మధ్యప్రదేశ్‌లో ప్రసిద్ధిగాంచిన ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్ వీడియో సోషల్ మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై మద్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సీరియస్ అవ్వడమే కాకుండా కలెక్టర్, ఎస్సీని ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మత విశ్వాసాలతో చెలగాటమాడితే సహించేది లేదని మిశ్రా మండిపడ్డారు.
ఐతే ఈ వీడియోలో ఆ అమ్మాయి గర్భగుడిలో జలాభిషేకం చేస్తున్నప్పుడూ కాంతులు వెదజిమ్మితున్నట్లు ఎఫెక్ట్స్ వంటివి పెట్టింది. అదీగాక ఆలయ పరిసరాల్లో డ్యాన్సులు చేస్తూ బ్యాగ్రౌండ్‌లో బాలీవుడ్ పాట వీడియోలో వినిపిస్తుంది. మరో యువతి ఆలయంలో పరిసరాల్లో వీడియో తీస్తున్నట్లు ఉంటుంది. ఐతే ఈ వీడియోపై ఆలయ పూజారి మహేష్‌గురు ఇది సనాతన సాంప్రదాయానికి విరుద్ధమంటూ సదరు అమ్మాయిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో ఆలయ పవిత్రతను మంటగలిపేలా ఉందంటూ మండిపడ్డారు. అలాగే మహకాల్ ఆలయ ఉద్యోగులు కూడా తమ బాధ్యతను సరిగా నిర్వర్తించడం లేదని పూజారి అన్నారు.
(చదవండి: బిల్కిస్ బానో కేసు: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment