ఉజ్జయిని: మానవత్వానికే మాయని మచ్చగా నిలిచిన ఘటన ఇది. ఒక చిన్నతల్లికి పెద్ద కష్టం వచ్చి వీధుల్లో తిరుగుతూ సాయం కోరినా ఎవరూ ముందుకు రాని దారుణమైన పరిస్థితి ఇది. మధ్యప్రదేశ్‌లో అత్యాచారానికి గురైన పన్నెండేళ్ల బాలిక అర్ధనగ్నంగా, రక్తమోడుతూ ఉజ్జయిని వీధుల్లో సాయం కోరుతూ తిరిగిన వీడియో అందరినీ కంట తడి పెట్టిస్తోంది. చిన్నారికి వచి్చన ఆ కష్టాన్ని చూసిన వారు దిగ్భ్రాంతికి లోనయ్యారే తప్ప సాయం చెయ్యడానికి ముందుకు రాలేదు.
కొందరు పొమ్మంటూ సంజ్ఞలు కూడా చేయడం కూడా కనిపించింది. చివరికి ఆ బాలిక ఒక ఆశ్రమం ఎదుట స్పృహ తప్పి పడిపోగా ఆశ్రమవాసులు ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో అందరికీ ఈ దారుణం గురించి తెలిసింది. ఆ బాలికపై అత్యాచారం జరిగిందని వైద్య పరీక్షల్లో తేలడంతో వెంటనే ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ప్రస్తుతం ఆ బాలికకు ఇండోర్ ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నామని, ఆమె ప్రాణానికి ప్రమాదం లేదని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా చెప్పారు.
ఆ బాలిక ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు. అత్యాచారానికి గురి కావడంతో తీవ్రమైన షాక్‌లో ఉన్న ఆ బాలిక తను ఎక్కడ నుంచి వచి్చందో, తల్లిదండ్రులు ఎవరో ఇంకా చెప్పలేకపోతోందని సూపరిండెంట్ ఆఫ్ పోలీసు సచిన్ శర్మ చెప్పారు. ఆ బాలికను నిరంతరం వైద్యులు, మానసిక నిపుణులు పరీక్షిస్తున్నారని కౌన్సెలింగ్ ఇస్తున్నారని చెప్పారు. మరోవైపు ఈ ఘటన మానవత్వానికే మచ్చగా మిగిలిందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్ అన్నారు. ఆ బాలిక అలా ఉజ్జయిని రోడ్లపై సాయం కోసం తిరిగిన వీడియో చూసి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ఆమె భవిష్యత్ కోసం కోటి రూపాయలు ఆర్థిక సాయం చేయాలని, రేపిస్టుకి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment