Mahakaleshwar Temple corridor
-
శ్రీరాముని రూపంలో మహాకాళేశ్వరుడు
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో కొలువైన మహాకాళేశ్వరుడు శ్రీరాముని రూపంలో దర్శనమిచ్చాడు. నేడు (బుధవారం) తెల్లవారుజామున నాలుగు గంటలకు మహాకాళేశ్వరునికి భస్మ హారతి నిర్వహించారు. గర్భగుడిలోని స్వామివారికి పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేసి, వివిధ పూజలు చేశారు. హారతి అనంతరం మహాకాళేశ్వరునికి వెండి కిరీటం, రుద్రాక్ష మాల ధరింపజేశారు. భస్మ హారతి సమయాన మహాకాళేశ్వరుణ్ణి శ్రీరాముని రూపంలో అలంకరించారు. అనంతరం మహాకాళ్వేర జ్యోతిర్లింగాన్ని వస్త్రంతో కప్పి, అస్థికలను సమర్పించారు. ఈ సమయంలో వేలాది మంది భక్తులు మహాకాళేశ్వరుని దివ్య దర్శనాన్ని చేసుకున్నారు. ఆలయ పరిసరాలు జై శ్రీ మహాకాళ్ నినాదాలతో మారుమోగిపోయాయి. -
అమ్మాయి డ్యాన్స్ వీడియో వివాదాస్పదం...హోం మంత్రి సీరియస్
మధ్యప్రదేశ్‌లో ప్రసిద్ధిగాంచిన ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తున్న ఇన్స్టాగ్రామ్ వీడియో సోషల్ మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై మద్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సీరియస్ అవ్వడమే కాకుండా కలెక్టర్, ఎస్సీని ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మత విశ్వాసాలతో చెలగాటమాడితే సహించేది లేదని మిశ్రా మండిపడ్డారు. ఐతే ఈ వీడియోలో ఆ అమ్మాయి గర్భగుడిలో జలాభిషేకం చేస్తున్నప్పుడూ కాంతులు వెదజిమ్మితున్నట్లు ఎఫెక్ట్స్ వంటివి పెట్టింది. అదీగాక ఆలయ పరిసరాల్లో డ్యాన్సులు చేస్తూ బ్యాగ్రౌండ్లో బాలీవుడ్ పాట వీడియోలో వినిపిస్తుంది. మరో యువతి ఆలయంలో పరిసరాల్లో వీడియో తీస్తున్నట్లు ఉంటుంది. ఐతే ఈ వీడియోపై ఆలయ పూజారి మహేష్గురు ఇది సనాతన సాంప్రదాయానికి విరుద్ధమంటూ సదరు అమ్మాయిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో ఆలయ పవిత్రతను మంటగలిపేలా ఉందంటూ మండిపడ్డారు. అలాగే మహకాల్ ఆలయ ఉద్యోగులు కూడా తమ బాధ్యతను సరిగా నిర్వర్తించడం లేదని పూజారి అన్నారు. (చదవండి: బిల్కిస్ బానో కేసు: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు) -
మహాకాల్ కారిడార్: ఉజ్జయిని నిండా ఆధ్యాత్మికతే
ఉజ్జయిని: ప్రధాని మోదీ మంగళవారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మహాకాల్ కారిడార్ మొదటి దశను ప్రారంభించారు. అనంతరం, ధోతి, గమ్చా ధరించి ప్రఖ్యాత మహాకాళేశ్వరాలయం గర్భగుడిలో పూజలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. వలసపాలన సంకెళ్లను తొలగించుకుంటున్నామని, సాంస్కృతిక ప్రాముఖ్యత గల ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. ‘ఉజ్జయినిలోని ప్రతి అణువులోనూ ఆధ్యాత్మికత ఉంటుంది. ఉజ్జయిని ప్రతి మూలలో దైవిక శక్తి ప్రసారం అవుతుంది. భారత దేశ శ్రేయస్సు, జ్ఞానం, గౌరవం, సాహిత్యానికి వేలాది సంవత్సరాలుగా ఉజ్జయిని సారథ్యం వహించింది’ అని పేర్కొన్నారు. ‘పునరుద్ధరణతో నవకల్పన వస్తుంది. వలస పాలనలో కోల్పోయిన వాటిని దేశం పునర్నిర్మిస్తోంది, గత కీర్తిని పునరుద్ధరించుకుంటోంది’ అని ప్రధాని చెప్పారు. మహాకాల్ కారిడార్ ప్రాజెక్ట్ ఉజ్జయిని చైతన్యాన్ని పెంచుతుందని అన్నారు. చార్ధామ్ యాత్రను ఏడాదంతా జరుపుకునేలా రహదారులను అభివృద్ధి చేశామన్నారు. అంతకుముందు, ఉజ్జయిని చేరుకున్న ప్రధాని మోదీకి కారిడార్ వద్ద సాధువులు, మత పెద్దలు స్వాగతం పలికారు. వారికి నమస్కరించుకుంటూ ఆయన ముందుకు సాగారు. అనంతరం ‘శివలింగం’ నమూనాను రిమోట్ బటన్ నొక్కి ఆవిష్కరించి, మహాకాల్ లోక్‌ను ఆయన జాతికి అంకితం చేశారు. బ్యాటరీ కారులో వెళ్తూ ఆయన కారిడార్‌ను పరిశీలించారు. మల్లకంభం విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. కారిడార్‌లో ఏర్పాటు చేసిన ఫౌంటెయిన్లు ఆ ప్రాంతానికి మరింత శోభనిచ్చాయి. కారిడార్ ప్రారంభంలో కొద్ది దూరంలో నంది ద్వార్, పినాకి ద్వార్ ఏర్పాటు చేశారు. ప్రధాని వెంట గవర్నర్ మంగూ భాయ్ పటేల్, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి సింధియా ఉన్నారు. రిమోట్ నొక్కిశివలింగాకృతిని ఆవిష్కరించడం ద్వారా మహాకాల్ కారిడార్ తొలిదశను జాతికి అంకితంచేస్తున్న మోదీ కారిడార్ విశేషాలివీ... ఉజ్జయిని మహాకాళేశ్వరాలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడి మహా కాళి ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఇలా జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలగలిసి ఉన్న మహాక్షేత్రాలు ఉజ్జయిని, కాశీ, శ్రీశైలం మాత్రమే. మత పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా మహా కాళేశ్వరాలయ అభివృద్ధి కోసం దేశంలోనే పొడవైన మహాకాల్ లోక్ కారిడార్‌కు కేంద్రం శ్రీకారం చుట్టింది. కారిడార్ పొడవు 900 మీటర్లు. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.856 కోట్లు. రూ.351 కోట్లతో తొలి దశ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మొత్తం 108 అందమైన పిల్లర్లతో కారిడార్‌ను నిర్మిస్తున్నారు. ఈ పిల్లర్లపై శివుని ఆనంద తాండవంతో పాటు మరెన్నో శివపార్వతుల భంగిమలను చెక్కుతున్నారు. ప్రధాన ద్వారం నుంచి ఆలయం దాకా 93 శివుని విగ్రహాలతో శివపురాణాన్ని చిత్రించారు. ప్రతి విగ్రహంపైనా క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే సంబంధిత సమాచారమంతా వస్తుంది. ప్రాజెక్టులో భాగంగా రుద్రసాగర్ వంటి హెరిటేజ్ నిర్మాణాలను కూడా పునరుద్ధరించి సుందరీకరిస్తున్నారు. ఆలయాన్ని క్షిప్రా నదితో అనుసంధానించేందుకు 152 భవనాలను సేకరించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కృత్రిమ మేధ సాయంతో మొత్తంప్రాంతంపై నిరంతర నిఘా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని ఏటా కోటిన్నరకు పైగా భక్తులు సందర్శిస్తుంటారు. కారిడార్ పూర్తయ్యాక ఈ సంఖ్య రెట్టింపవుతుందని అంచనా. కారిడార్ ప్రాజెక్టు స్థానికంగా ఎంతోమందికి ఉపాధి కూడా కల్పించనుంది. దీనివల్ల నగర ఆర్థికానికి కూడా ఊపు లభించనుంది. ఇదీ చదవండి: మహాకాళేశ్వరుడి మంత్రశక్తి జ్యోతిర్లింగం.. ప్రధాని మోదీ ఆవిష్కరించబోయే కారిడార్ ప్రత్యేకతలు ఇవే! -
అపూర్వం.. అమోఘం.. ఉజ్జయిని మహాకాళ్ లోక్ (ఫొటోలు)
-
Mahakal: మహాకాళ్ లోకపు ప్రత్యేకతలు తెలుసా?
