న్యూఢిల్లీ: రాజకీయ నాయకుల విజయాలను ప్రస్తావిస్తూ ఓటు అడుగుతున్నట్లు ప్రచురితమయ్యే కథనాలను పెయిడ్ న్యూస్ (చెల్లింపు వార్త) గానే పరిగణించాలని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. చెల్లింపు వార్తల ఆరోపణలపై మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రాను అనర్హుడిగా ప్రకటించిన ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సందర్భంగా.. ‘దినపత్రికల్లో అభ్యర్థి పేరుతో వచ్చే ప్రకటనలు, ఆయన విజయాలను ప్రశంసిస్తూ వార్తలు, వీటిని చూపిస్తూ ఓటు వేయాలని అభ్యర్థే స్వయంగా కోరుతున్నట్లు వచ్చే కథనాలను వార్తలుగా కాకుండా చెల్లింపు వార్తలుగానే చూడాలి’ అని ఈసీ పేర్కొంది. ఇలాంటి వార్తలు ఒకవేళ పెయిడ్ న్యూస్ కాకపోతే ఆ విషయాన్ని అభ్యర్థే నిరూపించుకోవాలని సుప్రీం కోర్టుకు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment