Narottam Mishra
-
అర్ధనగ్నంగా రక్తమోడుతూ
ఉజ్జయిని: మానవత్వానికే మాయని మచ్చగా నిలిచిన ఘటన ఇది. ఒక చిన్నతల్లికి పెద్ద కష్టం వచ్చి వీధుల్లో తిరుగుతూ సాయం కోరినా ఎవరూ ముందుకు రాని దారుణమైన పరిస్థితి ఇది. మధ్యప్రదేశ్‌లో అత్యాచారానికి గురైన పన్నెండేళ్ల బాలిక అర్ధనగ్నంగా, రక్తమోడుతూ ఉజ్జయిని వీధుల్లో సాయం కోరుతూ తిరిగిన వీడియో అందరినీ కంట తడి పెట్టిస్తోంది. చిన్నారికి వచి్చన ఆ కష్టాన్ని చూసిన వారు దిగ్భ్రాంతికి లోనయ్యారే తప్ప సాయం చెయ్యడానికి ముందుకు రాలేదు. కొందరు పొమ్మంటూ సంజ్ఞలు కూడా చేయడం కూడా కనిపించింది. చివరికి ఆ బాలిక ఒక ఆశ్రమం ఎదుట స్పృహ తప్పి పడిపోగా ఆశ్రమవాసులు ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో అందరికీ ఈ దారుణం గురించి తెలిసింది. ఆ బాలికపై అత్యాచారం జరిగిందని వైద్య పరీక్షల్లో తేలడంతో వెంటనే ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ప్రస్తుతం ఆ బాలికకు ఇండోర్ ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నామని, ఆమె ప్రాణానికి ప్రమాదం లేదని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా చెప్పారు. ఆ బాలిక ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు. అత్యాచారానికి గురి కావడంతో తీవ్రమైన షాక్‌లో ఉన్న ఆ బాలిక తను ఎక్కడ నుంచి వచి్చందో, తల్లిదండ్రులు ఎవరో ఇంకా చెప్పలేకపోతోందని సూపరిండెంట్ ఆఫ్ పోలీసు సచిన్ శర్మ చెప్పారు. ఆ బాలికను నిరంతరం వైద్యులు, మానసిక నిపుణులు పరీక్షిస్తున్నారని కౌన్సెలింగ్ ఇస్తున్నారని చెప్పారు. మరోవైపు ఈ ఘటన మానవత్వానికే మచ్చగా మిగిలిందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్ అన్నారు. ఆ బాలిక అలా ఉజ్జయిని రోడ్లపై సాయం కోసం తిరిగిన వీడియో చూసి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ఆమె భవిష్యత్ కోసం కోటి రూపాయలు ఆర్థిక సాయం చేయాలని, రేపిస్టుకి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. -
'పాక్ వెళ్లిన అంజు ఘటనలో అంతర్జాతీయ కుట్ర కోణం'
భోపాల్: పాకిస్థాన్‌లోని ప్రియుడు నస్రుల్లా కోసం భారత్‌ను వదిలిన వివాహిత అంజు అందరికీ తెలిసే ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ భర్తను వదలి పాక్‌లోని తన ప్రియుడు నస్రుల్లా కోసం వెళ్లిపోయింది అంజు. అక్కడికి వెళ్లిన తర్వాత మతం మార్చుకుంది. ఫాతిమాగా పేరు కూడా మార్చుకుని నస్రుల్లాను వివాహం చేసుకుంది. పాకిస్థాన్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. పాక్‌కు వచ్చి మతం మార్చుకున్నందుకు వారి జంటకు స్థానికంగా రియల్ఎస్టేట్ వ్యాపారి బహుమతులు అందిస్తున్నారు. డబ్బు, ఉండటానికి ఇళ్లు, భూములు ఇలా.. సకల సౌకర్యాలను సమకూర్చుతున్నారు. పాక్‌కు వచ్చి మతం మార్చుకున్నందుకు ఆమెకు సాదర స్వాగతాలు లభిస్తున్నాయి. దీనిపై మధ్యప్రదేశ్‌కు చెందిన హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు. ఓ వివాహిత పిల్లలను వదిలి పాక్ వెళ్లి, మతం మార్చుకుని ప్రియున్ని పెళ్లి చేసుకున్న ఘటనల వెనుక అంతర్జాతీయ కుట్ర కోణం దాగి ఉందని నరోత్తమ్ మిశ్రా అన్నారు. అలా పాక్‌కు వచ్చిన యువతికి గిఫ్ట్‌ల పేరిట సకల సౌకర్యాలను సమకూర్చడం కుట్రకు తావిస్తోందని చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. రాజస్థాన్‌కు చెందిన 34 ఏళ్ల అంజుకు 15 ఏళ్ల కూతురు ఉంది. 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వకుండానే ప్రియుని కోసం పాక్‌కు పారిపోయింది. దీనిపై స్పందించిన ఆమె తండ్రి.. తీవ్రంగా ఆవేదన చెందారు. భర్తను పిల్లలను ఎలా వదిలి వెళ్లగలిగిందని అన్నారు. ఆవిడ చనిపోయినట్లుగానే భావిస్తున్నట్లు గతంలో చెప్పారు. ఇదీ చదవండి: జ్ఞానవాపిని మసీదు అనడమే వివాదం.. సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు -
షారుఖ్ ఖాన్ సినిమాకు షాక్.. దీపికా పదుకొణె డ్రెస్‌పై అభ్యంతరం
బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న చిత్రం 'పఠాన్'. ఇటీవలే ఈ మూవీలోని ఓ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాలోని 'బేషరమ్ రంగ్ రో' అంటూ సాగే పాట ప్రస్తుతం వివాదానికి దారితీసింది. ఈ సాంగ్‌పై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పాటలో దీపికా పదుకొణె దుస్తులు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని నరోత్తమ్ మిశ్రా ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో పఠాన్ సినిమా నిషేధానికి పిలుపునిస్తానని హెచ్చరించారు. ఈ పాటలో పదుకొణె రిస్క్ స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ ధరించి కనిపించడంతో చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీపికా పదుకొణె దుస్తులు అభ్యంతరకరంగా ఉన్నాయని.. దాన్ని సరిదిద్దకుంటే మధ్యప్రదేశ్‌లో ఆ చిత్ర విడుదలను నిలిపివేయాలా వద్దా అని ఆలోచించాల్సి వస్తుందని హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. फिल्म #Pathan के गाने में टुकड़े-टुकड़े गैंग की समर्थक अभिनेत्री दीपिका पादुकोण की वेशभूषा बेहद आपत्तिजनक है और गाना दूषित मानसिकता के साथ फिल्माया गया है। गाने के दृश्यों व वेशभूषा को ठीक किया जाए अन्यथा फिल्म को मध्यप्रदेश में अनुमति दी जाए या नहीं दी जाए,यह विचारणीय होगा। pic.twitter.com/Ekl20ClY75 — Dr Narottam Mishra (@drnarottammisra) December 14, 2022 -
వైరల్ వీడియో: తల్లిపై ఫిర్యాదు చేసిన బుడ్డోడికి సర్ప్రైజ్ గిఫ్ట్
-
తల్లిపై ఫిర్యాదు చేసిన బుడ్డోడికి సర్ప్రైజ్ గిఫ్ట్
భోపాల్: తన చాక్లెట్లు దొంగిలించి దొరక్కుండా దాచి పెడుతోందంటూ తల్లిపై ఓ మూడేళ్ల బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. మాటలు సైతం సరిగా రాని వయసులోనే పోలీసులకు ఫిర్యాదు చేయాలనే ఆలోచన చేసిన ఆ బుడ్డోడికి దీపావళి ముందే వచ్చేసింది. ఏకంగా మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ఆ పిల్లాడికి సైకిల్ గిఫ్ట్‌గా పంపించారు. పోలీసులు తీసుకొచ్చి ఇచ్చిన ఆ సైకిల్‌పై చిన్నోడి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తల్లిపై ఫిర్యాదు చేస్తున్న మూడేళ్ల హమ్జా వీడియో చూసిన తర్వాత.. అతడి ధైర్యానికి మెచ్చిన హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా.. దివాళి గిఫ్ట్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆ మరుసటిరోజునే చిట్టి సైకిల్‌ను బాలుడికి పంపించారు. పోలీసు అధికారులు మంగళవారం సాయంత్రం హమ్జా ఇంటికి వెళ్లి సైకిల్‌తో పాటు చాక్లెట్లు అందించారు. వాటిని చూసిన ఆ చిన్నోడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదీ చదవండి: మా అమ్మ చాక్లెట్లు దొంగిలించింది.. అరెస్టు చేయండి.. పోలీస్ స్టేషన్లో బుడ్డోడి వీడియో వైరల్ -
ఓం రౌత్‌కు షాక్.. హనుమంతుడి పాత్రపై హోంమంత్రి అభ్యంతరం
ఆదిపురుష్ టీజర్‌ను వరుసగా వివాదాలు చూట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఈ టీజర్‌పై బీజేపీ అధికార ప్రతినిథి, నటి మాళవిక అవినాష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ దర్శకుడు ఓం రౌత్‌పై మండిపడ్డ సంగతి తెలిసిందే. రామాయణం గురించి రావణుడి పాత్ర గురించి ఎలాంటి అధ్యయనం చేయకుండానే ఓం రౌత్ ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కించినట్టు ఉన్నారని ఆమె ఎద్దేవా చేశారు. అంతేకాదు టీజర్ రిలీజైనప్పటి నుంచి నెటిజన్లు విమర్శలు చేస్తూనే ఉన్నారు. టీజర్ నిరాశ పరించింది, ఇది సినిమానా, పిల్లలు చూసే యానిమేటెడ్ కార్టున్ చిత్రమా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: ‘ఓం రౌత్‌కు రామాయణం తెలియదా?’ బీజేపీ మహిళా నేత విమర్శలు ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తాజాగా టీజర్‌పై స్పందిస్తూ మరో కొత్త వాదనను తెరపైకి తీసుకువ్చారు. బీజేపీ నాయకురాలు మాళవిక రావణుడి పాత్రపై అభ్యంతరం చెప్పగా.. ఆయన హనుమంతుడి పాత్రపై స్పందించారు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆయన టీజర్లో హనుమంతుడికి సంబంధించిన సన్నివేశాలపై అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘ఆది పురుష్ సినిమా టీజర్ చూశాను. అయితే అందులో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి. హిందువుల విశ్వాసానికి సంబంధించిన కొన్ని విషయాలను చూపించే విధానం అందులో సరిగా లేదు. చదవండి: హీరోతో లిప్‌లాక్ సీన్.. రాత్రిళ్లు ఉలిక్కి పడి లేచేదాన్ని: రష్మిక టీజర్లో హనుమంతుడు ధరించిన అంగవస్త్రం తోలుతో(లెదర్ తో) తయారు చేసినట్టు చూపించారు. అది హిందు మత విశ్వాసలను దెబ్బతీసేలా ఉంది. హనుమాన్ చాలీసాలో హనుమంతుడు ఎలా ఉంటారనేది స్పష్టంగా వివరించబడింది. కానీ దర్శకుడు ఇంకేదో చేసి చూపించారు’ అని మండిపడ్డారు. ఇలాంటి అభ్యంతకర సన్నివేశాలను దర్శకుడు సినిమా నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ విషయమై దర్శకుడు ఓం రౌత్‌కు లేఖ రాస్తానన్నారు. ఇక తమ డిమాండ్ మేరకు ఓం రౌత్ ఆ సన్నివేశాలను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చిరించారు. There are objectional scenes in teaser. Lord Hanuman is shown wearing clothes of leather. Such scenes hurt religious sentiments. I am writing to producer Om Raut to remove such scenes. If he doesn't remove, we'll think about legal action: MP Home Min on #Adipurush movie teaser pic.twitter.com/Z4AbUo9MxE — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 4, 2022 -
వారంతా ‘తుక్డే తుక్డే’ గ్యాంగ్ స్లీపర్ సెల్ ఏజెంట్స్.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నటి షబానా అజ్మీతో పాటు జావేద్ అక్తర్, నసీరుద్దీన్ షాను ‘తుక్డే తుక్డే’ గ్యాంగ్, స్లీపర్ సెల్ ఏజెంట్స్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిల్కిస్ బానో గ్యాంప్ రేప్ కేసులో దోషులను విడుదల చేయడంపై ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ స్పందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షబానా అజ్మీ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఏదైనా జరిగితే వీరంతా మాట్లాడేందుకు ముందుకు వస్తారు. మిగతా రాష్ట్రాల్లో ఏం జరిగినా వీరికి పట్టదు. రాజస్థాన్‌లో కన్హయ్య లాల్‌ను హత్య చేశారని, అప్పుడు వారి నోటి నుంచి ఒక్క మాట కూడా లేదని, జార్ఖండ్‌లోని దుమ్కాలో బాలికను సజీవ దహనం చేసిన సమయంలో మౌనంగా ఉన్నారంటూ మండిపడ్డారు. అలాగే, వీరంతా తమ చెడు మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ.. దీన్ని నాగరికత, సెక్యులర్ అని అనడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే షబానా అజ్మీతో పాటు జావేద్ అక్తర్, నసీరుద్దీన్ షాను ‘తుక్డే తుక్డే’ గ్యాంగ్ స్లీపర్ సెల్ ఏజెంట్స్ అంటూ విమర్శించారు. అదే సమయంలో వీరిని అవార్డ్ వాప్సీ గ్యాంగ్ అని కూడా అన్నారు. शबाना आजमी, नसीरुद्दीन शाह जैसे लोग टुकड़े-टुकड़े गैंग के स्लीपर सेल के एजेंट है जो सिर्फ भाजपा शासित राज्यों में हुई घटनाओं पर ही हल्ला मचाते हैं, जबकि कांग्रेस शासित राजस्थान और झारखंड जैसे राज्यों में हो रही घटनाओं पर मौन रहते हैं। अब ऐसे लोगों की कलई खुल चुकी हैं। pic.twitter.com/fPpaTLKbzx — Dr Narottam Mishra (@drnarottammisra) September 2, 2022 -
బాలీవుడ్ నటి సన్నీలియోన్ పాటపై దుమారం
-
మూడు రోజుల్లో ఆ వీడియోని తీసేయాలి!... సన్నీ లియోన్‌కి హోం మంత్రి వార్నింగ్!
ఇటీవల కాలంలో కొన్ని పాటలు తమ మనోభావాలు దెబ్బతీసేలా తీస్తున్నారంటూ చాలామంది కేసులు వేసి కోర్టులకెక్కడం జరుగుతోంది. ఈ మధ్య సమంత ఐటెం సాంగ్ గురించి కూడా అటువంటి విమర్శలే వచ్చాయి. అచ్చం అదే రీతీలో సన్నీ లియోన్ నటించిన "మధుబన్ మే రాధికా నాచే" ఆల్బమ్‌పై విమర్శలు వస్తున్నాయి. మొన్నటి వరకు పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తే ఇప్పుడూ మధ్యప్రదేశ్ హోం మంత్రి సన్నీకి వార్నింగ్ ఇచ్చారు. అసలు విషయంలోకెళ్లితే....ఇటీవల సన్నీ హాట్‌గా నటించిన "మధుబన్ మే రాధికా నాచే" వీడియో ఆల్బమ్ విడుదలైన దగ్గర నుంచి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా సన్నీ నటించిన ఆ మ్యూజిక్ ఆల్బమ్‌ని తీసేయడానికి 72 గంటలు సమయం ఇస్తున్నానంటూ సన్నీని, గాయకుడు సాకిబ్ తోషిని హెచ్చరించారు. ఈ క్రమంలో హోం మంత్రి నరోత్తమ్ మాట్లాడుతూ... "ఆ ఆల్బమ్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. మేము రాధను పూజిస్తాం. సాకిబ్ తోషి తన మతానికి సంబంధించిన పాటలను ఈ విధంగా స్వరపరుచుకోవచ్చు కదా. ఇలాంటి పాటలు మమ్మల్ని బాధపెడతాయి. మూడు రోజుల్లో ఆ వీడియో తీయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని హెచ్చరించారు. అంతేకాదు డిజైనర్ సబ్యసాచి పై చర్యలు తీసుకుంటాం అని అన్నారు. పైగా ఈ ఆల్బమ్‌ని నిషేధించాలంటూ హిందు పూజారులు కూడా మండిపడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు యుపిలోని బృందావన్‌కు చెందిన సంత్ నావల్ గిరి మహారాజ్ కూడా ఈ వీడియోని ప్రభుత్వం నిషేధించకపోతే కోర్టుకు వెళ్తాం అంటూ హెచ్చరించారు. నిజానికి "మధుబన్ మే రాధికా నాచే" పాటను 1960లో కోహినూర్ చిత్రం కోసం మహమ్మద్ రఫీ పాడారు. అయితే ఈ పాట రాధ, కృష్ణుల ప్రేమకు సంబంధించినది. అటువంటి పాటను సన్నీతో అశ్లీలంగా నృత్యం చేయించి తీయడంతోనే వివాదస్పదంగా మారింది. -
వరదల్లో చిక్కుకున్న హోం మంత్రి.. తాడు కట్టి పైకి లాగారు
భోపాల్: మధ్యప్రదేశ్ హోం మినిస్టర్ నరోత్తం మిశ్రాకు చేదు అనుభవం ఎదురయ్యింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు వెళ్లిన నరోత్తం.. చివరకు తానే వరదలో చిక్కుకుపోయాడు. విషయం తెలిసిన వెంటనే అధికారులు హెలికాప్టర్ని రంగంలోకి దించి.. తాడు సాయంతో ఆయనను పైకి లాగి రక్షించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కుండపోత వర్షాల కారణంగా మధ్యప్రదేశ్ దాతియా జిల్లాలో భారీగా వరదలు సంభవించాయి. ఈ క్రమంలో జిల్లాలోని కోట్రా గ్రామంలో ప్రజలు వరదలో చిక్కుకుని ఇబ్బందులు పడసాగారు. ఈ క్రమంలో వరద తీవ్రత పెరగడంతో కొందరు గ్రామస్తులు ఇంటి మీదకు చేరి సాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిసింది. వారికి సాయం చేసేందుకు హోం మినిస్టర్ నరోత్తం మిశ్రా.. కొందరు సహాయక సిబ్బందితో కలిసి పడవలో కోట్రా గ్రామానికి బయల్దేరారు. ఇంతలో ఉన్నటుండి ఓ చెట్టు పడవ మీద పడటంతో అది అక్కడే చిక్కుకుపోయింది.. ముందుకు కదలేదు. పరిస్థితి గురించి నరోత్తాం మిశ్రా ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ని రంగంలోకి దింపారు. తాళ్ల సాయంతో ఆయనను పైకి లాగారు. అనంతరం వరదల్లో చిక్కుకున్న మరో తొమ్మిది మంది గ్రామస్తులను కూడా కాపాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. -
వరదల్లో చిక్కుకున్న హోం మంత్రి.. తాడు కట్టి పైకి లాగారు
-
Toolkit రగడ: దుమ్మెత్తి పోసుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ
న్యూఢిల్లీ: కోవిడ్‌పై రాజకీయ వివాదానికి తెరలేపిన 'కాంగ్రెస్ టూల్‌కిట్' వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య చెలరేగిన మాటల యుద్ధం చల్లారడం లేదు. నిన్నటి వరకు ట్విట్టర్ వేదికగా టూల్‌కిట్ విషయంలో పరస్పరం ఆరోపణలు చేసుకున్న పార్టీలు ఇప్పుడు కరోనా మ్యూటెంట్ పేరిట దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ట్విట్టర్ లేబుల్‌తో ఈ గొడవ సమసిపోతుంది అనుకుంటున్న సమయంలో టూల్‌కిట్ వివాదాన్ని తిరగదోడారు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా. ఈరోజు ఆయన భోపాల్‌లో మాట్లాడుతూ ‘‘ఇండియన్ వేరియంట్ అనే వైరస్ లేకున్నా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్... ఇండియన్ వేరియంట్, సింగపూర్ వేరియంట్ అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నేత కమల్ నాథ్ కూడా ఇలాగే చెప్పారు. టూల్‌కిట్‌తో కమల్‌నాథ్‌కి సంబంధం ఉందని చెప్పడానికి ఇంతకంటే వేరే ఆధారం లేదు’’ అంటూ విమర్శించారు. కమల్ నాథ్ కౌంటర్.. నరోత్తం మిశ్రా ప్రకటనపై ఘాటుగా స్పందించారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్. ఈ వైరస్‌ని మొదట చైనా వైరస్ అన్నారు. ఇప్పుడు ఇండియన్ వేరియంట్ వంతు వచ్చింది. మన శాస్త్రవేత్తలు, డాక్టర్లు కూడా న్యూ స్ట్రెయిన్‌ని ఇండియన్ వేరియంట్ అనే పిలుస్తున్నారు. కేవలం బీజేపీనే దీన్ని అంగీకరించడం లేదు. మన ప్రధానికయితే ఇండియన్ వేరియంట్ అంటేనే భయం పట్టుకుంది. అందుకే టూల్‌కిట్ అంటూ అర్థం లేని విమర్శలు చేస్తున్నారంటూ’’ బీజేపీకి కౌంటర్ ఇచ్చారు కమల్‌నాథ్. ఏమిటీ వేరియంట్.. వైరస్లు సర్వసాధారణంగా వెనువెంటనే వాటి రూపాన్ని మార్చుకుంటాయి. వాటినే స్ట్రెయిన్, మ్యూటెంట్‌గా పిలుస్తారు. ఇండియాలో వచ్చిన కరోనా మ్యూటెంట్‌కి సాంకేతికంగా బీ.1.167 గా గుర్తించారు. అయితే మీడియాతో పాటు సోషల్ మీడియాలో దీన్ని ఇండియన్ వేరియంట్‌గానే పేర్కొంటున్నాయి. ఇండియన్ వేరియంట్ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించనప్పుడు ... ఆ పేరు ఎందుకు ఉపయోగిస్తున్నారని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడైనా ఇండియన్ వేరియంట్ అనే పదం కనిపిస్తే తొలగించాలని లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ని హెచ్చరించింది కేంద్రం. చదవండి: ట్విట్టర్.. నీకిది సరికాదు: కేంద్రం -
‘లవ్‌కి వ్యతిరేకులం కాదు, జిహాద్‌కి వ్యతిరేకం’
భోపాల్: వివాహం పేరుతో మోసపూరితంగా మతమార్పిడికి పాల్పడడంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. దాన్ని నేరపూరితంగా పరిగణిస్తూ, అందుకు పదేళ్ళ వరకు జైలు శిక్షని విధించేలా మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బిల్లుని పాస్ చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ చట్టం ఆవశ్యకతను ప్రశ్నించగా, హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సమాధానమిస్తూ 1968 చట్టం మాదిరిగా కాకుండా, ఈ చట్టం అలాంటి వివాహాన్ని రద్దు చేస్తుందని, ఆ నేరానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష పడుతుందని చెప్పారు. అలాగే లక్ష రూపాయల వరకు జరిమానా కూడా విధిస్తారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో సైతం ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చారు. మోసపూరితంగా గానీ, బలవంతంగా గానీ, భయపెట్టిగానీ, ఏదైనా ప్రలోభంతో గానీ పెళ్ళి పేరుతో మతమార్పిడికి పాల్పడడం ఈ చట్టరీత్యా నిషేధం. దాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. ‘‘మధ్య ప్రదేశ్ ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ బిల్ 2021’’ఆమోదం అనంతరం బీజేపీ శాసనసభ్యులు సభలో ‘జై శ్రీరాం’నినాదాలు చేశారు. అంతకు ముందు జరిగిన చర్చ సందర్భంగా హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ తాము లవ్ జిహాదీ కోసం ‘రఫీక్‌ని రవిగా’మారనివ్వమని అన్నారు. తాము ‘లవ్‌కి వ్యతిరేకులం కాదు, జిహాద్‌కి వ్యతిరేకం’అని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటులో సీఏఏని వ్యతిరేకించినట్టే, ఆర్టికల్ 370ని వ్యతిరేకించినట్టే కాంగ్రెస్ ఈ బిల్లుని సైతం వ్యతిరేకించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యానాన్ని కాంగ్రెస్ నేతలు విజయ్ సక్సేనా తదితరులు తీవ్రంగా తప్పు పట్టారు. చదవండి: కోవిడ్ టీకా: పడిపడి నవ్వుతున్న పోలీసు అధికారి -
ఇక ఆహారం కల్తీ చేస్తే జీవితాంతం జైల్లోనే!
భోపాల్: రోజు తినే ఆహారాన్ని కల్తీ చేయడం కొంతమందికి వ్యాపారంగా మారింది. అయితే దాన్ని అరికట్టాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆహరాన్ని కల్తీ చేసే వారికి జీవితఖైదు శిక్ష విధించే చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ కేబినెట్ కొత్త చట్టాన్ని రూపొందించింది. ‘మిలావత్ పే కసావత్’ నినాదంలో భాగంగా దీన్ని తీసుకొచ్చినట్లు మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా శనివారం మీడియాకు తెలిపారు. కాగా, మధ్యప్రదేశ్‌లో గతంలో ఆహర పదార్థాలు కల్తీ చేసేవారికి ఆరు నెలల జైలు శిక్ష విధించేవారు. ఆ తర్వాత దీన్ని మూడేళ్లకు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆహారం కల్తీ చేసేవారికి మంత్రి వర్గం జీవితఖైదు విధించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇకపై తయారీ తేదీ ముగిసిన వస్తువులను అమ్మేవారికి విధించే శిక్షలను కూడా మరింత కఠినతరం చేస్తామని పేర్కొన్నారు. ఇక కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలపాలని ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ సూచించారు. ఆహరం కల్తీ క్షమించరాని నేరమని, ఇది ప్రజల ఆరోగ్యాన్నితీవ్రంగా ప్రభావితం చేస్తొందని ఆమె అన్నారు. చదవండి: దత్తత పుత్రుడిని ఆశ్చర్యపర్చిన కేంద్రమంత్రి -
ఆలయంలో ముద్దు సన్నివేశాలు
భోపాల్: ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇప్పటికే సత్యం లింగరాజు నిజ జీవితం ఆధారంగా వెబ్‌సిరీస్‌ను రూపొందించి కోర్టు చుట్టూ తిరుగుతున్న నెటిఫ్లిక్స్‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ఏ సూటబుల్ బాయ్’ సిరీస్‌లో హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఈ సంస్థ ప్రతినిధులపై భారతీయ యువ మోర్చా జాతీయ కార్యదర్శి గౌరవ్ తివారీ మధ్యప్రదేశ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేగాక పవిత్ర దేవాలయంలో ముద్దు సీన్లు చిత్రీకరించి మనోభావాలు దెబ్బతీసినందుకు నెట్‌ఫ్లిక్స్ హిందువులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాగా మధ్యప్రదేశ్‌లోని నర్మదా నది ఒడ్డున ఉన్న మహేశ్వర ఆలయంలో ఈ ముద్దు సన్నివేశాలు చిత్రీకరించారని, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నమని ధ్వజమెత్తారు. అంతేగాక ఇది లవ్ జిహాద్‌ను కూడా ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. (చదవండి: ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ అకౌంట్) గౌరవ్ తివారీ ఫిర్యాదు మేరకు నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్, పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంబికా ఖురాలనాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరొత్తం మిశ్రా తెలిపారు. దేవాలయంలో ముద్దు సన్నివేశాలు చిత్రీకరించినట్లు దర్యాప్తులో వెల్లవడంతో సంస్థ ప్రతినిధులైన మోనికా షెర్గిల్, అంబికా ఖురానాలపై ఐపీసీ 295 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. దీనిపై నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు ఇంకా స్పందించ లేదు. కాగా ‘ఏ సూటబుల్ బాయ్’లో సినీనటి టబు కూడా నటించారు. ఇందులో టబుకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా అభ్యంతరకరంగా ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ‘ఏ సూటబుల్ బాయ్’ సిరీస్‌కు ప్రముఖ చిత్రనిర్మాత మీరా నాయర్ దర్శకత్వం వహించారు. ‘సలాం బాంబే’, ‘మాన్ సూన్ వెడ్డింగ్’, ‘ది నేమ్సెక్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి ఆమె విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. (చదవండి: కోహ్లి ట్వీట్‌పై నెట్‌ఫ్లిక్స్ సంబరం) -
లవ్ జిహాద్: ‘ఐదేళ్ల శిక్ష, వారికి సైతం..’
భోపాల్: లవ్ జిహాద్‌ను అరికట్టడం కోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెడతామని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రా అన్నారు. పెళ్లి పేరుతో మత మార్పిడికి పాల్పడితే నాన్ బెయిల్ కేసులు నమోదు చేసి, ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకొస్తామని పేర్కొన్నారు. అదే విధంగా, లవ్ జిహాద్‌కి సహాయం చేసిన వారికి కూడా ప్రధాన నిందితుడితో సమానంగా శిక్ష ఉంటుందని హెచ్చరించారు. బలవంత మత మార్పిడుల కోసం పవిత్రమైన వివాహ ధర్మాన్ని అడ్డు పెట్టుకోవడం దుర్మార్గమని మిశ్రా వ్యాఖ్యానించారు. ఇక పెళ్లి కోసం స్వచ్చందంగా మతం మారాలని భావించే వారు తప్పని సరిగా నెల రోజుల ముందుగానే కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. (చదవండి: సంచలన వ్యాఖ్యలు : మసీదులో హోమం చేస్తాం!) కాగా, కేవలం వివాహం కోసం మతమార్పిడి చేసుకోవడం ఆమోదయోగ్యం కాదన్న అలహాబాద్ కోర్టు వ్యాఖ్యల లవ్ జిహాద్ అంశం ఇటీవల కాలంలో తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కర్ణాటక, హరియాణా వంటి పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు లవ్ జిహాద్‌ను కట్టడి చేసేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామంటూ ప్రకటనలు చేశాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం సైతం అదే బాటలో నడిచేందుకు సిద్ధమైంది. ఇక ముస్లిం వర్గానికి చెందిన అబ్బాయి, హిందూ అమ్మాయిని ప్రేమించడం లేదా పెళ్లి చేసుకున్న సందర్భాలను లవ్ జిహాద్‌గా పేర్కొంటూ రైట్ వింగ్ గ్రూపులు ఈ పదాన్ని వాడుకలోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే లవ్ జిహాద్ అనే పదానికి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్వచనం చెప్పలేదు. అంతేగాకుండా ఈ అంశం ఆధారంగా కేంద్ర నిఘా సంస్థలు ఎలాంటి కేసు నమోదు చేయలేదని లోక్‌సభలో ఈ మేరకు ఫిబ్రవరిలో ప్రకటన చేసింది. -
తన తప్పు ఒప్పుకున్న హోంమంత్రి
ఇండోర్ : ‘నేను ఏ ప్రజా కార్యక్రమంలోనూ మాస్క్ ధరించను. అందులో తప్పేముంది. నేను మాస్క్ వేసుకోనంతే..’ అంటూ బుధవారం నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైన మధ్యప్రదేశ్ హోంమంత్రి నారోత్తమ్ మిశ్రా ఎట్టకేలకు తప్పు తెలుసుకున్నారు. తాను భవిష్కత్తులో ఆరోగ్య సూత్రాలను తప్పక పాటిస్తానని చెప్పారు. గురువారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘నేను మాస్క్ ధరించకపోవటం అన్నది చట్టవిరుద్ధమే. అది ప్రధాన మంత్రి సెంటిమెంట్‌కు సంబంధించి కాదనుకుంటున్నాను. నేను నా తప్పును ఒప్పుకుంటున్నాను. అలా అన్నందుకు చింతిస్తున్నాను. నేను తప్పకుండా మాస్క్ ధరిస్తాను. అందరూ మాస్క్‌లు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని కోరుకుంటున్నాన’’ని పేర్కొన్నారు. ( బిహార్ ఎన్నికలు: మాకు 50 శాతం సీట్లు ఇవ్వండి ) కాగా, బుధవారం మీడియా ప్రతినిధులు ‘‘మీరు మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు?’’ అని అడగ్గా.. ‘‘నేను పెట్టుకోనంతే’’ అంటూ నారోత్తమ్ సమాధానమిచ్చారు. దీనిపై స్పందించిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ‘‘ హోంమంత్రి మాస్క్ పెట్టుకోనంటున్నారు.. ఆయన లాగే ప్రధాన మంత్రి, ప్రజలు నియమాలను తుంగలో తొక్కి కరోనా సమయంలో వాళ్ల ఇష్టం వచ్చినట్లు చేస్తే ఏంటి పరిస్థితి?’’ అని ప్రశ్నించింది. -
అభ్యర్థులను పొగిడినా పెయిడ్ న్యూసే!
న్యూఢిల్లీ: రాజకీయ నాయకుల విజయాలను ప్రస్తావిస్తూ ఓటు అడుగుతున్నట్లు ప్రచురితమయ్యే కథనాలను పెయిడ్ న్యూస్ (చెల్లింపు వార్త) గానే పరిగణించాలని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. చెల్లింపు వార్తల ఆరోపణలపై మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రాను అనర్హుడిగా ప్రకటించిన ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సందర్భంగా.. ‘దినపత్రికల్లో అభ్యర్థి పేరుతో వచ్చే ప్రకటనలు, ఆయన విజయాలను ప్రశంసిస్తూ వార్తలు, వీటిని చూపిస్తూ ఓటు వేయాలని అభ్యర్థే స్వయంగా కోరుతున్నట్లు వచ్చే కథనాలను వార్తలుగా కాకుండా చెల్లింపు వార్తలుగానే చూడాలి’ అని ఈసీ పేర్కొంది. ఇలాంటి వార్తలు ఒకవేళ పెయిడ్ న్యూస్ కాకపోతే ఆ విషయాన్ని అభ్యర్థే నిరూపించుకోవాలని సుప్రీం కోర్టుకు తెలిపింది. -
మధ్యప్రదేశ్ మంత్రిపై వేటు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ సీనియర్ మంత్రి నరో త్తమ్ మిశ్రాపై ఎన్నికల సంఘం (ఈసీ) అనర్హత వేటు వేసింది. పెయిడ్ న్యూస్ అభియోగాలపై, ఎన్నికల ఖర్చులకు సంబంధించి తప్పుడు లెక్కలను చూపించారని పేర్కొంటూ ఆయనపై ఈ చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్‌లోని దటియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నిక కూడా చెల్లదని స్పష్టం చేసింది. శనివారం నుంచి మూడేళ్లపాటు మిశ్రాను అనర్హుడిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారి నసీమ్ జైదీ, ఎన్నికల కమిషనర్లు ఏకే జోటీ, ఓపీ రావత్‌లతో కూడిన ఎన్నికల సంఘం ధర్మాసనం.. 69 పేజీలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ నిర్ణయంతో మిశ్రా మూడేళ్లపాటు ఎన్ని కల్లో పోటీ చేసేందుకు అనర్హులు. 2008 అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా తన ఎన్నికల ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలను ఈసీ ముందుంచలేదని ఆరో పిస్తూ 2009లో కాంగ్రెస్ నేత రాజేంద్ర భారతి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఈసీ.. 2013 జనవరి 15న మిశ్రాకు నోటీసులు జారీ చేసింది. ఈసీ నోటీసులను సవాలు చేస్తూ మిశ్రా మధ్య ప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆయనకు అనుకూల ఫలితం రాలేదు. ఈ నేపథ్యంలో ఈసీ తన తీర్పు వెలువరించింది. మరోవైపు ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఈసీ వెలువరించిన తీర్పు 2008 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినదని, తాను 2013లో జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈసీ తీర్పు చెల్లదని పేర్కొన్నారు. ప్రస్తుత శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలో నీటివనరులు, ప్రజా సంబంధాల శాఖల మంత్రిగా మిశ్రా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల సంఘం నిషేధం విధించినందున నరోత్తమ్ మిశ్రా మంత్రి పదవికి తక్షణం రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ‘బీజేపీ మంత్రులు ఎన్నికల్లో ఎలా గెలుస్తున్నారో నిరూపితమైంది’ అని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ సింగ్ అన్నారు. మధ్యప్రదేశ్ మంత్రిపై వేటు మూడేళ్లపాటు అనర్హుడిగా ప్రకటించిన ఈసీ ∙రాజీనావ] ూకు కాంగ్రెస్ డిమాండ్ న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ సీనియర్ మంత్రి నరో త్తమ్ మిశ్రాపై ఎన్నికల సంఘం (ఈసీ) అనర్హత వేటు వేసింది. పెయిడ్ న్యూస్ అభియోగాలపై, ఎన్నికల ఖర్చులకు సంబంధించి తప్పుడు లెక్కలను చూపించారని పేర్కొంటూ ఆయనపై ఈ చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్‌లోని దటియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నిక కూడా చెల్లదని స్పష్టం చేసింది. శనివారం నుంచి మూడేళ్లపాటు మిశ్రాను అనర్హుడిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారి నసీమ్ జైదీ, ఎన్నికల కమిషనర్లు ఏకే జోటీ, ఓపీ రావత్‌లతో కూడిన ఎన్నికల సంఘం ధర్మాసనం.. 69 పేజీలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ నిర్ణయంతో మిశ్రా మూడేళ్లపాటు ఎన్ని కల్లో పోటీ చేసేం దుకు అనర్హులు. 2008 అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా తన ఎన్నికల ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలను ఈసీ ముందుంచలేదని ఆరో పిస్తూ 2009లో కాంగ్రెస్ నేత రాజేంద్ర భారతి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఈసీ.. 2013 జనవరి 15న మిశ్రాకు నోటీసులు జారీ చేసింది. ఈసీ నోటీసులను సవాలు చేస్తూ మిశ్రా మధ్య ప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆయనకు అనుకూల ఫలితం రాలేదు. ఈ నేపథ్యంలో ఈసీ తన తీర్పు వెలువరించింది. మరోవైపు ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఈసీ వెలువరించిన తీర్పు 2008 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినదని, తాను 2013లో జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈసీ తీర్పు చెల్లదని పేర్కొన్నారు. ప్రస్తుత శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలో నీటివనరులు, ప్రజా సంబంధాల శాఖల మంత్రిగా మిశ్రా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల సంఘం నిషేధం విధించినందున నరోత్తమ్ మిశ్రా మంత్రి పదవికి తక్షణం రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ‘బీజేపీ మంత్రులు ఎన్నికల్లో ఎలా గెలుస్తున్నారో నిరూపితమైంది’ అని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ సింగ్ అన్నారు.