Pathaan: Complaint Filed against Deepika Padukone for Wearing Saffron Bikini - Sakshi
Sakshi News home page

Pathaan song: ఆ డ్రెస్‌పైనే తీవ్ర అభ్యంతరం.. కేసు నమోదు

Published Thu, Dec 15 2022 6:11 PM | Last Updated on Thu, Dec 15 2022 6:37 PM

Complaint filed against Deepika Padukone saffron bikini in Pathaan song - Sakshi

షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న చిత్రం 'పఠాన్'. ఈ సినిమా విడుదలకు ముందే వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన 'బేషరమ్ రంగ్‌ రో' అనే సాంగ్ వివాదానికి దారితీసింది. ఆ పాటలో దీపకా పదుకొణె ధరించిన డ్రెస్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా తప్పుబట్టారు. తాజాగా ఈ పాటలో కాషాయ బికినీ ధరించడంపై ఫిర్యాదు చేశారు. 

ఈ అంశంపై సమాచార, ప్రసార శాఖకు న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. ఆ పాటలో కాషాయ బికినీ ధరించడాన్ని తప్పుబట్టారు. కుంకుమపువ్వును బేషరమ్‌గా పేర్కొనడంపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ పాటను సరిదిద్దే వరకు సినిమా విడుదలపై నిషేధం విధించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పాటలోని సన్నివేశాలు మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, అవమానించేలా ఉన్నాయని అన్నారు. ఆమె ధరించిన కుంకుమ, ఆకుపచ్చ బికినీలపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశాడు. న్యాయవాది ఫిర్యాదుతో కేసు నమోదైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement