Pathaan Movie
-
షారుఖ్ ను వెనక్కి నెట్టేసిన ప్రభాస్..
-
షారుఖ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. పఠాన్ మళ్లీ రాబోతున్నాడు!
షారుక్ ఖాన్ కెరీర్లో రూ. వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన చిత్రం ‘పఠాన్’ (2023). వైఆర్ఎఫ్ (యశ్‌రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా ‘పఠాన్’ సినిమాను నిర్మించారు. షారుక్ ఖాన్ టైటిల్ రోల్ చేశారు. కాగా ‘పఠాన్’ సినిమాకు సీక్వెల్‌గా ‘పఠాన్ 2’ తెరకెక్కించే పనిలో ఉన్నారట దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. ఆల్రెడీ ‘పఠాన్ 2’ స్క్రిప్ట్ వర్క్ మొదలైందని, స్టోరీ బేసిక్ ఐడియాకు షారుక్ ఖాన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని, వైఆర్ఎఫ్ స్పై యూనిర్స్‌లో భాగంగానే ‘పఠాన్’ ఉంటుందని బాలీవుడ్ భోగట్టా. ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది డిసెంబరులో ప్రరంభం కానుందని టాక్. -
Adipurush: సోమవారం దారుణంగా పడిపోయిన కలెక్షన్స్.. కారణం ఇదే
మెగా-బడ్జెట్‌తో రాముడిగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్‌కు డివైడ్ టాక్ వచ్చినా ఫస్ట్ వీకెండ్లో భారీ వసూళ్లను రాబట్టింది. తొలి మూడురోజులకు గాను ఏకంగా రూ. 340 కోట్లు వచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. తాజాగా నాలుగురోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా రూ. 375 కోట్లు కలెక్ట్ చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ ఆదిపురుష్ సినిమాకు సోమవారం నుంచి అగ్నిపరీక్ష మొదలైంది. కలెక్షన్లు ఒక్కసారిగా 75% పడిపోయాయి. బాక్స్ ఆఫీస్ ఇండియా లెక్కల ప్రకారం సోమవారం ఈ సినిమా ఆల్ ఇండియా (నెట్) కలెక్షన్ దాదాపు రూ. 20 కోట్లు మాత్రమే అని తేల్చేసింది. బాలీవుడ్లో సోమవారం నికరంగా రూ.8 కోట్లు మాత్రమే వసూళు చేసినట్లు తెలుస్తోంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్కడ మొదటి నాలుగు రోజులకు రూ. 113 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. (ఇదీ చదవండి: మెగా వారసురాలు అంటూ.. వీడియోలు షేర్ చేస్తున్న ఫ్యాన్స్) తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ ఇప్పటివరకు ఏపీ, తెలంగాణలో రూ.72 కోట్లకు పైగా షేర్ సాధించింది. గ్రాస్ ప్రకారం అయితే రూ. 113 కోట్లు అవుతుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో రూ.70 కోట్ల షేర్ వరకు రాబట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే అది జరగటం కష్టమే అనిపిస్తుంది. మరో పది రోజులపాటు సినిమాకు కలెక్షన్స్ ఉంటేనే ఇదే సాధ్యమవుతుంది. లేదంటే ప్రభాస్ ఖాతాలో వరుసగా మరో డిజాస్టర్ పడినట్టే అవుతుంది అనడంలో సందేహంలేదు. (ఇదీ చదవండి: సుధాకర్ కొడుక్కి అండగా మెగాస్టార్, ఆ బాధ్యత చిరంజీవిదేనట!) పఠాన్ రికార్డు బద్దలు కొట్టాడు కానీ.. మొదటి వీకెండ్లో ఆదిపురుష్ కలెక్షన్స్ పఠాన్ సినిమాను దాటాయి. అప్పటి వరకు పఠాన్ పేరుతో ఉన్న రూ. 313 కోట్ల రికార్డ్‌ను ఆదిపురుష్ అధిగిమించింది. కానీ పఠాన్ ఫైనల్ కలెక్షన్స్ అయిన రూ. 1000 కోట్ల గ్లోబల్ మార్క్‌ను ఆదిపురుష్ అధిగమించలేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఆదిపురుష్‌కు ప్రారంభం నుంచే డివైడ్ టాక్ వచ్చింది. దీంతోనే చాలా వరకు నష్టపోయిందని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపాడు. అంతే కాకుండా సినిమాలోని VFX భాగలేదనే టాక్ రావడమే కాకుండా క్యారెక్టర్ డిజైన్ కూడా బాగాలేదని కామెంట్లు వచ్చాయి. చివరికి ఈ సినిమా జాతీయ వివాదానికి కూడా దారితీసింది అని ఆయన తెలిపాడు. అందువల్ల ఈ సినిమా భారీ నష్టాలను మిగల్చవచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు. THE NEGATIVE WORD OF MOUTH HAS COME INTO PLAY… After a strong opening weekend, #Adipurush COLLAPSES on Monday.#Hindi version. #India biz. pic.twitter.com/HJT4hHT80u — taran adarsh (@taran_adarsh) June 19, 2023 -
ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో దుమ్మురేపిన పఠాన్
-
ప్రభాస్ తో ప్రభాస్ కే పోటీ రచ్చ లేపుతున్న 1000 కోట్ల వార్..
-
కోహ్లీ, షారూక్ పఠాన్ డ్యాన్స్ స్టెప్పులు
-
వెయ్యి కోట్ల క్లబ్బులో పఠాన్.. ఖరీదైన రోల్స్ రాయిస్ కారు కొన్న షారుక్
బాలీవుడ్ పనైపోయింది అని విరగబడి నవ్వినవాళ్లకు పఠాన్‌తో సమాధానం చెప్పాడు షారుక్ ఖాన్. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత పఠాన్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చిన షారుక్ ముప్పైకి పైగా రికార్డులను బద్ధలు కొట్టాడు. పఠాన్ రిలీజై 50 రోజులకు పైనే అవుతున్నా ఇప్పటికీ థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1049.50 కోట్ల గ్రాస్ రాబట్టిందీ చిత్రం. ఇందులో ఇండియా వాటా రూ.657.25 కోట్లు కాగా ఓవర్సీస్‌ది రూ.392.35 కోట్లుగా ఉంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన షారుక్ తాజాగా ఓ ఖరీదైన కారు కొనుగోలు చేసిశాడు. రోల్స్ రాయిస్ క్యులినన్ బ్లాక్ బెడ్జ్.. ఎస్యూవీ కారును తన గ్యారేజీకి తెచ్చుకున్నాడు. దీని ధర దాదాపు రూ.10 కోట్లు ఉండవచ్చని అంచనా! భారత్‌లో అమ్ముడవుతున్న ఖరీదైన ఎస్యూవీ కార్లలో ఇది ఒకటి అని తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం షారుక్ తన కొత్త కారులో షికారుకు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గత నెలలో రూ.5 కోట్లు విలువ చేసే వాచీ చేతికి ధరించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడీ బాలీవుడ్ స్టార్. ప్రస్తుతం షారుక్ ఖాన్.. అట్లీ దర్శకత్వంలో 'జవాన్', రాజ్‌కుమార్ హిరానీ డైరెక్షన్లో 'డుంకీ' చిత్రాల్లో నటిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' మూవీలో ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్లు భోగట్టా! #ShahRukhKhan𓀠 new car Rolls-Royce 555 entrying in #Mannat last night 🌙 @iamsrk pic.twitter.com/tU1GWgkC9T — SRK Khammam Fan club (@srkkhammamfc) March 27, 2023 #Pathaan continues to win hearts 🔥 Book your tickets now - https://t.co/SD17p6x9HI | https://t.co/VkhFng6vBj Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you, in Hindi, Tamil and Telugu. pic.twitter.com/xq5mHFn0Jj — Yash Raj Films (@yrf) March 24, 2023 -
రేర్ ఫీట్ సాధించిన కింగ్ ఖాన్ ‘పఠాన్’.. 30 రికార్డ్స్ బ్రేక్
కరోనా తర్వాత కళ తప్పిన బాలీవుడ్ బాక్సాఫీస్ ఊపిరి అందించింది పఠాన్ మూవీ. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సౌత్ మూవీస్ క్రియేట్ చేసిన రికార్డ్స్ మొత్తం పఠాన్ బ్రేక్ చేసింది. సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో షారూఖ్ ఖాన్,దీపికా పదుకొనే జంటగా నటించిన ఈ చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేయటం స్టార్ట్ చేసింది. జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పఠాన్ ఇప్పటి వరకు దాదాపు 30 రికార్డులు సాధించింది. అలాగే మరో అరుదైన ఘనతను పఠాన్ సొంతం చేసుకుంది. జనవరి 25న విడుదలైన పఠాన్ మూవీ సక్సెస్ ఫుల్ గా 50 రోజు కంప్లీట్ చేసుకుంది. ఇండియాలో పఠాన్ మూవీ దాదాపు 800 స్క్రీన్లల లో 50 డేస్ కంప్లీట్ చేసుకుంది. అలాగే వరల్డ్ వైడ్ గా పఠాన్ మూవీ మరో 135 ధియేటర్స్ లో రన్ అవుతోంది. ఈ మధ్య కాలంలో ఏ సినిమా ఇన్ని ధియేటర్స్ లో 50 డేస్ ఆడలేదు. ఆస్కార్ గెలుచుకున్న ఆర్ఆర్ఆర్...హిందీలో నిన్నటి వరకు హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచిన బాహుబలి 2 కూడా ఇన్ని ధియేటర్స్ లో 50 డేస్ కంప్లీట్ చేసుకోలేదు. హైయెస్ట్ ధియేటర్స్ లో 50 డేస్ కంప్లీట్ చేసుకున్న పీట్ ను పఠాన్ అందుకుంది. అలాగే ఆదిత్య చోప్రా యూనివర్స్ లో వచ్చిన పఠాన్ వరల్డ్ వైడ్ గా 30 రికార్డ్స్ బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది. హిందీలో దంగల్ తర్వాత వెయ్యి కోట్లు వసూళ్లు చేసిన మూవీ గా పఠాన్ నిలిచింది. అలాగే హిందీలో హైయెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా, వరల్డ్ వైడ్ గా రెండు వందలు.. మూడు వందలు.. నాలుగు వందల కోట్ల క్లబ్ లో ఫాస్ట్ గా చేరిన సినిమాగా, ఇండియాలో 500 కోట్లు నెట్ కలెక్ట్ చేసిన హిందీ సినిమాగా, యూకేలో భారీ ఓపెనింగ్ సాధించిన ఇండియన్ మూవీగా, న్యూజిలాండ్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా టాప్ గ్రాసర్ మూవీగా ఇలా మొత్తంగా 30 రికార్డ్స్ సాధించినట్లు బీటౌన్ చెబుతోంది. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ నటిస్తున్న మూవీ జవాన్..సౌతిండియా డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ జూన్ నుంచి అక్టోబర్ కి వాయిదా పడింది. పఠాన్ హిట్ కావటంతో జవాన్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. #Pathaan celebrates 50 glorious days in theatres 💥💥 Keep the love coming ❤️ Book your tickets now - https://t.co/SD17p6wBSa | https://t.co/VkhFng5XLL Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you, in Hindi, Tamil and Telugu. pic.twitter.com/EsmowoZGWX — Yash Raj Films (@yrf) March 15, 2023 -
‘పఠాన్’ కొత్త చరిత్ర.. ‘బాహుబలి’ రికార్డు బద్దలైంది
హిందీలో ‘బాహుబలి’ని దాటేశాడు ‘పఠాన్’. షారుక్ ఖాన్ టైటిల్ రోల్లో రూపొందిన హిందీ చిత్రం ‘పఠాన్’. యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం జనవరి 25న విడుదలైంది. ఇటీవల ఈ చిత్రం రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, ఓ రికార్డును నమోదు చేసుకుంది. కాగా హిందీలో అత్యధిక నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ సాధించిన టాప్ ప్లేస్ (దాదాపు రూ. 510 నెట్ కలెక్షన్స్)లో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ కాంబినేషన్లో రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ ఉండేది. ఈ రికార్డును ‘పఠాన్’ చిత్రం అధిగమించింది. ‘‘హిందీలో నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ రికార్డును అధిగమించిన షారుక్ ఖాన్, చిత్రదర్శకుడు సిద్దార్థ్ ఆనంద్, యశ్‌రాజ్ సంస్థకు శుభాకాంక్షలు. రికార్డులు ఉన్నది బ్రేక్ కావడం కోసమే’’ అని ట్వీట్ చేశారు ‘బాహుబలి’ నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ. ‘బాహుబలి’లాంటి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్స్. మేం మరింత కష్టపడటానికి ఆ సినిమా స్ఫూర్తిగా నిలిచింది’’ అని యశ్ రాజ్ సంస్థ ట్వీట్ చేసింది. Congratulations to @iamsrk sir, #SiddharthAnand @yrf and the entire team of #Pathaan on crossing @BaahubaliMovie 2 Hindi NBOC. Records are meant to be broken and I am happy it was none other than @iamsrk who did it! 😃 https://t.co/cUighGJmhu — Shobu Yarlagadda (@Shobu_) March 4, 2023 -
స్టార్ హీరో మూవీ టికెట్స్‌పై బంపరాఫర్.. ఆ మూడు రోజులే..!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, దీపికా పదుకొణె స్పై యాక్షన్ థ్రిల్లర్ 'పఠాన్'. ఈ ఏడాది జనవరి 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలు పో షించగా, డింపుల్ కపాడియా, అశుతోష్ రాణా కీ రోల్స్ చేశారు. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్‌తో యశ్‌రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మించారు. తాజాగా ఈ చిత్రబృందం అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. సినీ ప్రియుల కోసం యశ్‌రాజ్ ఫిలింస్ సంస్థ క్రేజీ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ సినిమా టికెట్లపై మూడు రోజుల పాటు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీగా పొందవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ ఆఫర్ హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో వర్తిస్తుందని పేర్కొంది. పఠాన్ సెలబ్రేషన్స్ పేరిట ఈ ఆఫర్‌ను ప్రకటించింది చిత్రబృందం. పఠాన్ కోడ్ ఉపయోగించి టికెట్స్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఆఫర్ మార్చి 3, 4, 5 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది అయితే ఫస్ట్ కమ్- ఫస్ట్ సర్వ్ కింద టికెట్లను కేటాయించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటివరకు పఠాన్ మూవీ చూడని వారు క్రేజీ ఆఫర్‌తో ఎంచక్కా థియేటర్లలో చూసేయొచ్చు. View this post on Instagram A post shared by Yash Raj Films (@yrf) -
చవక రేటుకు పఠాన్ టికెట్.. ఒక్కరోజే ఛాన్స్!
షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ పఠాన్. దీపికా పదుకొణె కథానాయికగా నటించగా జాన్ అబ్రహం విలన్‌గా మెప్పించాడు. ఈ సినిమా ఊహించని స్థాయిలో ఘన విజయం సాధించింది. ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో ఏకంగా రూ.600 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఈ సందర్భంగా యశ్ రాజ్ ఫిలింస్ ప్రొడక్షన్స్ సినీ ప్రేమికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి 17వ తేదీని పఠాన్ సినిమా రూ.110కే అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. సాధారణ థియేటర్లతోపాటు పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్ వంటి అన్ని మల్టీప్లెక్స్‌లోనూ 110 రూపాయలకే పఠాన్ చూడవచ్చని తెలిపింది. మరింకే.. పఠాన్‌ను ఫ్రెండ్స్‌తో లేదా ఫ్యామిలీతో మరోసారి చూసేయాలనుకుంటే రేపే దగ్గర్లోని థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి ఆస్వాదించండి. ఇక పఠాన్ విషయానికి వస్తే జనవరి 25న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా రూ.970 కోట్లు రాబట్టింది. అందులో ఒక్క ఇండియాలోనే రూ.605 కోట్లు కాగా ఓవర్సీస్లో రూ.365 కోట్లు రాబట్టడం విశేషం. Join the festivities of #Pathaan party, as it continues to get immense love all over! ❤️ Book your tickets now for #Pathaan NOW - https://t.co/SD17p6x9HI | https://t.co/VkhFng6vBj Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you, in Hindi, Tamil and Telugu. pic.twitter.com/9VyUVEztPS — Yash Raj Films (@yrf) February 16, 2023 #PathaanDay incoming! 💥 #Pathaan crosses 500 crores NBOC. Come celebrate with us this Friday. Book tickets at ₹ 110/- flat across all shows in India at @_PVRCinemas | @INOXMovies | @IndiaCinepolis and other participating cinemas! pic.twitter.com/7fuM0nU51c — Yash Raj Films (@yrf) February 16, 2023 చదవండి: అమ్మకు క్యాన్సర్.. అనాధాశ్రమంలో వదిలేశా -
షారుక్ ఖాన్ ధరించిన వాచ్ అన్ని కోట్లా?
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పఠాన్. జనవరి 25న రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.877 కోట్లు రాబట్టింది. సినిమా సక్సెస్‌తో ఒక్క చిత్రయూనిటే కాదు బాలీవుడ్ మొత్తం ఫుల్ ఖుషీ అవుతోంది. హిందీ చిత్రపరిశ్రమకు మళ్లీ మంచిరోజులొచ్చాయని అంతా సంబరపడుతున్నారు. కాగా ఇటీవల జరిగిన పఠాన్ సక్సెస్ ఈవెంట్లో షారుక్ తన చేతికి ఖరీదైన బ్లూ కలర్ వాచ్ ధరించాడు. తాజాగా దీపికా పదుకొణె షేర్ చేసిన వీడియోలో సైతం అదే వాచీతో దర్శనమిచ్చాడు. దీంతో అందరూ ఈ చేతి గడియారం ఏ బ్రాండ్‌కు చెందినది? దీని ఖరీదెంత? అని ఆరా తీస్తున్నారు. ఆ విషయానికి వస్తే.. షారుక్ ధరించిన వాచ్ 'అడెమర్స్ పిగెట్' అనే లగ్జరీ వాచ్ బ్రాండ్‌కు చెందినది. దీని ఖరీదు అక్షరాలా రూ.4.98 కోట్లని తెలుస్తోంది. ఇకపోతే షారుక్‌కు కోట్లు విలువ చేసే బీఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్, బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్, ఆడి సహా మరికొన్ని కార్లు ఉన్నాయి. అలాగే మన్నత్‌లో రూ.200 కోట్లు విలువ చేసే ఇల్లు కూడా ఉంది. #SRK doing a skincare routine is the most adorable thing you'll see today🥹❤️ Book your tickets now to watch him in an action packed avatar in #Pathaan:https://t.co/z4YLOG2NRI | https://t.co/lcsLnUSu9Y@iamsrk @deepikapadukone#ShahRukhKhan #DeepikaPadukone #JohnAbraham #YRF50 pic.twitter.com/3LCDxY57UJ — Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) February 9, 2023 The #Pathaan festivities continue ❤️💥 Book your tickets now! https://t.co/SD17p6x9HI | https://t.co/VkhFng6vBj Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you, in Hindi, Tamil and Telugu. pic.twitter.com/i82UrCWq7v — Yash Raj Films (@yrf) February 9, 2023 చదవండి: ఆర్థికసాయం కోసం అభిమాని ఎదురుచూపులు, గుర్తుపట్టి సాయం చేసిన బన్నీ -
ఆ సినిమాపై ఉమ్మేసినా సిగ్గురాలేదు.. ప్రకాశ్ రాజ్ సంచలన కామెంట్స్
వరుస సినిమాలతో బిజీగా ఉండే ప్రకాశ్ రాజ్.. అప్పుడప్పుడు తన కాంట్రవర్సీ మాటలతో వివాదాల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విడుదలైన బాలీవుడ్ మూవీ పఠాన్‌ను ప్రశంసలతో మంచెత్తుతూ.. వివేక్ అగ్నిహోత్రి మూవీ ది కశ్మీర్ ఫైల్స్‌పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు. కేరళలో జరిగిన ఓ ఈవెంట్లో ప్రకాశ్ రాజ్.. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై విమర్శలు చేశారు. ది కాశ్మీర్ ఫైల్స్ ఓ నాన్సెన్స్ ఫిల్మ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ జ్యూరీనే వారి సినిమాపై ఉమ్మివేసిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి కేవలం మొరగడానికే పనికొస్తారుగానీ.. కాటువేసే దమ్ము వీరికి లేదన్నారు. కేరళలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. ' ది కశ్మీర్ ఫైల్స్ నాన్సెన్స్ చిత్రాల్లో ఒకటి. ఆ సినిమా ఎవరు నిర్మించారో మాకు తెలుసు. ఆయనకు ఎలాంటి సిగ్గులేదు. అంతర్జాతీయ జ్యూరీ వారిపై ఉమ్మివేసింది. అయినా కూడా సిగ్గులేకుండా దర్శకుడు ఆస్కార్ ఎందుకు రాదు? అని అడిగారు. ఆ సినిమాకు కనీసం భాస్కర్ అవార్డ్ కూడా రాదు. వారు చేసేది కేవలం సౌండ్ పొల్యూషన్. బాలీవుడ్ బాయ్ కాట్ అన్నవారికి పఠాన్ 700 కోట్లు వసూలు రాబట్టింది. వాళ్లకు తెలిసింది కేవలం మొరగడమే. వారితో ఏం కాదు. ఎందుకంటే బయట చాలా సెన్సిటివ్ మీడియా ఉంది. అందుకే నేను చెప్తున్నా. నాకు తెలిసి ఇలాంటి మూవీలు చేయడానికే వాళ్లు దాదాపు రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. కానీ ప్రతిసారి కూడా ప్రజలను ఫూల్ చేయలేరు' అని అన్నారు. కాగా.. వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది కాశ్మీర్ ఫైల్స్ 2022లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ఒకటి. జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం 1990లలో కాశ్మీరీ హిందువుల వలసలను తెరకెక్కించారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి తదితరులు నటించారు. “They needed to ban #Pathaan. It's going 700Cr. These idiots, who needed to #BanPathaan, didn’t run Modi’s movie for 30Cr. They’re simply barking, they do not chew. Don’t fret. Sound air pollution!” says Actor #PrakashRaj at #MBIFL2023 in #Kerala.#PathaanMovie #BoycottGang pic.twitter.com/CismuRxJ4k — Hate Detector 🔍 (@HateDetectors) February 6, 2023 -
దంగల్ను దాటేసిన పఠాన్.. నెం.1 మూవీగా రికార్డు
బాలీవుడ్ పని అయిపోయింది.. హిందీ స్టార్ హీరోలు ఇక రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే! వాళ్ల సినిమాలకు కలెక్షన్లు రావడం ఇక కలే.. ఈ మాటలన్నింటికి పఠాన్‌తో సమాధానం చెప్పాడు షారుక్ ఖాన్. వందల కోట్లు కొల్లగొడుతూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ బాలీవుడ్ బాయ్‌కాట్ గ్యాంగ్ నోరు మూయించాడు. తాజాగా మరో రికార్డు బద్ధలు కొట్టాడు షారుక్. ఇప్పటికే పీకే, టైగర్ జిందా హై సినిమాలను దాటేసిన పఠాన్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ సినిమా దంగల్ను సైతం అధిగమించింది. రూ.729 కోట్లతో వరల్డ్‌వైడ్ భారీ వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రంగా ప్రథమ స్థానంలో నిలిచింది. నిజానికి దంగల్ ప్రపంచవ్యాప్తంగా రూ.2000 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. కానీ ఇందులో అధిక వాటా చైనాదే! అక్కడ హిందీలో కాకుండా మాండరిన్ భాషలో రిలీజ్ చేయగా రూ.1200 కోట్ల పైనే రాబట్టింది. ఇక పఠాన్ విషయానికి వస్తే.. షారుక్ నాలుగేళ్ల తర్వాత నటించిన చిత్రమిది. ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా సల్మాన్ అతిథి పాత్రలో మెరిశాడు. Action aur entertainment ka 💥 combo #Pathaan is getting love across the world!Book your tickets now! https://t.co/SD17p6x9HI | https://t.co/VkhFng6vBj Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you, in Hindi, Tamil and Telugu. pic.twitter.com/5VPnM9mHTY — Yash Raj Films (@yrf) February 4, 2023 చదవండి: వాణి జయరామ్ పోస్ట్‌మార్టమ్ పూర్తి -
పఠాన్ సినిమా ఫ్లాప్.. నెటిజన్‌కు షారూక్ దిమ్మదిరిగే కౌంటర్..!
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం 'పఠాన్.' జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. భారీస్థాయిలో వసూళ్లు రాబడుతూ రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది పఠాన్. వసూళ్లలో ఇప్పటికే కేజీయఫ్ 2, బాహుబలి వంటి పాన్ ఇండియా చిత్రాల రికార్డ్ బ్రేక్ చేసిన తొలి హిందీ చిత్రంగా పఠాన్ నిలిచింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.700 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సందర్భంగా హీరో శనివారం వీకెండ్ కావడంతో షారూక్ ఖాన్ ఎప్పటిలాగే తన ఫ్యాన్స్‌తో ఆస్క్ఎస్ఆర్కే సెషన్ నిర్వహించారు. ట్విటర్ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా అభిమానులు పలు రకాల ప్రశ్నలతో షారూక్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఇవాళ నాకు జలుబు ఉంది కాబట్టి.. పెళ్లి ప్రతిపాదనలు తీసుకురావద్దని అభిమానులను సరదాగా కోరాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. పఠాన్ మూవీ ఫస్ట్ హాఫ్ బాగుందని.. కానీ సెకండాఫ్ తీవ్ర నిరాశపరిచిందని అడిగారు. దీనికి షారూక్ స్పందిస్తూ.. ' దీనికి చింతించాల్సిన అవసరం లేదు. నీకు ఫస్ట్ హాఫ్ నచ్చింది కదా. అయితే ఈ వీకెండ్ ఓటీటీలో సెకండాఫ్ ఇంకో సినిమా చూసి చూసేయండి.' అంటూ సలహా ఇచ్చారు. మరో అభిమాని ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం రోజున మీతో డేట్‌కు వెళ్లాలనుందని అడిగింది. దీనికి షారూక్ ఖాన్ రిప్లై ఇస్తూ..' డేట్ అంటే నాకు చాలా బోరింగ్.. ఆ రోజు ఎవరైనా మీ ఫ్రెండ్‌తో పఠాన్ మూవీకి వెళ్లండి' అంటూ సలహా ఇచ్చారు. అలాగే చాలామంది అభిమానుల ట్వీట్లకు ఆయన ఫన్నీగా రిప్లై ఇచ్చారు. I am boring as a date….take some cool guy and watch #Pathaan in a theatre https://t.co/yCKPFo1QcS — Shah Rukh Khan (@iamsrk) February 4, 2023 Koi baat nahi. Apni apni pasand hoti hai. Pehla half see of #Pathaan second half see some other film on OTT this weekend. https://t.co/Q6hgMVic9f — Shah Rukh Khan (@iamsrk) February 4, 2023 Oh wow, weekend upon us again. Should be working but have a late call….so thought will catch up with some queries. If u have any. Go ahead #AskSRK ( also no marriage proposals today as I have a cold..just saying ha ha ) — Shah Rukh Khan (@iamsrk) February 4, 2023 -
వసూళ్ల ఊచకోత.. మరో రికార్డు బద్ధలు కొట్టిన పఠాన్
బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా కలెక్షన్స్ సాధిస్తోంది పఠాన్. రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తోంది. కోట్లకు కోట్లు కొల్లగొడుతూ బాయ్‌కాట్ బాలీవుడ్ అన్నవారి నోళ్లు మూయించింది. షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ చిత్రం రూ.417 కోట్ల గ్రాస్(రూ.348.50 కోట్ల నెట్) రాబట్టింది. ఓవర్సీస్లో రూ.250 కోట్లు వసూలు చేసింది. అంటే ప్రపంచవ్యాప్తంగా పఠాన్ రూ.667 కోట్ల మేర కలెక్షన్స్ సాధించింది. కాగా బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మొదటి చిత్రంగా దంగల్(రూ.374.53 కోట్లు), రెండో స్థానంలో టైగర్ జిందా హై(రూ.339 కోట్లు), మూడో స్థానంలో పీకే (రూ.337.72 కోట్లు) ఉండేది. కానీ తాజాగా పఠాన్ రూ.348 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టడంతో పీకే, టైగర్ జిందా హై సినిమాలను దాటేసి రెండో స్థానానికి చేరుకుంది. పఠాన్ దూకుడు చూస్తుంటే అతి త్వరలో దంగల్ను దాటేసి అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ చిత్రంగా రికార్డు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. #Pathaan ki party continues 🎉🎉🎉 Book your tickets now! https://t.co/SD17p6x9HI | https://t.co/VkhFng6vBj Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you, in Hindi, Tamil and Telugu. pic.twitter.com/kc1FjITfRy — Yash Raj Films (@yrf) February 2, 2023 చదవండి: నాతో స్టార్ హీరో సీక్రెట్ అఫైర్.. నటి పెళ్లికి ఆ డ్రెస్‌లో వేస్తావా? వేరే దొరకలేదా?: కీర్తి సురేశ్‌పై ట్రోలింగ్ -
'పఠాన్' సక్సెస్‌పై ఎమోషనల్ అయిన దీపికా పదుకొణె
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం 'పఠాన్'. జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించగా, సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్లో కనిపించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన తొలిరోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 500కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పటికే బాలీవుడ్లో `కేజీఎఫ్2` ‘బాహుబలి’ కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేసి హిందీ సినిమా చరిత్రలోనే హయ్యేస్ట్ గ్రాసింగ్ ఓపెనింగ్ వీకెండ్‌గా పఠాన్ నిలిచింది. ఈ క్రమంలో చిత్ర బృందం ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా పఠాన్‌పై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు దీపికా పదుకొణె ఎమోషనల్ అయ్యింది. దీపికా మాట్లాడుతూ.. ''సినిమా రిలీజ్ నాడు థియేటర్‌కి వెళ్లి ఆడియెన్స్ రెస్పాన్స్ చూద్దామనుకున్నా. కానీ ఆరోజు కుదర్లేదు. కానీ ఈరోజు మీ అందరి ప్రేమ, ప్రశంసలు పొందుతుంటే చాలా ఆనందంగా, ఓ పండుగలా అనిపిస్తుంది. ఓం శాంతి ఓం సినిమా నుంచి షారుక్ ఖాన్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఆరోజు నన్ను నమ్మి ఆయన అవకాశం ఇచ్చి ఉండకపోతే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. నిజాయితీగా, చిత్తశుద్దితో పని చేస్తే అందుకు బహుమతిగా ఇలాంటి ప్రేమ, ప్రశంసలు దక్కుతాయాని పఠాన్ రుజువు చేసింది'' అంటూ దీపికా కంటతడి పెట్టింది. View this post on Instagram A post shared by Bollywood Hungama🎥 (@realbollywoodhungama) -
పఠాన్‌ను ఎవరూ ఆపలేరు.. ఎన్ని వందల కోట్లు వచ్చాయంటే?
