Seethamma
-
Ram Navami 2024: వెండితెర సీతమ్మగా కనిపించిన తారలు వీళ్లే (ఫొటోలు)
-
సీతమ్మకు త్రీడీ చీర
సిరిసిల్ల: సిరిసిల్ల చేనేత కళావైభవాన్ని మరోసారి ప్రపంచానికి చాటాడు. మూడు రంగుల్లో త్రీడీ చీరను చేనేత మగ్గంపై నేశాడు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి సీతమ్మకు బహూకరించేందుకు మూడు రంగుల చీరను అద్భుతంగా రూపొందించాడు. ఆయనే సిరిసిల్ల నేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్. ఆయన 18 రోజులపాటు చేనేత మగ్గంపై శ్రమించి బంగారు, వెండి, రెడ్ బ్లడ్ రంగుల్లో చీరను నేశారు. ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు, 600 గ్రాముల బరువుతో అద్భుతమైన త్రీడీ చీరను రూపొందించారు. ఈ చీరను తిప్పుతుంటే.. రంగులు మారుతూ కనువిందు చేస్తుంది. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ ఆదివారం మాట్లాడుతూ.. శ్రీరామ నవమికి భద్రాచలం సీతారాములకు ఈ చీరను బహూకరించనున్నట్లు తెలిపారు. గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను, ఉంగరంలో దూరే చీరను కూడా విజయ్‌కుమార్ నేసి అభినందనలు అందుకున్నారు. -
సీతమ్మ పెద్ద మనసమ్మ.. రూ.3 కోట్ల విలువైన..
సాక్షి, ఉండ్రాజవరం: సీఎం వైఎస్ జగన్ సంక్షేమ, అభివృద్ధి పాలనకు బాసటగా ఓ మహిళ భూరి విరాళం అందించింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వేలివెన్నులో 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ పీహెచ్సీ నిర్మాణానికి దివంగత బూరుగుపల్లి సుబ్బారావు భార్య సీతమ్మ తన వంతుగా రూ.3 కోట్లకుపైగా విలువైన ఎకరం భూమిని విరాళంగా ఇచ్చారు. చదవండి: (వైఎస్సార్ జిల్లా నన్ను గుండెల్లో పెట్టుకుంది) ఈ నెల 21న సీఎం జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు నాడు ఆమె తన భూమిని ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయమై గురువారం ఆమె మాట్లాడుతూ తన భర్త సుబ్బారావు జ్ఞాపకార్థం ఆస్పత్రి నిర్మాణానికి సహకారం అందించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆమెకు జెడ్పీటీసీ సభ్యుడు నందిగం భాస్కరరామయ్య, సొసైటీ అధ్యక్షుడు బూరుగుపల్లి కృష్ణబ్రహ్మానందం, వైఎస్సార్సీపీ గ్రామ అధ్యక్షుడు శిరిగిన శివరాధాకృష్ణ, కరుటూరి శివరామకృష్ణ, గూడపాటి చెంచయ్య, శిరిగిన నర్సింహమూర్తి, ముళ్ళపూడి కేశవరావు, ఎం.కృష్ణారావు, ఎం.సత్యనారాయణ, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. -
శరమ... ఒక మెరుపు
శరమ రాక్షస స్త్రీ. విభీషణుడి భార్య. శరూషుడు అనే గంధర్వుడి కుమార్తె. రామాయణంలో కొద్దిసేపు కనపడుతుంది. కానీ ఒక పెద్ద మెరుపు. విభీషణుడు ఎప్పుడూ ధర్మాన్ని ఆశ్రయించి ఉంటాడు. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురూ చతుర్ముఖ బ్రహ్మని ఉద్దేశించి తపస్సు చేసారు. బ్రహ్మ ప్రత్యక్షమవగానే ఒక్కొక్కడు ఒక్కొక్క వరం కోరాడు. ‘‘మనసు ఎప్పుడూ ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించి ఉండుగాక!’’ అని విభీషణుడు కోరగా బ్రహ్మ తథాస్తన్నాడు. అందుకే తప్పు చేస్తున్నావని చెప్పినా వినని రావణుడు రాజ్యబహిష్కారం విధిస్తే, విభీషణుడు ధర్మాత్ముడయిన రామచంద్రమూర్తి దగ్గరకు వెళ్ళిపోయాడు. అప్పుడు విభీషణుడి భార్య ఏం చేయాలి .. ఆమె కూడా ఆయన వెంటే వెళ్ళిపోవాలి. కానీ ఆమె వెళ్ళలేదు. భర్తమీద ప్రేమ లేక కాదు, భర్తతో కలిసి వెళ్ళాలని తెలియక కాదు. తన భర్తకు దూరమైన మరొక స్త్రీ దుర్మార్గుడైన రాక్షసుడు రావణుడివల్ల కష్టాలు పడుతుంటే, ఊరడించడానికి మనిషి లేకపోతే అది మహా పాపం–అని భర్తతో వెళ్లిపోవడం కన్నా, ఇక్కడే ఉండిపోతానని ప్రాణాలకు తెగించి ఉండిపోయింది. యుద్ధం ప్రారంభమవుతుందనగా రావణుడు సీతమ్మ దగ్గరకు వెళ్లాడు...‘‘సీతా! నిన్న రాత్రి రామ లక్ష్మణులు పలువురు వానరులతో కలిసి వచ్చి సముద్రపు ఒడ్డున విడిది చేసారు. నా సేనాధిపతి ప్రహస్తుడు సైన్యంతో వెళ్ళి నిద్రపోతున్న రాముని శిరస్సును కోసేశాడు. మిగిలిన వానరులందరూ పారిపోయారు. లక్ష్మణుడు కూడా పారిపోయాడు. రాముడి శిరస్సును నా సైన్యం తీసుకొచ్చింది... ఇదిగో చూడు’’ అని ఒక రాక్షసుడిని పిలిచి తల అక్కడ పెట్టు అన్నాడు. ఇంద్రజాల మహిమ ఎంత గొప్పగా ఉందంటే సీతమ్మ కూడా దిగ్భ్రమ చెందింది. ‘‘చూసావా ధనుస్సు. ఈ కోదండం పట్టుకునే కదా నన్ను సంహరిస్తాడన్నావు... ఈ రాముణ్ణి నమ్ముకునే కదా నా పాన్పు చేరలేదు. రాముడి తల తెగిపోయింది. ఇప్పుడు నిన్ను రక్షించే వారెవరు’’ అన్నాడు. సీతమ్మ గుండెలు బాదుకుని ఏడుస్తోంది. ఆ సమయంలో తన కష్టం చెప్పుకోవడానికి ఒక్కళ్ళు కూడా లేరక్కడ. అంత శోకంలో ఎవరికయినా మనసు పనిచేస్తుందా... తను కనబడితే చంపేస్తాడని తెలిసినా సరే, నిర్భయంగా శరమ ఆకాశంలో నిలబడింది. రావణుడు చూడలేదు. ఈలోగా ఎవరో వచ్చి రమ్మంటే రావణుడు అటు వెళ్ళాడు. ఆమెను చేరిన శరమ ‘‘అమ్మా సీతమ్మా ! బెంగపెట్టుకోకు. అదంతా రావణుడి మాయ... నేనిప్పుడు ఆకాశగమనం చేసి రామచంద్రమూర్తిని చూసి వచ్చాను. అయినా రాముడికి విశ్వామిత్రుడి వరం ఉంది కదా. ఆయనకు శ్రమ ఉండదు, జ్వరముండదు. నిద్రపోతున్న ఆయనను ఎవరూ సంహరించలేరు... అటువంటిది ఈ ధూర్తు్తడు ప్రహస్తుడు చంపగలడా... నన్ను నమ్ము... రాముడు పరమ సంతోషంగా ఉన్నాడు’’ అంది. అయినా ఊరడిల్లని సీతమ్మ రావణుడు ఏం చేస్తున్నాడో చూసి రమ్మంది. వెళ్ళి వచ్చిన శరమ ‘‘అమ్మా ఇప్పుడు విను. అవిగో నగారాలు మోగుతున్నాయి...అవిగో భేరీల శబ్దాలు.. యుద్ధసంరంభం జరుగుతున్నది. నిజంగా రావణుడు చెప్పినదే నిజమయితే రాముడు నిహతుడు అయిన తరువాత ఇంకా యుద్ధం ఏముంటుంది? అమ్మా నన్ను నమ్ము. ఉపశాంతికోసం నీ భర్త విజయాన్ని కాంక్షిస్తూ ప్రత్యక్ష దైవమయిన సూర్యుణ్ణి ఉపాసించు’’ అంటూ ఎలా చేయాలో ఉపదేశించింది. అంతటి త్యాగమూర్తులు ఈ దేశ స్త్రీలు. ఇవి కాల్పనిక కథలు కావు. ఇతిహాసాలు. పరమ సత్యాలు. -
ఆశ్రిత వత్సలుడు
పరదారాపహరణం చాలా పాపమని, సాక్షాత్తూ ఆదిశక్తి వంటి సీతమ్మను తెచ్చి బంధించడం లంకకు చేటని, రావణునికి అత్యంత ప్రమాదకరమని, మర్యాదగా సీతమ్మని రామునికి అప్పగించి, క్షమాపణలు వేడుకోమని ఎంతో హితబోధ చేశాడు విభీషణుడు తన అన్న అయిన రావణునికి. పోగాలం దాపురించిన రావణుడు ఆ మాటలను చెవికెక్కించుకోకపోగా తీవ్రంగా అవమానించడంతో విభీషణుడు దుష్టుడైన అన్నను వదిలి ధర్మస్వరూపుడైన రాముని శరణు వేడాలన్న ఉద్దేశ్యంతో ఎప్పుడూ తననే అనుసరించే నలుగురు అనుచరులతోపాటు లంకను వదిలి సముద్రాన్ని దాటి అవతలి తీరంలో వానర సేనతో ఉన్న శ్రీ రామచంద్రుడి దగ్గరకు వచ్చి ఆకాశంలోనే నిలచి రాముడిని శరణు వేడాడు. అప్పుడు విభీషణుని చూసిన సుగ్రీవుడు ఆ వచ్చిన వారు రాక్షసులనీ, వారిని వెంటనే ఎదుర్కోవలసిందనీ తన సేనలను ఆజ్ఞాపించాడు. సుగ్రీవుడి ఆనతిని అందుకున్న వానర సేన తనను చుట్టుముట్టబోగా, వారిని చూసి విభీషణుడు తాను లంకాధిపతి రావణుని సోదరుడిననీ, అన్నను వదిలి ధర్మమూర్తి అయిన రాముని శరణు కోరి వచ్చాననీ, తాను మిత్రుడినే తప్ప శత్రువుని కాననీ చెప్పాడు. ఆ మాటలు విని సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, మైందుడు తదితరులు అతనిని ఎంతమాత్రమూ నమ్మవద్దని, అతడికి ఆశ్రయం ఇవ్వడం ప్రమాదకరమనీ రామునికి చెప్పారు. హనుమంతుడు కూడా ఇంచుమించు అవే మాటలు చెప్పాడు. అప్పుడు రాముడు వారితో– ‘‘వానర వీరులారా! విభీషణుని గురించి మీరంతా చెప్పినవి విన్నాను. మీరు చెప్పిన మాటలు యదార్థమే కావచ్చునేమో కానీ, నాకొక వ్రతం ఉంది. అదేమంటే, నాకు శత్రువైనా, మిత్రుడైనా ఎవరైనా నా దగ్గరకు వచ్చి ‘శరణు’ కోరితే, వారిలో ఎటువంటి దోషాలున్నా, వారు ఎంతటి చెడ్డవారయినా సరే, నేను వారికి అభయమిచ్చి తీరుతాను. సుగుణాలు ఉన్నవానిని రక్షించడం కంటే దోషాలున్న వారిని రక్షించడంలోనే మంచితనం బయటపడుతుంది. మరొకటి, ఇక్కడున్న ధర్మసూక్ష్మమేమిటంటే, దుష్టుడైన రావణునికి ధర్మం తెలిసిన విభీషణుడు తమ్ముడు కాకూడదన్న నియమమేమీ లేదు కదా... అదేవిధంగా మన శత్రువుల వద్ద నుంచి వచ్చినంత మాత్రాన అతడు కూడా మనకు శత్రువు కానవసరం లేదు! మనకు మిత్రుడు కావచ్చు కదా! లోకంలో దాయాదులెవరూ మిత్రుల్లా కలిసి మెలిసి ఉండరు. వారిలో వారికి మనస్పర్ధలుంటాయి. అందుకే జ్ఞాతులు సాధారణంగా విడిపోతుంటారు. ఒకరితో ఒకరు కలహించుకుంటూ ఉంటారు. అలాగే సీత కారణంగా రావణుడికి, విభీషణుడికి భేదాభిప్రాయాలు వచ్చి ఉంటాయి. అందుకే రావణుడు తమ్ముడిని తరిమి వేసి ఉంటాడు. మనం వచ్చిన కార్యం... అధర్మపరుడైన రావణుని ఎదిరించి, నా సీతను తీసుకు రావడం. కాబట్టి విభీషణుడికి, మనకు శత్రుత్వం ఎలా ఉంటుంది? ఒకవేళ మీరందరూ అనుమానించినట్లుగా విభీషణుడు దుష్టుడైనా కానీ మనకు వచ్చిన భయమేమీ లేదు. అతడు నాకు గానీ, మీలో ఎవరికైనా కానీ ఎటువంటి అపకారమూ చేయలేడు. నేను తలచుకుంటే ఈ భూమి మీద ఉన్న రాక్షసులను, దానవులను, యక్షులను ఒంటిచేత్తో ఎదుర్కోగలను. అలాంటిది ఈ ఐదుగురు రాక్షసులు ఎంత? శరణన్న విభీషణుడికి అభయమిస్తున్నాను. అతనిని ఇప్పుడే లంకకు రాజుగా ప్రకటిస్తున్నాను’’ అన్నాడు. రాముడికి ఉన్న ధర్మనిరతి, సంయమనం, ఆలోచన శక్తి, కుశాగ్రబుద్ధి, కొండంత ఆత్మవిశ్వాసాన్ని దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రాజైనవాడు ఎటువంటి విపత్కర పరిస్థితులలో ఉన్నప్పటికీ కేవలం అనుచరులు చెప్పిన మాటలను అసలు వినకుండా ఉండకూడదనీ, అదేవిధంగా ఆ మాటలను మాత్రమే విని, వాటిని బట్టి నిర్ణయం తీసుకోరాదనీ, తాను నిర్ణయించుకున్న విషయాన్ని ఎటువంటి తొట్రుపాటూ మరెంతటి మిడిసిపాటూ లేకుండా చక్కగా వివరించి చెప్పడం, చక్కగా ఆలోచించడం, సత్వర నిర్ణయాలు తీసుకోగలగడం, ఆ తీసుకున్న నిర్ణయాలను వెంటనే అమలు చేయడం ఎంతో మంచి చేస్తుందనీ మనం అర్థం చేసుకోవాలన్నదే ఇందులోని నీతి. – డి.వి.ఆర్. భాస్కర్ -
కోపమేల హనుమా!
రామరావణ యుద్ధం అరివీర భయంకరంగా జరిగింది. రావణుడు మరణించాడు. ఆ వార్త మొదట సీతమ్మ చెవిన వేశాడు హనుమ. ఆ మాట విని సీతమ్మ – హనుమా! ఎంత మంచి వార్త చెప్పావు? నిన్ను పొగడడానికి ఈ లోకంలో భాష చాలదు. నీకు ఇవ్వడానికి లోకంలో తగిన బహుమతి లేనే లేదు– అంది కళ్లలో నీళ్లతో. అది చూసి హనుమ చలించిపోయాడు. ఎన్ని అవమానాలు, కష్టాలు, కడగండ్లు ఎలా అనుభవించిందో, ఎలా సహించిందో సీతమ్మ తల్లి– అనుకున్నాడు. చుట్టూ రాక్షస స్త్రీలు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. వీళ్లే కదా ఏడిపించింది– అని వారివైపు కోపంగా చూస్తూ– ‘‘అమ్మా! నువ్వు ఆజ్ఞ ఇస్తే వారినందరినీ నా పిడికిలి పోటుతో చంపేస్తాను’’ అన్నాడు. అప్పుడు సీతమ్మ ‘‘హనుమా! ఈ రాక్షస స్త్రీలు రావణుడి దాసీ జనం. యజమాని చెప్పినట్లు చేయడం వారి ధర్మం. తమ ధర్మాన్ని నిర్వర్తించిన వారి మీద కోప్పడడం అధర్మం– అనర్థం. రావణుడి ఆజ్ఞానుసారం చేసిన వారి మీద మన ప్రతాపం ఎందుకు? రావణుడు మరణించాడు. వీళ్లు ఇక నన్ను బాధించరు. అలాంటప్పుడు వారితో వైరమే లేదు. వీరిని వదిలెయ్యి’’ అంది. ఈ మాటలకు పులకించిపోయిన హనుమ; తమకు చావు మూడిందనుకున్న రాక్షస స్త్రీలూ కూడా ఆనందంతో సీతమ్మ పాదాలకు ప్రణమిల్లారు. – డి.వి.ఆర్. -
లోక కల్యాణం
ఈ లోకంలో... మనిషికి మంచి గుణాలుంటే! ఈ లోకం తప్పకుండా... సుభిక్షంగా... సులక్షణంగా... ఆనందంగా ఉంటుంది. శ్రీరాముడిని... ఎలా పూజించాలనే మీమాంస అక్కరలేదు. ఈ సకలగుణాభిరాముడి సుగుణాల్లో... కొన్నింటినైనా మనవిగా చేసుకుంటే... ఆయనకు నైవేద్యం పెట్టినట్లూ ఉంటుంది! మనకు ప్రసాదం అందినట్లూ ఉంటుంది!! అదే లోక కల్యాణం. రామ... ఆ పేరే ఎంతో ప్రియమైనది. తియ్యనైనది. సుందరమైనది. పిబరే రామరసం... రాముని భక్తిలో ఐక్యమవడానికి మించిన ధన్యత ఏముంటుంది గనక. మానవునిగా పుట్టి దేవునిగా ఎదిగినవాడు రాముడు. బలహీన పడే సందర్భాలలో బలహీన పడక, తల వొగ్గాల్సిన సమయాలలో తల వొగ్గక, మాట తప్పాల్సిన సంకటాలలో కూడా మడమ తిప్పక... అదిగో నేను సంపూర్ణమై నిలిచాను... నా దారిలో నడవండి... ఈ దారిలో కష్టాలు ఎదురు కావచ్చు కాని విజయం మాత్రం తథ్యం... అని నిరూపించినవాడు పరంధాముడు. కుమారుడంటే ఇలా ఉండాలి... భర్త అంటే భార్య కోసం ఇలా పరితపించాలి... సోదరుడంటే తన సోదరుల మీద ఇంత ఆపేక్ష చూపాలి, స్నేహితుడంటే తన స్నేహితుడి కష్టాలలో అండగా ఇలా ఉండాలి... ఆహా... రాముడి చరితలో ప్రతి సామాన్యుడు వెతుక్కోవాల్సిన ఘట్టాలు ఎన్నో ఎన్నెన్నో... అందుకే ధర్మవర్తనకు, ప్రవర్తనకు ప్రతిరూపం ఆ శ్రీరామచంద్రుడు. ఆయన కల్యాణ వేడుక పుడమి పరవశించే పర్వదినం. ఆ రాముడు ఎందుకు అవతారమూర్తి అయ్యాడో ఈ శ్రీరామనవమిన చేస్తున్న భక్తిపూర్వక సందర్శనమిది. గొప్ప కుమారుడు అయోధ్యానగరం అంటే ఒక మూలన బంగారం... ఆ మూలన వెండి... ఎటు చూసినా ఐశ్వర్యం... అది రాముడి రాజ్యం. రామరాజ్యం. ఆ రాజ్యానికి ప్రభువు రాముడు. రాజయ్యాక, అవక ముందు కూడా తనను తాను దశరథ తనయుడనే చెప్పుకున్నాడు తప్ప రాజునని ఏనాడూ చెప్పుకోలేదు. అంతటి వినమ్రుడు రాముడు. చిన్ననాటి నుంచే ఆయనకు ఈ వినమ్రత ఉంది. విశ్వామిత్రుడు వచ్చి, యాగరక్షణ కోసం పంపమని అడిగినప్పుడు, తండ్రి ఆజ్ఞపై తమ్ముడు లక్ష్మణునితో కలసి విశ్వామిత్రుని వెంట నడిచాడు రాముడు. సీతాస్వయంవరానికి తీసుకెళ్లినప్పుడు లేశమాత్రంగా శివధనుర్భంగం చేసి సీతను గెలుచుకున్నా విశ్వామిత్రుడి ద్వారా తలిదండ్రులకు సమాచారాన్ని తెలియజేశాకే సీతను వివాహం చేసుకున్నాడు. తండ్రి మాట కోసం పూచికపుల్లతో సమానంగా రాజ్యాన్ని త్యజించినవాడు మానవుడవుతాడా మహనీయుడవుతాడుగానీ! గొప్ప స్థితప్రజ్ఞుడు కన్నతల్లి కౌసల్యను ఎంతగా ప్రేమించాడో పిన తల్లులు సుమిత్రను, కైకను కూడా అంతగా ప్రేమించినవాడు రాముడు. మరికొద్దిసేపటిలో యువరాజుగా పట్టాభిషిక్తుడు కావలసిన వాడు కైక వరం వల్లే సామాన్యుడిగా మిగిలాడు. కైకను నిందించినా కైకను ఎదిరించినా కైకకు తండ్రి ఇచ్చిన వరాలను తోసిపుచ్చినా, అతడి రాజ్యం అతడికి దక్కి ఉండేది. కాని కైక దుర్బలత్వాన్ని, రాజ్యం పట్ల, కుమారుడు భరతుడి పట్ల ఆమెకున్న లాలసను రాముడు అర్థం చేసుకున్నాడు. అందుకే కైకను పన్నెత్తి ఒక్కమాట అనలేదు. అపకారికి అపకారం చేయడం దానవ లక్షణమైతే, ఉపకారం చేయడం రాముడి లక్ష్యం. గొప్ప భర్త రాముడు ఏకపత్నీవత్రుడు. పురాణాలలో పతివ్రతలుగా అనేకమంది కనిపిస్తారు. కాని ఏకపత్నీవ్రతం వల్ల పూజలు అందుకున్న ఒకే ఒక పురుషుడు రాముడు. సీత సమక్షంలో లేని రాముడు అసంపూర్ణుడు. సీతారాములు అనేది జంటగా కనిపించే ఒకే మాట. రాముడూ సీతా వేరు వేరు కాదు. మనసా వాచా కలగలిసిపోయిన ఏకరూపం. ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రలోభ పెట్టినా సీతమ్మను తప్ప మరొకరి వంక కన్నెత్తి కూడా చూడలేదాయన. వనవాసానికి వెళ్లవలసి వచ్చినప్పుడు సుకుమారి అయిన సీతమ్మ తనతో అడవులకు వస్తే కష్టపడవలసి వస్తుందని వారించాడు. తనను అడవులకు రావద్దన్నందుకు ఎన్నో విధాలుగా సీతమ్మ నిష్టూరపడితే తప్ప ఆమె తనతో రావడానికి అంగీకరించలేదు. ఇంతి కష్టం తన కష్టం చేసుకునేవాడే పురుషుడు. మర్యాదరాముడు. గొప్ప శ్రేయోభిలాషి... శ్రీరాముడు అందరి బంధువు. ఆయనను చూడాలని, ఒక్కసారి దర్శించాలని కోరుకోని వారెవరు? శబరి శ్రీరాముణ్ణి ఆరాధించింది. ఆయన దర్శనం కోసం పరితపించిస్తోందని తెలిసి, ఆమెను మించిన స్థాయి లేదని, ఆమె వద్దకెళ్లి, ఆమె ఎంగిలిని మహాప్రసాదంలా స్వీకరించాడు. ఇక అడవుల్లో జడ పదార్థం వలే రాయిలా మారి ఉన్న అహల్య రాముడి ఓదార్పు వల్లే తిరిగి మామూలు మనిషయ్యింది. రాముడు శ్రేయోభిలాషి. ఎదుటివారి శ్రేయస్సు కోరే వాడే శ్రీరాముడు. గొప్ప స్నేహితుడు మన స్నేహంలో గొప్పతనం ఉంటేనే మనకు గొప్ప స్నేహితులుంటారు. శ్రీరాముడి గొప్పతనం సుగ్రీవుడితో స్నేహంలోనే తెలిసి వచ్చింది. ఇద్దరూ కష్టకాలంలోనే స్నేహితులయ్యారు. ఇద్దరూ రాజ్యాన్ని విడిచి, అడవులలో ఉంటున్నారు. రాముడు సుగ్రీవుడికి ధైర్యాన్ని ఇచ్చాడు. అతడి వల్ల ఆసరాను పొందాడు. అందుకే సుగ్రీవుడు ‘నువ్వు స్నేహితుడుగా లభించడం నా అదృష్టం. ఇలాంటి వ్యక్తి స్నేహితుడుగా ఉంటే ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు. నీతో స్నేహం కలవడం నాకు దైవమిచ్చిన వరం అనుకుంటాను’ అంటాడు. పడవ నడిపేవాడైన గుహునితో కూడా రామునికి అంతే స్నేహం. రాముడిలాంటి స్నేహితుడు ఉంటే చేతిలో రామబాణం ఉన్నట్టే. గొప్ప సహోదరుడు అనుక్షణం నీడలా తనను అనుసరించే లక్ష్మణుడంటే శ్రీరాముడికి ఎంతో ప్రేమ. ఆ అన్నదమ్ముల మధ్య మౌఖిక సంభాషణ తక్కువ. వారి ఆత్మలే మాట్లాడుకునేవి. ఒకరి సమక్షమే మరొకరికి ఆనందం. అటువంటి లక్ష్మణుడికి ప్రాణం మీదకు వచ్చినప్పుడు రాముడు తల్లడిల్లిపోయాడు. ఇంద్రజిత్తు తన అస్త్రాలతో లక్ష్మణుడిని మూర్ఛిల్లజేసినప్పుడు హనుమంతుడు వెళ్లి సంజీవనీ పర్వతాన్ని తీసుకు వచ్చి లక్ష్మణుని బతికించాక ‘నా బహిఃప్రాణాన్ని తిరిగి నాకు తెచ్చిచ్చినందుకు నీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేను హనుమా’ అంటూ పట్టరాని ఆనందంతో హనుమను కౌగిలించుకుంటాడు. లక్ష్మణుడే రాముడికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ. తమ్ముడి పర్యవేక్షణకు అంత విలువ ఇచ్చి రాముడు ఆదర్శనీయుడైనాడు. గొప్ప ధర్మపరాయణుడు తండ్రి కైకకిచ్చిన మాటకోసమే రాముడు వనవాసం వెళ్లవలసి వచ్చిందని తెలిసి భరతుడు మండిపడ్డాడు. వెంటనే కొంతమంది అనుచరులతో కలసి రాముడిని అన్వేషిస్తూ ఆయన ఉన్న చిత్రకూట పర్వతానికి వెళ్లి, ‘అన్నయ్యా! నిన్ను వనవాసానికి పంపించిన నాన్నగారు ఇక లేరు కదా, నీవు వచ్చి రాజ్యాన్ని ఏలుకో’ అంటూ అర్థిస్తాడు. రాముడు అంగీకరించడు. తండ్రికి ఇచ్చిన మాటను వెనక్కు తీసుకోడు. దాంతో నిస్సహాయుడై రాముడి పాదుకలను నెత్తి మీద పెట్టుకుని వెళ్లి ఆ పాదుకలకే పట్టం కట్టి, పరిపాలన చేస్తాడు భరతుడు. అ–సామాన్యుడు రావణుడు మాయావి, అమిత బలవంతుడు, అపారమైన బలగం గలవాడు. తానేమో సామాన్య మానవుడు. కోతిమూక, తమ్ముడు తప్ప తనకు ఏ బలమూ, బలగమూ లేదు. అయినా సరే, రాముడు ఏమాత్రం అధైర్యపడలేదు. వారి సాయంతోనే సేతువు నిర్మించాడు. వారినే వెంటబెట్టుకుని, లంకా న గరానికి వెళ్లి, వారినే సైన్యంగా చేసుకుని యుద్ధానికి సిద్ధపడ్డాడు. మధ్యమధ్యలో రావణుని మాయోపాయాలకూ, కుతంత్రాలకూ కుంగిపోలేదు. గొప్ప యుద్ధతంత్రాన్ని రచించి రావణుని సేనను, సోదరులను, పుత్రులను, ఇతర బలగాన్నంతటినీ క్రమక్రమంగా మట్టుపెడుతూ, రావణుని ధైర్యాన్ని నీరుకార్చి, చివరకు అంతటి బలశాలినీ నేలకూల్చాడు. గొప్ప శిష్యుడు కులగురువైన వశిష్ఠుని మాటను శ్రీరాముడు ఏనాడూ మీరలేదు. ఆయన చెప్పిన శాస్త్రాలను, శస్త్రాస్త్రాలనూ ఆపోశన పట్టాడు. మధ్యలో వచ్చిన విశ్వామిత్రుడినీ గురువుగానే భావించాడు. ఆయన వద్ద యుద్ధవిద్యలన్నీ నేర్చుకున్నాడు. ఆయన తీసుకువెడితేనే సీతా స్వయంవరానికి వెళ్లాడు. శివధనుర్భంగానంతరం ఆయన అనుమతితోనే తల్లిదండ్రులనూ, ఇతర సోదరులనూ, పరివారాన్నీ వశిష్టునీ మిథిలానగరానికి రప్పించాడు. ఆదినుంచి అభిప్రాయ భేదాలతో రగిలిపోతున్న ఇరువురు గురువులనూ ఒక్కతాటిమీద నడిపించాడు. గొప్ప యజమాని చేసిన సాయాన్ని మరువని కృతజ్ఞతాభిరాముడు శ్రీరాముడు. అందుకే సీతమ్మ జాడ కనిపెట్టిన హనుమంతుని బిడ్డలా చూసుకున్నాడు. ఎవరికీ ఇవ్వనంతటి చనువును ఇచ్చాడు. కొన్ని సార్లయితే సీతమ్మకు సైతం దక్కని చొరవ ఆంజనేయునికి దక్కిందంటే అర్థం చేసుకోవచ్చు. గొప్ప యజమానికే గొప్ప భక్తుడు దొరుకుతాడు. రాముడు గొప్ప యజమాని. హనుమంతుడు గొప్ప స్వామి భక్తుడు. ఈ జంట ప్రజల గుండెల్లో చెరగని జోడి. – డి.వి.ఆర్. భాస్కర్ -
సీతమ్మ పుస్తెలతాడు డీల్ ఎంత?
ఆలయంలోని ఆభరణాలు తీసుకెళ్లిందెవరు? - నీరుగారిన భద్రాద్రి నగల మాయం కేసు - మౌనం వహిస్తున్న ఆలయ అధికారులు - అర్చకుల మధ్య సాగుతున్న అంతర్గత పోరు - రామాలయంలో నిగ్గు తేలాల్సిన నిజాలెన్నో! భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం రామాలయంలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరి ణామాలు చర్చకు దారితీస్తున్నారుు. స్వామికార్యం పేరుతో కొందరు అర్చకులు, ఉద్యోగులు కలసి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. దేవా దాయశాఖ అధికారులు ఈ ఆలయం వ్యవహారాలపై దృష్టి సారించకపోవటం వెనుక ఏదో మతలబు దాగి ఉందనే ప్రచారం సాగుతోంది. ఆలయంలో బంగారు ఆభరణాలను మాయం చేసినా చర్యలు చేపట్టకపోవడంతో సదరు పూజారులు తమ పంథాను మార్చుకోవటం లేదు. నిత్య కల్యాణోత్సవంలో లక్ష్మణ స్వామికి లాకెట్ వేసి అలంకరణ చేయకపోవటం, ఆ విషయం పత్రికల ద్వారా బయట పడే వరకు దేవస్థానం అధికారులకు తెలియకపోవటం గమనార్హం. అసలు స్వామికి లాకెట్ ఎందుకు అలంకరించటం లేదనే విషయంపై కూపీ లాగితే.. కొత్తకోణాలు వెలుగులోకి వస్తున్నారుు. గత నెల 19న గర్భగుడిలోని బీరువా లోని సీతమ్మ పుస్తెలతాడు, లక్ష్మణ స్వామి బంగారు లాకెట్ కనిపించకుండా పోరుున విష యం తెలిసిందే. వీటి కోసం 10 రోజుల పాటు అర్చకులంతా వెతికారు. దేవాదాయశాఖ ఆభరణాల తనిఖీ అధికారి పర్యవేక్షణలో మరోసారి స్వామి వారి నగలను పరిశీలించి.. ఆ 2 ఆభరణాలు కనిపించలేదని ప్రకటించారు. కానీ.. 10 రోజుల తర్వాత గర్భగుడిలోని అదే బీరువాలోని లాకర్లో ప్రత్యక్షమయ్యారుు. నగలు పోయాయని ధ్రువీకరించాక అక్కడే అవి కనిపించటం పెద్ద డ్రామాలా మారింది. ఈ ఎపిసోడ్లో ఓ అర్చకుడు ‘ప్రధాన’ పాత్ర పోషించాడని తెలిసినా అతడిపై చర్యలు లేకపోవటం అనుమానాలకు తావిస్తోంది. నగల మాయం కేసు కూడా నీరుగారి పోరుుంది. నగలను మాయం చేసిందెవరనేది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. ఇది అర్చకుల మధ్య అంతర్యుద్ధానికి దారితీస్తోంది. డీల్ చేసిందెవరు?: సీతమ్మ పుస్తెలతాడు, లక్ష్మ ణ స్వామి లాకెట్‌ను ఓ ఆధ్యాత్మిక సంస్థకు కట్టబెట్టే క్రమంలోనే వాటిని మాయం చేశారనే ప్రచారం సాగింది. ఆ సంస్థకు అప్పగించేందుకు వాటిని ఇక్కడి అర్చకుడు తీసుకెళ్లాడని, ఈలోగా అది బయటకు పొక్కటంతో తరువాత గుట్టుచప్పుడు కాకుండా యథాస్థానంలో పెట్టినట్లు అర్చకు ల్లో చర్చ సాగుతోంది. లక్ష్మణ స్వామి లాకెట్ ను మాత్రం అప్పటికే ఆ సంస్థకు ఇచ్చారని, దాని స్థానంలో కొత్తది చేరుుంచి పెట్టారనే ప్రచారం కూడా ఉంది. కొత్త ఆభరణాన్ని గుర్తించకుండా ఉండేందుకే దాన్ని స్వామి మెడ లో వేయటం లేదని తెలుస్తోంది. ఈ వ్యవహా రంలో పెద్ద మొత్తంలోనే కానుకగా ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఓ అర్చకుడు ‘కీలక’ంగా వ్యవహరించగా అతడికి దేవస్థానంలోని ఇద్దరు ఉద్యోగులు మద్దతుగా నిలి చినట్లు ప్రచారం సాగుతోంది. విషయం బయటకు పొక్కినా హైదరాబాద్ స్థారుులో ఉన్న ఓ కీలక అధికారి వెన్నుదన్నుగా నిలవటంతోనే చర్యలకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. దేవాదాయశాఖ పెద్దల మౌఖిక ఆదేశాలతో గతంలో పనిచేసిన అధికారి అంగీకరించడం తోనే ఈ డీల్ నడిచినట్లు విమర్శలున్నారుు. అర్చకులను బదిలీ చేస్తాం.. ఆలయ ఉద్యోగులను ఇప్పటికే బదిలీ చేశాం. అర్చకులకు కూడా షిప్టు విధానాన్ని అమలు చేస్తున్నాం. త్వరలోనే వారిని కూడా బదిలీ చేస్తాం. ఈ విషయాన్ని ఇప్పటికే దేవాదాయ కమిషనర్, ఇతర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాం. - రమేశ్‌బాబు, భద్రాచలం ఆలయ ఈవో దొరికిందల్లా దోచెయ్.. సీతమ్మ పుస్తెల తాడును దాచేసినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవటంతో కొందరు ఉద్యోగులు అందినకాడికి దోచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. ఈ నేపథ్యంలోనే భక్తులు ఇచ్చే కానుకల నమోదు పుస్తకం మాయమైంది. అరుుతే 2 రోజుల తర్వాత ఇది కనిపించినప్పటికీ కొన్ని పేజీలు చినిగిపోవటం గమనార్హం. కాటేజీల్లో ఉండాల్సిన ఏసీని ఓ ఉద్యోగి తన ఇంట్లో బిగించాడు. వీటన్నింటిపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు, దాతలు ఇచ్చిన కానుకలను సైతం కొందరు అర్చకులు, ఉద్యోగులు కొల్లగొడుతుండటంపై సర్వత్రా ఆక్షేపణలు వస్తున్నారుు. -
