కోర్టుకు వెళ్తుంటే దాడి: ఒకరి మృతి
Published Wed, Aug 24 2016 8:32 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
కోర్టుకు వెళుతున్నవారి ఆటోను అటకాయించి మారణాయుధాలతో దాడి చేసిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం నేలపాడు సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కొల్లిపర మండలం తూములూరుకు చెందిన ఆళ్ల సీతమ్మ తన కుమార్తె శ్రీలక్ష్మి, అల్లుడు బలరామిరెడ్డి.. ఓ కేసుకు సంబంధించి సాక్షి దేవయ్యతో కలిసి బుధవారం ఉదయం ఆటోలో తెనాలి కోర్టుకు వెళుతున్నారు.
వీరి వాహనం కొల్లిపర మండలం సిరిపురం, తెనాలి మండలం నేలపాడు గ్రామాల మధ్యకు రాగానే అప్పటికే మాటు వేసి ఉన్న దుండగులు కారుతో అడ్డగించారు. ఆటో పంటకాల్వలోకి బోల్తాకొట్టింది. వెంటనే కారులోని వారు దిగి మారణాయుధాలతో దాడి చేశారు. ఘటనలో బలరామిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో డ్రైవరు నానిసహా మిగిలిన వారు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆస్తి తగాదాల కారణంగా సీతమ్మ రెండో అల్లుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని శ్రీలక్ష్మి ఆరోపిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement