సాక్షి, విజయవాడ: ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఏపీలో డీఎస్సీ వాయిదా పడింది. నేటి నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉండగా, మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ ముగిసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4 తర్వాత డిఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.
మార్చి 20 నుంచి పరీక్షా కేంద్రాల వెబ్ ఆప్షన్లు, 25 నుంచి హాల్ టికెట్ల డౌన్‌లోడ్ జరగాల్సి ఉంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏపీలో డీఎస్సీ వాయిదా పడింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు డీఎస్సీని వాయిదా వేయాలని సీఈసీ స్పష్టం చేసేంది కాగా, ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్ పరీక్షా ఫలితాల విడుదలకు ఈసీ బ్రేక్ వేసింది.
Comments
Please login to add a commentAdd a comment