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. ఆకలితో ఉన్న పులి పంజా విసిరినట్లుగా నాలుగేళ్లు వెండితెరకు దూరంగా ఉన్న ఆయన బాక్సాఫీస్ మీద యుద్ధమే చేస్తున్నాడు. కోట్లకు కోట్లు కొల్లగొడుతూ బాయ్‌కాట్ గ్యాంగ్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. తాజాగా పఠాన్ మూవీ రూ.500 కోట్ల మార్క్‌ను చేరుకుంది. ఇండియాలో రూ.335 కోట్లు రాబట్టగా ఓవర్సీస్లో రూ.207 కోట్లు కొల్లగొట్టింది. మొత్తంగా పఠాన్ ఐదు రోజుల్లోనే రూ.542 కోట్లు వసూలు చేయడంతో షారుక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. చూస్తుంటే పఠాన్ త్వరలోనే రూ.700 కోట్ల క్లబ్బులో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఈ సినిమాలో షారుక్ సరసన హీరోయిన్ దీపికా పదుకొణె నటించింది. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాను ఎవరూ చూడొద్దంటూ సోషల్ మీడియాలో బాయ్‌కాట్ గ్యాంగ్ తెగ హల్చల్ చేసింది. కానీ షారుక్ స్టార్డమ్ ముందు బాయ్‌కాట్ నినాదం పని చేయలేదు. పైగా ఆయన సినిమా రిలీజై దాదాపు నాలుగేళ్లవుతుండటంతో పఠాన్‌ను చూసేందుకు ఎగబడుతున్నారు జనం. #JhoomeJoPathaan meri jaan mehfil hi loot jaaye ❤️🔥 the FANtastic party outside #Mannat gets PATHAANfied 🔥 Book your tickets now: https://t.co/z4YLOG2NRI | https://t.co/lcsLnUSu9Y@iamsrk @yrf#ShahRukhKhan #Pathaan #PathaanReview #YRF50 pic.twitter.com/OwyULyq8G3 — Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) January 29, 2023 ‘PATHAAN’ CROSSES ₹ 500 CR MARK: ₹ 542 CR WORLDWIDE *GROSS* IN 5 DAYS… #Pathaan WORLDWIDE [#India + #Overseas] *Gross* BOC… *5 days*… ⭐️ #India: ₹ 335 cr ⭐️ #Overseas: ₹ 207 cr ⭐️ Worldwide Total *GROSS*: ₹ 542 cr 🔥🔥🔥 pic.twitter.com/UZvYoipsx0 — taran adarsh (@taran_adarsh) January 30, 2023 చదవండి: అసభ్యంగా తాకబోయాడు.. క్యాస్టింగ్ కౌచ్‌పై నటుడు పెళ్లైన 10 ఏళ్లకు సీమంతం.. భావోద్వేగంలో నటి -
ఫోటోలో ఉన్న పాలబుగ్గల పసివాడు ఎవరో తెలుసా?
ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా? చాలా క్యూట్‌గా కనిపిస్తున్న పాల బుగ్గల ఆ పసివాడు ఎవరో తెలుసా? సినీ ఇండస్ట్రీని ఏలుతున్న రారాజు అని మీకు తెలుసా? అమాయకంగా కనిపిస్తున్న ఈ బుడ్డోడు అందరి కలల రాకుమారుడిగా ఎదిగాడు. చలనచిత్ర పరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక స్థానం సంపాదించాడు. ఆ స్టార్ హీరో ఎవరో ఓ లుక్కేద్దాం. ఆ పాలబుగ్గల చిన్నారి మరెవరో కాదు. ప్రస్తుతం బాక్సాఫీస్‌ను ఓ ఆటాడుకుంటున్న బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్. ఆయన నటించిన చిత్రం పఠాన్ రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా ఆయన చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ సినిమాలో దీపికా పదుకొణేతో కలిసి నటించిన స్పై థ్రిల్లర్ మూవీ పఠాన్ థియేటర్లను షేక్ చేస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.550 కోట్లతో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో మరో హీరో జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ ప్రస్తుతం పలు రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ సందర్భంగా స్టార్ హీరో చిన్ననాటి ఫోటోలు వైరల్‌గా మారాయి. -
సింహాలు ఇంటర్వ్యూలకు వెళ్లవు, సేమ్ టు సేమ్..: షారుక్
పఠాన్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్. సుమారు నాలుగేళ్ల తర్వాత వెండితెరపై కనిపించిన బాద్షా తన ఎంట్రీతోనే రికార్డులు బద్ధలు కొట్టాడు. గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో ఊగిసలాడుతున్న బాలీవుడ్‌కు ఊపిరి పోశాడు. షారుక్ పఠాన్ మూవీ దక్షిణాదిలో పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయినప్పటికీ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మాత్రం దుమ్మురేపుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం పఠాన్ హిట్‌ను ఎంజాయ్ చేస్తున్న షారుక్ #AskSRK ద్వారా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించాడు. పఠాన్‌కు పబ్లిక్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? షారుక్ : పాటలు పాడా, డ్యాన్స్ చేశా.. నవ్వుకున్నాను. పఠాన్ సంబరాలు చేసుకునేటప్పుడు పక్కవాళ్లను సైతం దృష్టిలో ఉంచుకోండి. డింపుల్ కపాడియా, అశుతోష్ రానాతో పనిచేయడం ఎలా ఉంది? షారుక్ : డింపుల్, అశుతోష్ గొప్ప నటులు. వారితో పనిచేయడం మర్చిపోలేను. ఒక సీన్లో అయితే భలే ఫన్నీగా ఉంటారు. పఠాన్ చూశాను. కానీ దీని కంటే జీరోనే బాగుంది షారుక్ :మీ గొప్ప మనసుకు కృతజ్ఞతలు. కానీ దురదృష్టవశాత్తూ జీరోని లక్షల్లోనే వదిలేశారు. పఠాన్ సృష్టిస్తున్న రికార్డులు చూస్తుంటే ఏమనిపిస్తోంది? షారుక్ :మళ్లీ పాత రోజులకు వెళ్లినట్లు ఉంది అమ్మాయిలెవరూ నన్ను ఇష్టపడటం లేదు. ఏదైనా టిప్ ఇవ్వండి షారుక్ :టిప్స్ ఇచ్చేంత సమయం లేదు జిమ్ (జాన్ అబ్రహం) కొడుతున్నప్పుడు పఠాన్‌కు ఎలా అనిపించింది? షారుక్ :జిమ్ చాలా ధృడమైన వ్యక్తి. నన్ను చాలా గట్టిగా కొట్టాడు. ఉఫ్.. ఆ భగవంతుడి వల్ల క్షేమంగా అతడి నుంచి తప్పించుకున్నా పఠాన్ హిట్టయింది కానీ సల్మాన్‌తో బాక్సాఫీస్ వద్ద మీరు పోటీపడలేరు? షారుక్ :సల్మాన్ భాయ్ ఎప్పటికీ గొప్పవాడే! ప్రమోషన్స్‌కు ఎందుకు దూరంగా ఉన్నారు? షారుక్ :సింహాలు ఇంటర్వ్యూల్లో పాల్గొనవు. కాబట్టి నేను కూడా ఈ సారి ఇంటర్వ్యూలకు దూరంగా ఉన్నాను. చదవండి: కమెడియన్ పంచ్ ప్రసాద్ ఇల్లు చూశారా? -
‘పఠాన్’ సినిమా బ్లాక్ బస్టర్.. ఇంత మంది మూర్ఖులా!
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. నాలుగేళ్ల విరామం తర్వాత ‘పఠాన్’గా తెరపైకి దూసుకొచ్చిన షారూఖ్ సత్తా చాటాడు. వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. అయితే ఈ సినిమాపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాలను ట్విటర్ వేదికగా వెల్లడిస్తున్నారు. ఏముందని చూస్తున్నారు? ‘పఠాన్’ సినిమా విజయంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ తనదైన శైలిలో స్పందించారు. ‘పఠాన్ సినిమాకు వస్తున్న స్పందన చూసిన తర్వాత, ఇండియాలోని మూర్ఖుల సంఖ్య మీద నా అంచనా 90 శాతం నుంచి 95 శాతానికి పెరిగింద’ని ట్వీట్ చేశారు. నల్లమందు ధర పెరిగింది కాబట్టి.. చౌకైన ప్రత్యామ్నాయంగా ‘పఠాన్’ను కనుగొన్నారని సెటైర్ వేశారు. My estimate of fools in India has gone up from 90% to 95% after seeing the response to the film Pathan — Markandey Katju (@mkatju) January 26, 2023 అన్నీ ఉన్నాయి 2023లో ఇదే మొదటి బ్లాక్ బస్టర్ అంటూ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. ‘పఠాన్’లో అన్నీ ఉన్నాయి. స్టార్ పవర్, స్టైల్, హంగు, ఆత్మ, విషయం, ఆశ్చర్యాలు, ఇంకా అన్నింటికంటే ముఖ్యంగా ప్రతీకారేచ్ఛతో వచ్చిన షారుక్ ఖాన్. 2023లో ఇదే మొదటి బ్లాక్ బస్టర్!’అని ట్వీట్ చేశారు. అంతేకాదు ట్విటర్లో ‘పఠాన్’సినిమాకు నాలుగున్న స్టార్స్ రేటింగ్ కూడా ఇచ్చారు. #OneWordReview...#Pathaan: BLOCKBUSTER. Rating: ⭐️⭐️⭐️⭐️½#Pathaan has it all: Star power, style, scale, songs, soul, substance and surprises… And, most importantly, #SRK, who’s back with a vengeance… Will be the first #Blockbuster of 2023. #PathaanReview pic.twitter.com/Xci1SN72hz — taran adarsh (@taran_adarsh) January 25, 2023 కాగా, పఠాన్ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 170 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. మున్ముందు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా. (క్లిక్ చేయండి: షారుక్ పని అయిపోయిందంటూ ట్వీట్.. చివర్లో ట్విస్ట్!) -
వెండితెరపై దేశం కోసం పోరాడుతున్న రీల్ గుఢాచారులు
దేశం కోసం కొందరు గూఢచారులు ‘మేరా భారత్ మహాన్’ అంటూ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. అయితే ఇవి సిల్వర్ స్క్రీన్ గూఢచారుల కథలు. భారత రాజ్యాంగం అమలులోకొచ్చిన రోజు (జనవరి 26)న స్వాతంత్య్రం కోసం ప్రాణాలను లెక్కచేయని సమర యోధులను గుర్తు చేసుకుంటూ... సిల్వర్ స్క్రీన్‌పై దేశం కోసం పోరాడే ఈ రీల్ గూఢచారుల గురించి తెలుసుకుందాం. ఓ రహస్యాన్ని ఛేదించేందుకు ‘డెవిల్’గా గూఢచార్యం చేస్తున్నారు కల్యాణ్ రామ్. నవీన్ మేడారం దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘డెవిల్’. ‘ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ఉపశీర్షిక. 1945లో బ్రిటిష్ పరిపాలనలో ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ప్రేమ, ద్రోహం, మోసం.. ఈ మూడు అంశాలు ఏ విధంగా ఓ గూఢచారి జీవితాన్ని ప్రభావితం చేశాయన్నదే ఈ సినిమా ప్రధానాంశం. మరోవైపు దేశం కోసం అజ్ఞాతంలో ఉండనున్నారు విజయ్ దేవరకొండ. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో అజ్ఞాత గూఢచారి పాత్రలో కనిపిస్తారట విజయ్ దేవరకొండ. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. ఇక 2018లో ‘గూఢచారి’గా కనిపించి సక్సెస్‌ఫుల్‌గా మిషన్‌ను పూర్తి చేసిన అడివి శేష్ మళ్లీ ఓ కొత్త మిషన్‌ను ఆరంభించారు. ‘గూఢచారి’ సీక్వెల్ ‘జీ 2’ (గూఢచారి 2)లో హీరోగా నటిస్తున్నారు. సిరిగినీడి వినయ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు యాక్షన్ ‘ఏజెంట్’గా మారారు అఖిల్. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఏజెంట్’. దేశం కోసం ఎంతకైనా తెగించే ఓ ఏజెంట్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఈ వేసవిలో రిలీజ్ కానుంది. కాగా మంచు పర్వతాల్లో తుపాకులను దాచిపెట్టారు హీరో నిఖిల్. ఎందుకంటే దేశం కోసం గూఢచారిగా మారారు. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ‘స్పై’. దేశానికి సంబంధించిన ఓ సీక్రెట్‌ను కనిపెట్టి, దేశద్రోహులను ఓ స్పై ఏ విధంగా మట్టుపెట్టాడన్నదే ఈ సినిమా అని తెలుస్తోంది. ‘స్పై’ను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. వీరితో పాటు మరికొందరు కూడా గూడఛారులుగా కనిపించనున్నారు. కోలీవుడ్ లోనూ కొందరు హీరోలు దేశం కోసం సాహసాలు చేస్తున్నారు. దేశభక్తి నేపథ్యంగా హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘ఇండియన్’ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ చేస్తున్నారు కమల్ అండ్ శంకర్. పూర్తి దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో, ఈ కాలంతోపాటు 1920 కాలం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలిసింది. ఇక దర్శకుడిగా ‘తుపాకీ’, ‘స్పైడర్’ వంటి స్పై మూవీస్‌ను తీసిన ఏఆర్ మురుగదాస్ నిర్మాతగా ప్రస్తుతం ‘1947, ఆగస్టు 16’ అనే సినిమా నిర్మించారు. గౌతమ్ కార్తీక్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఎన్ఎస్ పొన్‌కుమార్ దర్శకుడు. ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. అలాగే మరో తమిళ హీరో అరుణ్ విజయ్ నటించిన సినిమా ‘బోర్డర్’. మిలిటరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రం ఇది. ఎ. వెంకటాచలం దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చే నెలలో రిలీజ్ కానుంది. ఇక విష్ణు విశాల్ హీరోగా మను ఆనంద్ దర్శకత్వంలోవచ్చిన ‘ఎఫ్ఐఆర్’ చిత్రం ఉగ్రవాదం నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్ఐఆర్ 2’ని ప్రకటించారు విష్ణు విశాల్. కాగా గత ఏడాది విడుదలైన ‘విక్రమ్’ సినిమాలో కమల్‌హాసన్, ‘సర్దార్’లో కార్తీ రా (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్) ఏజెంట్స్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలకు సీక్వెల్స్ రానున్నాయి. బాలీవుడ్లో అయితే స్పై బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్స్‌కు కొదవే లేదు. ఇప్పటికే ‘టైగర్ జిందా హై’, ‘ఏక్తా టైగర్’ వంటి స్పై బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్స్‌లో నటించిన సల్మాన్ ఖాన్ ఈ ఫ్రాంచైజీలోనే తాజాగా ‘టైగర్ 3’ సినిమా చేస్తున్నారు. మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. అలాగే స్పై బ్యాక్‌డ్రాప్‌లో సౌత్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ‘జవాన్’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు షారుక్ ఖాన్. ఈ ఏడాది జూన్ 2న ‘జవాన్’ విడుదల కానుంది. మరోవైపు కథానాయిక సారా అలీఖాన్ ‘ఆయే వతన్.. మేరే వతన్’ అనే మూవీ చేస్తున్నారు. కన్నన్ అయ్యర్ దర్శకత్వం వహిస్తున్నారు. క్విట్ ఇండియా ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఓ కాలేజీ విద్యార్థిని స్వాతంత్య్ర సంగ్రామంలో ఎలా పాల్గొంది? అన్నదే ఈ సినిమా కథ. అలాగే దేశ విభజన నాటి అంశాల నేపథ్యంలో ‘లాహోర్: 1947’ అనే సినిమా రూపుదిద్దుకోనుంది. ‘ఘాయల్’, ‘దామిని’, ‘ఘాతక్’ వంటి హిట్ సినిమాల తర్వాత హీరో సన్నీ డియోల్, దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి కాంబినేషన్లో ఈ సినిమా రూపొందనుంది. ఇక దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ రీసెంట్గా స్పై బ్యాక్‌డ్రాప్ సినిమాలు చేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన తాజా స్పై ఫిల్మ్ ‘పఠాన్’ థియేటర్స్‌లో ఉంది. కాగా ‘వార్’ తర్వాత హృతిక్ రోషన్‌తో ‘ఫైటర్’ చేస్తున్నారు సిద్ధార్థ్ ఆనంద్. ఇది కూడా స్పై బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ అట. అలాగే హీరో ప్రభాస్‌తో కూడా సిద్ధార్థ్ ఓ స్పై బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ చేస్తారని టాక్. ఇక హీరో జాన్ అబ్రహాం కూడా ‘టెహ్రాన్’ అనే స్పై ఫిల్మ్ చేస్తున్నారు. ఈ కోవలో మరికొన్ని బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. -
Pathaan Review: ‘పఠాన్’ మూవీ రివ్యూ
టైటిల్: పఠాన్ నటీనటులు: షారుఖ్ ఖాన్, జాన్అబ్రహం, దీపికా పదుకొణె, డింపుల్ కపాడియా, అశుతోశ్ రానా తదితరులు నిర్మాణ సంస్థ: యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మాత: ఆదిత్య చోప్రా దర్శకత్వం: సిద్ధార్థ్ ఆనంద్ సంగీతం: సంచిత్ బల్హారా, అకింత్ బల్హారా విడుదల తేది: జనవరి 25,2023 కథేంటంటే.. భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాకిస్తాన్ ప్రభుత్వం కోపంతో రగిలిపోతుంది. భారత్‌పై దాడి చేసేందుకు కుట్ర పన్నుతుంది. దీని కోసం ప్రైవేట్ ఏజెంట్ జిమ్(జాన్ అబ్రహం)ను సంప్రదిస్తాడు పాక్ జనరల్ కల్నల్. కశ్మీర్‌ని పాకిస్తాన్‌కి అప్పగించాలని, లేదంటే ఇండియాపై అటాక్ చేయాలని కోరతాడు. దీంతో ఇండియాపై బయో వార్ చేసేందుకు ప్లాన్ వేస్తాడు జిమ్. దాన్ని అడ్డుకునేందుకు రంగంలోకి దిగుతాడు ఇండియన్ ఏజెంట్ పఠాన్(షారుఖ్ ఖాన్). అసలు జిమ్ వేసిన రక్తభీజ్ ప్లాన్ ఏంటి? ఇండియాపై జిమ్ ఎందుకు పగ పడతాడు? పఠాన్, జిమ్‌కు ఉన్న సంబంధం ఏంటి? సీక్రెట్ ఏజెన్సీ ‘జోకర్’ని పఠాన్ ఎందుకు ఏర్పాటు చేశాడు? రక్తభీజ్ ప్లాన్‌ని చేధించే క్రమంలో పఠాన్, పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ రూబై(దీపికా పదుకొణె) మధ్య ఏం జరిగింది? పాకిస్తాన్ కుట్రను అడ్డుకునే క్రమంలో భారత ఆర్మీ అధికారిణి (డింపుల్ కపాడియా) చేసిన త్యాగమేంటి? తదితర విషయాలు తెలియాలంటే థియేటర్లో ‘పఠాన్’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 'వార్' మూవీతో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ భారీ విజయం అందుకున్నాడు. ఆ సినిమాలోని యాక్షన్, ఎమోషన్స్.. అన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాంటి దర్శకుడు షారుఖ్‌తో సినిమా అనేసరికి ‘పఠాన్’పై అంచనాలు పెరిగాయి. దానికి తోడు ‘ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై'తో పాటు ‘వార్’ లాంటి స్పై థ్రిల్లర్స్ నిర్మించిన భారీ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మాతగా వ్యవహరించడంతో ఆ అంచనాలు తారా స్థాయికి చేరాయి. అందుకు తగ్గట్టే భారీ యాక్షన్స్ సీక్వెన్స్, విజువల్స్‌తో పఠాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. అయితే కథ మాత్రం రొటీన్‌గా ఉంటుంది. యాక్షన్స్ సీన్స్, విజువల్స్... ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్ సినిమాలలో చూసినట్లుగానే ఉంటాయి. అయితే ఆ సినిమాల్లో పండిన ఎమోషన్ 'పఠాన్'లో పండలేదు. షారుఖ్ స్టార్డమ్తో సినిమాను లాక్కొచ్చారు. పస్టాఫ్ అంతా సాధారణంగా సాగుతుంది. జాన్ అబ్రహం, షారుఖ్ తలపడే సీన్స్ ఆకట్టుకుంటాయి. అయితే కథ మాత్రం ముందుకు వెనక్కి వెళ్తూ.. గందరగోళానికి గురి చేస్తుంది. రక్తభీజ్ను గుర్తించే క్రమంలో హెలికాప్టర్‌పై షారుఖ్, దీపికాలు చేసే యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. కానీ స్పై థ్రిల్లర్స్ తరహా సినిమాలు చూసేవాళ్లు ఆ ట్విస్ట్‌ని పసిగట్టే చాన్స్ ఉంది. ఇక సెకండాఫ్ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. ప్రీక్లైమాక్స్ ముందు వచ్చే ఇండియన్ ల్యాబ్ సీన్ ఎమోషనల్‌కు గురి చేస్తుంది. ఇక క్లైమాక్స్‌లో షారుఖ్, జాన్ అబ్రహం యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి. పఠాన్ కోసం టైగర్(సల్మాన్ ఖాన్) రావడం.. వారిద్దరు కలిసి చేసే యాక్షన్ సీన్ సినిమాకే హైలెట్. షారుఖ్ అభిమానులకు, యాక్షన్ సీక్వెన్స్ ఇష్టపడేవారికి ‘పఠాన్’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ఇండియన్ జవాన్ పఠాన్ పాత్రలో షారుఖ్ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్‌లో అద్భుతంగా నటించాడు. ఈ సినిమా కోసం షారుఖ్ పడిన కష్టమంతా తెరపై కనబడుతుంది. ప్యాక్డ్ బాడీతో కనిపించి అభిమానులను అలరించాడు. జాన్ అబ్రహం నెగెటివ్ రోల్లో అదరగొట్టేశాడు. యాక్షన్స్ సీన్స్‌లో షారుఖ్‌తో పోటీపడి నటించాడు. పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ రూబైగా దీపికా పదుకొణె తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అందాలను ప్రదర్శించడమే కాదు.. యాక్షన్స్ సీక్వెన్స్‌లో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె చేసే ఫైట్ సీన్స్ ఆకట్టుకుంటాయి. అశుతోష్ రానా, డింపుల్ కపాడియాలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సంచిత్ బల్హారా, అకింత్ బల్హారా నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
‘పఠాన్’ ట్విటర్ రివ్యూ
నాలుగేళ్ల విరామం తర్వాత బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ ‘పఠాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. దీపికా పదుకొణె హీరోయిన్గా నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ నేడు(జనవరి 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేశాయి. ఈ సినిమాపై వచ్చిన వివాదాలు కూడా ప్రచారానికి తోడైయ్యాయి. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా రికార్డు సృష్టించింది. భారీ అంచనాల మధ్య నేడు విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ షో డిపోయింది. దీంతో బుధవారం తెల్లవారుజామునుంచే ట్విటర్ ద్వారా ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘పఠాన్’కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ ద్వారా చర్చిస్తున్నారు. వాటిపై ఓ లుక్కేయండి. #PathaanReview INTERVAL If u think u know the whole story by watching the trailer.. Just wanna tell u all .. U ARE TOTALLY WRONG!! Nothing revealed in the trailer! 1st half: Gripping.. Intense.. Thrilling Keeps u hooked through out.. SRK is incredible 🔥#Pathaan #ShahRukhKhan — Es͜͡ha (@Esha_SRK) January 25, 2023 పఠాన్ ట్రైలర్ చూసి ఈ సినిమా కథను ఊహిస్తే కూడా పొరబడినట్టే. ట్రైలర్లో కథను ఏ మాత్రం కూడా రివీల్ చేయలేదు.. పస్టాఫ్ అంతా కూడా ఎంతో గ్రిప్పింగ్‌గా, ఇంటెన్స్‌గా, థ్రిల్లింగ్‌గా ఉంది.. షారుఖ్ ఎప్పుడూ ఓ అద్భుతమే అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 4.5 🌟 from my side! Enjoyed a good film after a long time! KING IS BACK ❤️ @iamsrk #Pathaan #PathaanFirstDayFirstShow — Ashweta 🇳🇿✨ (@Sonaholic_Ashu) January 25, 2023 కింగ్ ఈజ్ బ్యాక్. పఠాన్ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ 4.5 రేటింగ్ ఇచ్చాడు ఓ నెటిజన్. #PATHAAN Review 🔥 🔥 🔥 ---Srk entry 🔥 📛 ---john 🔥 deepika 🔥 1st half superveb ---2 ND half u will be happy for great action,,,, sequences 🔥 #SalmanKhan superb cameo 👏 👌 Not Srk back its Bollywood back #shahrukhkhan the great performance 👏 👌 👍 🙌 😎 enjoy india+ — Rakesh appu (@Kotresh57392792) January 25, 2023 Wish you all for #Pathaan Day🔥 Gearing up for my 1st show Have a blast💥 pic.twitter.com/I3yxkjTtDk — Aj (@ajlookout) January 25, 2023 What's need to spread fake news? Bhai i have tweeted what happened that's it🔥 really are you SRK fan?😁#Pathaan Beats #KGFChapter2 adv bookings Presales at National chains🔥#ShahRukhKhan𓀠 #PathaanReview https://t.co/mEQCBtEsfe pic.twitter.com/53Dx30k10a — AADI | ಆದೀ (@AadiSudeepian_) January 25, 2023 Don't worry,these are the rioters n t.rrorists sponsored by bh.gwa s.nghi t.rrorists organizations n #Pathaan is already a super duper hit and broke all records in advance booking only. So even @ANI @ani_digital must show these to go. Bar bhakts. They must apply go. Bar n Burnol — MiyaBhai (@miyabhai1503) January 25, 2023 #Pathaan has literally become a festival. Unbelievable stuff! Now hoping and praying for the film to be entertaining. #ShahRukhKhan #DeepikaPadukone #SiddharthAnand #JohnAbraham — A (@Anirudh_1901) January 25, 2023 -
షారుఖ్ ఖానా? అతనెవరు?: అసోం సీఎం
గువహతి: షారూఖ్ ఖానా? అసలు అతనెవరు? అతని గురించి నాకేం తెలియదు. అతని సినిమా పఠాన్ గురించి కూడా నాకేం తెలియదు.. ఈ కామెంట్లు చేసింది ఎవరో కాదు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ. శనివారం గువాహతిలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాకు ఈ సమాధానాలు ఇచ్చారు. పఠాన్ సినిమాను అడ్డుకుంటామని బజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. అక్కడి మీడియా అసోం సీఎంను స్పందించాలని కోరింది. దీనికి ఆయన బదులిస్తూ.. షారూఖ్ ఖాన్ ఎవరని, ఆ సినిమా గురించి కూడా తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. ‘‘బాలీవుడ్ నుండి చాలా మంది తమ సమస్యల గురించి ఫోన్ చేశారు. కానీ, ఆ ఖాన్ ఎవరో నాకు ఫోన్ చేయలేదు. ఒకవేళ అతను గనుక చేస్తే.. విషయాన్ని పరిశీలిస్తా’’ అని సీఎం హిమంత మీడియాకు తెలిపారు. నరెంగిలో శుక్రవారం సాయంత్రం పఠాన్‌ను ప్రదర్శించబోయే ఓ థియేటర్‌పై బజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేసి.. పోస్టర్లను చించేసి దహనం చేశారు. ఈ పరిణామంపై స్పందించిన సీఎం.. శాంతి భద్రతలకు ఎవరు భంగం కలిగించినా ఊరుకునేది లేదని, ఘటనకు సంబంధించి కేసు నమోదు అయ్యిందని.. చర్యలుంటాయని సమాధానం ఇచ్చారు. ఇక షారూఖ్ ఖాన్ అంటే.. బాలీవుడ్ సూపర్ స్టార్ అని విలేకరులు చెప్పగా.. రాష్ట్ర ప్రజలు అస్సామీ చిత్రాల గురించి ఆలోచించాలే తప్ప.. హిందీ చిత్రాల గురించి కాదని చెప్పారు. దివంగత నిపోన్ గోస్వామి దర్శకత్వం వహించిన డాక్టర్ బెచ్బరౌవా-పార్ట్2(అస్సామీ చిత్రం) త్వరలో విడుదల కాబోతోందని, ప్రజలంతా ఆ సినిమా చూడాలని ఆయన అసోం ప్రజలకు పిలుపు ఇచ్చారు. యాక్షన్ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో షారూఖ్ ఖాన్, జాన్ అబ్రహం, దీపికా పదుకునే ప్రధాన పాత్రల్లో తెరకెక్కింది పఠాన్. ఈ చిత్రం జనవరి 25వ తేదీన దేశవ్యాప్తంగా రిలీజ్ కానుంది. బేషరమ్ రంగ్ అనే పాటలో కాషాయం రంగు బికినీ ధరించిందని, అది హిందుత్వాన్ని కించపరిచినట్లేనని చెబుతూ వీహెచ్‌పీ సహా హిందూ అనుబంధ సంఘాలు ఈ చిత్రాన్ని నిషేధించాలని పట్టుబడుతున్నాయి.