Besharam Rang Row: MP Home Minister Objection On Deepika Padukone Dress In Pathaan Song - Sakshi
Sakshi News home page

Deepika Padukone: దీపికా పదుకొణె డ్రెస్‌పై తీవ్ర అభ్యంతరం.. ఆ రాష్ట్రంలో సినిమాపై బ్యాన్..!

Published Wed, Dec 14 2022 6:53 PM | Last Updated on Wed, Dec 14 2022 7:33 PM

Madhyapradesh Home Minister Objection On Deepika Padukone Dress in Pathaan Song - Sakshi

బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న చిత్రం 'పఠాన్'. ఇటీవలే ఈ మూవీలోని ఓ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాలోని 'బేషరమ్ రంగ్‌ రో' అంటూ సాగే పాట ప్రస్తుతం వివాదానికి దారితీసింది. ఈ సాంగ్‌పై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ఈ పాటలో దీపికా పదుకొణె దుస్తులు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని నరోత్తమ్ మిశ్రా ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో పఠాన్ సినిమా నిషేధానికి పిలుపునిస్తానని హెచ్చరించారు. ఈ పాటలో పదుకొణె రిస్క్ స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ ధరించి కనిపించడంతో చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీపికా పదుకొణె దుస్తులు అభ్యంతరకరంగా ఉన్నాయని.. దాన్ని సరిదిద్దకుంటే మధ్యప్రదేశ్‌లో ఆ చిత్ర విడుదలను నిలిపివేయాలా వద్దా అని ఆలోచించాల్సి వస్తుందని హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement