‘మహా’ ఎన్నికలు.. పెయిడ్‌ న్యూస్‌పై డేగ కన్ను | Maharashtra Election Officers Order On Paid News | Sakshi
Sakshi News home page

‘మహా’ ఎన్నికలు.. పెయిడ్‌ న్యూస్‌పై డేగ కన్ను

Published Fri, Nov 1 2024 12:02 PM | Last Updated on Fri, Nov 1 2024 12:23 PM

Maharashtra Election Officers Order On Paid News

సోలాపూర్‌:ప్రింట్,ఎల్రక్టానిక్‌ మీడియాల్లో ప్రసారమయ్యే పెయిడ్‌న్యూస్‌తో పాటు సోషల్‌ మీడియా వినియోగంపై సునిశిత నిఘా ఉంచాలని జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్‌, నియంత్రణ కమిటీ (ఎంసీఎంసీ) కమిటీ పౌర సమాచార అధికారులను ఆదేశించింది. 

ఈ మేరకు సోలాపూర్‌ సిటీ నార్త్‌ ,సోలాపూర్‌ సిటీ సెంట్రల్‌,అక్కల్కోట్, దక్షిణ సోలాపూర్‌ రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకుడు మీనా తేజరాం, కమిటీ కార్యదర్శి జిల్లా సమాచార అధికారి సునీల్‌ సోను టక్కే, ప్రాంతీయ ప్రచార అధికారి అంకుష్‌ చవాన్‌ , డాక్టర్‌ శ్రీరామ్‌ రౌత్, గణేష్‌ బి రాజధార్, అంబదాస్‌ యాదవ్, సమీర్‌ మూలాని, రఫీక్‌ షేక్‌తో కూడిన కమిటీ సమావేశమై చర్చించింది. 

ఈ సందర్భంగా మీనా తేజారాం మాట్లాడుతూ ‘ఎన్నికల సమయంలో మీడియా సర్టిఫికేషన్‌,నియంత్రణ కమిటీ పాత్ర చాలా ముఖ్యమైనది.ఈ కమిటీ ప్రింట్,ఎల్రక్టానిక్,సోషల్‌ మీడియా ప్రచారాలపై దృష్టిసారించాలి. ఎన్నిక ల సంఘం ఇచ్చిన సూచనల మేరకు కమిటీ  కచ్చితంగా పనిచేయాలి.పెయిడ్‌ న్యూస్‌పై నిఘా ఉంచాలి.అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు , రోజువారీ చెల్లింపు వార్తల నివేదికను  కమిటీకి ప్రతి రోజూ తప్పనిసరిగా సమర్పించాలి’అని సూచించారు.

ఇదీ చదవండి: మహారాష్ట్ర ఎన్నికలు బరిలో 7995 మంది 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement