బంగారు పోగులతో త్రీడీ చీర తయారీ
నవమికి భద్రాద్రి సీతమ్మకు బహూకరణ
సిరిసిల్ల కళాకారుడు విజయ్‌కుమార్ సృజన
సిరిసిల్ల: సిరిసిల్ల చేనేత కళావైభవాన్ని మరోసారి ప్రపంచానికి చాటాడు. మూడు రంగుల్లో త్రీడీ చీరను చేనేత మగ్గంపై నేశాడు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి సీతమ్మకు బహూకరించేందుకు మూడు రంగుల చీరను అద్భుతంగా రూపొందించాడు. ఆయనే సిరిసిల్ల నేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్.
ఆయన 18 రోజులపాటు చేనేత మగ్గంపై శ్రమించి బంగారు, వెండి, రెడ్ బ్లడ్ రంగుల్లో చీరను నేశారు. ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు, 600 గ్రాముల బరువుతో అద్భుతమైన త్రీడీ చీరను రూపొందించారు. ఈ చీరను తిప్పుతుంటే.. రంగులు మారుతూ కనువిందు చేస్తుంది.
ఈ సందర్భంగా విజయ్‌కుమార్ ఆదివారం మాట్లాడుతూ.. శ్రీరామ నవమికి భద్రాచలం సీతారాములకు ఈ చీరను బహూకరించనున్నట్లు తెలిపారు. గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను, ఉంగరంలో దూరే చీరను కూడా విజయ్‌కుమార్ నేసి అభినందనలు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment