candets
-
లోక్‌సభ అభ్యర్థుల్లో31% సంపన్నులు... 20% నేరచరితులు
సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 30.8 శాతం మంది కోటీశ్వరులే. అలాగే 20 శాతం (1,643) మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. వారిలో 1,190 మందిపై అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాల వంటి తీవ్రమైన కేసులున్నాయి. మొత్తం 8,360 మంది అభ్యర్థుల్లో 8,337 మంది అఫిడవిట్లను విశ్లేíÙంచిన మీదట అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు బుధవారం నివేదిక విడుదల చేశాయి. మొత్తం అభ్యర్థుల్లో 1,333 మంది జాతీయ పారీ్టల తరఫున, 532 మంది రాష్ట్ర పారీ్టల నుంచి, 2,580 మంది రిజిస్టర్డ్ పారీ్టల నుంచి బరిలో ఉన్నారు. 3,915 మంది స్వతంత్ర అభ్యర్థులు. మొత్తం 751 పారీ్టలు పోటీలో ఉన్నాయి. 2019లో 677 పార్టీలు, 2014లో 464, 2009 ఎన్నికల్లో 368 పారీ్టలు పోటీ చేశాయి. 2009 నుంచి∙2024 వరకు ఎన్నికల బరిలో నిలిచిన రాజకీయ పారీ్టల సంఖ్య 104% పెరిగింది. కాగా మరోసారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన 324 మంది సిట్టింగ్ ఎంపీల సంపద గత ఐదేళ్లలో సగటున 43% పెరిగింది. పెరుగుతున్న మహిళాæ అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళల సంఖ్య ఈసారీ స్వల్పంగానే ఉంది. కేవలం 797 మంది మాత్రమే బరిలో ఉన్నారు. అయితే గత మూడు లోక్‌సభ ఎన్నికల నుంచి వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2009లో 7 శాతం, 2014లో 8 శాతం, 2019లో 9 శాతం మహిళలు లోక్‌సభ బరిలో నిలవగా ఈసారి 10 శాతానికి చేరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 69 మంది మహిళలకు, కాంగ్రెస్ 41 మందికి టికెట్లిచ్చాయి.సగానికి పైగా రెడ్ అలర్ట్ స్థానాలే...క్రిమినల్ కేసులున్న అభ్యర్థుల సంఖ్య 2019 లోక్‌సభ ఎన్నికల్లో 1,500 కాగా ఈసారి 1,643కు పెరిగింది. మొత్తం 440 మంది అభ్యర్థులలో 191 మంది నేర చరితులతో ఈ జాబితాలో బీజేపీ టాప్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ (327 మందిలో 143), బీఎస్పీ (487 మందిలో 63), సీపీఎం (52 మందిలో 33) ఉన్నాయి. 3903 మంది స్వతంత్ర అభ్యర్థులలో 550 (14%) మంది నేర చరితులు. ఈ జాబితాలో టాప్ 5లో కేరళ నుంచి ముగ్గురు, తెలంగాణ, పశి్చమ బెంగాల్ నుంచి ఒక్కొక్కరున్నారు. ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది నేర చరితులున్న (రెడ్ అలర్ట్) స్థానాలు 2019లో 36 శాతం కాగా ఈసారి ఏకంగా 53 శాతానికి పెరిగాయి. ఈ జాబితాలో 288 నియోజకవర్గాలు చేరాయి. అంటే దేశవ్యాప్తంగా ప్రతి రెండు లోక్‌సభ సీట్లలో ఒకటి రెడ్ అలర్ట్ స్థానమే!సంపన్నుల్లో తెలుగు అభ్యర్థులే టాప్–2అభ్యర్థుల్లో కోటీశ్వరులు 2019లో 16 శాతం కాగా ఈసారి 27 శాతానికి పెరిగారు. మొత్తం అభ్యర్థులలో 2,572 మంది కోటీశ్వరులే! ఈ జాబితాలో కూడా బీజేపీయే టాప్‌లో నిలిచింది. 440 మంది బీజేపీ అభ్యర్థుల్లో 403 కోటీశ్వరులే. అంటే 91.6 శాతం! 2019లో ఇది 41.8 శాతమే. 327 మంది కాంగ్రెస్ అభ్యర్థులలో 292 మంది (89%), 487 మంది బీఎస్పీ అభ్యర్థులలో 163 మంది (33%), 52 మంది సీపీఎం అభ్యర్థులలో 27 మంది (52%) ), 3,903 మంది ఇండిపెండెంట్లలో 673 మంది (17%) మంది కోటీశ్వరులు. ఈ జాబితాలో తొలి, రెండో స్థానంలో తెలుగు అభ్యర్థులే ఉండటం విశేషం. ఏపీలోని గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఏకంగా రూ.5,705 కోట్లతో దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచారు. తెలంగాణలోని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రూ.4568.22 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. – సాక్షి, న్యూఢిల్లీ -
17వ లోక్‌సభకు.. కొత్త ముఖాలు!
లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో చివరిదైన ఏడో దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు కూడా ఖరారవడంతో ఈ ఎన్నికల్లో మొత్తం ఎంత మంది పోటీ చేస్తున్నారన్నది స్పష్టమయింది. లోక్‌సభ లోని 543 స్థానాలకు గాను రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి మొత్తం 8,048 మంది పోటీ చేస్తున్నారు(గత ఎన్నికలో 8,794 మంది పోటీ చేశారు). అయితే, వీరిలో 85 శాతం అంటే 6,819 మంది ఎన్నికలకు కొత్త వారే. అంటే మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారు. మిగతా వారిలో 8 శాతం రెండోసారి, 3.2 శాతం మూడోసారి, 1.5 శాతం నాలుగోసారి పోటీ చేస్తున్నారు. నాలుగు సార్లకు మించి పోటీ చేస్తున్న వారు 2.2 శాతం ఉన్నారు. అభ్యర్థుల్లో 85 శాతం కొత్త వారే కాబట్టి ఎన్నికల తర్వాత ఏర్పడబోయే 17వ లోక్‌సభలో కొత్త ముఖాలే ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీల తరఫున మొత్తం 2,163 మంది బరిలో దిగారు. 2,445 మంది చిన్న చిన్న పార్టీల తరఫున, 3,440 మంది ఇండిపెండెంట్లుగా ఎన్నికల గోదాలో కలబడుతున్నారు. ఈ సారి ప్రధాన రాజకీయ పార్టీలు కూడా చాలా మంది సిట్టింగులను పక్కన పెట్టేశాయి. 2014 ఎన్నికల్లో 73 శాతం సిట్టింగు ఎంపీలకు టికెట్లు లభిస్తే, ఈ సారి 59 శాతం సిట్టింగులకే మళ్లీ పోటీ చేసేందుకు అవకాశం దక్కింది. అంటే ప్రతి పది మంది సిట్టింగ్ ఎంపీల్లో దాదాపు నలుగురు పోటీ చేసే అవకాశం కోల్పోయా రు. పార్టీల వారీగా చూస్తే భారతీయ జనతా పార్టీకి 275 మం ది ఎంపీలుంటే వారిలో 156 మందికే ఈ సారి పోటీ చేసేందుకు టికెట్టు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ 48 మంది సిట్టింగ్ ఎంపీల్లో 28 ఎంపీలకే మళ్లీ అవకాశం ఇచ్చింది. ప్రాంతీయ పార్టీలదీ అదే దారి ప్రాంతీయ పార్టీలు కూడా ఈ సారి ఎక్కువ మంది కొత్త వారిని ఎన్నికల్లో నిలబెట్టాయి.ప్రస్తుత లోక్‌సభలో ప్రాంతీయ పార్టీల ఎంపీలు మొత్తం 139 మంది ఉంటే, వారిలో 63 మంది(45.5%) మాత్రమే ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అంటే 50 శాతానికిపైగా కొత్త ముఖాలే ప్రాంతీయ పార్టీల తరఫున పోటీ చేస్తున్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే 37 మంది ప్రస్తుత ఎంపీల్లో కేవలం ఆరుగురికే మళ్లీ టికెట్ ఇచ్చింది. ఒడిశా లోని బీజేడీ 20 మంది సిట్టింగులకుగాను నలుగురినే తిరిగి బరిలో దింపింది. ఏపీలో తెలుగు దేశం పార్టీ 16 మంది సిట్టింగు ఎంపీల్లో పది మందినే మళ్లీ పోటీ చేయిస్తోంది. వైఎస్సార్సీపీ తొమ్మిది మంది సిట్టింగు ఎంపీల్లో ఏడుగురికి టికెట్ ఇవ్వలేదు. తెలంగాణలోని టీఆర్ఎస్కున్న 11 మంది సిట్టిం గ్ ఎంపీల్లో ఏడుగురు మళ్లీ పోటీ చేస్తున్నారు. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ ఏడుగురిలో నలుగురినే మళ్లీ పోటీ చేయిస్తోంది. ప్రధాన పార్టీలు, ప్రాంతీయ పార్టీలూ కూడా ఈ సారి కొత్త వారినే ఎక్కువ మందిని ఎన్నికల్లో నిలబెట్టా యి. ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా, యూపీఏ సర్కారు వచ్చినా కూడా చాలా మంది ఎంపీలు కొత్తవారే అవుతారు. 90వ దశకం నుంచీ.... 1990 దశకం చివరి నుంచి ఎన్నికల్లో సిట్టింగులను పక్కన పెట్టడం పెరుగుతూ వస్తోంది. ప్రధాన పార్టీలు సిట్టింగు ఎంపీలను మార్చడానికి కారణాలు అనేకం ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ప్రభుత్వ వ్యతిరేకతను తప్పించుకోవడం.అధికార పార్టీపై ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువ సార్లు అధికారంలో కొనసాగిన పార్టీలపై సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. అలాంటి పార్టీ మరోసారి అధికారం కైవసం చేసుకోవానుకున్నప్పుడు ప్రజా వ్యతిరేకతను అధిగమించడం కోసం కొత్త వారికి టికెట్లు ఇస్తుంది. సిట్టింగ్‌ల పనితీరు, నియోజకవర్గాల్లో సదరు వ్యక్తికున్న బలం, ఆర్థిక పుష్టి వంటి అంశాలు కూడా అభ్యర్థి మార్పుకు దారి తీస్తాయి. మోదీ అయితే, ప్రతి ఎన్నికల్లో దాదాపు 50 శాతం కొత్త వారికి టికెట్లు ఇవ్వడమన్నది గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అమలు చేస్తున్న వ్యూహం. ప్రధాని అయ్యాక లోక్‌సభ ఎన్నికల్లో కూడా దీనినే అమలు పరుస్తున్నారు. అభ్యర్థులను మార్చే విషయంలో బీజేపీ కంటే కాంగ్రెస్ వెనకబడి ఉందని చెప్పాలి. చాలా ఏళ్లుగా ఆ పార్టీ అభ్యర్థుల ఎంపికలో విధేయతకే పెద్దపీట వేస్తూ వచ్చింది. కాబట్టి పనితీరు, ప్రభుత్వ వ్యతిరేకత ఎలా ఉన్నా చాలా మంది సిట్టింగులకే టికెట్లు లభించేవి. అయితే, ఈ సారి ఆ పార్టీ కూడా చాలా మంది సిట్టింగులను పక్కన పెట్టడం పార్టీ కొత్త అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెచ్చిన మార్పుగా పరిశీలకులు భావిస్తున్నారు. సిట్టింగులు,అనుభవజ్ఞులకు బదులు కొత్త వారు ఎన్నికవడం శుభసూచకమే అయినా, పాత వారి రాజకీయ, పరిపాలన అనుభవం వ్యర్ధమయినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా కొత్తగా ఎన్నికయిన వారు కూడా రెండో దఫా మళ్లీ అవకాశం వస్తుందో రాదో అన్న ఆందోళనతో విధి నిర్వహణపై శ్రద్ధ చూపించలేరని వారు అభిప్రాయపడుతున్నారు. -
17 స్థానాలకు 320 దరఖాస్తులు!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు 320 మంది ఆశావహులు దరఖా స్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభస్థానాలకు ఈ నెల 10 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారం ముగిసింది. రిజర్వుడ్ నియోజకవర్గాలైన నాగర్‌కర్నూల్, వరంగల్, పెద్దపల్లి, మహబూబాబాద్‌లలో భారీగా డిమాండ్ ఉందని తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గానికి 25కిపైగా దరఖా స్తులు వచ్చినట్టు సమాచారం. వీటిని ఈ నెల 17న జరిగే ప్రదేశ్ ఎన్నికల కమిటీ భేటీలో పరిశీలించి ఆ తర్వాత స్క్రూటినీ కమిటీ షార్ట్‌లిస్టు చేయనుంది. ఈ నెల 20లోపు నియోజకవర్గానికి 1 లేదా 2, అనివార్యమైతే 3 పేర్లతో జాబితాను సిద్ధం చేసి అధిష్టానానికి పంపనున్నట్లు సమాచారం. నేటి నుంచి సమీక్షలు..: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమీక్షలను శుక్రవారం నుంచి మూడ్రోజులు నిర్వహిస్తోంది. గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో తొలిరోజు ఆదిలాబాద్–పెద్దపల్లి, నిజామాబాద్–జహీరాబాద్, కరీంనగర్–వరంగల్, రెండోరోజు నాగర్‌కర్నూల్– మహబూబ్‌నగర్, ఖమ్మం– మహబూబాబాద్, నల్లగొండ–భువనగిరి నియోజకవర్గాల సమీక్షలు జరగనున్నాయి. అదేరోజు పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం కూడా జరగనుంది. మూడోరోజు చేవెళ్ల–మల్కాజ్గిరి, హైదరాబాద్–సికింద్రాబాద్, మెదక్ స్థానాల సమీక్షతోపాటు ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. భేటీలకు నేతలు ఆర్సీ కుంతియా, ఉత్తమ్, భట్టి హాజరు కానున్నారు. -
దాసోజు శ్రవణ్‌కు ఖైరతాబాద్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్‌కు అదృష్టం దక్కింది. కాంగ్రెస్ గొంతుకగా, టీపీసీసీలో తెరవెనుక వ్యూహకర్తగా గుర్తింపు పొందిన శ్రవణ్‌కు ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. బుధవారం విడుదల చేసిన రెండో జాబితాలో శ్రవణ్‌తో పాటు మరో 9 మంది అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. ఇందులో చాలా మంది పాతకాపులే ఉన్నారు. జాబితాలో జాజుల సురేందర్ (ఎల్లారెడ్డి), గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి), కె.కె.మహేందర్‌రెడ్డి (సిరిసిల్ల), కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (మేడ్చల్), రమేశ్‌రాథోడ్ (ఖానాపూర్), అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (ధర్మపురి), విష్ణువర్ధన్‌రెడ్డి (జూబ్లీహిల్స్), సి.ప్రతాప్‌రెడ్డి (షాద్‌నగర్), కందాల ఉపేందర్‌రెడ్డి (పాలేరు) ఉన్నారు. దీంతో కాంగ్రెస్ బుధవారం నాటికి ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 75కు చేరింది. ఇందులో సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే 33 ఓసీ, 15 బీసీ, 15 ఎస్సీ, 8 ఎస్టీ, 4 మైనార్టీలున్నారు. ఓసీల్లో 29 మంది రెడ్డి కులస్తులకు టికెట్లివ్వగా, ముగ్గురు వెలమలు, ఒక బ్రాహ్మణ నేతకు అవకాశం దక్కింది. బీసీల్లో అత్యధికంగా ఆరు స్థానాలు మున్నూరుకాపులకు కేటాయించారు. నాలుగు సీట్లు గౌడ్లకు, యాదవ, పద్మశాలి, విశ్వకర్మలకు ఒక్కోటి చొప్పున ఇచ్చారు. కాంగ్రెస్ మొత్తం 94 స్థానాల్లో పోటీ చేయనుండగా, ఇప్పటివరకు ప్రకటించినవి కాకుండా 19 స్థానాలను పెండింగ్‌లో ఉంచింది. ఇక్కడ పోటీ తీవ్రంగా ఉండటం, సామాజిక కోణంలో హైకమాండ్ ఈ స్థానాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నేడు లేదా రేపు ఈ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పొన్నాలకు మొండిచేయి పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు రెండో జాబితాలోనూ భంగపాటే ఎదురైంది. తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడం, తాను ఆశిస్తున్న జనగామను టీజేఎస్‌కు కేటాయిస్తారన్న ప్రచారం జరగడంతో ఆయన మంగళవారం ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఏఐసీసీ పెద్దలను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని, వయసు ఎక్కువ అయిందనే కారణంతోనే ఆయనకు టికెట్ ఇచ్చేందుకు రాహుల్ నిరాకరించారనే చర్చ జరుగుతోంది. పొన్నాల సేవలను పార్టీలో ప్రత్యేకంగా ఉపయోగించుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రెబెల్స్ బెడద.. రెండో జాబితాలో ప్రకటించిన స్థానాల్లో ఎల్లారెడ్డి, మేడ్చల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో రెబెల్స్ బరి లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేడ్చల్ టికెట్‌ను ఆశించిన తోటకూర జంగయ్య యాదవ్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఖానాపూర్ టికెట్‌ను రాథోడ్‌కు ఇవ్వొద్దంటూ హరినాయక్ వర్గీయులు గాంధీభవన్‌లో ఏకంగా ఆమరణ దీక్షకు దిగినా ఫలితం లేకుండా పోయింది. ఎల్లారెడ్డి విషయంలో బీసీ కోటాలో సురేందర్ వైపు పార్టీ అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఇక్కడ టికెట్ ఆశించిన మరో నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డి రెబెల్‌గా బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నా యి. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌తోపాటు పార్టీలో చేరిన సుభాష్‌రెడ్డి టికెట్‌పై ఆశలు పెట్టుకు న్నా అధిష్టానం మొండిచేయే చూపింది. -
కాంగ్రెస్ జాబితాకు అడ్డొచ్చిన అష్టమి!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా ఈనెల 2న వెలువడనుంది. వాస్తవానికి గురువారమే తొలి జాబితా విడుదల చేయాల్సి ఉన్నా.. అష్టమి కావడంతో శుక్రవారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. గురువారం జరగనున్న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేసిన అనంతరం రాహుల్ ఆమోదముద్ర వేస్తారని, శుక్రవారం తొలి జాబితా వస్తుందని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. తొలి జాబితాలో కాంగ్రెస్ పోటీ చేయనున్న స్థానాల్లో 2/3వ వంతు.. అంటే దాదాపు 60 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని సమాచారం. మిగిలిన జాబితాను మరో దఫా విడుదల చేస్తారని, అది ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే.. లేదంటే ఆ తర్వాత వస్తుందని తెలుస్తోంది. ఆశావహుల్లో ఉత్కంఠ ఇన్నాళ్లు ఎలాగొలా నెట్టుకొచ్చినా టికెట్ల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. పార్టీ పోటీ చేస్తుందని భావించిన వాటిలో 50కిపైగా స్థానాల్లో పెద్దగా సమస్యలు లేకున్నా మిగిలిన చోట్ల తీవ్ర పోటీ నెలకొంది. ఒక్కో స్థానానికి ఇద్దరు, ముగ్గురు నుంచి 30 మంది దాకా కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఎవరికి వారే తమకే టికెట్ వస్తుందనే అంచనాతో తీవ్ర ప్రయత్నాలు చేసుకున్నారు. అటు ఏఐసీసీ పెద్దలు, ఇటు టీపీసీసీ ముఖ్యులను ప్రసన్నం చేసుకునేందుకు నానా పాట్లు పడ్డారు. ఇప్పుడు వారంతా టికెట్లు ఎప్పుడు ప్రకటిస్తారా.. జాబితాలో తమ పేరు వస్తుందా లేదా అనే ఉత్కంఠలో గడుపుతున్నారు. -
మూడుసార్లు నేర చిట్టా ప్రచురణ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు తమ నేరచరిత్రకు సంబంధించిన సమాచారాన్ని మీడియాలో మూడు రోజులు ప్రకటనల రూపంలో వెల్లడించాలని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. లోక్ ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ప్రజాప్రయోజన ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా న్యాయ శాఖ ఉత్తర్వులను అనుసరించి ఎన్నికల అఫిడవిట్ ఫారం–26ను సవరించినట్లు తెలిపింది. దీని ప్రకారం క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు, గతంలో శిక్షకు గురైన అభ్యర్థులు ఆయా కేసుల వివరాలను మీడియా ద్వారా డిక్లరేషన్ ఇవ్వాలి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన మరుసటి రోజు నుంచి పోలింగ్ తేదీకి ముందు రెండు రోజుల వరకు మూడుసార్లు పత్రికల్లో, న్యూస్ చానెళ్లలో ఈ డిక్లరేషన్ ఇవ్వాలి. ఉదాహరణకు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల గడువు నవంబరు 22, పోలింగ్ తేదీ డిసెంబరు 7. కాబట్టి, డిక్లరేషన్ ప్రచురణ నవంబరు 23 నుంచి డిసెంబరు 5 మధ్య మూడు వేర్వేరు రోజుల్లో ఉండాలి. పత్రికల్లో అయితే ఫాంట్ సైజ్ 12గా ఉండాలి. నియోజకవర్గ పరిధిలో విస్తృత సర్క్యులేషన్ కలిగి ఉన్న పత్రికల్లో ఈ ప్రకటన జారీచేయాలి. టీవీల్లో అయితే పోలింగ్ ముగి సే సమయానికి 48 గంటల ముందు వరకు మూడుసార్లు వేర్వేరు తేదీల్లో డిక్లరేషన్ ప్రసా రం కావాలి. డిక్లరేషన్ క్లిప్పింగ్‌లను జిల్లా ఎన్నికల అధికారికి ఎన్నికల వ్యయ ఖాతాలతోపాటు సమర్పించాలి. తమ నేర చరిత్రను సొంత పార్టీకి వెల్లడించినట్లు అభ్యర్థులు రిటర్నింగ్ అధికారికి సమర్పించే ఫారం–26లోని నిబంధన 6(ఎ)లో పేర్కొనాలి. రాజకీయ పార్టీలు కూడా.. తమ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అభ్యర్థులు క్రిమినల్ కేసులు కలిగి ఉన్నట్లయితే పత్రికలు, టీవీ చానెళ్లలో పార్టీలు డిక్లరేషన్ ఇవ్వాలి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన మరుసటి రోజు నుంచి పోలింగ్‌కు రెండు రోజుల ముందు వరకు మూడుసార్లు పత్రికలు, న్యూస్ ఛానెళ్లలో ఈ వివరాలను వెల్లడించాలి. ఈ క్లిప్పింగ్‌లను ఎన్నికలు ముగిసిన 30 రోజుల్లోగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సమర్పించాలి. అప్పటివరకు ప్రభుత్వ వసతి పొంది, బకాయిలు చెల్లించకుండా ఉంటే ఆ సమాచారాన్ని అభ్యర్థులు ఫారం–26లో వెల్లడించాలి. -
అభ్యర్థులను పొగిడినా పెయిడ్ న్యూసే!
న్యూఢిల్లీ: రాజకీయ నాయకుల విజయాలను ప్రస్తావిస్తూ ఓటు అడుగుతున్నట్లు ప్రచురితమయ్యే కథనాలను పెయిడ్ న్యూస్ (చెల్లింపు వార్త) గానే పరిగణించాలని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. చెల్లింపు వార్తల ఆరోపణలపై మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రాను అనర్హుడిగా ప్రకటించిన ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సందర్భంగా.. ‘దినపత్రికల్లో అభ్యర్థి పేరుతో వచ్చే ప్రకటనలు, ఆయన విజయాలను ప్రశంసిస్తూ వార్తలు, వీటిని చూపిస్తూ ఓటు వేయాలని అభ్యర్థే స్వయంగా కోరుతున్నట్లు వచ్చే కథనాలను వార్తలుగా కాకుండా చెల్లింపు వార్తలుగానే చూడాలి’ అని ఈసీ పేర్కొంది. ఇలాంటి వార్తలు ఒకవేళ పెయిడ్ న్యూస్ కాకపోతే ఆ విషయాన్ని అభ్యర్థే నిరూపించుకోవాలని సుప్రీం కోర్టుకు తెలిపింది. -
ఓటు వేసిన ఎమెల్యే, ఎంపీ అభ్యర్థులు
-
ఓట్ల కోసం నానా పాట్లు పడుతున్న అభ్యర్ధులు
-
అభ్యర్ధులకు ఎన్ని కష్టాలు !
-
అభ్యర్ధుల పరకాయ ప్రవేశం