఏమయిందో తెలియక మృత దేహం పక్కనే కూర్చొని ఉన్న చిన్నారిని చూసి స్థానికులు చలించిపోతున్నారు.
Advertisement
Advertisement