ద్వాదశ జ్యోతిర్లింగాలలో విశిష్ట ప్రత్యేకతతో కూడుకున్న జ్యోతిర్లింగం.. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ప్రసిద్ధ శైవ క్షేత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినీ పట్టణంలో ఉంది. క్షిప్ర నదీ తీరంలో మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం ఇదేనని చెప్తారు. ఇతర చిత్రాలు, లింగాల వలె కాకుండా మంత్ర శక్తితో యేర్పడిన శివలింగంగా భావిస్తారు. అంతేకాదు.. తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగాలయం ఇది. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయ ప్రాంగణం కొత్త సొగసులతో.. సరికొత్తగా ముస్తాబు అయ్యింది. రుద్రసాగరం సమీపాన ఉన్న శ్రీ మహా కాళేశ్వరాలయ కారిడార్ ఇవాళ(మంగళవారం) ప్రారంభం కాబోతోంది. మహాకాళ్ లోక్ పేరిట అభివృద్ధి చేసిన పనులను ఆవిష్కరించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కార్తిక్ మేళా గ్రౌండ్లో ప్రజల సమక్షంలో ఆయన పాల్గొనున్నారు కూడా. పూజ తర్వాత ఈ కారిడార్‌ను జాతికి అంకితం చేయనున్నారాయన. Har Har Mahadev! The newly built Mahakal Corridor in Ujjain. pic.twitter.com/dA4ZgeEejD — Y. Satya Kumar (సత్యకుమార్) (@satyakumar_y) October 8, 2022 ► మహాకాళేశ్వర ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా, గర్భగుడి శ్రీచక్రయంత్రం తిరగవేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఐదు అంతస్తుల్లో ఉన్న ఆలయంలో మహా కాళేశ్వరుడికి పాతఃకాలం భస్మాభిషేకం చేస్తారు. ► ఇక్కడ కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని "దక్షిణామూర్తి" అని కూడా అంటారు. ► ఉజ్జయినిలో శివలింగాలు మూడుఅంతస్థులుగా ఉంటాయి. అన్నింటి కంటే కింద మహా కాళ లింగం. మధ్యలో ఉండేది ఓంకార లింగం, ఆ పైన నాగేంద్ర స్వరూపమైన లింగం ఉంటుంది. ► రెండు ఫేజ్‌లు మహాకాళ్ లోక్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కారిడార్ కోసం రూ.856 కోట్లు కేటాయించారు. విశాలమైన కారిడార్‌లో శివతత్వం ఉట్టిపడే అలంకరణలతో పాటు సందర్శకులను ఆకర్షించేలా పలు నిర్మాణాలు చేపట్టారు. ► మొదటి ఫేజ్ నిర్మాణానికి రూ.316 కోట్లు ఖర్చు అయ్యింది. 900 మీటర్ల కంటే పొడవైన ఈ కారిడార్.. దేశంలోనే అతిపెద్ద కారిడార్‌గా గుర్తింపు దక్కించుకోబోతోంది. ► మహాకాళేశ్వర ఆలయం చుట్టూరా పాత రుద్రసాగర్ సరస్సు చుట్టూరా ఈ కారిడార్ విస్తరించి ఉండనుంది. Preview of Mahakal Corridor. Newly developed corridor at the Mahakaleshwar temple has been named Sree Mahakal Lok, & its design is inspired by Shiv Leela. Murals & statues portray various aspects of Lord Shiva. On Oct 11, PM @narendramodi Ji will inaugurate it.