కోర్టుకు వెళ్తుంటే దాడి: ఒకరి మృతి
కోర్టుకు వెళుతున్నవారి ఆటోను అటకాయించి మారణాయుధాలతో దాడి చేసిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం నేలపాడు సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కొల్లిపర మండలం తూములూరుకు చెందిన ఆళ్ల సీతమ్మ తన కుమార్తె శ్రీలక్ష్మి, అల్లుడు బలరామిరెడ్డి.. ఓ కేసుకు సంబంధించి సాక్షి దేవయ్యతో కలిసి బుధవారం ఉదయం ఆటోలో తెనాలి కోర్టుకు వెళుతున్నారు. వీరి వాహనం కొల్లిపర మండలం సిరిపురం, తెనాలి మండలం నేలపాడు గ్రామాల మధ్యకు రాగానే అప్పటికే మాటు వేసి ఉన్న దుండగులు కారుతో అడ్డగించారు. ఆటో పంటకాల్వలోకి బోల్తాకొట్టింది. వెంటనే కారులోని వారు దిగి మారణాయుధాలతో దాడి చేశారు. ఘటనలో బలరామిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో డ్రైవరు నానిసహా మిగిలిన వారు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆస్తి తగాదాల కారణంగా సీతమ్మ రెండో అల్లుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని శ్రీలక్ష్మి ఆరోపిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సీతమ్మ మంగళ సూత్రాలు మాయం
-
'భద్రాద్రిలో నగల మాయంపై విచారణ చేపట్టాలి'
హైదరాబాద్: భద్రాచలం శ్రీ సీతా రామచంద్రస్వామి వారి ఆలయం లో సీతమ్మవారి మంగళసూత్రాలు, లక్ష్మణస్వామి మెడలోని బంగారు లాకెట్ మాయమయ్యాయి. ఈ నగల అదృశ్యంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఘటనకు కారకులైన వారిపై కేసు నమోదు చేయాలయాన్నారు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమన్నారు. తాను ఈ విషయం మీద తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో మాట్లాడినట్లు తెలిపారు. వెంటనే ఈ అంశంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన తెలిపారు. -
సీతమ్మ మంగళ సూత్రాలు మాయం
భద్రాద్రి ఆలయంలో బంగారు నిల్వలపై గందరగోళం భద్రాచలం : భద్రాచలం శ్రీసీతా రామచంద్రస్వామి వారి ఆలయం లో సీతమ్మవారి మంగళసూత్రాలు, లక్ష్మణస్వామి మెడలోని బంగారు లాకెట్ మాయమయ్యాయి. ఈ విషయాన్ని దేవస్థానం ఈవో రమేష్‌బాబు ధ్రువీకరించారు. ఆలయంలో 2 ఆభరణాలు మాయమైనట్లు శనివారం ప్రచారం జరగడం.. ఆ విషయాలు పత్రికల్లో రావడంతో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆలయంలోని ఆభరణాలు ఆలయ ప్రధానార్చకుల ఆధ్వర్యంలోని 11 మంది అర్చకుల బృందం పర్యవేక్షణలో ఉంటాయని ఈవో చెప్పారు. ఇందులో రెండు ఆభరణాలు కని పించలేదని అర్చకులు తన దృష్టికి తీసుకు రాగా వాటి లెక్క తేల్చాలని ఆదేశించి నట్లు చెప్పారు. అర్చకులు సోమవారం వరకు గడువు కోరినట్లు, వారు నివేదిక ఇచ్చాక.. తానూ స్వయంగా ఆభరణాలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అర్చకులపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, స్వామివారి ఉత్సవమూర్తులను అమెరికా వారికి అమ్మకానికి పెట్టడం, బంగారు తాపడం చేయించే విషయంలో తీవ్రమైన గోప్యత పాటించటంతో అప్పట్లో రేగిన దుమారం చర్చనీయాంశమైంది. తాజాగా ఆలయంలో ఆభరణాలు మాయం కావడం ఇక్కడి పాలన తీరును ఎత్తిచూపుతోంది. తాజా పరిణామాలతో భద్రతా ప్రమాణలపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. -
సీతమ్మను కలుద్దాం: టీడీపీ నాయకులు
తాడేపల్లిగూడెం తెలుగుతమ్ముళ్ల ఆలోచన మిత్రపక్ష నేతల మధ్య సయోధ్యకు యత్నం ఐదుగురు సభ్యులతో కమిటీ ! తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీకి, దాని మిత్రపక్షం భారతీయజనతా పార్టీకి పొసగడం లేదు. ఆ పార్టీల్లోని పెద్ద నేతల మధ్య సమన్వయం లోపించింది. ఇది కిందస్థాయి శ్రేణులకు ఇది తలనొప్పిగా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందనే ఆందోళనలో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. ఫలితంగా ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు తెలుగుతమ్ముళ్లు యత్నాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమైనట్టు సమాచారం. దీనికోసం ఓ ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని వేసినట్టు తెలిసింది. నియోజకవర్గంలో ఎప్పటి నుంచో మంత్రి మాణిక్యాలరావుకు, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు మధ్య మాటలులేనట్టుగా కనపడుతోంది. మంత్రి, మున్సిపల్ చైర్మన్ల బంధం కూడా బలహీనంగానే ఉంది. మంత్రి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు వెళితే తెలుగుదేశం పార్టీ నేతలు హాజరుకావడం లేదు. కనీసం సర్పంచ్ స్థాయి వ్యక్తి కూడా వెళ్లడం లేదు. పట్టణంలోనూ పరిస్థితి ఇలానే ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి తన పని తాను చేసుకుని వెళ్తుండగా, ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులు వారి పనులు వారు చేసుకుంటున్నారు. ఎవరికి వారే యమునా తీరేలా ఉండడంతో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడుతోంది. పాలన కూడా సవ్యంగా సాగడం లేదు. టీడీపీ, బీజేపీ మధ్యే కాకుండా తెలుగుదేశం పార్టీలోనూ అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. ఫలితంగా ఆ పార్టీలోని నేతల మధ్య కూడా సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తను ఇంతవరకు నియమించలేదు. ఈ బాధ్యతను మాజీ ఎమ్మెల్యే ఈలి నాని తాత్కాలికంగా నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో హవా ఉన్నవారే హల్చల్ చేస్తున్నారు. ఈ పరిస్థితులను తెలుగుతమ్ముళ్లు కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. మంత్రి, జడ్పీచైర్మన్ల మధ్య కొరవడిన సమన్వయాన్ని చక్కదిద్దేందుకు యత్నించాలని టీడీపీ నాయకులు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో నియోజకవర్గంలోని పట్టణంతోపాటు తాడేపల్లి గూడెం, పెంటపాడు మండలాలకు చెందిన ఐదుగురితో ఓ సమన్వయకమిటీ బృందాన్ని వేసి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మిని కలువనున్నారని పార్టీ వర్గాల సమాచారం. సీతమ్మ వద్ద పంచాయితీ పెట్టి ఆ తర్వాత ఆమె సూచనల మేరకు అవసరమైతే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావును కూడా కలవాలని వారు భావిస్తున్నట్టు తెలిసింది. పార్టీ గాడిలో పడాలంటే, మిత్రపక్షంతో సక్యతగా ముందుకెళితేనే మేలనే ఆలోచనలో టీడీపీ శ్రేణులున్నట్టు సమాచారం. -
అంజలికి ‘అంతిమ’ వీడ్కోలు
తమిళ సినిమా, న్యూస్‌లైన్ : వెండితెర సీతమ్మగా బాసిల్లిన అలనాటి మేటి నటి అంజలీ దేవికి గురువారం కన్నీటి వీడ్కోలు పలికారు. ఆమె భౌతికకాయానికి గురువారం అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. లవకుశ చిత్రంలో సీతమ్మ తల్లి అపనిందను మోస్తూ అడవిలో అష్టకష్టాలు పడినా బాధ్యతలకు దూరంకాకుండా తన కడుపులో పెరుగుతున్న శ్రీరామచంద్రుని వారసుల్ని కని పెంచి విద్యాబుద్దులు, విలువిద్యలు నేర్పించి వారిని తండ్రి చెంతకు చేర్చిన తరువాతే ఆ సాధ్వి తల్లి అయిన భూదేవి ఒడికి చేరుతుంది. ఆ సన్నివేశంలో అత్యంత సహజంగా నటించి రక్తికట్టించిన అంజలీదేవి నిజ జీవితంలోనూ పరిపూర్ణ జీవితాన్ని అనుభవించారు. నటిగా ఎంతో ఖ్యాతిగాంచిన అంజలీదేవి చివరి రోజుల్లో ఆధ్యాత్మిక బాటలో పయనించి ధన్యురాలయ్యూరు. ఈ నట శిరోమణికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు, సినీ ప్రముఖులు అంతిమవీడ్కోలు పలికారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు చెన్నై బీసెంట్ నగర్‌లోని శ్మశాన వాటికలో సంప్రదాయ బద్ధంగా అంజలి అంత్యక్రియలు నిర్వహించారు. అంజలీ దేవి భౌతిక కాయాన్ని సందర్శించడానికి అభిమానులు బారులు తీరారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి ఘనంగా నివాళులర్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు భద్రతను ఏర్పాటు చేసింది.