మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో కొలువైన మహాకాళేశ్వరుడు శ్రీరాముని రూపంలో దర్శనమిచ్చాడు. నేడు (బుధవారం) తెల్లవారుజామున నాలుగు గంటలకు మహాకాళేశ్వరునికి భస్మ హారతి నిర్వహించారు. గర్భగుడిలోని స్వామివారికి పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేసి, వివిధ పూజలు చేశారు.
హారతి అనంతరం మహాకాళేశ్వరునికి వెండి కిరీటం, రుద్రాక్ష మాల ధరింపజేశారు. భస్మ హారతి సమయాన మహాకాళేశ్వరుణ్ణి శ్రీరాముని రూపంలో అలంకరించారు. అనంతరం మహాకాళ్వేర జ్యోతిర్లింగాన్ని వస్త్రంతో కప్పి, అస్థికలను సమర్పించారు. ఈ సమయంలో వేలాది మంది భక్తులు మహాకాళేశ్వరుని దివ్య దర్శనాన్ని చేసుకున్నారు. ఆలయ పరిసరాలు జై శ్రీ మహాకాళ్ నినాదాలతో మారుమోగిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment