paid news
-
‘మహా’ ఎన్నికలు.. పెయిడ్ న్యూస్‌పై డేగ కన్ను
సోలాపూర్:ప్రింట్,ఎల్రక్టానిక్ మీడియాల్లో ప్రసారమయ్యే పెయిడ్‌న్యూస్‌తో పాటు సోషల్ మీడియా వినియోగంపై సునిశిత నిఘా ఉంచాలని జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్, నియంత్రణ కమిటీ (ఎంసీఎంసీ) కమిటీ పౌర సమాచార అధికారులను ఆదేశించింది. ఈ మేరకు సోలాపూర్ సిటీ నార్త్ ,సోలాపూర్ సిటీ సెంట్రల్,అక్కల్కోట్, దక్షిణ సోలాపూర్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకుడు మీనా తేజరాం, కమిటీ కార్యదర్శి జిల్లా సమాచార అధికారి సునీల్ సోను టక్కే, ప్రాంతీయ ప్రచార అధికారి అంకుష్ చవాన్ , డాక్టర్ శ్రీరామ్ రౌత్, గణేష్ బి రాజధార్, అంబదాస్ యాదవ్, సమీర్ మూలాని, రఫీక్ షేక్‌తో కూడిన కమిటీ సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగా మీనా తేజారాం మాట్లాడుతూ ‘ఎన్నికల సమయంలో మీడియా సర్టిఫికేషన్,నియంత్రణ కమిటీ పాత్ర చాలా ముఖ్యమైనది.ఈ కమిటీ ప్రింట్,ఎల్రక్టానిక్,సోషల్ మీడియా ప్రచారాలపై దృష్టిసారించాలి. ఎన్నిక ల సంఘం ఇచ్చిన సూచనల మేరకు కమిటీ కచ్చితంగా పనిచేయాలి.పెయిడ్ న్యూస్‌పై నిఘా ఉంచాలి.అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు , రోజువారీ చెల్లింపు వార్తల నివేదికను కమిటీకి ప్రతి రోజూ తప్పనిసరిగా సమర్పించాలి’అని సూచించారు.ఇదీ చదవండి: మహారాష్ట్ర ఎన్నికలు బరిలో 7995 మంది -
అభ్యర్థులను పొగిడినా పెయిడ్ న్యూసే!
న్యూఢిల్లీ: రాజకీయ నాయకుల విజయాలను ప్రస్తావిస్తూ ఓటు అడుగుతున్నట్లు ప్రచురితమయ్యే కథనాలను పెయిడ్ న్యూస్ (చెల్లింపు వార్త) గానే పరిగణించాలని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. చెల్లింపు వార్తల ఆరోపణలపై మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రాను అనర్హుడిగా ప్రకటించిన ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సందర్భంగా.. ‘దినపత్రికల్లో అభ్యర్థి పేరుతో వచ్చే ప్రకటనలు, ఆయన విజయాలను ప్రశంసిస్తూ వార్తలు, వీటిని చూపిస్తూ ఓటు వేయాలని అభ్యర్థే స్వయంగా కోరుతున్నట్లు వచ్చే కథనాలను వార్తలుగా కాకుండా చెల్లింపు వార్తలుగానే చూడాలి’ అని ఈసీ పేర్కొంది. ఇలాంటి వార్తలు ఒకవేళ పెయిడ్ న్యూస్ కాకపోతే ఆ విషయాన్ని అభ్యర్థే నిరూపించుకోవాలని సుప్రీం కోర్టుకు తెలిపింది. -
చెల్లింపు వార్తలు నేరమే!
న్యూఢిల్లీ: చెల్లింపు వార్తల(పెయిడ్ న్యూస్)ను ఎన్నికల నేరంగా పరిగణించాలని లా కమిషన్ సంప్రదింపుల్లో మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. గత వారం లా కమిషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ అభిప్రాయం వ్యక్తమైంది. ఈ వార్తలను ఎన్నికల నేరంగా పరిగణించాలన్న ప్రతిపాదనను ప్రజాప్రాతినిధ్య చట్టంలో చేర్చాలని భావిస్తున్నారా అని ప్రశ్నించగా.. కమిషన్ సభ్యులు 15 మందిలో నలుగురు మినహా సానుకూలత వ్యక్తం చేశారు. అయితే ఈు వార్తలను ఏ రకమైన నేరంగా పరిగణించానే విషయంపై భిన్నాభిప్రాయాలొచ్చాయి. కొంత మంది దీనిని ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఎన్నికల నేరంగా పరిగణించాలని చెప్పగా, కొందరు సాధారణ నేరంగా పరిగణిస్తే చాలన్నారు. గత వారం లా కమిషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత ప్రధాన ఎన్నికల అధికారి వీఎస్ సంపత్ మాట్లాడుతూ.. అభ్యర్థులను అనర్హతకు గురిచేసే ఎన్నికల నేరంగా పెయిడ్ న్యూస్‌ను మార్చాలని ప్రతిపాదించడం తెలిసిందే. ఆయన ప్రతిపాదనపై లా కమిషన్ సంప్రదింపులు జరపగా.. చెల్లింపు వార్తలను పర్యవేక్షించేందుకు, నియంత్రించేందుకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. -
ఎన్నికల లెక్కలు సమర్పించండి
ఈ నెల 15 వరకు గడువు ఇవ్వని పక్షంలో షాడో రిజిస్టర్ అధారంగా ధరల ఖరారు కలెక్టర్ గంగాధర కిషన్ కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో గత నెల 30వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల వివరాలను ఈనెల 15వ తేదీలోపు సంబంధిత రిటర్నింగ్ అధికారులకు (ఆర్ఓ) అందజేయాలని కలెక్టర్ గంగాధర కిషన్ సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఆర్ఓలతో కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతిఒక్క అభ్యర్థి లెక్కలు సమర్పించాలన్నారు. పెయిడ్ న్యూస్ విషయంలో పూర్తి భాధ్యత అభ్యర్థులదేనని చెప్పారు. ఈ విషయంలో అధికారులు నోటీసులు ఇచ్చినప్పుడు వెంటనే స్పందించాలన్నారు. సకాలంలో లెక్కలు ఇవ్వని పక్షంలో అధికారులు షాడో రిజిస్టర్ అధారంగా ధరలు ఖరారు చేస్తారని స్పష్టం చేశారు. ధరలు అధికంగా లెక్కిస్తున్నారు.. ఎన్నికల ఖర్చుకు సంబంధించి అధికారులు మార్కెట్ ధరల కన్నా రేట్లు అధికంగా వేశారని సమావేశంలో పాల్గొన్న డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, పోటీ చేసిన అభ్యర్థి తిరుణహరిశేషుతోపాటు మరికొందరు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనివల్ల తమకు ప్రత్యక్షంగా నష్టం లేకున్నా... ఆదాయ పన్ను, ఆదాయ వనరులు చూపాల్సిన సమయంలో సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. వాస్తవ లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని కోరా రు. ఖర్చులకు సంబంధించిన బిల్లులు ఇవ్వనప్పుడు మాత్రమే అధికారులు ధరలు నిర్ణయించి అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తారని కలెక్టర్ వారికి చెప్పారు. అందుకే నోటీసులకు సమాధానమిచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. 9 నుంచి అందుబాటులో ఉండాలి ఈనెల 9 నుంచి 15వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి ఎన్నికల లెక్కలు తీసుకునేందుకు సంబంధిత ఆర్ఓ కార్యాలయంలో సహాయ వ్యయ పరిశీలకులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. సందేహాలుంటే ఆర్ఓలను సంప్రదించాలన్నారు. రాజకీయ చర్చ అభ్యర్థులు ఎన్నికల ఖర్చులు ఇచ్చే విషయంలో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సమావేశం ప్రారంభంలోనే రాజకీయ చర్చకు దారితీసి ఆసక్తిని రేకెత్తించింది. సమావేశం ప్రారంభం కాగానే ములుగు ఆర్డీఓ మోతీలాల్ ఖర్చులు లెక్కించే విషయంలో అభ్యర్థులకు పలు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో మోతీలాల్‌ను ఉద్దేశించి మీరెవరు... అంటూ రెడ్యానాయక్ ప్రశ్నించారు. తాను ములుగు ఆర్డీఓ మోతీలాల్ అని ఆయన సమాధానమిచ్చారు. ఎన్నికల్లో ఆర్ ఓలు, ఏఆర్ఓలు అందరూ టీఆర్ఎస్కు గుద్దమని (ఓటేయమని) చెప్పారు... వారుకూడా వేశారంటూ రెడ్యా అన్నారు. ఆర్డీఓ కలుగజేసుకుని ఎమ్మెల్యే గారూ... అలా మాట్లాడొద్దని సముదాయించే ప్రయత్నం చేశారు. ఇక కలెక్టర్ వచ్చాక కార్యక్రమం ముగుస్తుందనుకున్న సమయంలో ఇదే విషయూన్ని మరో అభ్యర్థి లేవనెత్తారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నట్లు ప్రస్తుత ఎన్నికల్లో అధికారులు టీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేశారని భావిస్తే 2004, 2009లో కాంగ్రెస్‌కు పనిచేశారని భావించాల్సి ఉంటుందన్నారు. దీంతో కలెక్టర్ కల్పించుకుని రాజకీయ చర్చకు ఇది వేదిక కాదని చర్చకు ముక్తాయింపు ఇచ్చారు. వివిధ పార్టీల అభ్యర్థుల ఏజెంట్లు, స్వతంత్ర అభ్యర్థులు పాల్గొన్నారు. -
ఎన్నికలకు 800 కోట్లు!
-
ఎన్నికలకు 800 కోట్లు!
* కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన సీఈవో * ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు * 4.50 లక్షల మంది సిబ్బంది వినియోగం.. 69 వేల కేంద్రాల్లో వీడియోగ్రఫీ.. * డబ్బు, మద్యం పంపిణీ అడ్డుకునేందుకు పకడ్బందీ చర్యలు * ఎన్నికల వ్యయంపై 5న రాజకీయ పార్టీలు, మీడియాతో ఈసీ సమావేశం సాక్షి, హైదరాబాద్: ఈసారి రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ వ్యయం భారీగా పెరగనుంది. డబ్బు, మద్యం, అధికారబలాలకు అతీతంగా మరింత పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనుండటంతో ఈ వ్యయం కూడా పెరుగుతోంది. ఈనెల 10న ఎన్నికల నిర్వహణపై రాష్ట్రాల సీఈవోలతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఎన్నికల వ్యయంపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రూ.800 కోట్ల వ్యయం అవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగా ప్రతిపాదనలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఈ మొత్తం వ్యయంలో కేంద్రం సగం, రాష్ట్రం సగం భరించాల్సి ఉంటుంది. పోలింగ్ నిర్వహణకు రాష్ట్రంలో ఏకంగా 4.50 లక్షల మంది సిబ్బందిని వినియోగించనున్నారు. అలాగే 69 వేల పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీని ఏర్పాటు చేయనున్నారు. పొరుగు రాష్ట్రాల సరిహద్దులతో పాటు, ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా నిరోధించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. చెక్ పోస్టులతో పాటు సంచార బృందాలను ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకు ఎవరు పాల్పడకుండా గట్టి నిఘా పెడతారు. ప్రధానంగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు అధికార బలంతో ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకు పాల్పడకుండా అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. గతంలో నెల్లూరు పార్లమెంట్‌కు జరిగిన ఉప ఎన్నిక నిర్వహణకు రూ.13 కోట్ల వ్యయం అయింది. దీని ఆధారంగా త్వరలో జరగబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ వ్యయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అంచనా వేసింది. ‘పెయిడ్’పై ప్రత్యేక దృష్టి: వచ్చేఎన్నికల్లో రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయం పరిమితికి మించకుండా, అలాగే పెయిడ్ న్యూస్ వంటి ఇతర మార్గాల్లో ప్రచారం నిర్వహించడాన్ని నిరోధించాలని కమిషన్ నిర్ణయించింది. దీనిపై అవగాహన కల్పించేందుకు ఈనెల 5న కమిషన్ రాష్ట్రంలోని రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, మీడియా ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వొద్దు ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వద్దని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. ఈ మేరకు గుర్తింపు పొందిన అన్ని జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీల ప్రతినిధులకు ఎన్నికల కమిషన్ ముఖ్య కార్యదర్శి కె.అజయ్‌కుమార్ లేఖలు రాశారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళికలో సంక్షేమ కార్యక్రమాల హామీలను ఇవ్వొచ్చని, అయితే అవి ఎన్నికల స్ఫూర్తిని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని బలహీనపరిచేలా ఉండరాదని సూచించింది. రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలకు విశ్వసనీయత ఉండాలని, అలాగే ఆర్థికపరంగా ఆచరణ సాధ్యం అయ్యేవిగా ఉండాలని పేర్కొంది. -
చెల్లింపు వార్తల్ని నేరంగా చూడాలి
న్యాయశాఖను కోరాం: సీఈసీ సంపత్ ఎన్నికల సంస్కరణలకు చేయాల్సింది చాలా ఉందని వ్యాఖ్య ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తున్నందున చెల్లింపు వార్తల(పెయిడ్ న్యూస్)ను నేరంగా పరిగణించాలని కేంద్ర న్యాయశాఖను కోరినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వీఎస్ సంపత్ తెలిపారు. పెయిడ్ న్యూస్ ప్రభావం.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, మీడియా, ప్రజలపైన తీవ్రంగా ఉంటోందని చెప్పారు. శనివారమిక్కడ ‘ఎన్నికల్లో సంస్కరణలు’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘‘సంస్కరణల దిశగా చేయాల్సింది చాలా ఉంది. నేరమయ రాజకీయాలు లేకుండా చూడడం, రాజకీయ పార్టీల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడం, పార్టీ నిధుల ఆడిటింగ్ తదిత రాలపై తక్షణమే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మార్పు తీసుకురావడానికి ఉద్దేశించిన చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. నేర చరితులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించడానికి చట్టప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కసారిగా మార్పులు జరిగిపోవాలని ఆశించడం సరికాదు’’ అని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలకు నియమావళిపై మాట్లాడుతూ... ఎన్నికల తేదీలు ప్రకటించడానికి కొద్దిరోజుల ముందు ప్రభుత్వాలు తమ హయాంలో సాధించిన విజయాలపై ప్రకటనలు ఇవ్వడం మానుకోవాలన్నారు. అయితే ఆరోగ్యం, పేదరిక నిర్మూలన, వినియోగదారుల ప్రయోజనాల కోసం ఉద్దేశించిన ప్రకటనలకు మినహాయింపు ఉంటుందన్నారు. ఓటు వేయడాన్ని చట్టబద్ధంగా తప్పనిసరి చేసే అవకాశాలను సంపత్ తోసిపుచ్చారు. కిందటి పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 30 కోట్ల మంది ఓటు వేయలేదని, ఒకవేళ ఓటు వేయడాన్ని తప్పనిసరి చేస్తే వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సార్వత్రిక ఎన్నికలపై ప్రశ్నించగా.. ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి మే 31 నాటికి ముగుస్తుందని, ఆలోపు ఎన్నికలను నిర్వహిస్తామని వివరించారు. -
పెయిడ్ న్యూస్ కేసులో 9 మంది
సాక్షి, న్యూఢిల్లీ: పెయిడ్ న్యూస్‌ను నివారించడం కోసం ఎన్నికల కమిషన్ అనేక చర్యలు చేపట్టినప్పటికీ ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో పలు పెయిడ్ న్యూస్ కేసులు ఎన్నికల కమిషన్ దృష్టికి వచ్చాయి. ఢిల్లీ రవాణాశాఖ మంత్రి అర్విందర్ సింగ్ లవ్లీతోపాటు 9 మంది అభ్యర్థులను ఈసీ పెయిడ్ న్యూస్ కేసులో దోషులుగా నిర్ధారించింది. వీరిలో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులు ఉన్నారు. అంతేకాక పెయిడ్ న్యూస్ ప్రచురించిన పత్రికలపై ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. పెయిడ్ న్యూస్ కేసులో కాంగ్రెస్‌కు చెందిన అర్విందర్ సింగ్ లవ్లీ, సుశీల్ గుప్తా, ముఖేష్ శర్మలను దోషులుగా నిర్ధారించింది. లవ్లీ గాంధీనగర్ నుంచి, గుప్తా మోతీనగర్ నుంచి , శర్మ ఉత్తంనగర్ నుంచి పోటీచేశారు. బీజేపీ చెందిన నీల్ దమన్ ఖత్రీ, జయ్‌ప్రకాశ్, మనోజ్ షౌకీన్, రాజీవ్ బబ్బర్‌లను కూడా పెయిడ్ న్యూస్ కేసులో దోషులుగా గుర్తించారు. ఖత్రీ నరేలా నుంచి, జయ్‌ప్రకాశ్ సదర్ బజార్ నుంచి, షౌకీన్ నంగ్లోయ్ జాట్ నుంచి, బబ్బర్ తిలక్ నగర్ నుంచి పోటీచేశారు. బీఎస్పీకి చెందిన ధీరజ్‌కుమార్ టోకస్, సలీం సైఫీలను కూడా ఈ కేసులో దోషులుగా తేలారు. టోకస్ ఆర్కేపురం నుంచి, సైఫీ నంగ్లోయ్ జాట్ నుంచి పోటీచేశారు. పెయిడ్ న్యూస్ ఆరోపణలు రావడంతో ఈ అభ్యర్థులకు నోటీసులు పంపామని, అయితే వారిచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో చర్యలు చేపట్టామని ఎన్నికల ప్రధానాధికారి విజయ్‌దేవ్ చెప్పారు. పెయిడ్ న్యూస్ కోసం వారు చేసిన ఖర్చును వారి ఎన్నికల వ్యయంలో చేర్చనున్నట్లు ఆయన చెప్పారు. ఎన్నికల కోసం వారు చేసిన మొత్తం ఖర్చును పరిశీలించి నిర్ధారిస్తామని, వారి వ్యయం పరిమితిని మించినట్లయితే గెలిచిన అభ్యర్థుల ఎన్నికను రద్దు చేస్తామని ఆయన చెప్పారు. పెయిడ్ న్యూస్‌కు సంబంధించి 60 ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని ఆయన చెప్పారు. వాటిలో 8 ఆరోపణలు పెయిడ్ న్యూస్ కావని తేల్చామని, 28 కేసులలో నోటీసులు జారీ చేశామని, మరో 24 కేసులలో నోటీసులు జారీచేయవలసి ఉందన్నారు.