#ShriMahakalLok pic.twitter.com/uK0Tfyg7q6 — Shobha Karandlaje (@ShobhaBJP) October 9, 2022 ► ఈ కారిడార్‌కు రెండు భారీ నందీద్వారం, పినాకి ద్వారం ఉన్నాయి. ఈ రెండు గేట్వేస్లో తక్కువ దూరంలోనే కారిడార్ ప్రారంభంలో ఉంటాయి. ► ఇక ఈ కారిడార్‌కు మరో ప్రత్యేకత.. విశేష అలంకరణలతో కూడిన 108 స్తంభాలు. ఇసుక రాళ్లు, ఫౌంటైన్లు, శివ పురాణం నుండి కథలను వర్ణించే 50 కంటే ఎక్కువ కుడ్యచిత్రాలు ఉన్నాయి. ► కారిడార్ ప్రాజెక్ట్‌లో మిడ్-వే జోన్, పార్క్, కార్లు, బస్సుల కోసం బహుళ అంతస్థుల పార్కింగ్. పూలు, ఇతర వస్తువులు అమ్మే దుకాణాలు, సోలార్ లైటింగ్, యాత్రికుల సౌకర్యాల కేంద్రం, నీటి పైప్‌లైన్, మురుగునీటి లైన్ మొదలైనవి కూడా ఉన్నాయి. అలాగే, లైట్, సౌండ్ సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేశారు. ► ఇక రూ.310.22 కోట్లతో సెకండ్ ఫేజ్ పనులు కొనసాగుతున్నాయి. రుద్రసాగర్కు పునర్వైభవ పనులు ఇందులోనే సాగుతున్నాయి. A Golden era for Cultural rejuvenation under leadership of Hon'ble PM Shri @narendramodi Ji - Started with Kedarnath Shrine, then Kashi Vishwanath & now Ujjain #MahakalCorridor. Redevelopment of ancient temples for promoting religious tourism is a key priority of @BJP4India govt. pic.twitter.com/aYv4mVvlqm — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 10, 2022 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► రెండో దశ అభివృద్ధి పనుల్లో.. ఆలయ తూర్పు, ఉత్తర ముఖాల విస్తరణ ఉంటుంది. ఉజ్జయిని నగరంలోని మహారాజ్‌వాడ, మహల్ గేట్, హరి ఫాటక్ వంతెన, రామ్‌ఘాట్ ముఖభాగం, బేగం బాగ్ రోడ్ వంటి వివిధ ప్రాంతాల అభివృద్ధి కూడా ఇందులో ఉంది. పురాణాల ప్రకారం.. ఉజ్జయిని నగరానికి అవంతిక అని పేరు. విద్యార్థులు పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయుటకు గల నగరాలలో ఒకటిగా భాసిల్లింది. పురాణం ప్రకారం ఈ ప్రాంతాన్ని చంద్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మహా శివభక్తుడు. శివారాధనకే అంకితం అయ్యేవాడు. ఒకరోజు ఓ రైతు కొడుకు అయిన శ్రీకరుడు, రాజభవనం పరిసరాలలో నడుస్తూ రాజు పఠిస్తున్న భగవంతుని నామాన్ని విని వెంటనే దేవాలయంలోనికి ప్రవేశించి ఆయనతోపాటు ప్రార్థన చేస్తాడు. కానీ రాజభటులు శ్రీకరుడిని బలవంతంగా రాజ్యం వెలుపల గల క్షిప్ర నదీ సమీపంలోనికి పంపిస్తారు. ఉజ్జయినికి ప్రక్కగల రాజ్యాలలోని శత్రు రాజులు రిపుదమన రాజు, సింగాదిత్యుడు ఉజ్జయినిపై దండెత్తి సంపదను దోచుకోవాలని నిశ్చయించుకుంటారు. ఈ విషయం విన్న శ్రీకరుడు ప్రార్థనలు ప్రారంభిస్తాడు. ఈ విషయం విధి అనే పూజారికి తెలుస్తుంది. ఆయన నిర్ఘాంతపోయి.. క్షిప్ర నదీ తీరంలో మహాశివుని కోసం ప్రార్థనలు చేస్తాడు. శివుడు తన భక్తుల అభ్యర్థనలు విని మహాకాళుని అవతారంలో వారికి దర్శనమిచ్చి చంద్రసేనుని రాజ్యానికి చేరిన శత్రువులనందరినీ నాశనం చేశాడు. శివభక్తులైన శ్రీకరుడు, వ్రిధి ల అభ్యర్థన మేరకు ఆ నగరంలోనే ప్రధాన దైవంగా ఉండుటకు అంగీకరిస్తాడు. ఆ రోజు నుండి మహాశివుడు లింగంలో మహాకాళునిగా కాంతి రూపంలో కొలువైనాడు. పరమేశ్వరుడు ఈ క్షేత్రాన్ని దర్శించినవారికి మరణ, వ్యాధుల భయం నుండి విముక్తి కల్పిస్తాడనే నమ్మకం ఉంది.