ram navami
-
శోభాయాత్రపై రాళ్ల దాడి.. సీఎం మమతపై బీజేపీ ఆగ్రహం!
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో శ్రీరామ నవమి శోభాయాత్రపై రాళ్ల దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. ముర్షిదాబాద్ జిల్లాలోని రెజినగర్‌లోని శక్తిపూర్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా, కొందరు గాయపడినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో పోలీసులు లాఠీచార్జి చేశారని, రెజీనగర్‌లో ఒక వర్గాన్ని టార్గెట్ చేశారని బీజేపీ ఆరోపించింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బుధవారం సాయంత్రం శక్తిపూర్‌లో శ్రీరామనవమి ఊరేగింపులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక మహిళ గాయపడింది. బాధితురాలిని ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించామని, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. Mamata Banerjee is a blot on West Bengal. She, once again, failed to protect Ramanavami Shobha Yatras. Hindu devotees targeted in Rejinagar, Murshidabad. Hindus are a minority in this area. Just pointing it out, so that she doesn’t blame the Hindus for the attack on themselves… pic.twitter.com/pzvJt0aZ4x — Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) April 17, 2024 శ్రీరామ నవమి పండుగ సందర్భంగా పోలీసులు ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకున్నారని బీజేపీ నేత అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. శ్రీరామ నవమి ఊరేగింపునకు రక్షణ కల్పించడంలో సీఎం మమతా బెనర్జీ మరోసారి విఫలమయ్యారని ఆరోపించారు. శోభా యాత్రపై దాడికి మమతా బెనర్జీ మతపరమైన రెచ్చగొట్టే ప్రసంగాలే కారణమని అమిత్ మాల్వియా పేర్కొన్నారు. ముర్షిదాబాద్‌లో అల్లర్ల అనంతరం మేదినిపూర్‌లోని ఎగ్రాలో ఒక వర్గంపై దాడి జరిగింది. ఈ నేపధ్యంలో బీజేపీ కార్యకర్తలు ఎగ్రా పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. ఈ ఘటనలకు బెంగాల్ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలంటూ నినాదాలు చేశారు. -
రామతీర్థంలో నేడు సీతారాముల కళ్యాణం
-
ప్రధాని మోదీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు!
దేశంలో ఈరోజు శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ప్రధాని మోదీ దేశ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజల్లో అణువణువునా శ్రీరాముడు కొలువైవున్నాడని అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా శ్రీ రామ నవమి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాని మోదీ.. సోషల్ సైట్ ఎక్స్‌లో.. 'దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులకు శ్రీ రాముని జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఈ శుభ సమయంలో నా హృదయం భావోద్వేగంతో, కృతజ్ఞతతో నిండిపోయింది. ఈ సంవత్సరం లక్షలాది దేశప్రజల ఆకాంక్ష నెరవేరడాన్ని చూశాను. ఐదు శతాబ్దాల నిరీక్షణ తర్వాత ఈరోజు అయోధ్యలో శ్రీరామనవమిని ఘనంగా జరుపుకునే భాగ్యం మనకు లభించింది’ అని పేర్కొన్నారు. राम भारत की आस्था है, राम भारत का आधार है... pic.twitter.com/iyZm0ponNm — Narendra Modi (@narendramodi) April 17, 2024 అమిత్ షా కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు ‘జై శ్రీరామ్.. అందరికీ పవిత్రమైన శ్రీరామ నవమి పండుగ శుభాకాంక్షలు. మర్యాద పురుషోత్తముదైన శ్రీరాముడు తన జీవితంతో సత్యం, త్యాగం తదితర విలువలతో అత్యున్నత ఆదర్శాన్ని స్థాపించాడు. యావత్ ప్రపంచానికి మార్గనిర్దేశం చేసేందుకు కృషి చేశాడు. 500 ఏళ్ల తర్వాత ఈ ఏడాది స్వామి జన్మదినోత్సవాన్ని ఆయన జన్మస్థలంలో జరుపుకోవడం రామభక్తులందరికీ గర్వకారణం. అందరి క్షేమం కోరుతూ శ్రీరాముణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు. The first Ram Navami after the Pran Pratishtha in Ayodhya is a generational milestone, weaving together centuries of devotion with a new era of hope and progress. This is a day crores of Indians waited for. Innumerable people devoted their lives to this sacred cause. May the… pic.twitter.com/2aJMLn1hhI — Narendra Modi (@narendramodi) April 17, 2024 -
శ్రీరాముని రూపంలో మహాకాళేశ్వరుడు
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో కొలువైన మహాకాళేశ్వరుడు శ్రీరాముని రూపంలో దర్శనమిచ్చాడు. నేడు (బుధవారం) తెల్లవారుజామున నాలుగు గంటలకు మహాకాళేశ్వరునికి భస్మ హారతి నిర్వహించారు. గర్భగుడిలోని స్వామివారికి పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేసి, వివిధ పూజలు చేశారు. హారతి అనంతరం మహాకాళేశ్వరునికి వెండి కిరీటం, రుద్రాక్ష మాల ధరింపజేశారు. భస్మ హారతి సమయాన మహాకాళేశ్వరుణ్ణి శ్రీరాముని రూపంలో అలంకరించారు. అనంతరం మహాకాళ్వేర జ్యోతిర్లింగాన్ని వస్త్రంతో కప్పి, అస్థికలను సమర్పించారు. ఈ సమయంలో వేలాది మంది భక్తులు మహాకాళేశ్వరుని దివ్య దర్శనాన్ని చేసుకున్నారు. ఆలయ పరిసరాలు జై శ్రీ మహాకాళ్ నినాదాలతో మారుమోగిపోయాయి. -
అయోధ్య అణువణువు రామమయం!
అయోధ్యలోని నూతన రామాలయంలో తొలి శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ శ్రీరామ నవమి అయోధ్యకు చారిత్రకమైనదికానుంది. నేడు శ్రీరాముడు సూర్య తిలకం ధరించనున్నాడు. #WATCH | Uttar Pradesh: Devotees throng Ram temple in Ayodhya, on the occasion of #RamNavami pic.twitter.com/H2n0sQi4AP — ANI (@ANI) April 17, 2024 శ్రీరామ నవమి సందర్భంగా రామ్‌లల్లా దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే రామభక్తులు సరయూలో స్నానాలు చేసి, ఆలయానికి తరలివస్తున్నారు. #WATCH | Uttar Pradesh: Devotees throng Hanuman Garhi temple in Ayodhya, on the occasion of #RamNavami pic.twitter.com/ErvcKxzjae — ANI (@ANI) April 17, 2024 శ్రీరాముని దర్శనానికి వచ్చిన భక్తులు ముందుగా హనుమాన్ గర్హిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు కనిపిస్తున్నారు. #WATCH | UP: On security arrangements in Ayodhya on #RamNavami, Praveen Kumar, IG, Ayodhya Range says, " Arrangements have been done since earlier, we have divided the areas into two sectors...at 3:30 am, 'Darshan' have started at Ram temple..." pic.twitter.com/oH617ByA9D — ANI (@ANI) April 17, 2024 అయోధ్యలో భద్రతా ఏర్పాట్ల గురించి అయోధ్య రేంజ్ ఐజీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అయోధ్యలోని రామాలయ పరిసరాలను రెండు సెక్టార్లుగా విభజించి, నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. #WATCH | Uttar Pradesh: Devotees take holy dip in Saryu River as they arrive at Ram temple in Ayodhya, on the occasion of #RamNavami pic.twitter.com/ET582pvoT6 — ANI (@ANI) April 16, 2024 తెల్లవారుజామున 3:30 గంటల నుంచి బాలరాముని దర్శనం ప్రారంభమైంది. రామాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన బంగారు రామాయణాన్ని భక్తులు తిలకిస్తున్నారు. ఈ ప్రత్యేక రామాయణాన్ని మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ సుబ్రమణ్యం లక్ష్మీనారాయణన్ దంపతులు ట్రస్ట్‌కు అందించారు. #WATCH | UP: Devotees arrive in large numbers, early in the morning at Ayodhya Ram temple, on the occasion of #RamNavami pic.twitter.com/H7TOalsMMM — ANI (@ANI) April 16, 2024 -
సీతమ్మకు బంగారు చీర..
-
అయోధ్యకు 1,11,111 కేజీల లడ్డూలు
లక్నో: అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి బాల రాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం తొలి రామనవమి వేడుకలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 17న జరిగే ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రామ నవమి సందర్భంగా 1,11,111 కిలోల లడ్డూలను అయోధ్యలోని రామాలయానికి ప్రసాదంగా పంపి భక్తులకు పంపిణీ చేయనున్నట్లు దేవ్రహ హన్స్ బాబా ట్రస్ట్ ట్రస్టీ అతుల్ కుమార్ సక్సేనా తెలిపారు. కాశీ విశ్వనాథ ఆలయం సహా దేశంలోని పలు ఆలయాలకు ప్రతి వారం లడ్డూ ప్రసాదాన్ని పంపుతున్నట్లు ఆయన చెప్పారు. జనవరి 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ రోజున కూడా దేవ్రహ హన్స్ బాబా ఆశ్రమం 40 వేల కిలోల లడ్డూను నైవేద్యంగా పంపినట్లు తెలిపారు. ప్రధాని మోదీ గత జనవరి 22న అయోధ్య రామాలయంలో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమం జరగుతుండగా ఆర్మీ హెలికాప్టర్లు ఆలయంపై పూలవర్షం కురిపించాయి. ఆరోజు మొదలుకొని అయోధ్యలో సందడి కొనసాగుతోంది. ఏప్రిల్ 17న రామ నవమి సందర్భంగా ఆలయ తలుపులు మూడు రోజుల పాటు 24 గంటలూ తెరచి ఉండనున్నాయి. నైవేద్యం సమర్పించేటప్పుడు, అలంకారం చేసేటప్పుడు మాత్రమే తలుపులు మూసివేయనున్నారు. శ్రీరాముని జన్మదినోత్సవ వేడుకలకు అయోధ్యకు వచ్చే రామభక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. -
సీతమ్మకు త్రీడీ చీర
సిరిసిల్ల: సిరిసిల్ల చేనేత కళావైభవాన్ని మరోసారి ప్రపంచానికి చాటాడు. మూడు రంగుల్లో త్రీడీ చీరను చేనేత మగ్గంపై నేశాడు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి సీతమ్మకు బహూకరించేందుకు మూడు రంగుల చీరను అద్భుతంగా రూపొందించాడు. ఆయనే సిరిసిల్ల నేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్. ఆయన 18 రోజులపాటు చేనేత మగ్గంపై శ్రమించి బంగారు, వెండి, రెడ్ బ్లడ్ రంగుల్లో చీరను నేశారు. ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు, 600 గ్రాముల బరువుతో అద్భుతమైన త్రీడీ చీరను రూపొందించారు. ఈ చీరను తిప్పుతుంటే.. రంగులు మారుతూ కనువిందు చేస్తుంది. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ ఆదివారం మాట్లాడుతూ.. శ్రీరామ నవమికి భద్రాచలం సీతారాములకు ఈ చీరను బహూకరించనున్నట్లు తెలిపారు. గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను, ఉంగరంలో దూరే చీరను కూడా విజయ్‌కుమార్ నేసి అభినందనలు అందుకున్నారు. -
శ్రీరామ నవమి ఇకపై ప్రభుత్వ సెలవుదినం!
పశ్చిమ బెంగాల్లో తొలిసారిగా శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 17న సెలవు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇటువంటి ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్లో దుర్గాపూజ, కాళీపూజ, సరస్వతీ పూజలను ఘనంగా జరుపుకుంటారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా శ్రీరామ నవమి, హనుమాన్ జయంతిని వైభవంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో శ్రీ రామ నవమికి నేటి వరకూ సెలవు లేదు. గత ఏడాది శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపధ్యంలో బీజేపీ పలు విమర్శలు గుప్పించింది. శ్రీరామనవమి రోజున జనం ఊరేగింపులు నిర్వహించే హక్కులను కాలరాయడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ గతంలో వ్యాఖ్యానించింది. ఈ నేపధ్యంలోనే రానున్న శ్రీరామ నవమికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సెలవు ప్రకటించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. తృణమూల్ ప్రభుత్వం హిందువులను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నదంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
రామ నవమి అల్లర్ల కేసు.. సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు షాక్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రామ నవమి సందర్భంగా చెలరేగిన అల్లర్ల కేసును ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లు కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ మేరకు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.టీ మేరకు సీజేఐ డీవై చంద్రచుడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెల్లడించింది. రామనవమి అల్లర్ల కేసును ఎన్ఐఏకు అప్పగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును బెంగాల్ ప్రభుత్వం ఖండించింది. అల్లర్లలో ఎలాంటి పేలుడు ఘటనలు జరగలేదని తెలిపింది. రాజకీయ ప్రలోభంతో వేసిన పిల్ ఆధారంగా హైకోర్టు తీర్పు ఉందని ఆరోపించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం మెట్లెక్కింది. కాగా ఈ ఏడాది రామ నవమి సందర్భంగా రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి. దీనిపై మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 మధ్య పలు పోలీసు స్టేషన్లలో ఆరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అల్లర్లలో మందుగుండు పదార్థాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి విన్నవించారు. వాదోపవాదాలు విన్న తర్వాత కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు, పత్రాలు, స్వాధీనం చేసుకున్న వస్తువులు, సీసీటీవీ ఆధారాలు అన్నీ ఎన్ఐఏకు అప్పగించాల్సిందిగా హైకోర్టు ఇంతకు ముందు ఇచ్చిన తీర్పులో ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పు సమర్థనీయమేనని స్పష్టం చేసింది. గత మార్చిలో జరిగిన ఈ అల్లర్లలో దాదాపు 500 మంది ఆందోళనకారులు రాళ్లు రువ్వుకున్నారు. పలు వాహనాలు దగ్దమయ్యాయి. ఇద్దరు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇదీ చదవండి: Zomato Delivery Boy: జొమాటో బాయ్‌గా పనిచేస్తూనే.. చిరకాల స్వప్నాన్ని సాధించాడు.. -
రెండు వర్గాల మధ్య ఘర్షణ..జంషెడ్‌పూర్‌లో ఉద్రిక్తత..
జార్ఘండ్‌లోని జంషెడ్‌పూర్‌లో రెండు గ్రూపులు ఘర్షణకు దిగడంతో అల్లర్లు చెలరేగాయి. శనివారం శ్రీరామ నవమి జెండాను అపవిత్రం చేశారన్న ఆరోపణలతో ఇరు గ్రూప్‌లు ఘర్షణకు దిగాయి. నిందితులను పట్టుకోవాని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టడంతోనే అల్లర్లు చెలరేగినట్లు అదికారులు తెలిపారు. దీంతో ఆప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అల్లర్లను నియంత్రించేందుకు పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఈ మేరకు శాస్త్రి నగర్లో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుని రెండు దుకాణాలు, ఆటో రిక్షాకు నిప్పు పెట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు పోలీసులు. గుమిగూడి ఉన్నవారిని అక్కడ నుంచి పంపించి.. ఆ ప్రాంతం మొత్తం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది మోహరించారు. ఈ మేరకు సింగ్భూమ్ డిప్యూటీ కమిషనర్ విజయ్ యాదవ్ మాట్లాడుతూ.. అల్లర్లుకు సంబంధించిన కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పరిస్థితిని అంచనా వేస్తున్నామని, సాధారణ స్థితికి తీసుకురావడానికి శాంతి కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కొందరూ సంఘ వ్యతిరేకులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని, పౌరులు అప్రమత్తమై సహకరించాలని విజయ్ అన్నారు. అలాగే శాంతి భ్రదతల రక్షణ కోసం తగినంత పోలీసు బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీం, ఒక మేజిస్ట్రేట్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు సిబ్బందిని నియమించామని ఆమె ఒక ప్రకటనలో చెప్పారు. పుకార్లను నమ్మవద్దదని ఎమ్మెల్యే జాదవ్ ప్రజలను కోరారు. పుకార్లు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేదా సందేశాలు వస్తే పోలీసులకు తక్షణమే ఫిర్యాదు చేయాలని సూచించారు. #WATCH | Security forces conduct flag march in Jamshedpur's Kadma police station area following an incident of stone pelting and arson, in Jharkhand Section 144 CrPc is enforced in the area and mobile internet is temporarily banned. pic.twitter.com/NhPnWtkQhR — ANI (@ANI) April 10, 2023 (చదవండి: కోవిడ్ సన్నద్ధతపై దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్.. అప్రమత్తంగా ఉండాల్సిందే!) -
భద్రాద్రిలో వైభవంగా మహా పట్టాభిషేక మహోత్సవం (ఫొటోలు)
-
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
-
భద్రుని కోరిక మేరకు భద్రగిరిపై వెలిసిన భద్రాది రాముడు
-
ధూల్ పేట్ లో ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో రామనవమి శోభాయాత్ర
-
నేడు భద్రాద్రి రాములోరి కల్యాణం
-
కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం
-
అదిగో..అదిగో...భద్రగిరి
-
ఐపీఎస్‌పై దాడి.. కేంద్రమంత్రిపై ఎఫ్ఐఆర్!
కోల్‌కతా: 144 సెక్షన్‌ను ఉల్లంఘించి.. ఐపీఎస్ అధికారిపై దాడి చేశారంటూ కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోపై పశ్చిమ బెంగాల్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. శ్రీరామనవమి సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగిన అసన్సోల్ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొనడంతో పోలీసులు 144 సెక్షన్ విధించి.. నిషేధాజ్ఞలు అమల్లోకి తెచ్చారు. అయితే, తన నియోజకవర్గం పరిధిలోని అసన్సోల్ పరిస్థితిని సమీక్షించేందుకు అక్కడ పర్యటించాలని కేంద్రమంత్రి బాబుల్ ప్రయత్నించారు. ఇందుకు భద్రతా సిబ్బంది అడ్డుపడటంతో మరో మార్గం ద్వారా కల్యాణ్‌పూర్ ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అడ్డుకోవడంతో ఆగ్రహానికి లోనైన బాబుల్ ఐపీఎస్ అధికారి రూపేశ్ కుమార్‌పై దాడిచేసినట్టు తెలుస్తోంది. దీంతో 144 సెక్షన్‌ను ఉల్లంఘించి.. విధినిర్వహణలో ఉన్న ఐపీఎస్‌పై దాడి చేశారని, అల్లర్లకు పాల్పడ్డారని పోలీసులు కేంద్రమంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అసన్సోల్లో పర్యటిస్తున్న సమయంలో పోలీసులే తనపై దాడి చేశారని, దీనిపై తాను కూడా ఎఫ్ఐఆర్ నమోదుచేస్తానని తెలిపారు. -
బెంగాల్లో రామ్‌నవమి ర్యాలీలపై ఉత్కంఠ
సాక్షి, కోల్‌కతా : రామ్‌నవమి సందర్భంగా భారీ సాయుధ మార్చ్ నిర్వహించేందుకు బీజేపీ సన్నద్ధమవడంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. రామ్ నవమి ప్రదర్శనలకు తాము వ్యతిరేకం కాదని..అయితే శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. పదేళ్ల నుంచీ ప్రదర్శనలు నిర్వహించే ఒకటి రెండు సంస్థలనే ఆయుధాలతో ప్రదర్శన నిర్వహించేందుకు అనుమతిస్తామని చెప్పారు. తొలిసారిగా నిర్వహించే ఎలాంటి ర్యాలీలకు అనుమతి ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా రామ్‌నవమి ర్యాలీలు నిర్వహించాలని బీజేపీ కసరత్తు చేస్తుండగా, భారీ భద్రత నడుమ సైతం వర్థమాన్ జిల్లాలో ఓ మండపాన్ని దుండగులు ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పాలక తృణమూల్ కాంగ్రెస్ ప్రోద్బలంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని బీజేపీ ఆరోపించింది. ఆయుధాలతో రామ్‌నవమి ప్రదర్శనలు నిర్వహిస్తామని బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ తెలిపారు. కోల్‌కతాతో పాటు పొరుగున హౌరా జిల్లాలో ఆయుధాలతో రామ్‌నవమి ర్యాలీలకు బీజేపీ ప్రయత్నిస్తుండటంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు హౌరాలో ర్యాలీలు నిర్వహించాలని తృణమూల్ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ మండిపడింది. ఇప్పటివరకూ రామ్ నవమి వేడుకలను వ్యతిరేకించిన వారు రాజకీయ లబ్ధి కోసం ర్యాలీలను నిర్వహిస్తున్నారని దిలీప్ ఘోష్ ఆరోపించారు. -
బెంగాల్ వీధుల్లో కొత్త రామాయణం
కోల్‌కతా: శ్రీరామ నవమి వేళ పశ్చిమ బెంగాల్ వీధుల్లో కొత్త రామాయణం దర్శనం ఇచ్చింది. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోటాపోటీగా రామ నవమి వేడుకలు జరిపించారు. అయితే, శ్రీరాముడికి ఎంతో ప్రీతిపాత్రమైన హనుమంతుడికి మధ్య పోటీ పెట్టినట్లుగా ఈ ఉత్సవాలు నిర్వహించారు. బీజేపీ పార్టీ నేతలు శ్రీరామ నవమి ఉత్సవం నిర్వహించగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఒక్క హనుమంతుడికి మాత్రమే పండుగ నిర్వహించారు. రెండు పార్టీల నేతలు రోడ్లపైకి వచ్చారు. శ్రీ రామ్ అంటూ వారు, జై హనుమాన్ అంటూ వీరు చూస్తున్నవాళ్లంతా ఔరా అనుకునేలా ఈ వేడుకలు జరిపారు. బీజేపీ నిర్వహించే వేడుకల్లో ఆరెస్సెస్ కూడా తోడై, వారి కార్యకర్తలు కూడా చేరి వీధుల్లో కాషాయ జెండాలతో బారులు తీరి నినాదాలు చేస్తుండగా.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ప్రత్యేకంగా ఆయా నివాసాల నుంచి పలువురుని తీసుకొచ్చి పలు చోట్ల హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. దీంతో ఎలాంటి అవాంచనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా పెద్ద మొత్తంలో భద్రతను మోహరించారు. హిందూ సాంప్రదాయ ఆయుధాలతో ఎస్పీ నివాసం ముందు నుంచే పెద్ద మొత్తంలో ర్యాలీ ప్రారంభించారు. భారీ ఎత్తున నినాదాలు చేస్తూ టాపాసులు కాలుస్తూ రంగులు చల్లుకుంటూ చిందులేస్తూ సందడి చేశారు. దీనిపై పోలీసులు అడ్డు చెప్పగా మొహర్రం రోజున ముస్లింలు ఆయుధాలతో జరుపుకోవడం లేదా మేం చేస్తే తప్పేమిటంటూ 24వ పరగాణాల బీజేపీ అధ్యక్షుడు శంకర్ ఛటర్జీ అన్నారు. -
కళ్యాణం తో వైభోగం
♦ సిద్ధమవుతున్న మాస్టర్ ప్లాన్ ♦ కెమెరాతో చిత్రీకరణ ♦ రామనవమి నాడు వరాల జల్లు! ♦ థీమ్ పార్కుపై మళ్లీ కదలిక ♦ జటాయువు మండ పానికి మెరుగులు ఈ ఏడాది శ్రీరామనవమి నాటితో భద్రాచలం దశ మారనుంది. 15వ తేదీన ఆలయానికి మహర్దశ పట్టనుంది. శ్రీ సీతారాముల కల్యాణానికి హాజరయ్యే ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాద్రి క్షేత్రం అభివృద్ధికి వరాలు కురిపిస్తారని మంత్రి తుమ్మల ప్రకటించారు. దీనిలో భాగంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. దేవాదాయశాఖ, ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు భద్రాద్రి పరిసరాల్లో పర్యటిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రాంత అభివృద్ధిపై సీఎంకు నివేదిక అందజేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. భద్రాచలం : భద్రాద్రి రాములోరి క్షేత్రం రూపురేఖలు మార్చేందుకు పక్కా ప్రణాళిక సిద్ధమవుతోంది. శ్రీరామ నవమి రోజు శ్రీ సీతారాముల కల్యాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలం వస్తారు. భద్రాద్రి క్షేత్రం అభివృద్ధికి వరాల జల్లు కురిపిస్తారని ఇప్పటికే జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. యాదాద్రి, వేములవాడ ఆలయాలకు వందల కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి క్షేత్రానికి కూడా ఆ స్థాయిలోనే నిధులు ఇస్తారని జిల్లా ప్రజలు గట్టి నమ్మకంతో ఉన్నారు. పనుల నిర్వహణపై దేవాదాయశాఖ ఆర్కిటెక్ట్, స్థపతి, ఇతర ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు భద్రాచలం, పర్ణశాల ప్రాంతాన్ని ఓ దఫా పరిశీలించారు. ఆర్కిటెక్ట్ ఆనందసాయి సూచన మేరకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఫొటోగ్రఫీ నిపుణులు డ్రోన్ కెమెరాతో గుడి పరిసరాలను చిత్రీకరించారు. భద్రాచలం రామాలయం, మిథిలా స్టేడియం ప్రాంగణం, గోదావరి స్నానఘట్టాల పరిసరాలను డ్రోన్ కెమెరా వీడియో తీసింది. పర్ణశాల కుటీరం పరిసరాలు, భద్రాలానికి సమీపంలో ఏపీలో విలీనమైన జటాయువు మండప ప్రాంతాన్ని చిత్రీకరించారు. భద్రాద్రి దేవస్థానం డీఈ రవీందర్ తగు సూచనలు చేశారు. భద్రాద్రి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు ఆర్కిటెక్ట్ ఆనందసాయికి వీటిని అందజేయనున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, డ్రోన్ కెమెరాల ద్వారా భౌగోళిక స్థితిగతులను కూడా అంచనా వేసి, దేవాదాయశాఖ ద్వారా ప్రభుత్వానికి తగు నివేదిక అందజేయనున్నారు. ఆ పంచాయతీలూ వస్తే అభివృద్ధి పుంతలు ఏపీలో విలీనమైన ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకులపాడు, పురుషోత్తపట్నం, గుండాల పంచాయతీలు తిరిగి తెలంగాణలోకి వస్తే భద్రాచలం అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని పరిశీలకులు అంటున్నారు. పట్టణానికి సమీపంలోని ఆదర్శనగర్ కాలనీ పక్కన దేవస్థానానికి చెందిన సుమారు 11 ఎకరాల్లో రామాయణం థీమ్ పార్కుతో పాటు, ట్రైబల్ హట్ (గిరిజన మ్యూజియం) నెలకొల్పేందుకు సర్వం సిద్ధమైంది. కానీ రాష్ట్ర విభజనతో ఈ ప్రాంతం ఏపీలోకి వెళ్లింది. థీమ్ పార్కుకు రూ. రూ.21.54 కోట్ల నిధులు కేటాయించాలని కేంద్ర టూరిజం శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. ట్రైబల్ హట్ కోసం రూ.2.05 కోట్ల ఏపీటీడీసీ నిధులు అప్పట్లోనే మంజూరయ్యాయి. శిల్పాల ఏర్పాటు కోసం పెద్ద పెద్ద రాళ్లు తెప్పించి, పనులు కూడా ప్రారంభించారు. కానీ ఈ భూములు ఏపీలో విలీనం కావటంతో పనులకు అవాంతరం ఏర్పడింది. తాజాగా ఈ పంచాయతీలు తిరిగి తెలంగాణకు వస్తాయని నేరుగా సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో థీమ్ పార్కు, ట్రైబల్ హట్ నిర్మాణాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అయితే థీమ్ పార్కును అక్కడ కాకుండా పర్ణశాల లేదా జటాయువు మండపం పరిసరాల్లో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై నివేదికలు సిద్ధమవుతున్నాయి. జటాయువు మండప పరిసరాలను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించటం దీనిలో భాగమేనని దేవస్థానం అధికారులు అంటున్నారు. రెండో ప్రాకార మండపానికి ప్రాధాన్యం ఆలయాభివృద్ధిలో భాగంగా రామాలయం చుట్టూ 150 అడుగుల మేర రెండో ప్రాకారాన్ని నిర్మించేందుకు వైదిక కమిటీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. రామాలయానికి ఎదురుగా ఉన్న నృసింహస్వామి ఆలయానికి ఫ్లైఓవర్ బ్రిడ్జి, ఆలయం నుంచి గోదావరికి దారి, తాతగుడి వరకు రహదారి విస్తరిస్తే ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని వైదిక కమిటీ సూచిస్తోంది. ఆర్కిటెక్ట్ ఆనందసాయికి నివేదిక అందజేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతోంది. ఈ పరిణామాలు భద్రాచలం ప్రాంతవాసుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.